YouTubeలో డబ్బు సంపాదించడం ఎలా

మేము మరింత మంది క్రియేటర్‌లకు అందుబాటులో ఉండేలా YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)ను విస్తరింపజేస్తున్నాము, దీనితో వారికి ఫ్యాన్ ఫండింగ్, ఇంకా Shopping ఫీచర్‌లకు ముందుగానే యాక్సెస్ లభిస్తుంది. విస్తరించిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ఈ దేశాలు/ప్రాంతాలలో అర్హత ఉన్న క్రియేటర్‌లకు అందుబాటులో ఉంది. ఈ విస్తరణ AE, AU, BR, EG, ID, KE, KY, LT, LU, LV, MK, MP, MT, MY, NG, NL, NO, NZ, PF, PG, PH, PT, QA, RO, RS, SE, SG, SI, SK, SN, TC, TH, TR, UG, VI, VN, and ZAలో అర్హత కలిగిన క్రియేటర్‌లకు వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుంది. YPPలో జరిపిన మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ ఆర్టికల్‌ను చూడండి.

మీరు పై దేశాలు/ప్రాంతాలలో ఒక దానిలో నివసించకపోతే, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు సంబంధించి మీకు ఎలాంటి మార్పులు ఉండవు. మీకు సంబంధించిన YPP ఓవర్‌వ్యూ, అర్హత, దరఖాస్తు సూచనల కోసం మీరు ఈ ఆర్టికల్‌ను చూడవచ్చు.

విస్తరింపజేయబడిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ కోసం మీ అర్హతను చెక్ చేయండి. మీరు అర్హులు కాకపోతే, YouTube Studioలోని Earn ఏరియాలో నోటిఫికేషన్ పొందండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. YPP ప్రోగ్రామ్‌ను మీకు అందుబాటులోకి తెచ్చినప్పుడు, కనీస అర్హతా ప్రమాణాలకు మీరు అనుగుణంగా ఉన్నప్పుడు, మేము మీకు ఒక ఈమెయిల్‌ను పంపుతాము. 

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా, రష్యాలోని యూజర్లకు Google యాడ్‌లను, YouTube యాడ్‌లను అందించడాన్ని మేము తాత్కాలికంగా పాజ్ చేయనున్నాము. మరింత తెలుసుకోండి.

మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేయడం, అలాగే ఆమోదించబడటం ద్వారా YouTubeలో డబ్బు సంపాదించవచ్చు. మా YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలను ఫాలో అయ్యే ఛానెల్స్‌కు మాత్రమే మానిటైజ్ చేసే అర్హత ఉండవచ్చు.

YouTubeలో డబ్బు సంపాదించడంపై పరిచయ వీడియో

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

కొన్ని గమనికలు

  • మీరు YouTubeలో ఏమి క్రియేట్ చేయవచ్చనేది మేము మీకు చెప్పము, కానీ మా వీక్షకులు, క్రియేటర్‌లు, అడ్వర్టయిజర్‌లు సరైన విధంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉంటే, YouTube ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు, మేము మిమ్మల్ని ఉన్నత ప్రమాణాల్లో ఉంచుతాము.
  • మేము మంచి క్రియేటర్‌లకు రివార్డ్ ఇస్తున్నామని నిర్ధారించుకోవడానికి, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో మీరు ఆమోదించబడే ముందు మేము మీ ఛానెల్‌ను రివ్యూ చేస్తాము. మీరు మా అన్ని పాలసీలకు, గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి మేము ఛానెల్స్‌ను కూడా నిరంతరం రివ్యూ చేస్తాము.
  • YouTube ద్వారా వచ్చే మీ ఆదాయంపై ట్యాక్స్‌లు పే చేయాల్సిన బాధ్యత మీ పైన ఉండవచ్చు; దిగువున మరింత తెలుసుకోండి.

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో డబ్బు సంపాదించడానికి మార్గాలు

మీరు కింది ఫీచర్‌ల ద్వారా YouTubeలో డబ్బు సంపాదించవచ్చు:

  • యాడ్ నికర ఆదాయం: వీక్షణా పేజీ యాడ్‌లు, Shorts ఫీడ్ యాడ్‌ల నుండి ఆదాయాన్ని సంపాదించండి.
  • Shopping: YouTube Shopping అనుబంధ ప్రోగ్రామ్ ద్వారా మీ స్టోర్‌లోని ప్రోడక్ట్‌లను కానీ, లేదా మీరు ట్యాగ్ చేసే ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను కానీ మీ ఫ్యాన్స్ బ్రౌజ్ చేసి, కొనుగోలు చేయగలరు.
  • YouTube Premium ఆదాయం: YouTube Premium సబ్‌స్క్రయిబర్ మీ కంటెంట్‌ను చూసినప్పుడు, వారి సబ్‌స్క్రిప్షన్ ఫీజు‌లో కొంత భాగాన్ని పొందండి.
  • ఛానెల్ మెంబర్‌షిప్‌లు: మీ మెంబర్‌లు రిపీట్ అయ్యే నెలవారీ పేమెంట్‌లను చేస్తారు, అందుకు ప్రతిఫలంగా వారికి ప్రత్యేకమైన పెర్క్‌లకు యాక్సెస్ లభిస్తుంది.
  • సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్: మీ ఫ్యాన్స్ తమ మెసేజ్‌లను లేదా యానిమేట్ చేసిన ఇమేజ్‌లను లైవ్ చాట్ స్ట్రీమ్‌లలో హైలైట్ చేయడానికి పేమెంట్ చేస్తారు.
  • సూపర్ థ్యాంక్స్: మీ ఫ్యాన్స్ ఫన్నీ యానిమేషన్‌ను చూడటానికి, తమ మెసేజ్‌ను మీ వీడియోలోని లేదా మీ షార్ట్‌లోని కామెంట్‌ల విభాగంలో ప్రముఖంగా కనిపించేలా చేయడానికి పేమెంట్ చేస్తారు.

ప్రతి ఫీచర్‌కు సబ్‌స్క్రయిబర్‌ల సంఖ్య, వీక్షణల సంఖ్య ఆవశ్యకతలు ఉంటాయి, వీటికి అదనంగా ఒక్కో ఫీచర్‌కు ఒక్కో రకమైన అర్హతల సెట్ కూడా ఉంటుంది. మీ ఛానెల్‌కు లేదా వీడియోకు అర్హత లేదని మా రివ్యూవర్‌లు భావించినట్లయితే, నిర్దిష్ట ఫీచర్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు. రెండు ప్రధాన కారణాల వల్ల ఈ అదనపు థ్రెషోల్డ్‌లు ఉంటాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫీచర్ అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలో మేము చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాలి. అలాగే, మేము మంచి క్రియేటర్‌లకు రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి, మీ ఛానెల్‌లో మాకు తగినంత సందర్భం ఉందని నిర్ధారించుకోవాలి. సాధారణంగా, ఈ సందర్భం అంటే మేము రివ్యూ చేయడానికి మరింత కంటెంట్ ఉండాలని అర్థం.

మీ కంటెంట్ మా పాలసీలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి మేము ఛానెల్స్‌ను నిరంతరం రివ్యూ చేస్తామని గుర్తుంచుకోండి.

మానిటైజేషన్ ఫీచర్‌లను ఆన్ చేయడానికి కావలసిన కనీస అర్హతలు

ప్రతి ఫీచర్‌కు తన స్వంత అవసరాలు ఉంటాయని గుర్తుంచుకోండి. స్థానిక చట్టపరమైన అవసరాల కారణంగా కొన్ని ఫీచర్‌లు మీకు అందుబాటులో ఉండకపోవచ్చు.

మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు అర్హత పొందిన తర్వాత, మీకు ఈ మానిటైజేషన్ ఫీచర్‌లకు యాక్సెస్ లభించవచ్చు:

 

  ఛానెల్ పరిమితులు కనీస ఆవశ్యకతలు

 

 

 

ఛానెల్ మెంబర్‌షిప్‌లు

 

 

 

 

 

 

 

 

 

  • ​​​​​​500 మంది సబ్‌స్క్రయిబర్‌లు ఉండాలి
  • గత 90 రోజులలో 3 పబ్లిక్ వీడియోలు అప్‌లోడ్ అయ్యుండాలి
  • వీటిలో ఏదైనా:
    • గత 365 రోజులలో, నిడివి ఎక్కువ ఉన్న వీడియోలపై వచ్చిన పబ్లిక్ వీక్షణా సమయం 3,000 ఉండాలి
    • గత 90 రోజులలో వచ్చిన పబ్లిక్ Shorts వీక్షణలు 30 లక్షలు ఉండాలి
  • కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
  • ఛానెల్ మెంబర్‌షిప్‌లు అందుబాటులో ఉన్న దేశంలో నివసిస్తూ ఉండాలి
  • వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌ను లేదా గతంలో అందుబాటులో ఉండిన వాణిజ్య ప్రోడక్ట్ అనుబంధ ఒప్పందాన్ని అంగీకరించి ఉండాలి
  • ఛానెల్ పిల్లల కోసం రూపొందించినదిగా సెట్ చేసి ఉండకూడదు, అలాగే అందులో పిల్లల కోసం రూపొందించిన వీడియోలు లేదా అర్హత లేని వీడియోలు ఎక్కువ సంఖ్యలో ఉండకూడదు
  • SRAV ప్రకారం మ్యూజిక్ ఛానెల్ అయ్యుండకూడదు
  • పూర్తి ఆవశ్యకతలను ఇక్కడ చూడవచ్చు

 

 

 

Shopping (మీ సొంత ప్రోడక్ట్‌లు)

 

 

సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
  • సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అందుబాటులో ఉన్న దేశం/ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి
  • వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌ను లేదా గతంలో అందుబాటులో ఉండిన వాణిజ్య ప్రోడక్ట్ అనుబంధ ఒప్పందాన్ని అంగీకరించి ఉండాలి
  • పూర్తి ఆవశ్యకతలను ఇక్కడ చూడవచ్చు

 

 

సూపర్ థ్యాంక్స్

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
  • సూపర్ థ్యాంక్స్ అందుబాటులో ఉన్న దేశం/ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి
  • వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌ను లేదా గతంలో అందుబాటులో ఉండిన వాణిజ్య ప్రోడక్ట్ అనుబంధ ఒప్పందాన్ని అంగీకరించి ఉండాలి
  • ఛానెల్, SRAV ప్రకారం మ్యూజిక్ ఛానెల్ అయ్యుండకూడదు
  • పూర్తి ఆవశ్యకతలను ఇక్కడ చూడవచ్చు

 

 

యాడ్ ఆదాయం

  • 1,000 మంది సబ్‌స్క్రయిబర్‌లు ఉండాలి
  • వీటిలో ఏదైనా:
    • గత 365 రోజులలో, నిడివి ఎక్కువ ఉన్న వీడియోలపై వచ్చిన పబ్లిక్ వీక్షణా సమయం 4,000 ఉండాలి
    • గత 90 రోజులలో కోటి పబ్లిక్ Shorts వీక్షణలు వచ్చి ఉండాలి
  • కనీసం 18 సంవత్సరాల వయస్సు అయినా ఉండాలి, లేదా 'YouTube కోసం AdSense' ద్వారా మీ పేమెంట్‌లను హ్యాండిల్ చేయగల, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న లీగల్ గార్డియన్ అయినా ఉండాలి
  • YPP అందుబాటులో ఉన్న దేశం/ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి
  • సంబంధిత ఒప్పంద మాడ్యూల్స్‌ను అంగీకరించి ఉండాలి
  • మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండే కంటెంట్‌ను క్రియేట్ చేయాలి
YouTube Premium ఆదాయం
  • సంబంధిత ఒప్పంద మాడ్యూల్స్‌ను అంగీకరించి ఉండాలి
  • YouTube Premium సబ్‌స్క్రయిబర్ అయిన వీక్షకులు చూసే కంటెంట్‌ను క్రియేట్ చేయాలి

 

 

Shopping (ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లు)

  • 20,000 మంది సబ్‌స్క్రయిబర్‌లు ఉండాలి
  • వీటిలో ఏదైనా:
    • గత 365 రోజులలో, నిడివి ఎక్కువ ఉన్న వీడియోలపై వచ్చిన పబ్లిక్ వీక్షణా సమయం 4,000 ఉండాలి
    • గత 90 రోజులలో కోటి పబ్లిక్ Shorts వీక్షణలు వచ్చి ఉండాలి
  • సబ్‌స్క్రయిబర్‌ల విషయంలో నిర్దేశించిన పరిమితికి అనుగుణంగా ఉండాలి
  • KRలో లేదా USలో నివసిస్తూ ఉండాలి
  • ఛానెల్ మ్యూజిక్ ఛానెల్ కానీ, అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్ కానీ అయి ఉండకూడదు, లేదా మ్యూజిక్ పార్ట్‌నర్‌లతో అనుబంధించబడి ఉండకూడదు. మ్యూజిక్ పార్ట్‌నర్‌లలో మ్యూజిక్ లేబుళ్లు, డిస్ట్రిబ్యూటర్‌లు, పబ్లిషర్‌లు, లేదా VEVO ఉండవచ్చు.
  • ఛానెల్ పిల్లల కోసం రూపొందించినదిగా సెట్ చేసి ఉండకూడదు, అలాగే అందులో పిల్లల కోసం రూపొందించిన వీడియోలు ఎక్కువ సంఖ్యలో ఉండకూడదు
  • పూర్తి ఆవశ్యకతలను ఇక్కడ చూడవచ్చు
YouTubeలో డబ్బు సంపాదించడం ఎలా అనే దాని గురించి క్రియేటర్ చిట్కాలను పొందండి.

మీ YouTube ఆదాయం, ట్యాక్స్ బాధ్యత

YouTubeలో డబ్బు సంపాదించడం లేదా Shorts బోనస్‌లను అందుకోవడం అనేది ప్లాట్‌ఫామ్‌లో చక్కగా, ఎంగేజ్ చేసే కంటెంట్ కోసం రివార్డ్‌ను పొందడానికి గొప్ప మార్గం. YouTubeలో మీ మానిటైజ్ చేయబడిన వీడియోల ద్వారా సంపాదించిన ఏదైనా ఆదాయానికి సంబంధించి మీ నివాసిత దేశానికి ట్యాక్స్‌లు పే చేయాల్సిన బాధ్యత మీ పైన ఉండవచ్చని గుర్తుంచుకోండి. వివరణాత్మక గైడెన్స్ కోసం మీ లోకల్ ట్యాక్స్ అథారిటీలను సంప్రదించండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2362587135674611247
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false