YouTubeలో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌ల గురించి పరిచయం

ఈ ఆర్టికల్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లకు సంబంధించినది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లకు, కాపీరైట్ స్ట్రయిక్‌లకు వ్యత్యాసం ఉంది. వాటి గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి, కాపీరైట్ స్ట్రయిక్‌ల గురించి పరిచయం అనే మా ఆర్టికల్‌కు వెళ్లండి.

YouTubeలో ఎలా వ్యవహరించాలి అనే అంశాన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనే నియమాలు వివరిస్తాయి. ఈ పాలసీలు మా ప్లాట్‌ఫామ్‌లో ఉన్న అన్‌లిస్టెడ్ & ప్రైవేట్ కంటెంట్, కామెంట్‌లు, లింక్‌లు, కమ్యూనిటీ పోస్ట్‌లు, థంబ్‌నెయిల్స్‌తో పాటు అన్ని రకాల కంటెంట్‌కు వర్తిస్తాయి. ఈ లిస్ట్‌లో పేర్కొన్న వాటికే కాక ఇతర కంటెంట్ రకాలకు కూడా ఈ నియమాలు వర్తిస్తాయి. మీ కంటెంట్ మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లయితే, మీ ఛానెల్ స్ట్రయిక్‌ను అందుకుంటుంది. 

గమనిక: కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘనల కారణంగా కాకుండా ఇతర కారణాల వల్ల కూడా మేము కంటెంట్‌ను తీసివేయవచ్చు. ఉదాహరణకు, ఫస్ట్-పార్టీ చేసిన గోప్యతా ఫిర్యాదు లేదా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశం. ఈ సందర్భాలలో, మీ ఛానెల్‌కు స్ట్రయిక్ విధించబడదు.

తెలివిగా వ్యవహరించి క్రియేట్ చేయడం: YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్

మీరు స్ట్రయిక్‌ను అందుకున్నప్పుడు ఏమి జరుగుతుంది

మీరు స్ట్రయిక్‌ను అందుకున్నప్పుడు, మీకు దాని గురించి ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. మొబైల్‌లో, కంప్యూటర్‌లో లేదా మీ ఛానెల్ సెట్టింగ్స్‌లో కూడా నోటిఫికేషన్లను అందుకునేలా మీరు సెట్ చేసుకోవచ్చు. మేము ఇవి కూడా మీకు తెలియజేస్తాము:

  • ఏ కంటెంట్ తీసివేయబడింది
  • అది ఏ పాలసీలను ఉల్లంఘించింది (ఉదాహరణకు పీడించుట లేదా హింస)
  • అది మీ ఛానెల్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది
  • మీరు తర్వాత ఏమి చేయవచ్చు

మీ కంటెంట్ మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లయితే, అది మీ ఛానెల్‌ను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇక్కడ ఉంది:

హెచ్చరిక

పొరపాట్లు జరుగుతాయని, అలాగే మా పాలసీలను ఉల్లంఘించాలన్నది మీ ఉద్దేశం కాదని మేము అర్థం చేసుకున్నాము — అందుకే సాధారణంగా మొదటి ఉల్లంఘనకు హెచ్చరిక మాత్రమే ఉంటుంది. ఈ హెచ్చరిక గడువు 90 రోజుల్లో ముగియడానికి, మీరు పాలసీ ట్రెయినింగ్‌ను తీసుకోవచ్చు. అయితే మీ కంటెంట్ అదే పాలసీని 90 రోజుల వ్యవధిలో ఉల్లంఘిస్తే, హెచ్చరిక గడువు ముగియదు, మీ ఛానెల్ స్ట్రయిక్‌ను అందుకుంటుంది.

కొన్నిసార్లు తీవ్రమైన దుర్వినియోగం ఒక్కసారే జరిగినప్పటికీ, హెచ్చరిక లేకుండానే అది ఛానెల్ రద్దుకు దారితీస్తుంది. మేము పొరపాటు చేశామని మీరు భావిస్తే, మీరు సదరు హెచ్చరికను తొలగించాలని అప్పీల్ చేయవచ్చు.

ఆప్షనల్ పాలసీ ట్రెయినింగ్‌లు

మీరు ఉల్లంఘించిన నిర్దిష్ట కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు సంబంధించి పాలసీ ట్రెయినింగ్ తీసుకోవచ్చు. ఈ ట్రెయినింగ్‌లు చిన్నవిగా, ప్రోడక్ట్‌ను గురించి పరిజ్ఞానాన్ని అందించేవిగా ఉంటాయి. 

మీరు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ హెచ్చరికను అందుకున్నట్లయితే, సాధారణంగా మీ పాలసీ ఉల్లంఘనలను ఎక్కడి నుండి చెక్ చేస్తూ ఉంటారో, అక్కడి మీ Studio ఖాతా నుండి మీరు పాలసీ ట్రెయినింగ్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో Studio డ్యాష్‌బోర్డ్తో పాటు కంటెంట్ ట్యాబ్ కూడా ఉంటాయి. మీరు ఈమెయిల్, బ్యానర్ నోటిఫికేషన్‌ల నుండి ట్రెయినింగ్ తెరవడానికి లింక్ కూడా మీకు కనిపిస్తుంది. గమనిక: అన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ హెచ్చరికలు పాలసీ ట్రెయినింగ్‌లకు అర్హత కలిగి ఉండవు. 

మీరు ఆప్షనల్ పాలసీ ట్రెయినింగ్‌ను పూర్తి చేస్తే, మీ హెచ్చరిక 90 రోజుల తర్వాత ముగుస్తుంది. మీరు ట్రెయినింగ్‌ను పూర్తి చేసిన తర్వాత, వేరొక పాలసీని ఉల్లంఘిస్తే, మీకు మరొక హెచ్చరిక వస్తుంది.

అయినప్పటికీ, మా పాలసీలను పదే పదే ఉల్లంఘించినప్పుడు – లేదా తీవ్రమైన దుర్వినియోగం ఒకసారే జరిగినా కూడా – మీ ఖాతా రద్దు చేయబడవచ్చు. పదే పదే ఉల్లంఘించే వారిని భవిష్యత్తులో ట్రెయినింగ్‌లను తీసుకోకుండా మేము నిరోధించవచ్చు.

మొదటి స్ట్రయిక్

మీ కంటెంట్ మా పాలసీలను ఫాలో కాలేదని మేము రెండవసారి కనుగొన్నట్లయితే, మీకు స్ట్రయిక్ వస్తుంది.

స్ట్రయిక్ జారీ అయ్యింది అంటే, మీరు 1 వారం పాటు కింది వాటిని చేయలేరని అర్థం:

  • వీడియోలను అప్‌లోడ్ చేయడం లేదా లైవ్ స్ట్రీమ్‌లు చేయడం
  • షెడ్యూల్ చేసిన లైవ్ స్ట్రీమ్‌ను ప్రారంభించడం
  • పబ్లిక్‌గా చూపడం కోసం వీడియోను షెడ్యూల్ చేయడం
  • ప్రీమియర్‌ను క్రియేట్ చేయడం
  • త్వరలో రాబోయే ప్రీమియర్ కోసం లేదా లైవ్ స్ట్రీమ్ కోసం ట్రయిలర్‌ను జోడించడం
  • అనుకూల థంబ్‌నెయిళ్లను లేదా కమ్యూనిటీ పోస్ట్‌లను క్రియేట్ చేయడం
  • ప్లేలిస్ట్‌లను క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, లేదా సహకారులను జోడించడం
  • “సేవ్” బటన్‌ను ఉపయోగించి వీక్షణ పేజీ నుండి ప్లేలిస్ట్‌లను జోడించడం లేదా తీసివేయడం

పబ్లిక్‌ కోసం మీరు షెడ్యూల్ చేసిన కంటెంట్, పెనాల్టీ వ్యవధి ముగిసే వరకు “ప్రైవేట్”‌కు సెట్ చేయబడుతుంది. ఆ వ్యవధి ముగిశాక, దాన్ని రీషెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది.

గమనిక: ధృవీకరించిన తేదీ నుండి పెనాల్టీ ప్రారంభమవుతుంది.

1 వారం వ్యవధి తర్వాత, పూర్తి హక్కులను మేము ఆటోమేటిక్‌గా రీస్టోర్ చేస్తాము, కానీ మీ ఛానెల్‌లో స్ట్రయిక్ 90 రోజుల వరకు ఉంటుంది.

స్ట్రయిక్ వచ్చినప్పుడు అధునాతన ఫీచర్‌లకు యాక్సెస్‌ను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. యాక్సెస్‌ను తిరిగి ఎలా పొందాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

రెండవ స్ట్రయిక్

మొదటి స్ట్రయిక్ వచ్చిన అదే 90 రోజుల వ్యవధి లోపే మీకు మళ్లీ రెండవ స్ట్రయిక్ వచ్చినట్లయితే, 2 వారాల పాటు కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి మీకు అనుమతి ఉండదు. తదుపరి సమస్యలు లేకపోతే, 2 వారాల వ్యవధి తర్వాత, మేము పూర్తి హక్కులను ఆటోమేటిక్‌గా రీస్టోర్ చేస్తాము. ప్రతి స్ట్రయిక్ గడువు, అది జారీ అయిన దగ్గర నుండి 90 రోజుల పాటు ఉంటుంది.

మూడవ స్ట్రయిక్

అదే 90 రోజుల వ్యవధిలో 3 స్ట్రయిక్‌లు వస్తే, YouTube నుండి మీ ఛానెల్ శాశ్వతంగా తీసివేయబడుతుంది. ప్రతి స్ట్రయిక్ గడువు, అది జారీ అయిన దగ్గర నుండి 90 రోజుల పాటు ఉంటుంది.

గమనిక: మీ కంటెంట్‌ను తొలగించడం వల్ల స్ట్రయిక్ తీసివేయబడదు. తొలగించబడిన కంటెంట్‌పై కూడా మేము కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌ను జారీ చేయవచ్చు. తొలగించబడిన కంటెంట్‌కు మేము ఏ సందర్భాలలో మినహాయింపును ఇస్తాము అనే దాని గురించి మా గోప్యతా పాలసీలో మీరు మరింత తెలుసుకోవచ్చు.

మీ అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌కు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్ అందితే, అది సస్పెండ్ చేయబడుతుంది, అది ఒక స్టాండర్డ్ ఛానెల్ అవుతుంది. మరింత తెలుసుకోండి.

మీకు స్ట్రయిక్ వచ్చినప్పుడు ఏమి చేయాలి

మీరు YouTubeలో కొనసాగడానికి మేము సహాయం చేయాలనుకుంటున్నాము, కనుక కింది వాటిని చేయాలని గుర్తుంచుకోండి:

  1. మీ కంటెంట్ మా పాలసీలను ఫాలో అవుతోందని నిర్ధారించుకోవడానికి మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ గురించి తెలుసుకోండి.
  2. మీ ఛానెల్‌కు స్ట్రయిక్ వచ్చినట్లయితే, అలాగే మేము పొరపాటు చేశామని మీరు భావిస్తే, మాకు తెలియజేయండి. మీరు ఆ నిర్ణయాన్ని ఇక్కడ అప్పీల్ చేయవచ్చు.

YouTube తన విచక్షణ మేరకు, కంటెంట్‌ను క్రియేట్ చేయగల క్రియేటర్ సామర్థ్యాన్ని పరిమితం చేసే హక్కును కూడా కలిగి ఉంటుంది. మీ ఛానెల్ ఆఫ్ చేయబడవచ్చు లేదా ఏ YouTube ఫీచర్‌లనూ ఉపయోగించకుండా పరిమితం చేయబడవచ్చు.

ఇలా జరిగితే, ఈ పరిమితులను అధిగమించడానికి వేరొక ఛానెల్‌ను ఉపయోగించకుండా, క్రియేట్ చేయకుండా, లేదా పొందకుండా మీరు నిషేధించబడతారు. మీ YouTube ఛానెల్‌లో పరిమితి యాక్టివ్‌గా ఉన్నంత కాలం ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ పరిమితిని ఉల్లంఘించడం అనేది మా సర్వీస్ నియమాల ప్రకారం చట్టంలోని లొసుగుల దుర్వినియోగంగా పరిగణించబడుతుంది, అలాగే దీనివల్ల మీ ప్రస్తుత YouTube ఛానెల్స్ అన్నీ, మీరు క్రియేట్ చేసిన లేదా పొందిన ఏవైనా కొత్త ఛానెల్స్‌కు, అలాగే మీరు పదే పదే లేదా ప్రముఖంగా ఫీచర్ చేసిన అన్ని ఛానెల్స్ రద్దు చేయబడవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16114565286754794666
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false