Microsoft Outlook నుండి Gmailకి మారడం

Outlookకు, Gmailకి మధ్య ఉన్న తేడాలు

Microsoft Outlook, Gmailలు అనేక సారూప్య లక్షణాలను, ముఖ్యమైన తేడాలను కలిగి ఉన్నాయి. ఈ ఆర్టికల్ Outlook కంప్యూటర్ యాప్‌ను వెబ్‌లోని Gmailతో పోలుస్తుంది, అదేవిధంగా Gmailకి మారడం వల్ల కలిగే ప్రయోజనాలను హైలైట్ చేస్తుంది.

ఈ పేజీలో ఉన్నవి

 అన్నింటినీ విస్తరించండి  |  అన్నింటినీ కుదించండి

Gmailకి ఎందుకు మారాలి?

Gmail అనేది వెబ్-నేటివ్ యాప్

Gmailను వెబ్ కోసం డిజైన్ చేశారు, అంతేకాకుండా దీనిని ఉపయోగించడంలో సౌలభ్యాన్ని, కలిసి పని చేయగలగడాన్ని దృష్టిలో ఉంచుకొని బిల్డ్ చేశారు. డెస్క్‌టాప్ కంప్యూటర్‌ల కోసం, అలాగే ఎవరికి వారు పని చేయడం కోసం డిజైన్ చేయబడిన ఈమెయిల్ యాప్‌ల కంటే ఇది ఏక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఉదాహరణకు:

  • ప్రయాణంలో Gmail ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది—Gmail మీ కంప్యూటర్‌లోని యాప్‌లో కాకుండా, వెబ్ బ్రౌజర్‌లో రన్ అవుతుంది. వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించడం వలన ఆఫీస్ గాని, లేదా స్కూల్ కాని, ఎక్కడి నుండైనా, ఏ పరికరంలోనైనా ప్రాజెక్ట్‌లపై కలసి పని చేయడం సులభం అవుతుంది. 
  • మీరు చేసిన పనిని ఎప్పటికీ కోల్పోరు—మీరు పని చేస్తున్నప్పుడు మీ మార్పులు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. నిరంతరం సేవ్ చేయండి ని క్లిక్ చేస్తూ ఉండాల్సిన అవసరం గాని, లేదా ఆటోసేవ్‌ను సెటప్ చేయాల్సిన పని గాని లేదు.

Gmail ఫీచర్‌లు Google AI ద్వారా అందించబడతాయి

Gmailకి మారినప్పుడు, మీరు శక్తివంతమైన AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్‌లను పొందుతారు, వాటిలో భాగంగా ఇవి కూడా ఉంటాయి:

  • స్మార్ట్ కంపోజ్, వ్యక్తిగతీకరించిన సూచనలు—మీరు ఏదైనా రాయడం కోసం టైప్ చేసేటప్పుడు వ్యక్తిగతీకరించిన సూచనలను పొందండి. ఇది మెసేజ్‌లను మరింత వేగంగా రాయడంలోను, అలాగే వాటికి సమాధానం ఇవ్వడంలోను మీకు సహాయపడుతుంది.  Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి
  • ట్యాబ్‌లతో కూడిన ఇన్‌బాక్స్—Gmail మీ మెసేజ్‌లను, ప్రమోషన్‌లు, సోషల్, అప్‌డేట్‌లు, ఫోరమ్‌ల వంటి కేటగిరీలలో ఆటోమేటిక్‌గా క్రమపద్ధతిలో అమర్చి పెడుతుంది. దీనివల్ల మీరు అత్యంత ముఖ్యమైన మెసేజ్‌లను ముందుగా చూడగలుగుతారు. మీ ఇన్‌బాక్స్ రకాన్ని ఎంచుకోండి
  • అన్‌సబ్‌స్క్రయిబ్ చేసేందుకు సూచనలు—ప్రమోషనల్స్‌ను పంపేవారి కోసం Gmail సరళమైన సబ్‌స్క్రిప్షన్ తీసివేత బటన్‌ను అందిస్తుంది, దానిని క్లిక్ చేయడం ద్వారా మీరు వాటిని పంపేవారి మెయిలింగ్ లిస్ట్ నుండి మీ అడ్రస్‌ను ఒకే క్లిక్‌తో తీసివేయవచ్చు. Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి
  • ప్రాముఖ్యత మార్కర్ లు—మీకు ఏ మెసేజ్‌లు ముఖ్యమైనవి అనేది అంచనా వేయడానికి, వాటిని మార్క్ చేయడానికి, Gmailను మీ గత చర్యలను ఉపయోగించనివ్వండి. Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి
  • స్పామ్ ఫిల్టర్‌లు—Gmail 99.9 కంటే ఎక్కువ శాతం స్పామ్‌లను, ఫిషింగ్‌ను, ఇంకా మాల్వేర్‌లను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది, 1.5 బిలియన్లకు పైగా ఇన్‌బాక్స్‌లను రక్షిస్తుంది. అనుమానాస్పద ఈమెయిల్ ఆటోమేటిక్‌గా గుర్తించబడి, స్పామ్ ఫోల్డర్‌కు పంపబడుతుందని మీరు ధైర్యంగా ఉండవచ్చు. Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి
  • ఆటోమేటిక్ రిమైండర్‌లు—మీ రిప్లయి కోసం వేచి ఉన్న మెసేజ్ లను మీ ఇన్‌బాక్స్ లో పైకి తీసుకురావడం ద్వారా వాటిని Gmail స్మార్ట్‌గా మీకు గుర్తు చేస్తుంది. Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి

తాజా కంటెంట్‌ను డిస్‌ప్లే చేయడానికి Gmail మెసేజ్‌లను అప్‌డేట్ చేయగలదు

డైనమిక్ ఈమెయిల్‌ని ఆన్ చేసినప్పుడు, మీరు Gmail నుండి నిష్క్రమించకుండానే Google Docsలో ఈవెంట్‌లకు సమాధానం ఇవ్వడం, ప్రశ్నావళిని పూరించడం, దానితో పాటు కామెంట్‌లకు రిప్లయి ఇవ్వడం వంటి టాస్క్‌లను పూర్తి చేయవచ్చు. Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి

మీ కమ్యూనికేషన్ ఛానెల్స్ అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి

ఈమెయిల్‌ను పంపండి, Chatను ఉపయోగించండి, వీడియో మీటింగ్‌లను ప్రారంభించండి, అదేవిధంగా మీ క్యాలెండర్‌ను మేనేజ్ చేయండి, అన్నీ Gmailలోనే. మీ కమ్యూనికేషన్ ఛానెల్‌లన్నిటిలోనూ మీరు ఒకే బ్రౌజర్ విండోలో మీ కంటెంట్‌ను సెర్చ్ కూడా చేయవచ్చు. కమ్యూనికేషన్ ఛానెల్స్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి

Gmailలో ఇందుకు భిన్నంగా మీరు ఏం చేస్తారు

మీరు Gmailకి మారినప్పుడు, మీ ప్రస్తుత వర్క్‌ఫ్లోలను భద్రపరచాలని కోరుకోవడం సహజం. మీరు తరచుగా Gmailను Outlook వర్క్‌ఫ్లోకు ప్రతిరూపంగా చూసినప్పటికీ, దానికి మారడం అనేది కొత్త మార్గాలలో పని చేయడాన్ని ఆచరణాత్మకంగా తెలుసుకోవడానికి అనుకూల సమయాన్ని అందిస్తుంది. 

మీరు Gmailకి మారినప్పుడు మీరు విభిన్నంగా ఏమి చేస్తారో తెలుసుకోవడానికి కింది బెస్ట్ ప్రాక్టీసులను, చిట్కాలను ఉపయోగించండి.

Outlook వర్క్‌ఫ్లో Gmail బెస్ట్ ప్రాక్టీసులు & చిట్కాలు
డాక్యుమెంట్ కాపీలపై పరస్పర సహకారంతో పని చేయండి—కాపీలను ఈమెయిల్ అటాచ్‌మెంట్‌లుగా సహోద్యోగులకు పంపండి. ఒకే డాక్యుమెంట్‌పై కలిసి పని చేయండి—Google Docs, Sheets, Slidesను షేర్ చేయండి, షేరింగ్ అనుమతులను అప్‌డేట్ చేయండి, అలాగే Gmail నుండి నిష్క్రమించకుండానే కామెంట్‌లకు రిప్లయి ఇవ్వండి. మరింత తెలుసుకోండి
పంపినవారి ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చండి—మీ ఇన్‌బాక్స్‌లోని సెర్చ్ బార్ లేదా ఫిల్టర్ మెనూ ఉపయోగించండి. సెర్చ్ చేయడం ద్వారా మెసేజ్‌లను కనుగొనండి—అధునాతన సెర్చ్ ప్రమాణాలు, చిప్‌లు, యాప్‌ల ఇంకా సెర్చ్ ఓవర్‌లే ఉపయోగించి సెర్చ్ చేయండి. మరింత తెలుసుకోండి
మీరు పంపే మెసేజ్‌లను ముఖ్యమైనవిగా మార్క్ చేయండి—అత్యధిక ప్రాముఖ్యత మార్కర్‌ను ఎంచుకోండి. మరింత స్మార్ట్‌గా ఉండే సబ్జెక్ట్‌లను ఎంచుకోండిసబ్జెక్ట్ ఫీల్డ్‌లో మెసేజ్ ప్రాముఖ్యతను హైలైట్ చేయండి. మరింత తెలుసుకోండి
ఈమెయిల్‌లో టెక్స్ట్‌ను ఫార్మాట్ చేయండిమెసేజ్ విండోలో టెక్స్ట్ ఫార్మాట్‌లను వర్తింపజేయండి. ప్రత్యేక టెక్స్ట్ ఫార్మాట్‌ల కోసం Google Docs‌ను ఉపయోగించండి— మెసేజ్ విండోలో సాధారణంగా ఉపయోగించే టెక్స్ట్ ఫార్మాట్‌లను వర్తింపజేయండి. అధునాతన ఫార్మాటింగ్ ఆప్షన్‌లు లేదా టేబుల్స్ కోసం, Google Docs నుండి ఈమెయిల్‌ను ఎడిట్ చేసి, పంపండి. మరింత తెలుసుకోండి
మెసేజ్‌కు ఓటింగ్ బటన్‌లను జోడించండి—ఈమెయిల్ ద్వారా పోల్ తీసుకోండి. సర్వేల కోసం Google Formsను ఉపయోగించండి—Google Forms ఉపయోగించి పోల్ తీసుకోండి. మరింత తెలుసుకోండి
ఫాలోఅప్-రిమైండర్‌లుగా ఫ్లాగ్‌లను ఉపయోగించండి—మీరు స్వీకరించే ముఖ్యమైన మెసేజ్‌లను ట్రాక్ చేయడానికి ఫ్లాగ్‌లను ఉపయోగించండి. ముఖ్యమైన మెసేజ్‌లకు స్టార్ గుర్తును పెట్టండి లేదా తాత్కాలిక వాయిదాను ఉపయోగించండిమీరు స్వీకరించే మెసేజ్‌లను ముఖ్యమైనవిగా నక్షత్రం గుర్తు పెట్టండి, తాత్కాలికంగా వాయిదా వేయండి లేదా మార్క్ చేయండి. మరింత తెలుసుకోండి
గ్రూప్ ఈమెయిల్‌ను ఉపయోగించండినియమాలు, కేటగిరీలు ఇంకా ఫోల్డర్‌లను ఉపయోగించండి. ఈమెయిల్‌ను ఫిల్టర్ & లేబుల్ చేయండిఫిల్టర్‌లను ఉపయోగించండి ఇంకా మెసేజ్‌లకు లేబుల్స్ వర్తింపజేయండి. మరింత తెలుసుకోండి
ఫోల్డర్‌లలో మెసేజ్‌లను పోస్ట్ చేయండి—మీ ఖాతాలోని ఫోల్డర్‌లకు సమాచారంతో కూడిన మెసేజ్‌లను పోస్ట్ చేసుకోండి. మీకు మీరే మెసేజ్‌లను పంపండి—ఆపై మెసేజ్‌లకు లేబుల్స్‌ను వర్తింపజేయండి లేదా వాటిని ముఖ్యమైనవిగా మార్క్ చేయండి. మరింత తెలుసుకోండి
పబ్లిక్ ఫోల్డర్‌లను ఉపయోగించండి—మీ సంస్థలో సమాచారాన్ని షేర్ చేయండి. Google Driveను ఉపయోగించండి—Google Driveలో ఫైల్స్‌ను, ఫోల్డర్‌లను షేర్ చేయండి. Docs ఎడిటర్‌ల సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి
షేర్ చేసిన మెయిల్‌బాక్స్‌ను ఉపయోగించండి—ఒకే ఈమెయిల్ అడ్రస్ నుండి అనేక మంది వ్యక్తులకు మెసేజ్‌లను పంపే వీలు కల్పించండి. ఈమెయిల్ ఖాతాను డెలిగేట్ చేయండి—ఒకే ఈమెయిల్ ఖాతాను ఉపయోగించడానికి అనేక మందిని అనుమతించండి లేదా సహకారయోగ్య ఇన్‌బాక్స్‌ను క్రియేట్ చేయండి. Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి
ఆటోఆర్కైవ్ & క్లీన్ స్వీప్ లను ఉపయోగించండి—క్రమానుగతంగా, మీ ఇన్‌బాక్స్ నుండి Outlook ఆర్కైవ్ ఫైల్‌కి మెసేజ్‌లను తరలించడానికి నియమాలను సెటప్ చేయండి. మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా ఆర్కైవ్ చేయడానికి ఫిల్టర్‌లను ఉపయోగించండి—మెసేజ్‌లను ఆర్కైవ్ చేయండి, లేదా ఆర్కైవ్‌కు మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా తరలించడానికి ఫిల్టర్‌లను సెటప్ చేయండి. రెగ్యులర్ వ్యవధులలో రన్ చేయడానికి నియమాలను షెడ్యూల్ చేయవలసిన అవసరం లేదు. మీరు మెసేజ్‌లను ఆర్కైవ్ చేసిన తర్వాత, మీరు వాటిని ఇంకా అన్ని మెయిల్స్ అనే లేబుల్ కింద కనుగొంటారు. మరింత తెలుసుకోండి

 

ఫీచర్ వ్యత్యాసాల త్వరిత వీక్షణ

ఈ విభాగం Outlookకు, Gmailకి ఫీచర్‌లలో ఉన్న తేడాలను హైలైట్ చేస్తుంది.

ఫీచర్ లేదా టాస్క్ Outlook (డెస్క్‌టాప్) Gmail (వెబ్)
మీ ఈమెయిల్‌ని తెరవండి
మీ కంప్యూటర్‌లో Outlook తెరవండి.
ఏదైనా బ్రౌజర్‌లో, gmail.com సైట్‌కు వెళ్లండి. మరింత తెలుసుకోండి
ఈమెయిల్‌ను రాయండి గ్రామర్, స్పెల్లింగ్ చెకర్‌లను ఉపయోగించండి. గ్రామర్, స్పెల్లింగ్ ఇంకా వ్యక్తిగతీకరించిన రాత సూచనలను పొందండి. మరింత తెలుసుకోండి
డ్రాఫ్ట్‌లుగా సేవ్ చేయండి హోమ్ఆ తర్వాతకొత్త ఈమెయిల్ పైన క్లిక్ చేసి, తర్వాత సేవ్ చేయండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కొత్త ఈమెయిల్ రాయండి అనే ఆప్షన్ క్లిక్ చేయండి. డ్రాఫ్ట్‌లు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. మరింత తెలుసుకోండి
ఈమెయిల్‌కి ఈమెయిల్‌ను అటాచ్ చేయండి మెసేజ్ విండోలో, Outlook ఐటెమ్‌ను ఇన్‌సర్ట్ చేయండి, లేదా మెసేజ్‌లోకి ఐటెమ్‌ను లాగండి. మెసేజ్‌ను అటాచ్‌మెంట్‌గా ఫార్వర్డ్ చేయండి లేదా మెసేజ్‌ను మరొక మెసేజ్‌లోకి లాగండి. మరింత తెలుసుకోండి
అటాచ్‌మెంట్‌లను సేవ్ చేయండి మీ కంప్యూటర్‌కు అటాచ్‌మెంట్‌లను సేవ్ చేయండి. Google Driveకు అటాచ్‌మెంట్‌లను అప్‌లోడ్ చేయండి. మరింత తెలుసుకోండి
వ్యక్తిగత మెసేజ్‌లు లేదా సంభాషణ థ్రెడ్‌లను వీక్షించండి సంభాషణ ప్రకారం లేదా పంపినవారి ప్రకారం అమర్చండి. అన్ని మెసేజ్‌లను, లేదా సంభాషణలను చూడటానికి స్క్రోల్ చేయండి (డెస్క్‌టాప్ వీక్షణ). సంభాషణ వీక్షణను మార్చడానికి క్విక్ సెట్టింగ్‌లను ఉపయోగించండి. ఒక్కో స్క్రీన్‌లో గరిష్టంగా 100 మెసేజ్‌లు లేదా సంభాషణలను చూడండి (వెబ్ వీక్షణ). మరింత తెలుసుకోండి
ఈమెయిల్‌కి రిప్లయి ఇవ్వండి రిబ్బన్‌లో రిప్లయి ఇవ్వండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మెసేజ్‌లో రిప్లయి ఇవ్వండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. త్వరిత రిప్లయిల కోసం, స్మార్ట్ రిప్లయి సూచనలను ఉపయోగించండి. మరింత తెలుసుకోండి
మునుపటి ఈమెయిల్‌లోని కంటెంట్‌కు నేరుగా సమాధానం ఇవ్వండి మీ రిప్లయి మెసేజ్‌లో, "కింద నా ప్రతిస్పందనను ఇన్‌లైన్‌లో చూడండి" అని రాయండి. తర్వాత, మునుపటి మెసేజ్‌లోనే టైప్ చేయండి. మునుపటి మెసేజ్ నుండి టెక్స్ట్‌ను మీ రిప్లయి‌లోకి కాపీ చేసి, కోట్ ఫార్మాట్‌ను వర్తింపజేయండి. ఆ తర్వాత ప్రతిస్పందనను ఎంటర్ చేయండి. మరింత తెలుసుకోండి
సెట్టింగ్‌లకు షార్ట్‌కట్‌లను జోడించండి రిబ్బన్‌లో సెట్టింగ్‌లను అనుకూలీకరించండి. మీరు తరచుగా చేసే పనుల కోసం అనుకూల కీబోర్డ్ షార్ట్‌కట్‌లను జోడించండి. మరింత తెలుసుకోండి
 

ఒకే రకమైన ఫీచర్‌లకు వివిధ పేర్లు

Outlook, Gmailలు కొన్నిసార్లు ఒకే రకమైన ఫీచర్‌లకు భిన్నమైన పేర్లను ఉపయోగిస్తాయి. తేడాలను తెలుసుకోవడానికి ఈ టేబుల్‌ను ఉపయోగించండి.  

Outlook Gmail
ఫోల్డర్‌లు లేబుల్స్
నియమాలు ఫిల్టర్‌లు
కొత్త ఈమెయిల్ కొత్త ఈమెయిల్‌ను రాయడం
డెలివరీలో ఆలస్యం పంపడాన్ని షెడ్యూల్ చేయడం
మెసేజ్‌లను రీకాల్ చేయడం 'పంపించండి' చర్యను రద్దు చేయడం
మెయిల్ విలీనం మల్టీ-సెండ్ మోడ్
ఈమెయిల్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడం కాన్ఫిడెన్షియల్ మోడ్
అలర్ట్‌లు నోటిఫికేషన్‌లు
క్విక్ పార్ట్‌లు ఈమెయిల్ టెంప్లేట్‌లు
సంభాషణలను విస్మరించండి సంభాషణలను మ్యూట్ చేయండి
జంక్ స్పామ్
తొలగించిన ఐటెమ్‌లు ట్రాష్

 

Gmail ద్వారా ఇతర యాప్‌లతో కలిసి పని చేయండి & వాటిని ఉపయోగించండి

మీ సందర్భాన్ని మార్చకుండానే ఒక కమ్యూనికేషన్ స్ట్రీమ్ నుండి మరొక స్ట్రీమ్‌కి వెళ్లేందుకు Gmail మీకు వీలు కల్పిస్తుంది.

టాస్క్ మీరు Gmail (వెబ్)లో దీన్ని ఎలా చేస్తారు
Outlookను ఉపయోగించి సహోద్యోగులతో కలిసి పని చేయండి Outlookను, Gmailని కలిపి ఉపయోగించండి
సహోద్యోగులతో ఈమెయిల్‌ని ఎడిట్ చేయండి Google డాక్‌లో ఈమెయిల్ కంటెంట్‌పై కలిసి పని చేయండి
సహోద్యోగులతో చాట్ చేయండి, Spacesలో కంటెంట్‌ను షేర్ చేయండి Gmailలో Google Chatను ఉపయోగించండి
సహోద్యోగులను మరింత సులభంగా సంప్రదించండి మీ Google Contactsకు వ్యక్తులను జోడించండి
వీడియో మీటింగ్‌లను ప్రారంభించండి, వాయిస్ కాల్స్ చేయండి Gmailలో Google Meetని ఉపయోగించండి
మీటింగ్‌లు, అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయండి Gmailలో Google Calendar సైడ్‌బార్‌ను ఉపయోగించండి
ఈమెయిల్ నుండి టాస్క్‌ను క్రియేట్ చేయండి ఏదైనా ఈమెయిల్‌ను Google Tasksకు లాగండి
ఈమెయిల్ నుండి గమనికలను క్రియేట్ చేయండి Google Keepకి ఏదైనా ఈమెయిల్‌ను సేవ్ చేయండి
పోల్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయండి Google Forms సర్వేను పంపండి


Google, Google Workspace, and related marks and logos are trademarks of Google LLC. All other company and product names are trademarks of the companies with which they are associated.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17258635101507525413
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false