మీ YouTube ఛానెల్ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్‌ను విశ్లేషించి, మేనేజ్ చేయడం

మేము YouTubeలో పిల్లల కంటెంట్ విషయంలో డేటాను ఎలా కలెక్ట్ చేస్తాము, ఎలా ఉపయోగిస్తాము అనే దానికి కొన్ని మార్పులు చేస్తున్నాము. ఫలితంగా, ఈ ఆర్టికల్‌లోని కొన్ని సూచనలు మారవచ్చు. మరింత తెలుసుకోండి.

మెంబర్‌షిప్‌లు ఆన్ చేసి ఉన్న ఛానెల్స్, వేర్వేరు స్థాయిలతో ఛానెల్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను, వారి ఛానెల్ మెంబర్‌ల కోసం మెంబర్‌లు మాత్రమే పొందగల పెర్క్‌లను క్రియేట్ చేయవచ్చు. మీ మెంబర్‌లకు అందుబాటులో తీసుకురాగల పెర్క‌లు, స్థాయిలు వేర్వేరు ఉంటాయి. వీక్షకులు మీ ఛానెల్‌లో ఎలా చేరవచ్చు, అలాగే వారు మెంబర్‌షిప్‌లను ఎలా ఆస్వాదిస్తారు అనే వాటి గురించి మరింత తెలుసుకోండి.

కింది వాటితో సహా మీ ఛానెల్ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్‌ను మేనేజ్ చేయగల, అంచనా వేయగల పలు విభాగాలు YouTube Studioలో ఉన్నాయి:

మీ మెంబర్‌లు, పెర్క్‌ల గురించి మరింత తెలుసుకోవడంలో సహాయపడే మెంబర్‌ల API సర్వీస్, పలు ఇతర థర్డ్-పార్టీ ఇంటిగ్రేషన్‌లు మా వద్ద ఉన్నాయి

ఛానెల్ మెంబర్‌షిప్‌లు

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

ఛానెల్ మెంబర్‌షిప్‌లలో పాల్గొనే క్రియేటర్‌లు, MCNలు మా నియమాలు, పాలసీలకు, సంబంధిత చట్టాలు, నియంత్రణలన్నింటికీ అనుగుణంగా ఉండాలి.

మెంబర్‌షిప్‌ల ట్యాబ్

మీ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్, మీ మెంబర్‌లకు సంబంధించిన సమాచారాన్ని మీరు YouTube Studioలోని మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌లో కనుగొనవచ్చు. మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌కు వెళ్లడానికి, సంపాదించండి ఆ తర్వాత మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు మీ ఛానెల్‌లో కొత్త మెంబర్ చేరితే, మేము మీకు నోటిఫికేషన్‌ను పంపము. కానీ మీరు మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌లో మీ మెంబర్‌లను చూడవచ్చు. మీరు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో కొత్త వీక్షకులు మీ ఛానెల్ మెంబర్‌షిప్‌లో చేరినట్లయితే, ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో "స్వాగతం" అనే మెసేజ్ లైవ్ చాట్‌కు పంపబడుతుంది. ఈ మెసేజ్ చాట్‌కు ఎగువున 5 నిమిషాల పాటు పిన్ చేయబడుతుంది.

మీ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్‌కు సంబంధించిన సమాచారాన్ని మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌లో చూడటం

మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌లో, వీటితో సహా మీ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్‌కు సంబంధించిన సమాచారాన్ని మీరు పొందవచ్చు:
  1. మొత్తం మెంబర్‌లు: ప్రస్తుతం పెర్క్‌లకు యాక్సెస్ ఉన్న మెంబర్‌లందరూ. ఎవరైనా మెంబర్‌లు తమ మెంబర్‌షిప్‌ను రద్దు చేసినప్పటికీ, తమ మిగిలిన బిల్లింగ్ వ్యవధిలో పెర్క్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటే, వారు కూడా ఇందులో లెక్కించబడతారు.
  2. యాక్టివ్ మెంబర్‌లు: యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్న మెంబర్‌లు మాత్రమే. యాక్టివ్ మెంబర్‌లను పొందాలంటే, మొత్తం మెంబర్‌ల నుండి రద్దు చేసుకున్న మెంబర్‌‌లను తీసివేయాలి.
  3. ఆదాయం: గత బిల్లింగ్ వ్యవధిలో పొందిన నికర ఆదాయం. మీ నికర ఆదాయాన్ని, మునుపటి బిల్లింగ్ వ్యవధితో కూడా మీరు సరిపోల్చవచ్చు.
  4. స్థాయిని బట్టి మెంబర్‌లు: కాలానుగుణంగా స్థాయిని బట్టి మెంబర్‌ల సంఖ్య (మొత్తం అందరి సంఖ్య లేదా యాక్టివ్‌గా ఉన్న వారి సంఖ్య).
  5. సైన్ అప్‌లు, రద్దులు: గత బిల్లింగ్ వ్యవధిలో మెంబర్‌లు అయిన లేదా మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకున్న యూజర్‌ల సంఖ్య. మీరు మునుపటి బిల్లింగ్ వ్యవధితో కూడా సరిపోల్చవచ్చు.
  6. రద్దు ఫీడ్‌బ్యాక్: ముందుగానే నిర్వచించబడిన మా మల్టిపుల్ ఛాయిస్ ఆప్షన్‌లను ఉపయోగించి కొందరు మెంబర్‌లు, వారు ఎందుకు రద్దు చేసుకున్నారు అనే దానిపై ఫీడ్‌బ్యాక్‌ను ఇస్తారు. మెంబర్స్, మీ ఛానెల్‌ను రద్దు చేసుకున్నప్పుడు వారి ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికి ‘రద్దుల’కు నావిగేట్ చేయండి.
గమనిక: ప్రస్తుత క్యాలెండర్ నెలను బట్టి, బిల్లింగ్ వ్యవధి అనేది 28, 30 లేదా 31 రోజులు ఉండవచ్చు. ఉదాహరణకు, సెప్టెంబర్‌లో కొనుగోలు చేసిన మెంబర్‌షిప్, తదుపరి పేమెంట్‌కు ముందు 30 రోజుల పాటు పెర్క్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌లో మీ ఛానెల్ మెంబర్‌లకు సంబంధించిన సమాచారాన్ని చూడటం

మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌లో, వీటితో సహా మీ ప్రస్తుత మెంబర్‌లకు సంబంధించిన సమాచారాన్ని మీరు పొందవచ్చు:
  1. మెంబర్‌గా మొత్తం వ్యవధి: యూజర్ మీ ఛానెల్‌కు యాక్టివ్ పెయిడ్ మెంబర్‌గా ఉన్న మొత్తం సమయం. గతంలో మెంబర్‌గా ఉన్న వ్యవధులన్నింటికి సంబంధించిన సమయం ఇందులో ఉంటుంది.
  2. చివరి అప్‌డేట్: మెంబర్ చివరిసారిగా చేరిన, తిరిగి చేరిన, తమ మెంబర్‌షిప్‌ను అప్‌గ్రేడ్ చేసిన లేదా డౌన్‌గ్రేడ్ చేసినప్పటి నుండి గడిచిన రోజుల్లో.

ఈ సమాచారం స్నాప్‌షాట్‌ను CSVకి ఎగుమతి చేయడానికి, ఎగువ కుడి మూలన ఉన్న డౌన్‌లోడ్ ను క్లిక్ చేయండి. ఎగుమతి పూర్తవడానికి కొన్ని నిమిషాలు పట్టవచ్చు. మీరు వేచి ఉన్నప్పుడు ఈ విండోను మూసివేయవచ్చు. 

మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌లోని ఇతర కార్డ్‌లు, టూల్స్

మీ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్‌లో మీకు సహాయపడే ఇతర కార్డ్‌లు, టూల్స్‌ను మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌లో మీరు కనుగొనవచ్చు:
  1. రిసోర్స్‌లు: బెస్ట్ ప్రాక్టీసులను డిస్‌ప్లే చేసే డైనమిక్ కార్డ్, మీరు సమ్మతించగల, సమ్మతిని నిలిపివేయగల ఇతర రిసోర్స్‌లు, మెంబర్‌షిప్‌ల ప్రత్యేక ప్రయోగాలకు లింక్ అవుతుంది.
  2. కొత్త మెంబర్లను చేర్చిన ఇటీవలి వీడియోలు: వీక్షకులను మెంబర్లుగా మారుస్తూ, మంచి పనితీరు కనబరుస్తున్న వీడియోలపై దృష్టి పెట్టండి. 
  3. మెంబర్లు చేసిన ఇటీవలి కామెంట్లు: కొత్త మెంబర్ చేసిన లేటెస్ట్ కామెంట్లను సులువుగా కనుగొనండి. తద్వారా వాటికి రిప్లయి ఇవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
  4. మెంబర్‌షిప్‌ల ఆఫర్: మీ మెంబర్‌షిప్‌ల పెర్క్‌లు, స్థాయిలను మేనేజ్ చేయండి, అలాగే ఎడిట్ చేయండి. ఒక్కో ధర వద్ద మీరు చేర్చాలనుకునే పెర్క్‌ల రకాల కోసం సూచనలు, అలాగే బెస్ట్ ప్రాక్టీసులను కూడా ఈ కార్డ్ కలిగి ఉండవచ్చు.
    1. పరిచయ వీడియో: వీక్షకులు మెంబర్‌షిప్‌ల కోసం సైన్ అప్ చేయడానికి ‘చేరండి’ని క్లిక్ చేసినప్పుడు డిస్‌ప్లే అయ్యేలా ఒక వీడియోను అప్‌లోడ్ చేయండి.

YouTube ఎనలిటిక్స్

మీ మెంబర్‌లు, ఆదాయానికి సంబంధించిన మరింత డేటాను మీరు YouTube ఎనలిటిక్స్‌లో కూడా కనుగొనవచ్చు. YouTube ఎనలిటిక్స్‌కు వెళ్లడానికి, YouTube Studio ఆ తర్వాత ఎనలిటిక్స్‌కు సైన్ ఇన్ చేయండి.

YouTube ఎనలిటిక్స్‌లో మెంబర్‌షిప్‌ల ప్రేక్షకుల సమాచారాన్ని చూడటం

మీ ఛానెల్ మెంబర్‌లకు సంబంధించిన సమాచారాన్ని చూడటానికి:
  1. YouTube Studio ఆ తర్వాత ఎనలిటిక్స్ ఆ తర్వాత ప్రేక్షకులకు సైన్ ఇన్ చేయండి. 
  2. మొత్తం మెంబర్‌ల’ కార్డ్‌ను క్లిక్ చేయండి. ఒక రోజు లేదా కాలక్రమేణా పొందిన మొత్తం, యాక్టివ్ మెంబర్‌లను కార్డ్ చూపుతుంది. 
    • మీ మెంబర్‌ల గురించి మరింత డేటా కావాలంటే, మరింత చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. అనుకూల సమయ వ్యవధిలో కింది కొలమానాలు ఎటువంటి పనితీరు కనబరిచాయో కనుగొనడానికి మీరు టైమ్ సిరీస్‌ను మార్చవచ్చు:
      1. మొత్తం, అలాగే యాక్టివ్ మెంబర్‌లు
      2. మెంబర్‌షిప్‌లు పొందిన వారు
      3. మెంబర్‌షిప్‌లను రద్దు చేసిన వారు
      4. కోల్పోయిన మెంబర్‌లు (తమ బిల్లింగ్ వ్యవధి ముగిసిన ఫలితంగా పెర్క్‌లకు యాక్సెస్‌ను కోల్పోయిన రద్దు చేయబడిన మెంబర్‌లు)
  3. కీలక గణాంకాల’ కార్డ్ అనేది కాలానుగుణంగా మీరు ఎంత మంది మెంబర్‌లను పొందారు లేదా కోల్పోయారు అనే దాన్ని చూపిస్తుంది.

YouTube ఎనలిటిక్స్‌లో మెంబర్‌షిప్‌ల ఆదాయ సమాచారాన్ని చూడటం

మీ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్‌కు సంబంధించిన పై స్థాయి ఆదాయ డేటాను చూడటానికి:
  1. YouTube Studio ఆ తర్వాత ఎనలిటిక్స్ ఆ తర్వాత ఆదాయంకు సైన్ ఇన్ చేయండి.
  2. లావాదేవీల ఆదాయం’ కార్డ్‌ను క్లిక్ చేయండి. నిర్దిష్ట సమయ వ్యవధిలో ఎన్ని లావాదేవీలు జరిగాయో ఈ కార్డ్ చూపుతుంది. లావాదేవీలు అనేవి కొత్త సైన్ అప్‌లు లేదా రిపీట్ అయ్యేవి అయి ఉంటాయి.

మీ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్ నుండి పొందిన ఆదాయ డేటాకు సంబంధించిన మరింత వివరణాత్మక విభజనను చూడటానికి:

  1. YouTube Studio ఆ తర్వాత ఎనలిటిక్స్ ఆ తర్వాత ఆదాయంకు సైన్ ఇన్ చేయండి.
  2. మీరు డబ్బు సంపాదించే మార్గాల కార్డ్‌ను కనుగొని, ఎంచుకోండి.
  3. మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు అనుకూల సమయ వ్యవధిని సెట్ చేయవచ్చు లేదా వీడియో ఫార్మాట్ ఆధారంగా ఫిల్టర్ చేయవచ్చు.

గిఫ్ట్ మెంబర్‌షిప్‌లకు సంబంధించిన డేటాను YouTube ఎనలిటిక్స్‌లో చూడటం

గిఫ్ట్ మెంబర్‌షిప్‌లకు సంబంధించిన రిపోర్టింగ్ ఆప్షన్‌ను మీరు YouTube ఎనలిటిక్స్‌లో కనుగొనవచ్చు. ఎంచుకున్న సమయ వ్యవధిలో ఎన్ని మెంబర్‌షిప్‌లు గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎన్నింటిని రిడీమ్ చేసుకున్నారో చూడటానికి ‘మెంబర్‌షిప్‌ల రకాన్ని’ ఎంచుకోండి. 

ఛానెల్ మెంబర్‌షిప్‌ల ఆదాయంలో షేర్, రీఫండ్‌లు

మెంబర్‌షిప్‌ల ఆదాయంలో షేర్

క్రియేటర్‌లకు ఆదాయంలో షేర్

వర్తించే ట్యాక్స్‌లు, ఫీజులు డిడక్ట్ చేసిన తర్వాత మెంబర్‌షిప్ ఆదాయంలో క్రియేటర్‌లు 70% పొందుతారు. అన్ని లావాదేవీల ఖర్చులను (క్రెడిట్ కార్డ్ ఫీజుతో సహా) ప్రస్తుతం YouTube భరిస్తోంది.

MCNలలో క్రియేటర్‌లకు సంబంధించిన ఆదాయ షేరింగ్

మీరు MCNలో భాగమైతే, మీరు నెట్‌వర్క్‌ను సంప్రదించాలి. కొన్ని MCNలు అదనపు ఆదాయ షేరింగ్‌ను తీసుకోవచ్చు, అంటే మెంబర్‌షిప్‌ల నుండి మీ ఆదాయం 70% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
మీ మెంబర్‌షిప్ ఆదాయానికి వర్తించే ట్యాక్స్ చట్టాలన్నింటినీ పాటించేందుకు మీరు, మీ MCN బాధ్యత వహించాలి.

మెంబర్‌షిప్‌ల రద్దులు, ముగించడం, రీఫండ్‌లు

ఒకవేళ మెంబర్ రీఫండ్‌ను రిక్వెస్ట్ చేసినట్లయితే, ఆ క్లెయిమ్‌కు సంబంధించిన చెల్లుబాటును వెరిఫై చేసే హక్కు కేవలం YouTubeకు మాత్రమే ఉంది. మేము మెంబర్‌లకు రీఫండ్‌లను మంజూరు చేసేటప్పుడు, రీఫండ్ చేయాల్సిన మెంబర్‌లకు తిరిగి పేమెంట్ చేసేందుకు మీ 'YouTube కోసం AdSense ఖాతా' నుండి మీ షేర్ డిడక్ట్ చేయబడుతుంది. పెయిడ్ ఛానెల్ మెంబర్‌షిప్‌లకు సంబంధించిన YouTube రీఫండ్ పాలసీ గురించి తెలుసుకోండి.
కింది కారణాలలో దేని వలన అయినా ఛానెల్ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్ రద్దు అయితే, పేమెంట్ చేసే యాక్టివ్ మెంబర్‌లందరూ, తమ చివరి పేమెంట్‌కు రీఫండ్ పొందుతారు:
  • ఛానెల్ రద్దు చేస్తే
  • YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నుండి తీసివేస్తే
  • దుర్వినియోగం లేదా మోసం కారణంగా
  • మా నియమాలు లేదా పాలసీలను ఉల్లంఘించినందున
గమనిక: ఆదాయంలోని ఛానెల్ షేర్ నుండి రీఫండ్ చేసిన డబ్బు డిడక్ట్ చేయబడుతుంది.

అంచనా వేయడం, మేనేజ్ చేయడం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

నేను ఛానెల్ మెంబర్‌ను తీసివేయవచ్చా?

మెంబర్‌గా చేరిన ఎవరినీ మీరు తీసివేయలేరు, కానీ మీరు వారి కామెంట్‌లను బ్లాక్ చేయవచ్చు. నిర్దిష్ట వీక్షకుల కామెంట్‌లను బ్లాక్ చేయడానికి, మీరు తప్పనిసరిగా కామెంట్, లైవ్ చాట్ ఫిల్టర్‌లను సెటప్ చేయాలి.

కామెంట్ చేయకుండా నేను ఛానెల్ మెంబర్‌ను బ్లాక్ చేయవచ్చా?

నిర్దిష్ట వీక్షకుల కామెంట్‌లను బ్లాక్ చేయడానికి, మీరు కామెంట్, లైవ్ చాట్ ఫిల్టర్‌లను సెటప్ చేయాలి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12224894859915638622
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false