మీ టీవీలో ఉన్న మీ లైబ్రరీలో వీడియోలను చూడండి & మేనేజ్ చేయండి

మీ టీవీలోని, మీ Google లైబ్రరీలో సినిమాలను, షోలను చూడటానికి వివిధ రకాలైన మార్గాలు ఉన్నాయి.
కొన్ని ప్రోడక్ట్‌లు, ఫీచర్‌లు అన్ని దేశాలలో అందుబాటులో లేవు. మీ దేశంలో అందుబాటులో ఉన్న వాటి గురించి మరింత తెలుసుకోండి.

స్మార్ట్ టీవీలో మీ సినిమాలు & షోలను చూడండి

Android TVలో వీడియోలను చూడండి
  1. మీ Android TVలోని, మొదటి స్క్రీన్‌లో "యాప్‌లు" ఉండే అడ్డు వరుసకు స్క్రోల్ చేయండి.
  2. Google Play Movies & TV యాప్ Play Moviesను ఎంచుకోండి.
  3. మీరు చూడాలనుకుంటున్న సినిమాలు, షోలను సెర్చ్ చేయండి.
  4. సినిమా లేదా షోను ఎంచుకోండి.

చిట్కాలు:

  • వాయిస్ ద్వారా సెర్చ్ చేయడానికి: స్క్రీన్ ఎగువ భాగానికి స్క్రోల్ చేసి, మైక్రోఫోన్ Disable micను ఎంచుకోండి. 
  • మీ సెర్చ్‌ను టైప్ చేయడానికి: స్క్రీన్ ఎగువున, కుడి వైపుకు స్క్రోల్ చేసి, ఇన్‌పుట్ Inputను ఎంచుకోండి.
  1. మీ Android TV పరికరంలో, మీరు సరైన ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.
  2. షాప్ ట్యాబ్‌కు వెళ్లండి.
  3. “మీ లైబ్రరీ” టైటిల్‌తో ఉన్న మొదటి అడ్డు వరుసలో, మీరు కొనుగోలు చేసిన కంటెంట్ కనిపిస్తుంది.
    • మీ లైబ్రరీ 10 కంటే టైటిల్స్ ఎక్కువ ఉంటే, “మీ లైబ్రరీ” విభాగంలో, అన్నీ చూడండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

Android TVలో వేరే ఖాతాకు సైన్ ఇన్ చేయండి

Android TVలో వేరొక Google Play Movies & TV ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి, మీ పరికరంలో ప్రస్తుతం ఉన్న ఖాతాను తప్పనిసరిగా మీరు తీసివేయాలి. మీరు ఖాతాను తీసివేసిన తర్వాత, సెటప్ ప్రాసెస్‌ను తప్పనిసరిగా మీరు మళ్లీ కొనసాగించాలి. మరింత సమాచారం కోసం, Android TV సహాయ కేంద్రానికి వెళ్ళండి.

మీ ఫోన్ లేదా టాబ్లెట్‌తో మరొక Google ఖాతా నుండి కూడా మీ Android TVకి మీరు ప్రసారం చేయవచ్చు. మరింత సమాచారం కోసం, Chromecast సహాయ కేంద్రానికి వెళ్ళండి.

మీరు ఏదైనా ఒక ఖాతాకు సంబంధించి 2-దశల వెరిఫికేషన్‌ను ఉపయోగిస్తే, మీరు ఖాతాను జోడించే ముందు యాప్ పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయాలి.

Apple TVలో వీడియోలను చూడండి
మీరు మీ Apple TVని, మీ Apple మొబైల్ పరికరాన్ని ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసినప్పుడు, మీరు మీ TVకి వీడియోను స్ట్రీమ్ చేయడానికి AirPlayను ఉపయోగించవచ్చు.
  1. మీ iPhone లేదా iPadలో, Google TV యాప్ ను తెరవండి.
  2. చూడటానికి వీడియోను ఎంచుకోండి.
  3. వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్స్ పక్కన ఉన్న, AirPlay AirPlayను ఎంచుకోండి.
  4. మీ Apple TVని ఎంచుకోండి.

చిట్కా: Apple TV 3వ జనరేషన్ లేదా అంతకంటే అధునాతనమైనది AirPlayకి సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ మీ Apple TV మోడల్‌ను గుర్తించవచ్చు.

Chromecastతో వీడియోలను చూడండి

మీ Chromecastలో Google TV ఉన్నప్పుడు, మీరు నేరుగా మీ టీవీలో Google నుండి సినిమాలు, షోలను పొందవచ్చు. Google TVలో కంటెంట్‌ను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడం ఎలాగో తెలుసుకోండి.

ఇతర Chromecast పరికరాలతో, మీరు మీ టీవీకి వీడియోను స్ట్రీమ్ చేయవచ్చు.

ఇతర స్మార్ట్ టీవీలలో వీడియోలను చూడండి
  1. మీ స్మార్ట్ టీవీలో, YouTube యాప్ YouTubeను తెరవండి.
  2. మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. లైబ్రరీ ట్యాబ్‌లో, కొనుగోళ్లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
HDMI కేబుల్‌ను ఉపయోగించి వీడియోలను చూడండి

మీ పరికరాన్ని మీ టీవీకి కనెక్ట్ చేయడానికి, మీకు ఇవి అవసరం:

  • HDMI పోర్ట్‌లు అందుబాటులో ఉన్న HDTV. 
  • మీ పరికరాన్ని మీ టీవీకి కనెక్ట్ చేయడానికి వీలుగా ఉండే HDMI కేబుల్ లేదా అడాప్టర్.

మీరు మీ పరికరాన్ని, టీవీతో కనెక్ట్ చేసిన తర్వాత, మీ పరికరం స్క్రీన్ ఇంకా ఆడియో మీ టీవీ ద్వారా ప్లే చేయబడాలి. మీ వీడియో సౌండ్ లేకుండా ప్లే అవుతుంటే, మీరు మీ టీవీ సెట్టింగ్‌ల ద్వారా ఆడియో సోర్స్‌ను మార్చాల్సి ఉంటుంది.

మీరు మీ టీవీలో వీడియోలను చూడటానికి HDMI కేబుల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీకు సమస్యలు ఏర్పడితే, ఈ దశలను ట్రై చేయండి:

  • మీ HDMI కేబుల్ రెండు చివరలను డిస్‌కనెక్ట్ చేయండి. ఆపై, వాటిని సురక్షితంగా మీ పరికరం ఇంకా టీవీకి మళ్లీ కనెక్ట్ చేయండి.
  • మీ టీవీలోని సరైన HDMI పోర్ట్‌కు, HDMI కేబుల్ కనెక్ట్ చేయబడిందో లేదో చెక్ చేయండి.
  • వెబ్ ప్లేయర్‌లో వీడియోను చూడండి. యాప్ నుండి వీడియోలను మిర్రరింగ్ చేయడం సపోర్ట్ చేయబడదు. 
  • మీ టీవీ సరైన HDMI సోర్స్‌కు సెట్ చేయబడిందో లేదో చెక్ చేయండి.
  • మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయండి.

మీ టీవీలో సినిమా లేదా షోకు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

ముఖ్య గమనిక: Google TV పరికరంలో, సినిమా లేదా షోకు సంబంధించి మీకేమైనా సమస్యలు ఉంటే, ఈ పరిష్కార ప్రక్రియ దశలను ఫాలో చేయండి.

యాప్ నుండి నిష్క్రమించి, మళ్లీ తెరవండి

  1. మీ రిమోట్‌లో, హోమ్ బటన్‌ను నొక్కండి.
  2. Google Play Movies & TV Play Moviesని మళ్లీ తెరవండి.
  3. మీ సినిమా లేదా షోను రీప్లే చేయండి.

యాప్ నుండి సైన్ అవుట్ చేసి, తిరిగి సైన్ ఇన్ చేయండి

  1. Google Play Movies & TV Play Moviesని తెరవండి.
  2. సెట్టింగ్‌లు ఆ తర్వాత సైన్ అవుట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. సెట్టింగ్‌లకు తిరిగి వెళ్లి, సైన్ ఇన్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • మీరు కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  4. మీ సినిమా లేదా షోను రీప్లే చేయండి.

యాప్‌ను తొలగించి, మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి

  1. నా ఛానెల్‌లు అనే విభాగానికి వెళ్ళండి.
  2. Google Play Movies & TV హైలైట్ చేయండి.
  3. మీ రిమోట్‌లో, స్టార్ బటన్ ఆ తర్వాత తీసివేయండి అనే ఆప్షన్‌ను నొక్కండి.
  4. ఛానెల్ స్టోర్ నుండి యాప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి.
  5. మీ సినిమా లేదా షోను రీప్లే చేయండి.

వైర్ ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగించండి

  1. మీ పరికరాన్ని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయడానికి ఈథర్‌నెట్ కేబుల్‌ను ఉపయోగించండి.
  2. Wi-Fiకి బదులుగా వైర్ ఉన్న కనెక్షన్‌ను ఉపయోగించడానికి, మీ కనెక్షన్ సెట్టింగ్‌లను మార్చండి.
  3. మీ సినిమా లేదా షోను రీప్లే చేయండి.

Android TV కోసం మరిన్ని పరిష్కార ప్రక్రియ దశలు

మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేయండి

  1. Google Play Movies & TV Play Moviesని తెరవండి.
  2. మీ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను వెరిఫై చేయండి ఆ తర్వాత Wi-Fi అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • యాప్‌లో "మీ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను వెరిఫై చేయండి" అనే ఆప్షన్ కనిపించకపోతే: మీ పరికరంలో, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి. నెట్‌వర్క్ ఆ తర్వాత Wi-Fi అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. నెట్‌వర్క్‌ను ఎంచుకుని, కనెక్ట్ చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో చేయండి.
  4. యాప్‌కు తిరిగి వెళ్లి, మీ సినిమా లేదా షోను రీప్లే చేయండి.

మీ సిస్టమ్ అప్‌డేట్ అయ్యి ఉందని నిర్ధారించుకోండి

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  2. గురించి ఆ తర్వాత సిస్టమ్ అప్‌డేట్ ఆ తర్వాత ఇప్పుడే చెక్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. అప్‌డేట్ అందుబాటులో ఉంటే, దాన్ని ఇన్‌స్టాల్ చేయండి.
  4. మీ సినిమా లేదా షోను రీప్లే చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14409437520884660573
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false