మీ YouTube ఆదాయాన్ని చెక్ చేయండి

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా, రష్యాలోని యూజర్లకు Google యాడ్‌లను, YouTube యాడ్‌లను అందించడాన్ని మేము తాత్కాలికంగా పాజ్ చేయనున్నాము. మరింత తెలుసుకోండి.

మేము YouTube Studio మొబైల్ యాప్‌లోని 'సంపాదించండి' ట్యాబ్‌లో పేమెంట్ వివరాలను అందించే కొత్త బీటా వెర్షన్‌ను పరిచయం చేస్తున్నాము. ఈ బీటా వెర్షన్ అర్హత గల క్రియేటర్‌లకు వారి ఆదాయాలు పేమెంట్‌లుగా ఎలా మారుతాయో అర్థం చేసుకోవడానికి సహాయపడే సులభమైన మార్గాన్ని అందిస్తుంది. ఈ బీటా వెర్షన్‌తో, మీరు కింద పేర్కొన్న వాటిని చూడవచ్చు:
  • మీ తర్వాతి పేమెంట్‌కు సంబంధించిన ప్రోగ్రెస్
  • తేదీ, పే చేసిన మొత్తం, పేమెంట్ బ్రేక్‌డౌన్‌తో సహా మీకు సంబంధించిన గత 12 నెలల పేమెంట్ హిస్టరీ
మా ఫోరమ్ పోస్ట్ లింక్‌లో మరింత తెలుసుకోండి.

మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉంటే, YouTube ఎనలిటిక్స్‌లోని 'ఆదాయం' ట్యాబ్ మీకు ఏ కంటెంట్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది, అలాగే ఏ ఆదాయ సోర్స్‌లు అత్యధిక లాభాన్ని ఇస్తున్నాయి అనే విషయాలను చూపిస్తుంది. YouTubeలో డబ్బును ఎలా సంపాదించాలో తెలుసుకోండి.

చిట్కా: మా మానిటైజేషన్ సోర్స్‌లు అభివృద్ధి చెందుతున్నందున, మీరు YouTube ఎనలిటిక్స్‌లో మరింత వివరణాత్మకమైన ఆదాయ విభజనలతో పాటు ఆదాయ ట్యాబ్‌కు చేసిన మార్పులను చూడవచ్చు. ఈ విభజనలు మల్టీ-ఫార్మాట్ క్రియేటర్‌లకు వారి ఆదాయ స్ట్రీమ్‌లను మరింత ఎక్కువగా పరిశీలించడానికి, అలాగే వారి బిజినెస్‌ను పెంచుకోవడానికి ఆప్టిమైజ్ చేయడంలో అవకాశాన్ని కల్పిస్తాయి. మరింత సమాచారం కోసం చదవండి.

గమనిక: YouTube ఎనలిటిక్స్‌లో ఆదాయం కనిపించడానికి 2 రోజులు పడుతుంది.

మీ ఆదాయ రిపోర్ట్‌లను చూడండి

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, ఎనలిటిక్స్ ను ఎంచుకోండి.
  3. ఎగువ మెనూలో, ఆదాయం ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీరు ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు

గత 6 నెలల్లో మీ ఛానెల్ ఎంత సంపాదించిందో ఈ రిపోర్ట్ మీకు నెలవారీగా విభజించి చూపుతుంది.

ఈ కింద పేర్కొన్న అంశాల కారణంగా మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది సర్దుబాట్లకు లోబడి ఉంటుంది:

మీ అంచనా ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటే, అది ఈ సర్దుబాట్ల వల్ల కావచ్చు. YouTube ఎనలిటిక్స్‌లో సంపాదించిన ఆదాయం చూపబడిన తర్వాత, ఈ సర్దుబాట్లు రెండు సార్లు జరుగుతాయి:

  • మొదటి సర్దుబాటు 1 వారం తర్వాత జరుగుతుంది, ఇది మరింత పూర్తి అంచనాను ఇస్తుంది.
  • రెండవ సర్దుబాటు తర్వాతి నెల మధ్యలో జరుగుతుంది, ఇది మీ తుది నికర ఆదాయాన్ని అందిస్తుంది.

మీరు డబ్బు సంపాదించే మార్గాలు

ఈ రిపోర్ట్ ప్రతి ఆదాయ సోర్స్ నుండి ఎంత అంచనా ఆదాయం వచ్చింది అనే దానికి సంబంధించి కేటగిరీలను తెలియజేస్తుంది. ఆదాయ సోర్స్‌ల ఉదాహరణలలో వీక్షణ పేజీ యాడ్‌లు, Shorts ఫీడ్ యాడ్‌లు, మెంబర్‌షిప్‌లు, Supers, కనెక్ట్ చేసిన స్టోర్‌లు, Shopping అనుబంధ సంస్థలు ఉంటాయి. ఆదాయ విభజనను కేటగిరీల వారీగా చూసేందుకు ఏదైనా ఒక సోర్స్‌ను మీరు ఎంచుకోవచ్చు.

కంటెంట్ పనితీరు

ఈ రిపోర్ట్ మీ వీడియోలు, షార్ట్‌లు, లైవ్ స్ట్రీమ్‌లు ఎంత సంపాదించాయి అనే విషయాన్ని చూపుతుంది. ఈ రిపోర్ట్‌లో ఒక్కో మైల్‌కు ఆదాయం (RPM) కూడా ఉంటుంది.

ఏ కంటెంట్ అత్యధిక అంచనా ఆదాయాన్ని సంపాదించిందో ఈ రిపోర్ట్ మీకు చూపుతుంది, ఫార్మాట్ రకాల (వీడియోలు, షార్ట్‌లు, లైవ్ స్ట్రీమ్‌లు) ద్వారా విభజించబడింది.

మీ తుది నికర ఆదాయాన్ని చూడండి

తుది నికర ఆదాయం గురించి వివరాలు

  • మీ తుది నికర ఆదాయం మీ 'YouTube కోసం AdSense' ఖాతాలో మాత్రమే కనిపిస్తుంది.
  • 'YouTube కోసం AdSense'లోని తుది నికర ఆదాయం, YouTube ఎనలిటిక్స్‌లోని మీ అంచనా నికర ఆదాయం రెండూ వేర్వేరు కావచ్చు. ఉదాహరణకు, ట్యాక్స్ విత్‌హోల్డింగ్ ఏదైనా వర్తిస్తే, అది మీ తుది నికర ఆదాయంపై ప్రభావం చూపవచ్చు. ఏవైనా ట్యాక్స్‌లు విత్‌హోల్డ్ చేయబడితే, అవి మీ 'YouTube కోసం AdSense' ఖాతాలో కనిపిస్తాయి.
  • మునుపటి నెలకు సంబంధించిన తుది నికర ఆదాయం, ప్రతి నెలలో 7, 12 తేదీల మధ్య మీ ఖాతా బ్యాలెన్స్‌కు జోడించబడుతుంది.

'YouTube కోసం AdSense'లో మీ తుది నికర ఆదాయాన్ని చూడటానికి:

  1. మీ YouTube కోసం AdSense ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపున ఉన్న, YouTube కోసం AdSense అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీ YouTube నికర ఆదాయానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్, అలాగే మీ చివరి పేమెంట్ మొత్తం చూపబడుతుంది. మీరు YouTube-నిర్దిష్ట రిసోర్స్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు.

తెలుసుకోవాల్సిన కొలమానాలు

వీక్షణ పేజీ యాడ్ ఆదాయం ఎంచుకున్న తేదీల పరిధి, ప్రాంతానికి సంబంధించి YouTube కోసం AdSense, DoubleClick యాడ్‌లు, YouTube Premium నుండి పొందే అంచనా వేసిన ఆదాయం. ఈ సంఖ్యలో పార్ట్‌నర్ విక్రయ ప్రోగ్రామ్‌కు చెందిన యాడ్‌ల నుండి పొందిన ఆదాయం ఉండదు.
Shorts ఫీడ్ యాడ్ ఆదాయం ఎంచుకున్న తేదీల పరిధికి సంబంధించిన Shorts ఫీడ్‌ యాడ్స్, YouTube Premium నుండి వచ్చే అంచనా వేసిన ఆదాయం.
మెంబర్‌షిప్‌లపై వచ్చిన ఆదాయం ఎంచుకున్న తేదీల పరిధిలో మెంబర్‌షిప్‌లు, గిఫ్ట్ మెంబర్‌షిప్‌ల ద్వారా రాగల ఆదాయంపై అంచనా.
Supers ఆదాయం సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ వంటి Supers నుండి అంచనా వేయబడిన ఆదాయం.
Shopping అనుబంధ ఆదాయం మీ కంటెంట్‌లో కనిపించే ఇతర బ్రాండ్‌లకు సంబంధించిన ప్రోడక్ట్‌ల నుండి అంచనా వేసిన ఆదాయం.
మొత్తం సేల్స్ అనుబంధ రిటైలర్‌ల నుండి సంపాదించిన సేల్స్ అంచనా.
ఆర్డర్‌లు అనుబంధ రిటైలర్‌ల వద్ద బుక్ అయిన ఆర్డర్‌ల అంచనా.
ప్రోడక్ట్ క్లిక్‌లు ట్యాగ్ చేయబడిన ప్రోడక్ట్‌లపై వీక్షకులు చేసిన మొత్తం ప్రోడక్ట్ క్లిక్‌ల సంఖ్య.
టాప్ ప్రోడక్ట్‌లు ప్రోడక్ట్ క్లిక్‌ల ఆధారంగా ర్యాంక్ చేయబడిన మీ ప్రోడక్ట్‌లు.
అత్యధిక ఆదాయాన్ని సంపాదించి పెట్టే కంటెంట్ ఒక్కో ప్రోడక్ట్‌తో మీరు సంపాదించే ఆదాయాన్ని అంచనా వేసి, దాని ఆధారంగా ర్యాంక్ చేయబడిన ప్రోడక్ట్‌లు.
ప్రోడక్ట్‌ను ట్యాగ్ చేయడం ద్వారా వచ్చిన ఆదాయం ఎంచుకున్న తేదీల పరిధికి సంబంధించి YouTube Shopping Fund నుండి వచ్చే అంచనా వేయబడిన ఆదాయం.
YouTube Player for Education విద్యకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లలో వీక్షించబడుతున్న మీ కంటెంట్ నుండి అంచనా వేయబడిన ఆదాయం.
అంచనా ఆదాయం (రాబడి) ఎంచుకున్న తేదీల పరిధి, ప్రాంతానికి సంబంధించి YouTube ఆదాయ సోర్స్‌ల నుండి వచ్చే మీ మొత్తం అంచనా ఆదాయం (నికర ఆదాయం).
అంచనా వేయబడిన ఆదాయం (అనుబంధ రిటైలర్‌లు) పేమెంట్ చేయడానికి ఆమోదం ఇంకా లభించని, గతంలో జరిగిన సేల్స్ ద్వారా సంపాదించిన కమీషన్‌లు. పెండింగ్‌లో ఉన్న కమీషన్‌ల నుండి రిటర్న్ చేయబడిన ప్రోడక్ట్‌ల కమీషన్‌లను డిడక్ట్ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని లెక్కించడం జరుగుతుంది. సాధారణంగా, ప్రోడక్ట్‌లను రిటర్న్ చేయడానికి 30 నుండి 90 రోజుల వరకు సమయం ఉంటుంది.
ఆమోదించబడిన కమీషన్‌లు పేమెంట్ చేయడానికి ఆమోదం లభించిన, గతంలో జరిగిన సేల్స్ ద్వారా సంపాదించిన కమీషన్‌లు.

లావాదేవీలు

ఎంచుకున్న తేదీల పరిధి, ప్రాంతానికి సంబంధించి Supers నుండి జరిగిన లావాదేవీల సంఖ్య.

మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌ల అంచనా

వీక్షకులు మీ వీడియోను చూస్తున్న సమయంలో వారికి కనీసం ఒక్క యాడ్ ఇంప్రెషన్‌ను అయినా చూపినప్పుడు, అది మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌గా పరిగణించబడుతుంది. వీక్షకులు మీ వీడియోను చూడకుండానే ముందస్తు యాడ్ సమయంలో నిష్క్రమించినప్పుడు కూడా అది మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌గానే పరిగణించబడవచ్చు.

వీక్షణలు

మీ ఛానెల్స్ లేదా వీడియోలకు సంబంధించిన చట్టబద్ధమైన వీక్షణల సంఖ్య.

సగటు వీక్షణ వ్యవధి

ఎంచుకున్న తేదీల పరిధిలో సదరు వీడియోను, ఒక్కో వీక్షణలో సగటుగా ఎన్ని నిమిషాల పాటు వీక్షకులు చూశారో అంచనా వేసి తెలుపుతుంది.

వాచ్ టైమ్ (గంటలు)

వీక్షకులు మీ వీడియోను చూడటానికి కేటాయించిన సమయం.

అడ్వర్టయిజర్‌లు ఎంత పేమెంట్ చేస్తారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యాడ్‌లను చూపే 1,000 మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌లకు సంబంధించిన మీ ఆదాయం.
యాడ్ రకం ప్రకారం నికర ఆదాయం ఆదాయం అనేది యాడ్ రకాన్ని బట్టి విభజించబడి ఉంటుంది. వీటిలో స్కిప్ చేయదగిన వీడియో యాడ్‌లు, డిస్‌ప్లే యాడ్‌లు, బంపర్ యాడ్‌లు, స్కిప్ చేయదగని యాడ్‌లు మొదలైనవి ఉంటాయి.
మెంబర్‌షిప్ స్థాయిలు ఆదాయం అనేది నిపుణుల టయర్, వీరాభిమాని, VIP వంటి మెంబర్‌షిప్ స్థాయి ప్రకారం విభజించబడింది.
మొత్తం మెంబర్‌లు మొత్తం మెంబర్‌లు, యాక్టివ్‌గా ఉన్న మెంబర్‌లకు సంబంధించిన మీ ఆదాయం. మొత్తం మెంబర్‌ల నుండి రద్దు చేసిన మెంబర్‌లను తీసివేయడం ద్వారా యాక్టివ్ మెంబర్‌ల సంఖ్యను లెక్కించవచ్చు. కింద పేర్కొన్న మెంబర్‌లతో సహా మొత్తం మెంబర్‌ల కేటగిరీలను కనుగొనండి:
  • రిపీట్ అయ్యే మెంబర్‌షిప్‌లు ఉన్న మెంబర్‌లు
  • గిఫ్ట్ చేయబడిన మెంబర్‌షిప్‌లు ఉన్న మెంబర్‌లు (సమయ పరిమితి ఉన్న)
మెంబర్‌లు ఎక్కడి నుండి చేరుతున్నారు ఏ కంటెంట్ అత్యధిక మెంబర్‌షిప్‌లను తీసుకు వస్తుందో చెక్ చేయండి, అలాగే ఛానెల్ మెంబర్‌లకు “మెంబర్‌లకు మాత్రమే” బ్యాడ్జ్‌లను అందించండి.
మెంబర్‌షిప్‌ను రద్దు చేయడానికి కారణం మెంబర్‌షిప్‌లను రద్దు చేస్తున్నప్పుడు తగినంత మంది వీక్షకులు సర్వేకు ప్రతిస్పందిస్తే గణాంకాలను పొందండి.
Supers ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చు సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ ద్వారా విభజించబడిన ఆదాయం.
టాప్ ప్రోడక్ట్‌లు మీరు ప్రమోట్ చేసిన ప్రోడక్ట్‌లలో వేటికి ఎక్కువ క్లిక్‌లు వచ్చాయి.
కనెక్ట్ చేసిన స్టోర్‌కు సంబంధించిన ఇంప్రెషన్‌లు మీరు కనెక్ట్ చేసిన స్టోర్‌కు ఎన్ని ఇంప్రెషన్‌లు వచ్చాయి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14817786221197443977
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false