YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ఓవర్‌వ్యూ & అర్హత

మేము మరింత మంది క్రియేటర్‌లకు అందుబాటులో ఉండేలా YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)ను విస్తరింపజేస్తున్నాము, దీనితో వారికి ఫ్యాన్ ఫండింగ్, ఇంకా Shopping ఫీచర్‌లకు ముందుగానే యాక్సెస్ లభిస్తుంది. విస్తరించిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ఈ దేశాలు/ప్రాంతాలలో అర్హత ఉన్న క్రియేటర్‌లకు అందుబాటులో ఉంది. మీరు ఈ దేశాలు/ప్రాంతాలలో నివసిస్తూ ఉంటే, YPPలో మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ ఆర్టికల్‌ను రెఫర్ చేయండి. 

మీరు ఈ దేశాలు/ప్రాంతాలలో దేనిలోనైనా నివసించకపోతే, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు సంబంధించి మీకు ఎలాంటి మార్పులు ఉండవు. 

విస్తరింపజేయబడిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ కోసం మీ అర్హతను చెక్ చేయండి. మీరు అర్హులు కాకపోతే, YouTube Studioలోని Earn ఏరియాలో నోటిఫికేషన్ పొందండి ఆప్షన్‌ను ఎంచుకోండి. YPP ప్రోగ్రామ్‌ను మీకు అందుబాటులోకి తెచ్చినప్పుడు, అలాగే పేర్కొన్న కనీస అర్హతా ప్రమాణాలకు మీరు అనుగుణంగా ఉన్నప్పుడు, మేము మీకు ఒక ఈమెయిల్‌ను పంపుతాము. 
 

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) ద్వారా క్రియేటర్‌లు మరింత విస్తృత స్థాయిలో YouTube రిసోర్స్‌లకు, మానిటైజేషన్ ఫీచర్‌లకు యాక్సెస్ పొందుతారు, అలాగే మా క్రియేటర్ సపోర్ట్ టీమ్‌లకు యాక్సెస్ పొందుతారు. మీ కంటెంట్‌లో ప్రదర్శించబడే యాడ్‌ల నుండి వచ్చే ఆదాయన్ని షేర్ చేసుకునే వీలును కూడా ఇది కల్పిస్తుంది. ఫీచర్‌లు, అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ వివరాల గురించి ఈ ఆర్టికల్‌లో మరింత తెలుసుకోండి.

YouTubeలో డబ్బు సంపాదించడంపై పరిచయ వీడియో

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
YPPకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా, కానీ అంత కంటే ముందు ప్రేక్షకులను సంపాదించుకోవడంలో సహాయం కావాలా? మీ అభిమానుల సంఖ్యను పెంచుకోవడం కోసం మా చిట్కాలను, అలాగే YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన మా చిట్కాలను చెక్ చేయండి.

చేరడానికి మీకు ఏమి కావాలి

  1. YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలను ఫాలో అవ్వాలి.
    1. ఇది, YouTubeలో మానిటైజ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే పాలసీలు, గైడ్‌లైన్స్ కలిపి రూపొందించిన ఒక కలెక్షన్. YouTubeతో పార్ట్‌నర్ ఒప్పందాన్ని అంగీకరించినప్పుడు వీటికి తప్పక కట్టుబడి ఉండాలి.
  2. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉన్న దేశం/ప్రాంతంలో నివసించాలి.
  3. మీ ఛానెల్‌పై యాక్టివ్‌గా ఉన్న కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లు ఉండకూడదు.
  4. మీ Google ఖాతాకు 2-దశల వెరిఫికేషన్ ఆన్ చేయబడిందని నిర్ధారించుకోండి.
  5. YouTubeలో అధునాతన ఫీచర్‌లకు యాక్సెస్ ఉంది.
  6. యాక్టివ్‌గా ఉన్న 'YouTube కోసం AdSense' ఖాతాను మీ ఛానెల్‌కు లింక్ చేయండి, లేదా మీకు ఇప్పటికే ఆ ఖాతా లేకుంటే YouTube Studioలో ఖాతాను సెటప్ చేయడానికి సిద్ధంగా ఉండండి (YouTube Studioలో మాత్రమే కొత్త 'YouTube కోసం AdSense' ఖాతాను క్రియేట్ చేయండి – మరింత తెలుసుకోండి).

మీరు అర్హతను ఎలా సాధించవచ్చు

చేరడానికి మీకు ఏమి కావాలో అర్థం చేసుకున్న తర్వాత, Shorts లేదా నిడివి ఎక్కువ ఉన్న వీడియోతో మీ ఛానెల్ YPPకి అర్హత సాధించగలదు. మీరు అర్హత సాధించినప్పుడు మేము తెలియజేయాలని కోరుకుంటే, YouTube Studioలోని 'సంపాదించండి' అనే విభాగంలో నేను అర్హత సాధించినప్పుడు నాకు తెలియజేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. కింది కనీస అర్హతలలో ఒక దానిని మీరు సాధించిన తర్వాత, మీరు ఈమెయిల్‌ను అందుకుంటారు.

1. గత 12 నెలల్లో చెల్లుబాటు అయ్యే 4,000 గంటల పబ్లిక్ వీక్షణా సమయంతో 1,000 మంది సబ్‌స్క్రయిబర్‌‌లను పొందండి, లేదా
2. గత 90 రోజుల్లో 1 కోటి చెల్లుబాటు అయ్యే పబ్లిక్ Shorts వీక్షణలతో 1,000 మంది సబ్‌స్క్రయిబర్‌లను పొందండి.

Shorts ఫీడ్‌లోని Shorts వీక్షణలకు సంబంధించిన పబ్లిక్ వీక్షణా సమయం మొత్తం, 4,000 గంటల పబ్లిక్ వీక్షణా సమయంలో భాగంగా లెక్కించబడదని గుర్తుంచుకోండి.

కనీస అర్హతలకు సంబంధించిన మరింత సమాచారం

మీ ఛానెల్ మా పాలసీలకు, గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉందా లేదా అనే దాని గురించి మరింత సముచితమైన నిర్ణయం తీసుకోవడంలో ఈ పరిమితులు మాకు సహాయపడతాయి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత, మీ ఛానెల్ మా పాలసీలకు, గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉందా లేదా అని చూడటానికి దానిపై స్టాండర్డ్ రివ్యూ ప్రాసెస్‌ను అమలు చేయడం జరుగుతుంది. మీ ఛానెల్ మా పాలసీలకు, గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉంటే, మేము దానిని YPPలో ఆమోదిస్తాము. YPPలోని ఛానెల్స్ కాలక్రమేణా మా పాలసీలకు, గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మేము వాటిని నిరంతరం చెక్ చేస్తుంటామని గుర్తుంచుకోండి.

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి

✨ కొత్త అప్‌డేట్✨ YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్

మీకు కావలసినవన్నీ మీరు పొందిన తర్వాత, దరఖాస్తు చేసుకోవడానికి మీ ఛానెల్‌కు అర్హత లభించాక, డెస్క్‌టాప్ కంప్యూటర్ నుండి గానీ లేదా మొబైల్ పరికరం నుండి కానీ YPPకి సైన్ అప్ చేయండి:

  1. YouTubeకు సైన్ ఇన్ చేయండి
  2. ఎగువున కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటోను క్లిక్ చేయండి ఆ తర్వాత YouTube Studioను క్లిక్ చేయండి
  3. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి
  4. ప్రారంభించడానికి, ఇప్పుడే దరఖాస్తు చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి
  5. ప్రాథమిక నియమాలను రివ్యూ చేసి, అంగీకరించడానికి ప్రారంభించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి
  6. 'YouTube కోసం AdSense' ఖాతాను సెటప్ చేయడానికి ప్రారంభించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి, లేదా ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న ఖాతాను లింక్ చేయండి

పూర్తి చేసిన తర్వాత, మిమ్మల్ని రివ్యూ చేసే దశలో ప్రోగ్రెస్‌లో ఉంది అని కనిపిస్తుంది, అంటే మీ దరఖాస్తు మేము అందుకున్నామని అర్ధం!

మేము మీ దరఖాస్తును ఎలా రివ్యూ చేస్తాము

మీరు YPP నియమాలను అంగీకరించి, యాక్టివ్‌గా ఉన్న 'YouTube కోసం AdSense' ఖాతాను లింక్ చేసిన తర్వాత, మీ ఛానెల్‌ను రివ్యూ చేయడం కోసం ఆటోమేటిక్‌గా క్యూలో ఉంచడం జరుగుతుంది. మా పాలసీలు, గైడ్‌లైన్స్ అన్నింటినీ మీ ఛానెల్ ఫాలో అవుతుందని నిర్ధారించుకోవడానికి మా ఆటోమేటిక్ సిస్టమ్‌లతో పాటు, రివ్యూవర్‌లు మీ ఛానెల్‌ను పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తారు. మీ దరఖాస్తు స్టేటస్‌ను చూడటానికి, ఎప్పుడైనా YouTube Studioలోని సంపాదించండి అనే విభాగంలో తిరిగి చెక్ చేయండి.

మీ ఛానెల్‌ను రివ్యూ చేసిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాము (సాధారణంగా సుమారు 1 నెలలో). 

దరఖాస్తుల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉండటం, సిస్టమ్ సమస్యలు, లేదా రిసోర్స్ పరిమితుల కారణంగా ఆలస్యాలు జరగవచ్చని గుర్తుంచుకోండి. అన్ని YPP దరఖాస్తులు మేము అందుకున్న క్రమంలోనే రివ్యూ చేయబడతాయి. కొన్నిసార్లు ఛానెల్స్‌కు పలు రివ్యూలు అవసరం కావచ్చు, ప్రత్యేకించి YPP కోసం మీ ఛానెల్ అనుకూలతను చాలా మంది రివ్యూవర్‌లు అంగీకరించనప్పుడు. దీని వలన నిర్ణయాన్ని తీసుకునే సమయం పెరగవచ్చు.

మీ మొదటి దరఖాస్తు విజయవంతం కాకపోతే, కంగారు పడకండి - మీరు ఈ నిర్ణయంపై 21 రోజుల లోపు అప్పీల్ చేయవచ్చు లేదా ఒరిజినల్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తూ ఉండండి, 30 రోజుల వ్యవధి తర్వాత మీరు మళ్లీ ట్రై చేయవచ్చు. ఇది మీ దరఖాస్తుకు సంబంధించి మొదటి తిరస్కరణ కాకపోతే, లేదా మీరు ఇంతకుముందు తిరిగి దరఖాస్తు చేసి ఉంటే, మీరు 90 రోజుల వ్యవధి తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఛానెల్‌లో గణనీయమైన భాగం, ప్రస్తుతానికి మా పాలసీలను, గైడ్‌లైన్స్‌ను ఫాలో కావడం లేదని మా రివ్యూవర్‌లు భావించినట్టు ఉన్నారు. అందువల్ల, మీరు తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి ముందే ఈ నిర్దిష్ట భాగాన్ని మీ ఛానెల్‌లోని మొత్తం కంటెంట్‌తో పోల్చి చూసుకుని, లోటుపాట్లను సరి చేసుకోండి. తర్వాతసారి పంపే మీ దరఖాస్తును బలోపేతం చేసుకోవడానికి మీరు తీసుకోవలసిన దశల గురించి మరింత తెలుసుకోండి.

ఆదాయాన్ని ఎలా సంపాదించాలని భావిస్తున్నారో, పేమెంట్‌ను ఎలా పొందాలని అనుకుంటున్నారో ఎంచుకోండి

మీరు YPPలో భాగం అయిన తర్వాత, YouTube Studioలో వీక్షణా పేజీ యాడ్‌లు, Shorts ఫీడ్ యాడ్‌లు, మెంబర్‌షిప్‌లు, Supers, షాపింగ్, మరిన్నింటిని ప్రారంభించండి. మానిటైజేషన్ ఫీచర్‌లను ఆన్ చేయడానికి, సంబంధిత మాడ్యూల్ నియమాలను మీరు రివ్యూ చేసి, అంగీకరించాలి. ఇక్కడ మాడ్యూల్స్, వాటిలోని ఆప్షన్‌ల గురించి మరింత తెలుసుకోండి.

ఎలా మానిటైజ్ చేయాలనుకుంటున్నారో ఎంచుకున్న తర్వాత, మీరు యాడ్ ప్రాధాన్యతలను మేనేజ్ చేయగలరు, మీ అప్‌లోడ్‌లకు మానిటైజేషన్‌ను ఆన్ చేయగలరు, అలాగే మరిన్ని చేయగలరు. ఇప్పుడే YPPలో చేరిన క్రియేటర్‌ల నుంచి మాకు వచ్చే FAQల లిస్ట్ ఇక్కడ ఉంది.

పేమెంట్‌ను పొందడం ప్రారంభించండి

ఒక YouTube పార్ట్‌నర్‌గా మీ నికర ఆదాయం గురించి సులభంగా అర్థం చేసుకోవడానికి మా సహాయ కేంద్రానికి వెళ్లండి, YouTube కోసం AdSense (YPPలో ఉన్న క్రియేటర్‌లు పేమెంట్ పొందేలా చేసే Google ప్రోగ్రామ్) గురించి పూర్తిగా తెలుసుకోండి, తరచుగా తలెత్తే పేమెంట్ సమస్యలను పరిష్కరించండి.

డబ్బు సంపాదించడాన్ని కొనసాగించడానికి యాక్టివ్‌గా ఉండండి

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ వృద్ధి చెందే కొద్దీ, ఛానెల్స్‌ ఎకో సిస్టమ్‌ ఆరోగ్యకరంగా, యాక్టివ్‌గా కొనసాగేలా చూడటం ముఖ్యం. యాక్టివ్‌గా ఉండే క్రియేటర్‌లకు, అలాగే కమ్యూనిటీతో ఎంగేజ్ అవుతున్న వారికి సపోర్ట్ చేసేందుకు వీలుగా, 6 నెలలు లేదా అంత కంటే ఎక్కువ సమయం పాటు ఒక్క వీడియోను కూడా అప్‌లోడ్ చేయని లేదా కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేయని ఛానెల్స్‌కు మేము మానిటైజేషన్‌ను ఆఫ్ చేయవచ్చు.

దరఖాస్తు చేయడం అలాగే మరిన్ని వివరాలకు సంబంధించిన FAQలు

నేను ప్రోగ్రామ్ పరిమితికి చేరుకోలేకపోతే పరిస్థితి ఏమిటి?

మీరు ఇంకా ఆవశ్యకతలకు అనుగుణంగా లేకపోతే, ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించడానికి అలాగే మీ ప్రేక్షకులను పెంచుకోవడానికి కృషి చేయడాన్ని కొనసాగించండి. మీ ఛానెల్‌ను వృద్ధి చేసుకోవడంలో మీకు సహాయపడగల కొన్ని రిసోర్స్‌లు ఇక్కడ ఉన్నాయి:

  • YouTube సహాయ ఫోరమ్‌లో ఇతర YouTube యూజర్‌ల నుంచి పరిష్కారాలను తెలుసుకోండి.
  • మీ ఛానెల్‌ను ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే అంశాలకు సంబంధించి వేగవంతమైన, సులభమైన చిట్కాలను మా క్రియేటర్ చిట్కాల హబ్‌లో కనుగొనండి.
  • తెలుసుకోవడానికి, వృద్ధి చెందడానికి, అలాగే ప్రోగ్రామ్‌లు, రిసోర్స్‌లు, ఇంకా ఈవెంట్‌లకు కనెక్ట్ అవ్వడానికి youtube.com/creators లింక్‌కు వెళ్లండి.
  • YouTube సహాయక టీమ్ నుంచి ట్యుటోరియల్స్‌ను, పరిష్కార ప్రక్రియను, ఇంకా చిట్కా వీడియోలను చూడటానికి మా YouTube సహాయక ఛానెల్‌ను, YouTube Creators ఛానెల్‌ను చూడండి.

మీ ఛానెల్‌పై యాక్టివ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లుఉంటే, ఆ స్ట్రయిక్‌ల గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. మీ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లను తీసివేయడానికి మీరు చేసిన అప్పీల్ విజయవంతమైన తర్వాత కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లు వచ్చినప్పుడు, ప్రోగ్రామ్‌లోని ప్రస్తుత మెంబర్‌లు తీసివేయబడరు.

“చెల్లుబాటయ్యే పబ్లిక్ వీక్షణా సమయం”, "చెల్లుబాటయ్యే పబ్లిక్ Shorts వీక్షణలు" అంటే ఏమిటి?

చెల్లుబాటయ్యే పబ్లిక్ వీక్షణా సమయం

చెల్లుబాటయ్యే పబ్లిక్ వీక్షణా సమయంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది:

  • మీరు పబ్లిక్ అని సెట్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోల నుంచి పొందిన వీక్షణా సమయం

కింది వీడియో రకాల ద్వారా పొందిన వీక్షణా సమయం YPP పరిమితి కోసం లెక్కించబడదు:

  • ప్రైవేట్ వీడియోలు
  • అన్‌లిస్టెడ్ వీడియోలు
  • తొలగించబడిన వీడియోలు
  • యాడ్ క్యాంపెయిన్‌లు
  • YouTube Shorts
  • అన్‌లిస్టెడ్‌గా సెట్ చేసిన, తొలగించిన, లేదా VOD (ఆన్-డిమాండ్ వీడియో)గా మార్చని లైవ్ స్ట్రీమ్‌లు

చెల్లుబాటయ్యే పబ్లిక్ Shorts వీక్షణలు

చెల్లుబాటయ్యే పబ్లిక్ Shorts వీక్షణగా దీన్ని పరిగణించడం జరుగుతుంది:

  • మీరు పబ్లిక్ అని సెట్ చేసిన, Shorts ఫీడ్‌లో కనిపించే Shorts వీక్షణలు
Shorts ఫీడ్‌లోని Shorts వీక్షణలకు సంబంధించిన పబ్లిక్ వీక్షణా సమయం మొత్తం, 4,000 గంటల పబ్లిక్ వీక్షణా సమయంలో భాగంగా లెక్కించబడదని గుర్తుంచుకోండి. మేము పేమెంట్‌లను ఎలా లెక్కిస్తాము అనే దానికి సంబంధించి Shorts వీక్షణ అర్హత సమాచారం కోసం, మా YouTube Shorts మానిటైజేషన్ పాలసీలను చూడండి.

నేను పరిమితిని చేరుకున్నట్లయితే, ఆటోమేటిక్‌గా నాకు YPPలోకి ప్రవేశం దక్కుతుందా?

లేదు. పరిమితికి చేరుకున్న ప్రతి ఛానెల్‌కు స్టాండర్డ్ రివ్యూ ప్రాసెస్‌ను అమలు చేయడం జరుగుతుంది. మీ ఛానెల్ మా YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలకు అనుగుణంగా ఉందో లేదో చెక్ చేయడానికి మా టీమ్ మీ ఛానెల్ మొత్తాన్ని రివ్యూ చేస్తుంది. దరఖాస్తు చేసుకునే క్రమంలో మీ ఛానెల్‌పై తప్పనిసరిగా ఎటువంటి యాక్టివ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లు కూడా ఉండకూడదు. మా పాలసీలు అలాగే గైడ్‌లైన్స్‌ను ఫాలో అయ్యే ఛానెల్స్ మానిటైజ్ చేయగలవు.

నేను దరఖాస్తు చేసుకున్న తర్వాత నా సంఖ్యలు, పరిమితి కంటే దిగువకు పడిపోతే ఏమి జరుగుతుంది?

మీరు మా చెల్లుబాటు అయ్యే పబ్లిక్ వీక్షణా సమయం అలాగే సబ్‌స్క్రయిబర్ పరిమితిని చేరుకున్న తర్వాత, మీ ఛానెల్‌ను మేము రివ్యూ కోసం పంపిస్తాము. కాబట్టి రివ్యూ కోసం వేచి ఉన్నప్పుడు మీ సబ్‌స్క్రయిబర్ లేదా వీక్షణా సమయం సంఖ్యలు, పరిమితి కంటే దిగువకు పడిపోయినా ఫర్వాలేదు. మీరు పరిమితిని చేరుకుని, YPP కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, YPPలో భాగం కావడానికి మీ ఛానెల్‌కు అర్హత ఉందో లేదో తెలుసుకోవడం కోసం మేము ఇప్పటికీ దాన్ని రివ్యూ చేస్తాము. ఛానెల్ రివ్యూ చేయబడటానికి ముందు అన్ని YPP సైన్ అప్ దశలను (ప్రస్తుతం ఒప్పందంపై సంతకం చేయడం, YouTube కోసం AdSense ఖాతాను అనుబంధించడం వంటివి) పూర్తి చేయాలని గుర్తుంచుకోండి.

ఒక ఛానెల్ ఇన్‌యాక్టివ్‌గా ఉండి, 6 నెలలు లేదా అంత కంటే ఎక్కువ కాలం నుండి కమ్యూనిటీ పోస్ట్‌లను అప్‌లోడ్ లేదా పోస్ట్ చేయకపోతే, దాని మానిటైజేషన్‌ను తీసివేసే అధికారం YouTubeకు ఉంటుంది.

ఏవైనా YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలను ఛానెల్స్ ఉల్లంఘించినప్పుడు అవి మానిటైజేషన్‌ను కోల్పోతాయి. వాటి వీక్షణా సమయం అలాగే సబ్‌స్క్రయిబర్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా మానిటైజేషన్‌ను కోల్పోవడం జరుగుతుంది.

ఇప్పుడు నేను YPPలో లేను (లేదా నేను ప్రోగ్రామ్‌లో ఎప్పుడూ లేను) అలాగే నా వీడియోలలో నాకు యాడ్‌లు కనిపిస్తున్నాయి. ఆ యాడ్‌ల నుంచి నేను ఆదాయాన్ని సంపాదిస్తున్నానా?

ప్లాట్‌ఫామ్‌లోని మొత్తం కంటెంట్‌లో YouTube యాడ్‌లను అందించగలదు. మీరు మునుపు YPPలో మెంబర్ అయినట్లయితే (అలాగే ప్రస్తుతం ప్రోగ్రామ్‌లో లేకపోతే), మీ కంటెంట్‌లో యాడ్‌లు అందించబడుతుండటాన్ని మీరు ఇప్పటికీ చూడవచ్చు. ఈ సందర్భంలో, మీకు ఆదాయంలో వాటా రాదు.

ఒకవేళ భవిష్యత్తులో మీరు YPPలో తిరిగి చేరితే, మీరు తిరిగి చేరిన తర్వాత మీ కంటెంట్‌లో అందించబడే యాడ్‌ల నుంచి వచ్చే ఆదాయంలో వాటాను మీరు పొందగలుగుతారు. ఆ సందర్భంలో, YPP కోసం తిరిగి దరఖాస్తు చేస్తున్నప్పుడు, మీ ఛానెల్ ఈ పేజీలో పేర్కొన్న అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3030366320009314210
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false