Google Play & ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల గురించి మరింత తెలుసుకోండి

ఇప్పుడు కింది దేశాలలో డిజిటల్ కంటెంట్‌కు, సర్వీస్‌లకు చేసే పేమెంట్లకు సంబంధించి, డెవలపర్లు, వారి యూజర్లకు Google Play బిల్లింగ్ సిస్టమ్ కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను అందించవచ్చు:

  • ఐరోపా ఆర్థిక మండలి (EEA) దేశాలు
  • ఆస్ట్రేలియా
  • బ్రెజిల్
  • ఇండియా
  • ఇండోనేషియా
  • జపాన్
  • దక్షిణాఫ్రికా
  • దక్షిణ కొరియా
  • యునైటెడ్ స్టేట్స్

Google Play బిల్లింగ్ సిస్టమ్

Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా మీరు డిజిటల్ ప్రోడక్ట్‌లను, యాప్‌లోని కంటెంట్‌ను భద్రంగా, సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు. ఈ కొనుగోళ్లలోకి సబ్‌స్క్రిప్షన్‌లు కూడా వస్తాయి. మీ పేమెంట్ సమాచారం మీ Google ఖాతాలో సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది, యాప్ డెవలపర్‌లతో షేర్ చేయబడదు. మీరు ఎప్పుడు కొనుగోలు చేసినా సదరు కొనుగోలును ప్రామాణీకరించాల్సి ఉంటుంది. తద్వారా అనుకోకుండా పొరపాటున కొనుగోళ్లు చేసే అవకాశం ఉండదు.

మీరు Google Play బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించినప్పుడు, మీరు నెలవారీ బడ్జెట్‌ను కూడా సెట్ చేయవచ్చు, మీ పేమెంట్ హిస్టరీని చెక్ చేయవచ్చు, సబ్‌స్క్రిప్షన్ సెంటర్ ద్వారా మీ సబ్‌స్క్రిప్షన్‌లను ఒకే చోట మేనేజ్ చేయవచ్చు, తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెట్ చేయవచ్చు మేనేజ్ చేయవచ్చు. మీరు ఫ్యామిలీ గ్రూప్‌ను సెటప్ చేయవచ్చు, ఒకవేళ మీరు గ్రూప్‌లో తల్లి/తండ్రి అయితే, మీరు మెంబర్‌లు ఉపయోగించేందుకు ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌ను సెటప్ చేయవచ్చు, అలాగే Google Playలో కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి లేదా డౌన్‌లోడ్ చేయడానికి మీ అనుమతి అవసరమయ్యే విధంగా సెటప్ చేయవచ్చు. Google Playలో చేసిన కొనుగోలుకు సంబంధించి సమస్య ఉంటే, మీరు Google Play ద్వారా కూడా రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.

Google Play బిల్లింగ్ సిస్టమ్‌లో ప్రపంచవ్యాప్తంగా పలు రకాల పేమెంట్ ఆప్షన్‌ల ద్వారా పేమెంట్ చేయడం చాలా సులభం. మీ దేశాన్ని బట్టి, పేమెంట్ ఆప్షన్‌లలో లోకల్ మొబైల్ ఫోన్ బిల్లింగ్, ఈ-వాలెట్‌లు, నగదు, Play గిఫ్ట్ కార్డ్‌లు ఉండవచ్చు. మీ కొనుగోళ్ల ద్వారా Play పాయింట్‌లను సంపాదించవచ్చు. అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్‌ల గురించి మరింత తెలుసుకోండి.

Google Play బిల్లింగ్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

యూజర్‌ల కోసం ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌లు

ప్రతి కొనుగోలుపై పలు బిల్లింగ్ సిస్టమ్‌ల మధ్య ఎంచుకునే వెసులుబాటును డెవలపర్‌లు మీకు అందించవచ్చు. ఇది, మీరు నివసించే దేశం పైన, ఇందులో పాల్గొనే డెవలపర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మీ ఎంపిక వీటిని నిర్ణయిస్తుంది:

  • మీ కొనుగోలును సురక్షితం చేయడం, మీ పేమెంట్‌ను ప్రాసెస్ చేయడం అలాగే ఏదైనా పేమెంట్ సమాచారాన్ని స్టోర్ చేయడం లాంటివి ఎవరు చేస్తారు
  • కొనుగోలుకు సంబంధించిన కస్టమర్ సపోర్ట్‌ను ఎవరు అందజేస్తారు
  • మీ కొనుగోలుతో ఎలాంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి
  • EEA దేశాలలో వర్తించే వినియోగదారు హక్కులకు ఎవరు బాధ్యత వహిస్తారు

మీరు Play ఎకో-సిస్టమ్‌లో కొనుగోళ్లు చేసినప్పుడు, సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోవడంలో, ఈ ఎంపిక మీకు సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము.

చిట్కా: EEA దేశాల్లోని యూజర్‌ల కోసం, Google Play బిల్లింగ్ సిస్టమ్ ఎంపిక లేకుండానే మీకు ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్ అందించబడవచ్చు.

ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండియా, ఇండోనేషియా, జపాన్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా ఇంకా యునైటెడ్ స్టేట్స్‌లోని యూజర్‌లు, ప్రతి కొనుగోలుకు బిల్లింగ్ సిస్టమ్‌ల ఎంపికను కలిగి ఉంటారు
ప్రోడక్ట్‌ను బట్టి, యాప్‌లో డిజిటల్ కంటెంట్‌ను విక్రయించే డెవలపర్‌లు మీకు Google Play బిల్లింగ్ సిస్టమ్‌తో పాటు మరొక బిల్లింగ్ సిస్టమ్‌ను ప్రత్యామ్నాయంగా అందించవచ్చు. కొనుగోలు చేయడానికి మీరు మరొక బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించిన పక్షంలో, మీ కొనుగోలు Google Play ద్వారా మేనేజ్ చేయబడదు. మీ బిల్లింగ్ స్టేట్‌మెంట్‌లో కనబడే ఛార్జీల మూలాన్ని చెక్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
EEA దేశాలలో యూజర్‌లు
సొంత యాప్‌లో డిజిటల్ కంటెంట్‌ను, సర్వీస్‌లను విక్రయించే నాన్-గేమింగ్ యాప్‌ల డెవలపర్‌లు, Google Play బిల్లింగ్ సిస్టమ్‌కు బదులుగా గానీ, లేదా దానికి అదనంగా గానీ ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ను అందించవచ్చు. ఏదైనా కొనుగోలు చేయడానికి వేరొక బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించినప్పుడు, మీరు Googleతో లావాదేవీ జరపరు. మీ కొనుగోలు Google Play ద్వారా మేనేజ్ చేయబడదు. అలాగే పేమెంట్ చేయడానికి మీ Play బ్యాలెన్స్‌ను లేదా Play గిఫ్ట్ కార్డ్‌లను (మీ దేశంలో అందుబాటులో ఉంటే) ఉపయోగించలేరు. కొనుగోలు కంట్రోల్స్, Play ఆఫర్‌లు, Play Pass ఆఫర్‌లు, Play సబ్‌స్క్రిప్షన్ సెంటర్‌లోని సబ్‌స్క్రిప్షన్ మేనేజ్‌మెంట్ వంటి ఇతర Play ఫీచర్‌లు ఈ కొనుగోళ్లకు వర్తించవు. మీరు వేరొక బిల్లింగ్ సిస్టమ్‌ను ఎంచుకుంటే, ఆ బిల్లింగ్ సిస్టమ్ ప్రొవైడర్, ఏదైనా లావాదేవీ పర్పస్‌కు సంబంధించి విక్రేత అవుతారు. మీ కొనుగోలును డెలివరీ చేయడానికి (ఫుల్‌ఫిల్ చేయడానికి), సపోర్ట్ అందించడానికి పూర్తిగా బాధ్యత వహిస్తారు (వర్తించే చట్టాల ప్రకారం చట్టబద్ధమైన హామీల వంటి వినియోగదారు హక్కులు కూడా ఇందులో ఉంటాయి). మీ బిల్లింగ్ స్టేట్‌మెంట్‌లో కనబడే ఛార్జీల మూలాన్ని చెక్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

చిట్కాలు:

  • మీరు డెవలపర్‌తో లేదా ప్రత్యామ్నాయ బిల్లింగ్ సర్వీస్ ప్రొవైడర్‌తో షేర్ చేసే మీ బిల్లింగ్ అడ్రస్, పేమెంట్ ఆప్షన్ డిటైల్స్ వంటి పేమెంట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచే బాధ్యత Googleపై ఉండదు.
  • మీరు చెక్‌అవుట్‌లో Google Playను ఎంచుకున్నప్పుడు, అందుబాటులో ఉండే ఫీచర్‌లు:
    • Play గిఫ్ట్ కార్డ్‌లు లేదా Play పాయింట్‌లు
      • ఈ ఫీచర్ కేవలం ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
    • కొనుగోలు కంట్రోల్స్
    • Play సబ్‌స్క్రిప్షన్ మేనేజ్‌మెంట్
    • Play Pass ఆఫర్‌లు
  • బిల్లింగ్ ఫీచర్‌లను, ప్రయోజనాలను ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌లు ఏ విధంగా అందిస్తాయో తెలుసుకోవడానికి, మీ డెవలపర్‌ను సంప్రదించండి.

పిల్లల కోసం ప్రత్యామ్నాయ బిల్లింగ్

యాప్‌లలో డిజిటల్ కంటెంట్‌ను చిన్నారి కొనుగోలు చేయవచ్చు. అలాగే వారు Google Play అందించే లేదా డెవలపర్ అందించే మరొక పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. ఒకవేళ డెవలపర్ అందించిన బిల్లింగ్ సిస్టమ్‌ను చిన్నారి ఉపయోగిస్తే, Playలో కొనుగోలు ఆమోదాలు వర్తించవు.

వేరే విధమైన పేమెంట్ ఆప్షన్‌ను అందించే యాప్‌లలో, ఏదైనా యాప్‌లో కొనుగోలును చేయడానికి మొదటిసారిగా చిన్నారి ట్రై చేస్తున్నప్పుడు, కొనుగోలు చేసే లోపు వారి తల్లి/తండ్రి లేదా గార్డియన్ తప్పనిసరిగా సైన్ ఇన్ చేసి మెసేజ్‌ను రివ్యూ చేయాలి. యాప్‌లో డిజిటల్ కంటెంట్‌ను కొనుగోలు చేసేటప్పుడు, చిన్నారి ఉపయోగించగల ఇతర పేమెంట్ ఆప్షన్‌ల గురించిన సమాచారాన్ని ఈ మెసేజ్ తెలియజేస్తుంది. తర్వాతి సారి, ఇదే యాప్‌లో కొనుగోలు చేయడానికి చిన్నారి ట్రై చేసినప్పుడు, ఆ చిన్నారి తల్లి/తండ్రి లేదా గార్డియన్ ఈ మెసేజ్‌ను చూడటానికి సైన్ ఇన్ చేయమని ప్రాంప్ట్ చేయబడరు, కనుక చిన్నారి తల్లి/తండ్రి అనుమతి లేకుండా కొనసాగించవచ్చు.

ఒకవేళ చిన్నారి ఇతర యాప్‌లోని కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి Google Play కాకుండా, వేరే పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగిస్తే, కింద పేర్కొన్న వాటిని డెవలపర్ చేస్తారు:

  • కొనుగోలును సురక్షితం చేస్తారు, పేమెంట్‌ను ప్రాసెస్ చేస్తారు, అలాగే పేమెంట్ సమాచారాన్ని స్టోర్ చేస్తారు.
  • ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే, వాటిని పరిష్కరించడానికి సహాయం చేస్తారు.
  • కొనుగోలు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే అందజేస్తారు.

Google Play ద్వారా చేసిన కొనుగోళ్లను Google సురక్షితం చేస్తుంది. మీ చిన్నారి, Play గిఫ్ట్ కార్డ్‌లు, Play పాయింట్‌లు, Play Pass ఆఫర్‌లు, ఇంకా సబ్‌స్క్రిప్షన్ మేనేజ్‌మెంట్ వంటి Play ఫీచర్‌లకు అర్హత కలిగి ఉంటే, అవి Google Play ద్వారా కొనుగోలు చేయబడితే మాత్రమే అందుబాటులో ఉంటాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు)

ఐరోపా ఆర్థిక మండలి (EEA)లో ఏ దేశాలు ఉన్నాయి?
ప్రస్తుతం EEAలో ఈ దేశాలు ఉన్నాయి: ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్‌లాండ్, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లిచెన్‌స్టెయిన్, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్ ఇంకా స్వీడన్.
ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసిన కొనుగోలు కోసం నాకు రీఫండ్ అవసరమైతే ఏమి జరుగుతుంది?
మీరు ఇతర బిల్లింగ్ సిస్టమ్‌ల ద్వారా చేసిన కొనుగోళ్ల కోసం Google ద్వారా రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయలేరు. రీఫండ్ కోసం, డెవలపర్‌ను సంప్రదించాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము.
నేను Google Play బిల్లింగ్ సిస్టమ్‌తో కొనుగోలు చేస్తున్నానో లేక ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌తో కొనుగోలు చేస్తున్నానో నాకు ఎలా తెలుస్తుంది?

ఒక అప్లికేషన్, ఇతర బిల్లింగ్ సిస్టమ్‌లను అందించినప్పుడు, మీరు Google Play బిల్లింగ్ సిస్టమ్ లేదా ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్ మధ్య ఎంచుకోవచ్చు.

మీరు ఐరోపా ఆర్థిక మండలి (EEA) దేశాలలో ఒక దానిలో నివసిస్తుంటే:

  • ఒక అప్లికేషన్, ఒక ప్రత్యామ్నాయ బిల్లింగ్ ఆప్షన్‌ను మాత్రమే అందించగలదు.
  • ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌లతో పేమెంట్ చేయడానికి, మీరు మీ Play బ్యాలెన్స్‌ను లేదా Play గిఫ్ట్ కార్డ్‌లను ఉపయోగించలేరు.
  • ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌లకు ఈ Play ఫీచర్‌లు వర్తించవు:
    • కొనుగోలు కంట్రోల్స్
    • Play ఆఫర్‌లు
    • Play సబ్‌స్క్రిప్షన్ మేనేజ్‌మెంట్
    • Play Pass ఆఫర్‌లు
ఏదైనా ఒక లావాదేవీ, Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా జరిగిందా లేదా ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌లలో దేని ద్వారా అయినా చేయబడిందా అని చెక్ చేయడం ఎలా?

మీరు మీ Google Play ఆర్డర్ హిస్టరీ లేదా మీ బిల్లింగ్ స్టేట్‌మెంట్ ద్వారా లావాదేవీని ఎలా జరిగిందో నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ మీ కొనుగోలు, మీ Google Play ఆర్డర్ హిస్టరీ కింద కనిపించకుంటే, బహుశా మరొక బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసి ఉండవచ్చు. Google Playలో మీ ఆర్డర్ హిస్టరీని రివ్యూ చేయడం ఎలాగో చూడండి లేదా, ఛార్జీలు Google Play నుండి చేయబడ్డాయో లేదా మరొక ప్రొవైడర్ ద్వారా చేయబడ్డాయో, మీ బిల్లింగ్ స్టేట్‌మెంట్‌లో చెక్ చేయండి.


చిట్కా: కొనుగోలు చేయడానికి ఉపయోగించిన మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయాలని గుర్తుంచుకోండి. ఖాతాను జోడించడం లేదా ఖాతాలను మార్చడం ఎలాగో తెలుసుకోండి.
ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌లతో యాప్ సబ్‌స్క్రిప్షన్‌లను నేను ఎలా మేనేజ్ చేయగలను? అవి Play సబ్‌స్క్రిప్షన్‌ల సెంటర్‌లో కనిపిస్తాయా?

ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల ద్వారా చేసిన యాప్ సబ్‌స్క్రిప్షన్‌లు, మీ Play సబ్‌స్క్రిప్షన్‌ల సెంటర్‌లో లేదా play.google.com సైట్‌లో చూపబడవు. మీరు ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల ద్వారా చేసిన సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయడానికి, ఇంకా రద్దు చేయడానికి, మీ డెవలపర్‌ను సంప్రదించండి.

చిట్కా: మీరు Google Play బిల్లింగ్ సిస్టమ్ లేదా ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా సబ్‌స్క్రయిబ్ చేసినట్లయితే, యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం వలన మీ సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయబడదు.

ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల పేమెంట్ సమస్యలకు సంబంధించి, సపోర్ట్ కోసం నేను ఎవరిని సంప్రదించాలి?
ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌లతో గల అన్ని పేమెంట్ సమస్యలకు (విఫలమైన పేమెంట్‌లు, క్రెడిట్ కార్డ్‌లను జోడించడంలో సమస్యలు మొదలగునవి.,), దయచేసి డెవలపర్‌ను సంప్రదించండి.
ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌లను అందించే యాప్‌లతో, నేను ప్రస్తుతం కలిగి ఉండే ఏవైనా యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌లను, ఇది ఎలా ప్రభావితం చేస్తుంది?
మీరు రద్దు చేస్తే తప్పితే Google Play బిల్లింగ్ సిస్టమ్‌లో యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌లు కొనసాగుతాయి. యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయడం వలన మీ సబ్‌స్క్రిప్షన్ రద్దు కాదని గుర్తుంచుకోండి. మీరు Play సబ్‌స్క్రిప్షన్‌ల సెంటర్ లేదా play.google.com సైట్‌లో యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయడాన్ని కొనసాగించవచ్చు. Google Playలో సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
నేను యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ కోసం, నా బిల్లింగ్‌ను Google Play బిల్లింగ్ సిస్టమ్ నుండి ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌కు మార్చవచ్చా?
యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ కోసం, మీ బిల్లింగ్‌ను మార్చడానికి, మీరు మీ ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసి, తిరిగి సబ్‌స్క్రయిబ్ చేయాల్సి ఉంటుంది. మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడం వలన ఇప్పటికే ఉన్న మీ ధర, ప్రమోషన్‌లు కూడా ప్రభావితం కావచ్చని దయచేసి గుర్తుంచుకోండి.
ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లకు నా ప్రామాణీకరణ ఇంకా తల్లిదండ్రుల కంట్రోల్ సెట్టింగ్‌లు వర్తిస్తాయా?

లేదు, Google ద్వారా ఆఫర్ చేసే ప్రామాణీకరణ, కొనుగోలు కంట్రోల్ సెట్టింగ్‌లు, కేవలం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి. Google Playలో తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయడం, మేనేజ్ చేయడం లేదా Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా కొనుగోళ్ల కోసం, మీ ప్రామాణీకరణ సెట్టింగ్‌లను మేనేజ్ చేయడం ఎలా అనేదాని గురించి రివ్యూ చేయండి.

Family Linkతో మేనేజ్ చేయబడుతున్న Google ఖాతా ఉన్న పిల్లలకు, ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌లను అందించే యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి, ఇప్పటికీ తల్లిదండ్రుల ఆమోదం అవసరమా?
అవును, ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌లను ఉపయోగించి చేసే యాప్‌ల డౌన్‌లోడ్‌ల కోసం, Family Link ద్వారా తల్లి/తండ్రి చేసే ఆమోదం, ఇప్పటికీ సపోర్ట్ చేయబడుతుంది. అయితే, కొనుగోళ్లకు సంబంధించిన తల్లిదండ్రుల కంట్రోల్, ప్రామాణీకరణ సెట్టింగ్‌లు, Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు మాత్రమే సపోర్ట్ అందిస్తాయి. ఎలా చేయాలో రివ్యూ చేయండి:
నేను Google Play Pointsకు సైన్ అప్ చేశాను. ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లకు సంబంధించి, నాకు Google Play పాయింట్‌లు లభిస్తాయా?
లేదు, మీరు ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల ద్వారా చేసిన కొనుగోళ్లకు Google Play పాయింట్‌లను సంపాదించలేరు.
ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల ద్వారా కొనుగోళ్లను చేయడానికి, నా Play బ్యాలెన్స్, Play గిఫ్ట్ కార్డ్‌లను ఉపయోగించవచ్చా?
లేదు, మీరు ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల ద్వారా కొనుగోళ్లను చేయడానికి, మీ Play బ్యాలెన్స్‌ను ఉపయోగించలేరు.
ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ల ద్వారా చేసే కొనుగోళ్ల కోసం, నేను Play ఆఫర్‌లను రిడీమ్ చేయవచ్చా?
లేదు, Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్ల కోసం మాత్రమే Play ఆఫర్‌లను రిడీమ్ చేయవచ్చు.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1426798056091915399
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false