Google Playలో రీఫండ్‌ల గురించి తెలుసుకోండి

కింద వివరించిన రీఫండ్ పాలసీల ఆధారంగా, Google కొన్ని Google Play కొనుగోళ్లకు రీఫండ్ ఇవ్వవచ్చు. మీరు నేరుగా డెవలపర్‌ను కూడా సంప్రదించవచ్చు.

యునైటెడ్ కింగ్‌డమ్, ఐరోపా ఆర్థిక మండలి యూజర్‌ల కోసం

మీరు ఐరోపా ఆర్థిక మండలి లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉండి, మార్చి 28, 2018 లేదా ఆ తర్వాత కొనుగోలు చేసి ఉంటే, రీఫండ్‌ను ఎలా పొందాలో తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో మీరు చేసిన కొనుగోళ్లకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

  • మీరు యాప్‌ను గానీ లేదా యాప్‌లో గానీ కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల లోపు అయితే: మీరు Google Play ద్వారా రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • మీరు సినిమాలు, పుస్తకాలు లేదా ఇతర కంటెంట్‌ను కొన్నట్లయితే: మీరు 48 గంటల తర్వాత కూడా రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు (దిగువున పేర్కొన్న పాలసీని చెక్ చేయండి).

సాధారణంగా మీకు 1 పని దినం లోపే నిర్ణయం తెలియజేయబడుతుంది, కానీ కొన్నిసార్లు 4 పని దినాల వరకు కూడా పట్టవచ్చు.

రీఫండ్ రిక్వెస్ట్ స్టేటస్‌ను చెక్ చేయండి

మీరు Google Play వెబ్‌సైట్ ద్వారా లేదా ఎగువున ఉన్న “రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయండి” బటన్ ద్వారా రీఫండ్‌ను రిక్వెస్ట్ చేసిన తర్వాత, మీ రిక్వెస్ట్ స్టేటస్‌ను చెక్ చేయవచ్చు.

ఇటీవలి కొనుగోళ్లలో రీఫండ్ లిస్ట్ కాకుంటే, దాని కోసం రిక్వెస్ట్ చేయండి

ఈ మధ్య కాలంలో కొనుగోలు చేసిన లిస్ట్‌లో మీ కొనుగోలు కనిపించకపోతే, Google Play వెబ్‌సైట్ నుండి మీరు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు. రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, కింద పేర్కొన్న ఆప్షన్‌లను ఉపయోగించండి.

రీఫండ్ రిక్వెస్ట్ ఆప్షన్‌లను అన్వేషించండి

ఆప్షన్ 1: Google Play వెబ్‌సైట్‌లో రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి
  • మీరు యాప్‌ను గానీ లేదా యాప్‌లో గానీ కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల లోపు అయితే: మీరు Google Play ద్వారా రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • మీరు సినిమాలు, పుస్తకాలు లేదా ఇతర కంటెంట్‌ను కొన్నట్లయితే: మీరు 48 గంటల తర్వాత కూడా రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు (దిగువున పేర్కొన్న పాలసీని చెక్ చేయండి).
  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాతబడ్జెట్ & ఆర్డర్ హిస్టరీ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు రిటర్న్ చేయాలనుకుంటున్న ఆర్డర్ కోసం, సమస్యను రిపోర్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీ పరిస్థితిని వివరించే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. ఫారమ్‌ను పూర్తి చేసి, మీరు రీఫండ్‌ను కోరుకుంటున్నట్లు సూచించండి.
  7. సమర్పించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా:

  • ఒకవేళ మీకు పలు రీఫండ్ రిక్వెస్ట్‌లు ఉంటే, మీరు కొనుగోలు చేసిన ప్రతి ఐటెమ్ కోసం ఈ దశలను రిపీట్ చేయండి.
  • మీరు ఆర్డర్‌ను కనుగొనలేకపోతే, దాన్ని మీరు వేరొక Google ఖాతాను ఉపయోగించి కొనుగోలు చేసి ఉంటారు. ఖాతాలను మార్చడం ఎలాగో తెలుసుకోండి.
  • రీఫండ్ నిర్ణయాలతో కూడిన చాలా ఈమెయిళ్లు 15 నిమిషాలలోపు అందుతాయి, కానీ 4 పని దినాలు కూడా పట్టవచ్చు.
  • హార్డ్‌వేర్ పరికరలకు: మీరు Google Storeలో కొనుగోలు చేసిన పరికరాలను వాపసు చేయడానికి లేదా రీఫండ్‌ను పొందడానికి Google Store రీఫండ్‌ల పేజీకి వెళ్లండి.
ఆప్షన్ 2: Google Assistantలో రీఫండ్ కోసం అడగండి

మీకు Google Play రీఫండ్ కావాలని మీరు మీ పరికరంలోని Google Assistantతో కూడా చెప్పవచ్చు.

Google Assistant ద్వారా రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, మీ పరికరంలో తప్పనిసరిగా US ఇంగ్లీష్‌ను ఉపయోగించాలి.

Google Assistant గురించి మరింత తెలుసుకోండి.

ఆప్షన్ 3: యాప్ డెవలపర్ నుండి  సపోర్ట్‌ను పొందండి

Play స్టోర్‌లోని యాప్‌లు చాలా వరకు థర్డ్-పార్టీ డెవలపర్‌ల ద్వారా రూపొందించబడ్డాయి. Google ద్వారా కాదు. డెవలపర్‌లు వారి యాప్‌లకు సపోర్ట్‌ను అందించాలి, అవి మీ కోసం సక్రమంగా పని చేసేలా చూడటం వారి బాధ్యత.

కింది సందర్భాలలో మీరు యాప్ డెవలపర్‌ను సంప్రదించాలి:

  • మీకు యాప్ గురించి సందేహం ఉన్నప్పుడు.
  • మీరు యాప్‌లో చేసిన కొనుగోలు అందనప్పుడు లేదా మీరు ఆశించిన మేరకు పని చేయనప్పుడు. 
  • కొనుగోలు చేసిన 48 గంటల తర్వాత మీరు రీఫండ్‌ను కోరినప్పుడు. కొనుగోలుకు సంబంధించిన సమస్యలకు డెవలపర్ సహాయం అందించగలరు, దానికి సంబంధించిన పాలసీలు, వర్తించే చట్టాలకు అనుగుణంగా రీఫండ్‌లను ప్రాసెస్ చేయగలరు​.  

యాప్ డెవలపర్‌ను ఎలా సంప్రదించాలో కనుగొనండి.

గమనిక: రీఫండ్ రిక్వెస్ట్‌లకు సంబంధించిన కొంత సమాచారం డెవలపర్‌లతో షేర్ చేయబడవచ్చు.

ఆప్షన్ 4: Google Play Store యాప్‌లో రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

ముఖ్య గమనిక:

  • ప్రస్తుతం, మీరు Play Store యాప్ నుండి యాప్‌లో కొనుగోళ్ల కోసం మాత్రమే రీఫండ్‌లను రిక్వెస్ట్ చేయగలరు.
  • యాప్‌లో లేని కొనుగోళ్ల కోసం, దయచేసి ఎగువన ఉన్న “రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి” బటన్‌ను ఉపయోగించండి లేదా ఈ పేజీలో ప్రత్యామ్నాయ రీఫండ్ రిక్వెస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  1. Play Store యాప్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు > బడ్జెట్ & హిస్టరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్న ఆర్డర్ కోసం, లావాదేవీ వివరాలను చూడటానికి వీక్షణపై క్లిక్ చేయండి.
  5. సమస్యను రిపోర్ట్ చేయడానికి క్లిక్ చేయండి.
  6. డ్రాప్‌డౌన్ నుండి రీఫండ్ కోసం కారణాన్ని ఎంచుకోండి.
  7. సమర్పించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా:

  • ఒకవేళ మీకు పలు రీఫండ్ రిక్వెస్ట్‌లు ఉంటే, మీరు కొనుగోలు చేసిన ప్రతి ఐటెమ్ కోసం ఈ దశలను రిపీట్ చేయండి.
  • మీరు ఆర్డర్‌ను కనుగొనలేకపోతే, దాన్ని మీరు వేరొక Google ఖాతాను ఉపయోగించి కొనుగోలు చేసి ఉంటారు. ఖాతాలను స్విచ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
  • సాధారణంగా మీకు 1 పని దినం లోపే నిర్ణయం తెలియజేయబడుతుంది, కానీ కొన్నిసార్లు 4 పని దినాల వరకు కూడా పట్టవచ్చు.

Google Play రీఫండ్ పాలసీలు

మీరు ఏమి కొనుగోలు చేశారనే దానిని బట్టి రీఫండ్ పాలసీలు భిన్నంగా ఉంటాయి. మరింత సమాచారం కోసం లింక్‌ను ఎంచుకోండి.

పెయిడ్ యాప్‌ను మొదటిసారి కొనుగోలు చేసిన తర్వాత వెంటనే మీరు దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేస్తే, మీరు ఆటోమేటిక్‌గా రీఫండ్‌ను పొందవచ్చు. మీరు యాప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, మీరు దాన్ని మళ్లీ కొనుగోలు చేయవలసి ఉంటుంది, ఆ కొనుగోలుకు సంబంధించిన రీఫండ్‌కు మీకు అర్హత ఉండకపోవచ్చు.

మీరు మీ ఖాతా లేదా పేమెంట్ వివరాలను మరొకరికి ఇచ్చినా, మా పాలసీలను దుర్వినియోగం చేస్తున్నట్లు కనిపించినా లేదా మీ ఖాతాకు ప్రామాణీకరణతో కూడిన రక్షణ కల్పించక పోయినా, మేము సాధారణంగా రీఫండ్‌ను ఇవ్వలేము.
యాప్‌లు, గేమ్‌లు & యాప్‌లో కొనుగోళ్లు (సబ్‌స్క్రిప్షన్‌లతో సహా)
చాలా వరకు Google Play కొనుగోళ్లకు సంబంధించి, Google సాధారణంగా రీఫండ్‌లు ఇవ్వదు. అయితే, కింద వివరించబడిన కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మీరు నేరుగా డెవలపర్‌ను కూడా సంప్రదించవచ్చు. కొనుగోలుకు సంబంధించిన సమస్యలకు డెవలపర్ సహాయం అందించగలరు, అలాగే వాటికి సంబంధించిన పాలసీలు, వర్తించే చట్టాలకు అనుగుణంగా రీఫండ్‌లను ప్రాసెస్ చేయగలరు.

రీఫండ్ పాలసీ

  1. 48 గంటల లోపు: కొనుగోలు వివరాలను బట్టి మీరు రీఫండ్‌ను పొందగలుగుతారు. ఈ సూచనలను ఫాలో అవ్వండి.
  2. 48 గంటల తర్వాత: డెవలపర్‌లకు వారి స్వంత పాలసీలు, చట్టపరమైన అవసరాలు ఉంటాయి, కనుక వాటికి అనుగుణంగా మీకు రీఫండ్ ఇవ్వగలుగుతారు. మీ రీఫండ్ సమస్యను పరిష్కరించడానికి, దాన్ని పొందగలరో లేదో తెలుసుకోవడానికి, డెవలపర్‌ను సంప్రదించండి.

ముఖ్యమైనది:  

  • మీరు యాప్‌ను లేదా గేమ్‌ను ఒకసారి మాత్రమే రీఫండ్ కోసం వాపసు చేయవచ్చు. మీరు దాన్ని మళ్ళీ కొంటే, మీరు రీఫండ్‌ను పొందలేరు. రీఫండ్ జారీ చేయబడితే, మీరు ఐటెమ్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు. 
  • మీరు పలు ఐటెమ్‌లను ఒకేసారి కొనుగోలు చేస్తే, మీరు మొత్తం కొనుగోలును మాత్రమే రీఫండ్ చేయగలరు. మీరు ఆ కొనుగోలులోని ఐటెమ్‌లను విడివిడిగా రీఫండ్ చేయలేరు.
Google Play Pass
మీ Play Pass సబ్‌స్క్రిప్షన్‌ను ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. మీరు పేమెంట్ చేసిన వ్యవధి చివరి దాకా ఆ సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్ మీకు ఉంటుంది.
  • మీరు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న మొదటి 48 గంటల లోపు రద్దు చేసి, రీఫండ్‌ను రిక్వెస్ట్ చేస్తే, మీరు రద్దు చేసిన నెలకు సంబంధించిన ధరను మేము రీఫండ్ చేయవచ్చు.
Play పాయింట్‌లు

మీరు Google Playలో కొనుగోలు చేసిన ఐటెమ్‌ను రీఫండ్ చేయగలిగితే, ఆ కొనుగోలులో సంపాదించిన పాయింట్‌లు ఏవైనా ఉంటే, అవి మీ Play పాయింట్‌ల బ్యాలెన్స్, అలాగే స్థాయి ప్రోగ్రెస్ నుండి తీసివేయబడతాయి.

  • రీఫండ్ చేసిన ఐటెమ్ నుండి తీసివేసిన పాయింట్‌లను కవర్ చేయడానికి తగినన్ని పాయింట్‌లు మీ వద్ద లేకపోతే, మీ పాయింట్‌ల బ్యాలెన్స్ నెగిటివ్ అవుతుంది. 
  • మీ స్థాయి ప్రోగ్రెస్ నుండి పాయింట్‌లు తీసివేసిన తర్వాత మీ ప్రస్తుత స్థాయి వద్ద ఉండటానికి తగిన పాయింట్‌లు మీకు లేకపోతే, మీరు ఒక స్థాయి కిందకు తగ్గవచ్చు. 
  • మీరు కూపన్‌ను ఉపయోగించి చేసిన కొనుగోలుకు రీఫండ్‌ను పొందితే, మీ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి పేమెంట్ చేసిన మొత్తాన్ని, కూపన్ కోసం మీరు ఉపయోగించిన పాయింట్‌లను మీరు తిరిగి పొందుతారు. అందుబాటులో ఉంటే, మీరు మరొక కూపన్ కోసం పాయింట్‌లను మార్పిడి చేసుకోవలసి ఉంటుంది. 
  • యాప్, గేమ్, యాప్‌లోని ఐటెమ్ కోసం మీరు పాయింట్‌లను ఉపయోగించి, రీఫండ్ కావాలనుకుంటే, మా రీఫండ్ పాలసీలను చెక్ చేయండి.
  • మంచి కారణం కొరకు సపోర్ట్‌ను అందించడానికి లేదా Play క్రెడిట్ కోసం, ఉపయోగించబడిన పాయింట్‌లకు రీఫండ్ ఇవ్వబడదు.

Play పాయింట్‌ల సర్వీస్ నియమాల గురించి మరింత తెలుసుకోండి.

Google Play Movies & TV లేదా Google TVని తెరవండి
మీ వీడియో సక్రమంగా ప్లే కాకుంటే, ఈ ప్లేబ్యాక్ సమస్యలను పరిష్కరించే చిట్కాలు ట్రై చేయండి. మీరు ఇప్పటికీ రీఫండ్ కావాలనుకుంటే లేదా మరొక కారణం చేత రీఫండ్‌ను రిక్వెస్ట్ చేస్తుంటే, కింది సమాచారాన్ని చూడండి. 

రీఫండ్ లభ్యత

  • మీరు దాన్ని చూడటం ఇంకా ప్రారంభించకపోతే, మీరు కొనుగోలు చేసిన 7 రోజుల లోపు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • మీ సినిమా లేదా టీవీ షో లోపభూయిష్టంగా ఉంటే, అందుబాటులో లేకుంటే లేదా పనితీరు పేర్కొన్న విధంగా లేకుంటే, కొనుగోలు చేసిన 65 రోజుల లోపు మీరు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • మీరు సినిమా లేదా టీవీ షోను రీఫండ్ కోసం వాపసు చేస్తే, అది మీ లైబ్రరీ నుండి తీసివేయబడుతుంది, మీరు దాన్ని చూడలేక పోవచ్చు.
Google Play Books

మీ ఈ-బుక్ లేదా ఆడియోబుక్ లోడ్ కాకపోయినా లేదా ప్లే కాకపోయినా, ఈ పరిష్కార ప్రక్రియ దశలను ట్రై చేయండి. మీరు ఇప్పటికీ రీఫండ్ కావాలనుకుంటే లేదా మరొక కారణం చేత రీఫండ్‌ను రిక్వెస్ట్ చేస్తుంటే, కింది సమాచారాన్ని చూడండి.

ఒక దాన్ని వాపసు ఇవ్వడం, బుక్స్ బండిల్స్ కోసం రీఫండ్ లభ్యత

ఇ-బుక్‌ల రీఫండ్‌ల కోసం:

  • అన్ని అమ్మకాలు ఫైనల్ అయిన ఇ-బుక్‌ల అద్దె వ్యవధులు మినహాయించి, మీరు కొనుగోలు చేసిన 7 రోజుల లోపు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • ఈ-బుక్ పని చేయకపోతే, కొనుగోలు చేసిన 65 రోజుల లోపు ఎప్పుడైనా మీరు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • మీరు ఈ-బుక్‌ల బండిల్‌ను కొనుగోలు చేసినట్లైతే, మీరు మొత్తం బండిల్‌కు మాత్రమే రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయగలరు.

మీరు ఆడియోబుక్‌ను ఎక్కడ కొనుగోలు చేశారు అనే దానిపై ఆడియోబుక్‌ల రీఫండ్‌లు ఆధారపడి ఉంటాయి:

  • కింది సందర్భాలలో మినహాయించి, అన్ని కొనుగోళ్లు ఫైనల్‌గా పరిగణించబడతాయి:
    • దక్షిణ కొరియా కస్టమర్‌లు: మీరు ఆడియోబుక్‌ను వినడం ప్రారంభించనంత వరకు, కొనుగోలు చేసిన 7 రోజుల లోపు మీరు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
    • ఆడియోబుక్ పని చేయకపోతే, మీరు ఎప్పుడైనా రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.

బండిల్స్ రీఫండ్‌ల కోసం:

  • బండిల్‌లో మల్టిపుల్ బుక్‌లను మీరు డౌన్‌లోడ్ లేదా ఎగుమతి చేయనంత వరకూ, కొనుగోలు చేసిన 7 రోజుల లోపు మీరు మొత్తం బండిల్ కోసం రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • బండిల్‌లోని బుక్ పని చేయకపోతే, కొనుగోలు చేసిన 180 రోజుల లోపు మీరు ఆ బుక్ కోసం రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.

మీ రీఫండ్ ఆమోదించబడితే, ఈ-బుక్ లేదా ఆడియోబుక్ మీ లైబ్రరీ నుండి తీసివేయబడవచ్చు, మీరు దాన్ని చదవడం లేదా వినడం సాధ్యం కాకపోవచ్చు.

"గ్రూప్‌ల కోసం కొనండి" వంటి మల్టీ క్వాంటిటీ కొనుగోళ్లలో రీఫండ్‌ల కోసం ఈ కింది దశలను ఫాలో అవ్వండి:

  • మీరు కొనుగోలు చేసిన లైసెన్స్‌లలో దేనినీ ఇంకా రిడీమ్ చేయనంత వరకు మీరు కొనుగోలు చేసిన 7 రోజులలోపు పూర్తి రీఫండ్ కోసం అడగవచ్చు.
  • బుక్ చేయడం పని చేయకపోతే, మీరు కొనుగోలు చేసిన 65 రోజులలోపు పూర్తి రీఫండ్ కోసం అడగవచ్చు.
  • మీరు కొనుగోలు చేసిన 30 రోజులలోపు రిడీమ్ చేయని లైసెన్స్‌ల కోసం పాక్షిక రీఫండ్ కోసం అడగవచ్చు.
Google Play న్యూస్‌స్టాండ్

సింగిల్ సంచికలు

సంచికను మీరు యాక్సెస్ చేయలేకపోతే లేదా కంటెంట్ లోపభూయిష్టంగా ఉంటే మినహా, మ్యాగజైన్ టైటిల్‌ల సింగిల్ సంచిక కొనుగోళ్లకు రీఫండ్ చేయబడదు.

సబ్‌స్క్రిప్షన్‌లు

ఇలా జరిగితే, సబ్‌స్క్రిప్షన్‌లను ఎప్పుడైనా రద్దు చేయవచ్చు:

  1. మీరు కంటెంట్‌ను యాక్సెస్ చేయలేకపోయినప్పుడు, లేదా
  2. తీసుకున్న మొదటి 7 రోజుల లోపు మీరు సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసినప్పుడు.
చిట్కా: మేము యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌లకు మాత్రమే రీఫండ్ అందిస్తాము, ఇప్పటికే ముగిసిన సబ్‌స్క్రిప్షన్‌లకు రీఫండ్‌ను ఇవ్వలేము. మీరు పబ్లికేషన్‌ను వాపసు చేస్తే, అది మీ లైబ్రరీ నుండి తీసివేయబడుతుంది, మీరు దాన్ని యాక్సెస్ చేయలేక పోవచ్చు.
Subscribe with Google

సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడం 

  1. మీ Google ఖాతాలో, పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు విభాగానికి వెళ్లండి.
  2. రద్దు చేయడానికి, పాజ్ చేయడానికి లేదా సబ్‌స్క్రిప్షన్‌ను మార్చడానికి, “సబ్‌స్క్రిప్షన్‌లు,” కింద ఉన్న సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 

Google Playలో సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా రద్దు చేయాలి, పాజ్ చేయాలి లేదా ఎలా మార్చాలి అనేదాని గురించి తెలుసుకోండి.

సబ్‌స్క్రిప్షన్ సంబంధించి, రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడం

Google Play కొనుగోలు సంబంధించి, రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడం ఎలాగో తెలుసుకోండి. రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, మీరు Google Play సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు.

ఎక్కువగా, Subscribe with Google కొనుగోళ్లకు సంబంధించి, (1) అవి లోపాలను కలిగి ఉన్నప్పుడు; (2) Subscribe with Google ఇంటర్‌ఫేస్‌లో వాటి గురించి పేర్కొన్న ప్రయోజనాలతో అవి మ్యాచ్ కానప్పుడు; లేదా (3) Subscribe with Google అదనపు సర్వీస్ నియమాలలో వివరించిన విధంగా మీరు ఉపసంహరణ హక్కును కలిగి ఉన్నప్పుడు తప్ప, మిగిలిన సందర్భాలలో Google రీఫండ్‌లను అందజేయదు.

గమనిక: అవాంఛిత కొనుగోళ్లు జరగకుండా మీ ఖాతాను కాపాడుకోవడానికి మీరు తగు చర్యలు తీసుకోకపోతే – ఉదాహరణకు, మీ ఖాతా లేదా పేమెంట్ వివరాలను మరొకరికి అందించి ఉండటం లేదా మీ ఖాతాకు ప్రామాణీకరణతో కూడిన భద్రత కల్పించకపోవడం లాంటివి – సాధారణంగా ఇలాంటి సందర్భాలలో మేము రీఫండ్ ఇవ్వలేము.

Google Assistantలో ఈ చర్యకు లోబడి కొనుగోలు చేయండి

రీఫండ్ పాలసీ

  1. 48 గంటల లోపు: కొనుగోలు వివరాలను బట్టి మీరు రీఫండ్‌ను పొందగలుగుతారు. ఈ సూచనలను ఫాలో అవ్వండి.
  2. 48 గంటల తర్వాత: డెవలపర్‌లకు వారి స్వంత పాలసీలు, చట్టపరమైన అవసరాలు ఉంటాయి, కనుక వాటికి అనుగుణంగా మీకు రీఫండ్ ఇవ్వగలుగుతారు. మీ రీఫండ్ సమస్యను పరిష్కరించడానికి, దాన్ని పొందగలరో లేదో తెలుసుకోవడానికి, డెవలపర్‌ను సంప్రదించండి.
Google Play గిఫ్ట్ కార్డ్‌లు & Google Play బ్యాలెన్స్

Play గిఫ్ట్ కార్డ్‌లు ఇంకా క్యాష్ టాప్ అప్‌లతో సహా, ఇతర ప్రీపెయిడ్ Play బ్యాలెన్స్, చట్ట ప్రకారం అవసరం అయితే తప్ప, మిగిలిన సందర్భాలలో రీఫండ్ చేయబడవు లేదా బదిలీ చేయబడవు (ఉదాహరణకు, తక్కువ వయస్సు గల యూజర్ ఖాతాలు). ప్రమోషన్ కోసం ఇచ్చే Play బ్యాలెన్స్ రీఫండ్ చేయబడదు లేదా బదిలీ చేయబడదు.

  • గిఫ్ట్ కార్డ్‌లు లేదా ప్రమోషన్‌లో భాగంగా కాకుండా సాధారణంగా వచ్చిన గిఫ్ట్ కోడ్‌లను రిడీమ్ చేసుకున్న U.S నివాసులు, ఆ మొత్తం $10 కంటే తక్కువ అయితే, వారి Google Play బ్యాలెన్స్ రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • గిఫ్ట్ కార్డ్‌లు లేదా ప్రమోషన్‌లో భాగంగా కాకుండా సాధారణంగా వచ్చిన గిఫ్ట్ కోడ్‌లను రిడీమ్ చేసుకున్న బ్రెజిలియన్ నివాసులు, నిర్దిష్ట షరతులకు అనుగుణంగా ఉన్నట్లయితే, వారి Google Play బ్యాలెన్స్ రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు. ఈ షరతులలో భాగంగా, అమౌంట్ అనేది నిర్దిష్ట థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉందని, నిర్దిష్ట వ్యవధిలో ఎలాంటి రీఫండ్‌లు జారీ చేయబడలేదని మేము పేర్కొనవచ్చు.
  • గిఫ్ట్ కార్డ్‌లు లేదా ప్రమోషన్‌లో భాగంగా కాకుండా సాధారణంగా వచ్చిన గిఫ్ట్ కోడ్‌లను రిడీమ్ చేసుకున్న కొరియా నివాసులు, గిఫ్ట్ కార్డ్ ఫేస్ వాల్యూలో 40%కు సమానమైన లేదా అంత కంటే తక్కువ శాతాన్ని రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు, కాకపోతే వారి Google Play బ్యాలెన్స్‌లో వారు రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేసిన మొత్తం ఉండాలి.
  • ఆర్థికపరమైన సర్వీస్‌లను ఉపయోగించే కన్జ్యూమర్‌లతో న్యాయంగా వ్యవహరించడానికి సంబంధించిన పాలసీకి అనుగుణంగా ఉండటానికి, గిఫ్ట్ కార్డ్‌లు లేదా ప్రమోషన్‌లో భాగం కాని గిఫ్ట్ కోడ్‌లను రిడీమ్ చేసుకున్న మలేషియా నివాసులు, వారి Google Play బ్యాలెన్స్ రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు, అయితే ఈ రీఫండ్ రిక్వెస్ట్‌ను ఒకసారికి మాత్రమే చేయవచ్చు.

Google Play గిఫ్ట్‌లు
ముఖ్యమైనది: ఇది కేవలం Google Play క్రెడిట్ గిఫ్ట్‌లకు లేదా Google నుండి కొనుగోలు చేసిన Google Play Booksకు మాత్రమే వర్తిస్తుంది. మీ గిఫ్ట్‌ను థర్డ్-పార్టీ రిటైలర్ ద్వారా కొనుగోలు చేసి ఉంటే, రీఫండ్ సమాచారం కోసం రిటైలర్‌ను సంప్రదించండి.  మీ గిఫ్ట్‌ను వాపసు చేయాలనుకుంటే, ఆ సంగతి కొనుగోలుదారుకు తెలియజేయండి, తద్వారా వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు.

చిట్కాలు:

  • గిఫ్ట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తికి మాత్రమే మేము రీఫండ్‌ను జారీ చేస్తాము.
  • రిడీమ్ చేయని గిఫ్ట్‌లకు మాత్రమే రీఫండ్‌లు జారీ చేయబడతాయి.
  • గిఫ్ట్‌కు రీఫండ్ ఇచ్చిన తర్వాత గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేయలేరు.
  • Google Play క్రెడిట్ గిఫ్ట్‌ల కోసం, రీఫండ్‌లు కొనుగోలు తేదీ నుండి 3 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Google Play విరాళాలు
లాభాపేక్ష రహిత సంస్థలకు ఇచ్చిన విరాళాలకు రీఫండ్ పొందలేరు. మీకు పేమెంట్‌తో సమస్యలు ఉంటే, మా సపోర్ట్ టీమ్‌ను కాంటాక్ట్ చేయండి.
పాక్షిక రీఫండ్‌లు

ముఖ్యమైనది: మీరు "వెంటనే రద్దు చేయండి" అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే, మీ సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయబడుతుంది ఇంకా మీరు వెంటనే కంటెంట్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు.

ఈ పాలసీ, ఇజ్రాయెల్ లేదా జర్మనీలో ఉన్న యూజర్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ఇజ్రాయెల్ లేదా జర్మనీలో ఉన్నట్లయితే, తక్షణమే మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసి, పాక్షిక రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. రద్దు చేయడానికి, రద్దు చేయడానికి సంబంధించిన సూచనలను ఫాలో చేయండి అలాగే వెంటనే రద్దు చేసే ఆప్షన్‌ను ఎంచుకొని, పాక్షిక రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయండి. మీ పాక్షిక రీఫండ్ అనేది, సబ్‌స్క్రిప్షన్‌లో మిగిలి ఉన్న రోజుల ఆధారంగా లెక్కించబడుతుంది.

కోడ్‌ను ఉపయోగించి కిరాణా షాప్‌లో పేమెంట్ చేసిన ఐటెమ్‌ల కోసం రీఫండ్‌లు
కోడ్‌ను ఉపయోగించి మీరు కిరాణా షాప్‌లో ఐటెమ్‌ల కోసం పేమెంట్ చేసి ఉండి, ఆ తర్వాత రీఫండ్‌ను రిక్వెస్ట్ చేస్తే, Google Play నుండి మీకు ఇవ్వబడిన రీఫండ్‌లు మీకు తిరిగి Google Play క్రెడిట్‌గా ఇవ్వబడతాయి.
Stadia
Stadia రీఫండ్ పాలసీల గురించి మరింత తెలుసుకోండి.

రీఫండ్‌కు పట్టే సమయాలు

Google Play నుండి లభించే రీఫండ్‌లు, ఒరిజినల్ కొనుగోలు చేయడానికి ఉపయోగించిన పేమెంట్ ఆప్షన్‌కు పంపబడతాయి. మీరు ఎలా పేమెంట్ చేశారనే దాన్ని బట్టి రీఫండ్‌ల కోసం సమయం వేర్వేరుగా ఉంటుంది. 

మీ రీఫండ్ కోసం ఆశించిన దాని కంటే ఎక్కువ సమయం పడితే, మీ Google Pay ఖాతాలో మీ రీఫండ్ స్టేటస్‌ను చెక్ చేయండి. ఒకవేళ స్టేటస్‌లో "రీఫండ్ చేయబడింది" అని చూపుతుంటే, మీ పేమెంట్ ఆప్షన్‌లో మీకు క్రెడిట్ కనిపిస్తుంది. ఒకవేళ స్టేటస్‌లో "రద్దు చేయబడింది" అని చూపుతుంటే, ఆర్డర్‌కు ఎలాంటి ఛార్జి విధించలేదని అర్థం. కనుక మీ పేమెంట్ ఆప్షన్‌లో క్రెడిట్ కనిపించదు. 

YouTube

YouTube రీఫండ్ పాలసీల గురించి మరింత తెలుసుకోండి

రీఫండ్‌కు పట్టే సమయాలు

Google Play నుండి లభించే రీఫండ్‌లు ఒరిజినల్‌గా కొనుగోలు చేయడానికి ఉపయోగించిన పేమెంట్ ఆప్షన్‌కు పంపబడతాయి. మీరు ఎలా పేమెంట్ చేశారనే దాన్ని బట్టి రీఫండ్‌ల కోసం వివిధ రకాలుగా సమయం పడుతుంది.

మీ రీఫండ్ కోసం ఆశించిన దాని కంటే ఎక్కువ సమయం పడితే, మీ Google Pay ఖాతాలో మీ రీఫండ్ స్టేటస్‌ను చెక్ చేయండి. ఒకవేళ స్టేటస్‌లో "రీఫండ్ చేయబడింది" అని చూపుతుంటే, మీ పేమెంట్ ఆప్షన్‌లో మీకు క్రెడిట్ కనిపిస్తుంది. ఒకవేళ స్టేటస్‌లో "రద్దు చేయబడింది" అని చూపుతుంటే, ఆర్డర్‌కు ఎలాంటి ఛార్జీ విధించలేదని అర్థం. కనుక మీ పేమెంట్ ఆప్షన్‌లో క్రెడిట్ కనిపించదు.
రీఫండ్ టైమ్‌లైన్‌లు

Google Play నుండి లభించే రీఫండ్‌లు ఒరిజినల్ కొనుగోలు చేయడానికి ఉపయోగించిన చెల్లింపు విధానానికి పంపబడతాయి. మీరు ఎలా పేమెంట్ చేశారనే దాన్ని బట్టి రీఫండ్‌ల కోసం వివిధ రకాలుగా సమయం పడుతుంది.

మీ రీఫండ్ కోసం అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పడుతుంటే, మీ Google Pay ఖాతాలో రీఫండ్ స్టేటస్‌ను చూడవచ్చు. ఒకవేళ స్టేటస్ గనుక "రీఫండ్ ఇవ్వబడింది" అని కనిపిస్తే, మీ పేమెంట్ ఆప్షన్‌లో మీకు క్రెడిట్ కనిపిస్తుంది. ఒకవేళ స్టేటస్ "రద్దు చేయబడింది" అని చూపుతుంటే, ఆర్డర్‌కు ఎలాంటి ఛార్జ్ విధించలేదని అర్థం. కనుక మీ పేమెంట్ ఆప్షన్‌లో రీఫండ్ కనిపించదు.

పేమెంట్ ఆప్షన్

అంచనా వేయబడిన రీఫండ్ సమయం

క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్

3–5 పని దినాలు

ప్రాసెసింగ్ సమయం, కార్డ్ జారీ చేసిన సంస్థచే ప్రభావితమవుతుంది, కొన్ని సార్లు దీనికి 10 పని దినాల వరకు సమయం పట్టవచ్చు.

మీ క్రెడిట్ కార్డ్ ఇకపై యాక్టివ్‌గా లేకపోతే, మీ కార్డ్‌ను జారీ చేసిన బ్యాంక్‌కు రీఫండ్స్ వెళతాయి. నిధులను రికవర్ చేసుకోవడానికి బ్యాంక్‌ను కాంటాక్ట్ చేయండి.

TrueMoney Wallet, Linepay (தாய்லாந்தில் மட்டும்)

1–5 పని దినాలు

రీఫండ్‌లు యూజర్ ఖాతాలో కనిపించాలి.

AliPayHK (హాంకాంగ్‌లో మాత్రమే)

1–5 పని దినాలు

రీఫండ్‌లు యూజర్ ఈ-వాలెట్ ఖాతాలో కనిపించాలి.

Boost (మలేషియా మాత్రమే) 1–5 పని దినాలు
Coins.ph (ఫిలిప్పీన్స్‌లో మాత్రమే)

1–5 పని దినాలు

రీఫండ్‌లు యూజర్ ఖాతాలో కనిపించాలి.

Edy

1–5 పని దినాలు

రీఫండ్‌లు, మీ Google Play క్రెడిట్ బ్యాలెన్స్‌కు వర్తింపజేయబడతాయి.

Efecty (కొలొంబియాలో మాత్రమే)

1–60 పని దినాలు

రీఫండ్, మీ Google Play ఖాతాలో ప్రమోషనల్ Play బ్యాలెన్స్‌గా పంపబడుతుంది. దీన్ని 12 నెలల్లోపు ఉపయోగించాలి.

FPX (మలేషియా మాత్రమే) 7 రోజులు
GCash

1–5 పని దినాలు

రీఫండ్‌లు యూజర్ ఖాతాలో కనిపించాలి.

మొబైల్ క్యారియర్ బిల్లింగ్ (ప్రీపెయిడ్ / వాడిన దానికే పేమెంట్)

1–30 పని దినాలు

మీ క్యారియర్ ప్రాసెసింగ్ సమయాన్ని ప్రభావితం చేయవచ్చు, కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టవచ్చు.

మొబైల్ క్యారియర్ బిల్లింగ్ (పోస్ట్-పెయిడ్ / కాంట్రాక్ట్)

1–2 నెలవారీ స్టేట్‌మెంట్‌లు

మీ క్యారియర్, ప్రాసెసింగ్ సమయాన్ని ప్రభావితం చేయవచ్చు, కానీ రీఫండ్‌లు సాధారణంగా 2 నెలవారీ బిల్లింగ్ స్టేట్‌మెంట్‌లలో కనిపిస్తాయి. ఒకవేళ దీనికి ఎక్కువ సమయం పడితే, స్టేటస్‌ను చెక్ చేయడానికి మీ క్యారియర్‌ను సంప్రదించండి.

GoPay, OVO (ఇండోనేషియాలో మాత్రమే)

1–5  రోజులు 

Google Play బ్యాలెన్స్ (గిఫ్ట్ కార్డ్ లేదా క్రెడిట్ బ్యాలెన్స్)

1 పని దినం

రీఫండ్‌లు మీ Google Play ఖాతాలో కనబడతాయి. అప్పుడప్పుడూ దీనికి, 3 పని దినాల వరకు సమయం పట్టవచ్చు.

Google Pay

1 పని దినం

రీఫండ్‌లు, మీ Google Pay ఖాతాలో కనిపిస్తాయి. అప్పుడప్పుడూ దీనికి, 3 పని దినాల వరకు సమయం పట్టవచ్చు.

KakaoPay (కొరియాలో మాత్రమే)

3–5 పని దినాలు

కొన్ని సార్లు దీనికి, 10 పని దినాల వరకు సమయం పట్టవచ్చు. రీఫండ్ ప్రాసెస్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటే, మరిన్ని వివరాలతో కూడిన సమాచారం కోసం, KakaoPayను సంప్రదించండి.

Mercado Pago (Brazil and Mexico) 1–5 పని దినాలు
MoMo ఈ-వాలెట్ (వియత్నాంలో మాత్రమే) 1–5 పని దినాలు

నా paysafecard (పోలాండ్, సైప్రస్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, స్లోవేనియా, ఆస్ట్రియా, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్)

3–5 పని దినాలు
Octopus O! ePay (హాంకాంగ్‌లో మాత్రమే)

1–5 పని దినాలు

రీఫండ్‌లు యూజర్ ఈ-వాలెట్ ఖాతాలో కనిపించాలి.

ఆన్‌లైన్ బ్యాంకింగ్

1–10 పని దినాలు

మీ బ్యాంక్‌ను బట్టి ప్రాసెసింగ్ సమయం ప్రభావితమవుతుంది, కానీ దీనికి 4 నుండి 10 పని దినాల వరకూ సమయం పట్టవచ్చు.

PayPal

3–5 పని దినాలు

కొన్ని సార్లు దీనికి, 10 పని దినాల వరకు సమయం పట్టవచ్చు. మీరు PayPalలో పేమెంట్ ఆప్షన్‌కు డబ్బును తిరిగి అందిస్తుంటే (లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా లాగా), మరిన్ని వివరాలతో కూడిన సమాచారం కోసం PayPalను సంప్రదించండి.

Payco (కొరియాలో మాత్రమే)

3–5 పని దినాలు

కొన్ని సార్లు దీనికి, 10 పని దినాల వరకు సమయం పట్టవచ్చు. ఒకవేళ దీనికి ఎక్కువ సమయం పడితే, మరిన్ని వివరాలతో కూడిన సమాచారం కొరకు, PAYCOను సంప్రదించండి.

Paytm (ఇండియా) 1–5 పని దినాల్లో యూజర్‌కు చెందిన ఈ-వాలెట్ ఖాతాలో రీఫండ్‌లు కనిపిస్తాయి.
PIX (బ్రెజిల్ మాత్రమే)

1–5 పని దినాలు

Promptpay (థాయిలాండ్‌లో మాత్రమే)
  • ఆమోదించబడిన రీఫండ్‌లు, ఆటోమేటిక్‌గా తక్షణమే యూజర్ Play ఖాతాలో Play బ్యాలెన్స్‌గా క్రెడిట్ చేయబడతాయి. 
  • ఒరిజినల్ బ్యాంక్ ఖాతాకు సంబంధించి రీఫండ్‌లకు సపోర్ట్ లేదు.
QIWI Кошелек (రష్యా, కజకిస్థాన్)

3–5 పని దినాలు

రీఫండ్‌లు యూజర్ ఖాతాలో కనిపించాలి. 

ShopeePay (ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం) 15 పని దినాలు
Touch n Go ఈ-వాలెట్ (మలేషియాలో మాత్రమే)

1–5 పని దినాలు

TrueMoney వాలెట్ (థాయిలాండ్‌లో మాత్రమే) 1–5 పని దినాలు
VTC Pay (వియత్నాంలో మాత్రమే) 1–5 పని దినాలు
ZaloPay (వియత్నాంలో మాత్రమే) 1–5 పని దినాలు
ЮMoney [YooMoney] 13 పని దినాలు
కిరాణా షాప్‌లు లేదా యూజర్ బ్యాంక్ బదిలీలో పేమెంట్ చేయండి (తైవాన్)

2–3 పని దినాలు

రీఫండ్‌లు యూజర్‌కు చెందిన లింక్ చేసిన E.SUN ఖాతాలో కనిపిస్తాయి.

Verve (నైజీరియాలో మాత్రమే)

1-30 పని దినాలు

రీఫండ్‌ల వల్ల గరిష్ఠ కొనుగోలు మొత్తంలో ఏ మార్పూ జరగదు.

Merpay (జపాన్‌లో మాత్రమే)

1–5 పని దినాలు

రీఫండ్‌లు యూజర్‌కు చెందిన Merpay ఖాతాలో కనిపించాలి.

Paypay (జపాన్‌లో మాత్రమే)

1–5 పని దినాలు

రీఫండ్‌లు యూజర్‌కు చెందిన Paypay ఖాతాలో కనిపించాలి.

బ్యాంక్ బదిలీ (నైజీరియా)

2–15 పని దినాలు

రీఫండ్‌లు యూజర్ ఖాతాలో కనిపించాలి.

క్యారియర్ వాలెట్స్ (ఘనా)

1–3 పని దినాలు

రీఫండ్‌లు యూజర్ ఖాతాలో కనిపించాలి.

BLIK (పోలాండ్ మాత్రమే)

1–10 పని దినాలు

వారి బ్యాంక్ ఆధారంగా, రీఫండ్‌లు యూజర్ ఖాతాలో కనిపిస్తాయి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17639564231237134685
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false