ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌ల కోసం యాక్టివిటీలను క్రియేట్ చేయండి, మేనేజ్ చేయండి

YouTube Shopping అనేది మీకు, మీ వీక్షకులకు సరైనదని భావించే షాపింగ్ అనుభవాన్ని క్రియేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రోడక్ట్ ట్యాగింగ్‌తో, మీ YouTube ఛానెల్‌లో మీ ప్రోడక్ట్‌లను, లేదా మీరు అనుబంధ ప్రోగ్రామ్‌లో ఉంటే, ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను కూడా ప్రమోట్ చేయవచ్చు. ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌ల కోసం ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడటానికి, అలాగే వీక్షకులకు ప్రోడక్ట్‌ల గురించిన తాజా సమాచారాన్ని, డీల్స్‌ను అందించడానికి, మీరు ఈ యాక్టివిటీలను ఉపయోగించవచ్చు:

ప్రమోషన్లు & ధర తగ్గింపులు

ప్రమోషన్‌లు & ధర తగ్గింపులు అనే ఫీచర్, ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లకు సంబంధించిన డీల్స్‌ను వీక్షకులకు హైలైట్‌ చేస్తుంది. ప్రోడక్ట్ లిస్ట్ లేదా పిన్ చేసిన ప్రోడక్ట్ బ్యానర్‌లో డిస్‌ప్లే చేయబడే మూడు రకాల ప్రమోషన్లు & ధర తగ్గింపులు ఉన్నాయి.

  1. వ్యాపారి ప్రమోషన్: డీల్‌లో కింద పేర్కొన్న వాటికే పరిమితం కాకుండా ఇంకా కొన్ని అంశాలు ఉండవచ్చు:
    1. ప్రోడక్ట్‌పై తగ్గింపు శాతం ఆటోమేటిక్‌గా వర్తింపజేయబడుతుంది లేదా డిస్కౌంట్ కోడ్‌తో వర్తింపజేయబడుతుంది
    2. ఆటోమేటిక్‌గా లేదా డిస్కౌంట్ కోడ్‌తో వర్తింపజేయబడిన ప్రోడక్ట్‌పై తక్కువ మొత్తం లేదా స్థిర తగ్గింపు
    3. “కొనుగోలుపై గిఫ్ట్ పొందండి” లేదా “Xను కొనండి, Yను పొందండి” వంటి అర్హత లేని డీల్
  2. సేల్స్ ధరకు సంబంధించిన అదనపు గమనిక: ప్రోడక్ట్‌పై డిస్కౌంట్ ఇవ్వబడిన ధర.
  3. ధర తగ్గింపు: ప్రోడక్ట్ యొక్క ప్రస్తుత ధర సూచించబడిన ధర కంటే తక్కువగా ఉన్నప్పుడు చూపే బ్యాడ్జ్. గత 30 రోజులలో లిస్ట్ చేయబడిన అతి తక్కువ ధర అనేది సూచించబడిన ధరగా పేర్కొనబడుతుంది.

క్రియేటర్‌లు తమ స్టోర్‌లలో వారి ప్రోడక్ట్ ధరను అప్‌డేట్ చేయడం ద్వారా “ధర తగ్గింపును” ట్రిగ్గర్ చేయవచ్చు. క్రియేటర్‌లు వీటిని ఉపయోగించి వ్యాపారి ప్రమోషన్లను, సేల్స్ ధరకు సంబంధించిన అదనపు గమనికలను క్రియేట్ చేసి, వర్తింపజేయవచ్చు:

  1. Shopify, లేదా
  2. Google Merchant Center (GMC) - మీకు ప్రత్యక్ష యాక్సెస్ ఉంటే మాత్రమే.

YouTube అనేది వీక్షకులకు రిటైలర్ డేటా ఆధారంగా వారికి డీల్స్‌ను చూపుతుంది. ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌కు ఒకటి కంటే ఎక్కువ డీల్ అందుబాటులో ఉంటే, YouTube అందుబాటులో ఉన్న పెద్ద డీల్‌‌ను చూపుతుంది. ట్యాగ్ చేయబడిన ప్రోడక్ట్‌లు ఈ దేశాలు/ప్రాంతాల్లో మొబైల్ పరికరాన్ని ఉపయోగించే వీక్షకులకు మాత్రమే కనిపిస్తాయి. ట్యాగ్ చేయబడిన ప్రోడక్ట్‌లు మీ వీక్షకులకు కనిపించకపోతే, వారు మొబైల్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారని, అలాగే అందుబాటులో ఉన్న దేశం/ప్రాంతంలో ఉన్నారని నిర్ధారించుకోండి. ట్యాగ్ చేయబడిన ప్రోడక్ట్‌లు అనేవి వీక్షకుల దేశం/ప్రాంతానికి షిప్పింగ్ చేయడానికి ప్రోడక్ట్‌లు అందుబాటులో ఉంటే మాత్రమే కనిపిస్తాయి.

అర్హత

ప్రమోషన్‌లు & ధర తగ్గింపులు అనే ఫీచర్‌ను ఉపయోగించడానికి, డీల్ రకాన్ని బట్టి మీ రిటైలర్ ఇతర కావలసిన అర్హతలకు అనుగుణంగా ఉండాలి. సేల్స్ ధరకు సంబంధించిన అదనపు గమనికలు, ధర తగ్గింపుల కోసం ఇతర రిటైలర్ అర్హతలు ఏవీ లేనప్పటికీ, వ్యాపారి ప్రమోషన్లకు సంబంధించి మరిన్ని రిటైలర్ అర్హతలు ఉన్నాయి:

  • వ్యాపారి ప్రమోషన్లు (Shopify అందించేవి):
    • ఆటోమేటిక్‌గా వర్తించే డీల్స్ విషయంలో (ఆటోమేటిక్ డిస్కౌంట్‌లు): మీ Shopify స్టోర్ తప్పనిసరిగా కింద పేర్కొన్న దేశాలు/ప్రాంతాలలో ఒక దానిలో ఉండాలి: AU, BR, CA, DE, ES, FR, IN, IT, JP, KR, NL, UK, US.
    • డిస్కౌంట్ కోడ్‌లు వర్తింపజేసే డీల్స్ విషయంలో: మీ Shopify స్టోర్ తప్పనిసరిగా USలో ఉండాలి.
    • అర్హత లేని డీల్స్ విషయంలో: ఈ రకమైన డీల్స్ ప్రస్తుతం సపోర్ట్ చేయవు.
  • వ్యాపారి ప్రమోషన్లు (GMC అందించేవి): మీ సపోర్ట్ చేసే రిటైలర్ తప్పనిసరిగా కింద పేర్కొన్న దేశాలు/ప్రాంతాలలో ఒక దానిలో ఉండాలి: AU, BR, CA, DE, ES, FR, IN, IT, JP, NL, KR, UK, US.

ప్రమోషన్లు & ధర తగ్గింపులను సెటప్ చేసి, మేనేజ్ చేయండి

మీరు ఆఫర్ చేయాలనుకుంటున్న దాన్ని బట్టి డీల్స్‌ను సెటప్ చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. డీల్ రివ్యూ చేయబడి, ఆమోదం పొందిన తర్వాత, మీరు ప్రోడక్ట్‌ను ట్యాగ్ చేయవచ్చు.

గమనిక: మీరు ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేసినప్పుడు, మీరు ప్రోడక్ట్‌లను ఎంచుకుంటున్నప్పుడు డీల్‌ను చూడలేరు. అయితే, ట్యాగ్ చేసిన తర్వాత, డీల్‌ను చూడవచ్చు.

 ఏదైనా ప్రమోషన్లను YouTubeకు షేర్ చేయడానికి, వాటిని కనీసం 5 రోజుల ముందు సెటప్ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

వ్యాపారి ప్రమోషన్లు

Shopify ద్వారా వ్యాపారి ప్రమోషన్‌ను క్రియేట్ చేయండి లేదా ఎడిట్ చేయండి

మీరు ఆటోమేటిక్ డిస్కౌంట్ తగ్గింపు మొత్తం లేదా డిస్కౌంట్ కోడ్‌తో Shopify ద్వారా వ్యాపారి ప్రమోషన్లను క్రియేట్ చేయవచ్చు. వీక్షకులు అర్హత ఉన్న ఐటెమ్‌లను కొనుగోలు చేసినప్పుడు ఆటోమేటిక్ డిస్కౌంట్ తగ్గింపు మొత్తాలు చెక్ అవుట్ వద్ద ఆటోమేటిక్‌గా వర్తింపజేయబడతాయి. మీరు డిస్కౌంట్ కోడ్‌ను క్రియేట్ చేసి, షేర్ చేసినప్పుడు, అర్హత ఉన్న ఐటెమ్‌లపై డిస్కౌంట్‌ను పొందడానికి వీక్షకులు చెక్ అవుట్ వద్ద తప్పనిసరిగా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
గమనిక: అర్హత లేని డీల్స్, $0 షిప్పింగ్ ప్రమోషన్లు ఉన్న డీల్స్ ప్రస్తుతం సపోర్ట్ చేయవు. Shopify కోసం సపోర్ట్ చేసే ప్రమోషన్ వీడియో గురించి మరింత తెలుసుకోండి.

Shopifyలో వ్యాపారి ప్రమోషన్‌ను క్రియేట్ చేయడానికి:

  1. డిస్కౌంట్‌లుఆ తర్వాత డిస్కౌంట్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  2. “డిస్కౌంట్ రకాన్ని ఎంచుకోండి”లో దీన్ని ఎంచుకోండి: “తగ్గింపు మొత్తం ఉన్న ప్రోడక్ట్‌లు,” లేదా “తగ్గింపు మొత్తం ఉన్న ఆర్డర్‌లు”.
  3. “పేమెంట్ ఆప్షన్” కింద మీరు ఆఫర్ చేయాలనుకుంటున్న డిస్కౌంట్ రకాన్ని ఎంచుకోండి:
    1. ఆటోమేటిక్ డిస్కౌంట్: వీక్షకుల కోసం చెక్అవుట్ సమయంలో డిస్కౌంట్‌లు ఆటోమేటిక్‌గా వర్తింపజేయబడతాయి.
    2. డిస్కౌంట్ కోడ్: డిస్కౌంట్‌ను పొందడానికి వీక్షకులు చెక్ అవుట్ సమయంలో తప్పనిసరిగా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
  4. మీ ప్రమోషన్ వీడియో కోసం వివరాలను జోడించండి ఆ తర్వాత డిస్కౌంట్‌ను ఆదా చేయండి.
  5. మీ డిస్కౌంట్‌ను Google ఛానెల్ యాప్‌తో సింక్ చేయండి:
    1. డిస్కౌంట్‌లు కింద, సంబంధిత డిస్కౌంట్‌పై క్లిక్ చేయండి.
    2. సేల్స్ ఛానెల్స్ విభాగంలో, Google ఛానెల్ యాప్‌ను ఎంచుకోండి.
    3. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

 CGoogle Merchant Center (GMC)లో వ్యాపారి ప్రమోషన్‌ను క్రియేట్ చేయండి లేదా ఎడిట్ చేయండి

GMCలో వ్యాపారి ప్రమోషన్‌ను క్రియేట్ చేయడానికి:

  1. సంబంధిత ప్రోడక్ట్‌ల కోసం అందుబాటులో ఉన్న ఆప్షన్‌లలో ఒక దాన్ని ఉపయోగించి,మీ ప్రమోషన్‌ను క్రియేట్ చేసి, సబ్మిట్ చేయండి:
    1. Merchant Center ప్రమోషన్ల బిల్డర్
    2. ప్రమోషన్ల ఫీడ్
    3. కంటెంట్ API

వ్యాపారి ప్రమోషన్లు Google Merchant Center ఎడిటోరియల్ అర్హతలకు, ప్రమోషన్ల పాలసీలకు అనుగుణంగా రివ్యూ చేయబడి, నిర్దారించబడతాయి. ఆమోదించబడితే, ఇది Google, YouTube ప్లాట్‌ఫామ్‌లంతటా లైవ్‌లో అందుబాటులో ఉంటుంది.

సేల్స్ ధరకు సంబంధించిన అదనపు గమనిక

మీరు మీ సేల్స్ ధరను సెట్ చేసినప్పుడు, అది మీ అన్ని ఇతర అర్హతలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి.

Shopify ద్వారా సేల్స్ ధరను క్రియేట్ చేయండి లేదా ఎడిట్ చేయండి

Shopify ద్వారా సేల్స్ ధరను క్రియేట్ చేయడానికి:

  1. ప్రోడక్ట్‌లకు వెళ్లి,  ఆ తర్వాత సంబంధిత ప్రోడక్ట్‌ను క్లిక్ చేయండి.
  2. ధర కింద, మీ ప్రోడక్ట్ ఒరిజినల్ ధరతో ధరను పోల్చి చూడండి అనే ఆప్షన్‌ను సెట్ చేయండి.
  3. మీ ప్రోడక్ట్ ధరను కొత్త సేల్ కొత్తకు సెట్ చేయండి.

GMCలో సేల్స్ ధరను క్రియేట్ చేయండి లేదా ఎడిట్ చేయండి

GMCలో సేల్స్ ధరను క్రియేట్ చేయడానికి:

  1. మీ ఐటెమ్ కోసం ఒరిజినల్ ధర ధర [ధర] లక్షణంలో లిస్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి.
  2. ఆప్షనల్ సేల్ ధర [సేల్ ధర] లక్షణాన్ని ఉపయోగించి సేల్స్ ధరను సబ్మిట్ చేయండి.

ధర తగ్గింపు

“ధర తగ్గింపు” బ్యాడ్జ్ అనేది ప్రోడక్ట్‌కు సంబంధించి చాలా స్థిరంగా ఉన్న ధరలో ఎక్కువ తగ్గుదల ఉన్నప్పుడు కనిపిస్తుంది. మీరు మీ ప్రోడక్ట్‌కు సంబంధించి ధరను మార్చవచ్చు, తద్వారా Google “ధర తగ్గింపు” బ్యాడ్జ్‌ను చూపించగలదు. “ధర తగ్గింపు” బ్యాడ్జ్‌ను ట్రిగ్గర్ చేయడానికి, మీ స్టోర్ ద్వారా మీ ప్రోడక్ట్ ధరను అప్‌డేట్ చేయండి. కొత్త ధర మీరు గతంలో లిస్ట్ చేసిన సగటు ధర కంటే తక్కువగా ఉండాలి. ధర తగ్గింపునకు సంబంధించిన అదనపు గమనికలు ఎలా పని చేస్తాయి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

కొత్త ప్రోడక్ట్ రిలీజ్

కొత్త ప్రోడక్ట్ రిలీజ్ ఫీచర్‌తో, మీరు లైవ్ స్ట్రీమ్ సమయంలో కొత్త ప్రోడక్ట్‌ను రిలీజ్ చేసినప్పుడు అది వీక్షకులను ఆకట్టుకునేలా, ఆశ్చర్యపరిచేలా చేయొచ్చు. షాపింగ్ బ్యాగ్‌తో కూడిన ప్లేస్‌హోల్డర్ ఇమేజ్ మీ లైవ్ స్ట్రీమ్ ప్రోడక్ట్ లిస్ట్‌లో ప్రదర్శించబడుతుంది, ఇది మీ ప్రోడక్ట్ త్వరలో రిలీజ్ అవ్వనుందని వీక్షకులకు తెలియజేస్తుంది. ప్రోడక్ట్ మీ లైవ్ స్ట్రీమ్‌లో చూపబడిన తర్వాత, వీక్షకులు తక్షణమే దాన్ని కొనుగోలు చేయవచ్చు.

మీ అవసరాలు, అర్హత ఆధారంగా, పబ్లిష్ తేదీలతో లేదా పబ్లిష్ తేదీలు లేకుండా కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌లను సెటప్ చేయవచ్చు.

  • పబ్లిష్ తేదీలు గల కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌లు: రిలీజ్‌కు సంబంధించిన విషయాలు లీక్ అవ్వకుండా నివారించడానికి ఖచ్చితమైన ఆవశ్యకతలు, అలాగే ముందుగానే అదనపు సెటప్ అవసరం. తమ Shopify స్టోర్‌కు, లేదా కనెక్ట్ చేయబడిన తమ స్టోర్‌కు సంబంధించిన Google Merchant Center (GMC)కు నేరుగా యాక్సెస్ కలిగిన క్రియేటర్‌లు, పబ్లిష్ తేదీలను ఉపయోగించగలరు.
  • పబ్లిష్ తేదీలు లేని కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌లు:  మీరు లైవ్ స్ట్రీమ్‌కు ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేసినప్పుడు, ఇవి సెటప్ చేయబడతాయి. ఈ రిలీజ్‌లు, సమయానికి ముందు మీ ప్రోడక్ట్ YouTubeలో కనిపించకుండా ఆపివేస్తాయి, కానీ వీక్షకులు మీ ప్రోడక్ట్‌ను వేరే చోట కనుగొనవచ్చు. రిలీజ్‌కు సంబంధించిన విషయాలు లీక్ అవ్వకుండా నివారించడానికి, రిలీజ్ అయ్యేంత వరకు మీ ప్రోడక్ట్ పేజీని అన్‌లిస్ట్ చేయవచ్చు. అనుబంధ ప్రోగ్రామ్‌లోని క్రియేటర్‌లు లేదా కనెక్ట్ చేసిన స్టోర్‌లు గల క్రియేటర్‌లు ఈ ఫీచర్‌ను ఉపయోగించగలరు.

మీరు కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను సెటప్ చేసిన తర్వాత, మీ లైవ్ స్ట్రీమ్‌ను షెడ్యూల్ చేయవచ్చు, మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను స్ట్రీమ్‌కు జోడించవచ్చు, అలాగే పెద్దగా ప్రకటన చేయవచ్చు.

పబ్లిష్ తేదీలు లేకుండా కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌లను సెటప్ చేయడం

పబ్లిష్ తేదీలు లేకుండా మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను సెటప్ చేయడానికి, మీరు తప్పనిసరిగా:

మీ స్టోర్‌కు ప్రోడక్ట్‌ను జోడించారని నిర్ధారించుకోండి, తద్వారా మా పాలసీలకు, Google Merchant Center పాలసీలకు అది అనుగుణంగా ఉందో, లేదో రివ్యూ చేయవచ్చు. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి సాధారణంగా కొన్ని పని దినాల సమయం పడుతుంది. ఆమోదం పొందిన తర్వాత, మీ లైవ్ స్ట్రీమ్‌కు జోడించడానికి వీలుగా మీ ప్రోడక్ట్‌లు YouTube Studioలో కనిపిస్తాయి.

పబ్లిష్ తేదీలతో కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌లను సెటప్ చేయడం

పబ్లిష్ తేదీలతో మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను సెటప్ చేయడానికి, మీకు వీటికి ప్రత్యక్ష యాక్సెస్ అవసరం:

  • కనెక్ట్ చేసిన మీ స్టోర్‌కు సంబంధించిన Google Merchant Center (GMC)కు, లేదా
  • మీ Shopify స్టోర్‌కు సంబంధించిన అడ్మిన్ పేజీ

బెస్ట్ ప్రాక్టీసుగా, మీ లైవ్ స్ట్రీమ్‌కు కనీసం 1 వారం ముందు మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను సెటప్ చేయండి. మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను సెటప్ చేసిన తర్వాత, మీరు లైవ్ స్ట్రీమ్‌ను షెడ్యూల్ చేయవచ్చు, అలాగే చూపించడానికి వీలుగా మీ ప్రోడక్ట్‌ను లైవ్ స్ట్రీమ్‌కు జోడించవచ్చు.

Shopify ద్వారా పబ్లిష్ తేదీలలో కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను సెటప్ చేయడం

మీరు మీ Shopify స్టోర్‌ను YouTubeకు కనెక్ట్ చేసినట్లయితే, Shopifyలో మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను సెటప్ చేయండి:

  1. కొత్త ప్రోడక్ట్ రిలీజ్ ఆఫర్‌ను Shopifyకు అప్‌లోడ్ చేయండి.
  2. Google ఛానెల్ యాప్‌నకు, Shopify ఆన్‌లైన్ స్టోర్‌కు ఒకే తేదీని, సమయాన్ని షెడ్యూల్ చేయండి:
    • ఆన్‌లైన్ స్టోర్: ప్రోడక్ట్‌ల విభాగంలో, మీ ఆన్‌లైన్ స్టోర్ అందుబాటులోకి వచ్చే తేదీని, సమయాన్ని షెడ్యూల్ చేయండి. Shopifyలో మీ ఆఫర్ కనిపించి, షాపింగ్ చేయదగిన తేదీ, సమయం ఇది.

    • Google ఛానెల్ యాప్: సేల్స్ ఛానెల్ & యాప్‌ల విభాగం కింద, Google కోసం తేదీ, సమయాన్ని షెడ్యూల్ చేయండి. YouTube వీక్షకులకు మీ ఆఫర్ కనిపించి, వారు షాపింగ్ చేయదగిన తేదీ, సమయం ఇది.

    • Google ఛానెల్ యాప్, Shopify ఆన్‌లైన్ స్టోర్‌లో కొత్త ప్రోడక్ట్ రిలీజ్ తేదీ, సమయం (UTC టైమ్ జోన్‌తో సహా) ఒకే విధంగా ఉన్నాయో లేదో చెక్ చేయండి.
  3. మీ ప్రోడక్ట్ మా పాలసీలకు, అలాగే Google Merchant Center పాలసీలకు అనుగుణంగా ఉందో లేదో రివ్యూ చేయబడుతుంది. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి సాధారణంగా కొన్ని పని దినాల సమయం పడుతుంది. ఆమోదం పొందిన తర్వాత, మీ ప్రోడక్ట్ YouTube Studioలో కనిపిస్తుంది.

Google Merchant Center ద్వారా పబ్లిష్ తేదీలతో కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను సెటప్ చేయడం

కనెక్ట్ చేసిన మీ స్టోర్‌కు చెందిన Google Merchant Center (GMC)కు మీకు ప్రత్యక్ష యాక్సెస్ ఉంటే, పబ్లిష్ తేదీలతో మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను సెటప్ చేయవచ్చు:

  1. మీ ప్రోడక్ట్ లాంచ్‌కు సంబంధించిన ప్రోడక్ట్ డేటాను సబ్మిట్ చేయడానికి “disclosure_date” లక్షణంతో పాటు ప్రధాన ఫీడ్‌ను లేదా అనుబంధ ఫీడ్‌ను ఉపయోగించండి.
  2. కొత్త ప్రోడక్ట్ రిలీజ్ తేదీ, సమయం (UTC టైమ్ జోన్‌తో సహా) సరిగ్గా సెట్ చేసి ఉన్నాయో లేదో చెక్ చేయండి.
  3. మీ ప్రోడక్ట్ మా పాలసీలకు, అలాగే Google Merchant Center పాలసీలకు అనుగుణంగా ఉందో లేదో రివ్యూ చేయబడుతుంది. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి సాధారణంగా కొన్ని పని దినాల సమయం పడుతుంది. ఆమోదం పొందిన తర్వాత, మీ ప్రోడక్ట్‌లు YouTube Studioలో కనిపిస్తాయి.

కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను మీ లైవ్ స్ట్రీమ్‌కు జోడించండి

మీరు కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను సెటప్ చేసిన తర్వాత, మీ లైవ్ స్ట్రీమ్‌ను షెడ్యూల్ చేసి, మీ లైవ్ స్ట్రీమ్‌కు కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను ట్యాగ్ చేయండి:

  1. YouTube Studioలో, మీ లైవ్ స్ట్రీమ్‌ను షెడ్యూల్ చేయండి.
  2. లైవ్ కంట్రోల్ పేజీలో, లైవ్ స్ట్రీమ్ వీడియోకు కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను, ఇంకా ఏవైనా సంబంధిత ప్రోడక్ట్‌లు ఉంటే వాటిని ట్యాగ్ చేయండి. 
  • మీరు పబ్లిష్ తేదీలను ఉపయోగించి ఉంటే: మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్ పక్కన, అది అందుబాటులో ఉన్న తేదీతో “కొత్త ప్రోడక్ట్ రిలీజ్” బ్యాడ్జ్ ఉంటుంది. కొత్త ప్రోడక్ట్ రిలీజ్ తేదీ, సమయం (UTC టైమ్ జోన్‌తో సహా) సరిగ్గా సెట్ చేసి ఉన్నాయో లేదో చెక్ చేయండి. 
    • గమనిక: లైవ్ కంట్రోల్ పేజీ, GMC లేదా Shopifyలో, మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్ ల్యాండింగ్ పేజీలో కొత్త ప్రోడక్ట్ రిలీజ్ తేదీ, సమయం ఒకటే అయి ఉండాలి. ల్యాండింగ్ పేజీ తప్పనిసరిగా కొత్త ప్రోడక్ట్ రిలీజ్ అయ్యే సమయానికి (లిస్ట్ చేయబడిన విధంగా, సెర్చ్ చేయదగినదిగా) అందుబాటులో ఉండాలి. లేకపోతే, వీక్షకులకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది.
  • మీరు పబ్లిష్ తేదీలను ఉపయోగించి ఉండకపోతే: ప్రోడక్ట్ పక్కన ఉన్న “కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను క్రియేట్ చేయండి” ని క్లిక్ చేయండి. మీరు రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యేంత వరకు మీ ప్రోడక్ట్ దాచబడుతుంది.
  1. మీరు కొత్త ప్రోడక్ట్‌ను రిలీజ్ చేసినప్పుడు, అది మీ ప్రోడక్ట్ షెల్ఫ్‌లో మొదటి ఐటెమ్‌గా కనిపించాలని మీరు కోరుకుంటే, మీ ప్రోడక్ట్‌ల ఆర్డర్‌ను మార్చండి.
  2. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
ట్యాగింగ్ చిట్కాలు: మీ ప్రోడక్ట్ వేరియంట్‌లను (ఉదాహరణకు, ప్రోడక్ట్ విభిన్న సైజ్‌లలో లేదా రంగులలో అందుబాటులో ఉంటే) కలిగి ఉంటే, ప్రతి వేరియంట్‌ను విడిగా ట్యాగ్ చేయవచ్చు. 
  • ఒకవేళ మీ ప్రోడక్ట్ పలు వేరియంట్‌లను కలిగి లేకపోతే, మీరు వాటన్నింటిని ట్యాగ్ చేయవచ్చు. 
  • మీ ప్రోడక్ట్ పలు వేరియంట్‌లను కలిగి ఉంటే, విభిన్న ధరలు గల వేరియంట్‌లను మీరు ట్యాగ్ చేయవచ్చు. 
  • ట్యాగ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ పేరును అప్‌డేట్ చేయండి, తద్వారా వేరియంట్‌ల మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. 

వీక్షకులు తమకు నచ్చిన వేరియంట్‌ను ఎంచుకున్నప్పుడు, వారు ముందుగా ఎంచుకున్న వేరియంట్ వివరాలతో మీ వెబ్‌సైట్‌కు మళ్లించబడతారు. వారు కావాలనుకుంటే, మీ వెబ్‌సైట్‌లో వేరే వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

రిలీజ్ అవ్వడానికి ముందే, ప్రాముఖంగా ఫీచర్ అయ్యేలా మీ ప్రోడక్ట్‌ను మీ లైవ్ స్ట్రీమ్‌కు పిన్ చేయవచ్చు. రిలీజ్ తేదీకి ముందే, “త్వరలోనే రిలీజ్ కాబోతోంది” అనే బ్యానర్ పాప్-అప్ అవుతుంది. మీ ప్రోడక్ట్ రిలీజ్ అవ్వడానికి ఒక గంట ముందు, బ్యానర్ పక్కన కౌంట్‍డౌన్ టైమర్ పాప్-అప్ అవుతుంది. మీ ప్రోడక్ట్ రిలీజ్ అయిన తర్వాత, కౌంట్‍డౌన్ టైమర్ ఆటోమేటిక్‌గా సాధారణ ప్రోడక్ట్ పిన్‌గా మారుతుంది, Google, YouTube అంతటా ప్రోడక్ట్ కనిపిస్తుంది.

మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను మేనేజ్ చేయడం

కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌కు సంబంధించిన విషయాలు లీక్ అవ్వకుండా నివారించడానికి చిట్కాలు 

కొత్త ప్రోడక్ట్ రిలీజ్ అవ్వడానికి ముందే, మీ ప్రోడక్ట్ ల్యాండింగ్ పేజీ, ఇమేజ్ URLలు ఎక్కడికి లింక్ అయ్యాయో తెలుసుకోవడం ముఖ్యం. అదనపు సెక్యూరిటీ కోసం, తమ Shopify స్టోర్‌కు, లేదా కనెక్ట్ చేయబడిన తమ స్టోర్‌కు సంబంధించిన Google Merchant Center (GMC)కు ప్రత్యక్ష యాక్సెస్ కలిగిన క్రియేటర్‌లు వీటిని చేయవచ్చు:

  1. మీ ప్రోడక్ట్ పేజీని పబ్లిష్ చేయడానికి లైవ్ స్ట్రీమ్ అయ్యేంత వరకు వేచి ఉండవచ్చు 
  2. కనీసం 1 వారం ముందుగా పబ్లిష్ తేదీలను ఉపయోగించి మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను సబ్మిట్ చేయవచ్చు

మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్ సమయాన్ని మార్చవచ్చు

షెడ్యూల్ చేసిన మీ రిలీజ్ సమయాన్ని మీరు షెడ్యూల్ చేసిన విధంగానే అప్‌డేట్ చేయవచ్చు. కొత్తగా షెడ్యూల్ చేసిన సమయం అప్‌డేట్ అవ్వడానికి సుమారు 1 గంట సమయం పడుతుంది. అప్‌డేట్ చేసిన సమయాన్ని చూడాలంటే, మీరు YouTube Studioను తప్పనిసరిగా రీలోడ్ చేయాలి. ఏ సమయానికి అప్‌డేట్ అవ్వాలనుకుంటున్నారో దానితో పాటు మీరు ప్రోడక్ట్‌ను మళ్లీ ట్యాగ్ చేయాలి.

మీ లైవ్ స్ట్రీమ్ ఆలస్యంగా స్ట్రీమ్ అవుతున్నట్లయితే, అలాగే మీరు కొత్త ప్రోడక్ట్ రిలీజ్ ముందుగా కనిపించకూడదనుకుంటే, దాన్ని ప్రోడక్ట్ లిస్ట్ నుండి తీసివేయండి. మీరు దాన్ని మీ లైవ్ స్ట్రీమ్‌లో అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, రిలీజ్ చేయడం కోసం లైవ్ కంట్రోల్ పేజీలో దాన్ని మళ్లీ ట్యాగ్ చేయవచ్చు.

గమనిక: మీరు లైవ్ స్ట్రీమ్ నుండి కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌ను తీసివేస్తే, అది మీ లైవ్ స్ట్రీమ్ ప్రోడక్ట్ షెల్ఫ్‌లో కనిపించదు. అయితే, అది ఇప్పటికీ ఇతర YouTube ప్లాట్‌ఫామ్‌లలో షెడ్యూల్ చేసిన సమయంలో కనిపిస్తుంది.

మీ లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు మీ కొత్త ప్రోడక్ట్‌ను రిలీజ్ చేయండి

లైవ్ కంట్రోల్ పేజీలోని Shopping ట్యాబ్‌లో, కౌంట్‍డౌన్ టైమర్ ఉండాలా, లేదా మీ ప్రోడక్ట్‌ను తక్షణమే రిలీజ్ చేయాలా అనే దానిని మీరు నిర్ణయించుకోవచ్చు: 

  1. మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌కు పక్కన ఉన్న టైమర్ ను ఎంచుకోండి. మీ కొత్త ప్రోడక్ట్ రిలీజ్‌కు మీరు పబ్లిష్ తేదీలను ఉపయోగించి ఉంటే, పబ్లిష్ తేదీ, సమయం అయిన తర్వాత, మీరు టైమర్‌ను ఎంచుకోవచ్చు.
  2. మీకు 1:00 నిమిషం కౌంట్‌డౌన్ కావాలా లేదా తక్షణమే రిలీజ్ చేయాలా అనే దానిని మీరు ఎంచుకోవచ్చు. 
  3. వర్తింపజేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  4. మీరు కౌంట్‌డౌన్‌ను ఎంచుకుంటే, కౌంట్‌డౌన్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రారంభించండి ని క్లిక్ చేయండి. మీరు 'ప్రారంభించండి'ని క్లిక్ చేసిన తర్వాత, కౌంట్‌డౌన్‌ను మార్చలేరు లేదా పాజ్ చేయలేరు, కాబట్టి ప్రోడక్ట్‌ను రిలీజ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండేలా చూసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15049754370878447888
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false