ఫ్యామిలీ Google ఖాతాల గ్రూప్‌ను క్రియేట్ చేయండి

మీరు ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు, మీరు ఫ్యామిలీ మేనేజర్ అవుతారు. ఈ కింది వాటిని చేసినప్పుడు మీరు ఫ్యామిలీ గ్రూప్‌ను 6 మంది వ్యక్తుల వరకు క్రియేట్ చేయవచ్చు:

Google Oneతో ఫ్యామిలీని ఎలా క్రియేట్ చేయాలో చూడండి

Google Assistantతో ఫ్యామిలీని క్రియేట్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Assistant Assistantను తెరవండి. 
  2. "హాయ్ Google, నా ఫ్యామిలీని సెటప్ చేయి" అని చెప్పండి.
  3. స్క్రీన్‌పై సూచనలను ఫాలో చేయండి.
నేను నా ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేసిప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది

వయో అర్హత సాధించలేదు

ఫ్యామిలీ గ్రూప్‌ను మేనేజ్ చేయడానికి, మీ దేశంలో మేజర్‌గా పరిగణించే వయస్సు కంటే మీకు ఎక్కువ వయస్సు ఉండాలి. ఫ్యామిలీ మేనేజర్, వారి ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడానికి మిమ్మల్ని ఆహ్వానించవచ్చు.

మీరు ఇప్పటికే ఫ్యామిలీ గ్రూప్‌లో ఉన్నారు

మీరు ఒక్కసారి ఒక ఫ్యామిలీ గ్రూప్‌లో మాత్రమే భాగం కాగలరు. కొత్త ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయడానికి, మీ ప్రస్తుత ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించి, ఆపై కొత్తదాన్ని క్రియేట్ చేయండి.

ఖాతాకు సపోర్ట్ లేదు

మీరు మీ ఆఫీస్, స్కూల్ లేదా మరొక సంస్థ నుండి Google ఖాతాతో ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయలేరు.

ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయడంలో సమస్య

ప్రతి 12 నెలలకు ఒకసారి మాత్రమే మీరు ఫ్యామిలీ గ్రూప్‌లను మార్చగలరు. కొత్త ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయడానికి లేదా చేరడానికి, మీరు 12 నెలలు వేచి ఉండాల్సి రావచ్చు.

దేశానికి సపోర్ట్ లేదు లేదా ఫ్యామిలీకి సపోర్ట్ లేదు

ఫ్యామిలీ మేనేజర్ ఇంకా ఫ్యామిలీ మెంబర్‌లు అందరికీ ఒకే Google Play దేశం ఉందని నిర్ధారించుకోండి.

నేను ఫ్యామిలీ మెంబర్‌లను జోడించినప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది

Google ఖాతాకు ఈమెయిల్ అడ్రస్ అనుబంధించబడలేదు

మీ ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయడానికి మీరు Google Assistantను ఉపయోగిస్తుంటే, Google ఖాతాలతో అనుబంధించబడిన ఈమెయిల్ అడ్రస్‌లు మాత్రమే మీ ఫ్యామిలీలో భాగం కావచ్చు. Google ఖాతాతో అనుబంధించబడని ఈమెయిల్ అడ్రస్‌ను చేర్చడానికి, వేరే ప్రోడక్ట్‌ను ఉపయోగించి ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయండి.

మీరు మీ ఫ్యామిలీ గ్రూప్‌నకు ఆఫీస్, పాఠశాల లేదా మరొక సంస్థ నుండి Google ఖాతాను జోడించలేరు.

ఫ్యామిలీ మెంబర్ ఇప్పటికే ఫ్యామిలీ గ్రూప్‌లో ఉన్నారు

మీ కుటుంబ సభ్యుడు, ఒక సమయంలో ఒక ఫ్యామిలీ గ్రూప్‌లో మాత్రమే భాగం కావచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్, వారి ప్రస్తుత ఫ్యామిలీ గ్రూప్ నుండి నిష్క్రమించవచ్చు అలాగే మీ ఫ్యామిలీ గ్రూప్‌లో చేరవచ్చు.

కుటుంబ సభ్యుడు ఇప్పటికే ఫ్యామిలీ గ్రూప్‌లను మార్చారు

ప్రతి 12 నెలలకు ఒకసారి మాత్రమే మీరు ఫ్యామిలీ గ్రూప్‌లను మార్చగలరు. మీ కుటుంబ సభ్యుడు, వారి ప్రస్తుత ఫ్యామిలీ గ్రూప్‌ను విడిచిపెట్టి మీ గ్రూప్‌లో చేరడానికి 12 నెలల వరకు వేచి ఉండాల్సి రావచ్చు.

దేశానికి సపోర్ట్ లేదు లేదా ఫ్యామిలీకి సపోర్ట్ లేదు

మీరు ఇంకా ఫ్యామిలీ మెంబర్‌లు అందరి Google Play దేశం ఒకటేనని నిర్ధారించుకోండి.

నేను ఫ్యామిలీ మెంబర్‌లను ఆహ్వానించినప్పుడు నాకు CVN ఛాలెంజ్ వచ్చింది

మీరు ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను సెటప్ చేస్తే, మీరు మీ ఫ్యామిలీకి వ్యక్తులను ఆహ్వానించినప్పుడు, మీ క్రెడిట్ కార్డులోని CVN నంబర్‌ను వెరిఫై చేయమని మిమ్మల్ని అడగవచ్చు.

ఈ వెరిఫికేషన్‌లో భాగంగా, మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో, పెండింగ్‌లో ఉన్న ప్రామాణీకరణను మీరు చూడవచ్చు.

కార్డ్ చెల్లుబాటులో ఉందని Google నిర్ధారించుకోవడం కోసం ఈ ప్రామాణీకరణలు జరుగుతాయి. ఇవి అసలు ఛార్జీలు కావు, మీరు వాటికి పేమెంట్ చేయరు.

మీ ఖాతాలో, గరిష్టంగా 14 పనిదినాల వరకు ప్రామాణీకరణలు ఉండవచ్చు. 14 పని దినాల తర్వాత కూడా పెండింగ్‌లో ఉన్న ప్రామాణీకరణ మీకు కనిపిస్తే, మరింత సమాచారం కోసం మీ బ్యాంకును సంప్రదించండి.

ఫ్యామిలీ మెంబర్ పాత్రలు

ఫ్యామిలీ మేనేజర్

మీరు ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు, మీరు ఫ్యామిలీ మేనేజర్ అవుతారు. ఫ్యామిలీ మేనేజర్ మాత్రమే వీటిని చేయగల వ్యక్తి:

మీ ఫ్యామిలీలో పెద్దవారు ఎవరైనా సరే Google Oneకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. Google One ప్లాన్ మేనేజర్, ఫ్యామిలీ మేనేజర్ లాగానే ఉండాల్సిన అవసరం లేదు.

తల్లి/తండ్రి

ఫ్యామిలీ మేనేజర్ ద్వారా తల్లి/తండ్రిగా నియమించబడిన ఎవరికైనా, వారి దేశంలో మేజర్‌గా పరిగణించే వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉండాలి.

పేరెంట్స్ ఇవి చేయగలరు:

  • Google Play కొనుగోళ్లను ఆమోదించడం.
  • తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను అలాగే ఫ్యామిలీ మెంబర్‌ల కొనుగోలు ఆమోదాల సెట్టింగ్‌లను మార్చడం.
  • చిన్నారుల Google ఖాతాల పర్యవేక్షణలో సహాయ పడటానికి Family Linkను ఉపయోగించడం.

ముఖ్య గమనిక: కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లు కేవలం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

ఫామిలీ మెంబర్
  • ఫ్యామిలీ మేనేజర్ ద్వారా వారు ఆహ్వానించబడినప్పుడు, ఫ్యామిలీ గ్రూప్‌లో ఫ్యామిలీ మెంబర్ చేరవచ్చు.
  • ఎవరైనా మిమ్మల్ని వారి ఫ్యామిలీ గ్రూప్‌నకు ఆహ్వానిస్తే, మీరు ఫ్యామిలీ గ్రూప్‌లో చేరినప్పుడు ఏమి జరుగుతుందో మరింత తెలుసుకోండి.
ఫామిలీ మెంబర్ (పరిమిత యాక్సెస్)

ఈ స్థితిలో ఉన్న ఫ్యామిలీ మెంబర్‌కు ఫ్యామిలీ సర్వీస్‌ల కోసం పరిమిత యాక్సెస్ ఉంటుంది. కుటుంబంలో చేరడానికి వారి ఆహ్వానాన్ని అంగీకరించిన తర్వాత, వారు ఫ్యామిలీ సర్వీస్‌లకు పూర్తి యాక్సెస్‌ను పొందుతారు. ఉదాహరణకు, ఫ్యామిలీ గ్రూప్‌నకు పంపిన ఈమెయిల్‌లను పెండింగ్‌లో ఉన్న ఫ్యామిలీ మెంబర్ స్వీకరిస్తారు, కానీ వారు తమ ఆహ్వానాన్ని అంగీకరించే వరకు, ఫ్యామిలీ ఈమెయిల్‌లను పంపడానికి, Assistantను ఉపయోగించలేరు.
 
పరిమిత యాక్సెస్‌తో ఉన్న ఫ్యామిలీ మెంబర్‌లు g.co/YourFamilyలో వారి ఆహ్వానాన్ని అంగీకరించవచ్చు.

ఆహ్వానించబడిన ఫ్యామిలీ మెంబర్

ఫ్యామిలీలో చేరడానికి ఆహ్వానం అంగీకరించే వరకు 'ఆహ్వానించబడిన ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ సర్వీస్‌లను యాక్సెస్ చేయలేరు.

  • ఫ్యామిలీలో చేరడానికి, ఆహ్వానించబడిన మెంబర్ వారి ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌కు పంపిన ఆహ్వానాన్ని అంగీకరించవచ్చు.
  • ఆహ్వానాన్ని తిరిగి పంపడానికి, ఆహ్వానించబడిన మెంబర్‌ను ఫ్యామిలీ నుండి తీసివేసి, వారిని మళ్ళీ జోడించండి.

ఫ్యామిలీగా మీరు ఉపయోగించగల Google ప్రోడక్ట్‌లు

మీరు ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేసిన తర్వాత, మీరు వీటిని చేయవచ్చు:

  • ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించడం: మీరు ఒకదాన్ని సెటప్ చేస్తే, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్ ద్వారా మీ ఫ్యామిలీ Google Playలో కొనుగోళ్లను చేయవచ్చు.
  • ఫ్యామిలీ సర్వీసులను ఉపయోగించడం: Google One, Google Play ఫ్యామిలీ లైబ్రరీ, YouTube TV ఫ్యామిలీ ప్లాన్ వంటి ఫ్యామిలీ సర్వీస్‌లను ఉపయోగించుకోవచ్చు లేదా సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీకి అందుబాటులో ఉన్న సర్వీస్‌లను కనుగొనడానికి, g.co/YourFamily లింక్‌కు వెళ్లండి.
  • షేర్ చేసిన స్టోరేజ్ ఉపయోగించడం: మీరు Google One మెంబర్‌గా మారవచ్చు అలాగే గరిష్టంగా 5 మంది ఫ్యామిలీ మెంబర్‌లతో స్టోరేజ్‌ను షేర్ చేసుకోవచ్చు. Google One ఫ్యామిలీ షేరింగ్ ఎలా పని చేస్తుందో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
320301748843898829
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false