YouTube వాణిజ్యపరమైన ప్రోడక్ట్‌ల మానిటైజేషన్ పాలసీలు

కొత్త YPP క్రియేటర్‌ల కోసం వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM) అనేది వాణిజ్య ప్రోడక్ట్ అనుబంధ ఒప్పందాన్ని (CPA) రీప్లేస్ చేస్తోంది. CPAపై సంతకం చేసిన YPP క్రియేటర్‌లు కొత్త CPM ఒప్పందంపై సంతకం చేయాల్సిన అవసరం లేదు.

ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లను అన్‌లాక్ చేయాలనుకుంటున్న మానిటైజ్ చేసే క్రియేటర్‌లకు వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM) అందుబాటులో ఉంది. వీక్షకులతో కనెక్ట్ అవ్వడంతో పాటు కమ్యూనిటీని బిల్డ్ చేస్తూనే, అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఫ్యాన్ ఫండింగ్ మీకు వీలు కల్పిస్తుంది. అది ఫ్యాన్స్‌ అప్పటికప్పుడు సూపర్ థ్యాంక్స్‌ ద్వారా ఇచ్చే సపోర్ట్ కావచ్చు, లేదా ఛానెల్ మెంబర్‌షిప్‌ల ద్వారా లాయల్ ఫ్యాన్స్ కోసం ఇచ్చే 'మెంబర్‌లకు మాత్రమే' కంటెంట్ కావచ్చు.

ఫ్యాన్ ఫండింగ్‌లో ఈ మానిటైజేషన్ ఫీచర్‌లు ఉంటాయి:

  • ఛానెల్ మెంబర్‌షిప్‌లు: మీరు అందించే 'మెంబర్‌లకు మాత్రమే' అందుబాటులో ఉండే పెర్క్‌లకు బదులుగా మీ మెంబర్‌లు రిపీట్ అయ్యే నెలవారీ పేమెంట్‌లను చేస్తారు.
  • సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్: మీ ఫ్యాన్స్ తమ మెసేజ్‌లను లేదా యానిమేట్ చేసిన ఇమేజ్‌లను లైవ్ చాట్ స్ట్రీమ్‌లలో హైలైట్ చేయడానికి పేమెంట్ చేస్తారు.
  • సూపర్ థ్యాంక్స్: మీ ఫ్యాన్స్ సరదా యానిమేషన్‌ను చూడటానికి ఇంకా తమ మెసేజ్‌లను మీ షార్ట్‌లు అలాగే నిడివి ఎక్కువ ఉన్న వీడియోలోని కామెంట్‌ల విభాగంలో హైలైట్ చేయడానికి పేమెంట్ చేస్తారు.

YouTube ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లకు వర్తించే పాలసీలు

మీరు ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లతో YouTubeలో మానిటైజ్ చేస్తున్నట్లయితే, మీ ఛానెల్ (అలాగే మీ MCN) తప్పనిసరిగా ఈ ఫీచర్‌లకు (వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ లేదా వాణిజ్య ప్రోడక్ట్ అనుబంధ ఒప్పందం) వర్తించే మీ ఒప్పందానికి అనుగుణంగా ఉండాలి అలాగే YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలను ఫాలో అవ్వాలి, వీటిలో ఇవి ఉంటాయి:

YouTube సర్వీస్ నియమాల ప్రకారం వర్తించే అన్ని చట్టాలకు కూడా మీరు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. మీరు ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లను ఆన్ చేయవచ్చా లేదా, ఆఫర్ చేయవచ్చా లేదా, వాటి నుండి డబ్బు పంపవచ్చా లేదా, అలాగే అందుకోవచ్చా లేదా అనే అంశాలు ఇందులో ఉంటాయి. ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లు అనేవి ప్రజల నుండి సేకరించే నిధి లేదా విరాళం టూల్స్ కావు. ఈ ఫీచర్‌ల నుండి మీరు అందుకునే డబ్బు, మీకు ఇంకా మీ యాక్టివిటీలకు వర్తించే చట్టాల ఆధారంగా విభిన్నంగా పరిగణించబడవచ్చు.

రద్దు

ఫ్యాన్ ఫండింగ్ ప్రోడక్ట్‌లకు మీ యాక్సెస్ రద్దు చేయబడితే, అలాగే అటువంటి ప్రోడక్ట్‌లకు సంబంధించి అందుబాటులో ఉన్న ఏదైనా నిర్దిష్ట వాణిజ్యపరమైన కంటెంట్‌ను మీరు తీసివేయాలనుకుంటే, మీరు దాన్ని తప్పనిసరిగా తీసివేయాలి. రద్దు చేసిన తర్వాత ఏదైనా వాణిజ్యపరమైన కంటెంట్‌కు యాక్సెస్‌ను తీసివేయడం, లేదంటే పరిమితం చేయడానికి సంబంధించి YouTube బాధ్యత వహించదు.

ప్రోత్సాహకాలు

మేము ఎప్పటికప్పుడు ప్రోత్సాహక ప్రోగ్రామ్‌లను అందించవచ్చు. మరింత సమాచారం కోసం మళ్లీ ఇక్కడ చెక్ చేయండి.

ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లకు సంబంధించిన కనీస ఆవశ్యకతలు

ప్రతి ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ దాని సొంత ఆవశ్యకతలను కలిగి ఉంటుంది, మీరు ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లకు అర్హత పొందాలంటే తప్పనిసరిగా ఈ కనీస ఆవశ్యకతలను పాటించాలి:

ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లను ఆన్ చేయండి

ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లను ఆన్ చేయడానికి, మీరు తప్పనిసరిగా వీటిని చేయాలి:

  1. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో చేరడానికి దరఖాస్తు చేసుకుని ఉండాలి, ఆ దరఖాస్తు ఆమోదించబడాలి.
  2. మీరు (అలాగే మీ MCN) మా నియమాలు ఇంకా పాలసీలకు అంగీకరించి, వాటిని పాటిస్తూ ఉండాలి (సంబంధిత వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్, లేదా గతంలో అందుబాటులో ఉన్న వాణిజ్య ప్రోడక్ట్ అనుబంధ ఒప్పందంతో సహా).
  3. మీరు ఆవశ్యకతలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి ప్రతి ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌కు సంబంధించిన అర్హత ప్రమాణాలను రివ్యూ చేయాలి:
    1. ఛానెల్ మెంబర్‌షిప్‌లకు సంబంధించిన అర్హత ప్రమాణాలు
    2. సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్‌కు సంబంధించిన అర్హత ప్రమాణాలు
    3. సూపర్ థ్యాంక్స్‌కు సంబంధించిన అర్హత ప్రమాణాలు
  4. YouTube Studioలో లేదా YouTube Studio మొబైల్ యాప్‌లో ప్రతి ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌ను ఆన్ చేయాలి.

ఛానెల్ మెంబర్‌షిప్‌లు

వీక్షకులు నెలవారీ పేమెంట్‌ల ద్వారా మీ ఛానెల్‌లో చేరే వెసులుబాటును ఛానెల్ మెంబర్‌షిప్‌లు కల్పిస్తాయి అలాగే వీటి ద్వారా బ్యాడ్జ్‌లు, ఎమోజీలు, ఇంకా ఇతర వస్తువుల వంటి 'మెంబర్‌లకు మాత్రమే' అందుబాటులో ఉండే పెర్క్‌లకు వారు యాక్సెస్‌ను పొందుతారు. ఛానెల్ మెంబర్‌షిప్‌లను ఆన్ చేయడం అలాగే మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్

సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అనేవి లైవ్ స్ట్రీమ్‌లు ఇంకా ప్రీమియర్‌ల సమయంలో క్రియేటర్‌లను ఫ్యాన్స్‌తో కనెక్ట్ చేసే మార్గాలు. ఫ్యాన్స్ తమ మెసేజ్‌ను లైవ్ చాట్‌లో హైలైట్ చేయడానికి సూపర్ చాట్‌లను కొనుగోలు చేయవచ్చు లేదా లైవ్ చాట్‌లో కనిపించే యానిమేటెడ్ ఇమేజ్‌ను పొందడానికి సూపర్ స్టిక్కర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయడం అలాగే మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సూపర్ థ్యాంక్స్

సూపర్ థ్యాంక్స్ అనేది క్రియేటర్‌లకు తమ వీడియోల పట్ల అదనపు కృతజ్ఞత చూపాలనుకునే వీక్షకుల నుండి ఆదాయాన్ని సంపాదించే వీలు కల్పిస్తుంది. ఫ్యాన్స్, వన్-టైమ్ యానిమేషన్‌ను కొనుగోలు చేయవచ్చు ఇంకా వీడియోలోని కామెంట్ విభాగంలో విభిన్నమైన, రంగురంగుల, అలాగే అనుకూలంగా మార్చదగిన కామెంట్‌ను పోస్ట్ చేయవచ్చు. సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయడం అలాగే మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2184752809571107999
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false