మీరు ఎలా మానిటైజ్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి

మేము మరింత మంది క్రియేటర్‌లకు అందుబాటులో ఉండేలా YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)ను విస్తరింపజేస్తున్నాము, దీనితో వారికి ఫ్యాన్ ఫండింగ్, ఇంకా Shopping ఫీచర్‌లకు ముందుగానే యాక్సెస్ లభిస్తుంది. విస్తరించిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ఈ దేశాలు/ప్రాంతాలలో అర్హత ఉన్న క్రియేటర్‌లకు అందుబాటులో ఉంది. ఈ విస్తరణ AE, AU, BR, EG, ID, KE, KY, LT, LU, LV, MK, MP, MT, MY, NG, NL, NO, NZ, PF, PG, PH, PT, QA, RO, RS, SE, SG, SI, SK, SN, TC, TH, TR, UG, VI, VN, and ZAలో అర్హత కలిగిన క్రియేటర్‌లకు వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుంది. YPPలో జరిపిన మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ ఆర్టికల్‌ను చూడండి.

మీరు పై దేశాలు/ప్రాంతాలలో ఒక దానిలో నివసించకపోతే, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు సంబంధించి మీకు ఎలాంటి మార్పులు ఉండవు. మీకు సంబంధించిన YPP ఓవర్‌వ్యూ, అర్హత, దరఖాస్తు సూచనల కోసం మీరు ఈ ఆర్టికల్‌ను చూడవచ్చు.

విస్తరింపజేయబడిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ కోసం మీ అర్హతను చెక్ చేయండి. మీరు అర్హులు కాకపోతే, YouTube Studioలోని Earn ఏరియాలో నోటిఫికేషన్ పొందండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. YPP ప్రోగ్రామ్‌ను మీకు అందుబాటులోకి తెచ్చినప్పుడు, కనీస అర్హతా ప్రమాణాలకు మీరు అనుగుణంగా ఉన్నప్పుడు, మేము మీకు ఒక ఈమెయిల్‌ను పంపుతాము. 

మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో ఉంటే, ఈ కింద పేర్కొన్న మానిటైజేషన్ ఫీచర్‌ల ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు, కాకపోతే వాటికి సంబంధించిన పరిమితులకు, కావాల్సిన అర్హతలకు మీరు అనుగుణంగా ఉండాలి:

ఛానెల్ పరిమితులు మానిటైజేషన్ ఫీచర్‌లు
  • 500 మంది సబ్‌స్క్రయిబర్‌లు ఉండాలి
  • గత 90 రోజులలో 3 పబ్లిక్ వీడియోలు అప్‌లోడ్ అయ్యుండాలి
  • వీటిలో ఏదైనా:
    • గత 365 రోజులలో, నిడివి ఎక్కువ ఉన్న వీడియోలపై వచ్చిన పబ్లిక్ వీక్షణా సమయం 3,000 ఉండాలి
    • గత 90 రోజులలో వచ్చిన పబ్లిక్ Shorts వీక్షణలు 30 లక్షలు ఉండాలి
  • 1,000 మంది సబ్‌స్క్రయిబర్‌లు ఉండాలి
  • వీటిలో ఏదైనా:
    • గత 365 రోజులలో, నిడివి ఎక్కువ ఉన్న వీడియోలపై వచ్చిన పబ్లిక్ వీక్షణా సమయం 4,000 ఉండాలి
    • గత 90 రోజులలో కోటి పబ్లిక్ Shorts వీక్షణలు వచ్చి ఉండాలి

ఒక్కో మానిటైజేషన్ ఫీచర్‌కు కావలసిన అర్హతలు ఒక్కోలా ఉంటాయి. మీకు అర్హత ఉంటే, ఈ ఒక్కొక్క ఫీచర్‌ను ఎలా ఆన్ చేయాలో ఈ ఆర్టికల్ మీకు తెలియజేస్తుంది.

YouTubeలో డబ్బు సంపాదించడంపై పరిచయ వీడియో

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
డబ్బు సంపాదించడానికి గల మార్గాలను యాక్సెస్ చేయడం కోసం మీ YouTube ఛానెల్‌కు మానిటైజేషన్‌ను ఆన్ చేయడానికి కావలసిన దశలన్నింటినీ పూర్తి చేశారని నిర్ధారించుకోండి.

ఆదాయాన్ని సంపాదించడానికి గల మార్గాలను యాక్సెస్ చేయండి

YPPలో చేరిన తర్వాత, సంపాదించడానికి గల మార్గాలను అన్‌లాక్ చేయడానికి, ఏయే ఒప్పంద మాడ్యూల్స్‌కు అయితే పార్ట్‌నర్‌లకు అర్హత ఉంటుందో, ఆ మాడ్యూల్స్‌లో తమకు తగిన వాటిని వారు ఎంచుకోవచ్చు. ఈ విధానం, క్రియేటర్‌లకు మరింత పారదర్శకతను, ఇంకా వారి ఛానెల్‌కు ఏ మానిటైజేషన్ అవకాశాలు సరైనవో నిర్ణయించడంలో ఫోకస్‌ను అందిస్తుంది.

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ప్రతి ఆప్షనల్ మాడ్యూల్‌కు ప్రారంభించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, నియమాలను అంగీకరించండి.

వీక్షణా పేజీ యాడ్‌లు

2023 జనవరి నెల మధ్య నుండి, YPPలో ఇప్పటికే ఉన్న YouTube పార్ట్‌నర్‌లు, వీక్షణా పేజీ నుండి యాడ్ ఆదాయాన్ని సంపాదించడం కొనసాగించడానికి, వీక్షణ పేజీ మానిటైజేషన్ మాడ్యూల్‌ను రివ్యూ చేసి, అంగీకరించవలసి ఉంటుంది.

వీక్షణా పేజీలో మీ వీడియోలకు ముందు, మధ్యలో, తర్వాత, అలాగే మీ వీడియోల చుట్టూ కనిపించే యాడ్‌ల నుండి మీరు ఆదాయాన్ని సంపాదించవచ్చు. YouTube Premium సబ్‌స్క్రయిబర్ వీక్షణా పేజీలో మీ కంటెంట్‌ను చూసినప్పుడు కూడా మీరు ఆదాయాన్ని సంపాదించవచ్చు.

వీక్షణా పేజీ అనేది YouTube, YouTube Music, YouTube Kidsలో నిడివి ఎక్కువ ఉన్న మీ వీడియోల లేదా లైవ్ స్ట్రీమింగ్ వీడియోల వివరణ, ప్లేబ్యాక్‌ను రూపొందించడం కోసం నిర్దేశించి ఉన్న పేజీలను సూచిస్తుంది. వీక్షణా పేజీలోని నిడివి ఎక్కువ ఉన్న వీడియోల నుండి, లేదా లైవ్ స్ట్రీమింగ్ వీడియోల నుండి యాడ్ ఆదాయాన్ని, YouTube Premium ఆదాయాన్ని సంపాదించడానికి, లేదా YouTube వీడియో ప్లేయర్‌లో ఇతర సైట్‌లలో పొందుపరచబడినప్పుడు, మీరు వీక్షణ పేజీ మానిటైజేషన్ మాడ్యూల్‌ను తప్పనిసరిగా అంగీకరించాలి.

Shorts ఫీడ్ యాడ్‌లు

Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించడం వలన, Shorts ఫీడ్‌లోని వీడియోల మధ్యలో వచ్చే యాడ్‌ల నుండి పొందే ఆదాయాన్ని షేర్ చేసుకొనే వీలు మీ ఛానెల్‌కు లభిస్తుంది. మీరు ఈ మాడ్యూల్‌ను అంగీకరించిన తేదీ నుండి Shorts యాడ్‌ల ఆదాయ విభజన ప్రారంభమవుతుంది. Shorts విషయంలో యాడ్‌ల ఆదాయ విభజన ఎలా పని చేస్తుందనే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, మా YouTube Shorts మానిటైజేషన్ పాలసీలను చూడండి.

వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్

వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (అలాగే గతంలో అందుబాటులో ఉన్న వాణిజ్య ప్రోడక్ట్ అనుబంధ ఒప్పందం) ద్వారా మీ ఫ్యాన్స్‌తో కనెక్ట్ అయ్యి ఉంటూనే, మీరు ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌ల నుండి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లలో ఛానెల్ మెంబర్‌షిప్‌లు, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, ఇంకా సూపర్ థ్యాంక్స్ మొదలైనవి ఉంటాయి. ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌ల నుండి ఆదాయాన్ని సంపాదించడానికి, మీరు తప్పనిసరిగా, వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM}ను అంగీకరించి, ఆ తర్వాత ఒక్కో ఫీచర్‌ను ఆన్ చేయాలి. వాణిజ్య ప్రోడక్ట్ అనుబంధ ఒప్పందం (CPA)పై సంతకం చేసిన క్రియేటర్‌లు, కొత్త వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌పై సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లు, వర్తించే పాలసీల గురించి మరింత సమాచారం కోసం, మా YouTube వాణిజ్యపరమైన ప్రోడక్ట్‌ల మానిటైజేషన్ పాలసీలను చూడండి.

వీక్షణా పేజీ యాడ్‌లను ఆన్ చేయండి

మీ వీడియో మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉంటే, మీరు యాడ్‌లను ఆన్ చేయవచ్చు. మీ వీడియోకు అర్హత ఉందో లేదో ఖచ్చితంగా మీకు తెలియకపోతే, ఆ పేజీలోని సొంత సర్టిఫికేషన్ గైడెన్స్‌ను, ఉదాహరణలను చూడండి. యాడ్‌లను ఆన్ చేయడాన్ని ఎంచుకున్నంత మాత్రాన, వీడియోలో యాడ్‌లు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటాయని అర్థం కాదు. ఏవైనా యాడ్‌లు కనిపించడానికి ముందు, వీడియో మా గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉందో లేదో చూడటానికి ఆటోమేటెడ్ లేదా మానవ రివ్యూలతో సహా స్టాండర్డ్ ప్రాసెస్ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది.

YouTubeలో వీడియోలకు యాడ్‌లను ఆన్ చేయడం ద్వారా, ఆ వీడియోల విజువల్, ఆడియో అంశాలపై మీకు అవసరమైన అన్ని హక్కులు ఉన్నాయని మీరు నిర్ధారిస్తున్నారు.

విడివిడిగా ఒక్కో వీడియోకు యాడ్‌లను ఆన్ చేయండి

 మీరు ఇప్పటికే అప్‌లోడ్ చేసిన వీడియో కోసం యాడ్‌లను ఆన్ చేయడానికి:

  1. YouTube Studioకు వెళ్లండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్ ను ఎంచుకోండి.
  3. సంబంధిత వీడియోకు పక్కన ఉన్న, మానిటైజేషన్ ను క్లిక్ చేయండి.
  4. మానిటైజేషన్ డ్రాప్‌డౌన్‌లో ఆన్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

పలు వీడియోల కోసం యాడ్‌లను ఆన్ చేయండి

మీరు ఇప్పటికే అప్‌లోడ్ చేసిన పలు వీడియోలకు యాడ్‌లను ఆన్ చేయడానికి:

  1. YouTube Studioకు వెళ్లండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్ ను ఎంచుకోండి.
  3. మీరు ఏ వీడియోను అయితే మానిటైజ్ చేయాలనుకుంటున్నారో, ఆ వీడియోకు సంబంధించిన థంబ్‌నెయిల్‌కు ఎడమ వైపున ఉన్న బూడిద రంగు బాక్స్‌ను ఎంచుకోండి.
  4. మీ వీడియో లిస్ట్ పైన ఉన్న నలుపు రంగు బార్‌లోని ఎడిట్ చేయండి డ్రాప్‌డౌన్ ఆ తర్వాత మానిటైజేషన్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మానిటైజేషన్ డ్రాప్‌డౌన్‌లో ఆన్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మధ్యలో వచ్చే యాడ్‌లకు సంబంధించిన యాడ్ సెట్టింగ్‌లను బల్క్‌లో మార్చడానికి: యాడ్ సెట్టింగ్‌లను ఆ తర్వాత ఎడిట్ చేయండి ఆ తర్వాతని క్లిక్ చేసి, “వీడియో మధ్యలో యాడ్‌లను ప్రదర్శించండి (మధ్యలో వచ్చే యాడ్)” అనే ఆప్షన్‌కు పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకుని, ఆటోమేటిక్‌గా మధ్యలో వచ్చే యాడ్‌లను మీరు యాడ్ బ్రేక్‌లు లేని వీడియోలకు కావాలనుకుంటున్నారో లేదా అన్ని వీడియోలకు కావాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  6. వీడియోలను అప్‌డేట్ చేయండి ఆ తర్వాత “ఈ చర్యకు సంబంధించిన పరిణామాలను నేను అర్థం చేసుకున్నాను” పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి ఆ తర్వాత వీడియోలను అప్‌డేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Shorts ఫీడ్ యాడ్‌లను ఆన్ చేయండి

యాడ్‌లతో మానిటైజ్ చేసే కంటెంట్ అంతా తప్పనిసరిగా మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి. Shortsలో, మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అయ్యే కంటెంట్‌కు సంబంధించిన వీక్షణలు మాత్రమే ఆదాయ షేరింగ్‌కు అర్హత పొందుతాయి. Shorts ఫీడ్‌లోని వీడియోల మధ్యలో వచ్చే యాడ్‌ల నుండి పొందే ఆదాయాన్ని షేర్ చేయడానికి, YouTube Studioలోని సంపాదించండి విభాగంలో ఉండే Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను రివ్యూ చేసి అంగీకరించండి.​​​​​​

ఛానెల్ మెంబర్‌షిప్‌లను ఆన్ చేయండి

నెలవారీ పేమెంట్‌ల ద్వారా మీ ఛానెల్‌లో చేరే వెసులుబాటును వీక్షకులకు ఛానెల్ మెంబర్‌షిప్‌ల సదుపాయం కల్పిస్తుంది, దీని ద్వారా వారు బ్యాడ్జ్‌లు, ఎమోజీలు, ఇతర వస్తువుల వంటి మెంబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే పెర్క్‌లకు యాక్సెస్ పొందుతారు. ఛానెల్ మెంబర్‌షిప్‌లను ఆన్ చేయడం ఎలా అనే దాని గురించి, అలాగే వాటికి అర్హత గురించి మరింత తెలుసుకోండి.

Shoppingను ఆన్ చేయండి

Shopping సహాయంతో క్రియేటర్‌లు, తమ స్టోర్‌ను YouTubeకు కనెక్ట్ చేసి, తమ ప్రోడక్ట్‌లను ప్రదర్శించగలరు, అదే సమయంలో వారికి డబ్బు సంపాదించే వీలు కూడా లభిస్తుంది. మీకు అర్హత ఉంటే, మీ కంటెంట్‌లో మీరు ఇతర బ్రాండ్‌లకు చెందిన ప్రోడక్ట్‌లను కూడా ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. Shoppingకు అర్హత గురించి, అలాగే అది ఎలా పని చేస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

సూపర్ చాట్‌ను, సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయండి

సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అనేవి లైవ్ స్ట్రీమ్‌లు, ప్రీమియర్‌ల సమయంలో క్రియేటర్‌లను ఫ్యాన్స్‌తో కనెక్ట్ చేసే మార్గాలు. ఫ్యాన్స్ లైవ్ చాట్‌లో వారి మెసేజ్‌ను హైలైట్ చేయడానికి సూపర్ చాట్‌లను కొనుగోలు చేయవచ్చు, లేదా లైవ్ చాట్‌లో కనిపించే యానిమేటెడ్ ఇమేజ్‌ను పొందడానికి సూపర్ స్టిక్కర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. సూపర్ చాట్‌కు, సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయడానికి కావాల్సిన అర్హత గురించి, అలాగే వాటిని ఆన్ చేయడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయండి

సూపర్ థ్యాంక్స్ అనేది క్రియేటర్‌లకు తమ వీడియోల పట్ల అదనపు కృతజ్ఞత చూపాలనుకునే వీక్షకుల నుండి ఆదాయాన్ని సంపాదించే వీలు కల్పిస్తుంది. ఫ్యాన్స్ ఒకసారికి మాత్రమే ఉపయోగించగల యానిమేషన్‌ను కొనుగోలు చేయవచ్చు, అలాగే వీడియోలోని కామెంట్‌ల విభాగంలో భిన్నమైన, రంగురంగుల, అనుకూలంగా మార్చదగిన కామెంట్‌ను పోస్ట్ చేయవచ్చు. సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయడానికి అర్హత గురించి, అలాగే సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

YouTube Premium ఆదాయాన్ని ఆన్ చేయండి

YouTube Premiumకు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న వీక్షకులు మీ కంటెంట్‌ను చూస్తుంటే, వారు YouTube Premium కోసం పే చేసే ఫీజులో కొంత భాగాన్ని మీరు పొందుతారు. మీరు పోస్ట్ చేసే కంటెంట్ అంతటికీ (మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండే కంటెంట్‌కు) YouTube Premium ఆదాయాన్ని పొందే అర్హత ఉంటుంది. ఈ కింద ఉన్న వాటి విషయంలో, YouTube Premium ఆదాయాన్ని సంపాదించడానికి:

  • నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు: వీక్షణ పేజీ మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించి, వీక్షణా పేజీ యాడ్‌లను ఆన్ చేయండి
  • షార్ట్‌లు: Shorts ఫీడ్ మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించండి

YouTube Premium గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7500949920125441223
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false