మా అడ్వర్టయిజర్‌లు, యూజర్‌లు, ఇంకా పబ్లిషర్‌ల కోసం Google డిస్‌ప్లే, సెర్చ్ నెట్‌వర్క్‌లను సురక్షితంగా, స్పష్టంగా ఉంచడమే AdSense పాలసీ ఉద్దేశం. పాలసీలు, యాడ్‌ల ఎకో-సిస్టమ్‌లో వాటి పాత్ర మాకు ఎందుకు అవసరమో తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని చూడవచ్చు. AdSenseలో పాల్గొనే పబ్లిషర్‌లు అందరూ Googleతో సుదీర్ఘమైన, విజయవంతమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము. అది జరగడం కోసం, మీరుAdSense ప్రోగ్రామ్ పాలసీల గురించి బాగా తెలుసుకోవడం ముఖ్యం. మీ పేజీల సందర్శకులను తప్పుదారి పట్టించరాదని, పొరపాటు క్లిక్‌ల కోసం మోసపూరిత విధానాలకు పాల్పడకుండా ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోండి. మరిన్ని వివరాల కోసం, యాడ్ అమలు పాలసీలను చూడండి.
దీనికి వెళ్లండి:
- 1వ భాగం: యాడ్ అమలు
- 2వ భాగం: మొబైల్ సంబంధిత అంశాలు
- 3వ భాగం: ఆదాయాలలో డిడక్షన్‌లకు సంబంధించిన FAQలు
- 4వ భాగం: రివ్యూల కోసం రిక్వెస్ట్‌లు చేయడం, ఉల్లంఘనలను రిపోర్ట్ చేయడం
- 5వ భాగం: మరిన్ని రిసోర్స్‌లు
అన్నింటినీ విస్తరించండి | అన్నింటినీ కుదించండి
1వ భాగం: యాడ్ అమలు
ఫోల్డ్‌కు ఎగువున యూజర్‌లు చదవడానికి తగినంత కంటెంట్ ఉన్నంత వరకు, ఫోల్డ్‌కు ఎగువున యాడ్‌లను చూపడం అన్నది ఉల్లంఘనగా పరిగణించబడదు. కేవలం యాడ్‌లు మాత్రమే కనిపించే విధంగా మొత్తం కంటెంట్‌ను ఫోల్డ్‌కు దిగువున చూపించే పేజీ లేఅవుట్‌లను మేము అనుమతించబోము. ఇటువంటి వాటి అమలు కారణంగా యూజర్‌లు కంటెంట్‌కు, Google యాడ్‌లకు మధ్య తేడాలను కనుగొనడం కష్టం అవుతుంది.
మీరు యాడ్‌లను అమలు చేసేటప్పుడు, దయచేసి ఎల్లప్పుడూ మీ యూజర్‌ల గురించి ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఆ పేజీని మొదటిసారి సందర్శిస్తున్న యూజర్‌గా ఊహించుకోండి, మీరు ఆ యాడ్‌ల నుండి కంటెంట్‌ను వేరుగా చూడగలుగుతున్నారా అనే దానిని పరిగణనలోకి తీసుకోండి. మీ పేజీ డిజైన్‌కు మ్యాచ్ అయ్యే విధంగా మీరు సముచితమైన యాడ్ సైజ్, రంగు, బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకోవచ్చు, కానీ ఎప్పుడూ కూడా యాడ్‌లను ఎక్కడ ఉంచినా సరే, అవి పేజీలోని ఇతర కంటెంట్‌తో కలిసిపోయి ఉండేలా, కంటెంట్‌కు, యాడ్‌లకు మధ్య తేడాలు తెలుసుకోలేని పద్ధతిలో యాడ్‌లను ఫార్మాట్ చేయవద్దు. అలాగే, పొరపాటు క్లిక్‌లను నివారించడం కోసం, ఎల్లప్పుడూ యాడ్‌లకు కంటెంట్‌కు మధ్య తగిన దూరాన్ని పాటించండి.
పబ్లిషర్లు యూజర్‌లను ఏ విధంగానైనా తప్పుదారి పట్టించడాన్ని మేము అంగీకరించబోము. యాడ్‌ల పైన "స్పాన్సర్ చేసిన లింక్‌లు" లేదా "అడ్వర్టయిజ్‌మెంట్‌లు" అన్న లేబుల్స్‌ను మాత్రమే ఉంచడానికి మేము అనుమతిస్తాము.
"డౌన్‌లోడ్" బటన్ కింద యాడ్‌లను ఉంచినట్లయితే, యూజర్‌లు ఆ యాడ్‌లను పొరపాటుగా డౌన్‌లోడ్ లింక్‌లుగా భావించవచ్చు. కనుక దయచేసి ఎల్లప్పుడూ మీ యాడ్‌లను "డౌన్‌లోడ్" లింక్‌లకు దూరంగా ఉంచండి, అలాగే “డౌన్‌లోడ్” బటన్‌లు స్పష్టంగా కనిపించేలా చేయండి.
అవును, అది మా పాలసీలను ఉల్లంఘిస్తుంది. ముందుగా, మీరు మరో పేజీలోని ఫ్రేమ్‌లో యాడ్‌లను ఉంచడానికి అనుమతి లేదు. రెండవది, మీ సాఫ్ట్‌వేర్‌లో యాడ్‌లను ఉంచడానికి మీకు అనుమతి లేదు. ఉదాహరణకు, మీరు యాడ్‌లను కలిగిన పేజీ, అదే విధంగా ఆ పేజీని లోడ్ చేసే యాప్ రెండింటినీ కంట్రోల్ చేస్తే, మేము దానిపై చర్య తీసుకుంటాము
2వ భాగం: మొబైల్ సంబంధిత అంశాలు
యాప్‌ల కోసం టెక్నికల్ అవసరాలలో వివరించిన సపోర్ట్ ఉన్న వెబ్ కంటెంట్ వీక్షణ ఫ్రేమ్‌లో, అన్ని ఇతర సందర్భోచితమైన పాలసీలలో వివరించిన, సపోర్ట్ ఉన్న వెబ్ కంటెంట్ వీక్షణ ఫ్రేమ్ ఆప్షన్‌లలో ఒక దాన్ని మీరు ఫాలో అయినట్లయితే, మీరు మీ యాప్‌లోని AdSense యాడ్‌లతో మానిటైజ్ చేయవచ్చు. AdMob పాలసీ గురించి మరిన్ని వివరాల కోసం, AdMob సహాయ కేంద్రాన్ని చూడండి.
3వ భాగం: ఆదాయాలలో డిడక్షన్‌లకు సంబంధించిన FAQలు
అనేక కారణాల వల్ల మీ నికర ఆదాయాలలో డిడక్షన్‌లు ఉండవచ్చు. Google మీ ఖాతాలో చెల్లని క్లిక్ యాక్టివిటీ లేదా AdSense పాలసీకి అనుగుణంగా లేని యాడ్ అమలు ప్రక్రియలను గుర్తించినప్పుడు మీ ఆదాయాలను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. మరింత తెలుసుకోవడం కోసం, మీరు పాలసీ, ట్రాఫిక్ క్వాలిటీ గైడ్‌లైన్స్‌ను చూడాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము.
4వ భాగం: రివ్యూల కోసం రిక్వెస్ట్‌లు చేయడం, ఉల్లంఘనలను రిపోర్ట్ చేయడం
మేము అందించిన ఉదాహరణ పేజీ నుండి మీరు ఉల్లంఘనను తీసివేసినప్పటికీ, మీ సైట్ మొత్తం మీద ఇటువంటి ఉల్లంఘనలు మరికొన్ని ఉండవచ్చు. మేము నోటిఫికేషన్ ఈమెయిల్‌లో అందించే URL కేవలం ఒక ఉదాహరణ అని, ఈ సైట్‌లోని ఇతర పేజీల్లో కూడా అలాంటి ఉల్లంఘనలు జరిగి ఉండవచ్చని గుర్తుంచుకోండి. మీ సైట్ అంతటినీ సంపూర్ణంగా రివ్యూ చేసి, అది మా పాలసీలను తప్పకుండా పాటిస్తున్నదని నిర్ధారించుకోవాల్సిందిగా మేము మీకు సిఫార్సు చేస్తున్నాము. మీరు మీ సైట్‌లో అన్ని ఉల్లంఘనలను పరిష్కరించిన తర్వాత, మీరు మీ AdSense ఖాతాలోని లేదా సహాయ కేంద్రంలోని పాలసీ కేంద్రం ద్వారా రివ్యూను రిక్వెస్ట్ చేయవచ్చు.
మీ పేజీ లేదా సైట్‌లోని సాధారణ సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడటానికి మీరు పరిష్కార సాధనాన్ని చూపని యాడ్‌లను ఉపయోగించవచ్చు.
మీకు హెచ్చరిక అందినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. మీ మొత్తం సైట్ నుండి అన్ని ఉల్లంఘనలను తీసివేయడం ద్వారా మీరు హెచ్చరికకు సంబంధించిన చర్య తీసుకోవాలి. మీ పేజీ లేదా సైట్‌లో యాడ్‌లు నిలిపివేయబడినట్లయితే, రివ్యూ రిక్వెస్ట్ ఫారమ్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు మమ్మల్ని సంప్రదించడం కంటే ముందు, దయచేసి ముందుగా సమస్యను పరిష్కరించండి. ప్రస్తుత ఉల్లంఘన గురించి అర్థం చేసుకోవడం కోసం మీరు మా సహాయ కేంద్రంలో సంబంధిత పాలసీలను చదవాల్సిందిగా మేము గట్టిగా సిఫార్సు చేస్తున్నాము. రివ్యూను రిక్వెస్ట్ చేయడానికి, ఉల్లంఘన రివ్యూ రిక్వెస్ట్ పరిష్కార సాధనం లింక్‌ను ఉపయోగించండి, ఆపై సరైన రివ్యూ రిక్వెస్ట్ ఫారమ్‌ను కనుగొనడానికి దశలను అనుసరించండి.
మీకు తెలుసు కదా, ప్రోగ్రామ్ పాలసీ అనుకూలతకు సంబంధించిన సమస్యలను Google చాలా కఠినంగా పరిగణిస్తుంది. మా పబ్లిషర్లు, వారి పేజీ సందర్శకులు, మా అడ్వర్టయిజర్‌లకు సానుకూల అనుభవాన్ని అందించడంలో సహాయపడటం కోసం మా ప్రోగ్రామ్ పాలసీలు రూపొందించబడ్డాయి. కనుక, సాధారణంగా మా నిర్ణయాలే అంతిమం.
ఈ నిర్ణయం తప్పుగా తీసుకోబడిందని మీరు భావిస్తే; మీరు లేదా మీరు బాధ్యత వహించే వ్యక్తుల చర్యలు లేదా అశ్రద్ధ కారణంగా ఈ పాలసీ ఉల్లంఘనలు జరగలేదని మీకు సద్భావన ఉన్నట్లయితే; మీ ఖాతాను డిజేబుల్ చేయడాన్ని మీరు అప్పీల్ చేయవచ్చు. అందుకోసం, మా పాలసీ ఉల్లంఘన అప్పీల్—ఖాతా డిజేబుల్ చేయబడింది ఫారమ్ ద్వారా మాత్రమే మమ్మల్ని సంప్రదించండి.
మా నిపుణులు అందుబాటులోకి వచ్చిన వెంటనే మేము మీ రిక్వెస్ట్‌ను రివ్యూ చేస్తాము. అయితే, ప్రోగ్రామ్ పాలసీల ఉల్లంఘన కారణంగా ఖాతాను డిజేబుల్ చేసే హక్కు మాకు ఉందని, మీ ఖాతా తప్పక పునరుద్ధరించబడుతుందని మేము హామీ ఇవ్వలేమని గుర్తుంచుకోండి.
గమనించండి, మీరు మీ ఖాతా కోసం ఒక అప్పీల్‌ని మాత్రమే సమర్పించగలరు. అదనపు సమర్పణలు రివ్యూ చేయబడవు.
మా పబ్లిషర్లందరూ మా ప్రోగ్రామ్ పాలసీలను పాటించేలా చేయడం ద్వారా AdSense క్వాలిటీని, ప్రతిష్ఠను కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ ప్రమాణాలను కలిగి ఉండటంలో సహాయపడినందుకు మీకు ధన్యవాదాలు. పాలసీ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఏదైనా పేజీ లేదా సైట్‌ని మీరు గమనించినట్లయితే, యాడ్‌లలో ఉన్న "యాడ్‌లు Google ద్వారా అందించబడ్డాయి" లేదా "యాడ్‌ల ఎంపిక" లేబుల్‌ని క్లిక్ చేయడం ద్వారా దానిని మాకు రిపోర్ట్ చేయండి. మా నిపుణులు దానిని రివ్యూ చేసి, సరైన చర్య తీసుకుంటారు.
మీ సైట్ సోర్స్ కోడ్ నుండి యాడ్ కోడ్‌ని తొలగించడం ద్వారా మీరు మీ సైట్ నుండి యాడ్‌లను తీసివేయవచ్చు. అంతేకాకుండా, అనధికారిక వ్యక్తులు మీ వెబ్‌సైట్ సోర్స్ కోడ్‌ని యాక్సెస్ చేయలేరని నిర్ధారించుకోవడం కోసం మీ సైట్ సెక్యూరిటీని రివ్యూ చేయాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. మరింత సమాచారం కోసం, ఇక్కడ చూడండి: హ్యాకింగ్ లేదా హ్యాక్ అయిన కంటెంట్ అంటే ఏమిటి?
5వ భాగం: మరిన్ని రిసోర్స్‌లు
AdSense పాలసీలు, అలాగే బెస్ట్ ప్రాక్టీసుల గురించి మరింత సమాచారం కనుగొనడానికి, AdSense బ్లాగ్, AdSense YouTube ఛానెల్ లింక్‌లను సందర్శించండి.