YouTubeలో పేమెంట్ పొందడానికి 'YouTube కోసం AdSense' ఖాతాను సెటప్ చేయండి

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా, రష్యాలోని యూజర్లకు Google యాడ్‌లను, YouTube యాడ్‌లను అందించడాన్ని మేము తాత్కాలికంగా పాజ్ చేయనున్నాము. మరింత తెలుసుకోండి.

మీరు YouTubeలో డబ్బు సంపాదిస్తుంటే, డబ్బు సంపాదించడానికి, ఇంకా పేమెంట్‌ను పొందడానికి, ఆమోదించబడిన 'YouTube కోసం AdSense' ఖాతాను లింక్ చేయండి.

ముఖ్య గమనిక: AdSense నియమాలు, షరతులు లేదా 'YouTube కోసం AdSense' సర్వీస్ నియమాల ప్రకారం (ఏది వర్తిస్తే అది), ఒక 'పేమెంట్ గ్రహీత' పేరు మీద మీకు ఒక AdSense లేదా ఒక 'YouTube కోసం AdSense' ఖాతా మాత్రమే ఉండాలి. డూప్లికేట్ ఖాతాలు ఆమోదించబడవు, అంతే కాకుండా, అనుబంధిత YouTube ఛానెల్‌కు మానిటైజేషన్ ఆఫ్ చేయబడుతుంది. కొత్త 'YouTube కోసం AdSense' ఖాతాను ప్రారంభించేటప్పుడు, దాన్ని కేవలం YouTube Studio ద్వారా మాత్రమే క్రియేట్ చేయండి. మరొక సైట్‌లో క్రియేట్ చేస్తే (ఉదాహరణకు, AdSense హోమ్ పేజీలో క్రియేట్ చేస్తే), అది పని చేయదు.

'YouTube కోసం AdSense' ఖాతాను క్రియేట్ చేసి, లింక్ చేయండి

మీ ఛానెల్‌కు లింక్ చేయబడిన 'YouTube కోసం AdSense' ఖాతా ద్వారా YouTubeలో మీకు పేమెంట్ అందుతుంది. మీరు ఇప్పటికే YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉంటే, మీకు అవసరం ఏర్పడితే, లింక్ చేయబడిన మీ 'YouTube కోసం AdSense' ఖాతాను మీరు మార్చవచ్చు అనే విషయాన్ని గమనించండి. ఒకే 'YouTube కోసం AdSense' ఖాతాను ఉపయోగించి మీరు ఒకటి కంటే ఎక్కువ YouTube ఛానెల్స్‌ను కూడా మానిటైజ్ చేసుకోవచ్చు.

లింక్ చేయబడిన మీ 'YouTube కోసం AdSense' ఖాతాను మీరు ప్రతి 32 రోజులకు ఒకసారి మాత్రమే మార్చగలరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.

 YouTube Creators కోసం AdSense

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

 

మీరు కొత్త 'YouTube కోసం AdSense' ఖాతాను క్రియేట్ చేసి, దాన్ని మీ ఛానెల్‌కు లింక్ చేయవచ్చు:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి ట్యాబ్‌ను ఎంచుకోండి.
  3. 'YouTube కోసం AdSense'కు సైన్ అప్ చేయండి అనే కార్డ్‌పై ఉన్న ప్రారంభించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మిమ్మల్ని అడిగినప్పుడు, అవసరమైతే మీ YouTube ఖాతా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, తిరిగి ప్రామాణీకరించండి.
  5. 'YouTube కోసం AdSense'కు మీరు ఉపయోగించాలనుకుంటున్న Google ఖాతాను ఎంచుకోండి.
    • గమనిక: YouTube కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం మీరు ఇప్పటికే AdSenseను ఉపయోగిస్తున్నట్లయితే, ఆ AdSense ఖాతాతో ఉపయోగించబడే Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  6. మీరు ఇప్పుడు 'YouTube కోసం AdSense'లో ఉన్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత, పేజీకి ఎగువ భాగంలో కనిపించే ఈమెయిల్ అడ్రస్ సరైనదో కాదో వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఆ ఈమెయిల్ అడ్రస్ సరైనది కాకపోతే, ఖాతాలను మార్చడానికి, వేరే ఖాతాను ఉపయోగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. మీ ఖాతాను సెటప్ చేసుకోవడాన్ని కొనసాగించండి. మీ కాంటాక్ట్ సమాచారాన్ని అందించి, మీ 'YouTube కోసం AdSense' ఖాతా దరఖాస్తును సమర్పించండి.

పైన పేర్కొన్న దశలను ఫాలో అయిన తర్వాత, మీరు YouTube Studioకు తిరిగి మళ్లించబడతారు, అక్కడ మీ 'YouTube కోసం AdSense'   ఖాతాకు సంబంధించిన దరఖాస్తు అందిందని వెరిఫై చేస్తూ మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. మీ ఖాతాకు ఆమోదం లభించాక, మేము మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తాము, దీనికి చాలా రోజుల దాకా సమయం పట్టవచ్చు. ఆమోదించబడిన తర్వాత, YouTube Studioలోని 'YouTube కోసం AdSense'కు సైన్ అప్ చేయండి అనే కార్డ్‌లో, మీ 'YouTube కోసం AdSense' ఖాతా ఆమోదించబడిందని, అది ఇప్పుడు యాక్టివ్‌గా ఉందని నిర్ధారిస్తూ ఒక మెసేజ్ మీకు కనిపిస్తుంది.

మల్టీ ఛానెల్ నెట్‌వర్క్‌లు (MCN): మీరు MCNతో పార్ట్‌నర్‌గా ఉన్న అనుబంధ ఛానెల్ అయితే, మీ ఛానెల్‌కు మీ సొంత 'YouTube కోసం AdSense' ఖాతాను మీరు లింక్ చేయాల్సి ఉంటుంది. థర్డ్-పార్టీకి చెందిన 'YouTube కోసం AdSense' ఖాతాను, వారి అనుమతితోనే యాక్సెస్ చేసినా కూడా, అది AdSense సర్వీస్ నియమాల ఉల్లంఘనగా, లేదా 'YouTube కోసం AdSense' సర్వీస్ నియమాల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది ( ఏది వర్తిస్తే అది).

నాకు ఇప్పటికే AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతా ఉందో లేదో నాకు తెలియదు

"adsense-noreply@google.com" నుండి వచ్చిన ఈమెయిల్స్ కోసం మీ ఇన్‌బాక్స్‌లను సెర్చ్ చేయండి.
AdSense నియమాలు, షరతులు లేదా 'YouTube కోసం AdSense' సర్వీస్ నియమాల ప్రకారం (ఏది వర్తిస్తే అది), ఒక 'పేమెంట్ గ్రహీత' పేరు మీద మీకు ఒక AdSense లేదా ఒక 'YouTube కోసం AdSense' ఖాతా మాత్రమే ఉండాలి. మీకు డూప్లికేట్ ఖాతా ఉన్నట్లు తెలిస్తే, మీ 'YouTube కోసం AdSense' ఖాతా తిరస్కరించబడుతుంది, ఇంకా ఇతర సంబంధిత ఖాతాలను మూసివేయాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది.
నాకు ఇప్పటికే ఆమోదించబడిన AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతా ఉంది
  1. మీ YouTube ఖాతాకు సైన్ ఇన్ చేసి, https://studio.youtube.com/channel/UC/monetization లింక్‌కు వెళ్లండి
  2. “YouTube కోసం AdSenseకు సైన్ అప్ చేయండి” అనే కార్డ్‌పై ఉన్న ప్రారంభించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీ YouTube ఖాతా పాస్‌వర్డ్‌ను మీరు ఎంటర్ చేసి, తిరిగి ప్రామాణీకరించవలసి ఉంటుంది. మీ YouTube ఖాతాను తిరిగి ప్రామాణీకరించడం ఎలాగో తెలుసుకోండి.
  4. 'YouTube కోసం AdSense'కు సైన్ ఇన్ చేయడానికి మీరు ఉపయోగించాలనుకుంటున్న Google ఖాతాను ఎంచుకోండి. మీకు ఇప్పటికే AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతా ఉన్నట్లయితే, ఆ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీరు ఉపయోగించే Google ఖాతాతో తప్పనిసరిగా సైన్ ఇన్ చేయాలి. మీరు YouTubeకు సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించే సైన్ ఇన్ ఆధారాలు, ఈ ఖాతా రెండూ వేర్వేరు కావచ్చు.
  5. మీరు 'YouTube కోసం AdSense' సైన్ అప్ పేజీకి మళ్లించబడతారు. పేజీకి ఎగువ భాగంలో కనిపించే ఈమెయిల్ సరైనదేనని వెరిఫై చేసుకోండి. ఒకవేళ అక్కడ కనిపించే ఖాతా సరైనది కాకపోతే, ఖాతాలను మార్చడానికి, "వేరే ఖాతాను ఉపయోగించండి"ని క్లిక్ చేయండి.
  6. అనుబంధాన్ని ఆమోదించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. YouTube Studioలో ఉన్న 'సంపాదించండి' పేజీకి మీరు తిరిగి మళ్లించబడతారు.
  8. మీ 'YouTube కోసం AdSense' ఖాతాను మీరు కనెక్ట్ చేసిన తర్వాత, "YouTube కోసం AdSense ఖాతాకు సైన్ అప్ చేయండి" కార్డ్‌లో ఈ దశను మేము ఆకుపచ్చ రంగులో "పూర్తయింది" గుర్తుతో మార్క్ చేస్తాము.

కంటెంట్ మేనేజర్ ఖాతాను ఉపయోగించి 'YouTube కోసం AdSense'ను సెటప్ చేయండి

కంటెంట్ మేనేజర్ ఖాతాను నిర్వహించడానికి మీకు హక్కులు మంజూరు చేయబడితే, దాన్ని ఉపయోగించి మీరు 'YouTube కోసం AdSense' ఖాతాను అనుబంధించవచ్చు.
  1. మీ కంటెంట్ మేనేజర్ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. సెట్టింగ్‌లకు వెళ్లండి.
  3. ఓవర్‌వ్యూ విభాగంలో, మీకు 'YouTube కోసం AdSense' కనిపిస్తుంది (దాన్ని చూడటానికి మీరు స్క్రోల్ చేయాల్సి రావచ్చు).
  4. ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. కొనసాగించండి ఆప్షన్‌ను క్లిక్ చేసి, 'YouTube కోసం AdSense'కు వెళ్లండి.
  6. మీ YouTube ఖాతా పాస్‌వర్డ్‌ను మీరు ఎంటర్ చేసి, తిరిగి ప్రామాణీకరించవలసి ఉంటుంది. మీ YouTube ఖాతాను తిరిగి ప్రామాణీకరించడం ఎలాగో తెలుసుకోండి.
  7. 'YouTube కోసం AdSense'కు సైన్ ఇన్ చేయడానికి మీరు ఉపయోగించాలనుకుంటున్న Google ఖాతాను ఎంచుకోండి. మీకు ఇప్పటికే AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతా ఉన్నట్లయితే, ఆ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీరు ఉపయోగించే Google ఖాతాతో తప్పనిసరిగా సైన్ ఇన్ చేయాలి.
  8. అడిగినప్పుడు, మీ 'YouTube కోసం AdSense' ఖాతాకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. ఈ సమాచారం, మీరు YouTubeకు సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించే ఆధారాలు, రెండూ వేర్వేరు కావచ్చు.
  9. మీరు 'YouTube కోసం AdSense' ఖాతాతో అనుబంధిస్తున్న YouTube ఛానెల్‌ను నిర్ధారించండి, అలాగే ఛానెల్ కోసం ప్రధాన భాషను ఎంచుకోండి. 'YouTube కోసం AdSense' అనుబంధాన్ని పూర్తి చేయడానికి మీరు ఒక YouTube ఛానెల్‌నే ఎంచుకున్నప్పటికీ, మీ కంటెంట్ మేనేజర్‌కు లింక్ చేయబడిన ఛానెల్స్ అన్నింటిలో YouTube యాడ్‌లను ప్రదర్శిస్తుంది.
  10. అనుబంధాన్ని ఆమోదించండి ఆప్షన్‌ను క్లిక్ చేసి, అడిగినట్లయితే, మీ బిల్లింగ్ సమాచారాన్ని జోడించండి.
ఈ ప్రాసెస్‌ను పూర్తి చేశాక, మీరు YouTubeకు తిరిగి మళ్లించబడతారు. AdSense దరఖాస్తు రివ్యూకు సంబంధించి వేచి ఉండాల్సిన సమయాల గురించి మరింత తెలుసుకోండి.

సాధారణ సమస్యలు

'YouTube కోసం AdSense' ఖాతాను మీ ఛానెల్‌కు లింక్ చేయడానికి ట్రై చేసేటప్పుడు ఎదురయ్యే సాధారణ సమస్యలను పరిష్కరించడానికి ఈ కింద ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి.

నేను ఒక కొత్త 'YouTube కోసం AdSense' ఖాతాను క్రియేట్ చేశాను, కానీ నాకు ఇప్పటికే AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతా ఉన్నందున అది తిరస్కరించబడింది

వర్తించే విధంగా, AdSense నియమాలు, షరతులు లేదా 'YouTube కోసం AdSense' సర్వీస్ నియమాల ప్రకారం ఒకే 'పేమెంట్ గ్రహీత' పేరు మీద మీరు ఒక AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతాను మాత్రమే కలిగి ఉండగలరు. మీకు డూప్లికేట్ ఖాతా ఉన్నట్లు తెలిస్తే, కొత్తగా క్రియేట్ చేయబడిన మీ 'YouTube కోసం AdSense' ఖాతా తిరస్కరించబడుతుంది.

"మీకు ఇప్పటికే ఒక AdSense ఖాతా లేదా 'YouTube కోసం AdSense' ఖాతా ఉంది" అనే సబ్జెక్ట్‌తో మీకు వచ్చిన ఈమెయిల్ కోసం మీ ఈమెయిల్ ఇన్‌బాక్స్‌లను సెర్చ్ చేయండి. ఈ మెసేజ్‌లో, ఇప్పటికే ఉన్న మీ AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతాకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ సమాచారంతో, ఈ సమస్యను మీరు రెండు మార్గాలలో పరిష్కరించవచ్చు:

ఇప్పటికే ఉన్న ఖాతాను (పాత ఖాతా) ఉపయోగించండి

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేసి, అనుబంధాన్ని మార్చండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. ఖాతా ఎంపిక మెనూలో, ఇప్పటికే ఉన్న (పాతది) మీ AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతాను ఉపయోగించే Google ఖాతాను ఎంచుకోండి.
  3. అనుబంధాన్ని ఆమోదించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు YouTube Studioకు తిరిగి మళ్లించబడతారు, అక్కడ మీ ఛానెల్‌కు లింక్ అయి ఉన్న ఖాతాను మీరు చూడవచ్చు.

మీరు ఇప్పుడే క్రియేట్ చేసిన కొత్త ఖాతాను ఉపయోగించండి

ముందుగా, మీరు ఇప్పటికే ఉన్న ఖాతాను (పాత ఖాతా) మూసివేయాలి

  1. వర్తించే విధంగా, ఇప్పటికే ఉన్న మీ AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. మీ ఖాతాను మూసివేయడానికి, ఇక్కడ ఉన్న దశలను ఫాలో అవ్వండి.

మూసివేసిన తర్వాత, పాత ఖాతాను మీరు మూసివేశారని నిర్ధారించడానికి మీ కొత్త 'YouTube కోసం AdSense' ఖాతాకు సైన్ ఇన్ చేయండి.

గమనిక: మీ కొత్త 'YouTube కోసం AdSense' ఖాతా ఆమోదం పొంది, మీ YouTube ఛానెల్‌కు లింక్ అవ్వడానికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు.

అడ్రస్ (PIN) వెరిఫికేషన్ విషయంలో ఎదురయ్యే సమస్యలు

ఛానెల్ మానిటైజేషన్‌ను కొనసాగించడానికి, పేమెంట్‌లను అందుకోవడానికి, మీ 'YouTube కోసం AdSense' ఖాతాలో అడ్రస్ (PIN) వెరిఫికేషన్‌ను పూర్తి చేయడం అవసరం.

మీ ఛానెల్‌కు మీరు కొత్త 'YouTube కోసం AdSense' ఖాతాను లింక్ చేస్తే, మీ బ్యాలెన్స్ $10కు చేరుకున్నప్పుడు, పోస్ట్ ద్వారా మీ భౌతిక అడ్రస్‌కు ఒక PIN వెరిఫికేషన్ కార్డ్‌ను పంపడం జరుగుతుంది. ఈ PIN వెరిఫికేషన్ కార్డ్‌లో ఒక PIN కోడ్ ఉంటుంది, మీరు దీన్ని మీ అడ్రస్‌ను వెరిఫై చేయడానికి మీ ఖాతాలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

మీరు ఇప్పటికే ఉన్న AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతాకు లింక్ చేసినట్లయితే, పోస్ట్ ద్వారా PIN వెరిఫికేషన్ కార్డ్‌ను అందుకోవడానికి కనీసం 3 వారాల పాటు వేచి ఉండాల్సి రావచ్చు. 3 వారాలు గడిచాక కూడా అది మీకు అందకపోతే, మీరు మరో PIN వెరిఫికేషన్ కార్డ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు.

మీ 'YouTube కోసం AdSense' ఖాతాలోని ఫైల్‌లో ఉండే అడ్రస్, మీ లోకల్ పోస్ట్ ఆఫీస్ గుర్తించే అడ్రస్‌తో మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. సరైన అడ్రస్‌ను కలిగి ఉంటే, లోకల్ పోస్ట్ ఆఫీస్ మీ మెయిల్‌ను డెలివరీ చేయడంలో సహాయపడుతుంది. ఆ రెండూ వేరుగా ఉంటే, వాటి మధ్య ఏ తేడా లేకుండా ఉండేలా చేయడానికి, మీ ఖాతాలోని పేమెంట్ అడ్రస్‌ను మీరు మార్చాల్సి ఉంటుంది.

అడ్రస్ (PIN) వెరిఫికేషన్ విషయంలో మీకు సహాయం కావాలంటే, ఈ సహాయ రిసోర్స్‌లను చూడండి:

నేను నా అడ్రస్‌ను వెరిఫై చేయకపోతే ఏమి జరుగుతుంది?

4 నెలల లోపు మీ అడ్రస్‌ను మీరు వెరిఫై చేయకపోతే, మీ ఛానెల్‌కు మానిటైజేషన్ పాజ్ చేయబడుతుంది. కింది ఫీచర్‌లకు యాక్సెస్ పాజ్ చేయబడుతుంది:

  • ఛానెల్ మెంబర్‌షిప్‌లు
  • సూపర్ చాట్, మరిన్ని ఫీచర్‌లు

మీ అడ్రస్‌ను మీరు వెరిఫై చేశాకనే మీ ఛానెల్‌లో మానిటైజేషన్ కొనసాగుతుంది.

ఇతర సమస్యలు

YouTube Studioలో నాకు "అయ్యో, ఎక్కడో తప్పు జరిగింది" అనే ఎర్రర్ కనిపిస్తోంది

YouTube Studio గుర్తించని ఈమెయిల్స్‌ను ఉపయోగించి ఏవైనా మార్పులను చేయాలని ట్రై చేసేటప్పుడు ఈ ఎర్రర్ మెసేజ్ కనిపించే అవకాశం ఉంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఈ కింద పేర్కొన్న వాటిని ట్రై చేయండి:

  • 'YouTube కోసం AdSense' ఖాతాను లింక్ చేసేటప్పుడు, మీ గుర్తింపును వెరిఫై చేయమని YouTube Studio మిమ్మల్ని అడుగుతుంది. YouTubeకు సైన్ ఇన్ చేయడానికి మీరు ఏ ఈమెయిల్ అడ్రస్‌ను అయితే ఉపయోగిస్తున్నారో, ఆ ఈమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించే ఈ పని చేస్తున్నారని నిర్ధారించుకోండి.
  • ఆపై 'YouTube కోసం AdSense'కు కొనసాగించడానికి Google ఖాతాను ఎంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఈ సందర్భంలో, మీరు YouTube Studioకు సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించే ఈమెయిల్ అడ్రస్ కాకుండా వేరే అడ్రస్‌ను ఎంచుకోవచ్చు.
  • మీ ఛానెల్ ఏదైనా బ్రాండ్ ఖాతాకు లింక్ చేయబడి ఉంటే, ఒరిజినల్‌గా మీ ఛానెల్‌ను క్రియేట్ చేసిన ఈమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించి మీరు సైన్ ఇన్ చేయాలి. మీరు ఆ ఈమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించి సైన్ ఇన్ చేయలేకపోతున్నట్లయితే, మా ఖాతా రికవరీ దశలను పూర్తి చేయడానికి చిట్కాలను ఫాలో అయ్యి, మీ ఖాతాను రికవర్ చేసుకోండి.

సైన్ అప్ చేయడానికి 'YouTube కోసం AdSense' నన్ను ఒక వెబ్‌సైట్ URL అందించమని అడుగుతోంది

మీ YouTube ఛానెల్‌కు ఒక కొత్త 'YouTube కోసం AdSense' ఖాతాను లింక్ చేసేటప్పుడు, ఆ కొత్త ఖాతాను క్రియేట్ చేయడం కోసం, google.com/adsense లింక్‌కు గానీ, లేదా adsense.com లింక్‌కు గానీ వెళ్లవద్దు. మీరు అలా చేస్తే, మీ ఖాతా తిరస్కరించబడుతుంది, ఇంకా మీ ఛానెల్‌కు మానిటైజేషన్ డిజేబుల్ చేయబడుతుంది. బదులుగా, నేరుగా YouTube Studio నుండే 'YouTube కోసం AdSense' ఖాతాను క్రియేట్ చేయండి.

ఇతర ఎర్రర్‌లు

ఈ పేజీలో పేర్కొనబడని ఇతర టెక్నికల్ ఎర్రర్‌లను మీరు ఎదుర్కొంటున్నట్లయితే, ఈ కింద పేర్కొన్న దశలను ట్రై చేయండి:

  • బ్రౌజర్ ట్యాబ్‌లన్నింటినీ మూసివేయండి.
  • మీ బ్రౌజర్ కాష్‌ను, కుక్కీలను క్లియర్ చేయండి.
  • ప్రైవేట్ లేదా అజ్ఞాత విండోను ఉపయోగించండి (ఇతర Google ఖాతాలేవీ సైన్ ఇన్ చేసి లేవని నిర్ధారించుకోవడానికి).

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11609212420738280847
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false