మీ కోసం YouTube ఎలా పని చేస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి

YouTubeలో మీరు అభిరుచి మేరకు కంటెంట్ పోస్ట్ చేస్తుండొచ్చు లేదా బిజినెస్ ఉద్దేశంతో చేస్తుండొచ్చు. ఈ రెండింటిలో కారణం ఏదైనా కానీ కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి మీరు చాలా టైమ్‌ను, శక్తిని వెచ్చిస్తున్నారని మాకు తెలుసు. మీ కంటెంట్‌ను ప్రేక్షకులు ఎలా కనుగొంటున్నారు, దాని పనితీరు ఎలా ఉంది అనే వాటిని మీరు తెలుసుకోవడం ముఖ్యం. క్రియేటర్‌లుగా, మీరు మా కమ్యూనిటీ మధ్యలో ఉన్నారు, కాబట్టి మీతో కమ్యూనికేషన్, పారదర్శకత మా ప్రాధాన్యతగా ఉంటుంది. మీరు విజయతీరాల్ని చేరుకోవడానికి మేము చేయూతనిస్తాము. ఆ నేపథ్యంలో కొన్ని గొప్ప రిసోర్స్‌లను మేము అందుబాటులోకి తీసుకు వచ్చాము, అవి వీటిని వివరిస్తాయి:

YouTubeలో మీ కంటెంట్

YouTube సెర్చ్

YouTube సెర్చ్ అనేది సందర్భోచితం, ఎంగేజ్‌మెంట్‌, నాణ్యతతో సహా ఉత్తమ సెర్చ్ ఫలితాలను అందించడానికి కొన్ని ప్రధాన అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది. సందర్భోచితాన్ని అంచనా వేయడానికి మేము వీక్షకులు అడిగే సెర్చ్ క్వెరీతో వీడియో టైటిల్, ట్యాగ్‌లు, వివరణ, వీడియో కంటెంట్ ఎంత బాగా మ్యాచ్ అవుతున్నాయి లాంటి పలు అంశాలను పరిశీలిస్తాము. సందర్భోచితాన్ని అంచనా వేయడానికి వీడియోతో వీక్షకులు ఏ మేరకు ఎంగేజ్ అవుతున్నారు అన్న అంశం బాగా ఉపయోగపడుతుంది. యూజర్ల నుండి పొందిన ఎంగేజ్‌మెంట్ అనుభవాలను క్రోడీకరించి వాటిని లెక్కలోకి తీసుకుంటాము. ఉదాహరణకు, మేము ఒక నిర్దిష్ట క్వెరీకి సంబంధించి వీడియో వాచ్ టైమ్‌ను పరిశీలిస్తాము. ఇతర యూజర్లు ఆ వీడియోను ఈ క్వెరీకి సందర్భోచితంగా ఉందని భావిస్తున్నారా లేదా అన్నది అంచనా వేస్తాము. మెరుగైన క్వాలిటీని అందించడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తాము. ఒక నిర్దిష్ట టాపిక్ మీద ఏ ఛానెల్స్ నైపుణ్యాన్ని చూపిస్తున్నాయి, ప్రామాణికంగా విషయాన్ని చెప్పగలుగుతున్నాయి, విశ్వసనీయతను చూరగొంటున్నాయి అన్న అంశాలను నిర్ణయించేందుకు సహాయపడే సిగ్నల్స్‌ను మా సిస్టమ్‌లు గుర్తిస్తాయి. ఉచిత సెర్చ్ ఫలితాల్లో మెరుగైన ప్లేస్‌మెంట్ కోసం, YouTube ఎలాంటి పేమెంట్‌ను స్వీకరించదు.

మ్యూజిక్ లేదా వినోదం లాంటి రంగాలకు సంబంధించి, యూజర్లు ఎంజాయ్ చేయగలిగిన క్వాలిటీ కంటెంట్‌ను అందించేందుకు మా సిస్టమ్‌లు సహాయపడతాయి. ఇందుకోసం మేము తరచుగా కొత్తదనం లేదా ప్రజాదరణ వంటి అదనపు అంశాలను ఉపయోగిస్తాము. వార్తలు, రాజకీయాలు, వైద్య లేదా శాస్త్రీయ సమాచారంతో సహా విశ్వసనీయత కీలకమైన ఇతర రంగాలలో, మా సెర్చ్ సిస్టమ్‌లు విశ్వసనీయ మూలాల నుండి అధిక నాణ్యతను, అధికారిక కంటెంట్‌ను రూపొందించడానికి ప్రాధాన్యతనిస్తాయని నిర్ధారించుకోవడానికి మేము తీవ్రంగా కృషి చేస్తాము.

YouTube సెర్చ్‌లో అధికారిక కంటెంట్‌ను హైలైట్ చేయడం ద్వారా యూజర్‌లు కంటెంట్‌ను అన్వేషించడాన్ని అధికారిక కార్డ్‌లు కూడా సులభతరం చేస్తాయి. ఈ కార్డ్‌లలో టాప్ YouTube క్రియేటర్‌లు, సెలబ్రిటీలు, అలాగే మ్యూజిక్ ఆర్టిస్ట్‌ల వంటి వారికి చెందిన టాప్ ఛానెల్స్ నుండి అధికారిక వీడియోలు ఇంకా పోస్ట్‌లు కూడా ఉంటాయి. క్రీడా టీమ్‌లు, సినిమాలు అలాగే టీవీ, మ్యూజిక్, ఇంకా ప్రత్యేక ఈవెంట్‌లకు సంబంధించిన కంటెంట్ నుండి వీడియోలు, పోస్ట్‌లు కూడా చేర్చబడతాయి. ఈ కార్డ్‌లు ఆటోమేటిక్‌గా జెనరేట్ అవుతాయి, అనుకూలంగా మార్చుకోవడానికి అనుమతి లేదు.

యూజర్‌లకు అత్యుత్తమ సెర్చ్ ఫలితాలను అందించడానికి, మేము పరిగణనలోకి తీసుకునే అంశాల గురించి మీరు అర్థం చేసుకోవడంలో సహాయపడే రిసోర్స్‌లను మీకు అందించాలన్నది మా లక్ష్యం.

మరిన్ని రిసోర్స్‌లు

సిఫార్సు చేయబడిన వీడియోలు

ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన వీక్షణ అలవాట్లు ఉన్నాయని మేము తెలుసుకోవడం ప్రారంభించాము. మా సిస్టమ్ యూజర్ వీక్షణ అలవాట్లను సారూప్యమైన వాటితో పోలుస్తుంది. వీక్షకులు చూడాలనుకునే ఇతర కంటెంట్‌ను సూచించడానికి సిస్టమ్ ఆ సమాచారాన్ని ఉపయోగిస్తుంది.

మా సిఫార్సు సిస్టమ్ నిరంతరం అభివృద్ధి చెందుతోంది, మేము సిగ్నల్స్ అని పిలిచే 8 వేల కోట్లకు పైగా సమాచారం నుండి ప్రతిరోజూ నేర్చుకుంటున్నాము, వాటిలో ప్రధానంగా కింద పేర్కొన్నవి ఉన్నాయి:

  • వీక్షణ హిస్టరీ: మా సిస్టమ్, వీక్షకులు చూసే YouTube వీడియోలను వారికి మెరుగైన సిఫార్సులను అందించడానికి, వారు ఎక్కడ ఆపివేశారో గుర్తుంచుకోవడానికి, మరిన్నింటిని ఉపయోగిస్తుంది.
  • సెర్చ్ హిస్టరీ:  భవిష్యత్ సిఫార్సులను ప్రభావితం చేయడానికి వీక్షకులు YouTubeలో సెర్చ్ చేసిన వాటిని మా సిస్టమ్ ఉపయోగిస్తుంది.
  • ఛానెల్ సబ్‌స్క్రిప్షన్‌లు: వీక్షకులు వారు ఇష్టపడే ఇతర వీడియోలను సిఫార్సు చేయడానికి సబ్‌స్క్రిప్షన్ పొందిన YouTube ఛానెళ్ల గురించిన సమాచారాన్ని మా సిస్టమ్ ఉపయోగిస్తుంది.
  • లైక్‌లు: భవిష్యత్తులో ఇలాంటి వీడియోలపై వీక్షకుడు ఆసక్తి చూపే అవకాశాన్ని అంచనా వేయడానికి మా సిస్టమ్ లైక్‌ల సమాచారాన్ని ఉపయోగిస్తుంది.
  • డిస్‌లైక్‌లు: భవిష్యత్తులో ఏమి సిఫార్సు చేయకుండా ఉండాలో తెలియజేయడానికి వీక్షకులు డిస్‌లైక్ చేసిన వీడియోలను మా సిస్టమ్ ఉపయోగిస్తుంది.
  • “ఆసక్తి లేదు” ఫీడ్‌బ్యాక్ ఎంపికలు: భవిష్యత్తులో దేన్ని సిఫార్సు చేయకుండా ఉండాలనే విషయాన్ని తెలియజేయడానికి, వీక్షకులు "ఆసక్తి లేదు" అని మార్క్ చేసిన వీడియోలను మా సిస్టమ్ ఉపయోగిస్తుంది. 
  • “సిఫార్సు చేయవద్దు ఛానెల్” ఫీడ్‌బ్యాక్ ఎంపికలు: ఛానెల్ కంటెంట్ అనేది వీక్షకులు చూసి ఆనందించేది కాదనే సంకేతంగా మా సిస్టమ్ “ఛానెల్‌ను సిఫార్సు చేయవద్దు” ఫీడ్‌బ్యాక్ ఎంపికలను ఉపయోగిస్తుంది.
  • సంతృప్తి సర్వేలు: మా సిస్టమ్ యూజర్ సర్వేలను ఉపయోగిస్తుంది, వీక్షకులను వారు చూసిన వీడియోలకు రేటింగ్ ఇవ్వమని అడుగుతుంది, ఇది వాచ్ టైమ్‌ను మాత్రమే కాకుండా సంతృప్తిని అర్థం చేసుకోవడానికి సిస్టమ్‌కు సహాయపడుతుంది.

విభిన్న YouTube ఫీచర్‌లు కొన్ని సిఫార్సు సిగ్నళ్లపై ఇతర ఫీచర్‌ల కంటే ఎక్కువగా ఆధారపడతాయి. ఉదాహరణకు, తదుపరి ప్లే చేయమని వీడియోను సూచించేటప్పుడు వీక్షకులు ప్రస్తుతం చూస్తున్న వీడియోనే ప్రధాన సంకేతంగా ఉపయోగిస్తాము. హోమ్ పేజీలో వీడియో సిఫార్సులను అందించడానికి, మేము ప్రధానంగా వీక్షకుల వీక్షణ హిస్టరీపై ఆధారపడతాము. వీక్షకులు తమ హోమ్‌ పేజీలో సిఫార్సులను చూడకూడదనుకుంటే వారి వీక్షణ చరిత్రను ఆఫ్ చేయవచ్చు, క్లియర్ చేయవచ్చు. YouTube వీక్షణ హిస్టరీ ఆఫ్‌లో ఉన్న వ్యక్తుల కోసం, గణనీయమైన ముందస్తు వీక్షణ హిస్టరీ లేని వ్యక్తుల కోసం, హోమ్‌ పేజీ సెర్చ్ బార్‌ను, ఎడమ చేతి గైడ్ మెనుూను చూపడం కొనసాగిస్తుంది. 

అతిక్రమణకు దగ్గరగా ఉన్న కంటెంట్‌ను అలాగే హానికరమైన తప్పు సమాచారాన్ని ప్రచారం కానివ్వకుండా తగ్గించడం 

మేము పారదర్శకంగా ఉండాలని నిర్ణయించుకున్నాము అంటే దానర్థం - ఈ ప్లాట్‌ఫామ్‌లో కొన్ని రకాల కంటెంట్ మా పాలసీలను ఉల్లంఘించకపోయినా, దాదాపుగా ఉల్లంఘించే విధంగా ఉండటానికి అవకాశం ఉంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడటం చాలా ముఖ్యం అని మేము భావిస్తున్నాము. అదే సమయంలో YouTube హోమ్ పేజీలో, లేదా “తర్వాత రాబోయేది” ప్యానెల్ ద్వారా చేసే మా సిఫార్సులలో ఏ వీడియోలను ప్రముఖంగా డిస్‌ప్లే చేయాలి అనే దానికి సంబంధించి ఉన్నతమైన ప్రమాణాలను సెట్ చేస్తాము. 

అందుకే వార్తలు, రాజకీయాలు, వైద్యం, శాస్త్రీయ సమాచారం వంటి అంశాలపై వీక్షకులకు అధికారిక వీడియోలను సిఫార్సు చేసే అదనపు దశను మేము తీసుకుంటాము.

మేము ప్రతి ఛానెల్, వీడియోలోని సమాచార నాణ్యతను అంచనా వేసే పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న గైడ్‌లైన్స్‌ను ఉపయోగించి శిక్షణ పొందిన రివ్యూవర్లపై ఆధారపడతాము. వీడియో అధికారికంగా ఉందో లేదో నిర్ణయించడానికి, మూల్యాంకనం చేసేవారు వీడియో ప్రధాన టాపిక్ అయిన స్పీకర్ లేదా ఛానెల్‌కు సంబంధించిన నైపుణ్యం, ప్రసిద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు, కంటెంట్ దాని వాగ్దానాన్ని అందజేస్తుందా లేదా దాని లక్ష్యాన్ని సాధిస్తుందా వంటి అంశాలను పరిశీలిస్తారు. వీడియో ఎంత అధికారికంగా ఉంటే, అది సిఫార్సులలో అంత ఎక్కువగా ప్రచారం చేయబడుతుంది. వార్తా కేంద్రాలు, ఆరోగ్య సంస్థల వంటి అధికారిక సోర్స్‌ల నుండి కంటెంట్‌ను మెరుగ్గా అందించడానికి మా సిస్టమ్‌లను మెరుగుపరచడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. 

మరిన్ని రిసోర్స్‌లు

YouTubeతో మీ సంబంధం

YouTubeతో మీ ఒప్పందం

సర్వీస్ వినియోగం అంతా YouTube సర్వీస్ నియమాలకు, మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు, మా ప్లాట్‌ఫామ్ పాలసీలకు లోబడి ఉండాలి.

మానిటైజేషన్, లైవ్ స్ట్రీమింగ్, లేదా Shopping వంటి నిర్దిష్ట ఫీచర్‌లను మీరు ఆన్ చేసినప్పుడు, అదనపు పాలసీలు కూడా వర్తిస్తాయని గుర్తుంచుకోండి. మీరు ఒక సర్వీస్‌కు అడ్వర్టయిజింగ్‌ను లేదా స్పాన్సర్‌షిప్‌లను అందిస్తే లేదా మీ కంటెంట్‌లో పెయిడ్ ప్రమోషన్‌లను జోడిస్తే, అడ్వర్టయిజర్‌లకు సంబంధించిన మా యాడ్ పాలసీలకు కూడా మీరు కట్టుబడి ఉండాలని మర్చిపోకండి. మా సహాయ కేంద్రం కోసం సెర్చ్ చేసి, మా పాలసీలు అన్నింటిని మీరు ఎప్పుడైనా చూడవచ్చు.

YouTube Studioలో అంగీకరించిన అత్యంత ఇటీవలి ఆన్‌లైన్ ఒప్పందాలను మీరు కనుగొనవచ్చు.

YouTubeతో కమ్యూనికేట్ చేయడం

మా పార్ట్‌నర్‌లతో కమ్యూనికేషన్‌ను, పారదర్శకతను మెరుగుపరుచుకోవాలన్న మా నిరంతర లక్ష్యంలో భాగంగా, మేము చేసే మార్పులు ఏవి అయితే మీపై ప్రభావం చూపే అవకాశం ఉందో, వాటి గురించి మీకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. మీరు నిర్దిష్ట సమస్యను ఎదుర్కొంటున్నా, సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో సహాయం అవసరమైనా, లేదా YouTube నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నా, మీకు సాయం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాము. మీరు క్రియేటర్ సపోర్ట్‌ను లేదా మీ పార్ట్‌నర్ మేనేజర్‌ను సంప్రదించవచ్చు. మేము మిమ్మల్ని ఎలా సంప్రదిస్తాము అనే దాని గురించి మీరు ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు.

YouTubeలో డబ్బు సంపాదించడం

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్

మేము మరింత మంది క్రియేటర్‌లకు అందుబాటులో ఉండేలా YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)ను విస్తరింపజేస్తున్నాము, దీనితో వారికి ఫ్యాన్ ఫండింగ్, ఇంకా Shopping ఫీచర్‌లకు ముందుగానే యాక్సెస్ లభిస్తుంది. విస్తరించిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ఈ దేశాలు/ప్రాంతాలలో అర్హత ఉన్న క్రియేటర్‌లకు అందుబాటులో ఉంది. ఈ విస్తరణ AE, AU, BR, EG, ID, KE, KY, LT, LU, LV, MK, MP, MT, MY, NG, NL, NO, NZ, PF, PG, PH, PT, QA, RO, RS, SE, SG, SI, SK, SN, TC, TH, TR, UG, VI, VN, and ZAలో అర్హత కలిగిన క్రియేటర్‌లకు వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుంది. YPPలో జరిపిన మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ ఆర్టికల్‌ను చూడండి.

మీరు పై దేశాలు/ప్రాంతాలలో ఒక దానిలో నివసించకపోతే, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు సంబంధించి మీకు ఎలాంటి మార్పులు ఉండవు. మీకు సంబంధించిన YPP ఓవర్‌వ్యూ, అర్హత, దరఖాస్తు సూచనల కోసం మీరు ఈ ఆర్టికల్‌ను చూడవచ్చు.

విస్తరింపజేయబడిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ కోసం మీ అర్హతను చెక్ చేయండి. మీరు అర్హులు కాకపోతే, YouTube Studioలోని Earn ఏరియాలో నోటిఫికేషన్ పొందండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. YPP ప్రోగ్రామ్‌ను మీకు అందుబాటులోకి తెచ్చినప్పుడు, కనీస అర్హతా ప్రమాణాలకు మీరు అనుగుణంగా ఉన్నప్పుడు, మేము మీకు ఒక ఈమెయిల్‌ను పంపుతాము. 


YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగంగా, పలు ఆదాయ స్ట్రీమ్‌లను ఉపయోగించుకోవడానికి మీకు అర్హత ఉంటుంది. అయితే అవి మీ దేశం/ప్రాంతంలో అందుబాటులో ఉండాలి. అలాగే మీరు నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తూ ఉండాలి. మీకు క్రియేటర్ సపోర్ట్‌కు, Copyright Match Toolకు కూడా యాక్సెస్ ఉంటుంది. ప్రోగ్రామ్ గురించి, అది ఎలా పని చేస్తుంది, అలాగే దానికి ఎలా దరఖాస్తు చేయాలి అనే వాటి గురించి మీరు ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు.

YouTube Music ఛానెల్‌ను మానిటైజ్ చేయడం

మీరు లేబుల్ అయినా, పబ్లిషర్ అయినా, పంపిణీదారు అయినా, లేదా ఇండిపెండెంట్ మ్యుజీషియన్ అయినా, మరింత మంది ఫ్యాన్స్‌కు చేరువ కావడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి YouTube మీకు సహాయం చేస్తుంది. యాడ్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లు, అలాగే ఇతర ఆదాయ సోర్స్‌ల ద్వారా మీ మ్యూజిక్‌తో డబ్బు సంపాదించడంలో YouTube మీకు ఎలా సహాయపడగలదు అనే దాని గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి. YouTubeలో మీ మ్యూజిక్‌ను అందించడానికి అలాగే మీ డిజిటల్ హక్కులను మేనేజ్ చేయడానికి విస్తరించగల టూల్స్ ఇంకా వ్యూహాల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

ఫ్యాన్ ఫండింగ్ 

సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అనేవి లైవ్ స్ట్రీమ్‌లు ఇంకా ప్రీమియర్‌ల సమయంలో క్రియేటర్‌లను ఫ్యాన్స్‌తో కనెక్ట్ చేసే మార్గాలు. ఫ్యాన్స్ లైవ్ చాట్‌లో వారి మెసేజ్‌ను హైలైట్ చేయడానికి సూపర్ చాట్‌లను కొనుగోలు చేయవచ్చు, లేదా లైవ్ చాట్‌లో కనిపించగల యానిమేటెడ్ ఇమేజ్ కోసం సూపర్ స్టిక్కర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. మీకు అర్హత ఉంటే, సూపర్ చాట్‌ను లేదా సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయడం ఎలా అన్నది, అలాగే మీరు ఏ విధంగా ఈ ఫీచర్‌లను మేనేజ్ చేయవచ్చు అనే అంశాల గురించి మరింత తెలుసుకోండి.

సూపర్ థ్యాంక్స్ అనేది, షార్ట్‌లు, నిడివి ఎక్కువ ఉన్న వీడియోల పట్ల అదనపు కృతజ్ఞత చూపాలనుకునే వీక్షకుల నుండి క్రియేటర్లు ఆదాయాన్ని సంపాదించేందుకు వీలు కల్పిస్తుంది. ఫ్యాన్స్, వన్-టైమ్ యానిమేషన్‌ను కొనుగోలు చేసి, వీడియోలోని లేదా షార్ట్‌లోని కామెంట్ విభాగంలో రంగురంగుల, అలాగే అనుకూలంగా మార్చదగిన కామెంట్‌ను పోస్ట్ చేయవచ్చు. మీకు అర్హత ఉంటే, మీ ఛానెల్ కోసం సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయడం, అలాగే మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

నెలవారీ పేమెంట్‌ల ద్వారా మీ ఛానెల్‌లో చేరే వెసులుబాటును ఛానెల్ మెంబర్‌షిప్‌లు వీక్షకులకు కల్పిస్తాయి, దీని ద్వారా వారు బ్యాడ్జ్‌లు, ఎమోజిలు, ఇతర ప్రయోజనాల వంటి మెంబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే పెర్క్‌లను పొందుతారు. మీకు అర్హత ఉంటే, మీ ఛానెల్ కోసం మెంబర్‌షిప్‌లను ఆన్ చేయడం, మెంబర్‌షిప్‌లను మేనేజ్ చేయడం ఎలా అనే అంశాల గురించి మరింత తెలుసుకోండి.

YouTubeలో విక్రయించడం

అర్హత ఉన్న ఛానెల్ ఓనర్‌లు, YouTubeలో తమ స్వంత ప్రోడక్ట్‌లను, అధికారిక బ్రాండెడ్ అమ్మకపు వస్తువులను షోకేస్ చేసే అవకాశాన్ని కూడా మేము అందిస్తాము. YouTubeలో Shopping చేయడం ప్రారంభించండి.

అలాగే మీరు YouTubeలో మ్యూజిక్ ఆర్టిస్ట్ అయితే, మీ రాబోయే సంగీత కచేరీ లిస్టింగ్‌లను YouTubeలో షోకేస్ చేయడానికి కూడా మీకు అర్హత ఉండవచ్చు. మీ పర్యటన తేదీలకు సంబంధించిన టికెట్లను వీడియోలకు ఎలా జోడించాలనే దాని గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

YouTubeలో మీ పనితీరు

YouTube అనేది Googleలో ఒక భాగం. Google గోప్యతా పాలసీలకు, నియమాలకు లోబడి ఉంటుంది. మీరు ఒక యూజర్‌గా లేదా పార్ట్‌నర్‌గా, మా సర్వీస్‌లను ఉపయోగించినప్పుడు, మీ సమాచారం విషయంలో మీరు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. YouTubeలో మీ విజయాన్ని అంచనా వేయడానికి డేటా అనేది ఎంత ముఖ్యమో మేము అర్థం చేసుకోగలము. మా యూజర్‌ల, పార్ట్‌నర్‌ల గోప్యతను, సెక్యూరిటీని కాపాడటానికి మా గోప్యతా పాలసీ విషయంలో మా విధానాలు నిలకడగా ఉన్నాయని మేము నిర్ధారించుకుంటాము.

మీ డేటా నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడటానికి, YouTube మీ పనితీరును కొలవడానికి మీ కోసం టూల్స్ సూట్‌ను అందిస్తుంది. మీరు దీనికి అనుమతినిస్తే, మేము YouTube ఛానెల్‌కు, అలాగే కంటెంట్ ఓనర్‌లకు YouTube ఎనలిటిక్స్ డేటాకు యాక్సెస్‌ను అందిస్తాము. YouTube ఛానెల్, కంటెంట్ ఓనర్‌లు ఈ APIల ద్వారా ఎటువంటి రకాల రిపోర్ట్‌లను యాక్సెస్ చేయగలరు అనే దాని గురించి మరింత తెలుసుకోండి. మా వద్ద ఎనలిటిక్స్ ఫీచర్‌లు, YouTube ఎనలిటిక్స్ అలాగే ఆర్టిస్ట్‌ల కోసం YouTube ఎనలిటిక్స్ కూడా ఉన్నాయి, వీటిని నేరుగా ప్లాట్‌ఫామ్‌లో చేర్చి రూపొందించడం జరిగింది, తద్వారా ఈ కింద పేర్కొన్న పనితీరు కొలమానాలను యాక్సెస్ చేయడానికి మీకు వీటి ద్వారా అనుమతి ఉంటుంది: 

  • వాచ్ టైమ్: వీక్షకులు ఒక వీడియోను ఎంతసేపు చూశారో చెబుతుంది.
  • సబ్‌స్క్రయిబర్‌లు: మీ ఛానెల్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకున్న వీక్షకుల సంఖ్య.
  • వీక్షణలు: మీ ఛానెల్స్‌కు లేదా వీడియోలకు సంబంధించిన చట్టబద్ధమైన వీక్షణల సంఖ్య.
  • టాప్ వీడియోలు: ఏ వీడియోలు ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయో చెబుతుంది.
  • ప్రేక్షకుల నిలకడ: మీ వీడియో మీ ప్రేక్షకులకు ఎంత బాగా ఆసక్తిని కలిగిస్తుందో చూపిస్తుంది.
  • లైవ్ స్ట్రీమ్ డేటామీ వీడియో అంతటా మీ స్ట్రీమ్‌ను ఎంత మంది వీక్షకులు చూస్తున్నారో చూడండి.
  • జనాభా కేటగిరీలు: మీ వీక్షకులు ఎవరనేది, వారి వయస్సు, జెండర్, అలాగే లొకేషన్‌కు సంబంధించిన గణాంకాలతో సహా తెలియజేస్తుంది.
  • ట్రాఫిక్ సోర్స్‌లు: వీక్షకులు మీ కంటెంట్‌ను ఎలా కనుగొంటారనేది అర్థం చేసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.

మీ ఛానెల్ పేజీలో, వీక్షణా పేజీలో, YouTube ట్రెండింగ్ సైట్స్‌లో, ఆర్టిస్ట్‌ల కోసం YouTube ఎన‌లిటిక్స్‌లో, మ్యూజిక్ చార్ట్‌లు & గణాంకాలలో, ఇంకా API సర్వీస్‌లలో క్రోడీకరించిన సబ్‌స్క్రయిబర్ల సంఖ్య, వీడియో వీక్షణల సంఖ్య లాంటి ఛానెల్‌కు, వీడియోకు చెందిన కొంత ఎనలిటిక్స్‌ను కూడా మేము పబ్లిక్‌గా పబ్లిష్ చేస్తాము. Google గోప్యతా పాలసీ ప్రకారం, మేము క్రోడీకరించిన, అజ్ఞాతీకరించబడిన ఛానెల్ డేటాను, వీడియో డేటాను అడ్వర్టయిజర్లకు, సేల్స్ పార్ట్‌నర్లకు, ఇంకా హక్కుదారులకు కూడా అందించవచ్చు. ఉదాహరణకు, పేర్కొన్న దేశంలో లేదా ప్రాంతంలో గత ఏడాది కాలంలో ఫిట్‌నెస్ వీడియోల సంఖ్య రెట్టింపు అయిందని మేము చెప్పవచ్చు..

మీరు కొన్ని YouTube ఫీచర్‌లను ఉపయోగించాలని ఎంచుకున్నప్పుడు, నిర్దిష్ట రకాల డేటా కూడా షేర్ చేయబడవచ్చు. ఉదాహరణకు, మీరు మీ అధికారిక అమ్మకపు వస్తువుల రిటైలర్‌ను, మీ YouTube ఛానెల్‌ను కనెక్ట్ చేస్తే, విక్రయాలకు, విజిట్స్‌కు సంబంధించిన ఎనలిటిక్స్ డేటా, Googleకు, రిటైలర్‌కు మధ్య షేర్ చేయబడుతుంది. డేటా ఎలా షేర్ చేయబడవచ్చనేది మీ ప్రోగ్రామ్ నియమాలతో కలిపి మేము మీకు ఎల్లప్పుడూ తెలియజేస్తాము.

YouTube విశ్వసనీయతను, సేఫ్టీని అమలు చేసే కొన్ని YouTube టీమ్‌లు, YouTube ఎనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా లేదా API సర్వీస్‌ల ద్వారా అందుబాటులో ఉన్న డేటా కంటే భిన్నమైన లేదా మరింత వివరణాత్మకంగా ఉండే ఛానెల్ ఎనలిటిక్స్‌కు, వీడియో ఎనలిటిక్స్‌కు యాక్సెస్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు, YouTubeకు చెందిన స్పామ్ & సెక్యూరిటీ ఉల్లంఘన గుర్తింపు సిస్టమ్‌లు- సైట్ ట్రాఫిక్‌ను, ఎనలిటిక్స్‌ను పూర్తి స్థాయిలో రివ్యూ చేసి, సక్రమంగా లేని ప్రవర్తన ఏమైనా ఉందా అని చెక్ చేస్తాయి, YouTube సర్వీస్ నియమాలను ఉల్లంఘిస్తూ వీడియోల వీక్షణ సంఖ్యను లేదా సబ్‌స్క్రయిబర్ల సంఖ్యను పెంచి చూపేందుకు ట్రై చేస్తున్న వ్యక్తులను పట్టుకునే అవకాశం ఉంది.

ప్రత్యేకించి - ప్లాట్‌ఫామ్‌లతో పాటు పరికరాలు అంతటా వీక్షకుల సంఖ్య మారినప్పుడు, బిజినెస్ సంస్థలకు, అడ్వర్టయిజర్‌లకు ఖచ్చితమైన, చర్య తీసుకోదగిన గణాంకాలను అందించే లక్ష్యంతో మేము కొత్త పద్ధతులపై నిరంతరం పని చేస్తాము. మా యూజర్‌ల గోప్యతను, సెక్యూరిటీని కాపాడటానికి ఈ పద్ధతులు మా గోప్యతా పాలసీ విషయంలో నిలకడగా ఉన్నాయా లేదా అని మేము నిర్ధారించుకుంటాము. మీరు మా సర్వీస్‌లను ఉపయోగించడాన్ని నిలిపివేస్తే, మా రిటెన్షన్ పాలసీలో భాగంగా మేము ఈ డేటాను ఎలా నిల్వ చేస్తామనే దానికి సంబంధించి మీరు మరింత సమాచారాన్ని చదవవచ్చు.

మీరు క్రియేటర్ సపోర్ట్‌ను సంప్రదించడం ద్వారా మీ డేటా నుండి అత్యధిక ప్రయోజనం ఎలా పొందాలి అనే విషయం గురించి సహాయాన్ని పొందవచ్చు. మీరు అత్యంత విలువైనదిగా భావించే టూల్స్ గురించి మీ ఫీడ్‌బ్యాక్‌ను తెలియజేయడాన్ని మేము ఎల్లప్పుడూ స్వాగతిస్తాము.

మేము కొత్త టాలెంట్‌ను ఎలా సపోర్ట్ చేస్తాము

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మా క్రియేటర్‌లకు, ఆర్టిస్ట్‌లకు సహాయపడాలనే మా లక్ష్యంలో భాగంగా, వారి అభివృద్ధికి సపోర్ట్ చేయడానికి మేము క్రమం తప్పకుండా ప్రోగ్రామ్‌లను అమలు చేస్తాము. కొత్త కంటెంట్‌ను డెవలప్ చేయడంలో సపోర్ట్ చేయడానికి YouTube స్పేస్‌లలోని అద్భుతమైన స్టూడియోలకు, NextUp వంటి ట్రైనింగ్ క్యాంప్‌లకు, అలాగే నిర్దిష్ట సీడ్ ఫండింగ్‌కు యాక్సెస్‌ను అందించడం కూడా ఇందులో ఉండవచ్చు. ఈ సపోర్ట్‌కు బదులుగా, మా యూజర్లు ఆస్వాదించడం కోసం మా క్రియేటర్లు, ఆర్టిస్ట్‌లు YouTube కోసం ప్రత్యేకంగా కంటెంట్‌ను రూపొందిస్తామని హామీ ఇస్తారు.

మరిన్ని రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14818631111500880957
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false