YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలు

మీరు డ్రీమ్ ట్రాక్‌తో జెనరేట్ చేసిన మ్యూజిక్‌ను నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో ఉపయోగించినట్లయితే, యాడ్‌ల ద్వారా లేదా సబ్‌స్క్రిప్షన్ (YouTube Premium) ఆదాయ షేరింగ్ ద్వారా మీ వీడియోను మీరు మానిటైజ్ చేయలేరు.

మార్చి 10, 2022: రష్యాలో Google అడ్వర్టయిజింగ్ సిస్టమ్‌లు ఇటీవల సస్పెండ్ చేయబడినందున, మేము AdSense, YouTube కోసం AdSense, AdMob, ఇంకా Google Ad Managerలో కొత్త రష్యన్ ఖాతాల క్రియేషన్‌ను పాజ్ చేయనున్నాము. అంతే కాకుండా, రష్యాలోని అడ్వర్టయిజర్‌ల విషయంలో, ప్రపంచవ్యాప్తంగా Google ప్రాపర్టీస్, ఇంకా నెట్‌వర్క్‌లలో మేము యాడ్‌లను పాజ్ చేస్తాము. ఆ కారణంగా, రష్యాలోని క్రియేటర్‌లు, ప్రస్తుతం కొత్త YPP సైన్ అప్‌లను పూర్తి చేయలేరు.

మార్చి 3, 2022: ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా, రష్యాలోని యూజర్‌లకు Google యాడ్‌లను, YouTube యాడ్‌లను అందించడాన్ని మేము తాత్కాలికంగా పాజ్ చేయనున్నాము. అలాగే రష్యాలోని వీక్షకులు కలిగి ఉన్న అన్ని మానిటైజేషన్ ఫీచర్‌ల (ఛానెల్ మెంబర్‌షిప్‌‌లు, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్‌లు, అమ్మకపు వస్తువులు వంటివి) యాక్సెస్‌ను మేము పాజ్ చేస్తున్నాము. మరింత తెలుసుకోండి.

ఫిబ్రవరి 25, 2022: ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం దృష్ట్యా, రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వ నిధులను పొందే మీడియా ఛానెల్స్‌కు మేము YouTube మానిటైజేషన్‌ను పాజ్ చేస్తున్నాము. 

మేము పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన విధంగా సర్దుబాట్లు చేస్తూనే ఉంటాము.

ఏప్రిల్ 2024న అప్‌డేట్ అయ్యింది: క్రియేటర్‌ల కోసం రిపీట్ అయ్యే, రీయూజ్ అయ్యే కంటెంట్ అర్థాన్ని స్పష్టం చేయడానికి మా ప్రోగ్రామ్ పాలసీల్లోని భాష అప్‌డేట్ అయ్యింది. మా రిపీట్ అయ్యే, రీయూజ్ అయ్యే కంటెంట్ పాలసీలు మారలేదు.

మీరు YouTubeలో మానిటైజ్ చేస్తున్నట్లయితే, మీ ఛానెల్ YouTube మానిటైజేషన్ పాలసీలను తప్పక ఫాలో అవ్వాలి. దీనిలో కింద పేర్కొన్న పాలసీలు, అలాగే YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్, సర్వీస్ నియమాలు, కాపీరైట్, హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీ పాలసీలు, అలాగే మా ప్రోగ్రామ్ పాలసీలు ఉంటాయి.

ఈ పాలసీలు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉన్న వారికి లేదా దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వారికి వర్తిస్తాయి. మీరు YouTubeలో Shortsను మానిటైజ్ చేస్తున్నట్లయితే, YouTube Shorts మానిటైజేషన్ పాలసీలు కూడా వర్తిస్తాయి.

యాడ్‌లతో మానిటైజ్ చేసే కంటెంట్ అంతా తప్పనిసరిగా మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి. తొలిసారి వాడే యూజర్‌లు ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌ల నుండి ఆదాయాన్ని సంపాదించడానికి, నిర్దిష్ట ఫీచర్‌లను ఆన్ చేసే ముందు తప్పనిసరిగా వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM)ను ఆమోదించాలి. ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లతో మానిటైజ్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా వాణిజ్యపరమైన ప్రోడక్ట్‌ల మానిటైజేషన్ పాలసీలను కూడా ఫాలో అవ్వాలి.

ప్రతి ప్రధాన పాలసీకి సంబంధించిన క్విక్ ఓవర్‌వ్యూ ఇక్కడ ఉంది. ప్రతి పాలసీని మీరు పూర్తిగా చదివారని నిర్ధారించుకోండి, ఎందుకంటే, ఒక ఛానెల్ మానిటైజ్ చేయడానికి అనుకూలంగా ఉందో లేదో చెక్ చేయడానికి ఈ పాలసీలు ఉపయోగించబడతాయి. మానిటైజ్ చేస్తున్న ఛానెల్స్ ఈ పాలసీలను ఫాలో అవుతున్నాయా లేదా అని మా రివ్యూవర్‌లు క్రమం తప్పకుండా చెక్ చేస్తారు. మేము మా పాలసీలను ఎలా అమలు చేస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

మేము ఈ పేజీలో వీడియో అనే పదాన్ని ఉపయోగించినప్పుడు, అది షార్ట్‌లను, నిడివి ఎక్కువ ఉన్న వీడియోలను, అలాగే లైవ్ స్ట్రీమింగ్‌ను సూచిస్తుందని గుర్తుంచుకోండి. వీక్షణ పేజీ (YouTube, YouTube Music, లేదా YouTube Kidsలోని పేజీలు), YouTube వీడియో ప్లేయర్ (ఇతర సైట్‌లలో YouTube కంటెంట్‌ను పొందుపరిచే ప్లేయర్), అలాగే YouTube Shorts ప్లేయర్ (Shortsను అందుబాటులో ఉంచే ప్లేయర్)తో సహా వీడియోలను ఎక్కడ చూసినా ఈ పాలసీలు వర్తిస్తాయి.

మేము మీ ఛానెల్‌ను రివ్యూ చేసినప్పుడు ఏమేమి చెక్ చేస్తాము

మీరు YouTubeలో డబ్బు సంపాదిస్తున్నట్లయితే, మీ కంటెంట్ ఒరిజినల్ అయి ఉండాలి, అలాగే అది ప్రామాణీకరించబడి ఉండాలి. దాని అర్థం మీ కంటెంట్ కింద పేర్కొన్న విధంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము: 

  • కంటెంట్ అనేది మీరే క్రియేట్ చేసిన ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. మీరు వేరొకరి కంటెంట్‌ను వాడుతున్నట్లయితే, దాన్ని మీ స్వంతం చేసుకోవడానికి మీరు దానిని చెప్పుకోదగ్గ స్థాయిలో మార్చాలి.
  • డూప్లికేట్ చేయబడిన లేదా రిపీట్ అయ్యే కంటెంట్ అయి ఉండకూడదు. మీ కంటెంట్‌ను వీక్షణలను పొందడం కోసం కాకుండా వీక్షకులకు వినోదాన్ని లేదా అవగాహన కలిగించడం కోసం రూపొందించాలి. 

మా రివ్యూవర్‌లు మీ ఛానెల్‌ను, అందులోని కంటెంట్‌ను మా పాలసీలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడం కోసం చెక్ చేస్తారు. వారు ప్రతి వీడియోను చెక్ చేయలేరు కాబట్టి, మా రివ్యూవర్‌లు మీ ఛానెల్‌కు సంబంధించిన కింద పేర్కొన్న అంశాలపై ఫోకస్ చేయవచ్చు:

  • ప్రధాన టాపిక్
  • ఎక్కువగా చూసిన వీడియోలు
  • సరికొత్త వీడియోలు
  • వాచ్ టైమ్‌లో అత్యధిక శాతం
  • వీడియో మెటాడేటా (టైటిల్స్, థంబ్‌నెయిల్స్, వివరణలతో సహా)
  • ఛానెల్‌కు చెందిన “ఛానెల్ గురించిన సమాచారం” విభాగం

పైన పేర్కొన్నవి కేవలం మా రివ్యూవర్‌లు అంచనా వేయగల కంటెంట్‌కు సంబంధించిన ఉదాహరణలు మాత్రమే. మీ ఛానెల్ మా పాలసీలకు పూర్తిగా అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మా రివ్యూవర్‌లు మీ ఛానెల్‌లోని ఇతర అంశాలను చెక్ చేయవచ్చని గమనించండి.

YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వండి

వీక్షకులు, క్రియేటర్‌లు, అడ్వర్టయిజర్‌లందరూ మెచ్చేలా YouTubeను ఒక గొప్ప కమ్యూనిటీగా ఉంచడంలో ఈ గైడ్‌లైన్స్ సహాయపడతాయి. YouTubeలోని ఎవరైనా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి, అలాగే మీరు పోస్ట్ చేసే కంటెంట్ ఏదైనా సరే, తప్పనిసరిగా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అన్నింటిని ఫాలో అవ్వాలి.

మా గైడ్‌లైన్స్ నిర్దిష్ట వీడియోలకు మాత్రమే కాకుండా మీ ఛానెల్ మొత్తానికి వర్తిస్తాయని మానిటైజ్ చేసే క్రియేటర్‌లు తెలుసుకోవాలి. YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించే కంటెంట్‌కు మానిటైజేషన్ కోసం అర్హత ఉండదు, అంతే కాక అది YouTube నుండి తీసివేయబడుతుంది.
మా ప్రోగ్రామ్ పాలసీలను ఫాలో అవ్వండి
YouTube పార్ట్‌నర్‌లు తమ వీడియోలను మానిటైజ్ చేస్తున్నందుకు ప్రతిఫలంగా పేమెంట్‌ను పొందడానికి YouTube కోసం AdSense వీలు కల్పిస్తుంది. మా ప్రోగ్రామ్ పాలసీలను, అలాగే YouTube సర్వీస్ నియమాలను ఫాలో అవుతున్నారని నిర్ధారించుకోండి.

రిపీట్ అయ్యే కంటెంట్

రిపీట్ అయ్యే కంటెంట్ అనేది ఒకే విధమైన కంటెంట్ ఉండి, వీక్షకులు వీడియోల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంలో సమస్య ఉండే కంటెంట్‌ను ఫీచర్ చేసే ఛానెల్‌ను రెఫర్ చేస్తుంది. ఇందులో వీడియోల అంతటా ఎటువంటి వైవిధ్యం లేకుండా సాధారణ టెంప్లేట్‌తో రూపొందించినట్లు కనిపించే కంటెంట్, లేదా పెద్ద మొత్తంలో సులభంగా రీప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్న కంటెంట్ ఉంటాయి.

ఈ పాలసీ మీ ఛానెల్ మొత్తానికి వర్తిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, మీరు మా గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించే అనేక వీడియోలను కలిగి ఉంటే, మీ మొత్తం ఛానెల్ నుండి మానిటైజేషన్‌ను తీసివేయవచ్చు.

మానిటైజ్ చేయడానికి ఎటువంటి కంటెంట్ అనుమతించబడుతుంది

వీక్షకులు చూడటానికి ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉండే కంటెంట్‌ను, మానిటైజ్ అయ్యే కంటెంట్ అందిస్తుందా లేదా అనే విషయాన్ని ఈ పాలసీ నిర్ధారిస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే, మీ ఛానెల్‌లోని కంటెంట్ ఒక వీడియో నుండి మరొక వీడియోకు భిన్నంగా ఉందని సగటు వీక్షకులు స్పష్టంగా చెప్పగలిగితే, అటువంటి కంటెంట్‌ను మానిటైజ్ చేయవచ్చు. చాలా ఛానెళ్లు ఒకే తరహాలో ఉన్న కంటెంట్‌ను క్రియేట్ చేస్తాయని మాకు తెలుసు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి వీడియోకు సంబంధించిన కంటెంట్ పోల్చి చూసినప్పుడు విభిన్నంగా ఉండాలి.

మానిటైజ్ చేయడానికి అనుమతి ఉన్న వాటికి ఉదాహరణలు (వీటితో సహా, కానీ వీటికే పరిమితం కాదు):

  • మీ వీడియోలకు ఇంట్రో అలాగే ముగింపు ఒకటే ఉంటుంది, కానీ మీ కంటెంట్‌లో ఎక్కువ భాగం భిన్నంగా ఉంటుంది
  • ఒకే విధమైన కంటెంట్, ఉదాహరణకు ప్రతి వీడియోలో మీరు ఫీచర్ చేస్తున్న సబ్జెక్ట్ క్వాలిటీల గురించే ప్రత్యేకంగా వివరించే కంటెంట్ ఉండటం
  • ఒకే విధమైన కంటెంట్‌ల షార్ట్ క్లిప్‌లను కలిపి ఎడిట్ చేసి, అవి ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉన్నాయో మీరు వివరిస్తే అనుమతించబడుతుంది

ఈ గైడ్‌లైన్‌ను ఉల్లంఘించే కంటెంట్

ఒక ఛానెల్‌కు సంబంధించిన కంటెంట్ ఒకే విధమైన కంటెంట్‌ను కలిగి ఉంటే, అది ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన వీడియోలను చూడటం కోసం YouTubeకు వచ్చే వీక్షకులను తీవ్రంగా నిరాశపరచవచ్చు. అంటే వీడియోల మధ్య కంటెంట్‌లో కొద్దిపాటి తేడా మాత్రమే ఉంటే, అటువంటి కంటెంట్ ఉన్న ఛానెళ్లు మానిటైజ్ చేయడానికి అనుమతించబడవు. మరో విధంగా చెప్పాలంటే, మీ ఛానెల్‌లో ఒక సాధారణ టెంప్లేట్‌ను ఉపయోగించి ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసిన లేదా రూపొందించిన కంటెంట్, అలాగే పెద్ద మొత్తంలో సులభంగా రీప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్న కంటెంట్ ఉండకూడదు.

మానిటైజ్ చేయడానికి అనుమతించబడని వాటికి ఉదాహరణలు (ఇది పూర్తి లిస్ట్ కాదు):

  • మీరు ఒరిజినల్‌గా క్రియేట్ చేయని ఇతర మెటీరియల్స్‌కు సంబంధించిన రీడింగ్‌లను ప్రత్యేకంగా ఫీచర్ చేసే కంటెంట్, ఉదాహరణకు - వెబ్‌సైట్‌లు లేదా వార్తల ఫీడ్‌ల నుండి టెక్స్ట్ వంటివి
  • ఏదైనా ఒక ఒరిజినల్ పాట పిచ్‌ను లేదా వేగాన్ని మార్చడానికి ఎడిట్ చేయడం తప్ప, మిగిలిన అన్ని విషయాల్లో ఆ ఒరిజినల్ లాగానే ఉండే పాటలు
  • ఒకే విధంగా ఉండే, రిపీట్ అయ్యే కంటెంట్ లేదా విద్యాపరమైన విలువను, కామెంటరీని, లేదా కథనాలను అందించని అర్థ రహితమైన కంటెంట్
  • భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన, లేదా పలు వీడియోలలో ఒకే టెంప్లేట్‌ను ఉపయోగించిన కంటెంట్
  • నామమాత్రంగా విలువను అందించే లేదా అసలు విలువను అందించని కథనం, కామెంటరీ లేదా విద్యాపరమైన విలువ లేని ఇమేజ్ స్లయిడ్ షోలు లేదా స్క్రోల్ చేసిన టెక్స్ట్

తిరిగి ఉపయోగించిన కంటెంట్

తిరిగి ఉపయోగించిన కంటెంట్ అంటే ఇప్పటికే YouTubeలో ఉన్న కంటెంట్‌ను లేదా మరొక ఆన్‌లైన్ సోర్స్‌కు చెందిన కంటెంట్‌ను చెప్పుకోదగ్గ స్థాయిలో ఒరిజినల్ కామెంటరీని జోడించకుండా, ముఖ్యమైన మార్పులు చేయకుండా, లేదా దానికి విద్యాపరమైన, వినోదాత్మకమైన విలువను జోడించకుండా తమ ప్రయోజనాల కోసం ఛానెళ్లు మళ్లీ ఉపయోగించడం. తిరిగి ఉపయోగించిన కంటెంట్‌ను డూప్లికేట్ చేయబడిన లేదా స్క్రాప్ చేయబడిన కంటెంట్ (ఇతర వెబ్‌సైట్‌ల నుండి ప్రత్యేకమైన లేదా ఒరిజినల్ కంటెంట్‌ను తీసుకొని మీ స్వంత కంటెంట్ లాగా పబ్లిష్ చేయడం) అని కూడా పిలుస్తారు. 

మీ కంటెంట్ తిరిగి ఉపయోగించబడిందో లేదో తెలుసుకోవడానికి, మీ కంటెంట్‌ను ఎలా క్రియేట్ చేశారు, రూపొందించడంలో ఎలా భాగం అయ్యారు, లేదా ఎలా ప్రొడ్యూస్ చేశారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మా రివ్యూవర్‌లు మీ ఛానెల్‌ను చెక్ చేస్తారు. మా రివ్యూవర్‌లు మీ ఛానెల్‌కు సంబంధించి కింద పేర్కొన్న వాటిని చెక్ చేయవచ్చు: 

  • వీడియోలు 
  • ఛానెల్ వివరణ
  • వీడియో టైటిల్
  • వీడియో వివరణలు

'తిరిగి ఉపయోగించిన కంటెంట్'కు సంబంధించిన మా పాలసీ మీ ఛానెల్ మొత్తానికి వర్తిస్తుంది. మీ ఛానెల్‌లో మా గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించే వీడియోలు ఉంటే లేదా మీరు కంటెంట్‌ను రూపొందించారని మేము స్పష్టంగా చెప్పలేకపోతే, మీ మొత్తం ఛానెల్ నుండి మానిటైజేషన్ తీసివేయబడవచ్చు.

మానిటైజ్ చేయడానికి ఎటువంటి కంటెంట్ అనుమతించబడుతుంది

వీక్షకులకు గొప్ప విలువను అందించగల ఒరిజినల్ కంటెంట్‌ను, ప్రామాణికమైన కంటెంట్‌ను అందించే క్రియేటర్‌లను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశం. మీరు ఒరిజినల్‌గా క్రియేట్ చేయని కంటెంట్‌ను సరదాగా ఉండేలా లేదా ఆలోచనాత్మకంగా ఉండేలా మారిస్తే (దిగువ పేర్కొన్న మా గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా), మీరు కంటెంట్‌ను ఏదో ఒక విధంగా మార్చారని అర్థం. మీ ఛానెల్‌లో ఈ రకమైన కంటెంట్ కనిపించవచ్చు, కానీ నిర్దిష్ట వీడియోలు కాపీరైట్ వంటి ఇతర పాలసీలకు లోబడి ఉండే అవకాశం ఉంది. మరొక విధంగా చెప్పాలంటే, ఒరిజినల్ వీడియోకు, మీ వీడియోకు మధ్య సమంజసమైన వ్యత్యాసం ఉందని వీక్షకులు చెప్పగలిగితే, మేము 'తిరిగి ఉపయోగించిన కంటెంట్'‌ను అనుమతిస్తాము.

గమనిక: ఈ ఉదాహరణలు 'తిరిగి ఉపయోగించిన కంటెంట్' మానిటైజేషన్ పాలసీని ఉల్లంఘించనప్పటికీ, కాపీరైట్ వంటి ఇతర పాలసీలు ఇప్పటికీ వర్తిస్తాయి.

మానిటైజ్ చేయడానికి అనుమతించబడే వాటికి ఉదాహరణలు (వీటితో సహా, కానీ వీటికే పరిమితం కాదు):

  • విశ్లేషణాత్మక రివ్యూ కోసం క్లిప్‌లను ఉపయోగించడం
  • మీరు డైలాగ్‌ను మార్చి రాసి, వాయిస్ ఓవర్‌ను మార్చిన ఒక సినిమాలోని సీన్
  • పోటీదారు విజయవంతం అవ్వడానికి గల కారణాన్ని మీరు వివరించిన క్రీడల టోర్నమెంట్‌లోని రీప్లేలు
  • ఒరిజినల్ వీడియోపై మీరు కామెంట్ చేసిన రియాక్షన్ వీడియోలు
  • మీరు కథాంశాన్ని, కామెంటరీని జోడించిన, ఇతర క్రియేటర్‌లకు సంబంధించిన ఎడిట్ చేసిన ఫుటేజ్ అనుమతించబడుతుంది
  • మా లైబ్రరీలోని పాటకు ఒరిజినల్ కంటెంట్‌ను జోడించడం లేదా మీ కంటెంట్‌కు ఇతర వీడియోల నుండి ఒరిజినల్ ఆడియో లేదా వీడియో విభాగాన్ని జోడించడం వంటి Shortsలో రీమిక్స్ కంటెంట్‌కు ఎడిట్‌లు చేయడం
  • అప్‌లోడ్ చేసిన క్రియేటర్‌ను వీడియోలో ప్రధానంగా ఫీచర్ చేసే కంటెంట్
  • కంటెంట్‌లో క్రియేటర్ కనిపించే లేదా క్రియేటర్‌కు, కంటెంట్‌కు మధ్య గల సంబంధాన్ని వివరించే కంటెంట్‌ను ఇతర ఆన్‌లైన్ సోర్స్‌ల నుండి తీసుకుని తిరిగి ఉపయోగించడం
  • చెప్పుకోదగ్గ స్థాయిలో ఎడిట్ చేయబడి, మీ ఛానెల్‌లో ప్రత్యేకంగా కనిపించే, వీడియోకు సంబంధించిన తిరిగి ఉపయోగించిన కంటెంట్ ఆడియో, విజువల్ ఎఫెక్ట్‌లతో ఎడిట్ చేసిన ఫుటేజ్

ఈ గైడ్‌లైన్‌ను ఉల్లంఘించే కంటెంట్

మరొకరి కంటెంట్‌ను తీసుకుని, దానికి చిన్నపాటి మార్పులు చేసి, దాన్ని ఒరిజినల్‌గా సొంతంగా మీరే క్రియేట్ చేశారని పేర్కొనడం కూడా ఈ గైడ్‌లైన్‌ను ఉల్లంఘించడంగా పరిగణించబడుతుంది. కంటెంట్ మీదే అని మేము చెప్పలేకపోతే, అది 'తిరిగి ఉపయోగించిన కంటెంట్'కు సంబంధించిన మా పాలసీకి లోబడి ఉండవచ్చు. మీకు ఒరిజినల్ క్రియేటర్ నుండి అనుమతి ఉన్నా కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. 'తిరిగి ఉపయోగించిన కంటెంట్'పై YouTube కాపీరైట్ అమలు విధానానికి సంబంధించి ఎటువంటి ప్రభావం ఉండదు, ఎందుకంటే ఇది కాపీరైట్, అనుమతి లేదా న్యాయమైన వినియోగం అనే దానిపై ఆధారపడి ఉండదు. మీ కంటెంట్‌పై కొన్నిసార్లు మీరు క్లెయిమ్‌లను పొందకపోవచ్చు, కానీ మీ ఛానెల్ ఇప్పటికీ 'తిరిగి ఉపయోగించిన కంటెంట్'‌కు సంబంధించిన మా కంటెంట్ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించే అవకాశం ఉందని ఈ గైడ్‌లైన్ అర్థం.

మానిటైజ్ చేయడానికి అనుమతి లేని వాటికి మరిన్ని ఉదాహరణలు (ఇది పూర్తి లిస్ట్ కాదు):

  • మీ అభిమాన షో లోని కొన్ని దృశ్యాలకు సంబంధించిన క్లిప్‌లను నామమాత్రపు కథనంతో లేదా అసలు కథనం లేకుండా ఎడిట్ చేసినట్లయితే అవి అనుమతించబడవు
  • ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్‌ల నుండి మీరు కంపైల్ చేసిన షార్ట్ వీడియోలు అనుమతించబడవు
  • వేర్వేరు ఆర్టిస్ట్‌ల నుండి కలెక్ట్ చేసిన పాటలు (మీకు వారి అనుమతి ఉన్నప్పటికీ)
  • ఇతర క్రియేటర్‌లు చాలా సార్లు అప్‌లోడ్ చేసిన కంటెంట్ అనుమతించబడదు
  • ఇతర వ్యక్తులకు సంబంధించిన కంటెంట్ ప్రమోషన్ (మీకు అనుమతి ఉన్నప్పటికీ)
  • ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేయనటువంటి మరొక ఆన్‌లైన్ సోర్స్ నుండి డౌన్‌లోడ్ చేసిన లేదా కాపీ చేసిన కంటెంట్ 
  • అదనపు వాయిస్ కామెంటరీ లేకుండానే మీ వీడియోలకు మాటల రూపంలో కాకుండా నుండి వేరే రియాక్షన్‌ల ద్వారా వీక్షణలను పొందే కంటెంట్
పిల్లలు, ఫ్యామిలీ కంటెంట్‌కు సంబంధించిన క్వాలిటీ నియమాలు
ప్లాట్‌ఫామ్‌లో అధిక క్వాలిటీ గల కంటెంట్‌ను కంట్రిబ్యూట్ చేసే క్రియేటర్‌లకు రివార్డ్‌ను ఇవ్వడానికి కొత్త మార్గాలను కనుగొంటూనే, పిల్లలు, ఫ్యామిలీలకు YouTubeలో సురక్షితమైన, గొప్ప అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం.

మీ ఛానెల్ "పిల్లల కోసం రూపొందించిన” కంటెంట్‌ను కలిగి ఉంటే, మేము ఆ కంటెంట్ మానిటైజేషన్ స్టేటస్‌ను నిర్ణయించడానికి YouTubeకు చెందిన పిల్లలు, ఫ్యామిలీ కంటెంట్‌కు సంబంధించిన క్వాలిటీ నియమాలను ఉపయోగిస్తాము.

ఒకవేళ ఛానెల్, తక్కువ క్వాలిటీ గల “పిల్లల కోసం రూపొందించిన” కంటెంట్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లుగా కనుగొనబడితే, అది YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నుండి సస్పెండ్ చేయబడవచ్చు. నిర్దిష్ట వీడియో ఈ క్వాలిటీ నియమాలను ఉల్లంఘిస్తున్నట్లు కనుగొనబడితే, దానిపై యాడ్స్ పరిమితం చేయబడటం లేదా యాడ్స్ లేకుండా ప్రదర్శించబడటం మీరు గమనించవచ్చు.

"పిల్లల కోసం రూపొందించబడిన" మీ కంటెంట్ తక్కువ క్వాలిటీని కలిగి ఉందో, లేదా అధిక క్వాలిటీని కలిగి ఉందో చెక్ చేసేటప్పుడు, స్వల్ప భేదాలు, సందర్భం అనేవి ముఖ్యమైన అంశాలుగా నిలుస్తాయి. పిల్లలు, ఫ్యామిలీ కంటెంట్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్, ఉదాహరణల కోసం మా బెస్ట్ ప్రాక్టీసుల పేజీని సందర్శించండి.

మానిటైజేషన్ అర్హత కోసం క్వాలిటీ నియమాలను వర్తింపచేయడం

ఒక నిర్దిష్ట వీడియో క్వాలిటీ అంతటినీ ప్రభావితం చేసే అనేక తక్కువ క్వాలిటీకి సంబంధించిన సూత్రాలు ఉన్నాయి. మానిటైజేషన్ అర్హత కోసం మేము ప్రతి నియమాన్ని దశల వారీ పద్ధతిలో ఒక అంశం లాగా పరిగణనలోకి తీసుకుంటాము. మేము ప్రస్తుతం దిగువున లిస్ట్ చేయబడిన పిల్లలు, ఫ్యామిలీ కంటెంట్‌కు సంబంధించిన తక్కువ క్వాలిటీ నియమాలను అమలు చేస్తున్నాము. కాలక్రమేణా మరింత క్వాలిటీ గల నియమాలను చేర్చడానికి మేము పరిధిని పెంచే అవకాశం ఉంది.

  • ప్రతికూల ప్రవర్తనలు లేదా వైఖరిని ప్రోత్సహించడం: ప్రమాదకరమైన యాక్టివిటీలు, వ్యర్థాలు, జులుం చలాయించడం, నిజాయితీ లేని లేదా ఇతరుల పట్ల గౌరవం లేకపోవడాన్ని ప్రోత్సహించే కంటెంట్ (ఉదా. ప్రమాదకరమైన/సురక్షితం కాని ప్రాంక్‌లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు).
  • వాణిజ్యపరమైన, అలాగే ప్రమోషనల్ ఉద్దేశం అధికంగా ఉన్న కంటెంట్: ప్రోడక్ట్‌ల కొనుగోలు మీద లేదా బ్రాండ్‌లు, లోగోలను ప్రమోట్ చేయడం మీద ప్రధానంగా ఫోకస్ చేసిన కంటెంట్ (ఉదా. బొమ్మలు, ఆహారం). కన్జ్యూమర్‌ల పైనే మితి మీరిన స్థాయిలో ఫోకస్ చేసే కంటెంట్ కూడా ఇందులో భాగంగా ఉంటుంది. YouTube Kidsలో వాణిజ్యపరమైన కంటెంట్ గురించి మరింత తెలుసుకోండి.
  • విద్యాపరమైనది అయినట్లుగా చూపి మోసం చేసే కంటెంట్: టైటిల్‌లో లేదా థంబ్‌నెయిల్‌లో విద్యా విషయానికి సంబంధించిన కంటెంట్ ఉన్నట్లు చూపించినా, వాస్తవానికి దానికి సంబంధించిన గైడెన్స్ లేదా వివరణ లేని, లేదా పిల్లలకు సందర్భోచితమైనది కాని కంటెంట్. ఉదాహరణకు వీక్షకులకు సహాయం అందిస్తున్నట్లు మాటిచ్ఛే "రంగులు నేర్చుకోండి" లేదా "అంకెలు నేర్చుకోండి" అనే టైటిల్స్ లేదా థంబ్‌నెయిల్స్‌ను చూపి, బదులుగా అర్థంపర్థం లేకుండా రిపీట్ అయ్యే, లేదా ఖచ్చితత్వం లేని సమాచారాన్ని ఫీచర్ చేయడం.
  • అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉన్నది: ఆలోచనా రహితమైన, ఒక దానితో మరొక దానికి సంబంధం లేని కథనంతో, వినబడకుండా ఉన్న ఆడియో వంటి అర్థంకానిదిగా ఉన్న కంటెంట్. సాధారణంగా మాస్ ప్రొడక్షన్ లేదా ఆటో-జెనరేషన్ ఫలితంగా ఈ రకమైన వీడియో క్రియేట్ అవుతుంది.
  • సంచలనం కలిగించడం లేదా తప్పుదోవ పట్టించడం: అసత్యమైన, ఉన్నదాన్ని ఎక్కువచేసి చూపించిన, అసంబద్ధమైన, లేదా అభిప్రాయాల ఆధారంగా రూపొందిన కంటెంట్ యువ వీక్షకులను గందరగోళానికి గురి చేయవచ్చు. ఇందులో భాగంగా “కీవర్డ్ కూర్పు”, లేదా పిల్లలకు ఆసక్తి కలిగించే ప్రఖ్యాతమైన కీవర్డ్‌లను రిపీట్ చేయడం, మార్చడం, ఎక్కువచేసి చూపించడం కూడా ఉండవచ్చు. కీవర్డ్‌లను అసంబద్ధంగా ఉండేలా ఉపయోగించడం కూడా జరగవచ్చు.
క్రియేటర్ బాధ్యత
మీ ఛానెల్, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ యొక్క విజయం అనేది అడ్వర్టయిజర్‌లు తమ బ్రాండ్‌ను YouTube కంటెంట్‌తో అనుబంధించడానికి సిద్ధంగా ఉన్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అడ్వర్టయిజర్‌లు నమ్మకాన్ని కోల్పోయినప్పుడు YouTube క్రియేటర్‌లందరి నికర ఆదాయం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది.
కమ్యూనిటీపై ఎక్కువ ప్రతికూల ప్రభావం చూపే అసాధారణ స్థాయిలో హాని కలిగించే ప్రవర్తనను మేము అనుమతించము. ఈ పాలసీ ఏంటంటే మీరు YouTubeలో, అలాగే వెలుపల ఉన్న మీ వీక్షకులను, తోటి క్రియేటర్‌లను, మా అడ్వర్టయిజర్‌లను -- గౌరవించాలి.
మీరు ఈ పాలసీని ఉల్లంఘిస్తే, మేము మీ మానిటైజేషన్‌ను తాత్కాలికంగా ఆఫ్ చేయవచ్చు లేదా మీ ఖాతాలను రద్దు చేయవచ్చు. ఇది ఇప్పటికే ఉన్న మీ అన్ని ఛానెల్స్‌కు, మీరు క్రియేట్ చేసే ఏవైనా కొత్త ఛానెల్స్‌కు, మీరు నిత్యం కనిపించే ఛానెల్స్‌కు వర్తించవచ్చు.
మీ ఛానెల్స్‌లో ఏవైనా డీమానిటైజ్ చేయబడినా లేదా రద్దు చేయబడినా, ఈ పరిమితులను అధిగమించడానికి మీరు కొత్త వాటిని క్రియేట్ చేయడం గానీ లేదా ఇప్పటికే ఉన్న ఛానెల్స్‌ను ఉపయోగించడం గానీ చేయకూడదు, లేదా మీ సస్పెన్షన్ వ్యవధిలో ఈ ఛానెల్స్ నుండి YPPకి దరఖాస్తు చేయకూడదు. అలా చేయడం వల్ల అన్ని ఛానెల్స్‌ను రద్దు చేసే అవకాశం ఉంది.
క్రియేటర్ బాధ్యత గురించి మరింత తెలుసుకోండి.
క్రియేటర్ ఖచ్చితత్వం

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లోని క్రియేటర్‌లు తాము ఎవరనేది చెప్పుకునే విధంగా ఉండాలని, అలాగే తమ ప్లాట్‌ఫామ్‌లోని యాక్టివిటీని మార్చడం ద్వారా లేదా మోసపూరిత పద్ధతులకు పాల్పడటం ద్వారా తమను తాము తప్పుగా సూచించకుండా ఉండాలని మేము ఆశిస్తున్నాము.

అంటే వీక్షణలు, సబ్‌స్క్రయిబర్‌లు, వాచ్ టైమ్, అలాగే యాడ్ ఇంప్రెషన్‌ల వంటి ఛానెల్ ఎంగేజ్‌మెంట్‌ను క్రియేటర్‌లు కృత్రిమంగా పెంచకూడదని అర్థం. అదే విధంగా, ఆ కంటెంట్‌ను తొలగించే లేదా అస్పష్టం చేసే ముందు క్రియేటర్‌లు పాలసీలకు అనుగుణంగా లేని కంటెంట్‌కు సంబంధించి ఆర్గానిక్ ఎంగేజ్‌మెంట్‌ను ప్రోత్సహించకూడదు. ఈ రకమైన ప్రవర్తనకు పాల్పడటం వల్ల YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నుండి తీసివేయబడవచ్చు లేదా మీ ఛానెల్స్ రద్దు చేయబడవచ్చు. మరింత సమాచారం కోసం, మా ప్రోగ్రామ్ పాలసీలను చూడండి

క్రియేటర్‌లు చట్టవిరుద్ధమైన, మోసపూరితమైన లేదా వంచనతో కూడిన లావాదేవీల కోసం మా మానిటైజేషన్ ఫీచర్‌లను ఉపయోగించడం వంటి ఆర్థిక దుర్వినియోగ ప్రవర్తనలకు పాల్పడడటం ద్వారా యూజర్‌లను లేదా YouTubeను తప్పుదారి పట్టించకూడదు. మీరు ఈ పాలసీని ఉల్లంఘిస్తే, మేము మిమ్మల్ని YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నుండి తీసివేయవచ్చు లేదా మీ ఛానెల్స్‌ను రద్దు చేయవచ్చు.

పాలసీ మార్పుల గురించి మేము మీకు ఎలా తెలియజేస్తాము

YouTube ఈ సర్వీస్‌ను నిరంతరం అప్‌డేట్ చేస్తుంటుంది, మెరుగుపరుస్తూ ఉంటుంది, అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుగుణంగా మారుస్తుంది. మా సర్వీస్‌కు చేసిన మార్పులను ప్రతిబింబించడానికి లేదా చట్టపరమైన, రెగ్యులేటరీ, లేదా భద్రతా కారణాలకు సంబంధించి - సర్వీస్ నియమాలు, అలాగే YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నియమాలు, మా పాలసీలు, ఇంకా ఇతర ఒప్పంద డాక్యుమెంట్‌లతో సహా - మీరు సర్వీస్‌లను ఉపయోగించేటప్పుడు వర్తించే నియమాలు, షరతులకు లేదా పాలసీలకు మేము మార్పులు చేయాల్సి రావచ్చు.

మిమ్మల్ని ప్రభావితం చేసే మార్పులు చేసినప్పుడు మేము మీకు రాతపూర్వకంగా తెలియజేస్తాము. సవరించిన నియమాలను మీరు అంగీకరించకపోతే, మీరు సంబంధిత ఫీచర్‌ను ఉపయోగించడాన్ని ఆపివేయవచ్చు, లేదా మాతో మీకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు.

మా పాలసీల విషయంలో మీరు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యి ఉండటంలో సహాయపడటానికి, మేము శాశ్వత అప్‌డేట్‌ల లాగ్‌ను కూడా నిర్వహిస్తాము. మా చేంజ్‌లాగ్‌ను ఇక్కడ చూడండి.

YouTube మానిటైజేషన్ పాలసీలను మేము ఎలా అమలు చేస్తాము

YouTube ద్వారా డబ్బు సంపాదించే వారెవరైనా తప్పనిసరిగా YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలను ఫాలో అవ్వాలి. మీరు మా పాలసీలలో దేనినైనా ఉల్లంఘించినట్లయితే, YouTube కింద పేర్కొన్న చర్యలను తీసుకునే అవకాశం ఉంది.

నికర ఆదాయాన్ని లేదా పేమెంట్‌ను విత్‌హోల్డ్ చేయండి, సర్దుబాటు చేయండి, సర్దుబాటు ఛార్జీ విధించండి, లేదా భవిష్యత్తులో సర్దుబాటు ఛార్జీ విధించండి

YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీల ఉల్లంఘనలతో అనుబంధించబడిన మీ నికర ఆదాయాన్ని దేనినైనా మేము విత్‌హోల్డ్ చేయవచ్చు లేదా సర్దుబాటు చేయవచ్చు. మేము ఇంకా పంపిణీ చేయని ఏదైనా YouTube కోసం AdSense బ్యాలెన్స్ నుండి అనుబంధిత నికర ఆదాయాన్ని కూడా సర్దుబాటు ఛార్జీ విధించండి చేయవచ్చు లేదా భవిష్యత్తులో మీకు పే చేయాల్సిన నికర ఆదాయం నుండి సంబంధిత మొత్తాల విషయంలో భవిష్యత్తులో సర్దుబాటు ఛార్జీ విధించవచ్చు.

అటువంటి ఉల్లంఘనల విషయంలో, నికర ఆదాయాన్ని విత్‌హోల్డ్ చేయాలా, సర్దుబాటు చేయాలా, లేదా భవిష్యత్తులో సర్దుబాటు ఛార్జీ విధించాలా అనే దానిపై దర్యాప్తు చేయడానికి మాకు కొంత సమయం అవసరం. దీని వల్ల 90 రోజుల వరకు లేదా మేము ఏవైనా థర్డ్-పార్టీ హక్కుల వివాదాలను పరిష్కరించేంత వరకు పేమెంట్ ఆలస్యం కావచ్చు.

మేము మీ నికర ఆదాయాన్ని విత్‌హోల్డ్ లేదా సర్దుబాటు చేయాల్సి వచ్చే ఉల్లంఘనలకు సంబంధించిన ఉదాహరణల్లో ఈ సందర్భాలు (కానీ వీటికే పరిమితం కాదు) ఉంటాయి:

మీ ఛానెల్ YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నుండి రద్దు చేయబడిన లేదా సస్పెండ్ చేయబడిన మీకు ఇకపై ఎలాంటి ఆదాయాన్ని పొందే హక్కు ఉండదు. అంతే కాక, నికర ఆదాయాన్ని విత్‌హోల్డ్ చేసి, వీలైన చోట్ల, సముచితమైన కొనుగోళ్ల విషయంలో అడ్వర్టయిజర్‌లకు, లేదా వీక్షకులకు రీఫండ్‌ను జారీ చేసే అవకాశం కూడా ఉంది.

మేము మా పాలసీలను అమలు చేయాల్సి వచ్చినప్పుడు ఈమెయిల్ ద్వారా లేదా ప్రోడక్ట్ ద్వారా మీకు రాతపూర్వకంగా తెలియజేస్తాము. మీకు ఏ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయో కూడా మేము మీకు తెలియజేస్తాము.

మీ వీడియోల నుండి వచ్చే యాడ్ ఆదాయాన్ని పరిమితం చేయండి

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లోని మెంబర్‌గా, మీ వీడియోలు మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉంటే, మీరు వాటిని యాడ్ ఆదాయాన్ని సంపాదించేందుకు అర్హత పొందేలా చేయవచ్చు. అయితే, మీ వీడియోలు మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేవని కనుగొనబడితే, లేదా అవి మా వయోపరిమితి లేదా కాపీరైట్ గైడ్‌లైన్స్ వంటి ఇతర పాలసీలను ఉల్లంఘిస్తే, మీ వీడియోలు యాడ్ ఆదాయాన్ని పరిమితంగా సంపాదించవచ్చు లేదా అస్సలు సంపాదించలేకపోవచ్చు.

మానిటైజేషన్‌కు కంటెంట్ అర్హత పొందలేకపోవడానికి గల కారణాల గురించి మరింత సమాచారం కోసం ఈ లింక్‌ను చూడండి: YouTube Studioకు సంబంధించిన మానిటైజేషన్ చిహ్నం గైడ్

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో మీరు పాల్గొనడాన్ని సస్పెండ్ చేయండి

మా YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలను ఉల్లంఘిస్తే, మీ అన్ని ఖాతాలకు లేదా మీ ఖాతాలలో దేనికి అయినా మానిటైజేషన్ సస్పెండ్ చేయబడవచ్చు లేదా శాశ్వతంగా డిజేబుల్ చేయబడవచ్చు. మీ ఛానెల్‌కు ఇకపై మానిటైజేషన్‌కు అర్హత లేదని నిర్ధారించబడితే, మీ ఛానెల్ YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌తో అనుబంధించబడిన అన్ని మానిటైజేషన్ టూల్స్‌కు, ఫీచర్‌లకు, మాడ్యూల్స్‌కు యాక్సెస్‌ను కోల్పోతుంది. మీరు క్రియేటర్ సపోర్ట్‌ను సంప్రదించడం ద్వారా ఏ సమయంలోనైనా నిర్దిష్ట మానిటైజేషన్ మాడ్యూల్స్‌ను నిలిపివేయడానికి ఎంచుకోవచ్చు.

డేటా నిల్వ కొనసాగింపు

YouTubeతో మీ మానిటైజేషన్ ఒప్పందం రద్దు చేయబడితే, మీరు ఇప్పటికీ క్రియేటర్ సపోర్ట్‌ను సంప్రదించడం ద్వారా మీరు ప్రోగ్రామ్‌లో ఉన్నప్పటి నుండి మీ YouTube ఎనలిటిక్స్ డేటాను రిక్వెస్ట్ చేయవచ్చు.

పరిష్కార ప్రక్రియ చిట్కాలు అలాగే ప్రోగ్రామ్‌లో చేరడానికి మళ్లీ ఎలా దరఖాస్తు చేయాలనే దాని గురించిన వివరాలతో సహా సస్పెన్షన్‌లకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ లింక్‌ను చూడండి: నా ఛానెల్‌కు మానిటైజేషన్ డిజేబుల్ చేయబడింది

మీ YouTube ఛానెల్‌ను సస్పెండ్ చేయండి లేదా రద్దు కూడా చేయండి

అసాధారణ పరిస్థితులలో, ప్లాట్‌ఫామ్ సమగ్రతను కాపాడటానికి లేదా మా యూజర్‌లను హానికరమైన పరిస్థితుల నుండి రక్షించడానికి మేము ఛానెల్‌ను, ఖాతాను రద్దు చేయాల్సి రావచ్చు, లేదా సర్వీస్‌కు యూజర్ యాక్సెస్‌ను డిజేబుల్ చేయాల్సి రావచ్చు. మీ ఛానెల్ లేదా ఖాతా పొరపాటున రద్దు చేయబడిందని మీరు భావిస్తే, మీరు ఏమి చేయగలరు అనే దానితో సహా ఛానెల్ రద్దులు అలాగే డిజేబుల్ చేయబడిన Google ఖాతాల గురించి మరింత తెలుసుకోండి.

మీ మానిటైజేషన్‌ను ప్రభావితం చేసే చర్యల గురించి మేము మీకు ఎలా తెలియజేస్తాము

మేము మా పాలసీలను అమలు చేయాల్సి వచ్చినప్పుడు ఈమెయిల్ ద్వారా లేదా ప్రోడక్ట్ ద్వారా మీకు రాతపూర్వకంగా తెలియజేస్తాము. మీకు ఏ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయో కూడా మేము మీకు తెలియజేస్తాము.

మిమ్మల్ని ప్రభావితం చేసే సమస్యల విషయంలో సహాయం పొందడం ఎలా

మీరు YouTube పార్టనర్ ప్రోగ్రామ్‌లో భాగమైతే, మా క్రియేటర్ సపోర్ట్ టీమ్‌కు మీరు యాక్సెస్‌ను పొందవచ్చు.

మీరు నిర్దిష్ట సమస్యను ఎదుర్కొంటున్నా లేదా క్రియేటర్‌గా YouTube నుండి అత్యధిక ప్రయోజనాన్ని పొందడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నా, మీకు సాయం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాము:

  • మీరు YouTubeను ఉపయోగించే విధానాన్ని ఆప్టిమైజ్ చేయండి
  • మా ఎనలిటిక్స్ టూల్స్ నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడం ఎలాగో అర్థం చేసుకోండి
  • YouTubeకు సంబంధించిన టెక్నికల్ లేదా సర్వీస్ అంశాలకు సంబంధించి చిట్కాలను పొందండి
  • పాలసీ, కాపీరైట్ గైడ్‌లైన్స్‌కు నావిగేట్ అవ్వడం ఎలాగో తెలుసుకోండి
  • ఖాతా, ఇంకా ఛానెల్ మేనేజ్‌మెంట్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలను పొందండి
  • కంటెంట్ ID, హక్కుల మేనేజ్‌మెంట్ సమస్యలను పరిష్కరించండి
  • మీ ఖాతాలో ఎదురయ్యే బగ్‌లను లేదా సమస్యలను గుర్తించి, పరిష్కరించండి

మీరు క్రియేటర్ సపోర్ట్‌ను సంప్రదించడానికి, అలాగే YouTube క్రియేటర్‌గా సహాయం పొందడం ఎలా అనే దాని గురించి మరింత వివరణాత్మక సూచనలను కనుగొనవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2904301740603215012
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false