Google Business Profile పాలసీల ఓవర్‌వ్యూ

వారి Business Profileకు జోడించిన ఏదైనా కంటెంట్ ఖచ్చితంగా ప్రస్తావనలో ఉన్న లొకేషన్‌ను సూచించాలి, అలాగే పాలసీలు, గైడ్‌లైన్స్‌లను ఫాలో అవ్వాలి. ఉల్లంఘనలు చోటు చేసుకున్నప్పుడు, మేము కంటెంట్ డిస్‌ప్లే కాకుండా నియంత్రించడానికి లేదా ప్రొఫైల్ లేదా వ్యాపారి ఖాతాకు యాక్సెస్‌ను పరిమితం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము.

అన్ని Google Business Profile పాలసీలు, గైడ్‌లైన్స్

ఈ ఆర్టికల్ మా కీలక పాలసీలను వివరిస్తుంది, వ్యాపారులు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యలను వివరిస్తుంది, అయితే ఇది సమగ్రమైనది కాదు. Google Business Profile పాలసీలకు, గైడ్‌లైన్స్‌కు సంబంధించి పూర్తి లిస్ట్‌ను చూడండి.

నిషేధించిన, నియంత్రిత కంటెంట్

Business Profileకు జోడించిన మొత్తం కంటెంట్ తప్పనిసరిగా Googleకు చెందిన నిషేధించిన, నియంత్రిత కంటెంట్‌ పాలసీలకు కట్టుబడి ఉండాలి. ఈ పాలసీలు రివ్యూలు, ఫోటోలు, అలాగే వీడియోలతో సహా అన్ని కంటెంట్ ఫార్మాట్‌లకు వర్తిస్తాయి. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రొఫైల్‌లు, అలాగే కంటెంట్‌ Googleలో పబ్లిష్ అవకుండా తిరస్కరించబడవచ్చు.

ఖాతా స్థాయి పరిమితులు

వ్యాపారులు కింది కారణాల వల్ల తమ Business Profileకు యాక్సెస్‌ను కోల్పోవచ్చు లేదా వారి యాక్సెస్ పరిమితం కావచ్చు:

Google ఖాతా మంచి స్థితిలో లేదు
Google ఖాతా మంచి స్థితిలో లేకుంటే (ఉదా. అది డిజేబుల్ చేయబడింది, సస్పెండ్ చేయబడింది, లేదా తొలగించబడింది) వ్యాపారి తమ Google Business Profileను యాక్సెస్ చేయడానికి ముందు సమస్యను పరిష్కరించడానికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి.
Business Profile యాక్టివిటీ నుంచి ఖాతా పరిమితం చేయబడింది

ఎవరైనా వ్యాపారి Google Business Profile పాలసీలను పదే పదే ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించబడితే, వారి Business Profileకు యాక్సెస్ పరిమితం కావచ్చు.

వ్యాపారి ఖాతా పరిమితం చేయబడితే, ఆ ఖాతాతో అనుబంధించబడిన అన్ని Business Profileలు సస్పెండ్ అవుతాయి.

ఎప్పుడైతే మీ ఖాతా పరిమితం అవుతుందో, అప్పుడు పరిమితం చేసిన ఖాతా నుండి జోడించిన కంటెంట్ తిరస్కరించబడుతుంది. ఇంతకుముందు తీసివేసిన ఏదైనా కంటెంట్‌ను విజయవంతంగా పునరుద్ధరించడానికి లేదా ప్రొఫైల్‌కు కొత్త కంటెంట్‌ను జోడించడానికి ముందు ఖాతా తప్పనిసరిగా పునరుద్ధరించబడాలి.

ఇతర Google ప్రోడక్ట్ ఖాతా పరిమితి కారణంగా ప్రొఫైల్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం

మరొక Google ప్రాడక్ట్‌తో అనుబంధించిన ఖాతా ద్వారా Business Profile క్రియేట్ అయినప్పుడు, Business Profile యేతర ప్రోడక్ట్ ఖాతా పరిమితి వల్ల Business Profile సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది.

Business Profile యేతర ఖాతా పరిమితం అయినప్పుడు, పరిమితం చేయబడిన ఖాతా నుండి Business Profileకు జోడించిన కంటెంట్ తిరస్కరించబడవచ్చు. ప్రొఫైల్‌ను పునరుద్ధరించడానికి ముందు Business Profile యేతర ఖాతాను తప్పనిసరిగా పునరుద్ధరించాలి.

అర్హత

బిజినెస్ ప్రొఫైళ్ల కోసం Google కింది పరిమితులు, అలాగే అర్హతలను కలిగి ఉంది:

అర్హత లేని బిజినెస్‌లు

Googleలో Business Profile కోసం అర్హత పొందడానికి, బిజినెస్ పేర్కొన్న పని వేళల్లో వారు తప్పనిసరిగా కస్టమర్‌లను స్వయంగా కలవాలి.

ఉదాహరణకు, కింది బిజినెస్‌లకు Business Profile కోసం అర్హత లేదు:

  • మీకు స్వంతం కాని లేదా రెప్రజెంట్ చేయడానికి అధికారం లేని లొకేషన్‌లో కొనసాగే సర్వీస్, క్లాస్ లేదా సమావేశం.
  • లీడ్ జెనరేషన్ ఏజెంట్‌లు లేదా కంపెనీలు.
  • బ్రాండ్‌లు, సంస్థలు, ఆర్టిస్ట్‌లు, అలాగే ఆన్‌లైన్‌లో మాత్రమే సర్వీస్‌లు అందించే ఇతర బిజినెస్‌లు.
  • అద్దెకిచ్చే లేదా అమ్మకానికి ఉంచిన భవనాలు, ఉదా., విడిది గృహాలు, మోడల్ ఇళ్లు లేదా ఖాళీ అపార్ట్‌మెంట్‌లు.

అర్హత గురించి మరిన్ని వివరాల కోసం, బిజినెస్ అర్హత, యాజమాన్య హక్కు‌ను రివ్యూ చేయండి.

బిజినెస్ ఉనికిలో లేదు

Googleలో డేటాను సాధ్యమైనంత ఖచ్చితమైనదిగా ఉంచడానికి, Google వివిధ సోర్స్‌ల నుండి సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, యూజర్ రిపోర్ట్‌లు, లైసెన్స్ ఉన్న కంటెంట్.

మీరు క్లెయిమ్ చేసిన లొకేషన్‌లో మీ బిజినెస్ లేదని మేము గుర్తిస్తే, Google మీ ప్రొఫైల్‌ను డిజేబుల్ చేస్తుంది.

P.O. బాక్స్ అడ్రస్
P.O బాక్స్ అడ్రస్ కలిగి ఉన్న బిజినెస్‌లు Google Business Profileలో అనుమతించబడవు. P.O బాక్స్ వద్ద తమ బిజినెస్ అడ్రస్‌ను సెట్ చేసుకున్న వ్యాపారుల ప్రొఫైల్ సస్పెండ్ చేయబడుతుంది.

యాజమాన్య హక్కు

Business Profile యాజమాన్య హక్కుకు సంబంధించిన సమస్యలు:

అనధికారిక ప్రొఫైల్ యాక్సెస్
బిజినెస్ ప్రొఫైల్‌కు వేరే వ్యాపారి అధికారిక ఓనర్ అని నిర్ధారించబడినప్పుడు, ఇతర అనధికార యూజర్‌లకు యాక్సెస్ ఉపసంహరించబడుతుంది.
ఇన్‌యాక్టివ్ ఓనర్
ఎక్కువ కాలం పాటు తమ Google Business Profileను యాక్సెస్ చేయని వ్యాపారుల యాక్సెస్ తగిన హెచ్చరిక తర్వాత ఉపసంహరించబడవచ్చు, కంటెంట్ తీసివేయబడవచ్చు.

పోస్ట్ చేసే పరిమితులు

ప్రొఫైల్‌కు యూజర్ కంట్రిబ్యూషన్‌లు స్థిరంగా సహాయకరంగా లేకుండా, హానికరంగా, టాపిక్‌తో సంబంధం లేకుండా లేదా సాధారణంగా Google పాలసీలను ఉల్లంఘించినప్పుడు, ఆ ప్రొఫైల్‌కు చెందిన యూజర్ రూపొందించిన కంటెంట్‌ను మేము పరిమితం చేయవచ్చు లేదా సస్పెండ్ చేయవచ్చు. బిజినెస్‌కు సంబంధం లేని కారణాల వల్ల ఆ బిజినెస్ పదే పదే పేలవమైన రివ్యూలను పొందడం ఒక ఉదాహరణ. పోస్ట్ చేయడానికి సంబంధించిన పరిమితుల గురించి మరింత తెలుసుకోండి.

దేని కోసమైతే కారణాలు సమర్పించబడ్డాయో ఆ కంటెంట్ తిరస్కరించబడవచ్చు

Business Profileకు జోడించిన కంటెంట్ అనేక కారణాల వల్ల తిరస్కరించబడవచ్చు.

తొలగించబడిన ప్రొఫైల్
కంటెంట్‌ను Google రివ్యూ చేయడానికి లేదా పబ్లిష్ చేయడానికి ముందు ప్రొఫైల్‌కు యాక్సెస్ కలిగిన యూజర్ అనుబంధ ప్రొఫైల్‌ను తొలగించినప్పుడు కంటెంట్, అలాగే అప్పీళ్లను Google తిరస్కరించవచ్చు.
డిజేబుల్ చేసిన ప్రొఫైల్

కంటెంట్‌ను Google రివ్యూ చేయడానికి లేదా పబ్లిష్ చేయడానికి ముందు అనుబంధ ప్రొఫైల్ డిజేబుల్ చేయబడినప్పుడు కంటెంట్‌, అలాగే అప్పీళ్లను Google తిరస్కరించవచ్చు.

ప్రొఫైల్‌కు కంటెంట్‌ను విజయవంతంగా కంట్రిబ్యూట్ చేసే ముందు డిజేబుల్ చేసిన ప్రొఫైళ్లను తప్పనిసరిగా పునరుద్ధరించాలి.

డిజేబుల్ చేసిన ప్రొఫైళ్లకు సంబంధించి సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.

సస్పెండ్ చేయబడిన ప్రొఫైల్

కంటెంట్‌ను Google రివ్యూ చేయడానికి లేదా పబ్లిష్ చేయడానికి ముందు అనుబంధ ప్రొఫైల్ సస్పెండ్ అయినప్పుడు Google కంటెంట్, అలాగే అప్పీళ్లను తిరస్కరించవచ్చు.

ప్రొఫైల్‌కు కంటెంట్‌ను విజయవంతంగా కంట్రిబ్యూట్ చేసే ముందు సస్పెండ్ అయిన ప్రొఫైళ్లను తప్పనిసరిగా పునరుద్ధరించాలి.

సస్పెండ్ అయిన ప్రొఫైళ్లకు సంబంధించి సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.

వెరిఫికేషన్ తప్పనిసరి

Googleలో మీ బిజినెస్ పేరును, ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి, మీరు తప్పక ముందుగా మీ బిజినెస్‌ను వెరిఫై చేయాలి. వెరిఫై కాని ప్రొఫైళ్లకు జోడించిన కంటెంట్‌ను Google తిరస్కరించవచ్చు.

వెరిఫై చేయబడటం గురించి మరిన్ని వివరాల కోసం, ఈ దశలను ఫాలో అవ్వండి.

కంటెంట్ పబ్లిష్ అవ్వడంలో విఫలం కావడానికి లేదా అప్పీల్స్ తిరస్కరించబడటానికి ఇతర కారణాలు

కొన్నిసార్లు సమర్పించిన కంటెంట్ పాలసీ యేతర కారణాల వల్ల పబ్లిష్ అవ్వడంలో విఫలం కావచ్చు:

ప్రొఫైల్ లేదా కంటెంట్ ఇప్పటికే లైవ్‌లో ఉంది, ఎడిట్ చేయబడింది లేదా తొలగించబడింది
Google ఇప్పటికే కంటెంట్‌ను ఆమోదించినందున నిర్దిష్ట వ్యాపారి చేర్చిన కంటెంట్ జోడించబడకపోవచ్చు. ఒకే ఫోటోను లేదా ఫోన్ నంబర్‌ను ఒకటి కంటే ఎక్కువ సార్లు మీరు జోడించడానికి ట్రై చేయడం దీనికి ఉదాహరణ.
అదే విధంగా, సందేహాస్పద కంటెంట్ ఇప్పటికే లైవ్‌లో ఉన్న, తొలగించబడిన, లేదా ఎడిట్ చేయబడిన కారణంగా అప్పీల్ తీర్పును నిర్ణయించలేనప్పుడు Google అప్పీల్స్‌ను తిరస్కరించవచ్చు.
సమర్పణలో ఎర్రర్
మీ కంటెంట్‌ను ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఎర్రర్ ఏర్పడింది. దయచేసి తర్వాత మళ్లీ ట్రై చేయండి లేదా Google Business Profile సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
359115940802321265
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99729
false
false
false