YouTube & YouTube TVలో NBA League Passను చూడండి

మీరు NBA అభిమాని అయితే, మీకు ఇష్టమైన గేమ్‌లన్నింటిని చూడటానికి మీరు NBA League Passను కొనుగోలు చేయవచ్చు. NBA League Passతో మీరు వీటిని చేయవచ్చు:

  • మార్కెట్ వెలుపల అందుబాటులో గల (మీ నివాస ప్రాంతం వెలుపల ఉన్న) సాధారణ సీజన్ NBA గేమ్‌లను చూడవచ్చు. 
  • మన ప్రాంతంలో జరిగే, బయట జరిగే గేమ్‌లు రెండింటికీ సంబంధించి మీ అభిమాన అనౌన్సర్‌ల నుండి గేమ్ కామెంటరీని వినండి.
  • YouTube TV యాప్‌లో ఆటోమేటిక్‌గా రికార్డ్ చేయడానికి మీకు ఇష్టమైన టీమ్‌లన్నింటిని సెటప్ చేయండి.
  • NBA League Pass పేజీలో షెడ్యూల్‌ను చూడండి లేదా మిస్ అయిన గేమ్‌లను చూడండి.
  • మల్టీ-వ్యూను, మల్టీ-ఫీడ్ ఎంపిక సాధనాన్ని ఉపయోగించి YouTube TVలో లేదా YouTubeలో హైలైట్‌లు చూడండి.
  • YouTube TV యాప్‌లో మీకు ఇష్టమైన టీమ్‌లన్నింటి గేమ్‌లను ఆటోమేటిక్‌గా రికార్డ్ చేసేలా సెటప్ చేయండి.

YouTube TVలో క్రీడలను ఎలా చూడాలి

గమనిక: NBA లీగ్ పాస్ జాతీయ ప్రసారాలను చూపదు. మీరు YouTube TV బేస్ మెంబర్‌షిప్‌లో చేర్చబడిన జాతీయ నెట్‌వర్క్‌లలో జాతీయంగా ప్రసారం చేయబడిన గేమ్‌లను చూడవచ్చు.

NBA లీగ్ పాస్‌ను పొందండి

NBA League Passను కొనుగోలు చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి: నెలవారీ పాస్‌ను లేదా సీజన్ పాస్‌ను కొనుగోలు చేయండి.

YouTubeలో సైన్ అప్ చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, youtube.com లింక్‌కు వెళ్లండి.
  2. మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. NBA ఛానెల్ పేజీకి వెళ్లి, ఆపై సైన్ అప్ చేయండి (లేదా దానిని ఉచితంగా ట్రై చేయండి) అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

YouTube TVలో సైన్ అప్ చేయడానికి:

  1. YouTube TVకి సైన్ ఇన్ చేయండి. 
  2. మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత సెట్టింగ్‌లు  ఆ తర్వాత మెంబర్‌షిప్ అనే ఆప్షన్‌కు వెళ్లండి. 

గమనిక:

  • నెలవారీ పాస్‌ను మీరు రద్దు చేసుకునే వరకు అది ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ అవుతూనే ఉంటుంది, అది మీ నెలవారీ YouTube బిల్లుకు జోడించబడుతుంది.
  • సీజన్ పాస్ ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ అవ్వదు. మీరు సీజన్ పాస్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీకు ప్రస్తుత సీజన్‌కు యాక్సెస్ ఉంటుంది. మీరు భవిష్యత్తు సీజన్‌ల కోసం వేరొక సీజన్ పాస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
  • నెలవారీ పాస్ నుండి సీజన్ పాస్‌కు మారడానికి, ముందుగా మీ నెలవారీ పాస్‌ను రద్దు చేసుకుని, ఆ తర్వాత సీజన్ రకానికి తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
  • మీరు NBA League Pass సీజన్ రకాన్ని కొనుగోలు చేసి, YouTube TVని రద్దు చేసుకుంటే, మీరు యాక్సెస్‌ను కోల్పోతారు. అయితే, మీరు ఏ సీజన్‌లో అయితే సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారో, అదే సీజన్ జరుగుతుండగా YouTube TVకి మీరు తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకుంటే, మీరు మళ్లీ యాక్సెస్‌ను పొందుతారు.

 

మల్టీ-వ్యూతో పలు స్ట్రీమ్‌లను ఒకేసారి చూడవచ్చు

ముందుగానే ఎంచుకున్న పలు లైవ్ గేమ్‌లను Chromecast లేదా Fire TV Stick వంటి స్మార్ట్ టీవీలో, లేదా స్ట్రీమింగ్ పరికరంలో ఒకేసారి చూసే వీలును మీకు YouTube మల్టీ-వ్యూ ఫీచర్ కల్పిస్తుంది. ఎంచుకున్న గేమ్‌ల కాంబినేషన్ కోసం మల్టీ-వ్యూను వేగవంతంగా కనుగోలు చేయగల మార్గాలు:

  1. గేమ్‌లలో ఒక దాన్ని చూడటాన్ని ప్రారంభించడం.
  2. మల్టీ-వ్యూ కాంబినేషన్‌లను చూడటానికి కిందికి నొక్కడం.
  3. మీ ప్రాధాన్య గేమ్ కాంబినేషన్‌ను ఎంచుకోవడం.

మన ప్రాంతపు వీడియో ఫీడ్, బయటి వీడియో ఫీడ్ మధ్య మారుతూ ఉండండి

వెబ్ బ్రౌజర్ లేదా మొబైల్ పరికరంలోని YouTube TVలో, NBA League Pass పేజీ‌కి వెళ్లి, గేమ్ పక్కన ఉన్న కింది వైపు బాణాన్ని ఎంచుకోండి. మన ప్రాంతంలోని లేదా బయటి గేమ్‌లకు సంబంధించిన కామెంటరీ ఆప్షన్‌లను ఎంచుకోవడానికి మీ టీవీలో, మరిన్ని అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

YouTube Primetime ఛానెల్‌లో, స్మార్ట్ టీవీలో లేదా Chromecast లేదా Fire TV Stick వంటి స్ట్రీమింగ్ పరికరంలో, (“ప్లేలిస్ట్” బటన్ పక్కన ఉన్న) వీక్షణ పేజీలో నేరుగా ప్రసారాల చిహ్నాన్ని ఎంచుకొని YouTubeలో మన ప్రాంతంలో జరిగే, బయట జరిగే గేమ్‌ల మధ్య మీరు మారవచ్చు.

YouTubeTV ప్రసార చిహ్నం లొకేషన్

NBA League Pass నుండి మరిన్ని ప్రయోజనాలను పొందండి

  • YouTube TVలో, NBA League Pass గేమ్‌లు ప్రారంభమవ్వడానికి 15 నిమిషాల ముందే మొదటి ట్యాబ్‌లో చూపబడతాయి, అలాగే ప్రసారం అవ్వడానికి 7 రోజుల ముందే లైవ్ ట్యాబ్‌లో చూపబడతాయి, కాబట్టి మీ రికార్డింగ్ ఆప్షన్‌లను మీరు సెట్ చేసుకుని, గేమ్ జరిగే రోజున వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. YouTube Primetime ఛానెల్‌లో, ఈవెంట్ ప్రారంభమయ్యే ఒక గంట ముందే NBA ఛానెల్‌లోని మీ మొదటి ట్యాబ్‌లో, ఇంకా లైవ్ ట్యాబ్‌లో గేమ్‌లు ఆటోమేటిక్‌గా చూపబడతాయి. 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11283563047076019705
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false