YouTube Shopping ఫీచర్‌ను ఉపయోగించడం ప్రారంభించండి

YouTube Shopping అనేది అర్హత కలిగిన క్రియేటర్‌లు YouTube అంతటా వారి స్వంత స్టోర్‌ల నుండి, లేదా ఇతర బ్రాండ్‌ల నుండి ప్రోడక్ట్‌లను సులభంగా ప్రమోట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. YouTube Shopping ద్వారా, మీరు వీటిని చేయగలరు:

  • మీ కంటెంట్‌లో మీ సొంత ప్రోడక్ట్‌లను ఫీచర్ చేయడానికి మీ స్టోర్‌ను సెటప్ చేసి, YouTubeకు కనెక్ట్ చేయండి.
  • ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను మీ కంటెంట్‌లో ట్యాగ్ చేయండి.
  • YouTube ఎనలిటిక్స్‌లో మీ Shopping ఎనలిటిక్స్‌ను చెక్ చేసి, ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌ల పనితీరును చూడండి.

YouTube Shopping ఫీచర్‌లలో ఇవి ఉంటాయి:

  • మీ ఛానెల్‌కు సంబంధించిన స్టోర్
  • మీరు కనెక్ట్ చేసిన స్టోర్‌లోని ప్రోడక్ట్‌లను వివరణలో, ఇంకా ప్రోడక్ట్ షెల్ఫ్‌లో చూపించడం జరుగుతుంది
  • మీ వీడియోలలో, షార్ట్‌లలో, లైవ్ స్ట్రీమ్‌లలో ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లు

మీ సొంత ప్రోడక్ట్‌లను ప్రమోట్ చేసుకోండి

YouTubeలో అమ్మకపు వస్తువుల వంటి మీ సొంత ప్రోడక్ట్‌లను ప్రమోట్ చేయడానికి, మీరు వీటిని కలిగి ఉండాలి:

  1. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి
  2. మీ స్టోర్‌ను YouTubeకు కనెక్ట్ చేయాలి
  3. ప్రోడక్ట్‌లను మీ కంటెంట్‌లో ఫీచర్ చేయడానికి మీ స్టోర్ నుండి వాటిని ట్యాగ్ చేయాలి

YouTube Shopping: మీ స్టోర్‌లోని ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి, విక్రయించండి

ఈ లొకేషన్‌లలో ఉండే వీక్షకులు, YouTubeలో ఈ కింద పేర్కొన్న ప్లాట్‌ఫామ్‌లలో మీ ప్రోడక్ట్‌లను బ్రౌజ్ చేయగలరు, కొనుగోలు చేయగలరు:

  • మీ ఛానెల్‌కు సంబంధించిన స్టోర్‌లో
  • వీడియో వివరణలో ప్రోడక్ట్‌లుగా
  • మీ కంటెంట్ కింద ప్రోడక్ట్ షెల్ఫ్‌లో
  • మీ కంటెంట్‌లో Shopping బటన్‌తో 

గమనిక: Google Merchant Centerలో స్టోర్‌లు సెట్ చేసిన విక్రయ దేశాల ఆధారంగా మేము వీక్షకులకు పూర్తి ప్రోడక్ట్ సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తాము. ఒక వీడియో ఏదైనా ఒక దేశంలో "షిప్పింగ్ ఏరియాస్ లిమిటెడ్" అనే ఒక నిరాకరణను చూపుతున్నట్లయితే, ఆ వ్యాపారి Google Merchant Centerలో సదరు దేశాన్ని టార్గెట్‌గా చేసుకోలేదని అర్థం. మరిన్ని వివరాల కోసం మీరు రిటైలర్‌ను లేదా ఆన్‌లైన్ స్టోర్ అడ్మిన్‌ను సంప్రదించవచ్చు. లోకల్ మార్కెట్‌లలో షిప్పింగ్‌కు సపోర్ట్ చేయడానికి ప్లాట్‌ఫామ్‌లు, రిటైలర్‌లు పూర్తిగా బాధ్యత వహిస్తారు. మీరు ప్లాట్‌ఫామ్ లేదా రిటైలర్ వెబ్‌సైట్‌కు వెళ్లి, వారి లోకల్ షిప్పింగ్ సపోర్ట్ గురించి తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మీరు విక్రయించే దేశాలకు సంబంధించిన సమాచారాన్ని వ్యాపారులు ఎలా ఎడిట్ చేయవచ్చనే దాని గురించి కూడా మరింత తెలుసుకోవచ్చు.

మీ సొంత ప్రోడక్ట్‌లను ప్రమోట్ చేయడానికి కావాల్సిన ఛానెల్ అర్హత

మీ సొంత ప్రోడక్ట్‌లను YouTube అంతటా ప్రమోట్ చేయాలంటే, మీ ఛానెల్ తప్పనిసరిగా ఈ కనీస అవసరాలను కలిగి ఉండాలి:

మీరు అర్హత ప్రమాణాలను కలిగి ఉన్నారని నిర్ధారించిన తర్వాత, మీ ఛానెల్ కోసం Shopping ఫీచర్‌లను ఆన్ చేయడానికి మీ స్టోర్‌ను కనెక్ట్ చేయవచ్చు. YPP లేదా సబ్‌స్క్రయిబర్ పరిమితి నియమాలకు మీ ఛానెల్ అనుగుణంగా లేకపోతే, మీ ఛానెల్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి మీరు ఈ రిసోర్స్‌లను రివ్యూ చేయవచ్చు.

ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను ప్రమోట్ చేయండి

YouTube Shopping సహాయంతో మీ ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి, విక్రయించండి! 🛍️

ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను మీ కంటెంట్‌లో ట్యాగ్ చేయవచ్చు, అలాగే ప్రమోట్ చేయవచ్చు. ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను మీ కంటెంట్‌లో ట్యాగ్ చేయడానికి మీరు తప్పనిసరిగా:

  1. అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  2. మా ట్యాగింగ్ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి.
  3. మీ కంటెంట్‌లో ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి.

ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను ప్రమోట్ చేయడానికి కావల్సిన ఛానెల్ అర్హత

ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను మీ కంటెంట్‌లో ప్రమోట్ చేయడానికి, మీ ఛానెల్ తప్పనిసరిగా ఈ కనీస అర్హతలను కలిగి ఉండాలి:

  • మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉండాలి
  • మీరు దక్షిణ కొరియా లేదా యునైటెడ్ స్టేట్స్ నివాసితులై ఉండాలి.
  • మీ ఛానెల్‌కు 10,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రయిబర్‌లు ఉండాలి.
  • మీ ఛానెల్ మ్యూజిక్ ఛానెల్ కానీ, అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్ కానీ అయి ఉండకూడదు, లేదా మ్యూజిక్ పార్ట్‌నర్‌లతో అనుబంధించబడి ఉండకూడదు. మ్యూజిక్ పార్ట్‌నర్‌లలో మ్యూజిక్ లేబుళ్లు, డిస్ట్రిబ్యూటర్‌లు, పబ్లిషర్‌లు, లేదా VEVO ఉండవచ్చు.
మీ ఛానెల్‌కు సంబంధించిన ప్రేక్షకుల సెట్టింగ్, పిల్లల కోసం రూపొందించినదిగా సెట్ చేసి ఉండకూడదు, మీ ఛానెల్‌లో పిల్లల కోసం రూపొందించినవిగా సెట్ చేసి ఉన్న వీడియోలు చాలా ఎక్కువగా ఉండకూడదు.

Shopping పనితీరు, ఆదాయం

కనెక్ట్ చేసిన మీ స్టోర్‌లలోని ప్రోడక్ట్‌లు

మీరు ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌ల పనితీరును చూచాయగా తెలుసుకోవడానికి YouTube Studioలోని Shopping విభాగానికి వెళ్లవచ్చు, లేదా విస్తారిత రిపోర్ట్‌ల కోసం YouTube ఎనలిటిక్స్‌కు వెళ్లవచ్చు. ఆదాయానికి సంబంధించి వివరణాత్మకమైన తాజా సమాచారం కోసం, మీ అమ్మకపు వస్తువుల ప్లాట్‌ఫామ్ లేదా రిటైలర్ వెబ్‌సైట్‌కు వెళ్లండి. అమ్మకపు వస్తువులు, ప్రోడక్ట్‌ల విక్రయానికి సంబంధించిన అన్ని పేమెంట్‌లు మీ అమ్మకపు వస్తువుల రిటైలర్ లేదా ప్లాట్‌ఫామ్ ద్వారా పే చేయబడతాయని గుర్తుంచుకోండి. YouTube, AdSenseల ప్రమేయం ఉండదు.

ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లు

ట్యాగ్ చేసిన మీ ప్రోడక్ట్‌లకు సంబంధించిన ఎంగేజ్‌మెంట్‌ను మెజర్ చేయడానికి, అలాగే మీకు వచ్చే ట్రాఫిక్‌లో ప్రోడక్ట్ పేజీల నుండి ఎంత ట్రాఫిక్ వస్తుందో తెలుసుకోవడానికి, మీరు YouTube ఎనలిటిక్స్‌లోని విస్తారిత రిపోర్ట్‌లను ఉపయోగించవచ్చు.

పాలసీలు

కనెక్ట్ చేసిన మీ స్టోర్‌లలోని ప్రోడక్ట్‌లు

అమ్మకపు వస్తువుల విక్రయాలకు సంబంధించి, కింద పేర్కొన్న వాటితో సహా అన్ని అంశాలకు (కానీ వీటికి మాత్రమే పరిమితం కాదు) మీ అధికారిక అమ్మకపు వస్తువుల రిటైలర్ లేదా ప్లాట్‌ఫామ్ బాధ్యత వహిస్తుంది (Google బాధ్యత వహించదు):

  • అమ్మకపు విధానం
  • వేర్‌హౌసింగ్
  • ఆర్డర్‌ను పూర్తి చేయడం
  • రీఫండ్‌లు
  • కస్టమర్ సర్వీస్
  • ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్
  • క్రియేటర్ లేదా ఆర్టిస్ట్ పేమెంట్

రిటైలర్‌లు లేదా ప్లాట్‌ఫామ్‌లు, అలాగే Google మధ్య డేటా షేరింగ్

అమ్మకపు వస్తువుల విక్రయాలు, సందర్శనలకు సంబంధించిన డేటా అనేది ప్రోడక్ట్ మెరుగుదలల కోసం, అలాగే మీకు సంబంధించిన ఎనలిటిక్స్‌ను అందించడం కోసం రిటైలర్‌లు, Googleల మధ్య షేర్ చేయబడుతుంది. ఉదాహరణకు, మీ YouTube Studioలో జరిగే మొత్తం నెలవారీ అమ్మకపు వస్తువుల విక్రయాలకు సంబంధించి మీ రిటైలర్ నుండి మేము పొందే డాటాను షేర్ చేయవచ్చు. మీ ఛానెల్‌లో విక్రయాలను మరింతగా పెంచడానికి కొత్త ఫీచర్‌లు సహాయపడతాయో లేదో అంచనా వేయడానికి కూడా మేము ఈ డేటాను ఉపయోగించవచ్చు. రిటైలర్‌లు, వారి ఎనలిటిక్స్ కోసం YouTube Shopping ఫీచర్‌ల నుండి వచ్చే ట్రాఫిక్‌కు సంబంధించిన డేటాను పొందుతారు.

Shopping డేటాను మీ రిటైలర్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా ఉపయోగిస్తారు అనేవి వారి గోప్యతా పాలసీతో సహా వారి సొంత నియమాలు, షరతులకు కట్టుబడి ఉంటాయి. అటువంటి Shopping డేటాను Google హ్యాండిల్ చేయడం, ఉపయోగించడం అనేవి మా గోప్యతా పాలసీకి కట్టుబడి ఉంటాయి. మీరు ఈ పాలసీలను చదివి, అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి.

ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లు

మీరు ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను ఫీచర్ చేసినప్పుడు, రిటైలర్ వెబ్‌సైట్‌లో జరిగే ఏ లావాదేవీలైనా, యాక్టివిటీలైనా, రిటైలర్ గోప్యతా పాలసీలతో సహా, వారి నియమాలు, షరతులకు కట్టుబడి ఉంటాయి. తుది ధర, వర్తించే ఫీజులు, అలాగే ట్యాక్స్‌లను రిటైలర్ నిర్ణయిస్తారు. రిటైలర్ వీటితో సహా మొత్తం ఆర్డర్‌ను హ్యాండిల్ చేస్తారు:

  • ఆర్డర్‌ను పూర్తి చేయడం
  • షిప్పింగ్
  • పేమెంట్
  • సపోర్ట్ (రిటర్న్‌లు, రీఫండ్‌లతో సహా)

రిటర్న్‌లు, రీఫండ్‌లతో సహా, ఆర్డర్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే, వీక్షకులు రిటైలర్‌ను సంప్రదించవచ్చు.

ఛానెల్‌కు సంబంధించిన ప్రత్యేక ప్రోడక్ట్ లిస్టింగ్‌లు

అర్హత ఉన్న వ్యాపారులు తమ Google Merchant Center ఖాతాలలోని లేదా Cafe24 ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ప్రత్యేక ఫ్లోలను ఉపయోగించి నిర్దిష్ట YouTube ఛానెల్స్‌తో ప్రత్యేకంగా ప్రోడక్ట్ లిస్టింగ్‌లను షేర్ చేయవచ్చు. వ్యాపారులు తమ లిస్టింగ్ ఫీడ్‌లలో భాగంగా నిర్దిష్ట ప్రోడక్ట్ లిస్టింగ్‌ను ఏ ఛానెల్స్ ప్రత్యేకంగా హ్యాండిల్ చేయాలో పేర్కొనడం ద్వారా కూడా అలా చేయవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా, సంబంధిత ప్రోడక్ట్‌లు లేదా ప్రోడక్ట్ ప్రమోషన్లు నిర్దిష్ట YouTube ఛానెల్‌కు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయని, ఇతర సేల్స్ ఛానెల్స్ లేదా ఇతర YouTube క్రియేటర్‌లకు అందుబాటులో ఉండవని వ్యాపారులు నిర్ధారిస్తారు. లిస్టింగ్ సమయంలో ఈ లిస్టింగ్‌లు సంబంధిత ఛానెల్‌లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయని మార్క్ చేయబడతాయి, అలాగే వాటికి డిస్కౌంట్ మరియు/లేదా సమయ-పరిమితి ఉన్న సమయంలో వీక్షకులకు హైలైట్ చేయబడతాయి. ప్రత్యేక లిస్టింగ్‌లు అనేవి సదరు వ్యాపారికి చెందిన గోప్యతా పాలసీలతో పాటు వారి నియమాలు, షరతులకు లోబడి ఉంటాయి. తుది ధరను, అలాగే కొనుగోలుకు సంబంధించిన షరతులను వ్యాపారి నిర్ణయిస్తారు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6003774153427419647
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false