YouTube విరాళం FAQలు

క్రియేటర్‌లు తాము చేయూతనందించే స్వచ్ఛంద సంస్థలకు సపోర్ట్ చేయడానికి YouTube విరాళం అనుమతిస్తుంది. అర్హత గల ఛానెల్స్ తమ వీడియోలు, అలాగే లైవ్ స్ట్రీమ్‌లకు 'విరాళం' బటన్‌ను జోడించడం ద్వారా లాభాపేక్ష రహిత సంస్థల కోసం నిధుల సమీకరణ చేయవచ్చు. వీక్షకులు నేరుగా వీడియో వీక్షణా పేజీ లేదా లైవ్ చాట్‌లో విరాళం అందించవచ్చు.

క్రియేటర్ & నిధుల సమీకరణ FAQలు

YouTube విరాళం కోసం నిధుల సమీకరణ చేయడానికి ఎవరు అర్హులు?

'విరాళం' నిధుల సమీకరణను సెటప్ చేయడానికి, మీ ఛానెల్ కింది అవసరాలకు అనుగుణంగా ఉండాలి:

గమనిక: పైన పేర్కొన్న అర్హత ప్రమాణాలను పాటించని కొన్ని ఛానెల్స్‌లో నిధుల సమీకరణ చేయడాన్ని మీరు చూడవచ్చు. భవిష్యత్తులో YouTube విరాళం మరింత విస్తృతంగా అందుబాటులో ఉండేలా మేము ప్లాన్ చేస్తున్నాము.

ఏయే దేశాలు/ప్రాంతాలు YouTube విరాళ నిధుల సమీకరణను సెటప్ చేయగలవు?

మీరు కింద పేర్కొన్న దేశాలు/ప్రాంతాలలో ఉన్నట్లయితే, మీరు YouTube విరాళ నిధుల సమీకరణను సెటప్ చేయవచ్చు.

  • అర్జెంటీనా
  • ఆస్ట్రియా
  • బెల్జియం
  • బొలీవియా
  • కెనడా
  • కొలంబియా
  • క్రొయేషియా
  • ఎస్టోనియా
  • ఫ్రాన్స్
  • జర్మనీ
  • ఘనా
  • హాంకాంగ్
  • ఐస్‌లాండ్
  • ఇండోనేషియా
  • ఐర్లాండ్
  • ఇజ్రాయిల్
  • ఇటలీ
  • కువైట్
  • లాట్వియా
  • లిథువేనియా
  • లక్సెంబర్గ్
  • మలేషియా
  • మెక్సికో
  • మాంటెనీగ్రో
  • నెదర్లాండ్స్
  • న్యూజిలాండ్
  • నార్వే
  • పెరూ
  • ఫిలిప్పీన్స్
  • పోలాండ్
  • ప్యూర్టోరికో
  • రొమేనియా
  • స్లొవేకియా
  • స్పెయిన్
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • థాయ్‌లాండ్
  • టర్కీ
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • USA

నాకు YouTube విరాళం యాక్సెస్ ఉందని నేను చూశాను. నేను దీన్ని ఎలా సెటప్ చేయాలి?

నేను నిధుల సమీకరణను క్రియేట్ చేసిన తర్వాత నాకు 'విరాళం' బటన్ కనిపించకపోతే ఏమి చేయాలి?

మీ నిధుల సమీకరణలో 'విరాళం' బటన్ కనిపించకపోవడానికి కొన్ని కారణాలు కింద ఉన్నాయి:
  • మీరు YouTube విరాళ నిధుల సమీకరణను సెటప్ చేశారని నిర్ధారించుకోండి.
  • నిధుల సమీకరణకు ప్రారంభ తేదీ ఉన్నట్లయితే, నిధుల సమీకరణ ప్రారంభ తేదీ తర్వాత 'విరాళం' బటన్ మీ వీక్షణా పేజీలో లేదా లైవ్ చాట్‌లో కనిపిస్తుంది.
  • మీరు లైవ్ స్ట్రీమ్‌లో నిధుల సమీకరణను చేస్తున్నట్లయితే అలాగే లైవ్ చాట్ ఆన్ చేయబడి ఉంటే, మొబైల్‌లోని చాట్‌లో మీకు 'విరాళం' బటన్ కనిపిస్తుంది. లైవ్ చాట్‌ను చూడటానికి మొబైల్ పరికరాలు తప్పనిసరిగా పోర్ట్రెయిట్ మోడ్‌లో ఉండాలి. లైవ్ చాట్ విరాళాల గురించి మరింత తెలుసుకోండి.
  • మీరు మీ వీడియో లేదా ఛానెల్‌ను "పిల్లల కోసం రూపొందించబడింది" అని సెట్ చేస్తే, 'విరాళం' బటన్ తీసివేయబడుతుంది. 

కమ్యూనిటీ నిధుల సేకరణ కార్యక్రమాలు అంటే ఏమిటి?

కమ్యూనిటీ నిధుల సేకరణ కార్యక్రమం అనేది అదే స్వచ్ఛంద సంస్థ కోసం నిధులను సమీకరించడానికి ఇతర క్రియేటర్‌లతో సహకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కమ్యూనిటీ నిధుల సేకరణ కార్యక్రమాన్ని క్రియేట్ చేయడం లేదా అందులో చేరడం ఎలాగో తెలుసుకోండి.

సూపర్ చాట్ ఫర్ గుడ్‌కు ఏమైంది?

సూపర్ చాట్ ఫర్ గుడ్ అనేది ఇప్పుడు లైవ్ చాట్ విరాళాలు. క్రియేటర్‌లు ఇప్పటికీ తమ లైవ్ స్ట్రీమ్‌లలో నిధుల సమీకరణలను హోస్ట్ చేయవచ్చు, అలాగే వీక్షకులు ఇప్పటికీ నేరుగా చాట్ విండో నుండి విరాళం అందించవచ్చు. గందరగోళాన్ని నివారించడానికి విరాళాలు ఉన్న లైవ్ స్ట్రీమ్‌ల కోసం సూపర్ చాట్ అలాగే సూపర్ స్టిక్కర్స్ ఆఫ్ చేయబడతాయి. వీక్షకుల యాక్టివిటీ విడ్జెట్‌తో మీరు లైవ్ కంట్రోల్ పేజీలో వీక్షకుల విరాళాలను పర్యవేక్షించవచ్చు.
లైవ్ చాట్ విరాళాలను ఆన్ చేయడానికి, మీ నిధుల సమీకరణకు మీ షెడ్యూల్ చేయబడిన లైవ్ స్ట్రీమ్‌ను జోడించండి. YouTube విరాళ నిధుల సమీకరణను ఎలా సెటప్ చేయాలో తెలుసుకోండి. లైవ్ చాట్ ఉన్న లైవ్ స్ట్రీమ్‌లు, చాట్‌లో 'విరాళం' చిహ్నం ను కలిగి ఉంటాయి. లైవ్ చాట్ లేని లైవ్ స్ట్రీమ్‌లు, స్ట్రీమ్ పక్కన లేదా కింద 'విరాళం' బటన్‌ను కలిగి ఉంటాయి.
విరాళాలు ఉన్న వీడియోలలో సూపర్ థాంక్స్ అందుబాటులో ఉండదు.

నిధుల సమీకరణను కలిగి ఉన్న వీడియోలు లేదా లైవ్ స్ట్రీమ్‌లలో నేను ఇప్పటికీ మానిటైజ్ చేయవచ్చా?

మీరు మీ వీడియోలు అలాగే లైవ్ స్ట్రీమ్‌లకు నిధుల సమీకరణను జోడించినప్పుడు యాడ్స్ ప్రభావితం కావు. గందరగోళాన్ని నివారించడానికి, లైవ్ చాట్ విరాళాలు ఉన్న లైవ్ స్ట్రీమ్‌లలో సూపర్ చాట్ అలాగే సూపర్ స్టిక్కర్స్ అందుబాటులో ఉండవు. క్రియేటర్‌లు 'విరాళం' బటన్ ఉన్న 'మెంబర్‌లకు మాత్రమే' లైవ్ చాట్‌ను హోస్ట్ చేయలేరు. విరాళాలు ఉన్న వీడియోలలో సూపర్ థాంక్స్ అందుబాటులో ఉండదు.

లాభాపేక్ష రహిత సంస్థలు విరాళాలను ఎలా పొందుతాయి?

Google రిక్వెస్ట్ మేరకు విరాళాలను సేకరించి, పంపిణీ చేయడానికి Network for Goodతో Google భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. మీ కంట్రిబ్యూషన్ 100% లాభాపేక్ష రహిత సంస్థ‌కు వెళ్తుంది అలాగే YouTube లావాదేవీల ఫీజులను చెల్లిస్తుంది. U.S. IRS ప్రకారం, విరాళాలను అందుకున్న తర్వాత వాటిపై Network for Good ప్రత్యేక చట్టపరమైన నియంత్రణను కలిగి ఉంటుంది. YouTube క్రియేటర్‌కు చెందిన లాభాపేక్ష రహిత సంస్థకు Network for Good నిధులను పంపిణీ చేయలేకపోతే, Network for Good మరొక అర్హత కలిగిన U.S. లాభాపేక్ష రహిత సంస్థకు నిధులను పంపిణీ చేస్తుంది. Network for Good నిధుల పంపిణీలు ఎలా జరుగుతాయి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

నా విరాళాన్ని పొందడానికి ఎంపిక చేయబడిన లాభాపేక్ష రహిత సంస్థ అర్హత లేనిదిగా మారితే ఏమి చేయాలి?

Network for Good, Googleకు చెందిన దాత సలహా నిధి పార్ట్‌నర్, ఏదైనా కారణంతో (లాభాపేక్ష రహిత సంస్థ అనేది చెల్లుబాటు అయ్యే యునైటెడ్ స్టేట్స్ 501(c)(3) సంస్థ కాకపోవడంతో సహా) ఉద్దేశించబడిన లాభాపేక్ష రహిత సంస్థకు ఒక ప్రాజెక్ట్ కోసం నిధులను పంపిణీ చేయలేకపోతే, ప్రత్యామ్నాయ అర్హత కలిగిన లాభాపేక్ష రహిత సంస్థను ఎంపిక చేయడానికి Network for Goodతో కలిసి Google పని చేస్తుంది.
నా లైవ్ చాట్‌లో నాకు విరాళాలు ఎలా కనిపిస్తాయి?
చాట్ విండో‌లో విరాళాలు కనిపించడాన్ని మీరు చూస్తారు. మీరు లైవ్ కంట్రోల్ పేజీలో వీక్షకుల యాక్టివిటీ విడ్జెట్‌తో రియల్ టైంలో లైవ్ చాట్ విరాళాలను కూడా పర్యవేక్షించవచ్చు.

'అమౌంట్ మొత్తం' అలాగే 'ప్రోగ్రెస్ బార్' అనేవి దేనిని సూచిస్తాయి?

నిధుల సమీకరణలో పాల్గొంటున్న అన్ని ఛానెల్‌లు అలాగే వీడియోల నుండి, మొత్తంగా ఆ నిధుల సమీకరణ కోసం సమీకరించబడిన నిధులను 'అమౌంట్ మొత్తం' సూచిస్తుంది. 'విరాళం' బటన్ కింద మీరు మొత్తం అమౌంట్‌ను లేదా ప్రోగ్రెస్ బార్‌ను కనుగొనవచ్చు.

నా నిధుల సమీకరణ గురించి ఎనలిటిక్స్‌ను నేను ఎక్కడ కనుగొనగలను?

మీ నిధుల సమీకరణ గురించి ఎనలిటిక్స్‌ను కనుగొనడానికి:

  1. కంప్యూటర్‌లో YouTubeలోకి సైన్ ఇన్ చేయండి.
  2. YouTube Studioకు వెళ్లండి.
  3. సంపాదించండికి వెళ్లండి.
  4. విరాళాన్ని ఎంచుకోండి.
  5. “సమీకరించబడిన మొత్తం” కింద, మీరు చేరిన లేదా క్రియేట్ చేసిన ప్రచారాలు పక్కన సాధారణ నిధుల సమీకరణ డేటా మీకు కనిపిస్తుంది.
  6. మీ నిధుల సమీకరణ గురించి మరిన్ని వివరాలను చూడటానికి సమీకరించబడిన మొత్తం పైన మౌస్ కర్సర్‌ను ఉంచండి.

లాభాపేక్ష రహిత సంస్థ FAQలు

YouTube విరాళం కోసం నిధుల సమీకరణ చేయడానికి ఏ లాభాపేక్షరహిత సంస్థలకు అర్హత ఉంటుంది?
YouTube విరాళం నిధుల సమీకరణ నుండి డబ్బును పొందడం కోసం అర్హత సాధించడానికి, లాభాపేక్ష రహిత సంస్థ తప్పనిసరిగా ఈ అర్హతలను కలిగి ఉండాలి:
  • క్రియేటర్ ద్వారా రిక్వెస్ట్ చేయబడాలి.
  • USలో నమోదు చేయబడిన 501(c)(3) పబ్లిక్ స్వచ్ఛంద సంస్థ అయి ఉండాలి.
    • గమనిక: ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని లాభాపేక్ష రహిత సంస్థలు మాత్రమే అర్హతను కలిగి ఉండగా, చాలా లాభాపేక్ష రహిత సంస్థలు USలో శాఖలను లేదా భాగస్వామి సంస్థలను కలిగి ఉన్నాయి. మీరు YouTube విరాళ సెటప్ టూల్‌లో అందుబాటులో ఉన్న లాభాపేక్ష రహిత సంస్థల పూర్తి లిస్ట్‌ను చూడవచ్చు.
  • GuideStar ద్వారా ఆన్‌లైన్‌ నిధుల సమీకరణ చేయడం సమ్మతించబడి ఉండాలి.
  • YouTubeలో అలాగే వెలుపల, రెండింటిలోనూ YouTube మానిటైజేషన్ పాలసీలను ఫాలో చేయాలి. ఈ అర్హతలో YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో చేయడం కూడా ఉంది.
గమనిక: ప్రైవేట్ ఫౌండేషన్‌లు ప్రస్తుతం సపోర్ట్ చేయబడవు. 

నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్న లాభాపేక్ష రహిత సంస్థ రిక్వెస్ట్ టూల్‌లో నాకు కనిపించకపోతే ఏమి చేయాలి?

మీరు వెతుకుతున్న లాభాపేక్ష రహిత సంస్థ రిక్వెస్ట్ టూల్‌లో కనిపించకపోవడానికి కొన్ని కారణాలు కింద ఉన్నాయి:
  • ఆ లాభాపేక్ష రహిత సంస్థ Google for Nonprofitsలో భాగం కాదు. ఆ లాభాపేక్ష రహిత సంస్థ Google for Nonprofits ఖాతాను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • ఆ లాభాపేక్ష రహిత సంస్థ Guidestarలో నమోదు చేయబడిన US ఆధారిత 501(c)(3) లాభాపేక్ష రహిత సంస్థ కాదు. guidestar.orgలో వాటి కోసం చూసి, ఆ లాభాపేక్ష రహిత సంస్థ అక్కడ ఉందని నిర్ధారించుకోండి.
  • లాభాపేక్ష రహిత సంస్థ ఆన్‌లైన్‌ నిధుల సమీకరణను నిలిపివేసింది. లాభాపేక్ష రహిత సంస్థలు తమ కోసం ఆన్‌లైన్‌లో నిధుల సమీకరణ చేయడానికి తప్పనిసరిగా దాతలకు అనుమతి ఇవ్వాలి. YouTubeలో లాభాపేక్ష రహిత సంస్థగా డబ్బును సమీకరించడం గురించి మరింత తెలుసుకోండి.

నేను సపోర్ట్ చేయాలనుకుంటున్న లాభాపేక్ష రహిత సంస్థను నేను రిక్వెస్ట్ చేశాను. జోడించడానికి ఎంత సమయం పడుతుంది?

మీరు మీ అర్హత గల లాభాపేక్ష రహిత సంస్థను సమర్పించిన తర్వాత, మీ రిక్వెస్ట్ స్టేటస్‌ను మీకు తెలియజేయడానికి మేము మీకు ఈమెయిల్‌ను పంపుతాము. కొన్ని రిక్వెస్ట్‌ల ఆమోదానికి 5 పని దినాల వరకు సమయం పట్టవచ్చు. ఈ ప్రాసెస్‌ను వేగవంతం చేయడంలో సహాయపడటానికి, మీరు రిక్వెస్ట్ చేస్తున్న లాభాపేక్ష రహిత సంస్థ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి.

లాభాపేక్ష రహిత సంస్థలకు నిధులు ఎలా పంపిణీ చేయబడతాయి?

లాభాపేక్ష రహిత సంస్థలకు నిధులను సేకరించడానికి అలాగే పంపిణీ చేయడానికి, U.S. 501(c)(3) అయిన Network for Good అలాగే దాత సలహా నిధితో మేము భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాము. సాధారణంగా Network for Good నెలవారీగా నిధులను పంపిణీ చేస్తుంది. $10 కంటే తక్కువ సమీకరించబడితే, నిధులు వార్షికంగా పంపిణీ చేయబడతాయి. నిధుల పంపిణీ అలాగే Network for Good గురించి మరింత తెలుసుకోండి.

Google for Nonprofits గురించి నేను ఎలా మరింత తెలుసుకోగలను?

Google for Nonprofits అలాగే ప్రోగ్రామ్ అర్హతా గైడ్‌లైన్స్ గురించి మరింత తెలుసుకోండి. 

YouTubeలో లాభాపేక్ష రహిత సంస్థగా డబ్బును సమీకరించడం గురించి నేను ఎలా మరింత తెలుసుకోగలను? 

దాతకు సంబంధించిన FAQలు

వీడియో వీక్షణా పేజీలో నేను 'విరాళం' బటన్‌ను చూశాను. అది ఎలా పని చేస్తుంది?

లైవ్ చాట్ విరాళాలు అంటే ఏమిటి?

క్రియేటర్ లైవ్ స్ట్రీమ్‌కు లేదా లైవ్ చాట్ ఎనేబుల్ చేయబడిన ప్రీమియర్‌కు నిధుల సమీకరణను జోడించినప్పుడు, చాట్‌లో 'విరాళం' బటన్ కనిపించడాన్ని వీక్షకులు చూస్తారు. వీక్షకులు లైవ్ చాట్ విరాళాలతో విరాళం అందించినప్పుడు, వారు లైవ్ చాట్‌లో తమ విరాళానికి తమ పేరును జోడించడాన్ని ఎంచుకోవచ్చు. లైవ్ చాట్ విరాళాల గురించి మరింత తెలుసుకోండి.
YouTube విరాళం నిధుల సమీకరణకు ఏ దేశాలు/ప్రాంతాలు విరాళం అందించగలవు?

మీరు కింది దేశాలు/ప్రాంతాల్లో ఉన్నట్లయితే, మీరు విరాళాలు అందించవచ్చు.

  • అర్జెంటీనా
  • ఆస్ట్రియా
  • బెల్జియం
  • బొలీవియా
  • కెనడా
  • కొలంబియా
  • క్రొయేషియా
  • ఎస్టోనియా
  • ఫ్రాన్స్
  • జర్మనీ
  • ఘనా
  • హాంకాంగ్
  • ఐస్‌లాండ్
  • ఇండోనేషియా
  • ఐర్లాండ్
  • ఇజ్రాయిల్
  • ఇటలీ
  • కొరియా
  • కువైట్
  • లాట్వియా
  • లిథువేనియా
  • లక్సెంబర్గ్
  • మలేషియా
  • మెక్సికో
  • మాంటెనీగ్రో
  • నెదర్లాండ్స్
  • న్యూజిలాండ్
  • నార్వే
  • పెరూ
  • ఫిలిప్పీన్స్
  • పోలాండ్
  • ప్యూర్టోరికో
  • రొమేనియా
  • స్లోవేకియా
  • దక్షిణ కొరియా
  • స్పెయిన్
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • తైవాన్
  • థాయ్‌లాండ్
  • టర్కీ
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • USA

నా విరాళానికి పన్ను మినహాయింపు లభిస్తుందా?

లొకేషన్ ఆధారంగా దాత పన్ను సమాచారాన్ని ఇక్కడ చూడండి.

నా విరాళంలో ఎంత మొత్తం లాభాపేక్ష రహిత సంస్థకు చేరుతుంది?

మీరు విరాళంగా అందించే 100% డబ్బు లాభాపేక్ష రహిత సంస్థకు వెళ్తుంది. క్రెడిట్ కార్డ్ లావాదేవీల ఫీజులను కూడా YouTube భరిస్తుంది.

నేను నా విరాళంపై రీఫండ్ పొందగలనా?

లాభాపేక్ష రహిత సంస్థలకు స్వచ్ఛందంగా అందించే విరాళాలు రీఫండ్ చేయబడవు. పేమెంట్ చేయడంలో మీకు సమస్య ఉంటే, మీరు మా సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు.

నేను విరాళం అందించినప్పుడు, మీరు లాభాపేక్ష రహిత సంస్థలతో ఏ సమాచారాన్ని షేర్ చేస్తారు?

మీరు విరాళం అందించినప్పుడు, మీ కాంటాక్ట్ సమాచారం లాభాపేక్ష రహిత సంస్థ లేదా క్రియేటర్‌తో షేర్ చేయబడదు. మీరు లైవ్ చాట్‌లో విరాళం ఇస్తున్నప్పుడు “పబ్లిక్” విరాళం అందించినట్లయితే, లైవ్ స్ట్రీమ్‌ను హోస్ట్ చేస్తున్న క్రియేటర్ మీ ఖాతా పేరు అలాగే విరాళ మొత్తాన్ని చూడగలరు. మీ సమాచారం ఎలా ఉపయోగించబడుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
యూజర్, కంపెనీ, అలాగే ఆఫ్‌సైట్ విరాళాలు అంటే ఏమిటి?
  • యూజర్ విరాళాలు: YouTube యూజర్‌ల ద్వారా అందించబడిన నిధులు.
  • కంపెనీ విరాళాలు: లాభాపేక్ష రహిత సంస్థ ద్వారా వెరిఫై చేయబడిన విధంగా, YouTube లేదా మరొక కంపెనీ ద్వారా అందించబడిన నిధులు.
  • ఆఫ్‌సైట్ విరాళాలు: ఈ ప్రచారంలో భాగంగా YouTube కాకుండా వేరొక సైట్‌లో ఆర్గనైజర్ ద్వారా సేకరించబడిన అలాగే లాభాపేక్ష రహిత సంస్థ ద్వారా వెరిఫై చేయబడిన నిధులు.
కంపెనీ మ్యాచింగ్ ఎలా పని చేస్తుంది?
విరాళాలను మ్యాచ్ చేయడానికి కంపెనీ హామీ ఇచ్చినట్లయితే, YouTube 'విరాళం' బటన్ ద్వారా నిధుల సమీకరణకు అందించబడిన ప్రతి $1కు వారు $1ను విరాళంగా అందిస్తారు. పూర్తి మ్యాచ్ లభించడం లేదా ప్రచారం ముగియడం, వీటిలో ఏది ముందుగా జరిగినా, అప్పటి వరకు ఈ మ్యాచింగ్ కొనసాగుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15197316066191565422
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false