Microsoft Outlook నుండి Gmailకి మారడం

ఈమెయిల్‌ను ఆర్గనైజ్ చేయండి, ఆర్కైవ్ చేయండి


Gmailలో, మీ ఈమెయిల్‌ను ఆర్గనైజ్ చేయడానికి, లేబుల్స్‌ను, ఫిల్టర్‌లను ఉపయోగించండి. మీ ఇన్‌బాక్స్‌ను ఖాళీగా ఉంచడానికి, మీరు మెసేజ్‌లపై స్టార్ గుర్తు ఉంచవచ్చు, తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు, ఆర్కైవ్ చేయవచ్చు ఇంకా తొలగించవచ్చు.

ఈ పేజీలో ఉన్నవి

Note: The instructions in this guide are primarily web only. మొబైల్ పరికరాల కోసం స్విచింగ్ సమాచారాన్ని పొందండి

 Expand all  |  అన్నింటినీ కుదించండి

టాపిక్ ఆధారంగా మెసేజ్‌లను ఆర్గనైజ్ చేయండి


  • Outlookలో: నియమాలు, కేటగిరీలు ఇంకా ఫోల్డర్‌లను ఉపయోగించండి.
  • Gmailలో: ఫిల్టర్‌లను ఉపయోగించండి ఇంకా మెసేజ్‌లకు లేబుల్స్ వర్తింపజేయండి. మీరు మెసేజ్‌కు మల్టిపుల్ లేబుల్స్‌ను వర్తింపజేయవచ్చు, ఇంకా ఎడమ ప్యానెల్‌లో ఉన్న వాటి లేబుల్స్‌లో దేనినైనా క్లిక్ చేయడం ద్వారా మెసేజ్‌లను కనుగొనవచ్చు.

ఎలాగో తెలుసుకోండి

ఒక ఫిల్టర్‌ను క్రియేట్ చేయండి

  1. Gmailని తెరవండి.
  2. ఎగువన ఉన్న సెర్చ్ బాక్స్‌లో, సెర్చ్ ఆప్షన్‌లను చూపించండి photos tune ఆప్షన్‌ను క్లిక్ చేయండి .
  3. మీ సెర్చ్ ప్రమాణాలను ఎంటర్ చేయండి. మీ సెర్చ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేయాలనుకుంటే, Search ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఏ ఈమెయిల్స్ కనిపిస్తాయో చూడండి. 
  4. సెర్చ్ విండో దిగువున ఉన్న ఫిల్టర్‌ను క్రియేట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఫిల్టర్‌ను ఉపయోగించి ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  6. ఫిల్టర్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

గమనిక: మీరు మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయడానికి ఫిల్టర్‌ను రూపొందిస్తే, అది కొత్త మెసేజ్‌ల మీద మాత్రమే ప్రభావం చూపుతుంది. ​అదనంగా, మీరు ఫిల్టర్ చేసిన మెసేజ్‌కు ఎవరైనా రిప్లయి ఇచ్చినప్పుడు, అదే సెర్చ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మాత్రమే, ఆ రిప్లయి ఫిల్టర్ చేయబడుతుంది. 

ఫిల్టర్‌ల గురించి మరింత తెలుసుకోండి

 లేబుల్‌ను క్రియేట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకి వెళ్లండి.
  2. ఎడమ వైపున, కిందికి స్క్రోల్ చేసి, మరిన్ని ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. కొత్త లేబుల్‌ను సృష్టించు క్లిక్ చేయండి.
  4. మీ లేబుల్‌కు పేరు పెట్టండి.
  5. క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ ఇన్‌బాక్స్‌లోని మెసేజ్‌లను లేబుల్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకి వెళ్లండి.
  2. మెసేజ్‌లను ఎంపిక చేయండి.
  3. ఎగువన ఉన్న, లేబుల్స్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. లేబుల్‌ను ఎంచుకోండి లేదా కొత్తదాన్ని క్రియేట్ చేయండి.
చిట్కా: ఒకే సమయంలో మల్టిఫుల్ మెసేజ్‌లకు లేబుల్‌ను వర్తింపజేయడానికి, మెసేజ్‌లకు ఎడమ వైపున ఉన్న పెట్టెలను చెక్ చేసి, ఆపై ఇన్‌బాక్స్ పైన ఉన్న లేబుల్‌ను ఎంచుకోండి.

Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి

మీరు పంపే ఈమెయిల్‌ను ముఖ్యమైనదిగా మార్క్ చేయండి


  • Outlookలో: అత్యధిక ప్రాముఖ్యత మార్కర్‌ను ఎంచుకోండి. Gmail ఖాతాలకు పంపబడిన మెసేజ్‌లలో ప్రాముఖ్యత మార్కర్‌లు కనిపించవు.
  • Gmailలో: సబ్జెక్ట్ ఫీల్డ్‌లో మెసేజ్ ప్రాముఖ్యతను హైలైట్ చేయండి.

ఎలాగో తెలుసుకోండి
  1. Gmail‌ను తెరవండి.
  2. Compose‌ను క్లిక్ చేయండి.
  3. స్వీకర్తలను జోడించండి.
  4. సబ్జెక్ట్ ఫీల్డ్‌లో, కింద పేర్కొన్న విధంగా డిస్క్రిప్టర్‌ను జోడించండి:
    • [అత్యవసరం]
    • [డిసెంబర్ 1లోగా రిప్లయి ఇవ్వండి]
    • [ఆమోదం అవసరం]
      గమనిక: మీరు పంపే ఈమెయిల్స్‌ను ముఖ్యమైనవిగా గుర్తించడానికి డిస్క్రిప్టర్‌కు ముందు, మీరు ఎరుపు ఆశ్చర్యార్థకం పాయింట్ ‌ను అతికించవచ్చు.
  5. మీ మెసేజ్‌ను టైప్ చేసి, పంపండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఫాలో-అప్ కోసం మీరు అందుకున్న ఈమెయిల్‌ను మార్క్ చేయండి


  • Outlookలో: మీరు స్వీకరించే ముఖ్యమైన మెసేజ్‌లను ట్రాక్ చేయడానికి ఫ్లాగ్‌లను ఉపయోగించండి.
  • Gmailలో: మీరు స్వీకరించే మెసేజ్‌లను ముఖ్యమైనవిగా నక్షత్రం గుర్తు పెట్టండి, తాత్కాలికంగా వాయిదా వేయండి లేదా మార్క్ చేయండి.

ఎలాగో తెలుసుకోండి

ఈమెయిల్‌ను ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి స్టార్ గుర్తు ఉంచండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmail తెరవండి.
  2. మీ ఇన్‌బాక్స్ నుండి, సందేశం ఎడమవైపుకి వెళ్లి, తర్వాత నక్షత్రం ఉంచు క్లిక్ చేయండి. సందేశం తెరవబడి ఉన్నట్లయితే, మరిన్ని ఆ తర్వాత నక్షత్రాన్ని జోడించు క్లిక్ చేయండి.
  3. మీరు అనేక స్టార్స్‌ను కలిగి ఉన్నట్లయితే, మీరు ఉపయోగించాలనుకుంటున్న దానిని చూసేంత వరకు స్టార్ చిహ్నాన్ని క్లిక్ చేయడం కొనసాగించండి.

మీరు స్టార్ గుర్తు ఉంచిన ఈమెయిల్‌ను చూడండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmail తెరవండి.
  2. పేజీకి ఎడమవైపున,  నక్షత్రం ఉంచబడినవి క్లిక్ చేయండి. ముందుగా మీరు మరిన్ని అనే ఆప్షన్‌ను క్లిక్ చేయవలసి ఉంటుంది.

చిట్కా: స్టార్ ఉన్న మెసేజ్‌లను కనుగొనడానికి, మీరు Gmailలో సెర్చ్ ఆపరేటర్‌లను కూడా ఉపయోగించవచ్చు.

  • స్టార్ ఉంచిన మెసేజ్‌లన్నింటినీ కనుగొనడానికి, is:starred‌ను ఎంటర్ చేయండి.
  • ఏదైనా ప్రత్యేక స్టార్ గుర్తుతో ఉన్న మెసేజ్‌లను కనుగొనడానికి, has: అని ఎంటర్ చేసి, దాని పక్కన స్టార్ పేరును ఉంచాలి. ఈ పేర్లు ప్రస్తుతం వినియోగంలో ఉన్న మీ స్టార్ ఆప్షన్‌ల ఆధారంగా ఉంటాయి:
    • has:yellow-star
    • has:orange-star
    • has:red-star
    • has:purple-star
    • has:blue-star
    • has:green-star
    • has:red-bang
    • has:orange-guillemet
    • has:yellow-bang
    • has:green-check
    • has:blue-info
    • has:purple-question

తర్వాత వరకు ఈమెయిల్‌ను తాత్కాలికంగా వాయిదా వేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmail వెళ్లండి. 
  2. ఇమెయిల్‌కు సూచించండి.
  3. కుడివైపు, తాత్కాలికంగా ఆపివేయి క్లిక్ చేయండి .
  4. ఇమెయిల్‌ను పొందడానికి తర్వాత రోజు మరియు సమయాన్ని ఎంచుకోండి.

అనేక సందేశాలను తాత్కాలికంగా ఆపివేయడానికి, సందేశాలను ఎంచుకోండి. ఎగువన ఉన్న, తాత్కాలికంగా వాయిదా వేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: ఒకే సమయంలో మల్టిఫుల్ మెసేజ్‌లకు లేబుల్‌ను వర్తింపజేయడానికి, మెసేజ్‌లకు ఎడమ వైపున ఉన్న పెట్టెలను చెక్ చేసి, ఆపై ఇన్‌బాక్స్ పైన ఉన్న లేబుల్‌ను ఎంచుకోండి.

 Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి

అటాచ్‌మెంట్‌లను సేవ్ చేయండి 


  • Outlookలో: మీ కంప్యూటర్‌కు అటాచ్‌మెంట్‌లను సేవ్ చేయండి.
  • Gmailలో: Google Driveకు అటాచ్‌మెంట్‌లను అప్‌లోడ్ చేయండి.

ఎలాగో తెలుసుకోండి

అటాచ్‌మెంట్‌లను సేవ్ చేయండి

ముఖ్య గమనిక: మీరు Google Driveకు నిర్దిష్ట అటాచ్‌మెంట్‌లను జోడించలేరు. మీరు Driveలో స్టోర్ చేయగల ఫైళ్ల గురించి తెలుసుకోండి.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. మెసేజ్‌ను తెరవండి.
  3. మెసేజ్ కింద, అటాచ్‌మెంట్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  4. Driveకు జోడించండి ని క్లిక్ చేయండి.

Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి

అవసరం లేని ఈమెయిల్‌ను తీసివేయండి 


అవసరం లేని థ్రెడ్‌లను చూపవద్దు

మీరు ఈమెయిల్‌ను స్వీకరించి, సంభాషణలో మరిన్ని ఈమెయిల్స్‌ను చూడకూడదు అని నిర్ణయించుకోవచ్చు. అప్పుడు రిప్లయిలు ఆటోమేటిక్‌గా ఇన్‌బాక్స్‌ను దాటవేసి, నేరుగా ఆర్కైవ్‌కు వెళ్లడానికి మీరు సంభాషణను మ్యూట్ చేయవచ్చు.

  • Outlookలో: సంభాషణలను విస్మరించండి.
  • Gmailలో: సంభాషణలను మ్యూట్ చేయండి. 

ఎలాగో తెలుసుకోండి

ఈమెయిల్ థ్రెడ్‌లను మ్యూట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకి వెళ్లండి.
  2. సంభాషణను తెరవండి లేదా ఎంచుకోండి.
  3. ఎగువన, మరిన్ని మరిన్నిఆ తర్వాత మ్యూట్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.

చిట్కా: మరింత వేగంగా మ్యూట్ చేసేందుకు, కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఆన్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

స్పామ్ తీసివేయండి

  • Outlookలో: ఈమెయిల్‌ను జంక్‌గా మార్క్ చేయండి, అలాగే జంక్ ఈమెయిల్ కోసం సెట్టింగ్‌లను ఎంచుకోండి.
  • Gmailలో: మెసేజ్‌లను స్పామ్‌గా రిపోర్ట్ చేయండి, మెసేజ్‌లను స్పామ్ ఫోల్డర్‌కు తరలించి, పంపిన వారిని బ్లాక్ చేయండి.

ఎలాగో తెలుసుకోండి

స్పామ్‌గా రిపోర్ట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailని తెరవండి.
  2. ఒకటి లేదా మరిన్ని ఇమెయిల్‌లను ఎంచుకోండి.
  3. స్పామ్‌ను నివేదించు క్లిక్ చేయండి.

పంపిన వారిని బ్లాక్ చేయండి 

ఎవరైనా పంపే వారిని మీరు బ్లాక్ చేసినప్పుడు, వారు మీకు పంపే మెసేజ్‌లు స్పామ్‌కు వెళతాయి.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. మెసేజ్‌ను తెరవండి.
  3. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఎంపికను క్లిక్ చేయండి.
  4. [sender]ని బ్లాక్ చేయి క్లిక్ చేయండి.

చిట్కా: మీరు ఎవరినైనా పొరపాటున బ్లాక్ చేసినట్లయితే, అవే దశలను ఉంపయోగించి మీరు వారిని అన్‌బ్లాక్ చేయవచ్చు.

Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి

ఈమెయిల్‌ను ఆర్కైవ్ చేయండి


  • Outlookలో: క్రమానుగతంగా, మీ ఇన్‌బాక్స్ నుండి Outlook ఆర్కైవ్ ఫైల్‌కి మెసేజ్‌లను తరలించడానికి నియమాలను సెటప్ చేయండి.
  • Gmailలో: మెసేజ్‌లను ఆర్కైవ్ చేయండి, లేదా ఆర్కైవ్‌కు మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా తరలించడానికి ఫిల్టర్‌లను సెటప్ చేయండి. రెగ్యులర్ వ్యవధులలో రన్ చేయడానికి నియమాలను షెడ్యూల్ చేయవలసిన అవసరం లేదు. మీరు మెసేజ్‌లను ఆర్కైవ్ చేసిన తర్వాత, మీరు వాటిని ఇంకా అన్ని మెయిల్స్ అనే లేబుల్ కింద కనుగొంటారు.

ఎలాగో తెలుసుకోండి

 ఈమెయిల్‌ను ఆర్కైవ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. మీరు ఆర్కైవ్ చేయాలనుకుంటున్న మెసేజ్‌ను తెరవండి.
  3. ఎగువున, ఆర్కైవ్ చేయండి ని క్లిక్ చేయండి.

చిట్కాలు:

మల్టిపుల్ మెసేజ్‌లను ఆర్కైవ్ చేయండి

  1. మెసేజ్‌లకు ఎడమ వైపున ఉన్న బాక్స్‌లను చెక్ చేయండి.
  2. మీ ఇన్‌బాక్స్ ఎగువ భాగంలో ఉన్న, ఆర్కైవ్ చేయండి Archiveని క్లిక్ చేయండి.

ఆర్కైవ్ అయిన ఈమెయిల్‌ను కనుగొనండి

ముఖ్య గమనిక: మీరు Gmailలో సెర్చ్ చేసినప్పుడు, మీ ఫలితాలలో ఆర్కైవ్ చేయబడిన మెసేజ్‌లు ఉంటాయి. Gmailలో సెర్చ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎడమవైపు, మరిన్ని ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. అన్ని మెయిల్స్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
గమనిక: మీకు అన్ని మెయిల్స్ లేదా ట్రాష్ కనిపించకపోతే, ఎడమ సైడ్‌బార్ కింది వైపుకు స్క్రోల్ చేసి, మరిన్ని అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ ఆర్కైవ్ నుండి మెసేజ్‌ను తిరిగి పొందండి

  1. అన్ని మెయిల్స్ విభాగానికి వెళ్లండి.
  2. మెసేజ్‌ను కుడి క్లిక్ చేయండి, తర్వాత ఇన్‌బాక్స్‌కు తరలించండి లేదా ఈ విధంగా లేబుల్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 

ఈమెయిల్‌ను తొలగించండి


  • Outlookలో: మెసేజ్‌లను తొలగించిన ఐటెమ్‌ల ఫోల్డర్‌కు తరలించి, మెయిల్‌బాక్స్ క్లీనప్‌ను ఉపయోగించండి.
  • Gmailలో: మెసేజ్‌లను ట్రాష్‌కు తరలించండి. ట్రాష్ చేసిన మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా 30 రోజుల తర్వాత తొలగించబడతాయి. 

ఎలాగో తెలుసుకోండి

ఈమెయిల్‌ను తొలగించండి 

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. మీరు తొలగించాలనుకుంటున్న ప్రతి సందేశం ఎడమవైపు, బాక్స్‌ను ఎంచుకోండి.
  3. ఎగువన, తొలగించు క్లిక్ చేయండి.

గమనిక: మీకు అన్ని మెయిల్స్ లేదా ట్రాష్ కనిపించకపోతే, ఎడమ సైడ్‌బార్ కింది వైపుకు స్క్రోల్ చేసి, మరిన్ని అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మల్టిపుల్ మెసేజ్‌లను తొలగించండి

  1. మెసేజ్‌లకు ఎడమ వైపున ఉన్న బాక్స్‌లను చెక్ చేయండి.
  2. మీ ఇన్‌బాక్స్ ఎగువ భాగంలో ఉన్న, తొలగించండి తొలగించు ని క్లిక్ చేయండి.

మీ ట్రాష్ నుండి మెసేజ్‌ను తరలించండి లేదా దానిని శాశ్వతంగా తొలగించండి

  1. ట్రాష్‌కు వెళ్లండి.
  2. మెసేజ్‌ను కుడి క్లిక్ చేయండి, తర్వాత ఇన్‌బాక్స్‌కు తరలించండి లేదా శాశ్వతంగా తొలగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సంబంధిత టాపిక్‌లు


Google, Google Workspace, and related marks and logos are trademarks of Google LLC. All other company and product names are trademarks of the companies with which they are associated.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2652251537807180282
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false