YouTubeలో ఛానెల్ మెంబర్‌షిప్‌లను ప్రారంభించడం

మేము YouTubeలో పిల్లల కంటెంట్ విషయంలో డేటాను ఎలా కలెక్ట్ చేస్తాము, ఎలా ఉపయోగిస్తాము అనే దానికి కొన్ని మార్పులు చేస్తున్నాము. ఫలితంగా, ఈ ఆర్టికల్‌లోని కొన్ని సూచనలు మారవచ్చు. మరింత తెలుసుకోండి.

నెలవారీ పేమెంట్‌ల ద్వారా మీ ఛానెల్‌లో చేరే వెసులుబాటును వీక్షకులకు ఛానెల్ మెంబర్‌షిప్‌లు కల్పిస్తాయి, తిరిగి వారు బ్యాడ్జ్‌లు, ఎమోజీలు, ఇతర వస్తువుల వంటి మెంబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేక పెర్క్‌లను పొందుతారు.

మీ ఛానెల్‌కు మెంబర్‌షిప్‌లను ప్రారంభించడానికి:

  1. ఛానెల్ మెంబర్‌షిప్‌లకు కావలసిన అర్హతలు, అవి ఏ లొకేషన్‌లో అందుబాటులో ఉన్నాయి, వాటి పాలసీలు, గైడ్‌లైన్స్‌ను రివ్యూ చేయండి.
  2. మీ ఛానెల్‌కు లేదా మీ నెట్‌వర్క్‌కు మెంబర్‌షిప్‌లను ఆన్ చేయండి.
  3. మీ ఛానెల్ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్ కోసం పెర్క్‌లు, స్థాయిలను క్రియేట్ చేయండి.

ఛానెల్ మెంబర్‌షిప్‌లు

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

 

లభ్యత, అర్హత

అర్హత

ఛానెల్ మెంబర్‌షిప్‌లకు అర్హత పొందడానికి, మీరు ముందుగా ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌ల కోసం కనీస ఆవశ్యకతలను పాటించారని నిర్ధారించుకోండి. మెంబర్‌షిప్‌ల కోసం దిగువ పేర్కొన్న ఇతర అర్హతా ప్రమాణాలు మీకున్నాయని నిర్ధారించండి:

  • మీరు అందుబాటులో ఉన్న లొకేషన్‌లలో ఏదైనా ఒక దానిలో నివసిస్తూ ఉండాలి.
  • ఛానెల్ పిల్లల కోసం రూపొందించబడినదిగా సెట్ చేసి ఉండకూడదు, అలాగే అందులో పిల్లల కోసం రూపొందించబడిన వీడియోలు ఎక్కువ సంఖ్యలో ఉండకూడదు.
  • మీ ఛానెల్‌లో అర్హత లేని వీడియోలు గణనీయమైన సంఖ్యలో ఉండకూడదు.
    • పిల్లల కోసం రూపొందించబడినవిగా సెట్ చేసిన వీడియోలు, లేదా మ్యూజిక్ క్లెయిమ్‌లు ఉన్న వీడియోలు, అనర్హమైనవిగా పరిగణించబడతాయి.
  • మీరు (ఇంకా మీ MCN) మా నియమాలు, పాలసీలను (సంబంధిత వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌తో సహా) అంగీకరించారు, వాటిని పాటిస్తున్నారు.
    • గమనిక: కొన్ని మ్యూజిక్ ఛానెల్స్, ఛానెల్ మెంబర్‌షిప్‌లకు అర్హత పొందకపోవచ్చు. ఉదాహరణకు, SRAV ఒప్పందం కింద ఉన్న మ్యూజిక్ ఛానెల్స్‌కు ప్రస్తుతం అర్హత లేదు.
లభ్యత

కింద పేర్కొన్న లొకేషన్‌లలో అర్హత కలిగిన క్రియేటర్‌లకు ఛానెల్ మెంబర్‌షిప్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి:

  • అల్జీరియా
  • అమెరికన్ సమోవా
  • అర్జెంటీనా
  • అరుబా
  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • బహ్రెయిన్
  • బెలారస్
  • బెల్జియం
  • బెర్ముడా
  • బొలీవియా
  • బోస్నియా & హెర్జిగోవినా
  • బ్రెజిల్
  • బల్గేరియా
  • కెనడా
  • కేమాన్ దీవులు
  • చిలీ
  • కొలంబియా
  • కోస్టారికా
  • క్రొయేషియా
  • సైప్రస్
  • చెక్ రిపబ్లిక్
  • డెన్మార్క్
  • డొమినికన్ రిపబ్లిక్
  • ఈక్వెడార్
  • ఈజిప్ట్
  • ఎల్ సాల్వడోర్
  • ఎస్టోనియా
  • ఫిన్‌లాండ్
  • ఫ్రాన్స్
  • ఫ్రెంచ్ గీయానా
  • ఫ్రెంచ్ పాలినేషియా
  • జర్మనీ
  • గ్రీస్
  • గ్వాడెలోప్
  • గ్వామ్
  • గ్వాటెమాలా
  • హోండురస్
  • హాంకాంగ్
  • హంగేరి
  • ఐస్‌ల్యాండ్
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • ఐర్లాండ్
  • ఇజ్రాయిల్
  • ఇటలీ
  • జపాన్
  • జోర్డాన్
  • కెన్యా
  • కువైట్
  • లాత్వియా
  • లెబనాన్
  • లిచెన్‌స్టెయిన్
  • లిథువేనియా
  • లక్సెంబర్గ్
  • మలేషియా
  • మాల్టా
  • మెక్సికో
  • మొరాకో
  • నెదర్లాండ్స్
  • న్యూజిలాండ్
  • నికరాగువా
  • నైజీరియా
  • ఉత్తర మాసిడోనియా
  • ఉత్తర మారియానా దీవులు
  • నార్వే
  • ఒమన్
  • పనామా
  • పాపువా న్యూ గినియా
  • పరాగ్వే
  • పెరూ
  • ఫిలిప్పీన్స్
  • పోలండ్
  • పోర్చుగల్
  • ప్యూర్టోరికో
  • ఖతార్
  • రొమేనియా
  • రష్యా
  • సౌదీ అరేబియా
  • సెనెగల్
  • సెర్బియా
  • సింగపూర్
  • స్లోవేకియా
  • స్లోవేనియా
  • దక్షిణాఫ్రికా
  • దక్షిణ కొరియా
  • స్పెయిన్
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • తైవాన్
  • థాయ్‌లాండ్
  • టర్కీ
  • టర్క్స్ అండ్ కైకోస్ దీవులు
  • U.S. వర్జిన్ దీవులు
  • ఉగాండా
  • ఉక్రెయిన్
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్
  • ఉరుగ్వే
  • వియత్నాం

ఛానెల్ మెంబర్‌షిప్‌లకు ఉన్న పాలసీలు, గైడ్‌లైన్స్

క్రియేటర్‌లు, MCNలకు ఉన్న ఛానెల్ మెంబర్‌షిప్‌ల పాలసీలు
ఛానెల్ మెంబర్‌షిప్‌లు అనేది ఒక ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్. కాబట్టి, పాల్గొనే క్రియేటర్‌లు (ఇంకా వారి MCNలు) YouTube ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లకు వర్తించే అన్ని పాలసీలకు లోబడి ఉండాలి.
మీ ఛానెల్ ఛానెల్ మెంబర్‌షిప్‌లకు సంబంధించిన కంటెంట్, పెర్క్, పెర్క్ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వడం ముఖ్యం. మీ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్‌లో చేర్చిన పెర్క్‌లన్నీ, మీ మెంబర్‌షిప్‌ల విండోలో లిస్ట్ చేసినా లేదా ఇతర సోర్స్‌ల ద్వారా అందుబాటులో ఉన్నా, ఈ పాలసీలకు లోబడి ఉండాలి. మేము ఈ పాలసీలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయవచ్చు.
ఛానెల్ మెంబర్‌షిప్‌లకు సంబంధించిన కంటెంట్, పెర్క్ గైడ్‌లైన్స్

బ్యాడ్జ్‌లు, ఎమోజీలు, పెర్క్‌లు, వీడియోలు, లైవ్ చాట్‌లు, ఇంకా ఇతర కంటెంట్‌తో సహా ఛానెల్ మెంబర్‌షిప్ పెర్క్‌లన్నీ మెంబర్‌షిప్ పాలసీలకు, గైడ్‌లైన్స్‌కు లోబడి ఉండాలి.

మీ మెంబర్‌లను ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా చేసే పెర్క్‌లను మీరు చేర్చవచ్చు. కానీ, మా పాలసీలు, నియమాల ప్రకారం మెంబర్‌లు మాత్రమే పొందగల ఈ కింద పెర్క్‌లకు అనుమతి లేదు.

  • YouTubeలో అందుబాటులో ఉన్న కంటెంట్‌కు (మ్యూజిక్‌తో సహా) సంబంధించిన డౌన్‌లోడ్‌లు
  • స్వయంగా హాజరు అయ్యే 1:1 మీటింగ్‌లు
  • ర్యాండమ్‌గా మీ మెంబర్లలో ఒకరిని లేదా కొంత మందిని (అందరినీ కాదు) ఎంచుకొని, వారికి ఏదైనా అందించడం. వాటిలో కొన్ని ఈ కింద అందించబడ్డాయి, అయితే ఇవి కాకుండా ఇంకా వేరేవి కూడా ఉండవచ్చు:
    • పోటీలు
    • లాటరీలు
    • స్వీప్‌స్టేక్స్
  • చిన్నారులను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ చేసే పెర్క్‌లు, చిన్నారులను ఉద్దేశించి లేదా వారిని లక్ష్యంగా చేసుకొని రూపొందించే పెర్క్‌లు, లేదా చిన్నారులను ఆకర్షించే విధంగా ఉండే లేదా వారికి అనుచితంగా ఉండే పెర్క్‌లు
  • చిన్నారులను, తమ తల్లిదండ్రులను మీ ఛానెల్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరమని అడగాల్సిందిగా ప్రోత్సహించే పెర్క్‌లు 

ఛానెల్ మెంబర్‌షిప్‌ల రద్దులు, ముగించడం, రీఫండ్‌లు

ఒకవేళ మెంబర్ రీఫండ్‌ను రిక్వెస్ట్ చేసినట్లయితే, ఆ క్లెయిమ్‌కు సంబంధించిన చెల్లుబాటును వెరిఫై చేసే హక్కు కేవలం YouTubeకు మాత్రమే ఉంది. మేము మెంబర్‌లకు రీఫండ్‌లను మంజూరు చేసేటప్పుడు, రీఫండ్ చేయాల్సిన మెంబర్‌లకు తిరిగి పేమెంట్ చేసేందుకు మీ 'YouTube కోసం AdSense ఖాతా' నుండి మీ షేర్ డిడక్ట్ చేయబడుతుంది. పెయిడ్ ఛానెల్ మెంబర్‌షిప్‌లకు సంబంధించిన YouTube రీఫండ్ పాలసీ గురించి తెలుసుకోండి.
కింది కారణాలలో దేని వలన అయినా ఛానెల్ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్ రద్దు అయితే, పేమెంట్ చేసే యాక్టివ్ మెంబర్‌లందరూ, తమ చివరి పేమెంట్‌కు రీఫండ్ పొందుతారు:
  • ఛానెల్ రద్దు చేస్తే
  • YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నుండి తీసివేస్తే
  • దుర్వినియోగం లేదా మోసం కారణంగా
  • మా నియమాలు లేదా పాలసీలను ఉల్లంఘించినందున

గమనిక: ఆదాయంలోని ఛానెల్ షేర్ నుండి, రీఫండ్ చేసిన డబ్బు డిడక్ట్ చేయబడుతుంది.

పాజ్ చేయబడిన మోడ్ మీ ఛానెల్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది

కింద పేర్కొన్న సందర్భాలలో, మీ ఛానెల్‌కు సంబంధించిన మెంబర్‌షిప్‌లు "పాజ్ చేయబడిన మోడ్"కు మారతాయి:

మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది

మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నప్పుడు:

  • బ్యాడ్జ్‌లు, ఎమోజీ, మెంబర్‌లు మాత్రమే చూడగల కమ్యూనిటీ పోస్ట్‌ల వంటి పెర్క్‌లతో సహా మీ ఛానెల్‌లోని పెర్క్‌లకు మీ మెంబర్‌లు యాక్సెస్‌ను కోల్పోతారు.
  • మీ మెంబర్‌ల నెలవారీ పేమెంట్‌లు పాజ్ చేయబడతాయి. 
  • "చేరే" బటన్ మీ ఛానెల్‌లో కనిపించదు.

పాజ్ చేయబడిన మోడ్ మీ మెంబర్‌లను రద్దు చేయనప్పటికీ, మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా మెంబర్‌లు తమ మెంబర్‌షిప్‌ను రద్దు చేయవచ్చు.

పాజ్ చేయబడిన మోడ్ నుండి ఎలా తీసివేయాలి

పాజ్ చేయబడిన మోడ్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి, మీరు పాజ్ చేయబడిన మోడ్‌లో ఉండటానికి గల సమస్యను పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాత, మీరు లేదా మీ కొత్త MCN పాజ్ చేయబడిన మోడ్ నుండి ఎగ్జిట్ కావచ్చు, ఛానెల్ మెంబర్‌షిప్‌లను కొనసాగించవచ్చు:

  1. కంప్యూటర్‌లో, studio.youtube.com/channel/UC/monetization/memberships‌కు వెళ్లండి
  2. ఛానెల్ మెంబర్‌షిప్‌ల బాక్స్‌లో, ఆన్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
    1. గమనిక: మీరు (లేదా మీ కొత్త MCN) మా నియమాలకు, పాలసీలకు (వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌తో సహా) అంగీకరించి, వాటిని పాటిస్తున్నప్పుడు మాత్రమే మెంబర్‌షిప్‌లను ఆన్ చేయగలరు.

మీరు మెంబర్‌షిప్‌లను కొనసాగించిన తర్వాత, ఛానెల్ మెంబర్‌లు మీ మెంబర్‌షిప్ పెర్క్‌లకు యాక్సెస్‌ను తిరిగి పొందుతారు. వారు రద్దు చేసుకుంటే మినహా, మెంబర్‌ల తర్వాతి బిల్లింగ్ కాల వ్యవధి ప్రారంభంలో వారికి మళ్లీ ఛార్జ్ చేయబడదు.

మీరు పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నప్పుడు మీ మెంబర్‌లకు ఏం జరుగుతుంది

పాజ్ చేయబడిన మోడ్‌లో ఉంటే, మీ మెంబర్‌లు ఆటోమేటిక్‌గా రద్దు అవ్వరు, కానీ మెంబర్‌లు ఎప్పుడైనా రద్దు చేయడానికి ఎంచుకోవచ్చు. అయితే, నిర్దిష్ట సమయం గడిచిన తర్వాత, మేము మీ మెంబర్‌లను ఆటోమేటిక్‌గా రద్దు చేస్తాము. ఆ సమయం, మెంబర్ మీ ఛానెల్‌లో ఎప్పుడు చేరారు అనే దానిపై ఆధారపడుతుంది:

  • YouTube.com ద్వారా చేరిన మెంబర్‌లకు: 120 రోజులు గడిచిన తర్వాత కూడా మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉంటే, వారి మెంబర్‌షిప్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.
  • YouTube Android లేదా iOS యాప్‌ల ద్వారా చేరిన మెంబర్‌లకు: మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నప్పుడు మెంబర్ యొక్క బిల్లింగ్ వ్యవధి ముగిస్తే, వారి మెంబర్‌షిప్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.

మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నా, మెంబర్‌లు, స్వయంగా వారే తమ మెంబర్‌షిప్‌ను రద్దు చేయడానికి ఎంచుకోవచ్చు. మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ కొనసాగినప్పుడు, మెంబర్‌లు మీ ఛానెల్‌లో తిరిగి చేరవచ్చు.

మీరు పాజ్ చేయబడిన మోడ్‌లో 120 రోజులకు పైగా ఉంటే ఏం జరుగుతుంది

120 రోజుల్లో మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్ నుండి ఎగ్జిట్ అవ్వకపోతే, మీ ఛానెల్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ రద్దు అవుతుంది, మీరు మెంబర్‌లందరినీ కోల్పోతారు. మీ ఛానెల్‌లోని మెంబర్‌ల చివరి నెల పేమెంట్ ఆటోమేటిక్‌గా రీఫండ్ చేయబడుతుంది. మీ మెంబర్‌ల రీఫండ్‌లను, మేము మీ 'YouTube కోసం AdSense'లోని మీ షేర్ నుండి డిడక్ట్ చేస్తాము.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1388938849932395962
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false