నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

పాలసీలు

Google పబ్లిషర్ పరిమితులు

మేము అన్ని Google పబ్లిషర్ పాలసీలు, Google పబ్లిషర్ పరిమితులను కొత్త పబ్లిషర్ పాలసీల సహాయ కేంద్రానికి తరలించి, ఒక్కటిగా చేసే ప్రాసెస్‌లో ఉన్నాము. ప్రస్తుతానికి, AdMob, AdSense, Ad Manager సహాయ కేంద్రాల్లో అన్ని పాలసీలను మీరు ఇప్పటికీ చూడవచ్చు. 

పబ్లిషర్లకు కంటెంట్‌ను మానిటైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం, అలాగే పొటెన్షియల్ (ఆసక్తి ఉన్న) కస్టమర్లను రీచ్ కావడానికి ఉపయోగపడే, సంబంధిత ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను అడ్వర్టయిజర్లకు అందించడం ద్వారా ఇంటర్నెట్‌, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, అందరికీ అందుబాటులో ఉండేందుకు Google దోహదపడుతోంది.

ఎటువంటి కంటెంట్‌పై నిర్దిష్ట అడ్వర్టయిజింగ్ సోర్స్‌ల నుండి యాడ్స్ రాకుండా పరిమితం చేయబడతాయి అన్నది పబ్లిషర్ పరిమితులు నిర్దేశిస్తాయి. మీ కంటెంట్‌ మీద 'ఇన్వెంటరీ పరిమితి (రిస్ట్రిక్షన్‌)' అనే లేబుల్ గనుక ఉన్నట్లయితే, దానిపై తక్కువ సంఖ్యలో మాత్రమే అడ్వర్టయిజ్‌మెంట్ ప్రొవైడర్లు బిడ్ వేయగలుగుతారు. కొన్ని సందర్భాల్లో దీని అర్థం: అడ్వర్టయిజింగ్ సోర్స్‌లు ఏవీ మీ ఇన్వెంటరీపై బిడ్డింగ్ వేయడం లేదు, మీ కంటెంట్‌పై యాడ్‌లు ఏవీ కనిపించవు. ఈ పరిమితులతో లేబుల్ చేయబడిన కంటెంట్‌పై "Google Ads (గతంలో AdWords)" అడ్వర్టయిజ్‌మెంట్‌లు చూపబడవని దయచేసి గుర్తుంచుకోండి. కనుక, మీరు ఈ Google పబ్లిషర్ పరిమితులు వర్తించే కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి ఎంచుకున్నప్పటికీ, ఇది పరిమితులు లేని ఇతర కంటెంట్ కన్నా తక్కువ అడ్వర్టయిజింగ్‌ను అందుకునే అవకాశం ఉంది.

Google పబ్లిషర్ పరిమితులు కింద పేర్కొన్న కేటగిరీలలో ఆర్గనైజ్ చేయబడ్డాయి:

మీ Google పబ్లిషర్ ప్రోడక్ట్‌ల వినియోగాన్ని పర్యవేక్షించే ఏవైనా ఇతర పాలసీలతో పాటు అదనంగా ఈ పరిమితులు వర్తిస్తాయి.

సాధారణంగా ఉపయోగించే పాలసీ పదాల గురించి, ఇంకా గ్లాసరీలో వాటి అర్థాలు ఏమిటి అనేదాని గురించి మరింత తెలుసుకోండి. 

కంటెంట్ పరిమితులు

లైంగిక కంటెంట్

వీటిని కలిగి ఉన్న కంటెంట్:

  • నగ్నత్వం కలిగి ఉన్నవి.
  • శృంగార చిత్రీకరణలు ఉన్నవి, లైంగిక కోరికలను రెచ్చగొట్టేవి మరియు/లేదా సంభోగానికి ప్రేరేపించేవి.

    ఉదాహరణలు: వక్షోజాలు, పిరుదులు లేదా పంగల క్లోజ్-అప్ షాట్‌లు, పల్చని లేదా శరీరం కనిపించే దుస్తులు లేదా లోదుస్తులు, మసకబర్చిన లైంగిక శరీర భాగాలు లేదా లైంగిక ప్రేరేపణ కలిగించే విధంగా భంగిమ మరియు/లేదా బట్టలు లేకుండా ఉన్న పురుషులు లేదా మహిళల సెన్సార్ చేసిన చిత్రాలు

  • లైంగిక అంశాల చర్చలు.

    ఉదాహరణలు: ఇతరుల శృంగార కార్యాలను చూసి ఆనందించడం, పాత్రాభినయం, బానిసత్వం, ఆధిపత్యం, లొంగిపోవడం, శాడోమసోచిజం

  • లైంగిక వినోదం అందించేవి.

    ఉదాహరణలు: పోర్నోగ్రఫీ చలన చిత్రోత్సవాలు, అడల్ట్ వెబ్‌క్యామ్ సేవలు, స్ట్రిప్ క్లబ్‌లు

  • లైంగిక ఉత్పత్తుల అమ్మకపు ప్రచారం.

    ఉదాహరణలు: సెక్స్ సంబంధిత ఆటబొమ్మలు, వ్యక్తిగత లూబ్రికెంట్‌లు, మర్మాంగాలను పెద్దవిగా చేసే ఉపకరణాలు

  • అక్రమ సంబంధాలు మరియు/లేదా ఇతరులతో శృంగార చర్యలను ప్రోత్సహించే లేదా ఆ చర్యలకు తోడ్పాటు ఇచ్చేవి.

    ఉదాహరణలు: అక్రమ సంబంధం, భాగస్వాములను మార్చుకుని సంభోగించడం, సరదా సంభోగం లేదా ఫ్లింగ్ డేటింగ్

  • లైంగిక చర్య గురించి సలహాలు అందించేవి.

    ఉదాహరణలు: సెక్స్ చిట్కాలు

  • లైంగిక శక్తిని పెంచే ఔషధాలు లేదా సప్లిమెంట్‌లను ప్రచారం చేసేవి.

    ఉదాహరణలు: అంగస్తంభన మాత్రలు, లిబిడో బూస్టింగ్ సప్లిమెంట్‌లు

  లైంగిక కంటెంట్ గురించి మరింత తెలుసుకోండి

దిగ్భ్రాంతిని కలిగించే కంటెంట్

వీటిని కలిగి ఉన్న కంటెంట్:

  • భీకరమైన, గ్రాఫిక్‌గా ఉన్న, లేదా అసహ్యకరమైన వివరణలు లేదా చిత్రాలను కలిగి ఉండేవి.

    ఉదాహరణలు: రక్తం, పేగులు, నెత్తురు, లైంగిక ద్రవాలు, మనుషులు లేదా జంతువుల వ్యర్థాలు, నేరం జరిగిన దృశ్యం లేదా ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు

  • హింసాత్మక చర్యల చిత్రీకరణను కలిగి ఉన్నవి.

    ఉదాహరణలు: కాల్పులు, పేలుళ్లు లేదా బాంబు దాడులకు సంబంధించిన వివరణలు లేదా చిత్రాలు; వాటిని చేస్తున్నప్పుడు చిత్రీకరించిన వీడియోలు

  • అభ్యంతరకరమైన లేదా అసభ్యకరమైన పదజాలం గణనీయ పరిమాణంలో కలిగి ఉన్నవి లేదా విశేషంగా కలిగి ఉన్నవి.

    ఉదాహరణలు: తిట్లు లేదా శాపనార్థాలు, అసభ్యకర పదాలు ధ్వనించే విభిన్న పదజాలం, అక్షర దోషాలు

గేమ్ ఆడే విధానానికి సంబంధించిన ఇమేజ్‌లకు మినహాయింపు: గేమ్ ఆడే విధానానికి సంబంధించిన ఇమేజ్‌ల విషయంలో, కంటెంట్ అనేది కింద పేర్కొన్న విధంగా ఉంటే మాత్రమే అది "ఘోరమైన, గ్రాఫిక్, లేదా అసహ్యకరమైన ఖాతాలు లేదా ఇమేజ్‌లు కలిగి ఉందని" లేదా "హింసాత్మక చర్యలను వర్ణిస్తుందని" పరిగణించబడుతుంది.

  • చిత్రహింస.

    ఉదాహరణలు: నిగ్రహించబడిన లేదా ఖైదు చేయబడిన పాత్రలపై తీవ్రమైన నొప్పి లేదా బాధను కలిగించే హింసాత్మక చర్య

  • లైంగిక హింస.
  • మైనర్లపై హింస.
  • నిజ జీవితంలో ప్రముఖ వ్యక్తులపై హింస.

    ఉదాహరణలు: ప్రస్తుత ప్రపంచ అధ్యక్షులు, ప్రభుత్వ అధికారులు, సెలబ్రిటీలు లేదా క్రీడా ఆటగాళ్ల పట్ల ఏదైనా రకమైన హింస

  • సామాజిక వివక్ష లేదా అణచివేతకు సంబంధించిన లక్షణం ఆధారంగా ఒక వ్యక్తిని లేదా ఒక సమూహాన్ని హింసించడం.
  • ఉదాహరణలు: జాతి లేదా జాతి మూలం, మతం, వైకల్యం, వయస్సు, జాతీయత, వెటరన్ స్టేటస్, లైంగిక ధోరణి, లింగం, లింగ గుర్తింపు ఆధారంగా వ్యక్తులపై హింస

  దిగ్భ్రాంతిని కలిగించే కంటెంట్ గురించి మరింత తెలుసుకోండి

పేలుడు పదార్థాలు

వీటిని కలిగి ఉన్న కంటెంట్:

  • విస్ఫోటనం చెంది, తద్వారా చుట్టుపక్కల ఉన్న మనుషులకు లేదా ఆస్తులకు హాని కలిగించే అవకాశం ఉన్న ఉత్పత్తుల అమ్మకాన్ని ప్రచారం చేసే కంటెంట్.

    ఉదాహరణలు: నెయిల్ బాంబులు, కెమికల్ బాంబులు, గ్రెనేడ్‌లు, మందుగుండు లేదా ఏవైనా పేలుడు బాణాసంచా

  • పేలుడు పదార్థాల రూపకల్పన, వాటిని మెరుగుపరచడం లేదా పొందడం గురించి సూచనలను అందించే కంటెంట్.

    ఉదాహరణలు: బాంబు తయారీ మార్గదర్శకాలు; గ్రెనేడ్‌లు, బాంబులు లేదా ఇతర పేలుడు పరికరాల యొక్క భాగాల 3D ముద్రణ కోసం ఉద్దేశించిన సాఫ్ట్‌వేర్ లేదా సామాగ్రి

  పేలుడు పదార్థాల గురించి మరింత తెలుసుకోండి

తుపాకులు, తుపాకీ భాగాలు, సంబంధిత ప్రోడక్ట్‌లు

వీటిని కలిగి ఉన్న కంటెంట్:

  • తుపాకులు లేదా సరిగా వినియోగించకపోతే తీవ్ర హాని కలుగజేసే క్రీడలు లేదా వినోద సంబంధమైన తుపాకులు లేదా నిజమైనవిగా భ్రమింపజేసే తుపాకుల అమ్మకాలను ప్రచారం చేసే కంటెంట్.

    ఉదాహరణలు: చేతి తుపాకులు, రైఫిళ్లు, షాట్‌గన్‌లు, వేట తుపాకులు, పని చేస్తున్న పురాతన తుపాకులు, ఎయిర్‌సాఫ్ట్ గన్‌లు, పెయింట్‌బాల్ గన్‌లు, బిబి గన్‌లు, 3D ముద్రిత గన్‌లు

  • కాల్పులు జరపగల ఆయుధాలకు అవసరమైన లేదా వాటి పని తీరును మెరుగుపరిచేందుకు తుది రూపంలో ఉన్న లేదా ప్రాసెస్ చేయాల్సిన దశలో ఉన్న విడి భాగాలు లేదా అంతర్భాగాల అమ్మకాలను ప్రచారం చేసే కంటెంట్.

    ఉదాహరణలు: మందుగుండు సామాగ్రి, మందుగుండు సామాగ్రి క్లిప్‌లు, సైలెన్సర్‌లు, తుపాకుల ట్రైపాడ్‌లు, బైపాడ్‌లు, స్టాక్‌లు, మార్పిడి వస్తు సామాగ్రి, గన్-గ్రిప్‌లు, లక్ష్యం గురి పెట్టే దూరదర్శక ఉపకరణాలు, బంప్ స్టాక్‌లు

  • విడి భాగాలతో కాల్పులు జరిపే ఆయుధాలను రూపొందించేందుకు లేదా వాటి పని తీరును మెరుగుపరిచేందుకు సూచనలు ఇచ్చే కంటెంట్.

  తుపాకులు, తుపాకీ భాగాలు, సంబంధిత ప్రోడక్ట్‌ల గురించి మరింత తెలుసుకోండి

ఇతర ఆయుధాలు

వీటిని కలిగి ఉన్న కంటెంట్:

  • క్రీడలు, స్వీయ-రక్షణ లేదా యుద్ధ రంగంలో ప్రత్యర్థిని గాయపరచగల ఆయుధాలను ఉత్పత్తులుగా చెప్పి జరిపే అమ్మకాలను లేదా అలాంటి వాటిని ప్రచారం చేసే కంటెంట్.

    ఉదాహరణలు: విసరగలిగే నక్షత్ర ఆయుధాలు, టేజర్‌లు, బ్రాస్ నకుల్స్, పెప్పర్ స్ప్రే

  • గొడవలు, కొట్లాటలలో పైచేయి సాధించడానికి రూపొందించిన కత్తుల (దానితో పాటుగా, కనబడకుండా దాచిపెట్టగల రూపంలో ఉన్న లేదా సహాయక సాధనంతో తెరవగలిగే కత్తుల) అమ్మకాన్ని ప్రచారం చేసే కంటెంట్.

    ఉదాహరణలు: స్విచ్‌బ్లేడ్‌లు, పోరాట కత్తులు, ఖడ్గ-వాలాలు, బాలిసాంగ్‌లు, మిలిటరీ కత్తులు, లోపలికి గుచ్చే బాకులు, విసిరే గొడ్డళ్లు

  • ఈ "ఇతర ఆయుధాలు" కోవలోకి వచ్చే ఏదైనా ప్రోడక్ట్‌ను రూపొందించడం, మెరుగుపరచడం లేదా దానిని ఎలా పొందాలో తెలియజేసే సూచనలను కలిగి ఉండే కంటెంట్.

  ఇతర ఆయుధాల గురించి మరింత తెలుసుకోండి

పొగాకు

వీటిని కలిగి ఉన్న కంటెంట్:

  • పొగాకు మరియు పొగాకు సంబంధిత ఉత్పత్తుల అమ్మకాలను ప్రచారం చేసేవి.

    ఉదాహరణలు: సిగరెట్‌లు, చుట్టలు, పొగాకు పైపులు, రోలింగ్ పేపర్‌లు, నమిలే పొగాకు, ఇ-సిగరెట్‌లు

   పొగాకు గురించి మరింత తెలుసుకోండి

మాదక ద్రవ్యాలు

వీటిని కలిగి ఉన్న కంటెంట్:

  • వినోదం కోసం మత్తులో తూగేలా మానసిక స్థితిని మార్చే పదార్థాలు లేదా "మైకం" వచ్చేలా చేసే పదార్థాలను ప్రచారం చేసేవి.

    ఉదాహరణలు: కొకైన్, క్రిస్టల్ మెత్, హెరాయిన్, మారిజువానా (గంజాయి), కొకైన్ ప్రత్యామ్నాయ పదార్థాలు, మెఫెడ్రోన్, "మైకం తెప్పించే చట్టబద్ధమైన ఇతర పదార్థాలు"

  • మత్తు పదార్థాల వినియోగానికి ఉపయోగించే సాధనాలను ప్రచారం చేసే ఉత్పత్తులు లేదా సేవల గురించి కలిగి ఉన్నవి.

    ఉదాహరణలు: పైపులు, బాంగ్‌లు, గంజాయి కాఫీ షాపులు

  • మత్తు పదార్థాల తయారీ, కొనుగోలు లేదా వినియోగం గురించి సూచనలను అందించేవి.

    ఉదాహరణలు: మత్తు పదార్థాల వినియోగానికి సంబంధించిన చిట్కాలు లేదా సిఫార్సులను ఇచ్చిపుచ్చుకునే ఫోరమ్‌లు

  మాదక ద్రవ్యాల గురించి మరింత తెలుసుకోండి

మద్యం అమ్మకం లేదా దుర్వినియోగం

వీటిని కలిగి ఉన్న కంటెంట్:

  • మద్యం పానీయాల ఆన్‌లైన్ అమ్మకాల గురించి కలిగి ఉన్నవి.
  • బాధ్యతారాహిత్యంగా మద్యపానాన్ని ప్రోత్సహించేవి.

    ఉదాహరణలు: మితిమీరిన, అమితమైన లేదా పోటాపోటీ మద్యపానం వంటి వాటిని ప్రోత్సహించే విధంగా చూపడం

  మద్యం అమ్మకం లేదా దుర్వినియోగం గురించి మరింత తెలుసుకోండి

ఆన్‌లైన్ జూదం

వీటిని కలిగి ఉన్న కంటెంట్:

  • ఆన్‌లైన్‌, నిజమైన డబ్బుతో గ్యాంబ్లింగ్ లేదా ఆటలో గెలుపోటముల ఆధారంగా నగదు లేదా బహుమతులను గెలుచుకోగల అవకాశం కోసం నగదు లేదా ఇతర విలువైన వస్తువులను చెల్లించే లేదా పందెంగా పెట్టే ఏదైనా ఇంటర్నెట్ ఆధారిత గేమ్‌లో యూజర్‌లు పాల్గొనడానికి ఎనేబుల్ చేసే కంటెంట్.

    ఉదాహరణలు: ఆన్‌లైన్ కేసినోలు లేదా బుక్‌మేకర్‌లు, ఆన్‌లైన్ లాటరీ టిక్కెట్ లేదా స్క్రాచ్ కార్డ్ కొనుగోలు, ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన పేజీలను ప్రచారం చేసే అగ్రిగేటర్ లేదా అనుబంధ సైట్‌లు

   ఆన్‌లైన్ జూదం గురించి మరింత తెలుసుకోండి

వైద్యుల సూచనతో మాత్రమే పొందగల మందులు

వీటిని కలిగి ఉన్న కంటెంట్:

  • వైద్యుల సూచనతో మాత్రమే పొందే మందుల ఆన్‌లైన్ అమ్మకాలను ప్రచారం చేసేవి.

    ఉదాహరణలు: వైద్యుల సూచనతో మాత్రమే పొందగల మందుల అమ్మకం, ఆన్‌లైన్ మందుల షాపులు

   వైద్యుల సూచనతో మాత్రమే పొందగల మందుల గురించి మరింత తెలుసుకోండి

ఆమోదించబడని ఔషధాలు, సప్లిమెంట్‌లు

వీటిని కలిగి ఉన్న కంటెంట్:

  • ఆమోదం పొందని ఔషధాలు, సప్లిమెంట్‌ల అమ్మకాలను ప్రచారం చేసేవి.

    ఉదాహరణలు: ఆమోదం పొందని ఔషధాలు, సప్లిమెంట్‌లకు సంబంధించిన ఈ అసంపూర్ణ జాబితాలో ఉన్న అన్ని ఐటెమ్‌లు; ఎఫిడ్రా కలిగి ఉన్న ప్రోడక్ట్‌లు; హానికరమైన ఔషధాలు లేదా పదార్థాలను కలిగిన మూలికలు, డైట్ సంబంధిత సప్లిమెంట్‌లు; ఆమోదం లేని ఔషధాలు, సప్లిమెంట్‌లు లేదా నియంత్రిత పదార్థాల పేర్లను పోలినట్లుగా పేర్లను కలిగి ఉండి తికమక కలిగించే ప్రోడక్ట్‌లు.

  ఆమోదించబడని ఔషధాలు, సప్లిమెంట్‌ల గురించి మరింత తెలుసుకోండి

Google Play స్టోర్ నుండి తొలగించబడిన యాప్

దీని అర్థం, ఆ యాప్: 

  • Google Play పాలసీలను ఉల్లంఘించినందుకు Google Play స్టోర్ నుండి తొలగించబడిందని అర్థం.

 Google Play Store నుండి తొలగించబడిన యాప్ గురించి మరింత తెలుసుకోండి


పనితీరుపై వర్తించే పరిమితులు 

యాడ్స్ ఇంటర్‌ఫియరింగ్ 

కంటెంట్‌ను అస్పష్టంగా చేసే Google-అందించే యాడ్‌లు

మేము ఈ కింద పేర్కొన్న విధంగా ఉండే 'Google అందించే యాడ్‌లను' అనుమతించము:

  • ఏ సమయంలోనైనా కంటెంట్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా అస్పష్టం చేస్తున్నవి

  కంటెంట్‌ను అస్పష్టంగా చేసే Google-అందించే యాడ్‌ల గురించి మరింత తెలుసుకోండి 

Google అందించే యాడ్‌లను అస్పష్టంగా చేసే కంటెంట్ 

మేము ఈ కింద పేర్కొన్న విధంగా ఉండే కంటెంట్‌ను అనుమతించము:

  • Google అందించే యాడ్‌లను పూర్తిగా లేదా పాక్షికంగా అస్పష్టం చేసే కంటెంట్.

  Google అందించే యాడ్‌లను అస్పష్టంగా చేసే కంటెంట్ గురించి మరింత తెలుసుకోండి 

వీడియో ఇన్వెంటరీ పరిమితులు

ఇన్వెంటరీని ఖచ్చితంగా వివరించడం

  1. కింద పేర్కొన్న వాటితో సహా, వీడియో ఇన్వెంటరీ తప్పనిసరిగా ఖచ్చితమైన సిగ్నల్స్‌ను (Ad Manager కోసం, VAST యాడ్ ట్యాగ్ URL పారామీటర్స్ చూడండి), అందించాలి:
    • యాడ్ ప్లేస్‌మెంట్ ఆడిబిలిటీ: ఆటోమేటిక్‌గా వినపడుతుంది లేదా మ్యూట్ చేయబడుతుంది (Ad Manager విషయంలో, vpmute పారామీటర్‌ను చూడండి).
    • యాడ్ ప్లేస్‌మెంట్ రకం: వీడియో కంటెంట్‌తో వీడియో ప్లేయర్‌లలో అందించే వీడియో యాడ్‌లు తప్పనిసరిగా "స్ట్రీమ్‌లోని" లేదా "అనుబంధిత కంటెంట్" ప్లేస్‌మెంట్‌లుగా ఖచ్చితంగా ప్రకటించబడాలి (Ad Manager విషయంలో, plcmt పారామీటర్‌ను చూడండి). నాన్-వీడియో ప్లేయర్ ప్లేస్‌మెంట్‌లలో అందించే వీడియో యాడ్‌లకు డిక్లరేషన్‌లు అవసరం లేదు, "మధ్యంతరం" లేదా "స్వతంత్ర రకం" ప్లేస్‌మెంట్‌ల రూపంలో ఇన్వెంటరీ ఫార్మాట్ ఆధారంగా Google ఆటోమేటిక్‌గా నిర్ణయిస్తుంది.
      • "స్ట్రీమ్‌లోని" అంటే వీడియో లేదా ఆడియో కంటెంట్ స్ట్రీమ్‌లో ప్లే చేయబడిన వీడియో లేదా ఆడియో యాడ్, ఇక్కడ వీడియో లేదా ఆడియో కంటెంట్ యూజర్ సందర్శన లేదా యూజర్ స్పష్టంగా రిక్వెస్ట్ చేయడంపై ఫోకస్ పెడుతుంది.

        ఉదాహరణ: యూజర్ రిక్వెస్ట్ చేసిన వీడియో కంటెంట్ స్ట్రీమ్‌కు ముందు, మధ్యలో లేదా తర్వాత ప్లే చేయబడిన వీడియో యాడ్.

      • "అనుబంధిత కంటెంట్" అంటే యూజర్ సందర్శన ప్రధాన కంటెంట్‌తో పాటు వీడియో కంటెంట్ స్ట్రీమ్‌లో ప్లే చేయబడిన వీడియో యాడ్, ఇక్కడ వీడియో కంటెంట్ యూజర్ సందర్శనపై ఫోకస్ పెట్టదు లేదా యూజర్ ద్వారా స్పష్టంగా రిక్వెస్ట్ చేయబడదు. అనుబంధిత కంటెంట్ ప్లేస్‌మెంట్‌లు తప్పనిసరిగా పేజీ ప్రధాన భాగంలో లోడ్ చేయబడాలి, ఆటోమేటిక్‌గా మ్యూట్ చేయబడాలి.

        ఉదాహరణ: ప్రధానంగా ఎడిటోరియల్ పేజీలో కొంత భాగాన్ని తీసుకునే మ్యూట్ చేయబడిన వీడియో కంటెంట్ స్ట్రీమ్‌కు ముందు, మధ్యలో లేదా తర్వాత ప్లే చేయబడిన వీడియో యాడ్.

      • "ఇంటర్‌స్టీషియల్" అంటే కంటెంట్ మధ్య మారుతున్నప్పుడు మరే ఇతర స్ట్రీమింగ్ వీడియో కంటెంట్ లేకుండా ప్లే చేయబడిన వీడియో యాడ్, ఇక్కడ పేజీ ప్రాథమిక ఫోకస్ అనేది వీడియో యాడ్‌పై ఉంటుంది, వీక్షణ పోర్ట్‌లో ఎక్కువ భాగాన్ని తీసుకుంటుంది.

        ఉదాహరణ: ఏదైనా ఇతర స్ట్రీమింగ్ వీడియో కంటెంట్‌తో సంబంధం లేని వీడియో యాడ్, కంటెంట్ మధ్య సహజమైన విరామం లేదా మార్పులో పూర్తి వీక్షణలో ఉంచబడుతుంది.

      • "స్టాండలోన్" అంటే ఏ ఇతర స్ట్రీమింగ్ వీడియో కంటెంట్ లేకుండా ప్లే చేయబడిన వీడియో యాడ్, ఇక్కడ పేజీ యొక్క ఫోకస్ వీడియో యాడ్ కాదు.

        ఉదాహరణ: ఏదైనా ఇతర స్ట్రీమింగ్ వీడియో కంటెంట్‌తో సంబంధం లేని వీడియో యాడ్, అది ఆర్టికల్ పేజీ కుడి వైపున ఉన్న బ్యానర్‌లో ఉంచబడుతుంది.

గమనిక: Ad Manager విషయంలో, సహాయ కేంద్రం పేజీలలో, ప్రోడక్ట్ కంట్రోల్స్‌లో "ఇన్‌స్ట్రీమ్" లేదా "స్ట్రీమ్‌లోని" నియమాలు, ఈ పాలసీలలో నిర్వచించిన విధంగా "స్ట్రీమ్‌లోని", "అనుబంధిత కంటెంట్" రెండింటినీ సూచిస్తాయి. ఈ పాలసీల ప్రకారం "స్ట్రీమ్‌లోని" లేదా "అనుబంధిత కంటెంట్" అయిన Ad Manager వీడియో ఇన్వెంటరీ తప్పనిసరిగా పాలసీలలోని సంబంధిత అవసరాలకు కట్టుబడి ఉండాలి.

సపోర్ట్ చేసే అమలు పద్దతులను ఉపయోగించడం

  1. అధికారిక Google బీటా ప్రోగ్రామ్ ద్వారా తప్ప, ఇన్-స్ట్రీమ్ లేదా దానితో పాటు కంటెంట్ ప్లేస్‌మెంట్‌లు తప్పనిసరిగా Google ఇంటరాక్టివ్ మీడియా యాడ్స్ SDK లేదా Google ప్రోగ్రామ్ ఆధారితమైన యాక్సెస్ లైబ్రరీని సపోర్ట్ ఉన్న ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించాలి.
    • YouTube కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి పార్ట్‌నర్‌లు, పబ్లిషర్‌లు ఇంటరాక్టివ్ మీడియా యాడ్‌ల ప్రోడక్ట్‌లను ఉపయోగించలేరు. YouTube కంటెంట్ కోసం, పార్ట్‌నర్‌లు, పబ్లిషర్‌లు తప్పనిసరిగా YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ద్వారా మానిటైజ్ చేయాలి.
  2. ఇంటర్‌స్టీషియల్ లేదా స్టాండలోన్ ప్లేస్‌మెంట్‌లు తప్పనిసరిగా Google అందించిన పరిష్కారాలను ఉపయోగించాలి: వెబ్‌లో: Google పబ్లిషర్ ట్యాగ్‌లు; యాప్‌లో: Google మొబైల్ యాడ్స్ SDK (Ad Manager కోసం; AdMob కోసం).
    • Google ఇంటరాక్టివ్ మీడియా యాడ్స్ SDK, గేమ్‌లలోని ప్లేస్‌మెంట్‌లకు మినహా ఇంటర్‌స్టీషియల్ లేదా స్టాండలోన్ ప్లేస్‌మెంట్‌లకు అనుమతించబడదు.

అడ్వర్టయిజర్ విలువను రక్షించడం

  1. వీడియో ఇన్వెంటరీ కంట్రోల్స్ (ఉదాహరణకు, ప్లే చేయడం, పాజ్ చేయడం, మ్యూట్ చేయడం, స్కిప్ చేయడం, లేదా విస్మరించడం వంటివి), యాడ్ కంటెంట్ లేదా అందించిన కంట్రోల్స్ అనేవి అడ్డు పడకూడదు, దాచకూడదు, లేదా పని చేయకుండా ఉండకూడదు.
    • స్పష్టత కోసం, వీడియో ఇన్వెంటరీ కంట్రోల్స్ లేదా సింగిల్ యూజర్ చర్య ఫలితంగా మాత్రమే యాక్టివేట్ చేయబడిన లేదా ప్రదర్శించబడిన యాడ్ కంట్రోల్స్ (ఉదాహరణకు, స్క్రోలింగ్, మౌస్ కర్సర్ ఉంచడం, స్క్రీన్‌పై ట్యాప్ చేయడం లేదా స్వైప్ చేయడం) అడ్డు పడినవి, దాచబడినవి, లేదా పని చేయనివిగా పరిగణించబడవు.
  2. స్ట్రీమ్‌లోని ప్లేస్‌మెంట్‌ల కోసం, మ్యూట్ చేసిన ప్లేస్‌మెంట్‌లలో ఆడియో యాడ్‌లు రిక్వెస్ట్ చేయబడకూడదు లేదా ప్రదర్శించబడకూడదు.

యూజర్‌ను గౌరవించడం

  1. కింది పేర్కొన్న విధంగా ఉంటే, వీడియో ఇన్వెంటరీ ఆటోప్లే కావచ్చు:
    • అన్ని ప్లేస్‌మెంట్ రకాల్లో ఒక వీడియో ఇన్వెంటరీ మాత్రమే ఎప్పుడైనా ధ్వనితో ఆటోప్లే కావచ్చు.
      • స్ట్రీమ్‌లోని లేదా అనుబంధిత కంటెంట్ ప్లేస్‌మెంట్‌ల కోసం అదనంగా, ఏ సమయంలోనైనా వీక్షణలో ఒక వీడియో ప్లేయర్ మాత్రమే ఆటోప్లే చేయవచ్చు.
    • యాడ్ యూనిట్‌లో కనీసం 50% కనిపించే వరకు యాడ్ ఆటోప్లే చేయకూడదు.
  2. కింది విధంగా ఉంటే, వీడియో ఇన్వెంటరీ స్టిక్కీగా ఉండవచ్చు:
    • వీడియో లేదా యాడ్ కంటెంట్ మొత్తం వ్యవధి కోసం విస్మరించండి అనే ఆప్షన్ అందించబడింది. ఈ ఆప్షన్ దాచబడకూడదు, ఏదైనా దానికి అడ్డుగా ఉండకూడదు, లేదా అది పని చేయకుండా ఉండకూడదు.
    • స్టిక్కీ ప్లేస్‌మెంట్‌కు మారే స్ట్రీమ్‌లోని లేదా అనుబంధిత కంటెంట్ ప్లేస్‌మెంట్‌ల కోసం, వీడియో ప్లేయర్ తప్పనిసరిగా ప్రధాన కంటెంట్‌లో ప్రారంభం కావాలి, యూజర్ వీడియో ప్లేయర్‌ను పేజీ నుండి స్క్రోల్ చేసినప్పుడు మాత్రమే మారాలి.

  వీడియో ఇన్వెంటరీ పరిమితుల గురించి మరింత తెలుసుకోండి 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
ఎదగగల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి

విలువైన AdSense గణాంకాలను మిస్ చేసుకోకండి. మీ నికర ఆదాయాన్ని పెంచడంలో సహాయపడగల పనితీరు రిపోర్ట్‌లను, వ్యక్తిగతీకరించిన చిట్కాలను, వెబినార్ ఆహ్వానాలను అందుకోవడానికి సమ్మతించండి

సమ్మతించండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
861869456069497458
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false