మరింత Google స్టోరేజ్‌ను కొనుగోలు చేయండి

మీ Google ఖాతాకు ఎటువంటి ఛార్జీ లేకుండా 15 GB క్లౌడ్ స్టోరేజ్ అందించబడుతుంది. కింద పేర్కొన్న వాటన్నింటికీ స్టోరేజ్ షేర్ చేయబడుతుంది:
  • Google Drive
  • Gmail
  • Google Photos

వీటితో మరింత క్లౌడ్ స్టోరేజ్‌ను పొందండి:

గమనిక: మీకు ఆఫీస్ లేదా స్కూల్ ఖాతా ఉన్నట్లయితే, మీరు మీ కోసం మరింత స్టోరేజ్‌ను కొనుగోలు చేయలేరు. మీకు మరింత స్టోరేజ్ కావాలంటే, మీకు మీ ఖాతాను అందించిన వ్యక్తిని కాంటాక్ట్ చేయండి.

స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్‌లు

  • మీ స్టోరేజ్ ప్లాన్‌కు చెందిన పేమెంట్ సైకిల్‌ను మీరు ఎప్పుడైనా నెలవారీ నుండి వార్షిక సైకిల్‌కు మార్చుకోవచ్చు.
  • Google One సబ్‌స్క్రిప్షన్ గడువు ఎన్నటికీ ముగియదు -- మీ సెట్టింగ్‌లను మీరు మారిస్తే మినహా, అది ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ చేయబడుతుంది.
  • మీరు వేరే పేమెంట్ షెడ్యూల్‌కు మారినప్పుడు, ఈ మార్పులు అమలులోకి రావడానికి 24 గంటల వరకు సమయం పట్టవచ్చు.
  • అమ్మకపు ధరతో పాటు, అదనంగా మీకు లోకల్ ట్యాక్స్‌లు లేదా ఫీజులు విధించబడవచ్చు. ఈ రేట్లను, స్థానిక చట్టపరమైన సంస్థలు మార్చవచ్చు. ఈ విషయంలో Google నుండి నోటీసు ఏదీ అందకపోవచ్చు. అమ్మకపు ధరను మించి, అదనంగా ఫీజును Google ఛార్జీ చేయదు. మీరు ఐరోపా ఆర్థిక మండలి లేదా మొరాకోలో నివసిస్తుంటే, Google Play ద్వారా మీరు చేసే కొనుగోళ్లపై, మీకు వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) విధించబడుతుంది. ఈ కొనుగోళ్ల కోసం, మీరు VAT ఇన్‌వాయిస్ లేదా రసీదు కోసం రిక్వెస్ట్ చేయవచ్చు.
  • Google స్టోరేజ్ కొనుగోలు సదుపాయం కేవలం కొన్ని దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ఏ దేశాల్లో స్టోరేజ్‌ను కొనుగోలు చేసే సదుపాయం ఉందో తెలుసుకోండి.
మీ Google ప్రోడక్ట్‌ల కోసం మీరు అదనపు స్టోరేజ్‌ను పొందవచ్చు.

మీరు ఇప్పటికే Drive ప్లాన్ కోసం పేమెంట్ చేస్తే, మీరు ఎటువంటి చార్జీ లేకుండా Google Oneకు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ చేయబడతారు. మీ ఇప్పటికే ఉన్న స్టోరేజ్ Google Oneతో ఎలా పని చేస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

మీరు Drive ప్లాన్‌ను కలిగి లేకపోతే, మరింత స్టోరేజ్, నిపుణుల సహాయం, అలాగే అదనపు మెంబర్ ప్రయోజనాలను పొందడానికి మీరు Google One మెంబర్‌గా మారవచ్చు.

మీ Google స్టోరేజ్‌ను అప్‌గ్రేడ్ చేయండి

చిట్కా: మీ స్టోరేజ్‌ను అప్‌గ్రేడ్ చేసే ముందు, మీ పేమెంట్ ఆప్షన్ అప్‌డేట్ అయ్యి ఉందని నిర్ధారించుకోండి. మీ పేమెంట్ వివరాలను అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
మీరు అప్‌గ్రేడ్ చేసిన తర్వాత, మీ ప్రస్తుత Drive స్టోరేజ్ ప్లాన్‌ను, మీ Google One మెంబర్‌షిప్ రీప్లేస్ చేస్తుంది. Google One మెంబర్‌లు మరింత ఎక్కువ స్టోరేజ్ స్పేస్ పొందుతారు, అలాగే ప్రత్యేక ప్రయోజనాలను, ఫ్యామిలీ ప్లాన్ షేరింగ్‌ను పొందుతారు. Google One మెంబర్‌గా మీకు మరింత స్టోరేజ్ స్పేస్ కావాలనుకుంటే, కింది దశలను ఫాలో అవ్వండి.

Google One యాప్ ద్వారా స్టోరేజ్‌ను కొనుగోలు చేయండి

Buy more storage
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.
  2. Play స్టోర్ నుండి, Google One యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  3. Google One యాప్‌లో, దిగువ భాగంలో, అప్‌గ్రేడ్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ కొత్త స్టోరేజ్ పరిమితిని ఎంచుకోండి.
  5. కొత్త ప్లాన్ ధరను, అలాగే పేమెంట్ తేదీని రివ్యూ చేయండి, ఆపై కొనసాగించును ట్యాప్ చేయండి.
  6. మీ Google One ప్లాన్‌ను నిర్ధారించడానికి, మీ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకుని, సబ్‌స్క్రయిబ్ చేయిని ట్యాప్ చేయండి.

మీ కంప్యూటర్‌లో, మీరు one.google.com సైట్‌ను సందర్శిస్తే, Google Oneను కూడా ఉపయోగించవచ్చు.

Google Drive యాప్ ద్వారా స్టోరేజ్‌ను కొనుగోలు చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Drive యాప్ Driveను తెరవండి.
  2. ఎగువ ఎడమ వైపున, మెనూ మెనూ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. స్టోరేజ్‌ను అప్‌గ్రేడ్ చేయండిని ట్యాప్ చేయండి.
  4. కిందికి స్క్రోల్ చేసి, వేరే స్టోరేజ్ ప్లాన్‌ను ఎంచుకోండి.
    • ఇతర ప్లాన్‌లను కనుగొనడానికి, మరిన్ని ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  5. మీ పేమెంట్ రకాన్ని ఎంచుకుని, సబ్‌స్క్రయిబ్ చేయండిని ట్యాప్ చేయండి.

మరింత తెలుసుకోండి

మరొక కంపెనీ అందించే Google One ప్లాన్‌ల గురించి

ముఖ్య గమనిక: మీ Google One ప్లాన్ మరొక కంపెనీ ద్వారా అందించబడినట్లయితే, మీ ప్లాన్‌ను అప్‌గ్రేడ్, డౌన్‌గ్రేడ్, లేదా రద్దు చేయడానికి మీరు నేరుగా ఆ కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది.

మరొక కంపెనీ అందించే Google One ప్లాన్‌ను మేనేజ్ చేయండి

Google One సైట్‌లో కానీ, యాప్‌లో కానీ అందుబాటులో ఉండే Google One ప్లాన్‌కు మారండి

మీ ప్రస్తుత ప్లాన్‌ను మీరు మరొక కంపెనీ నుండి కొనుగోలు చేసి ఉండి, ఆ ప్లాన్‌కు బదులుగా Google One సైట్‌లో లేదా యాప్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే ప్లాన్ కావాలనుకుంటే, మీరు ఇలా చేయాల్సి ఉంటుంది:

  1. మీకు ప్లాన్‌ను విక్రయించిన కంపెనీని సంప్రదించడం ద్వారా మీ ప్రస్తుత Google One ప్లాన్‌ను రద్దు చేయండి.
  2. Google One సైట్, అలాగే యాప్‌లో అందుబాటులో ఉన్న Google One ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేయండి.
రద్దు చేయడం వలన మీ స్టోరేజ్ నిండిపోతే, Google సర్వీస్‌లకు అంతరాయాలు ఏర్పడకుండా నివారించడానికి, మీరు వెంటనే ఏదైనా కొత్త ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ స్టోరేజ్ పరిమితి మించిపోయినప్పుడు ఏమి జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకోండి.
పేమెంట్ సమస్యలను పరిష్కరించండి
పేమెంట్ సమస్యలను పరిష్కరించడానికి, మీకు ప్లాన్‌ను అందిస్తున్న కంపెనీని సంప్రదించండి, అలాగే మీ పేమెంట్ ఆప్షన్ గడువు ముగియలేదని, వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి. మీరు Google One సెట్టింగ్‌లలో ఆ కంపెనీని సంప్రదించడానికి లింక్‌ను కనుగొనవచ్చు.
మీరు Google One సైట్‌లో లేదా యాప్‌లో మీ పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేయలేరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.

పేమెంట్ సమస్యలు

మీ పేమెంట్ ఆప్షన్ గడువు ముగిసినా లేదా వివరాలు సరైనవి కాకపోయినా లేదా పాతవి అయినా ఇలా జరగవచ్చు. పేమెంట్ సమస్యలను పరిష్కరించడానికి, మీకు Google One ప్లాన్‌ను అందిస్తున్న కంపెనీని సంప్రదించండి.

ప్రయోజనాలకు యాక్సెస్

పేమెంట్ సమస్య ఉన్నట్లయితే, మీరు పరిమిత సమయం వరకు మీ Google One ప్రయోజనాలకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు. మీరు సమస్యను వెంటనే పరిష్కరించకుంటే, మీ Google One ప్లాన్ ముగుస్తుంది, అలాగే మీ స్టోరేజ్ పరిమితి 15 GBకి తగ్గించబడుతుంది. మీరు ఈ స్టోరేజ్‌ను మించిపోతే, Gmail, Google Photos, Drive, అలాగే ఇతర Google సర్వీస్‌లను ఉపయోగించేటప్పుడు మీకు అంతరాయాలు ఎదురవుతాయి. మీ స్టోరేజ్ పరిమితి మించిపోయినప్పుడు ఏమి జరుగుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

Pixel Pass ద్వారా మీ Google One మెంబర్‌షిప్‌ను అప్‌డేట్ చేయండి

మీ ప్లాన్‌ను మార్చుకోండి

Pixel Pass ద్వారా మీకు 200 GB Google One ప్లాన్ ఉన్నట్లైతే, మరింత స్టోరేజ్ కోసం మీరు మీ ప్లాన్‌ను Google One వెబ్‌సైట్ ద్వారా మార్చుకోవచ్చు. మీరు ఎంచుకునే ప్లాన్ ఆధారంగా మీ నెలవారీ ధర మారుతుంది, చెక్ అవుట్ వద్ద మీకు కొత్త ధర కనిపిస్తుంది.
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, one.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. ఎగువ ఎడమ వైపున, మెనూ మెనూ ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత మెంబర్‌షిప్ ప్లాన్‌ను మార్చండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. అప్‌గ్రేడ్ ప్లాన్‌ను ఎంచుకోండి.

మీరు మీ Pixel Pass సబ్‌స్క్రిప్షన్‌ను Google Store ద్వారా కొనుగోలు చేసినట్లైతే, మీరు మీ Google One ప్లాన్‌ను Google Store‌లో కూడా అప్‌డేట్ చేయవచ్చు.

స్టోరేజ్ కొనుగోలుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి
మీరు గడువు ముగిసిన Google Drive స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటే, మీ సబ్‌స్క్రిప్షన్‌ను రీ-యాక్టివేట్ చేసుకోవడానికి, 'Google Play Store'కు వెళ్లండి.

Google One సబ్‌స్క్రిప్షన్ ధర గురించి తెలుసుకోండి

Google One మెంబర్‌లు మరింత ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను, ప్రత్యేక ప్రయోజనాలను, ఫ్యామిలీ ప్లాన్ షేరింగ్‌తో పాటు మరిన్నింటిని పొందుతారు. మీ లొకేషన్‌లో Google One ధర ఎంతో తెలుసుకోండి.

సహకారాన్ని మెరుగుపరుచుకోండి, దీనితో కనెక్ట్ అయి ఉండండి Google Workspace Essentials

మీ కంపెనీ పని చేసే ప్రాజెక్టుల కోసం మెరుగైన సహకారం, మరింత స్టోరేజ్ కావాలనుకుంటే, మీరు Google WorkspaceEssentials ఖాతా కోసం సైన్ అప్ చేయవచ్చు. సైన్ అప్ చేయడానికి, మీ బిజినెస్ ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించండి.

Google Workspace Essentials ఖాతా కింది వాటిని అందిస్తుంది:

  • సురక్షితమైన, విశ్వసనీయమైన వీడియో సమావేశం
  • షేర్ చేసిన డ్రైవ్ స్పేస్, దీనిలో టీమ్‌లు వారి కంటెంట్‌ను మొత్తం స్టోర్ చేయవచ్చు
  • Docs, Sheets, ఇంకా Slides లాంటి సహకార యాప్‌లు 
  • భద్రత, గోప్యత, సమ్మతి టూల్స్
  • ఎటువంటి డొమైన్ వెరిఫికేషన్ లేదా IT జోక్యం అవసరం లేదు

G Suite Essentialsకు సంబంధించి యాప్‌లు, టూల్స్ ఇంకా ధరల గురించి మరింత తెలుసుకోండి.

Workspace Individualతో Google Oneను ఉపయోగించండి

మీ Workspace Individual ప్లాన్ 1 TB స్టోరేజ్‌తో వస్తుంది. మీరు Google Oneతో మరింత స్టోరేజ్‌ను కొనుగోలు చేయవచ్చు. Workspace Individual గురించి తెలుసుకోండి.

మీరు Google One ప్లాన్ మెంబర్ అయితే:
  • మీ Workspace Individual స్టోరేజ్‌కు, అదనంగా Google One ప్లాన్ స్టోరేజ్ ఉంటుంది.
  • మీ Google One సబ్‌స్క్రిప్షన్ లేదా మీ ఫ్యామిలీ ప్లాన్ ఇంకా మెంబర్‌షిప్ షేరింగ్ సంబంధించి ఎటువంటి మార్పు లేదు.
  • మీరు రద్దు చేసుకునేంత వరకు, మీ ఎన్‌రోల్‌మెంట్ కొనసాగుతూనే ఉంటుంది. 

అప్‌గ్రేడ్ చేసిన తర్వాత స్టోరేజ్ స్పేస్ పెరగదు

మీరు కొత్త స్టోరేజ్ ప్లాన్‌ను కొనుగోలు చేసిన తర్వాత, మీ కొత్త స్టోరేజ్ అందుబాటులోకి రావడానికి గరిష్ఠంగా 24 గంటల సమయం పట్టవచ్చు.

24 గంటల తర్వాత కూడా మీ స్టోరేజ్ తప్పుగా ఉంటే, మీ పేమెంట్ జరిగిందో లేదో చూడటానికి మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి. 

మీ పేమెంట్ ప్రాసెస్ పూర్తయ్యి, మీరు అప్‌గ్రేడ్ చేయబడి 24 గంటలు గడిచిన తర్వాత కూడా, మీ స్టోరేజ్ ఇంకా తప్పుగా చూపిస్తుంటే, ఈ పరిష్కార దశలను ట్రై చేయండి.

మీ పేమెంట్ కార్డ్‌కు ఛార్జీ విధించబడినా, మీ Google ఖాతాలో పేమెంట్ కనిపించకపోతే, మీరు మల్టిపుల్ Google ఖాతాలకు సైన్ ఇన్ చేశారేమో చెక్ చేయండి. అలా అయితే, Google One మెంబర్‌షిప్ ప్లాన్ వేరే ఖాతాతో కొనుగోలు చేయబడి ఉండవచ్చు. మీరు ఆ ఖాతాలో కొనుగోలును రద్దు చేసి, మీకు కావలసిన ఖాతాలో తిరిగి Google One మెంబర్‌షిప్‌ను కొనుగోలు చేయవచ్చు. Google Oneలో కొనుగోళ్లను రద్దు చేయడం ఎలాగో తెలుసుకోండి.

తక్కువ స్టోరేజ్ ఉండే ప్లాన్‌కు మారండి

మీరు ప్రస్తుతం మీ వద్ద ఉన్న స్పేస్ అంతటినీ ఉపయోగించకుంటే, లేదా Google స్టోరేజ్ కోసం తక్కువ ఫీజు పే చేయాలనుకుంటే, మీ స్టోరేజ్ ప్లాన్‌ను డౌన్‌గ్రేడ్ చేయండి లేదా రద్దు చేయండి.

Pixel Passతో Google One మెంబర్‌షిప్‌ను మార్చండి
Pixel Pass సబ్‌స్క్రయిబర్‌లు one.google.com లింక్‌లో Google One మెంబర్‌షిప్ ప్లాన్‌లను మార్చవచ్చు. మీకు 200 GB కంటే తక్కువ Google స్టోరేజ్ కావాలంటే, మీ Pixel Pass సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసి, వేరొక Google One మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేయండి. మీ Pixel Pass ప్లాన్‌ను రద్దు చేయడం ఎలాగో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18075505264820087650
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false