YouTube Shopping అనుబంధ ప్రోగ్రామ్ ఓవర్‌వ్యూ & అర్హత

YouTube Shopping అనుబంధ ప్రోగ్రామ్ 🛍️

మీరు YouTubeలో డబ్బు సంపాదించడానికి YouTube Shopping అనుబంధ ప్రోగ్రామ్, ఒక మార్గాన్ని అందిస్తూనే మీ ప్రేక్షకులు వారికి నచ్చే ప్రోడక్ట్‌లను కనుగొనడానికి సహాయకరంగా నిలుస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా, మీరు కింద పేర్కొన్న వాటిని చేయవచ్చు:

  • మీ ఫ్యాన్స్‌కు షాపింగ్‌లో సహాయం చేయండి: మీ కంటెంట్‌లో ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడం వలన, ధర లాంటి ఉపయోగకర సమాచారాన్ని ఫ్యాన్స్ త్వరగా తెలుసుకోగలుగుతారు. రిటైలర్‌కు చెందిన వెబ్‌సైట్‌లో ఒకవైపు చెక్ అవుట్ చేస్తూనే మీ వీడియోను చూడటం కొనసాగిస్తారు.
  • మీ YouTube బిజినెస్ నుండి మరింత ప్రయోజనాన్ని పొందడం: మీరు క్రియేట్ చేసే గొప్ప షాపింగ్ కంటెంట్‌, YouTube అంతటా మరిన్ని బ్రాండ్‌లను, మరింత మంది వీక్షకులను చేరుకోవడానికి "అనుబంధ ప్రోగ్రామ్" సహాయపడుతుంది. తద్వారా YouTubeలో మీరు సంపాదించగల మొత్తం పెరగడానికి అవకాశం కల్పిస్తుంది. ఫ్యాన్స్ కొనుగోలు చేసినప్పుడు మీరు మంచి కమీషన్‌ను కూడా పొందుతారు.
  • క్రియేట్ చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించండి: మీరు YouTube Studioలో ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయవచ్చు, గణాంకాలను పొందవచ్చు, నికర ఆదాయాన్ని రివ్యూ చేయవచ్చు కాబట్టి మీరు వ్యక్తులు ఇష్టపడే కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవచ్చు, లింక్‌లను మేనేజ్ చేయడానికి తక్కువ సమయాన్ని వెచ్చించవచ్చు.
గమనిక: ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోను, కొరియాలోను ఉన్న అర్హత కలిగిన క్రియేటర్‌ల కోసం అందుబాటులో ఉంది. మీరు ముందుగానే చేరడానికి ఆసక్తిని వ్యక్తం చేయాలనుకుంటే లేదా నిర్దిష్ట బ్రాండ్‌లను సిఫార్సు చేయాలనుకుంటే, దయచేసి ఈ ఫారమ్‌ను పూరించండి. ఫారమ్‌ను పూరించడం వలన ఖచ్చితంగా ఆహ్వానం అందుతుందని అనుకోవడానికి వీల్లేదు.

YouTube Shopping అనుబంధ ప్రోగ్రామ్

కావలసిన అర్హతలు

ప్రోగ్రామ్‌కు ఆహ్వానం పొందాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ఈ కనీస అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి:

  • మీ ఛానెల్, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగం అయ్యి ఉండాలి
  • మీ ఛానెల్‌కు తప్పనిసరిగా 10,000 మందికి పైగా సబ్‌స్క్రయిబర్‌లు ఉండాలి
  • మీరు యునైటెడ్ స్టేట్స్, కొరియా నివాసితులై ఉండాలి
  • మీ ఛానెల్ మ్యూజిక్ ఛానెల్ కానీ, అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్ కానీ అయి ఉండకూడదు, లేదా మ్యూజిక్ పార్ట్‌నర్‌లతో అనుబంధించబడి ఉండకూడదు. మ్యూజిక్ పార్ట్‌నర్‌లలో మ్యూజిక్ లేబుల్స్, డిస్ట్రిబ్యూటర్‌లు, పబ్లిషర్‌లు, లేదా VEVO ఉండవచ్చు
  • మీ ఛానెల్‌కు సంబంధించిన ప్రేక్షకుల సెట్టింగ్, పిల్లల కోసం రూపొందించినదిగా సెట్ చేసి ఉండకూడదు. అలాగే మీ ఛానెల్‌లో పిల్లల కోసం రూపొందించినవిగా సెట్ చేసి ఉన్న వీడియోలు గణనీయంగా ఉండకూడదు

ఎలా చేరాలి

మీరు ప్రోగ్రామ్‌లో చేరడానికి అర్హత సాధించిన తర్వాత, YouTube Studioలో సైన్ అప్ చేయవచ్చు.

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ప్రోగ్రామ్‌లు కింద, ఇప్పుడే చేరండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. YouTube Shopping అనుబంధ ప్రోగ్రామ్ సర్వీస్ నియమాలను రివ్యూ చేసి, అంగీకరించండి.
  5. మీరు చేరారు! మీరు మీ కంటెంట్‌లో ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడం ప్రారంభించవచ్చు. ట్యాగింగ్ గైడ్‌లైన్స్‌ను తప్పకుండా ఫాలో అవ్వండి.

అనుబంధ విక్రేతలు, ఆఫర్‌లు

మీరు ప్రోగ్రామ్‌లో భాగమైన తర్వాత, పెరుగుతున్న పార్టిసిపెంట్‌ల లిస్ట్ నుండి ట్యాగ్ చేయవచ్చు, ఇంకా వారి కమిషన్ శాతాలను చూడవచ్చు. మీరు ఉచిత ప్రోడక్ట్ శాంపిల్స్‌ను రిక్వెస్ట్ చేయడం, సేల్‌లో ఉన్న ప్రోడక్ట్‌లను చూడటం, విక్రేతల నుండి అధిక కమిషన్‌లను స్వీకరించడం ద్వారా ఉత్సాహంగా పాల్గొనవచ్చు. మీ కంటెంట్‌లో ప్రోడక్ట్‌లను ఎలా ట్యాగ్ చేయాలో తెలుసుకోండి

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి. 
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండిఆ తర్వాత Shopping ఆ తర్వాత అనుబంధిత ఆఫర్‌లను అన్వేషించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 

  3. "ఉత్సాహంగా పాల్గొనండి" దిగువున, మీరు కమిషన్, ప్రమోషన్‌లు, లేదా శాంపిల్స్ ఆప్షన్‌ను క్లిక్ చేయవచ్చు. 

  • గమనిక: మరిన్ని వివరాల కోసం మీరు విక్రేతను క్లిక్ చేయండి. విక్రేతలను అక్షర క్రమం ఆధారంగా లేదా అత్యధిక కమీషన్ ఆధారంగా కూడా మీరు క్రమపద్ధతిలో అమర్చవచ్చు.

అనుబంధ విక్రేతల లిస్ట్‌లు

మీరు ప్రోగ్రామ్‌లో భాగమైన తర్వాత, కింద పేర్కొన్న వాటితో సహా పెరుగుతున్న మా విక్రేతల లిస్ట్ నుండి మీరు ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడం ప్రారంభించవచ్చు:

అనుబంధ విక్రేతల లిస్ట్

గమనిక:
  • ఇది విక్రేతలకు సంబంధించిన పూర్తి లిస్ట్ కాదు. మీరు YouTube Studioలో అనుబంధ విక్రేతలకు సంబంధించిన పూర్తి లిస్ట్‌ను కనుగొనవచ్చు.
  • మీరు ఈ ప్రోగ్రామ్‌లో చేరడానికి ఆసక్తి ఉన్న బ్రాండ్ లేదా రిటైలర్ అయితే, దయచేసి ఈ బ్రాండ్/రిటైలర్ ఆసక్తిని తెలియజేసే ఫారమ్‌ను పూరించండి. ఫారమ్‌ను పూరించడం వలన ఖచ్చితంగా ఆహ్వానం అందుతుందని అనుకోవడానికి వీల్లేదు.

మీ నికర ఆదాయం గురించి అర్థం చేసుకోండి

ఇందులో పాల్గొనే ప్రతి బ్రాండ్, ప్రతి రిటైలర్- ఒక్కో ప్రోడక్ట్‌కు కమీషన్ రేట్‌లను, అట్రిబ్యూషన్ విండోను సెట్ చేస్తారు. ఒక్కో ప్రోడక్ట్ అందించే కమీషన్ పర్సెంటేజ్‌లు, వాటి ఆఫర్ పక్కన డిస్‌ప్లే అవుతాయి. ఎంత పర్సెంటేజ్ అయితే డిస్‌ప్లే చేయబడుతుందో, అంతే పే చేయబడుతుంది. మీరు ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌పై వీక్షకులు క్లిక్ చేసి కొనుగోలు చేసిన తర్వాత, మీకు కమీషన్‌లు వస్తాయి. మీరు YouTube ఎనలిటిక్స్‌ను ఉపయోగించి మీ YouTube ఆదాయాన్ని చెక్ చేయవచ్చు.

గమనిక: కొనుగోలు పూర్తి అయిన 60 నుండి 120 రోజుల లోపు, కమీషన్‌లను, YouTube కోసం AdSense ద్వారా పే చేయడం జరుగుతుంది. కస్టమర్ వేటినైనా రిటర్న్ చేస్తే, వాటిని పరిగణనలోకి తీసుకోవడానికి ఈ సమయ వ్యవధి అవసరం అవుతుంది. కస్టమర్ ప్రోడక్ట్‌ను రిటర్న్ చేస్తే, కమీషన్‌లను రివర్స్ చేయడం జరుగుతుంది.

పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లు, స్పాన్సర్‌షిప్‌లు & ఎండార్స్‌మెంట్‌లు

మీ వీడియోలలో పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లను, ఎండార్స్‌మెంట్‌లను, స్పాన్సర్‌షిప్‌లను, లేదా వీక్షకులకు బహిర్గతం (డిస్‌క్లోజ్) చేయాల్సిన ఇతర కంటెంట్‌ను చేర్చినట్లయితే, మీరు YouTubeకు చెందిన పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్ పాలసీలను ఫాలో అవ్వాలి. మరింత సమాచారం కోసం, దయచేసి ఈ ఆర్టికల్‌ను రెఫర్ చేయండి.

సైన్-అప్ సమస్యలను పరిష్కరించడం

సైన్ అప్ చేసేటప్పుడు మీరు ఎదుర్కొనే ఎర్రర్‌లను పరిష్కరించడానికి సాధారణంగా అనుసరించే పద్ధతులు ఇక్కడ ఉన్నాయి:

  • మీ ఛానెల్‌కు అర్హత ఉండకపోవచ్చు. మీ ఛానెల్, తగు ఆవశ్యకతలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించడానికి ఎగువున ఉన్న అర్హత ప్రమాణాలను రివ్యూ చేయండి.
  • మీ ఛానెల్, కంటెంట్ ఓనర్ ద్వారా మేనేజ్ చేయబడుతుంటే, ఆ ఓనర్ మీ తరఫున ఒప్పందాన్ని అంగీకరించాలి.
  • మీరు తప్పు YouTube ఛానెల్‌కు సైన్-ఇన్ చేసి ఉండవచ్చు. అర్హత ఉందని మీరు విశ్వసిస్తున్న ఛానెల్‌కు మారి మళ్లీ ట్రై చేయండి.

గమనిక: మీ సమస్య పైన పేర్కొన్న సందర్భాలలో ఒకటి కాదని నిర్ధారించిన తర్వాత, తదుపరి సహాయం కోసం క్రియేటర్ సపోర్ట్‌ను సంప్రదించండి.

బెస్ట్ ప్రాక్టీసులు, రిసోర్స్‌లు

మొదటి రోజు నుండే అనుబంధ ప్రోగ్రామ్ ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి, మేము వీటిని సిఫార్సు చేస్తున్నాము:

  • పాపులర్ బ్రాండ్‌ల సేల్స్ & ప్రోమోలను ఫీచర్ చేయడం: మీరు ఫీచర్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ ద్వారా కమీషన్ పొందే అవకాశం ఉందో, లేదో చెక్ చేసి, మీకు అత్యంత సందర్భోచితంగా ఉండే సేల్స్ & ప్రోమోలతో మీ కంటెంట్‌ను ప్లాన్ చేయండి. 
  • సందర్భోచితమైన ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేసి, CTAను ఉపయోగించి సేల్స్ పెంచుకోండి: మీ వీడియో‌లో లేదా షార్ట్‌లో ఫీచర్ చేసిన ప్రోడక్ట్‌లతో మీ కంటెంట్‌ను ట్యాగ్ చేయండి. అలాగే వాటిని షాపింగ్ చేయవచ్చని మీ ప్రేక్షకులకు తెలియజేయడానికి 'కాల్ టు యాక్షన్‌'ను ఉపయోగించండి.
    • వీడియోలంతటా ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడానికి బల్క్ ట్యాగింగ్ ఫీచర్‌ను ఉపయోగించండి: YouTube Studioలోని సంపాదన విభాగంలో, Shopping ట్యాబ్and then ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయండి  and thenకు వెళ్లి, వీడియో వివరణలో కనుగొన్న సూచించిన ప్రోడక్ట్‌లతో ఉన్న వీడియోలను ట్యాగ్ చేయడానికి రివ్యూ చేయండి.
      • నిర్దిష్ట ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడానికి, ప్రోడక్ట్ ఇమేజ్ and thenను క్లిక్ చేసి, సంబంధిత ప్రోడక్ట్‌లకు పక్కన ఉన్న, ట్యాగ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి లేదా అన్ని ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడానికి అన్నింటిని ట్యాగ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
      • ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వీడియోలలో ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడానికి, సంబంధిత వీడియోలను ఎంచుకోండి లేదా అన్ని వీడియోలను ఎంచుకొని and then ట్యాగ్ చేయండి.
  • బ్రాండ్‌ల నుండి, క్రియేటర్‌ల నుండి ప్రేరణ పొందడం: కంటెంట్‌కు సంబంధించి ఇనిస్పిరేషన్ పొందేందుకు YouTube క్రియేటర్‌ల అనుబంధ కంటెంట్‌ను చూడండి.

క్రియేటర్ స్టార్టర్ ప్యాక్

మీ కంటెంట్‌కు జోడించడానికి సెటప్ చిట్కాలు, బెస్ట్ ప్రాక్టీసులు, సరదా స్టిక్కర్‌ల వంటి రిసోర్స్‌లతో కూడిన స్టార్టర్ ప్యాక్.

అనుబంధ క్రియేటర్‌ల ప్లేలిస్ట్

YouTubeలో ఇతర క్రియేటర్‌ల అనుబంధ కంటెంట్‌ను పరిశీలించడం ద్వారా వారి నుండి ఇక్కడ ప్రేరణ పొందండి!

YouTube Shopping అనుబంధ పనితీరు ఆధారిత బోనస్

గమనిక: YouTube Shopping అనుబంధ పనితీరు ఆధారిత బోనస్ 2023లో ముగిసింది.

YouTube Shopping అనుబంధ పనితీరు ఆధారిత బోనస్ మీ కంటెంట్‌లో ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడం ద్వారా అర్హత కలిగిన క్రియేటర్‌లు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. అక్టోబర్ 27 - నవంబర్ 30, డిసెంబర్ 1 - 31, 2023 మధ్య తేదీలలో ట్యాగ్ చేసిన మీ ప్రోడక్ట్‌ల మొత్తం సేల్స్ ఆధారంగా మీరు బోనస్‌ను పొందవచ్చు. ఈ బోనస్ ప్రస్తుత బ్రాండ్, రిటైలర్ ఇతర ప్రోత్సాహకాలను రీప్లేస్ చేయదు, అలాగే జరిగిన సేల్స్‌పై పొందిన కమీషన్‌లతో పాటు అదనంగా ఇది లభిస్తుంది.

అర్హత కలిగిన క్రియేటర్‌లు నెలకు ఒక బోనస్‌ను పొందాలంటే కింది సేల్స్ టయర్స్‌కు అనుగుణంగా ఉండాలి (మొత్తాలు USDలో ఉంటాయి):

  • మొత్తం ప్రోడక్ట్ సేల్స్‌లో $300 సంపాదించినందుకు $30 బోనస్‌ను పొందడం
  • మొత్తం ప్రోడక్ట్ సేల్స్‌లో $1,000 సంపాదించినందుకు $120 బోనస్‌ను పొందడం
  • మొత్తం ప్రోడక్ట్ సేల్స్‌లో $5,000 సంపాదించినందుకు $750 బోనస్‌ను పొందడం
  • మొత్తం ప్రోడక్ట్ సేల్స్‌లో $15,000+ సంపాదించినందుకు $3,000 బోనస్‌ను పొందడం

బోనస్ పీరియడ్ ముగిసిన తర్వాత 45 రోజుల లోపు రిటర్న్స్ ఏవైనా ఉంటే, వాటి విలువను మీ మొత్తం అమ్మకాల నుండి తీసివేయడం ద్వారా, సంపాదించిన బోనస్ పేమెంట్‌ను లెక్కించడం జరుగుతుంది. మీరు సంపాదించిన బోనస్ పేమెంట్, ప్రోగ్రామ్‌లో భాగమైన ఒక్కో నెల ముగిసిన తర్వాత, 120 రోజుల లోపు మీYouTube కోసం AdSense ఖాతాలో కనిపిస్తుంది.

గమనిక: YouTube Shopping అనుబంధ ప్రోగ్రామ్ అందించే పనితీరు ఆధారిత బోనస్ అనేది YouTube అనుబంధ ప్రోగ్రామ్ సర్వీస్ నియమాలకు కట్టుబడి ఉంటుంది. YouTube Shopping అనుబంధ పనితీరు ఆధారిత బోనస్‌ను నోటీస్ అందించి Google ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. వంచనగా, దుర్వినియోగమైనవిగా, మోసపూరితమైనవిగా లేదా చెల్లనివిగా Google గుర్తించిన ఇతర పద్ధతుల ద్వారా చేసిన లావాదేవీలతో సహా ఇతర కారణాల వలన పేమెంట్‌ను నిరాకరించే హక్కును Google కలిగి ఉంటుంది. 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6029564739110309765
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false