YouTube పార్ట్‌నర్ నికర ఆదాయ ఓవర్‌వ్యూ

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా, రష్యాలోని యూజర్లకు Google యాడ్‌లను, YouTube యాడ్‌లను అందించడాన్ని మేము తాత్కాలికంగా పాజ్ చేయనున్నాము. మరింత తెలుసుకోండి.

ఈ పేజీలోని సమాచారం YouTubeలో కంటెంట్‌ను మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌ల కోసం ఉద్దేశించింది. ఈ క్రియేటర్లలోకి YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉన్న వారు కూడా వస్తారు.

క్రియేటర్‌లకు, వారి కంటెంట్‌ను YouTubeలో మానిటైజ్ చేసుకొనే వెసులుబాటును YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ అందిస్తుంది. క్రియేటర్‌లు, వారి వీడియోల్లో వచ్చే యాడ్ల ద్వారా నికర ఆదాయాన్ని షేరింగ్ ప్రాతిపదికన అందుకోగలరు, లేదా పలు రకాల ఇతర మానిటైజేషన్ ఫీచర్‌లను ఉపయోగించడం ద్వారా ఇదే పద్ధతిలో ఆదాయాన్ని పొందగలరు. మీ సంపాదన ఆదాయంగా ఎలా మారుతుంది, మీరు పేమెంట్‌ను ఎలా పొందుతారు, అలాగే మీరు పేమెంట్‌ను ఎప్పుడు పొందుతారు అనే అంశాల గురించి అర్థం చేసుకోవడానికి ఈ పేజీని ఉపయోగించండి.

నేను ఆదాయాన్ని ఎలా సంపాదించగలను?

యాడ్ నికర ఆదాయం

మీరు మీ ఛానెల్‌ను మానిటైజేషన్ కోసం ఎనేబుల్ చేసినప్పుడు, Google నుండి, దాని పార్ట్‌నర్‌ల నుండి మీ వీడియోలకు వచ్చే యాడ్‌లు ఆన్ అవుతాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని షేరింగ్ ప్రాతిపదికన అందుకోగలరు.
 
మీకు ఎంత పేమెంట్ అందుతుందనే విషయంలో గానీ లేదా మీకు పేమెంట్ అందుతుందా, లేదా అనే విషయంలో గానీ, YouTube పార్ట్‌నర్ ఒప్పందం కింద ఎటువంటి హామీ ఇవ్వబడదు. వీక్షకులు మీ వీడియోను చూసినప్పుడు జెనరేట్ అయ్యే యాడ్ నికర ఆదాయంలోని షేర్ ఆధారంగా ఆదాయం జెనరేట్ అవుతుంది. మీరు మానిటైజ్ చేసే వీడియోలలో యాడ్‌లు ఎలా ప్రదర్శించబడతాయి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ఇతర మానిటైజేషన్ ఫీచర్‌లు

ఛానెల్ మెంబర్‌షిప్‌లు, Shopping, సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్, YouTube Premium సబ్‌స్క్రిప్షన్‌ల వంటి ఇతర మానిటైజేషన్ ఫీచర్‌ల నుండి కూడా మీరు ఆదాయాన్ని సంపాదించవచ్చు. YouTubeలో డబ్బు సంపాదించడానికి అవకాశం ఉన్న అన్ని మార్గాల గురించి మరింత తెలుసుకోండి.
ఆదాయంలో నా షేర్ ఎంత?

ఆదాయ (రెవిన్యూ) షేరింగ్ అనేది, YouTubeతో మీరు చేసుకున్న నిర్దిష్ట పార్ట్‌నర్ ఒప్పందంలో వివరించినట్లుగా స్థూల ఆదాయ శాతాన్ని (గ్రాస్‌ రెవిన్యూలో పర్సెంటేజీని) సూచిస్తుంది. మీ ఆదాయ షేరింగ్ గురించి నిర్దిష్ట వివరాల కోసం మీ ఒప్పందాలను రివ్యూ చేయవచ్చు:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి
  2. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లు ను ఎంచుకోండి
  3. ఒప్పందాలు ఆప్షన్‌ను ఎంచుకోండి
  4. మీ ఆదాయ షేరింగ్ గురించి వివరాలను తెలుసుకోవడానికి, ప్రతి ఒప్పందం పక్కన ఉన్న ఒప్పందాన్ని చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి

మీ ఒప్పందాలను ఎక్కడ చూడాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

గమనిక: సేల్స్ ట్యాక్స్, VAT, GST మొదలైన లావాదేవీల ట్యాక్స్‌లు Googleకు ఆదాయం కాదు, అవి పార్ట్‌నర్ ఆదాయ షేరింగ్ లెక్కింపులో చేర్చబడలేదు.

ఆదాయ షేరింగ్ రేట్‌లు

నిర్దిష్ట మాడ్యూల్స్ YouTube Studioలో అందుబాటులో ఉంటాయి, పార్ట్‌నర్లు వాటిని ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. ప్రతి మాడ్యూల్‌కు సంబంధించిన నియమాలను రివ్యూ చేస్తున్నప్పుడు, పార్ట్‌నర్‌లు ఆదాయ షేరింగ్ రేట్‌ల వివరాల గురించి మరింత తెలుసుకోవచ్చు.

వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్

వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌ను రివ్యూ చేసి, అంగీకరించడం ద్వారా ఒక పార్ట్‌నర్‌, ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లను ఆన్ చేస్తే, YouTube వారికి, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్‌లు, సూపర్ థాంక్స్ ద్వారా వచ్చే నికర ఆదాయంలో 70% పేమెంట్ చేస్తుంది.

వీక్షణ పేజీ మానిటైజేషన్ మాడ్యూల్

పార్ట్‌నర్, వీక్షణ పేజీ మానిటైజేషన్ మాడ్యూల్‌ను రివ్యూ చేసి, దానిని అంగీకరించి వీక్షణా పేజీ యాడ్స్‌ను ఆన్ చేసినప్పుడు, పార్ట్‌నర్ కంటెంట్ వీక్షణా పేజీలో ఉండే పబ్లిక్ వీడియోలలో యాడ్స్‌ డిస్‌ప్లే అవుతాయి లేదా స్ట్రీమ్ చేయబడతాయి. ఆ యాడ్‌ల నుండి పొందిన నికర ఆదాయాల్లో YouTube ఆ పార్ట్‌నర్‌కు 55% పేమెంట్ చేస్తుంది. పార్ట్‌నర్ పబ్లిక్ వీడియోలు, ఇతర వెబ్‌సైట్‌లలో లేదా అప్లికేషన్‌లలో ఉన్న YouTube వీడియో ప్లేయర్‌లో స్ట్రీమ్ అయినప్పుడు కూడా ఈ ఆదాయ షేరింగ్ రేట్ వర్తిస్తుంది. 

Shorts మానిటైజేషన్ మాడ్యూల్

పార్ట్‌నర్, Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను రివ్యూ చేసి, దాన్ని అంగీకరించి "Shorts ఫీడ్ యాడ్స్‌"ను ఆన్ చేసి ఉంటే, 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి (పూల్)' కేటాయింపులో ఉన్న వీక్షణల వాటా ఆధారంగా ఆదాయంలో 45% మొత్తాన్ని పార్ట్‌నర్‌కు YouTube పేమెంట్ చేస్తుంది. 

నా నికర ఆదాయాన్ని నేను ఎక్కడ చూడగలను?

YouTube ఎన‌లిటిక్స్

మీరు YouTube ఎన‌లిటిక్స్‌ను ఉపయోగించి మీ అంచనా వేసిన YouTube ఆదాయాన్ని చెక్ చేయవచ్చు.

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, ఎనలిటిక్స్‌ను ఎంచుకోండి.
  3. ఎగువ మెనూలో, ఆదాయం ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఈ వీక్షణలో, మీరు మీ ఆదాయానికి సంబంధించిన వివిధ రకాల రాబడి రిపోర్ట్‌లను చూడవచ్చు. మీ ఆదాయాన్ని చెక్ చేయడానికి YouTube ఎన‌లిటిక్స్‌ను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.

నెలవారీ అంచనా వేసిన ఆదాయం

YouTube ఎన‌లిటిక్స్‌లో కనిపించే నెలవారీ అంచనా ఆదాయం హెచ్చుతగ్గులకు లోను అయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకోండి:

చెల్లని ట్రాఫిక్, కంటెంట్ ID క్లెయిమ్‌లు, వివాదాల కారణంగా లేదా కొన్ని యాడ్ క్యాంపెయిన్ రకాల (ఉదా. రోజుకు ధరతో కూడిన క్యాంపెయిన్‌లు) కారణంగా నెలవారీ అంచనా వేసిన ఆదాయం సర్దుబాట్లకు లోబడి ఉంటుంది. మీ నెలవారీ అంచనా వేసిన ఆదాయంలో హెచ్చుతగ్గులు కనిపిస్తే, అది ఆ సర్దుబాట్ల వల్ల కావచ్చు. ఆదాయం జెనరేట్ అయిన తర్వాత రెండు సార్లు సర్దుబాట్లు జరుగుతాయి: 1 వారం తర్వాత (మరింత పూర్తి అంచనాను ఇస్తుంది), అలాగే తర్వాతి నెల మధ్యలో మీ తుది నికర ఆదాయాన్ని అందిస్తుంది.

YouTube కోసం AdSense

మీ తుది నికర ఆదాయం మీ 'YouTube కోసం AdSense' ఖాతాలో మాత్రమే కనిపిస్తుంది. మునుపటి నెలకు సంబంధించిన తుది నికర ఆదాయం, ప్రతి నెలలో 7, 12 తేదీల మధ్య మీ 'YouTube కోసం AdSense' ఖాతా బ్యాలెన్స్‌కు జోడించబడుతుంది.

మీ YouTube కోసం AdSense ఖాతాలో మీ తుది నికర ఆదాయాన్ని మీరు కనుగొనవచ్చు.

  1. మీ 'YouTube కోసం AdSense' ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపున, సెట్టింగ్‌లు ఆ తర్వాత పేమెంట్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు ఎంచుకున్న సమయ వ్యవధి, మీ చివరి లావాదేవీలకు సంబంధించిన మీ మొత్తం ఆదాయాన్ని చూస్తారు.

ట్యాక్స్ విత్‌హోల్డింగ్ మీ తుది నికర ఆదాయంపై ప్రభావం చూపవచ్చు (ఏదైనా వర్తిస్తే), అలాగే విత్‌హోల్డ్ చేయబడిన మొత్తం మీ 'YouTube కోసం AdSense' ఖాతాలో మాత్రమే కనిపిస్తుంది.

నా ఆదాయానికి ట్యాక్స్ వర్తిస్తుందా?
గమనిక: YouTube, Googleలు ట్యాక్స్ సమస్యలకు సంబంధించి మీకు సలహా ఇవ్వలేవు. మీ ట్యాక్స్ పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి ట్యాక్స్ నిపుణులను సంప్రదించండి.

U.S. ట్యాక్స్ సంబంధిత ఆవశ్యకతలు 

U.S.లోని వీక్షకుల నుండి మీరు జెనరేట్ చేసే ఆదాయంపై ట్యాక్స్‌లను Google విత్‌హోల్డ్ చేస్తుంది. మీరు ఇంకా 'YouTube కోసం AdSense' ఖాతాలో మీ U.S. ట్యాక్స్ సమాచారాన్ని సమర్పించకపోతే, ఇప్పుడు చేయండి, తద్వారా Google మీకు సంబంధించి సరైన మినహాయింపు ధరను నిర్ణయించగలుగుతుంది. ట్యాక్స్ సమాచారాన్ని అందించకపోతే, Google గరిష్ఠ రేట్‌ను విత్‌హోల్డ్ చేయవచ్చు.
 
మానిటైజ్ చేసే క్రియేటర్‌లందరూ, ప్రపంచంలో వారి లొకేషన్‌తో సంబంధం లేకుండా, U.S. ట్యాక్స్ సమాచారాన్ని సమర్పించడం అవసరం. కొత్త 'YouTube కోసం AdSense' ఖాతాలతో కొత్త పార్ట్‌నర్‌లు తమ మొదటి పేమెంట్‌లను పొందడానికి ముందు కూడా ట్యాక్స్ సమాచారాన్ని అందించడం అవసరం. YouTube ఆదాయానికి సంబంధించి U.S. ట్యాక్స్ ఆవశ్యకతలు, అలాగే Googleకు U.S. ట్యాక్స్ సమాచారాన్ని సమర్పించడం గురించి మరింత తెలుసుకోండి.

ఇతర ట్యాక్స్ బాధ్యత

YouTubeలో మీ మానిటైజ్ చేయబడిన వీడియోల ద్వారా సంపాదించిన ఏదైనా ఆదాయానికి సంబంధించి మీ నివాసిత దేశానికి లేదా ప్రాంతానికి ట్యాక్స్‌లు పే చేయాల్సిన బాధ్యత మీ పైన ఉండవచ్చని గుర్తుంచుకోండి. వివరణాత్మక గైడెన్స్ కోసం మీ లోకల్ ట్యాక్స్ అధికారులను సంప్రదించండి.

నేను పేమెంట్‌ను ఎలా పొందగలను?
YouTubeలో పేమెంట్‌ను పొందడానికి, మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో మెంబర్ కావాలి. పేమెంట్‌ను మొదటిసారి పొందుతున్నట్లయితే, ఒక కొత్త 'YouTube కోసం AdSense' ఖాతాను క్రియేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది.

YouTube కోసం AdSense

మీరు YouTube ద్వారా పొందిన నికర ఆదాయాన్ని ప్రధాన పేమెంట్ పద్ధతి అయిన 'YouTube కోసం AdSense' ద్వారా మీకు పే చేయడం జరుగుతుంది. 'YouTube కోసం AdSense' అనేది Google వారి ప్రోగ్రామ్, దీని ద్వారా మానిటైజ్ చేసే YouTube క్రియేటర్‌లు డబ్బు సంపాదించవచ్చు, అలాగే పేమెంట్‌ను పొందవచ్చు. 

ఉపయోగకరమైన రిసోర్స్‌లు

మల్టీ ఛానెల్ నెట్‌వర్క్‌లు (MCN)

మల్టీ ఛానల్ నెట్‌వర్క్‌లతో (MCN) పార్ట్‌నర్‌గా ఉన్న అనుబంధ ఛానెల్స్‌కు పేమెంట్‌లు YouTube ద్వారా నిర్వహించబడవు, కానీ MCN ద్వారా నేరుగా దాని అనుబంధ ఛానెల్స్‌కు పేమెంట్‌లు చేయబడతాయి. MCNకు YouTube పేమెంట్‌ను జారీ చేస్తుంది, అలాగే వారి అనుబంధ ఛానెల్స్‌కు పేమెంట్‌ను జారీ చేయడానికి MCN బాధ్యత వహిస్తుంది. దీని కోసం పేమెంట్ టైమ్‌లైన్ అన్ని ఇతర మానిటైజ్ చేసే ఛానెల్స్ మాదిరిగానే ఉంటుంది (పేమెంట్ టైమ్‌లైన్‌లను చూడండి). ప్రతి MCN, వారి అనుబంధ ఛానెల్స్‌కు పేమెంట్‌లను నిర్ణయించేటప్పుడు, వారి సంబంధిత అనుబంధ ఛానెల్స్‌కు సంబంధించిన విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌ను (ఒకవేళ ఏదైనా వర్తిస్తే) లెక్కించడానికి అనుమతించే రిపోర్ట్‌కు యాక్సెస్‌ను కలిగి ఉంటుంది.

షాపింగ్ పేమెంట్స్

మీ ఛానెల్ స్టోర్‌లోని సేల్స్‌కు సంబంధించిన పేమెంట్‌ను పొందడానికి, మీరు నేరుగా మీ అధికారిక అమ్మకపు వస్తువుల రిటైలర్ లేదా ప్లాట్‌ఫామ్ నుండి పేమెంట్స్‌ను పొందుతారు. YouTubeలో షాపింగ్ గురించి మరింత తెలుసుకోండి. YouTube Shopping అనుబంధ ప్రోగ్రామ్ ద్వారా, వీక్షకుల కంటెంట్‌లో ఫీచర్ అయ్యి ఉండే, థర్డ్-పార్టీ వ్యాపారులకు చెందిన ప్రోడక్ట్‌లను, వారు డైరెక్ట్ లింక్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే, అర్హతగల క్రియేటర్‌లకు కూడా కమీషన్ అందుతుంది. 
నేను పేమెంట్‌ను ఎప్పుడు పొందుతాను?

పేమెంట్ టైమ్‌లైన్‌లు

మునుపటి నెలకు సంబంధించిన తుది YouTube నికర ఆదాయం ప్రస్తుత నెల 7 నుండి 12వ తేదీల మధ్య 'YouTube కోసం AdSense'లో మీ YouTube పేమెంట్ ఖాతా బ్యాలెన్స్‌కు జోడించబడుతుంది. ఉదాహరణకు, మీరు యునైటెడ్ స్టేట్స్‌లో ఉండి, జూన్‌లో మీరు $100 సంపాదిస్తే, మీరు ఈ బ్యాలెన్స్‌ను జూలై 7-12 తేదీల మధ్య చూస్తారు.
మీ మొత్తం బ్యాలెన్స్ కనిష్ఠ పేమెంట్ పరిమితికి చేరుకొని, మీ వద్ద పేమెంట్ హోల్డ్స్ ఏవీ లేకపోతే, ప్రస్తుత నెలలో 21-26 తేదీల మధ్య నికర ఆదాయాన్ని పే చేయడం జరుగుతుంది. మీరు ఈ సమయంలో ఏవైనా వర్తించే పన్ను డిడక్షన్‌లను కూడా చూడవచ్చు. 
సంక్షిప్తంగా, కింది ప్రమాణాలు నెరవేరినప్పుడు మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది:
'YouTube కోసం AdSense' విషయంలో పేమెంట్ టైమ్‌లైన్‌ల గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4613809463090138518
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false