విస్తరింపజేయబడిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఓవర్‌వ్యూ

మేము మరింత మంది క్రియేటర్‌లకు అందుబాటులో ఉండేలా YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)ను విస్తరింపజేస్తున్నాము, దీనితో వారికి ఫ్యాన్ ఫండింగ్, ఇంకా Shopping ఫీచర్‌లకు ముందుగానే యాక్సెస్ లభిస్తుంది. విస్తరించిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ఈ దేశాలు/ప్రాంతాలలో అర్హత ఉన్న క్రియేటర్‌లకు అందుబాటులో ఉంది. మీరు ఈ దేశాలు/ప్రాంతాలలో నివసిస్తూ ఉంటే, YPPలో వచ్చిన మార్పులను గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ కింద ఉన్న ఆర్టికల్‌ను చదవవచ్చు.  

మీరు ఈ దేశాలు/ప్రాంతాలలో దేనిలోనైనా నివసించకపోతే, మీకు సంబంధించి YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు ఎలాంటి మార్పులు ఉండవు. మీకు సంబంధించిన YPP ఓవర్‌వ్యూ, అర్హత, దరఖాస్తు సూచనల కోసం మీరు ఈ ఆర్టికల్‌ను చూడవచ్చు.

విస్తరింపజేయబడిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ కోసం మీ అర్హతను చెక్ చేయండి. మీరు అర్హులు కాకపోతే, YouTube Studioలోని Earn ఏరియాలో నోటిఫికేషన్ పొందండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. YPP ప్రోగ్రామ్‌ను మీకు అందుబాటులోకి తెచ్చినప్పుడు, కనీస అర్హతా ప్రమాణాలకు మీరు అనుగుణంగా ఉన్నప్పుడు, మేము మీకు ఒక ఈమెయిల్‌ను పంపుతాము. 

YouTubeలో డబ్బు సంపాదించడంపై పరిచయ వీడియో

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

క్రియేటర్‌లకు YouTube ఎల్లప్పుడూ లాభదాయకమైన ప్లాట్‌ఫామ్‌గానే ఉండేలా చూసుకోవడానికి, మేము YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)ని అభివృద్ధి చేస్తున్నామని 2022లో అనౌన్స్ చేశాము. 2023 జూన్ నెల మధ్య నుండి, మేము మరింత మంది క్రియేటర్‌లకు అందుబాటులో ఉండేలా YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌ను విస్తరింపజేస్తున్నాము, దీనితో వారికి ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లకు, ఇంకా ఎంపిక చేయబడిన కొన్ని Shopping ఫీచర్‌లకు ముందుగానే యాక్సెస్ లభిస్తుంది.

అర్హత ఉన్న దేశాలలోని క్రియేటర్‌లు కింద పేర్కొన్న కనీస అర్హతలలో ఏదో ఒక దాన్ని చేరుకున్నప్పుడు విస్తరింపజేయబడిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు:

  • గత 90 రోజుల్లో చెల్లుబాటు అయ్యే 3 పబ్లిక్ అప్‌లోడ్‌లతో 500 మంది సబ్‌స్క్రయిబర్‌లను, అలాగే గత 12 నెలల్లో చెల్లుబాటు అయ్యే పబ్లిక్ వీక్షణా సమయం కనీసం 3,000 గంటలు ఉన్నప్పుడు, లేదా
  • గత 90 రోజుల్లో చెల్లుబాటు అయ్యే 3 పబ్లిక్ అప్‌లోడ్‍‌లతో 500 మంది సబ్‌స్క్రయిబర్లను, అలాగే గత 90 రోజుల్లో చెల్లుబాటు అయ్యే 30 లక్షల పబ్లిక్ Shorts వీక్షణలను పొందినప్పుడు

మీరు అర్హత సాధించినప్పుడు మా నుండి నోటిఫికేషన్ పొందాలనుకుంటే, YouTube Studioలోని 'సంపాదించండి' ఏరియాలో నోటిఫికేషన్ పొందండిని ఎంచుకోండి. విస్తరింపజేయబడిన YPP ప్రోగ్రామ్‌ను మీకు అందుబాటులోకి తెచ్చినప్పుడు, అలాగే పైన పేర్కొన్న కనీస అర్హతా ప్రమాణాలకు మీరు అనుగుణంగా ఉన్నప్పుడు, మేము మీకు ఒక ఈమెయిల్‌ను పంపుతాము.

కింద పేర్కొన్న కనీస అర్హతలను కూడా చేరుకున్న YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లోని క్రియేటర్‌లు యాడ్‌లు, YouTube Premium నుండి వచ్చే ఆదాయ షేరింగ్ వంటి అదనపు ప్రయోజనాలను పొందుతారు:

  • గత 12 నెలల్లో చెల్లుబాటు అయ్యే 4,000 గంటల పబ్లిక్ వీక్షణా సమయంతో 1,000 మంది సబ్‌స్క్రయిబర్‌‌లను పొందండి, లేదా
  • గత 90 రోజుల్లో 1 కోటి చెల్లుబాటు అయ్యే పబ్లిక్ Shorts వీక్షణలతో 1,000 మంది సబ్‌స్క్రయిబర్‌లను పొందండి.

ప్రస్తుతం YPPలోనే ఉన్న పార్ట్‌నర్‌ల విషయంలో, వారికి అందించబడే ప్రోగ్రామ్ ప్రయోజనాలలో ఏ మార్పులూ లేవు.

విస్తరింపజేయబడిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో చేరాలంటే మీరు ఏమి చేయాలి

  1. YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలను ఫాలో అవ్వండి.
  2. అందుబాటులో ఉన్న దేశాలు/ప్రాంతాలు ఒక దానిలో ఛానెల్ ఉండేలా చూసుకోండి.
  3. మీ Google ఖాతాకు 2-దశల వెరిఫికేషన్ ఆన్ చేయబడి ఉందని నిర్ధారించుకోండి.
  4. మీ ఛానెల్‌కు లింక్ చేసేందుకు, మీ వద్ద యాక్టివ్‌గా ఉన్న ఒక'YouTube కోసం AdSense ఖాతా ఉండాలి. ఇప్పటికే మీకు AdSense ఖాతా ఏదీ లేకపోతే, దరఖాస్తు చేసుకొనే సమయంలో YouTube Studioలో ఒక కొత్త ఖాతాను సెటప్ చేయడానికి సిద్ధంగా ఉండండి. కొత్త 'YouTube కోసం AdSense ఖాతా'ను YouTube Studioలో మాత్రమే క్రియేట్ చేస్తున్నట్లు నిర్ధారించుకోండి.

విస్తరింపజేయబడిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ఎక్కడ అందుబాటులో ఉంది

విస్తరింపజేయబడిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ కింద పేర్కొన్న దేశాలు/ప్రాంతాలలో అర్హత కలిగిన క్రియేటర్‌లకు అందుబాటులో ఉంది:

  • అల్జీరియా
  • అమెరికన్ సమోవా
  • అర్జెంటీనా
  • అరుబా
  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • బహ్రెయిన్ 
  • బెలారస్
  • బెల్జియం
  • బెర్ముడా
  • బొలీవియా 
  • బోస్నియా & హెర్జిగోవినా
  • బ్రెజిల్
  • బల్గేరియా
  • కెనడా
  • కేమాన్ దీవులు
  • చిలీ
  • కొలంబియా
  • కోస్టారికా
  • క్రొయేషియా 
  • సైప్రస్
  • చెక్ రిపబ్లిక్
  • డెన్మార్క్ 
  • డొమినికన్ రిపబ్లిక్ 
  • ఈక్వెడార్
  • ఈజిప్ట్
  • ఎల్ సాల్వడోర్
  • ఎస్టోనియా
  • ఫిన్లాండ్
  • ఫ్రాన్స్
  • ఫ్రెంచ్ గీయానా
  • ఫ్రెంచ్ పాలినేషియా
  • జర్మనీ
  • గ్రీస్
  • గ్వాడెలోప్
  • గ్వామ్
  • గ్వాటెమాలా
  • హాంకాంగ్
  • హోండురస్
  • హంగేరీ
  • ఐస్‌ల్యాండ్
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • ఐర్లాండ్
  • ఇజ్రాయిల్
  • ఇటలీ
  • జపాన్
  • జోర్డాన్
  • కెన్యా
  • కువైట్
  • లాత్వియా
  • లెబనాన్
  • లిచెన్‌స్టెయిన్
  • లిథువేనియా
  • లక్సెంబర్గ్
  • మాసిడోనియా
  • మలేషియా
  • మాల్టా
  • మొరాకో
  • మెక్సికో
  • నెదర్లాండ్స్
  • న్యూజిలాండ్
  • నికరాగువా
  • నైజీరియా 
  • ఉత్తర మారియానా దీవులు
  • నార్వే
  • ఒమన్
  • పనామా
  • పాపువా న్యూ గినియా
  • పెరూ
  • ఫిలిప్పీన్స్
  • పోలాండ్ 
  • పోర్చుగల్
  • ప్యూర్టోరికో
  • పరాగ్వే
  • ఖతార్
  • రొమేనియా
  • సౌదీ అరేబియా
  • సెనెగల్ 
  • సెర్బియా
  • సింగపూర్
  • స్లోవేకియా
  • స్లోవేనియా
  • దక్షిణాఫ్రికా
  • దక్షిణ కొరియా
  • స్పెయిన్
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • తైవాన్
  • థాయ్‌లాండ్ 
  • టర్కీ 
  • టర్క్స్ అండ్ కైకోస్ 
  • ఉగాండా
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్
  • ఉరుగ్వే
  • U.S. వర్జిన్ దీవులు
  • వియత్నాం

విస్తరింపజేయబడిన YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి

మీకు కావలసినవన్నీ మీరు పొందిన తర్వాత, దరఖాస్తు చేసుకోవడానికి మీ ఛానెల్‌కు అర్హత లభించాక, కంప్యూటర్ నుండి గానీ లేదా మొబైల్ పరికరం నుండి కానీ YPPకి సైన్ అప్ చేయండి:

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండిని క్లిక్ చేయండి.
  3. ప్రాథమిక నియమాలను రివ్యూ చేసి, అంగీకరించడానికి, ఇప్పుడే దరఖాస్తు చేయండిని క్లిక్ చేయండి.
  4. 'YouTube కోసం AdSense' ఖాతాను సెటప్ చేయడానికి, ప్రారంభించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి, లేదా ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న ఖాతాను లింక్ చేయండి.

మీరు చేయాల్సిన పని అయిపోయాక, మీ ఛానెల్‌ను రివ్యూ చేసే దశలో ప్రోగ్రెస్‌లో ఉంది అని కనిపిస్తుంది, అంటే మీ దరఖాస్తు మేము అందుకున్నామని అర్థం!

మేము దేనిని రివ్యూ చేస్తాము

మా పాలసీలు, గైడ్‌లైన్స్ అన్నింటినీ మీ ఛానెల్ ఫాలో అవుతుందని నిర్ధారించుకోవడానికి మా ఆటోమేటిక్ సిస్టమ్‌లతో పాటు, హ్యూమన్ రివ్యూవర్‌లు మీ ఛానెల్‌ను పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తారు. మీ దరఖాస్తు స్టేటస్‌ను చూడటానికి, ఎప్పుడైనా YouTube Studioలోని సంపాదించండి అనే విభాగంలో తిరిగి చెక్ చేయండి.

YPP దరఖాస్తులన్నీ మాకు అందిన క్రమంలోనే రివ్యూ చేయబడతాయి. మీ ఛానెల్‌ను రివ్యూ చేసిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాము (సాధారణంగా దీనికి సుమారుగా 1 నెల పడుతుంది).
 
ఆలస్యం జరిగే అవకాశం ఉందని గుర్తుంచుకోండి, అందుకు కారణాలు ఇవిగోండి:
  • దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం
  • సిస్టమ్‌లో సమస్యలు ఎదురవ్వడం
  • రిసోర్స్ పరిమితులు
  • ఛానెల్స్‌కు కొన్ని రివ్యూలు అవసరం కావడం, ముఖ్యంగా YPPలో చేరడానికి ఛానెల్‌కు అర్హత ఉందా లేదా అనే విషయంలో చాలా మంది రివ్యూవర్‌లు ఏకాభిప్రాయానికి రాలేనప్పుడు

మీ మొదటి దరఖాస్తు విజయవంతం కాకపోతే, కంగారు పడకండి - ఒరిజినల్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తూ ఉండండి, 30 రోజుల వ్యవధి తర్వాత మీరు మళ్లీ ట్రై చేయవచ్చు. మీ దరఖాస్తు గతంలో కూడా తిరస్కరణకు గురైనట్లయితే, మీరు 90 రోజుల వ్యవధి తర్వాత మళ్లీ ట్రై చేయవచ్చు. మీ ఛానెల్‌లోని కంటెంట్‌లో చాలా భాగం, ప్రస్తుతానికి మా పాలసీలను, గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వడం లేదని మా రివ్యూవర్‌లు భావించినట్టు ఉన్నారు. అందువల్ల, మీరు తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి ముందే, మా పాలసీలను, గైడ్‌లైన్స్‌ను రివ్యూ చేసి, వాటికి తగ్గట్టుగానే మీ ఛానెల్‌లోని కంటెంట్ అంతా ఉందో లేదో చూసుకొని, తదనుగుణంగా మీ ఛానెల్‌ను మార్చుకోండి. తర్వాతిసారి దరఖాస్తు చేసుకొనేటప్పుడు, అన్ని విధాలా మీ ఛానెల్ బలంగా ఉండేలా చూసుకోవడానికి, మీరు ఫాలో అవ్వగల దశల గురించి మరింత తెలుసుకోండి.

ఆదాయాన్ని ఎలా సంపాదించాలని భావిస్తున్నారో, పేమెంట్‌ను ఎలా పొందాలని అనుకుంటున్నారో ఎంచుకోండి

మీరు YPPలో చేరిన తర్వాత, ఫ్యాన్ ఫండింగ్, ఇంకా Shopping ఫీచర్‌లతో మీరు సంపాదించడం ప్రారంభించవచ్చు. ఫ్యాన్ ఫండింగ్, ఇంకా Shopping ఫీచర్‌లను ఆన్ చేయడానికి, వాణిజ్యపరమైన ప్రోడక్ట్‌ల మాడ్యూల్‌ను రివ్యూ చేసి, అంగీకరించండి. ఫ్యాన్ ఫండింగ్, ఇంకా Shopping ఫీచర్‌లను ఎలా ఆన్ చేయాలి అనే దాని గురించి, అలాగే మాడ్యూల్ గురించి మరింత తెలుసుకోండి.

ఫ్యాన్ ఫండింగ్, Shopping ఫీచర్‌లు

మీరు 500 సబ్‌స్క్రయిబర్‌లతో YPPలో చేరితే, ఈ మానిటైజేషన్ ఫీచర్‌ల ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు, కాకపోతే వాటికి సంబంధించిన అర్హతా ప్రమాణాలకు మీరు అనుగుణంగా ఉండాలి:

  • ఛానెల్ మెంబర్‌షిప్‌లు: ఈ సదుపాయం, నెలవారీ పేమెంట్‌ల ద్వారా మీ ఛానెల్‌లో చేరే వెసులుబాటును వీక్షకులకు కల్పిస్తుంది, దీని ద్వారా వారు బ్యాడ్జ్‌లు, ఎమోజీలు, ఇతర వస్తువుల వంటి మెంబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే పెర్క్‌లకు యాక్సెస్ పొందుతారు.
  • సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్: మీ ఫ్యాన్స్ లైవ్ చాట్‌లో తమ మెసేజ్‌ను ప్రముఖంగా కనిపించేలా చేయడానికి సూపర్ చాట్‌లను కొనుగోలు చేయవచ్చు, లేదా లైవ్ చాట్‌లో కనిపించే ఫన్నీ యానిమేటెడ్ ఇమేజ్‌ను పొందడానికి సూపర్ స్టిక్కర్స్‌ను కొనుగోలు చేయవచ్చు.
  • సూపర్ థ్యాంక్స్:  మీ వీడియోల పట్ల అదనపు కృతజ్ఞత చూపాలనుకునే వీక్షకుల నుండి ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఇది మీకు ఇస్తుంది.
  • Shopping: మీ అధికారిక అమ్మకపు వస్తువుల స్టోర్‌ను YouTubeకు కనెక్ట్ చేసి, మీ ప్రోడక్ట్‌లను ప్రదర్శించే వీలు ఇది మీకు కల్పిస్తుంది.

పేమెంట్‌ను పొందడం ప్రారంభించండి

ఈ కింద ఉన్న వాటి కోసం, మా సహాయ కేంద్రంలో ఉండే "పేమెంట్ పొందండి" విభాగానికి వెళ్లండి:

  • YouTube పార్ట్‌నర్‌గా మీ నికర ఆదాయం గురించి సులభంగా అర్థం చేసుకోవడం కోసం
  • 'YouTube కోసం AdSense'ను గురించి మరింత సమాచారం (YPPలోని క్రియేటర్‌లకు పేమెంట్ లభించే Google ప్రోగ్రామ్)
  • తరచుగా వచ్చే పేమెంట్ సమస్యలను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోవడం కోసం

డబ్బు సంపాదించడాన్ని కొనసాగించడానికి యాక్టివ్‌గా ఉండండి

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ వృద్ధి చెందే కొద్దీ, ఛానెల్స్ ఎకో-సిస్టమ్ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. 6 నెలలు లేదా అంత కంటే ఎక్కువ సమయం పాటు ఒక్క వీడియోను కూడా అప్‌లోడ్ చేయని లేదా కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేయని ఛానెల్స్‌కు మేము మానిటైజేషన్‌ను ఆఫ్ చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14632628307754828128
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false