Googleలో మీ ఫ్యామిలీని మేనేజ్ చేయండి

ఫ్యామిలీ మేనేజర్‌గా, మీ ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడానికి 5 గురు వ్యక్తుల దాకా మీరు ఆహ్వానించవచ్చు. మీ ఫ్యామిలీ గ్రూప్‌లోని వ్యక్తులను తీసివేయడం, లేదా ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించడం కూడా మీరు చేయవచ్చు.

ఫ్యామిలీ మెంబర్‌లను జోడించండి

మీరు కింద పేర్కొన్న అర్హతలు ఉన్న ఫ్యామిలీ మెంబర్‌లను జోడించవచ్చు:

  • మీరు నివసిస్తున్న దేశంలోనే నివసిస్తున్న వారిని జోడించవచ్చు.
  • కనీసం 13 సంవత్సరాలు (లేదా మీ దేశంలో వయోపరిమితి ప్రకారం) ఉన్న వారిని జోడించవచ్చు. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను, వారి Gmail ఖాతాను ఫ్యామిలీ మేనేజర్ క్రియేట్ చేసినట్లయితే మాత్రమే జోడించడానికి వీలు పడుతుంది.
చిట్కా: ఎవరైనా మీ ఫ్యామిలీ గ్రూప్‌లో చేరినప్పుడు, మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది.
Play Store యాప్
  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత ఫ్యామిలీ ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఫ్యామిలీ మెంబర్‌లను ఆహ్వానించండి ఆ తర్వాత పంపండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Family Link యాప్
ముఖ్యమైనది: Family Link లభ్యత కొన్ని దేశాలలో పరిమితంగా ఉండవచ్చు. Family Link యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Family Link Family Linkను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున ఉన్న, మెనూ Menu ఆ తర్వాత ఫ్యామిలీని మేనేజ్ చేయండి ఆ తర్వాత ఆహ్వానాలను పంపండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Google One యాప్

ఫ్యామిలీ గ్రూప్‌లో ఉండే ఏ మెంబర్ అయినా Google One మెంబర్‌షిప్‌ను కొనుగోలు చేసి, దాన్ని గరిష్ఠంగా 6 మెంబర్‌లు ఉన్న తమ ఫ్యామిలీతో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా షేర్ చేయవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google One యాప్ Google Oneను తెరవండి.
  2. ఎగువున ఉన్న, మెనూ ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఫ్యామిలీ సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. Google Oneను మీ ఫ్యామిలీతో షేర్ చేయండి అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి. నిర్ధారించుకోవడానికి, తర్వాతి స్క్రీన్‌లో, షేర్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. ఫ్యామిలీ గ్రూప్‌ను మేనేజ్ చేయండి ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్‌లను ఆహ్వానించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. సెటప్‌ను పూర్తి చేయడానికి సూచనలను ఫాలో అవ్వండి.
Google Assistant యాప్
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, "Ok Google, Assistant సెట్టింగ్‌లను తెరువు" అని చెప్పండి లేదా Assistant సెట్టింగ్‌లకు వెళ్లండి.
  2. మీరు ఆ తర్వాత మీ వ్యక్తులు ఆ తర్వాత వ్యక్తిని జోడించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు జోడించాలనుకుంటున్న కాంటాక్ట్‌ను ఎంచుకోండి.
  4. ఫ్యామిలీ గ్రూప్‌ను ఆన్ చేయండి.
  5. వారి ఈమెయిల్ అడ్రస్‌ను నిర్ధారించి, ఈ ఈమెయిల్‌ను ఉపయోగించండి ఆ తర్వాత సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి ఎవరైనా ఒకరిని తీసివేయండి

మీరు ఫ్యామిలీ మేనేజర్ అయితే, మీరు పలు మార్గాల్లో మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి వ్యక్తులను తీసివేయవచ్చు.
మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి మీరు ఎవరైనా ఒకరిని తీసివేసినప్పుడు ఏమి జరుగుతుంది
  • మీరు మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి తీసివేసిన వ్యక్తి:
    • వారి Google ఖాతాను, ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌తో కొనుగోలు చేయబడిన వారి పరికరంలోని ఏదైనా కంటెంట్‌ను కలిగి ఉంటారు.
    • ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌తో కొత్త కొనుగోళ్లు చేయలేరు, లేదా మీ ఫ్యామిలీ గ్రూప్ షేర్ చేసే ఏవైనా సర్వీస్‌లను యాక్సెస్ చేయలేరు.
    • వారిని తీసివేసినప్పుడు వారు ఈమెయిల్ అలర్ట్‌ను అందుకుంటారు.
    • మీ ఫ్యామిలీ లైబ్రరీలో దేనికైనా యాక్సెస్‌ను కోల్పోతారు.
    • మీ ఫ్యామిలీ, Google One మెంబర్‌షిప్‌ను షేర్ చేస్తే, మీ షేర్ చేసిన స్టోరేజ్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు. 
    • అదనపు మెంబర్ ప్రయోజనాలకు, అలాగే Google నిపుణులకు యాక్సెస్‌ను కోల్పోతారు.
  • ఒకవేళ మీరు తీసివేసిన వ్యక్తి ఈ విధంగా చేస్తే:
    • ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌తో కొనుగోలు చేసి, అది ఇప్పటికే ప్రాసెస్‌లో ఉంటే: మీకు ఇప్పటికీ ఛార్జీ విధించబడుతుంది, కానీ మీరు అవసరం లేకపోయినా లేదా అనుకోకుండా చేసిన కొనుగోళ్లకు సంబంధించిన రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
    • ఫ్యామిలీ లైబ్రరీకి కంటెంట్‌ను జోడిస్తే: మీరు Google Play ఫ్యామిలీ లైబ్రరీని సెటప్ చేస్తే, వారు జోడించిన ఏదైనా కంటెంట్ తీసివేయబడుతుంది, అలాగే ఇతర ఫ్యామిలీ మెంబర్‌లు ఆ కంటెంట్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు.
    • 13 సంవత్సరాలు (లేదా మీ దేశంలో వయోపరిమితి ప్రకారం) లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండి, మీరు, మీ చిన్నారి, Family Linkతో వారి ఖాతాను మేనేజ్ చేయడానికి ఎంచుకోబడితే: మీరు వారిని ఫ్యామిలీ గ్రూప్ నుండి తీసివేసినప్పుడు వారి Google ఖాతా, ఏవైనా పరికరాలు ఇకపై పర్యవేక్షించబడవు.
మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి పర్యవేక్షించబడే చిన్నారిని తీసివేయండి

ఫ్యామిలీ గ్రూప్ నుండి పర్యవేక్షించబడే చిన్నారిని తీసివేయడానికి: 

మొబైల్ లేదా వెబ్ బ్రౌజర్

పర్యవేక్షించబడే చిన్నారిని తీసివేయండి

  1. g.co/YourFamily అనే లింక్‌కు వెళ్లండి.
  2. మీరు తీసివేయాలనుకుంటున్న చిన్నారిని ఎంచుకోండి.
  3. ఖాతా సమాచారం ఆ తర్వాత మెంబర్‌ను తీసివేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • మీరు మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి రావచ్చు.
  4. తీసివేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఇతర ఫ్యామిలీ మెంబర్‌లను తీసివేయండి 

  1. g.co/YourFamily అనే లింక్‌కు వెళ్లండి.
  2. మీరు తీసివేయాలనుకుంటున్న ఫ్యామిలీ మెంబర్‌ను ఎంచుకోండి.
  3. మెంబర్‌ను తీసివేయండి ఆ తర్వాత తీసివేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
Play Store యాప్
  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్‌లను చూడండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ ఫ్యామిలీ మెంబర్ పేరును ట్యాప్ చేయండి.
  5. ఎగువున కుడివైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత మెంబర్‌ను తీసివేయండి ఆ తర్వాత తీసివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Family Link యాప్
ముఖ్యమైనది: Family Link లభ్యత కొన్ని దేశాలలో పరిమితంగా ఉండవచ్చు. Family Link యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Family Link యాప్ Family Linkను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున ఉన్న, మెనూ Menu ఆ తర్వాత ఫ్యామిలీని మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు తీసివేయాలనుకుంటున్న ఫ్యామిలీ మెంబర్‌ను ట్యాప్ చేసి, ఆ తర్వాత మెంబర్‌ను తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Google One యాప్
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google One Google Oneను తెరవండి.
  2. ఎగువున ఉన్న, మెనూ ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఫ్యామిలీని మేనేజ్ చేయండి ఆ తర్వాత ఫ్యామిలీ గ్రూప్‌ను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు తీసివేయాలనుకుంటున్న ఫ్యామిలీ మెంబర్‌ను ట్యాప్ చేసి ఆ తర్వాత మెంబర్‌ను తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Google Assistant యాప్
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, "Ok Google, Assistant సెట్టింగ్‌లను తెరువు" అని చెప్పండి లేదా Assistant సెట్టింగ్‌లకు వెళ్లండి.
  2. మీరు ఆ తర్వాత మీ వ్యక్తులు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు తీసివేయాలనుకుంటున్న ఫ్యామిలీ మెంబర్‌ను ట్యాప్ చేయండి.
  4. ఫ్యామిలీ గ్రూప్‌ను ఆఫ్ చేయండి.
  5. దిగువున కుడి వైపున, సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

మీ ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించండి

మీరు ఫ్యామిలీ మేనేజర్ అయితే, మీరు మీ ఫ్యామిలీ గ్రూప్‌ను పలు మార్గాల్లో తొలగించవచ్చు.
మీరు మీ ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించినప్పుడు ఏమి జరుగుతుంది
ముఖ్య గమనిక: మీరు ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించిన తర్వాత, మీరు దాన్ని రీస్టోర్ చేయలేరు.
  • మీ ఫ్యామిలీ గ్రూప్‌లోని అందరూ వారి Google ఖాతాలను, అలాగే ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌తో కొనుగోలు చేసిన వారి పరికరంలోని ఏదైనా కంటెంట్‌ను కొనసాగిస్తారు.
  • మీ ఫ్యామిలీ మెంబర్‌లు ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌తో కొనుగోలు చేసి, అది ఇప్పటికే ప్రాసెస్‌లో ఉంటే, మీకు ఇప్పటికీ ఛార్జీ విధించబడుతుంది, కానీ మీరు అవసరం లేకపోయినా లేదా అనుకోకుండా చేసిన కొనుగోళ్లకు సంబంధించి రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • మీరు Google Play ఫ్యామిలీ లైబ్రరీని సెటప్ చేస్తే, మీ ఫ్యామిలీ గ్రూప్‌లోని అందరూ, ఇతర ఫ్యామిలీ మెంబర్‌లు జోడించిన ఫ్యామిలీ లైబ్రరీ కంటెంట్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు.
  • మీరు YouTube Music లేదా Google One వంటి ఫ్యామిలీ ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నట్లయితే, మీ ఫ్యామిలీ ఆ సర్వీస్‌కు యాక్సెస్‌ను కోల్పోతుంది.
  • మీ ఫ్యామిలీ Google One మెంబర్‌షిప్‌ను షేర్ చేస్తే, మీ ఫ్యామిలీ షేర్ చేయబడిన స్టోరేజ్‌కు యాక్సెస్‌ను కోల్పోతుంది. 
  • ఫ్యామిలీ మెంబర్ 13 సంవత్సరాలు (లేదా మీ దేశంలో వయోపరిమితి) లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండి, మీరు వారి ఖాతాను Family Linkతో మేనేజ్ చేయాలని ఎంచుకుంటే, మీరు వారిని ఫ్యామిలీ గ్రూప్ నుండి తీసివేసినప్పుడు వారి Google ఖాతా, అలాగే వారికి సంబంధించిన ఏవైనా పరికరాలు పర్యవేక్షించబడవు.
  • మీరు మీ ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగిస్తే, మీరు వచ్చే 12 నెలల్లో ఒకసారి మాత్రమే మరొక ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయగలరు లేదా అందులో చేరగలరు.
పర్యవేక్షించబడే చిన్నారితో కూడిన మీ ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించండి
మీరు పర్యవేక్షించబడే చిన్నారితో కూడిన ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించే ముందు, వారు 13 సంవత్సరాల కంటే తక్కువ (లేదా మీ దేశంలో వయోపరిమితి కంటే తక్కువ) వయస్సును కలిగి ఉండి, మీరు వారి కోసం Google ఖాతాను క్రియేట్ చేసినట్లయితే, మీరు వారి Google ఖాతాను తొలగించాలి.
మొబైల్ లేదా వెబ్ బ్రౌజర్
  1. g.co/YourFamily అనే లింక్‌కు వెళ్లండి.
  2. మెనూ Menu ఆ తర్వాత ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
Play Store యాప్
  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత ఫ్యామిలీ ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించండి ఆ తర్వాత తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Family Link యాప్
ముఖ్యమైనది: Family Link లభ్యత కొన్ని దేశాలలో పరిమితంగా ఉండవచ్చు. Family Link యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Family Link యాప్ Family Linkను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున ఉన్న, మెనూ Menu ఆ తర్వాత ఫ్యామిలీని మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించండి"లో, ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
  5. తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Google One యాప్
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google One Google Oneను తెరవండి.
  2. ఎగువున ఉన్న, మెనూ ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఫ్యామిలీ సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి ఆ తర్వాత ఫ్యామిలీ గ్రూప్‌ను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఫ్యామిలీ గ్రూప్‌ను తొలగించండి ఆ తర్వాత తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14412699423855195440
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false