Googleలో మీ Business Profileను ఎడిట్‌ చేయండి

Googleలో మీ బిజినెస్ సమాచారాన్ని ఖచ్చితమైనదిగా, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యి ఉండేలా చేయడానికి, మీ Business Profile వెరిఫై అయిన తర్వాత మీరు Googleలో దాన్ని ఎడిట్ చేయవచ్చు. కస్టమర్‌గా మారే అవకాశమున్న వారు మీ బిజినెస్‌ను కనుగొని, దాని గురించి మరింత తెలుసుకోవడానికి, మీ అడ్రస్, పని వేళలు, కాంటాక్ట్ సమాచారం, ఫోటోలు వంటి సమాచారాన్ని మీరు మార్చవచ్చు.

మీరు ఇప్పటికే చేయకపోతే, మీ బిజినెస్‌ను జోడించండి లేదా క్లెయిమ్ చేయండి, ఆపై, మీ Business Profileను వెరిఫై చేయండి, తద్వారా Search, Maps, ఇంకా ఇతర Google సర్వీస్‌లు కనిపించడానికి దీనికి అర్హత లభిస్తుంది.

మీ బిజినెస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎడిట్ చేయడానికి ముందు మీరు దాన్ని తప్పనిసరిగా వెరిఫై చేయాలి. మార్పులలో పేరు, కేటగిరీ, అడ్రస్, పని వేళలు, ఫోన్ నంబర్, వెబ్‌సైట్ వంటివి ఉంటాయి. బిజినెస్ వెరిఫికేషన్ పూర్తయ్యి, ఎడిట్‌లను ఆమోదించిన తర్వాత, ఈ మార్పులు Google Search, Mapsలో పబ్లిష్ చేయడం జరుగుతుంది. 

కొంతమంది బిజినెస్ ఓనర్‌లు తమ సమాచారాన్ని ఎడిట్ చేయడానికి ముందు వారి బిజినెస్‌ను వెరిఫై చేయాల్సి రావచ్చు.

Business Profileను ఎడిట్ చేయండి

ముఖ్య గమనిక: మీ Business Profileను మేనేజ్ చేయడానికి ఉపయోగించే కొన్ని ఫీచర్‌లు Google Maps, Search, ఆపరేటింగ్ సిస్టమ్‌ను బట్టి విభిన్నంగా ఉండవచ్చు.

మీ స్వంత Business Profileను ఎడిట్ చేయండి

మీ ప్రొఫైల్‌ను Google Search, Mapsలో నేరుగా ఎడిట్ చేయడానికి:

  1. మీ Business Profileకు వెళ్లండి. మీ ప్రొఫైల్‌ను ఎలా కనుగొనాలో తెలుసుకోండి.
  2. మీ బిజినెస్ ప్రొఫైల్‌ను ఎడిట్ చేయడానికి:
    • Google Searchతో, ప్రొఫైల్‌ను ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • Google Mapsతో, ప్రొఫైల్‌ను ఎడిట్ చేయండి ఆ తర్వాత బిజినెస్ సమాచారం ఆప్షన్‌లను ఎంచుకోండి.
  3. మీరు చేసిన ప్రతి మార్పు తర్వాత, సేవ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

మరొకరి లోకల్ బిసినెస్‌కు సంబంధించిన సమాచారాన్ని సరి చేయండి

మీ సొంతం కాని లేదా మీరు మేనేజ్ చేయని బిజినెస్ సమాచారంలో ఏదైనా తప్పును మీరు గమనిస్తే, మీరు ఎడిట్‌ను సూచించవచ్చు లేదా Google Mapsలో ఎర్రర్‌ను రిపోర్ట్ చేయవచ్చు.

మరొకరి బిజినెస్ Google Mapsలో కనిపించకపోతే, మీరు పేర్కొనబడని స్థలాన్ని జోడించవచ్చు.

ఎడిట్‌ల రకాలు

మీ బిజినెస్ ప్రొఫైల్‌లో మీరు యాడ్ లేదా ఎడిట్ చేయగల వివిధ రకాల సమాచారానికి సహాయపడగల కొన్ని చిట్కాలు:

బిజినెస్‌ పేరు
సంకేతాలు, స్టేషనరీ మరియు ఇతర బ్రాండింగ్‌లో వాస్తవ ప్రపంచంలో కనిపించే మీ బిజినెస్‌‌ పేరుని సరిగ్గా ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ లేఖను రిక్వెస్ట్ చేసిన తర్వాత మీ బిజినెస్ పేరును మీరు మార్చుకుంటే, మీరు తప్పనిసరిగా మళ్లీ మీ బిజినెస్‌ను వెరిఫై చేయాలి. Business Profile క్వాలిటీ గైడ్‌లైన్స్ గురించి మరింత తెలుసుకోండి.
కేటగిరీ

మీ బిజినెస్‌కు సరిగ్గా మ్యాచ్ అయ్యే కేటగిరీని ఎంచుకోండి. మీ బిజినెస్‌కు సంబంధించిన అన్ని లొకేషన్‌లు తప్పనిసరిగా “ప్రధాన కేటగిరీ”ని షేర్ చేయాలి. వీలైనంత ప్రత్యేకమైన, అలాగే మీ ప్రధాన బిజినెస్‌ను సూచించే కేటగిరీని ఎంచుకోండి. మీరు పలు కేటగిరీలను ఎంచుకున్నట్లయితే, మొదటి ఫీల్డ్‌లో ఎంటర్ చేయబడిన కేటగిరీ మీ ప్రధాన కేటగిరీ అవుతుంది.

మీరు మరో 9 కేటగిరీల వరకు ఎంచుకోవచ్చు. మీకు మీ బిజినెస్ కోసం ఒక కేటగిరీని ఎంచుకోవడంలో సమస్య ఉంటే, ఒక సాధారణమైన కేటగిరీని ఎంచుకోండి. వీటిని గుర్తుంచుకోండి:

  • కేటగిరీలను కేవలం కీవర్డ్‌లుగా లేదా మీ బిజినెస్ అట్రిబ్యూట్‌లను వివరించడానికి ఉపయోగించవద్దు.
  • సమీపంలోని లేదా ఇతర సంబంధిత బిజినెస్‌లతో మ్యాచ్ అయ్యే కేటగిరీలను ఉపయోగించవద్దు. ఉదాహరణకు: మీ బిజినెస్ ఫిజికల్ లొకేషన్ లోపల ఉన్న బిజినెస్ లేదా మీ బిజినెస్‌ను కలిగి ఉన్న సంస్థ.

బిజినెస్ కేటగిరీల గురించి మరింత తెలుసుకోండి.

అడ్రస్, పిన్ లొకేషన్

మీ బిజినెస్ లొకేషన్‌కు సంబంధించిన పూర్తి, ఖచ్చితమైన అడ్రస్‌ను ఎంటర్ చేయండి. అడ్రస్‌ను ఎంటర్ చేయడానికి సంబంధించిన గైడ్‌లైన్స్ గురించి మరింత తెలుసుకోండి

  • మీరు మీ బిజినెస్ అడ్రస్‌లో కస్టమర్‌లకు సర్వీస్‌లను అందించనట్లయితే, అడ్రస్ ఫీల్డ్‌ను ఖాళీగా వదిలేయండి.
  • వెరిఫికేషన్ లేఖను రిక్వెస్ట్ చేసిన తర్వాత మీరు మీ అడ్రస్‌ను మార్చినట్లయితే, మీరు తప్పనిసరిగా మీ బిజినెస్‌ను మళ్లీ వెరిఫై చేయాలి.
సేవా ప్రాంతం

మీ బిజినెస్ ఒక నిర్దిష్ట స్థానిక ఏరియాలో కస్టమర్‌లకు సర్వీసులను అందిస్తే, మీ సర్వీసు ఏరియాను ఎంటర్ చేయండి. మీ సర్వీసు ఏరియాను మీరు లిస్ట్ చేసినప్పుడు, మీరు ఏయే ఏరియాలకు స్వయంగా వెళ్లి సర్వీసులను అందిస్తున్నారు లేదా డెలివరీ చేస్తున్నారు అనే విషయం మీ కస్టమర్‌లకు తెలుస్తుంది.

ఇక్కడ మీరు నగరాలు, పిన్ కోడ్‌లు లేదా మీరు సర్వీసులు అందించే ఇతర ప్రాంతాలను ఆధారంగా చేసుకుని, మీరు సర్వీసులు అందించాలనుకునే ప్రాంతాన్ని సెట్ చేసుకోవచ్చు. మీ సర్వీసు ఏరియాను సెట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

పని వేళలు
ఫోన్ నంబర్
  • మీ ప్రధాన బిజినెస్ ఫోన్ నంబర్‌తో పాటు, మీరు మరో 2 ఫోన్ నంబర్‌ ల వరకు ఎంటర్ చేయవచ్చు. నంబర్‌లు తప్పనిసరిగా మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నంబర్‌లు అయి ఉండాలి, ఫ్యాక్స్ నంబర్‌లు కాకూడదు.
  • మీ Business Profileలో మీరు ఫోన్ నంబర్‌ను దాచవచ్చు.

మీ Business Profile ఫోన్ నంబర్‌ను దాచండి

  1. మీ Business Profileకు వెళ్లండి. మీ ప్రొఫైల్‌ను ఎలా కనుగొనాలో తెలుసుకోండి.
  2. మీ Business Profileలో, మరిన్ని మరిన్ని ఆ తర్వాత Business Profile సెట్టింగ్‌లు ఆప్షన్‌లను ఎంచుకోండి.
  3. అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. "ఫోన్ నంబర్” కింద, చూపవద్దును ఆన్ లేదా ఆఫ్ చేయండి.
వెబ్‌సైట్

మీ బిజినెస్ వెబ్‌సైట్‌కు ఎంటర్ అవ్వడానికి:

మీ బిజినెస్ కేటగిరీ ఆధారంగా, ఆన్‌లైన్ ఆర్డర్‌లు, రిజర్వేషన్‌లు, అలాగే అపాయింట్‌మెంట్‌ల లాగా అదనపు లింక్‌లను జోడించడానికి మీకు ఆప్షన్‌లు కనిపించవచ్చు.

సోషల్ మీడియా లింక్‌లు
కంప్యూటర్ లేదా మొబైల్ పరికరంలో Google Business Profileలో సోషల్ మీడియా లింక్‌లను మేనేజ్ చేయండి. మీ బిజినెస్ నిర్దిష్ట దేశాలు లేదా ప్రాంతాలలో ఉన్నట్లయితే, మీరు కింద పేర్కొన్న వాటి కోసం మీ Business Profileకు ఒక్కో ప్లాట్‌ఫామ్‌కు ఒక సోషల్ మీడియా లింక్‌ను జోడించవచ్చు:
  • Facebook
  • Instagram
  • LinkedIn
  • Pinterest
  • TikTok
  • Twitter
  • YouTube

చిట్కా: సోషల్ మీడియా లింక్‌లు ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయి, యూజర్‌లందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు.

Google Business Profileలో సోషల్ మీడియా లింక్‌లను మేనేజ్ చేయడం తెలుసుకోండి.

లక్షణాలు

మీ బిజినెస్ గురించి కస్టమర్‌లకు మరింత తెలియజేయడం కోసం అట్రిబ్యూట్‌లను పేర్కొనండి. ఉదాహరణకు: "Wi-Fi” లేదా "అవుట్‌డోర్ సీటింగ్ ఉంది." మీ బిజినెస్‌కు సంబంధించి కొన్ని వాస్తవ అట్రిబ్యూట్‌లను మీరు ఎడిట్ చేయవచ్చు, ఉదాహరణకు అవుట్‌డోర్ సీటింగ్. విశేష అట్రిబ్యూట్‌లు, మీ బిజినెస్ స్థానికంగా ప్రముఖమైనదా కాదా వంటివి, మీ బిజినెస్‌ను సందర్శించిన Google యూజర్‌ల అభిప్రాయాలపై అధారపడి ఉంటాయి.

మీ బిజినెస్ కేటగిరీ కోసం అందుబాటులో ఉన్న అట్రిబ్యూట్‌లను జోడించడం లేదా తీసివేయడం ఎలాగో తెలుసుకోండి.

చిట్కా: మీరు ఆరోగ్య సంరక్షణ ప్రొఫైల్‌ను కలిగి ఉంటే లేదా మేనేజ్ చేస్తుంటే, మీరు ఈ కింది సమాచారాన్ని ఎడిట్ చేయవచ్చు:

  • మీ బిజినెస్ ఆన్‌లైన్ సంరక్షణను అందిస్తుందా లేదా అని.
  • మీరు కస్టమర్‌ల కోసం, ఆన్‌లైన్ సంరక్షణను షెడ్యూల్ చేయడానికి, అందుకోవడానికి ఒక ప్రత్యక్ష పద్ధతిని అందిస్తున్నారా లేదా అని.
  • మీ లింగం.
ఫోటోలు బిజినెస్‌ నుండి

మీ బిజినెస్ గురించి సంక్షిప్త వివరణను ఎంటర్ చేయండి.

చేర్చవలసిన అంశాలు:

  • మీరు అందించే సర్వీసులు
  • ఇతర బిజినెస్‌లతో పోల్చితే మీ ప్రత్యేకత ఏమిటి
  • మీ హిస్టరీ
  • కస్టమర్‌లకు ఉపయోగకరంగా ఉండే ఏవైనా ఇతర అంశాలు

చేర్చకూడని అంశాలు:

  • URLలు, HTML కోడ్‌ను చేర్చకండి.
  • వివరణ ఫీల్డ్‌లో 750 అక్షరాలు మించకుండా చూసుకోండి.

ప్రమోషన్‌లు, ధరలు లేదా అమ్మకాల వివరాలకు బదులుగా ప్రధానంగా మీ బిజినెస్ వివరాలపై దృష్టి సారించండి. బిజినెస్ ప్రాతినిధ్యం వహించడానికి సంబంధించి గైడ్‌లైన్స్ గురించి మరింత చదవండి.

ఉదాహరణ: "పట్టణ నడి బొడ్డు నుండి కొంత దూరంలోనే మా సొంత ఐస్ క్రీమ్ షాప్ ఉంది, స్థానికులు తమ ఫ్రెండ్స్‌తో కలిసి కోన్ ఐస్ క్రీమ్‌ను ఆస్వాదించడానికి మా షాప్‌ను ఇష్టమైన స్థలంగా భావిస్తున్నందుకు, నేరుగా తమ ఇంటికి డెలివరీ చేసే తాజా పిజ్జా కోసం మాకు కాల్ చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. మేము 35 రకాల రుచులతో కూడిన ఇంటిలో తయారు చేసిన, చేతితో తయారు చేసిన ఐస్ క్రీమ్‌లు, సోర్బెట్‌లను సంవత్సరం పొడవునా అందిస్తున్నాం. అలాగే, ప్రతి రోజు మధ్యాహ్నం నుండి షాప్ మూసివేసే వరకు మా పిజ్జా ఓవెన్, న్యూయార్క్ స్టయిల్ 'పైల'ను అందిస్తుంది. నేడే మా షాప్‌కు విచ్చేయండి!"

ప్రారంభ తేదీ

మీ బిజినెస్ మొదట ఎప్పుడు తెరవబడిందో, లేదా ఎప్పుడు తెరుచుకుంటుందో కస్టమర్‌లకు తెలియజేయడానికి మీ Business Profileకు ప్రారంభ తేదీని జోడించండి.

బిజినెస్ ఎంత కాలం నుండి నడుస్తోందని కనుగొనడానికి Google పలు సోర్స్‌లను ఉపయోగిస్తుంది. Google Searchలోని కొన్ని ప్రదేశాలలో, బిజినెస్ ఎన్ని సంవత్సరాలుగా నడుస్తోందనే విషయాన్ని కస్టమర్‌లకు తెలియజేయడానికి ప్రారంభ తేదీ ఉపయోగించబడవచ్చు. తప్పు ఉందని వ్యాపారి నమ్మితే, వారు సరైన ప్రారంభ తేదీని సెట్ చేయవచ్చు.

మీ ప్రారంభ తేదీ యొక్క సంవత్సరం, నెల మాత్రమే అవసరం. మీరు తేదీని భవిష్యత్తులో ఒక సంవత్సరం దాకా ఎంటర్ చేయవచ్చు, కానీ ఇది Googleలో ఆ తేదీకి 90 రోజుల కంటే ముందు చూపబడదు.

Google Search, Mapsలలో మీ ప్రారంభ తేదీని సెట్ చేయండి

  1. మీ Business Profileకు వెళ్లండి. మీ ప్రొఫైల్‌ను ఎలా కనుగొనాలో తెలుసుకోండి.
  2. మీ బిజినెస్ సమాచారాన్ని ఎడిట్ చేయడానికి:
    • Google Searchను ఉపయోగించడానికి, ప్రొఫైల్‌ను ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • Google Mapsతో, ప్రొఫైల్‌ను ఎడిట్ చేయండి ఆ తర్వాత బిజినెస్ సమాచారం ఆప్షన్‌లను ఎంచుకోండి.
  3. మీ ప్రారంభ తేదీని ఎడిట్ చేయడానికి:
    • Google Searchను ఉపయోగించి, “ప్రారంభ తేదీ” ఫీల్డ్‌కు స్క్రోల్ చేసి, దాన్ని ఎంచుకోండి.
    • Google Mapsను ఉపయోగించి, “పరిచయం” ట్యాబ్ కింద, ప్రారంభ తేదీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. అవసరమైన ఫీల్డ్స్‌ను ఎంటర్ చేయండి.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
చిట్కా: Google Searchలోని కొన్ని ప్రదేశాలలో, బిజినెస్ ఎన్ని సంవత్సరాలుగా నడుస్తోందనే విషయాన్ని కస్టమర్‌లకు తెలియజేయడానికి ఓపెనింగ్ తేదీ ఉపయోగించబడుతుంది.
మెనూ/సేవలు (పరిమిత లభ్యత)
'మెనూ, సర్వీసుల ఎడిటర్'‌ను ఉపయోగించి, మీ మెనూ ఐటెమ్‌లు, సర్వీసుల ధరలతో పాటు ఇతర వివరాలను అప్‌డేట్ చేయండి.
మెనూ ఎడిటర్ (ఫుడ్, డ్రింక్ బిజినెస్‌లు మాత్రమే) లేదా సర్వీసుల ఎడిటర్ గురించి మరింత తెలుసుకోండి.
ప్రోడక్ట్‌లు (పరిమిత లభ్యత)

స్టోర్‌లో ప్రోడక్ట్‌లు

మీరు అర్హత ఉన్న దేశంలో (US, CA, UK, IE) రిటైల్ బిజినెస్‌ను రన్ చేస్తున్నట్లయితే, మీ Business Profileలో మీ స్టోర్‌లోని ప్రొడక్ట్‌లను ఆటోమేటిక్‌గా ప్రదర్శించడం ద్వారా, ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేవారిని స్టోర్‌లో షాపింగ్ చేసేలా ప్రోత్సహించవచ్చు.

మీ ప్రోడక్ట్‌లను మీ Business Profileకు జోడించడానికి, మీ సేల్ లొకేషన్ సిస్టమ్‌ను లోకల్ ఇన్వెంటరీ యాప్‌నకు లేదా ప్రోడక్ట్ రీడర్‌కు కనెక్ట్ చేయండి. స్టోర్‌లోని ప్రోడక్ట్‌లను ప్రదర్శించడం ఎలాగో తెలుసుకోండి.

చెక్ ఇన్ మరియు చెక్ అవుట్ సమయాలు (హోటళ్లు మాత్రమే)
హోటళ్లు, వాటి Business Profileకు వాటి చెక్-ఇన్, చెక్-అవుట్ సమయాలను జోడించవచ్చు. రూమ్‌లు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి, అలాగే వాటిని ఎప్పుడు ఖాళీ చేయాలి అనే విషయంలో ఈ సమాచారం కస్టమర్‌లకు సహాయపడుతుంది.
హోటల్ లిస్టింగ్‌లు ఖచ్చితమైనవని నిర్ధారించడానికి, Google, వివిధ విశ్వసనీయ సోర్స్‌ల నుండి చెక్-ఇన్, చెక్-అవుట్ సమాచారాలను కూడా సేకరిస్తుంది (ఉదా., యూజర్ రిపోర్ట్‌లు, లైసెన్స్ పొందిన కంటెంట్). మీరు ఈ అప్‌డేట్‌లను ఆటోమేటిక్‌గా అంగీకరించాలా, వద్దా అని ఎంచుకోవచ్చు.
హోటల్ సమాచారం (హోటళ్లు మాత్రమే)
ముఖ్య గమనిక: ఈ ఫీచర్, కేవలం కంప్యూటర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
వెరిఫై అయిన హోటల్ ప్రొఫైల్స్‌ను కలిగి ఉన్న ఓనర్‌లు, Business Profile మేనేజర్‌లోని "హోటల్ అట్రిబ్యూట్‌లు" అనే విభాగంలో వారి సర్వీస్‌లను, సౌకర్యాలను ఎడిట్ చేయవచ్చు. 

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7740648246067311000
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99729
false
false
false