నెలవారీ పేమెంట్ల ద్వారా మీ ఛానెల్లో చేరే వెసులుబాటును వీక్షకులకు ఛానెల్ మెంబర్‌షిప్‌లు కల్పిస్తాయి, తిరిగి వారు బ్యాడ్జ్‌లు, ఎమోజీలు, ఇతర వస్తువుల వంటి మెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేక పెర్క్‌లను పొందుతారు.
మీ ఛానెల్‌కు మెంబర్‌షిప్‌లను ప్రారంభించడానికి:
- ఛానెల్ మెంబర్‌షిప్‌లకు కావలసిన అర్హతలు, అవి ఏ లొకేషన్లో అందుబాటులో ఉన్నాయి, వాటి పాలసీలు, గైడ్‌లైన్స్‌ను రివ్యూ చేయండి.
- మీ ఛానెల్‌కు లేదా మీ నెట్‌వర్క్‌కు మెంబర్‌షిప్‌లను ఆన్ చేయండి.
- మీ ఛానెల్ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్ కోసం పెర్క్‌లు, స్థాయిలను క్రియేట్ చేయండి.
లభ్యత, అర్హత
అర్హతఛానెల్ మెంబర్‌షిప్‌లకు అర్హత పొందడానికి, మీరు ముందుగా ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ల కోసం కనీస ఆవశ్యకతలను పాటించారని నిర్ధారించుకోండి. మెంబర్‌షిప్‌ల కోసం దిగువ పేర్కొన్న ఇతర అర్హతా ప్రమాణాలు మీకున్నాయని నిర్ధారించండి:
- మీరు అందుబాటులో ఉన్న లొకేషన్లలో ఏదైనా ఒక దానిలో నివసిస్తూ ఉండాలి.
- ఛానెల్ పిల్లల కోసం రూపొందించబడినదిగా సెట్ చేసి ఉండకూడదు, అలాగే అందులో పిల్లల కోసం రూపొందించబడిన వీడియోలు ఎక్కువ సంఖ్యలో ఉండకూడదు.
- మీ ఛానెల్లో అర్హత లేని వీడియోలు గణనీయమైన సంఖ్యలో ఉండకూడదు.
- పిల్లల కోసం రూపొందించబడినవిగా సెట్ చేసిన వీడియోలు, లేదా మ్యూజిక్ క్లెయిమ్‌లు ఉన్న వీడియోలు, అనర్హమైనవిగా పరిగణించబడతాయి.
- మీరు (ఇంకా మీ MCN) మా నియమాలు, పాలసీలను (సంబంధిత వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్తో సహా) అంగీకరించారు, వాటిని పాటిస్తున్నారు.
- గమనిక: కొన్ని మ్యూజిక్ ఛానెల్స్, ఛానెల్ మెంబర్‌షిప్‌లకు అర్హత పొందకపోవచ్చు. ఉదాహరణకు, SRAV ఒప్పందం కింద ఉన్న మ్యూజిక్ ఛానెల్స్‌కు ప్రస్తుతం అర్హత లేదు.
కింద పేర్కొన్న లొకేషన్లలో అర్హత కలిగిన క్రియేటర్లకు ఛానెల్ మెంబర్‌షిప్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి:
|
|
ఛానెల్ మెంబర్‌షిప్‌లకు ఉన్న పాలసీలు, గైడ్‌లైన్స్
క్రియేటర్లు, MCNలకు ఉన్న ఛానెల్ మెంబర్‌షిప్‌ల పాలసీలుబ్యాడ్జ్లు, ఎమోజీలు, పెర్క్‌లు, వీడియోలు, లైవ్ చాట్లు, ఇంకా ఇతర కంటెంట్‌తో సహా ఛానెల్ మెంబర్షిప్ పెర్క్‌లన్నీ మెంబర్షిప్ పాలసీలకు, గైడ్‌లైన్స్‌కు లోబడి ఉండాలి.
మీ మెంబర్లను ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా చేసే పెర్క్‌లను మీరు చేర్చవచ్చు. కానీ, మా పాలసీలు, నియమాల ప్రకారం మెంబర్లు మాత్రమే పొందగల ఈ కింద పెర్క్‌లకు అనుమతి లేదు.
- YouTubeలో అందుబాటులో ఉన్న కంటెంట్‌కు (మ్యూజిక్‌తో సహా) సంబంధించిన డౌన్లోడ్లు
- స్వయంగా హాజరు అయ్యే 1:1 మీటింగ్‌లు
- ర్యాండమ్‌గా మీ మెంబర్లలో ఒకరిని లేదా కొంత మందిని (అందరినీ కాదు) ఎంచుకొని, వారికి ఏదైనా అందించడం. వాటిలో కొన్ని ఈ కింద అందించబడ్డాయి, అయితే ఇవి కాకుండా ఇంకా వేరేవి కూడా ఉండవచ్చు:
- పోటీలు
- లాటరీలు
- స్వీప్‌స్టేక్స్
- చిన్నారులను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ చేసే పెర్క్‌లు, చిన్నారులను ఉద్దేశించి లేదా వారిని లక్ష్యంగా చేసుకొని రూపొందించే పెర్క్‌లు, లేదా చిన్నారులను ఆకర్షించే విధంగా ఉండే లేదా వారికి అనుచితంగా ఉండే పెర్క్‌లు
- చిన్నారులను, తమ తల్లిదండ్రులను మీ ఛానెల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్‌లో చేరమని అడగాల్సిందిగా ప్రోత్సహించే పెర్క్‌లు
ఛానెల్ మెంబర్‌షిప్‌ల రద్దులు, ముగించడం, రీఫండ్లు
- ఛానెల్ రద్దు చేస్తే
- YouTube పార్ట్నర్ ప్రోగ్రామ్ నుండి తీసివేస్తే
- దుర్వినియోగం లేదా మోసం కారణంగా
- మా నియమాలు లేదా పాలసీలను ఉల్లంఘించినందున
గమనిక: ఆదాయంలోని ఛానెల్ షేర్ నుండి, రీఫండ్ చేసిన డబ్బు డిడక్ట్ చేయబడుతుంది.
పాజ్ చేయబడిన మోడ్ మీ ఛానెల్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది
- మీ ఛానెల్ రద్దు అవ్వడం.
- మీ ఛానెల్ YouTube మానిటైజేషన్ పాలసీలను ఉల్లంఘించడం.
- నిష్క్రమించడం లేదా కంటెంట్ ఓనర్లను మార్చడం వల్ల మీరు మానిటైజేషన్‌ను కోల్పోయినప్పుడు.
- మీ ఛానెల్‌ను పిల్లల కోసం రూపొందించినదిగా సెట్ చేసినప్పుడు.
మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది
మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నప్పుడు:
- బ్యాడ్జ్‌లు, ఎమోజీ, మెంబర్లు మాత్రమే చూడగల కమ్యూనిటీ పోస్ట్‌ల వంటి పెర్క్‌లతో సహా మీ ఛానెల్లోని పెర్క్‌లకు మీ మెంబర్లు యాక్సెస్‌ను కోల్పోతారు.
- మీ మెంబర్ల నెలవారీ పేమెంట్లు పాజ్ చేయబడతాయి.
- "చేరే" బటన్ మీ ఛానెల్లో కనిపించదు.
పాజ్ చేయబడిన మోడ్ మీ మెంబర్లను రద్దు చేయనప్పటికీ, మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా మెంబర్లు తమ మెంబర్‌షిప్‌ను రద్దు చేయవచ్చు.
పాజ్ చేయబడిన మోడ్ నుండి ఎలా తీసివేయాలి
పాజ్ చేయబడిన మోడ్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి, మీరు పాజ్ చేయబడిన మోడ్‌లో ఉండటానికి గల సమస్యను పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాత, మీరు లేదా మీ కొత్త MCN పాజ్ చేయబడిన మోడ్ నుండి ఎగ్జిట్ కావచ్చు, ఛానెల్ మెంబర్‌షిప్‌లను కొనసాగించవచ్చు:
- కంప్యూటర్లో, studio.youtube.com/channel/UC/monetization/membershipsకు వెళ్లండి
- ఛానెల్ మెంబర్‌షిప్‌ల బాక్స్‌లో, ఆన్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- గమనిక: మీరు (లేదా మీ కొత్త MCN) మా నియమాలకు, పాలసీలకు (వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్తో సహా) అంగీకరించి, వాటిని పాటిస్తున్నప్పుడు మాత్రమే మెంబర్‌షిప్‌లను ఆన్ చేయగలరు.
మీరు మెంబర్‌షిప్‌లను కొనసాగించిన తర్వాత, ఛానెల్ మెంబర్లు మీ మెంబర్షిప్ పెర్క్‌లకు యాక్సెస్‌ను తిరిగి పొందుతారు. వారు రద్దు చేసుకుంటే మినహా, మెంబర్ల తర్వాతి బిల్లింగ్ కాల వ్యవధి ప్రారంభంలో వారికి మళ్లీ ఛార్జ్ చేయబడదు.
మీరు పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నప్పుడు మీ మెంబర్లకు ఏం జరుగుతుంది
పాజ్ చేయబడిన మోడ్‌లో ఉంటే, మీ మెంబర్లు ఆటోమేటిక్‌గా రద్దు అవ్వరు, కానీ మెంబర్లు ఎప్పుడైనా రద్దు చేయడానికి ఎంచుకోవచ్చు. అయితే, నిర్దిష్ట సమయం గడిచిన తర్వాత, మేము మీ మెంబర్లను ఆటోమేటిక్‌గా రద్దు చేస్తాము. ఆ సమయం, మెంబర్ మీ ఛానెల్లో ఎప్పుడు చేరారు అనే దానిపై ఆధారపడుతుంది:
- YouTube.com ద్వారా చేరిన మెంబర్లకు: 120 రోజులు గడిచిన తర్వాత కూడా మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉంటే, వారి మెంబర్షిప్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.
- YouTube Android లేదా iOS యాప్‌ల ద్వారా చేరిన మెంబర్లకు: మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నప్పుడు మెంబర్ యొక్క బిల్లింగ్ వ్యవధి ముగిస్తే, వారి మెంబర్షిప్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.
మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్‌లో ఉన్నా, మెంబర్లు, స్వయంగా వారే తమ మెంబర్‌షిప్‌ను రద్దు చేయడానికి ఎంచుకోవచ్చు. మెంబర్షిప్ ప్రోగ్రామ్ కొనసాగినప్పుడు, మెంబర్లు మీ ఛానెల్లో తిరిగి చేరవచ్చు.
మీరు పాజ్ చేయబడిన మోడ్‌లో 120 రోజులకు పైగా ఉంటే ఏం జరుగుతుంది
120 రోజుల్లో మీ ఛానెల్ పాజ్ చేయబడిన మోడ్ నుండి ఎగ్జిట్ అవ్వకపోతే, మీ ఛానెల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ రద్దు అవుతుంది, మీరు మెంబర్లందరినీ కోల్పోతారు. మీ ఛానెల్లోని మెంబర్ల చివరి నెల పేమెంట్ ఆటోమేటిక్‌గా రీఫండ్ చేయబడుతుంది. మీ మెంబర్ల రీఫండ్లను, మేము మీ 'YouTube కోసం AdSense'లోని మీ షేర్ నుండి డిడక్ట్ చేస్తాము.