YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌

YouTubeను ఉపయోగించడం ద్వారా, మీరు ప్రపంచ నలుమూలల్లో ఉండే వ్యక్తుల కమ్యూనిటీలో చేరుతున్నారు. దిగువున పేర్కొన్న గైడ్‌లైన్స్ YouTubeను అందరికీ సరదాగా, వినోదాత్మకంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఏదైనా కంటెంట్ ఈ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘిస్తోందని మీరు భావిస్తే, దాన్ని రిపోర్ట్ చేయండి.

కొన్నిసార్లు, మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను కంటెంట్ ఉల్లంఘించినప్పటికీ, విద్యాపరమైన, డాక్యుమెంటరీ, శాస్త్రీయ, లేదా కళాత్మక (EDSA) సందర్భాన్ని కలిగి ఉన్నప్పుడు, అది YouTubeలోనే ఉంచబడవచ్చు. ఇటువంటి సందర్భాలలో, కంటెంట్ EDSA మినహాయింపును పొందుతుంది.

ఈ పాలసీలు మీ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న అన్ని రకాల కంటెంట్‌కు వర్తిస్తాయి, ఉదాహరణకు, అన్‌లిస్టెడ్, ప్రైవేట్ కంటెంట్, కామెంట్‌లు లింక్‌లు, కమ్యూనిటీ పోస్ట్‌లు, థంబ్‌నెయిల్స్ మొదలైనవి. ఈ లిస్ట్‌లో పేర్కొన్న వాటికే కాక ఇతర కంటెంట్ రకాలకు కూడా ఈ నియమాలు వర్తిస్తాయి.

తెలివిగా వ్యవహరించి క్రియేట్ చేయడం: YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

స్పామ్, ఇంకా మోసపూరిత పద్ధతులు

YouTube కమ్యూనిటీ, నమ్మకం అనే పునాది మీద నిర్మించబడింది. స్కామ్, తప్పుదారి పట్టించడం, స్పామ్, లేదా ఇతర యూజర్‌లను మోసగించడం వంటి వాటిని చేసే ఉద్దేశంతో రూపొందించిన కంటెంట్ YouTubeలో అనుమతించబడదు.

గోప్యమైన కంటెంట్ 

వీక్షకులు, క్రియేటర్‌లు, ముఖ్యంగా మైనర్‌లను రక్షించాలని మేము ఆశిస్తున్నాము. అందువల్లనే చిన్నారులను సురక్షితంగా ఉంచడం, సెక్స్, నగ్నత్వం, ఇంకా స్వీయ హానికి సంబంధించిన నియమాలను మేము రూపొందించాము. YouTubeలో ఏది అనుమతించబడుతుందో తెలుసుకోండి, అలాగే ఈ పాలసీలను ఫాలో అవ్వని కంటెంట్ మీకు కనిపిస్తే ఏమి చేయాలో తెలుసుకోండి.

హింసాత్మక లేదా ప్రమాదకరమైన కంటెంట్

విద్వేషాలు పెంచే కంటెంట్, మోసపూరిత ప్రవర్తన, స్పష్టంగా చూపే హింస, హానికరమైన దాడులు, హానికరమైన లేదా ప్రమాదకరమైన ప్రవర్తనను ప్రమోట్ చేసే కంటెంట్ YouTubeలో అనుమతించబడదు.

నియంత్రిత వస్తువులు

కొన్ని వస్తువులను YouTubeలో అమ్మలేరు. దేనికి అనుమతి ఉందో—దేనికి అనుమతి లేదో తెలుసుకోండి.

తప్పు సమాచారం

అసాధారణ స్థాయిలో హాని కలిగించే తీవ్రమైన రిస్క్ ఉన్న కొన్ని రకాల తప్పుదారి పట్టించే లేదా మోసపూరిత కంటెంట్‌ YouTubeలో అనుమతించబడదు. ఏ రకాల తప్పుడు సమాచారం వల్ల అయితే వాస్తవ ప్రపంచంలో నిజంగానే హాని కలిగే అవకాశం ఉందో, ఆ రకాలు ఈ కోవకు చెందుతాయి, ఉదాహరణకు, హానికరమైన నివారణోపాయాలు లేదా చికిత్సలను ప్రమోట్ చేసే కంటెంట్, సాంకేతికపరంగా దురుద్దేశంతో మార్చబడిన కొన్ని రకాల కంటెంట్ లేదా ప్రజాస్వామ్య ప్రాసెస్‌లకు ఆటంకం కలిగించే కంటెంట్.

 

విద్యాపరమైన, డాక్యుమెంటరీ, శాస్త్రీయ, లేదా కళాత్మక (EDSA) కంటెంట్

YouTubeను సురక్షితమైన కమ్యూనిటీగా తయారు చేయడమే మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ లక్ష్యం. కొన్నిసార్లు, మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను కంటెంట్ ఉల్లంఘించినప్పటికీ, విద్యాపరమైన, డాక్యుమెంటరీ, శాస్త్రీయ, లేదా కళాత్మక (EDSA) సందర్భాన్ని కలిగి ఉన్నప్పుడు, అది YouTubeలోనే ఉంచబడవచ్చు. ఇటువంటి సందర్భాలలో, కంటెంట్ EDSA మినహాయింపును పొందుతుంది. 

YouTube పాలసీలు, గైడ్‌లైన్స్ కోసం క్రియేటర్ చిట్కాలను పొందండి.

దయచేసి ఈ నియమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. YouTube క్రియేటర్ యొక్క ప్రవర్తన - అది ఈ ప్లాట్‌ఫామ్‌లోపలైనా మరియు/లేదా వెలుపల అయినా - మా యూజర్‌లు, కమ్యూనిటీ, ఉద్యోగులు లేదా ఎకోసిస్టమ్‌కు హాని కలిగిస్తున్నట్లయితే, వీటికే పరిమితం కాకుండా వారి చర్యల తీవ్రత, వారిలో ఏదైనా హానికరమైన ప్రవర్తనల అలవాటు ఉందా లేదా అన్న విషయం వంటి అనేక అంశాల ఆధారంగా మేము ప్రతిస్పందించవచ్చు. మా ప్రతిస్పందన అనేది క్రియేటర్ అధికారాలను సస్పెండ్ చేయడం నుండి ఖాతాను రద్దు చేయడం వరకు ఉంటుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13031908080732370466
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false