YouTubeకు ఎందుకు సైన్ ఇన్ చేయాలి?

సైన్ ఇన్ చేయడం వలన పొందే ప్రయోజనాలను మీకు తెలియజేయడంలో సహాయపడేందుకు, సైన్ ఇన్ చేయాల్సిందిగా వ్యక్తులకు గుర్తు చేయడానికి మేము పలు మార్గాలను టెస్ట్ చేస్తున్నాము. ఈ ఫీచర్‌లో, మీరు YouTubeను ఉపయోగిస్తున్నప్పుడు చూపబడే సైన్ ఇన్ ప్రాంప్ట్ ఉంటుంది. ఈ ప్రాంప్ట్ మీకు కనిపిస్తే, ఆ సమయంలో సైన్ ఇన్ చేయకూడదని మీరు అనుకుంటే, మీరు దాన్ని విస్మరించవచ్చు.

మీ Google ఖాతాతో YouTubeకు సైన్ ఇన్ చేయడం అనేది మీరు ఇష్టపడే కంటెంట్‌ను కనుగొనడంలో, YouTube కమ్యూనిటీతో కనెక్ట్ కావడంలో, ఇంకా మరిన్నింటిలో మీకు సహాయపడుతుంది. మీరు సైన్ ఇన్ చేసినప్పుడు వీటిని పొందుతారు:

సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా మీకు ఇష్టమైన ఛానెల్‌ల నుండి మరింత కంటెంట్‌ను చూడవచ్చు

మీరు ఛానెళ్లకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు అలాగే కొత్త వీడియోలను అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్‌ను పొందడానికి మీరు ఎంచుకోవచ్చు. ఆటోమేటిక్‌గా, మేము ఛానెల్ నుండి మీకు హైలైట్‌లను మాత్రమే పంపుతాము.

ప్లేలిస్ట్‌లను క్రియేట్ చేయండి, షేర్ చేయండి

ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయడం ద్వారా మీకు ఇష్టమైన వీడియోలను కనుగొని, చూడండి. మీరు దాన్ని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయవచ్చు, అలాగే దానిపై సహకారం అందించడానికి వారిని ఆహ్వానించవచ్చు.

కమ్యూనిటీకి సహకారం అందించండి

మీకు ఇష్టమైన ఛానెళ్లతో, ఆర్టిస్ట్‌లతో ఇంటరాక్ట్ అవ్వవచ్చు. వీడియోలు మరియు పోస్ట్‌లపై మీ కామెంట్‌లు వారి వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో వారికి తెలియజేయవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు, ఇతర అభిమానులతో కనెక్ట్ అవ్వవచ్చు.


రిపోర్ట్ చేయండి, బ్లాక్ చేయండి వంటి మా కమ్యూనిటీ టూల్స్‌ను ఉపయోగించడం ద్వారా మీరు ప్రతి ఒక్కరి కోసం YouTubeను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.

YouTube నుండి మరిన్ని ప్రయోజనాలను పొందడానికి ఆప్షనల్ మార్గాలు

ఈ ఆప్షనల్ పెయిడ్ సర్వీస్‌ల ద్వారా YouTube నుండి మీరు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు:

అజ్ఞాత మోడ్‌ను ఉపయోగించి ప్రైవేట్‌గా చూడండి

మీ యాక్టివిటీని YouTube గుర్తుంచుకోకూడదని మీరు భావిస్తే, మీరు అజ్ఞాత మోడ్‌ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు అజ్ఞాత మోడ్‌లో ఏదైనా వీడియోను చూస్తే, అది మీ ఖాతాకు సంబంధించి, సిఫార్సు చేయబడిన వీడియోలను మార్చదు.


మొబైల్‌లో, ఖాతా మెనూలో మీకు అజ్ఞాత మోడ్ కనిపిస్తుంది. లేదా మీరు ఇష్టపడే బ్రౌజర్‌లో మీరు ప్రైవేట్ మోడ్‌ను ఉపయోగించవచ్చు. అజ్ఞాత మోడ్ గురించి మరింత తెలుసుకోండి.

మీ గోప్యతను కంట్రోల్ చేయండి

YouTube మీ గోప్యతను కాపాడటం కోసం కట్టుబడి ఉంటుంది. సైన్ ఇన్ చేసి ఉన్నప్పుడు, మీరు YouTubeలో మీ డేటాను యాక్సెస్ చేసి, మీ ఖాతాలో ఎటువంటి డేటా స్టోర్ అవుతుందో చూడవచ్చు. మీరు సమగ్రమైన గోప్యతా సెట్టింగ్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9505212011497648567
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false