కంటెంట్ మేనేజర్ బాధ్యతలు, ఫీచర్ యాక్సెస్

ఈ ఫీచర్‌లు YouTube Studio కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించే పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. యాక్సెస్ పొందడానికి మీ YouTube పార్ట్‌నర్ మేనేజర్‌ను సంప్రదించండి.

మీరు YouTube పాలసీలను ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుంది

YouTube పాలసీలను అనుసరించడంలో విఫలమయ్యే కంటెంట్ మేనేజర్‌లు, సదరు పాలసీలను అశ్రద్ధతోనో, ఉద్దేశపూర్వకంగానో, లేదా హానికలిగించేందుకు, CMSను దుర్వినియోగం చేశారని YouTube కనుగొనడం జరిగితే, వారు అధికారిక హెచ్చరికలను స్వీకరించవచ్చు. అంతే కాకుండా, YouTube నియమాలు లేదా పాలసీలను ఉల్లంఘించే ఏదైనా హోస్ట్ చేసిన లేదా డెలివరీ చేయబడిన కంటెంట్‌ను YouTube తీసివేయవచ్చు. కొన్ని నిర్దిష్ట YouTube ప్రోగ్రామ్‌లు, అలాగే CMS ఫీచర్‌లకు మీ కంపెనీ అర్హతను అధికారిక హెచ్చరికలు ప్రభావితం చేయవచ్చు, కాబట్టి మీ సిస్టమ్‌లకు అనధికారిక యాక్సెస్‌ను నిరోధించడానికి, YouTubeకు సంబంధించిన అన్ని పాలసీలు, గైడ్‌లైన్స్, అవసరాలకు అనుగుణంగా మీరు తగిన అంతర్గత క్వాలిటీ కంట్రోల్స్‌ను కలిగి ఉండటం ముఖ్యం.

CMS ఫీచర్‌లకు యాక్సెస్ కోల్పోవడం

అధికారిక హెచ్చరికలతో పాటు, CMS ఫీచర్‌లను దుర్వినియోగం చేసే పార్ట్‌నర్‌లు ఆ ఫీచర్‌లకు లేదా సంబంధిత ఇతర ఫీచర్‌లకు యాక్సెస్ కోల్పోవచ్చు. సాధారణంగా ఇది తాత్కాలికం, కొంత నిర్దిష్ట సమయం వరకు ఉంటుంది. కంటెంట్ మేనేజ్‌మెంట్ ఎకో సిస్టమ్‌కు కలగబోయే హానిని నివారించడానికి మేము CMS ఫీచర్‌లకు మీ యాక్సెస్‌ను తాత్కాలికంగా పరిమితం చేసే అవకాశం కూడా ఉంది. ఫీచర్‌కు పార్ట్‌నర్ తిరిగి యాక్సెస్ పొందడానికి పట్టే సమయం అనేక ఫీచర్‌లపై ఆధారపడి ఉంటుంది, అవి ఏవంటే, ఉల్లంఘన తీవ్రత, ఇది సంభవించిన కారణం, పార్ట్‌నర్ బిజినెస్‌పై ప్రభావం, అలాగే పార్ట్‌నర్ ఉల్లంఘన హిస్టరీ మొదలైనవి. కొన్ని సందర్భాల్లో, నిర్దిష్ట ఫీచర్‌లను శాశ్వతంగా కోల్పోవడం సముచితమని మేము భావించవచ్చు. మీ పార్ట్‌నర్ మేనేజర్ నిర్దిష్ట వివరాలు, అలాగే తదుపరి దశల గురించిన సమాచారాన్ని కలిగి ఉంటారు. మీకు పార్ట్‌నర్ మేనేజర్ లేకపోతే, మరింత సమాచారం కోసం మీరు క్రియేటర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు.

కంటెంట్ మేనేజర్‌గా మీ బాధ్యతలు

YouTube కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMS) అనేది సక్రమంగా ఉపయోగించకపోతే YouTube ఎకో-సిస్టమ్‌కు హాని చేయగలిగే శక్తివంతమైన టూల్స్ సూట్. హోస్ట్ చేయబడిన, డెలివరీ చేయబడిన (ఛానెల్స్, ఆర్ట్ ట్రాక్‌లు, అస్సెట్‌ల మెటాడేటా, కంటెంట్ ID రెఫరెన్స్‌లు మొదలైనవి) కంటెంట్ మొత్తం మా సర్వీస్ నియమాలు, కమ్యూనిటీ గైడ్‌లైన్స్, మానిటైజేషన్ ఆవశ్యకతలు, అలాగే కంటెంట్ మేనేజర్ పాలసీలతో సహా, YouTube పాలసీలు, గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతున్నట్లు నిర్ధారించే బాధ్యత కంటెంట్ మేనేజర్‌పై ఉంటుంది.

పదే పదే, తీవ్రమైన ఉల్లంఘనలు

మేము ఈ పాలసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తాము. మా కంటెంట్ మేనేజర్ పాలసీలను పదే పదే లేదా తీవ్రంగా ఉల్లంఘించే పార్ట్‌నర్‌లు అత్యంత కఠిన చర్యలను ఎదుర్కొంటారు. అదనపు CMS ఫీచర్‌లకు యాక్సెస్ కోల్పోవడం, దీర్ఘకాలం నిర్దిష్ట ఫీచర్‌లను కోల్పోవడం లేదా CMSకు పూర్తిగా యాక్సెస్ కోల్పోవడం, అలాగే YouTubeతో ఉన్న ఏవైనా ఒప్పందాలు రద్దు కావడం వంటి చర్యలు ఇందులో ఉండవచ్చు.

కొన్ని సందర్భాల్లో, మా పాలసీలను పాటించాల్సిందిగా మేము “చివరి హెచ్చరిక”ను జారీ చేయవచ్చు. అధికారిక చివరి హెచ్చరిక నోటిఫికేషన్‌ను స్వీకరించిన కంటెంట్ మేనేజర్‌లు తదుపరి సంవత్సర కాలంలో దుర్వినియోగ ఆడిట్‌ను పాస్ అయ్యేంతవరకు వారి CMS ఫీచర్స్‌లో చాలా వాటికి యాక్సెస్ కోల్పోతారు. తదుపరి సంవత్సరంలో ఏవైనా మా కంటెంట్ మేనేజర్ పాలసీ ఉల్లంఘనలు ఉండి, దుర్వినియోగ ఆడిట్‌ను రిక్వెస్ట్ చేయడంలో, దాన్ని పాస్ అవడంలో విఫలమైతే, పార్ట్‌నర్‌ల ఒప్పందాలు రద్దు అయ్యే ప్రమాదంలో పడతాయి.

పలు కంటెంట్ ఓనర్‌ల యాజమాన్య హక్కు

YouTubeలోని పలు కంటెంట్ మేనేజర్స్‌లో మీకు నియంత్రణాధికారాలు ఉంటే, ఒక కంటెంట్ మేనేజర్‌లో జరిగే ఉల్లంఘనలు మీ యాజమాన్య హక్కులోని కంటెంట్ మేనేజర్‌లన్నింటిలో క్రమశిక్షణా చర్యలకు కారణం అయ్యే అవకాశముంటుంది. 

సాధారణ కంటెంట్ మేనేజర్ పాలసీలు

YouTube CMSకు యాక్సెస్ ఉన్న ప్రతి పార్ట్‌నర్‌కూ ఈ పాలసీలు వర్తిస్తాయి

ఛానెల్ జవాబుదారీతనం పాలసీ

లింక్ అయిన అన్ని ఛానెళ్లు YouTube కంటెంట్ పాలసీలు, అలాగే గైడ్‌లైన్స్‌ను అనుసరించేలా చూసుకోవాల్సిన బాధ్యత కంటెంట్ మేనేజర్‌లదే. ఈ పాలసీ, స్వంతమైన & నిర్వహించబడుతున్న (స్వం&ని) ఛానెళ్లకు, అలాగే అనుబంధ ఛానెళ్లకు రెండింటికీ అప్‌లోడ్ చేసే కంటెంట్‌కు వర్తిస్తుంది. 

పాలసీ ఆవశ్యకతలు

  • కంటెంట్ మేనేజర్‌లు 90 రోజుల వ్యవధిలో తప్పక 30 కంటే తక్కువ దుర్వినియోగ సంఘటనలు (ఉపసంహారాలు, తాత్కాలిక నిలిపివేతలు లేదా డీమానిటైజేషన్‌ల వంటివి) కలిగి ఉండాలి. ఈ పాలసీ మీ అనుబంధ, అలాగే అనుబంధం కాని ఖాతాల రెండింటిలోని ఛానెల్స్‌కు వర్తిస్తుంది. 
  • కంటెంట్ మేనేజర్‌లు తమ అనుబంధం కాని ఖాతాలకు సంబంధించి 90 రోజుల వ్యవధిలో తప్పక 10 కంటే తక్కువ దుర్వినియోగ సంఘటనలు కలిగి ఉండాలి.

పాలసీ ఉల్లంఘనలు

ఈ పరిమితిని మించితే ఈ పాలసీని ఉల్లంఘించే ఒక సంఘటనగా పరిగణించబడుతుంది. 90 రోజుల వ్యవధిలో మొదటి ఉల్లంఘన 1 నెల తాత్కాలిక నిలిపివేతకు దారి తీస్తుంది. తాత్కాలిక నిలిపివేత కాలంలో, మీరు మీ కంటెంట్ మేనేజర్‌కు కొత్త ఛానెల్స్‌ను క్రియేట్ లేదా లింక్ చేయలేరు. 

90 రోజుల వ్యవధిలో రెండవ ఉల్లంఘన 2 నెలల తాత్కాలిక నిలిపివేతకు దారి తీస్తుంది. మూడవది, చివరిది అయిన ఉల్లంఘన వల్ల పెనాల్టీలు విధించబడతాయి. ఇందులో దీర్ఘకాల నిలిపివేత లేదా YouTubeతో మీకు ఉన్న ఒప్పందాల రద్దు వంటి చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది.

పాలసీని అనుసరించడానికి మీరు ఏం చేయవచ్చు

ఛానెల్ ప్రవేశ పాలసీ
క్రియేటర్ ఛానెల్స్‌ను తమ నెట్‌వర్క్‌కు జోడించే ముందు కంటెంట్ మేనేజర్‌లు ఆ క్రియేటర్‌లతో సంబంధాలు కలిగి ఉండాలి. గైడ్‌లైన్స్ ఉల్లంఘించే పద్ధతిలో లేదా నిజాయితీ లేని మార్గాల్లో క్రియేటర్‌లను ఆన్‌బోర్డ్ చేయడం, లేదా ఛానెళ్లను లింక్ చేసే అధికారాలను దుర్వినియోగం చేయడం వల్ల, ఇంకా ఇతర అంశాల వల్ల CMS ఫీచర్‌లకు కంటెంట్ మేనేజర్‌లు యాక్సెస్ కోల్పోవచ్చు.

పాలసీ ఆవశ్యకతలు:

  • ప్రతి నెలా తమ ఛానెల్ లింకింగ్ ఆహ్వానాలకు సంబంధించి కంటెంట్ మేనేజర్‌లు తప్పనిసరిగా 90% అంగీకార రేటును కలిగి ఉండాలి.
  • 90% కంటే తక్కువ అంగీకార రేటు కలిగి ఉండే కంటెంట్ మేనేజర్‌లు 1 నెల వరకు తమ కంటెంట్ ఓనర్‌ల గ్రూపు మొత్తానికి సంబంధించి ఛానెల్ ఆహ్వానాలపై పరిమితులు ఎదుర్కొనవచ్చు.

పాలసీని ఫాలో అవ్వడానికి మీరు ఏం చేయవచ్చు:

  • నెల ప్రారంభంలో మీ ఆహ్వానాలను పంపండి. తద్వారా ఆహ్వానాన్ని అంగీకరించేందుకు మీ క్రియేటర్‌లకు సరిపడా సమయం లభిస్తుంది.
  • మీకు తెలిసిన, అలాగే మీరు బిజినెస్ సంబంధాన్ని కలిగి ఉండే ఛానెళ్లకు మాత్రమే ఆహ్వానాలను పంపండి.
  • అవసరమైతే, క్రియేటర్‌లను సంప్రదించి, ఆహ్వానాలను అంగీకరించాల్సిందిగా వారికి గుర్తు చేయండి.
సిస్టమ్‌ల పాలసీని ఉల్లంఘించడం
కంటెంట్ మేనేజర్‌లు తమ కంటెంట్ ఓనర్‌ల తరఫున హక్కులను, అలాగే కంటెంట్‌ను మేనేజ్ చేస్తారని, తమ నెట్‌వర్క్‌లోని సమస్యలను పరిష్కరిస్తారని, YouTube CMSను బాధ్యతతో వినియోగిస్తారని మేము విశ్వసిస్తున్నాము. YouTube CMSలో రూపొందించిన ఫీచర్ల పట్ల కూడా ఆ విశ్వాసం కలిగి ఉంటాము. YouTube ఏర్పరిచిన సిస్టమ్‌లను లేదా ప్రాసెస్‌లను ఉల్లంఘించేలా ఈ ఫీచర్‌లను దుర్వినియోగం చేసే కంటెంట్ మేనేజర్‌లు ఆ విశ్వాసాన్ని కోల్పోతారు, అలాగే YouTube ఎకో సిస్టమ్ మొత్తానికి హాని కలిగించిన వారు అవుతారు.

పాలసీ ఆవశ్యకతలు:

  • YouTube సిస్టమ్‌లు, ప్రాసెస్‌లు లేదా పాలసీల ఉల్లంఘనకు దారి తీసే కార్యకలాపాలకు పాల్పడకుండా లేదా వాటిలో జోక్యం చేసుకోకుండా కంటెంట్ మేనేజర్‌లపై నిషేధం విధించబడింది.
  • ఈ పాలసీని ఉల్లంఘించడం తీవ్రమైన దుర్వినియోగం కింద పరిగణించబడవచ్చు, అలాగే మీ కంటెంట్ ఓనర్‌ల గ్రూపు మొత్తాన్ని రద్దు చేయడానికి ఇది దారి తీసే అవకాశముంటుంది.

ఈ పాలసీని ఉల్లంఘించడం అనే దానికి ఈ కింది అంశాలు ఉదాహరణలుగా ఉండవచ్చు:

  • YouTubeలో మానిటైజేషన్‌కు అర్హత లేని కంటెంట్‌ను అక్రమమైన పద్ధతిలో మానిటైజ్ చేసేందుకు CMSను ఉపయోగించడం. ఇందులో మా కమ్యూనిటీ, అలాగే బ్రాండ్ భద్రత గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించే కంటెంట్‌తో పాటుగా, వర్తించే ఏవైనా చట్టాలు, నియంత్రణల ద్వారా నిషేధం విధించబడిన కంటెంట్ ఉంటుంది.
  • తాత్కాలికంగానైనా చట్టబద్ధమైన మేధోసంపత్తి హక్కు కలిగి లేని కంటెంట్ IDకి మీ యాజమాన్య హక్కును మాన్యువల్‌గా జోడించడం.
  • క్లెయిమ్ వివాద పరిష్కార ప్రక్రియను ఉల్లంఘించేందుకు మాన్యువల్ కంటెంట్ ID క్లెయిమ్ చేసే విధానాన్ని ఉపయోగించడం.
  • ముందస్తు అనుమతి అవసరమైన సందర్బాల్లో YouTube ద్వారా అనుమతి పొందని ఛానెల్‌ను మీ CMSలో చేర్చడం.
  • దుర్వినియోగాలను ఉపయోగించడం లేదా వాటి నుండి ప్రయోజనం పొందడం లేదా చెల్లని లేదా మోసపూరిత మార్గాల ద్వారా YouTubeలో మీ ఆదాయాన్ని పెంచడానికి రూపొందించిన టెక్నిక్‌లలో పాల్గొనడం.        

కంటెంట్ మేనేజర్ కాపీరైట్ స్ట్రయిక్‌ల పాలసీ
ఛానెల్ కాపీరైట్ స్ట్రయిక్‌ను పొందినప్పుడు, ఛానెల్ స్థాయి క్రమశిక్షణా చర్యలు వర్తిస్తాయి. తాము మేనేజ్ చేసే ఛానెల్స్ వ్యాప్తంగా కాపీరైట్ స్ట్రయిక్‌లను పొందడాన్ని పార్ట్‌నర్‌లు నివారించాలి. ఇలా చేయడంలో విఫలమైతే ఇప్పటికే ఉన్న ఛానెల్ స్ట్రయిక్ పాలసీలతో పాటుగా వారి కంటెంట్ మేనేజర్‌పై కూడా చర్యలు వర్తిస్తాయి. పార్ట్‌నర్ స్ట్రయిక్ చర్యలు ఫీచర్‌లకు యాక్సెస్‌ను పరిమితం చేస్తాయి. కంటెంట్ ఓనర్, అలాగే అనుబంధ కంటెంట్ ఓనర్‌లను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.

పాలసీ ఆవశ్యకతలు:

90 రోజుల కాలంలో ఒక పార్ట్‌నర్ తాను మేనేజ్ చేసే ఛానెల్స్ వ్యాప్తంగా 10 కాపీరైట్ స్ట్రయిక్‌లను అందుకుంటే, పార్ట్‌నర్ తదుపరి రివ్యూకు లోబడి ఉంటారు, దీని ఫలితంగా ఛానెల్స్‌ను లింక్ చేసే సామర్థ్యం, వీడియోలను అప్‌లోడ్ చేసే సామర్థ్యం కోల్పోవడం, అలాగే భాగస్వామ్య ఒప్పందం రద్దు కావడం వంటివి జరగవచ్చు. 90 రోజుల తర్వాత, కాపీరైట్ స్ట్రయిక్‌ల గడువు ముగుస్తుంది, ఛానెల్, అలాగే కంటెంట్ ఓనర్‌ల నుండి అవి పూర్తిగా తీసివేయబడతాయి. YouTube తన ఇష్టానుసారం ఎప్పుడైనా దుర్వినియోగాన్ని అంచనా వేసి, పరిష్కరించే హక్కును కలిగి ఉంది.

పాలసీని ఫాలో అవ్వడానికి మీరు ఏం చేయవచ్చు:

  • మేనేజ్ చేయడానికి కొత్త ఛానెల్స్‌ను ఎంపిక చేయడంలో జాగ్రత్త వహించండి. మీ స్ట్రయిక్‌కు మొత్తంగా ప్రమాదంగా పరిణమించే అవకాశమున్న ఛానెల్స్‌ను జోడించడం నివారించండి.
  • స్వం&ని కంటెంట్ ఓనర్‌లో ఛానెళ్ల సంఖ్యను 120 కంటే తక్కువగా ఉంచే పార్ట్‌నర్‌లే ఎక్కువగా ఉత్తమ పనితీరు కనబరుస్తారు.
  • కాపీరైట్‌పై మీరు మేనేజ్ చేసే ఛానెల్స్‌కు అవగాహన కల్పించండి, అలాగే అవి YouTube పాలసీలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయని నిర్ధారించుకోండి.
  • మీరు మేనేజ్ చేసే ఛానెళ్ల సంఖ్యను పెంచుతున్న క్రమంలో మీరు తగిన అంతర్గత కంట్రోల్స్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు నిర్ధారించుకోండి.
ఏవైనా అనుబంధ కాపీరైట్ స్ట్రయిక్‌లు చెల్లనివి అని మీరు అనుకుంటే, ప్రతివాద నోటిఫికేషన్‌లను ఫైల్ చేయడం లేదా క్లెయిమ్ ఉపసంహరణలను రిక్వెస్ట్ చేయడం గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు.
మీరు సహాయ కేంద్రంలో కాపీరైట్ స్ట్రయిక్‌‌ల గురించి మరింత తెలుసుకోవచ్చు.
జవాబుదారీతనంతో కూడిన యాక్సెస్, అలాగే సేకరణల పాలసీ
మా ఎకో-సిస్టమ్‌లో సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఉంచడానికి మేము చేసే ప్రయత్నంలో భాగంగా, ఏ CMS ఖాతాలు అయితే, జవాబుదారీతనం లేని పార్టీల చేతికి లేదా నిషిద్ధ పార్టీల చేతికి వెళ్లిపోయాయని YouTube భావిస్తుందో, ఆ ఖాతాలపై అది పరిమితులను విధించవచ్చు, వాటిని సస్పెండ్ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. 
  • కంటెంట్ మేనేజర్‌లు తమ CMS ఖాతాను ఉపయోగించి తీసుకునే ప్రతి చర్యకు బాధ్యత వహించాలి.
    • మీ ఉద్యోగుల యాక్సెస్, అలాగే మా పాలసీల అనుసరణను పర్యవేక్షించడానికి మీరు తగిన రక్షణ ఛత్రాలు కలిగి ఉన్నట్టు నిర్ధారించుకోండి. తమ వ్యక్తిగత ఉద్యోగుల చర్యలకు కంపెనీలు బాధ్యత వహించాలి.
    • CMS ఖాతాను నిర్వహించడానికి నియమించుకున్న థర్డ్-పార్టీ కంపెనీలకు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది.
  • పరిహారంగా లేదా ఇతర లాభం కోసం మీ CMS ఖాతాకు అనుబంధం కాని లేదా నిషిద్ధ థర్డ్ పార్టీలకు యాక్సెస్ ఇవ్వడం పూర్తిగా నిషిద్ధం.
    • మీ CMS ఖాతా యాక్సెస్‌ను అద్దెకు ఇవ్వడం, లీజుకు ఇవ్వడం లేదా అమ్మడం చేయవద్దు.
    • మీ తరఫున మీ CMS ఖాతాను నిర్వహించేందుకు మీరు థర్డ్-పార్టీతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంటే, ఆ సంస్థ తప్పక నేరుగా మాతో భాగస్వామ్య ఒప్పందాన్ని కలిగి ఉండాలి. 
    • దుర్వినియోగ చరిత్ర కలిగి ఉన్న సంస్థలకు (లేదా అనుబంధ వ్యక్తులకు) మీ CMS ఖాతా యాక్సెస్‌ను ఇవ్వవద్దు.
    • అనుబంధం కాని లేదా నిషిద్ధ పార్టీ మీ CMS ఖాతాకు యాక్సెస్ పొందినట్టు గుర్తిస్తే, దానిపై YouTube చర్య తీసుకోవచ్చు. ఉదాహరణకు, YouTube ఒక వ్యక్తి యాక్సెస్‌ను ఉపసంహరించవచ్చు లేదా అనుబంధ ఒప్పందాలను రద్దు చేయవచ్చు.
మిమ్మల్ని మరొక కంపెనీ తీసుకుంటే కంటెంట్ మేనేజర్‌గా మీరు YouTubeకు తప్పక తెలియజేయాలి. CMS యాక్సెస్ కలిగిన కంపెనీని మీ ఆధీనంలోకి తీసుకుంటుంటే, మీరు YouTubeకు కూడా నోటీసు ఇవ్వాలి. ఇది మీరు ఆధీనంలోకి తీసుకున్న 30 రోజుల్లో జరగాలి.
మ్యూజిక్ పార్ట్‌నర్ హోస్టింగ్ పాలసీ
మ్యూజిక్ యేతర కంటెంట్ చాలా వరకు తప్పకుండా, ఖాతాలో ఇప్పటికే ఉన్న మ్యూజిక్ అస్సెట్‌లకు సంబంధితంగా ఉండాలి.
  • ఉదాహరణకు, ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలు చాలా వరకు సంబంధితమైనవిగా పరిగణించబడతాయి.
  • మ్యూజిక్ యేతర కంటెంట్ కలిగిన మ్యూజిక్ పార్ట్‌నర్‌లు ఛానెళ్లను లింక్ చేసే సామర్థ్యం వంటి ఫీచర్ యాక్సెస్‌ను కోల్పోయే అవకాశాలను నివారించడానికి తమ పార్ట్‌నర్ మేనేజర్‌లతో సాధ్యమయ్యే పరిష్కారాల గురించి చర్చించాలి.

కంటెంట్ ID కోసం పాలసీలు

ఈ పాలసీలు కంటెంట్ ID మ్యాచింగ్ సిస్టమ్‌కు యాక్సెస్ కలిగిన పార్ట్‌నర్‌లకు వర్తిస్తాయి. కంటెంట్ ID కోసం అర్హత సాధించడం గురించి మీరు సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోవచ్చు.

కంటెంట్ ID అర్హత కలిగిన కంటెంట్ పాలసీ
YouTubeలో హక్కులను మేనేజ్ చేయడం కోసం కంటెంట్ ID మ్యాచింగ్ అన్నది శక్తివంతమైన టూల్. సంక్లిష్టత, అలాగే సున్నితమైన స్వభావం కారణంగా, రెఫరెన్స్‌గా ఉపయోగించబడడానికి కంటెంట్ తప్పక కొన్ని ఆవశ్యకాలకు తగినట్టుగా ఉండాలి. ఈ ఆవశ్యకాలకు తగినట్టుగా నడుచుకోవడం, అలాగే మీ మేధోసంపత్తి కలిగిన వీడియోలను మాత్రమే మీ రెఫరెన్స్ క్లెయిమ్ చేసేలా చూడడం మీ బాధ్యత.

పాలసీ ఆవశ్యకతలు

  • మీరు యాజమాన్య హక్కును క్లెయిమ్ చేసే ప్రాంతాల కోసం రెఫరెన్స్ ఫైల్‌లోని కంటెంట్‌పై తప్పనిసరిగా మీకు ప్రత్యేక హక్కులు ఉండాలి.
    • రెఫరెన్స్‌గా ఉపయోగించేందుకు అనర్హమైన కంటెంట్‌కు ఉదాహరణలు:
      • థర్డ్-పార్టీ నుండి లైసెన్స్ పొందిన, మీరే కాకుండా ఇతరులు కూడా ఉపయోగించగల అవకాశాన్ని కలిగి ఉన్న కంటెంట్; ఉదాహరణకు ప్రముఖమైన క్రీడా ఈవెంట్‌కు సంబంధించిన ప్రాంతీయ ప్రసారాలు.
      • క్రియేటివ్ కామన్స్ లేదా సారూప్య ఉచిత/ఓపెన్ లైసెన్స్‌లలో రిలీజ్ చేసిన కంటెంట్.
      • పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ఫుటేజ్, రికార్డింగ్‌లు లేదా కంపోజిషన్‌లు.
      • న్యాయమైన వినియోగ నియమాలకు అనుగుణంగా ఉపయోగించే ఇతర సోర్స్‌లకు సంబంధించిన క్లిప్‌లు.
      • ప్రొడక్షన్ మ్యూజిక్ వంటి ఇతర వీడియోలలో ఉపయోగించడానికి పెద్ద మొత్తంలో విక్రయించబడిన లేదా లైసెన్స్ ఉన్న కంటెంట్.

ఈ ఆవశ్యకత మీ రెఫరెన్స్ తాలూకు ఆడియోకు, విజువల్‌కు రెండింటికీ వర్తిస్తుంది. ఉదాహరణకు, మీ ఆడియోవిజువల్ రిఫరెన్స్‌లో లైసెన్స్ లేని థర్డ్-పార్టీ ఆడియో ఉంటే, డెలివరీకి ముందు ఆ కంటెంట్ తీసివేయబడాలి.

  • ఖచ్చితమైన మ్యాచింగ్‌ను అనుమతించడానికి రెఫరెన్స్ ఫైల్స్ అన్నీ సరిపడే విధంగా భిన్నంగా ఉండాలి.
    • రెఫరెన్స్‌గా ఉపయోగించేందుకు అనర్హమైన కంటెంట్‌కు ఉదాహరణలు:
      • కరియోకి రికార్డింగ్‌లు, రీమాస్టర్‌లు, రికార్డింగ్‌ల లాగా ఉండే సౌండ్.
      • సౌండ్ ఎఫెక్ట్‌లు, సౌండ్‌బెడ్‌లు లేదా ప్రొడక్షన్ లూప్‌లు.
      • పబ్లిక్ డొమైన్‌లో ఉండే సౌండ్ రికార్డింగ్‌లు లేదా అదే కంటెంట్‌కు సంబంధించిన ఇతర సౌండ్ రికార్డింగ్‌ల మాదిరిగా ఉండే థర్డ్-పార్టీ కంటెంట్. ఉదాహరణకు, క్లాసికల్ మ్యూజిక్ లేదా కొన్ని రకాల రీమిక్స్‌లు.
  • రెఫరెన్స్ ఫైల్స్ అన్నీ తప్పనిసరిగా మేధోసంపత్తి కంటెంట్‌ను కలిగి ఉండాలి.
    • రెఫరెన్స్‌గా ఉపయోగించేందుకు అనర్హమైన కంటెంట్‌కు ఉదాహరణలు:
      • పాటల కంపైలేషన్‌లు లేదా షార్ట్ వీడియో కంటెంట్.
      • మ్యాషప్‌లు లేదా నిరంతర DJ మిక్స్‌లు.
      • కౌంట్‌డౌన్ లిస్ట్‌లు లేదా పూర్తి ఆల్బమ్ సౌండ్ రికార్డింగ్‌లు.
  • కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి ఉపయోగించిన రెఫరెన్స్ ఫైళ్లు అన్నీ YouTube కంటెంట్ పాలసీలకు అనుగుణంగా ఉండాలి.

వీడియో గేమ్ కంటెంట్‌పై ప్రత్యేక పరిమితులు

  • 'గేమ్ ఆడే విధానం' ఫుటేజ్‌తో లేదా వీడియో గేమ్ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్(OST)లతో రెఫరెన్స్‌లను వీడియో గేమ్ పబ్లిషర్‌లు మాత్రమే అందించగలరు. 
    • ఒరిజినల్ వీడియో గేమ్ సౌండ్‌ట్రాక్‌లు అన్నవి, గేమ్‌లో చేర్చడం కోసం లైసెన్స్ పొందిన ట్రాక్‌లకు కాకుండా వీడియో గేమ్ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేయబడిన సౌండ్ రికార్డింగ్‌లుగా నిర్వచించబడతాయి.
    • ఈ పాలసీలో లైవ్ స్ట్రీమింగ్ వీడియో గేమ్ కంటెంట్ VODలు ఉంటాయి. 
      • ఈ కంటెంట్‌ను సంరక్షించడానికి Copyright Match Tool‌ను లేదా మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే విధానాన్ని ఉపయోగించండి.
  • వీడియో గేమ్ OSTల కవర్‌లకు సంబంధించి సౌండ్ రికార్డింగ్ అస్సెట్‌లన్నీ రివ్యూ పాలసీకి రూట్ తప్పక ఉపయోగించాలి.
    • ఈ అస్సెట్‌లకు సంబంధించి, పొందుపరిచిన కంపొజిషన్‌లకు మెలోడీ మ్యాచింగ్ అనేక సరికాని క్లెయిమ్‌లకు దారితీయవచ్చు, ఇది వీడియో గేమ్ పబ్లిషర్ అభ్యర్థనలకు భిన్నంగా ఉండవచ్చు.
కంటెంట్ ID రెఫరెన్స్ డెలివరీ పాలసీ
కంటెంట్ మేనేజర్‌లు కంటెంట్ ID మ్యాచింగ్ కోసం తగిన రెఫరెన్స్ ఫైళ్లను మాత్రమే అందించాలి. చెల్లని రెఫరెన్స్‌లు క్రియేటర్‌లకు, అలాగే YouTube హక్కుల మేనేజ్‌మెంట్ ఎకో సిస్టమ్‌కు కూడా హానికరమైనవి. ఏ కంటెంట్, కంటెంట్ IDకి అర్హత కలిగినది అన్నదాని గురించి మీరు సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోవచ్చు.

పాలసీ ఆవశ్యకతలు:

  • కంటెంట్ మేనేజర్లు అందరూ తమ కంటెంట్ ఓనర్ క్యాటలాగ్‌లో చెల్లని కంటెంట్ ID రెఫరెన్స్‌లను తప్పకుండా 1% కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే 30 రోజుల వ్యవధిలో 500 చెల్లని రెఫరెన్స్‌లను మించరాదు.
  • దీన్ని మించిపోతే కంటెంట్ ఓనర్‌ల రెఫరెన్స్ డెలివరీపై పరిమితి విధించబడవచ్చు లేదా దాన్ని డిజేబుల్ చేయవచ్చు.
కంటెంట్ ID మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే విధానం పాలసీ

మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే విధానం గురించి

మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే విధానం అన్నది తమ కంటెంట్ కలిగిన వీడియోలను మాన్యువల్‌గా క్లెయిమ్ చేయడానికి కంటెంట్ మేనేజర్‌లకు వీలు కల్పించే ఫీచర్. కంటెంట్ IDకి అర్హత కలిగిన కంటెంట్ ఆటోమేటిక్‌గా క్లెయిమ్ అవని సందర్భంలో క్లెయిమ్ చేసే కవరేజీలో ఉన్న అంతరాలను పూడ్చడానికి మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఒక రకమైన కంటెంట్, కంటెంట్ IDకి అర్హత కలిగి లేకపోతే, దాన్ని మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే విధానంలో క్లెయిమ్ చేయకూడదు.


చాలా అవసరం ఉందని నిరూపించే పార్ట్‌నర్‌లకు మాత్రమే మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే టూల్‌కు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. YouTubeలో నాలుగు రకాల స్వేచ్ఛతో నిలకడగా ఉండే ఆరోగ్యకరమైన, న్యాయమైన ఎకో సిస్టమ్‌ను కొనసాగించడానికి మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే విధానం, దాని వినియోగానికి సంబంధించి ఖచ్చితమైన ఆవశ్యకతలను కలిగి ఉంది.

ఏ కంటెంట్‌ను మీరు క్లెయిమ్ చేయవచ్చు అనేదానిపై పరిమితులు

 పరిమితి  వివరాలు
ప్రత్యేకించి మీకు మాత్రమే సొంతమైన, కాపీరైట్ చేసిన కంటెంట్‌ను కలిగి ఉండే వీడియోలను మాత్రమే క్లెయిమ్ చేయండి. అప్‌లోడ్ చేసిన వీడియోలో ఉండే కంటెంట్‌ను మాత్రమే క్లెయిమ్ చేయండి.

మీ సొంతం కాని కంటెంట్‌ను (లేదా కంటెంట్‌లోని భాగాలు) మాన్యువల్‌గా క్లెయిమ్ చేయవద్దు.


సెన్సార్‌షిప్‌నకు సంబంధించి మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే విధానాన్ని దుర్వినియోగం చేయడం అన్నది, సదరు ఫీచర్‌ను తక్షణం లేదా శాశ్వతంగా కోల్పోయే పరిస్థితికి దారి తీయవచ్చు, అదనంగా సాధ్యమయ్యే ఇతర పెనాల్టీలు కూడా విధించబడవచ్చు.

కంటెంట్ ID మ్యాచింగ్‌తో ఏం క్లెయిమ్ చేయగలం అన్న పరిధిలో మాత్రమే మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే విధానాన్ని ఉపయోగించండి.
 
అప్‌లోడర్ వీడియో, అలాగే పార్ట్‌నర్ అందించిన రెఫరెన్స్ కంటెంట్ మధ్య మ్యాచ్ అయ్యే ఆడియో, విజువల్, అలాగే మెలోడీని మాత్రమే క్లెయిమ్ చేసేందుకు కంటెంట్ ID మ్యాచింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రధాన ఫంక్షనాలిటీతో తగినట్టుగా మాన్యువల్ క్లెయిమ్‌లన్నీ ఉండాలి.

థంబ్‌నెయిల్ లేదా స్టిల్ ఇమేజ్ ఆధారంగా వీడియోలను మాన్యువల్‌గా క్లెయిమ్ చేయవద్దు.


వ్యాపారచిహ్నం, గోప్యత లేదా ఇతర కాపీరైట్ యేతర సమస్యలను మేనేజ్ చేయడానికి మాన్యువల్ క్లెయిమ్‌లను ఉపయోగించవద్దు. 

అప్‌లోడర్ క్రియేట్ చేసిన కాపీరైట్ చేయబడిన పాత్రలను కలిగిన వీడియోలను మాన్యువల్‌గా క్లెయిమ్ చేయవద్దు.

లైవ్ ఈవెంట్‌ల ఫ్యాన్ రికార్డింగ్‌లలో (నాటకాలు, కామెడీ రొటీన్‌లు, లేదా క్రీడా ఈవెంట్‌ల లాంటివి) ఏదైనా నిర్దిష్ట రికార్డింగ్‌పై మీరు హక్కులు కలిగి ఉంటే తప్ప, లేదా మ్యూజిక్ కంపోజిషన్‌ను మ్యూజిక్ పబ్లిషర్ క్లెయిమ్ చేస్తే తప్ప వాటిని మాన్యువల్‌గా క్లెయిమ్ చేయవద్దు. 

మ్యూజిక్ కంపోజిషన్‌లకు సంబంధించి మాత్రమే హక్కుల నిర్వహణను కంటెంట్ ID సపోర్ట్ చేస్తుంది కానీ, రాతపూర్వక లేదా స్క్రిప్ట్ చేసిన రూపంలోని కంటెంట్‌కు కాదు. 

ఇతర వినియోగ సందర్భాలకు సంబంధించి, చట్టబద్ధ తొలగింపు రిక్వెస్ట్ లేదా గోప్యతా ఫిర్యాదును సమర్పించడాన్ని మేము సిఫార్సు చేస్తాము.

అదే కంటెంట్‌ను ప్రస్తుతం లేదా ఇంతకుముందు ఒక అస్సెట్ ద్వారా క్లెయిమ్ చేసి ఉంటే ఆ వీడియోలను మాన్యువల్‌గా క్లెయిమ్ చేయవద్దు. ఈ పరిమితిలో, అదే కంటెంట్‌కు సంబంధించి మునుపటి క్లెయిమ్‌ను విజయవంతంగా వివాదం లేవనెత్తిన వీడియోలను మాన్యువల్‌గా క్లెయిమ్ చేయడం కూడా ఉంటుంది.

డూప్లికేట్, పోటీ క్లెయిమ్‌లను మాన్యువల్‌గా క్రియేట్ చేయడాన్ని మా సిస్టమ్‌ల పాలసీకి సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తాము. 
వీడియోపై ఇప్పటికే ఉన్న క్లెయిమ్స్‌లో చెల్లని ఆదాయ షేరింగ్ ఏర్పాటును క్రియేట్ చేయడానికి మాన్యువల్ క్లెయిమ్‌లను ఉపయోగించవద్దు. ఈ పాలసీని ఉల్లంఘించడం అన్నది తీవ్రమైన సిస్టమ్‌ల పాలసీ ఉల్లంఘనగా పరిగణించవచ్చు.
మీ యాజమాన్య హక్కు అన్నది ఇతర అస్సెట్స్‌లో పొందుపరచబడితే, లేదా పొందుపరచబడాలంటే వీడియోలను మాన్యువల్‌గా క్లెయిమ్ చేయవద్దు. వీడయోలోని ఒక భాగం ఇప్పటికే మీ కంపోజిషన్‌ను కలిగి ఉన్న సౌండ్ రికార్డింగ్ అస్సెట్ ద్వారా క్లెయిమ్ చేయబడితే మాన్యువల్ కంపోజిషన్ క్లెయిమ్‌ను చేయవద్దు. సాధ్యమైనప్పుడల్లా కంపోజిషన్ యాజమాన్య హక్కును సౌండ్ రికార్డింగ్స్‌లో పొందుపరచాలి.

మీరు కంటెంట్‌ను క్లెయిమ్ చేయడంపై పరిమితులు

పరిమితి వివరాలు
మాన్యువల్ క్లెయిమ్‌ను సమర్పించడానికి ముందుగా మీరు క్లెయిమ్ చేస్తున్న కంటెంట్‌ను మీరు మాన్యువల్‌గా రివ్యూ చేయాలి.
 
మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే విధాన ప్రక్రియను ఆటోమేటిక్ చేయడం అనుమతించబడదు. మాన్యువల్ చర్య పాలసీని చూడండి.
మాన్యువల్ క్లెయిమ్‌లను చేయడానికి ఉపయోగించబడే అస్సెట్‌లన్నింటిలో ఖచ్చితమైన, మనుషులు చదవగలిగే మెటాడేటాతో పాటు చెల్లుబాటు అయ్యే రెఫరెన్స్ కంటెంట్ ఉండాలి. క్లెయిమ్ చేయబడిన కంటెంట్‌కు సంబంధించిన రెఫరెన్స్ ఫైల్, మ్యాచింగ్‌కు తగినట్టుగా లేని సందర్భంలో, లేదా దాన్ని మా రెఫరెన్స్ పాలసీ నిషేధించిన సందర్భంలో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. 

ఈ అస్సెట్‌లకు రెఫరెన్స్‌లు అవసరం లేదు, అయితే క్లెయిమ్‌లన్నీ అదే, విభిన్న కంటెంట్‌ కోసం అయి ఉండాలి, అలాగే మెటాడేటా ద్వారా ఖచ్చితంగా వివరించబడాలి. (ఉదా. ‘బకెట్' లేదా 'క్యాచ్-ఆల్' అస్సెట్‌లు కాదు).

మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే విధానంలో ఉపయోగించబడే అస్సెట్‌లు మీ యాజమాన్య హక్కు పరిధిని స్పష్టంగా ప్రతిబింబించాలి. ఉదాహరణకు, మీరు, లైసెన్స్ ఉన్న కంటెంట్ రీ-అప్‌లోడ్‌లను క్లెయిమ్ చేసే ప్రాంతీయ ప్రసారకర్త అయితే, ఆ కంటెంట్‌కు మీరు ప్రపంచ వ్యాప్త హక్కులను కలిగి లేకపోతే గ్లోబల్ బ్లాక్ పాలసీని అమలు చేసేందుకు మీరు మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే విధానాన్ని ఉపయోగించలేరు.

అదనంగా, ప్రసారకర్తలు ఒక ప్రాంతంలో లైసెన్స్ ఉన్న కంటెంట్‌ను చూపించడానికి హక్కులను కలిగి ఉండవచ్చు, కానీ దానర్థం ఎల్లప్పుడూ ఆ ప్రాంతంలో ఆ కంటెంట్‌ను కలిగి ఉన్న వీడియోలను క్లెయిమ్ చేసే హక్కులను కలిగి ఉన్నట్టు కాదు.
మాన్యువల్ క్లెయిమ్‌లు అన్నీ వీడియోలో క్లెయిమ్ చేసే కంటెంట్ ఎక్కడ ఉందన్నది గుర్తించే ఖచ్చితమైన టైమ్ స్టాంప్‌‌లను కలిగి ఉండాలి. వ్యక్తిగత మ్యాచింగ్ భాగాలు తప్పకుండా ప్రత్యేక టైమ్ స్టాంప్‌లతో పేర్కొనబడాలి.

ఉద్దేశపూర్వకంగా లేదా పదే పదే తప్పుదారి పట్టించే టైమ్ స్టాంప్‌లను అందించడం అన్నది మా పాలసీలకు సంబంధించి తీవ్ర ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది.
YouTube కమ్యూనిటీ లేదా బ్రాండ్ రక్షణ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించే 'మానిటైజ్' పాలసీతో కంటెంట్‌ను మాన్యువల్‌గా క్లెయిమ్ చేయవద్దు. దీన్ని మా సిస్టమ్‌ల పాలసీ ఉల్లంఘనగా పరిగణించవచ్చు. ఇక్కడ మరింత చదవండి.
వీడియోలోని చిన్న భాగంలో ఉండే ఆడియో కంటెంట్‌పై మాన్యువల్ క్లెయిమ్‌లు చాలా పరిమిత సందర్భాల్లో మాత్రమే మానిటైజ్ పాలసీని ఉపయోగించవచ్చు. సాధారణంగా, ఆడియో కంటెంట్ యొక్క స్వల్ప వినియోగాలపై మాన్యువల్ క్లెయిమ్‌లు క్లెయిమ్ చేసిన కంటెంట్ ఈ కింది వాటికి సంబంధంచినదైతే మినహా బ్లాక్ లేదా ట్రాక్ పాలసీని ఉపయోగించవచ్చు:
​వీడియో కంపైలేషన్, మ్యూజిక్ కౌంట్‌డౌన్, లేదా మ్యూజిక్ థీమ్ కలిగిన ఛాలెంజ్‌లో భాగంగా ఉండే కంటెంట్.
  • ఛానెల్‌ను బ్రాండ్ చేయడానికి ఉపయోగించిన ఇంట్రో/అవుట్రోలో భాగంగా ఉండే కంటెంట్.
  • మానిటైజ్ పాలసీతో చెల్లుబాటు అయ్యే కంటెంట్ ID క్లెయిమ్‌ను ఇప్పటికే కలిగిన ఉన్న వీడియోలో ఉండే కంటెంట్.
  • హక్కుదారు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌‌కు అప్‌లోడ్ చేయబడిన వీడియోలో ఉండే కంటెంట్.
  • వీడియోలో ఎక్కువ భాగం కలిగిన కంటెంట్.
ఆడియో కంటెంట్ యొక్క“ఉద్దేశపూర్వకం కాని వినియోగం”పై మాన్యువల్ క్లెయిమ్‌లు 'మానిటైజ్ పాలసీ'ని ఉపయోగించకపోవచ్చు, కానీ మీరు ఇప్పటికీ మీ కంటెంట్‌పై ఏదైనా వినియోగంపై 'ట్రాక్' లేదా 'బ్లాక్' పాలసీని సాధారణంగా వర్తింపజేయవచ్చు. ఈ పాలసీ ఉద్దేశం కోసం, ఈ కింది సందర్భాలను మేము "ఉద్దేశపూర్వకం కాని వినియోగం"గా నిర్వచిస్తాము:
  • వీడియోకు కంటెంట్ అన్నది క్రియేటర్ ద్వారా జోడించబడనప్పుడు, అలాగే
  • క్రియేటర్, అలాగే కంటెంట్ మధ్య ఎలాంటి ఇంటరాక్షన్ లేనప్పుడు.

“ఉద్దేశపూర్వకం కాని వినియోగానికి” ఉదాహరణలు కొన్ని ఈ కింద ఉన్నాయి:

  • క్రియేటర్ ఇల్లు లేదా ఆఫీస్‌లోని మరొక గది నుండి వినిపించే టెలివిజన్.
  • పక్క నుండి వెళ్తున్న కారు నుండి వచ్చే మ్యూజిక్.

వినియోగం ఉద్దేశపూర్వకం కాదు అని ఏ సందర్భాల్లో పరిగణించబడదు అన్నదానికి కొన్ని ఉదాహరణలు ఈ కింద ఉన్నాయి:

  • మ్యూజిక్‌కు పాడడం, డ్యాన్స్ చేయడం లేదా ఆడడం.
  • పోస్ట్ ప్రొడక్షన్ లేదా ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో జోడించబడిన ఏదైనా కంటెంట్.
  • మ్యూజిక్‌కు క్రియేటర్ ప్రత్యక్ష కంట్రోల్ కలిగిన చోట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదా సంగీత కచేరీ వంటి ఆడియోను క్యాప్చర్ చేయడానికి తీసే వీడియో.

కంటెంట్ ID, అలాగే కీలక కంటెంట్‌ను మాన్యువల్‌గా బ్లాక్ చేయడం

కీలకమైన కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి మాన్యువల్ కంటెంట్ ID చర్యలను ఉపయోగించడం YouTubeలో అనుమతించబడదు. ఈ కింది వాటికి సంబంధించిన కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి దారి తీసే కంటెంట్ IDలో మాన్యువల్ చర్యను తీసుకోవద్దు 1) మీకు లేదా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న క్లయింట్‌లకు కీలకమైనది, అలాగే 2) మీ కాపీరైట్ రక్షణ ఉన్న కంటెంట్ భాగాలను కలిగినది.
  • “కీలకం” అంటే అర్థం కంటెంట్‌ను ఉపయోగించే ఉద్దేశం విమర్శించడం మరియు/లేదా ప్రతికూల, లేదా తక్కువ చేసే పద్ధతిలో కంటెంట్, దాని అంశాలు, క్రియేటర్‌లు, లేదా హక్కుదారులను చూపించడం.
  • “మాన్యువల్ చర్య”లో మాన్యువల్ క్లెయిమ్‌ వర్తింపజేయడం లేదా బ్లాక్ చేయడానికి ఇప్పటికే ఉన్న క్లెయిమ్ పాలసీని మార్చడం వంటి వాటికే పరిమితం కాకుండా మరికొన్ని ఉంటాయి.
  • కాపీరైట్ రక్షణ ఉన్న మీ కంటెంట్ అతిక్రమణకు గురైందని మీరు నమ్మితే, బదులుగా DMCA తొలగింపు రిక్వెస్ట్‌ను ఫైల్ చేయండి.
  • మీ DMCA తొలగింపు రిక్వెస్ట్ తిరస్కరించబడితే, మీరు కంటెంట్‌ను క్లెయిమ్ చేయడం కోసం మాన్యువల్ చర్యలను తీసుకునేందుకు ఇప్పటికీ అనుమతి ఉండదు. ఇందులో మాన్యువల్ క్లెయిమ్‌ను జోడించడం, అలాగే కంటెంట్‌పై బ్లాక్ పాలసీని ఉంచడం వంటి వాటికే పరిమితం కాకుండా మరికొన్ని కూడా ఉంటాయి.
కంటెంట్ ID, అలాగే రాజకీయ సెన్సార్‌షిప్
మీకు హక్కులు లేని రాజకీయ కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి కంటెంట్ IDని ఉపయోగించడం అన్నది తీవ్రమైన ఉల్లంఘన, ఇది YouTubeలో అనుమతించబడదు. అలా చేయడానికి ప్రయత్నిస్తే, కంటెంట్ మేనేజర్‌కు చెందిన కంటెంట్ ఓనర్‌ల గ్రూపు మొత్తం రద్దు అవవచ్చు.

సమస్యలను నివారించడానికి చిట్కాలు:

  • మీ “బ్లాక్ మాత్రమే” క్లెయిమ్‌లను గమనిస్తూ ఉండండి, ఏవైనా సమస్యలను కనుగొంటే నేరుగా మీ పార్ట్‌నర్ మేనేజర్‌కు రిపోర్ట్ చేయండి.
కంటెంట్ ID మాన్యువల్ చర్య పాలసీ
కంటెంట్ మేనేజర్‌ల నుండి కొన్ని మాన్యువల్ రివ్యూ చర్యలపై కంటెంట్ ID ఆధారపడి ఉంటుంది. ఈ చర్యల్లో కింద పేర్కొన్న అంశాలు ఉంటాయి, కానీ అవి వాటికి మాత్రమే పరిమితం కావు:
  • అస్సెట్‌లు, అలాగే రెఫరెన్స్ ఫైల్‌కు చెందిన అస్పష్ట యాజమాన్య హక్కును పరిష్కరించడం.
  • వివాదాస్పద, అలాగే వివాదాస్పదం అయ్యే అవకాశమున్న కాపీరైట్ క్లెయిమ్‌లను రివ్యూ చేయడం.

పాలసీ ఆవశ్యకతలు

  • మాన్యువల్ చర్యలకు మాన్యువల్ రివ్యూ అవసరం, ఆటోమేటిక్ లేదా స్క్రిప్ట్ చేయడం సాధ్యం కాదు.
  • వివాదాస్పదం, లేదా వివాదాస్పదం అయ్యే అవకాశమున్న క్లెయిమ్‌ల వంటి మాన్యువల్ చర్యలు అన్నీ తప్పక:
    • ఖచ్చితంగా మీ యాజమాన్య హక్కు పరిధిని ప్రతిబింబించాలి.
    • సంబంధిత అన్ని చట్టాలు, నియంత్రణలకు కట్టుబడి ఉండాలి.
    • మానిటైజేషన్‌కు కావలసిన అర్హతల వంటి YouTube పాలసీలన్నింటికీ అనుగుణంగా ఉండాలి.

పరిమితులు

  • ఈ కింది వాటికి సంబంధించిన కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి దారి తీసే కంటెంట్ IDలో మాన్యువల్ చర్యను తీసుకోవద్దు 1) మీకు లేదా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న క్లయింట్‌లకు కీలకమైనది, అలాగే 2) మీ కాపీరైట్ రక్షణ ఉన్న కంటెంట్ భాగాలను కలిగినది.
    • “కీలకం” అంటే అర్థం కంటెంట్‌ను ఉపయోగించే ఉద్దేశం విమర్శించడం మరియు/లేదా ప్రతికూల, లేదా తక్కువ చేసే పద్ధతిలో కంటెంట్, దాని అంశాలు, క్రియేటర్‌లు, లేదా హక్కుదారులను చూపించడం.
    • “మాన్యువల్ చర్య”లో మాన్యువల్ క్లెయిమ్‌ వర్తింపజేయడం లేదా బ్లాక్ చేయడానికి ఇప్పటికే ఉన్న క్లెయిమ్ పాలసీని మార్చడం వంటి వాటికే పరిమితం కాకుండా మరికొన్ని ఉంటాయి.
    • మీ కాపీరైట్ రక్షణ ఉన్న కంటెంట్‌ను వేరే కంటెంట్ అతిక్రమించిందని మీరు నమ్మితే దయచేసి DMCA తొలగింపు రిక్వెస్ట్‌ను ఫైల్ చేయండి.
    • కాపీరైట్‌కు మినహాయింపులను పరిగణించాలని కోరూతూ మీ DMCA తొలగింపు రిక్వెస్ట్ తిరస్కరించబడితే, మీరు కంటెంట్‌పై బ్లాక్ క్లెయిమ్‌లను ఉంచడం కోసం మాన్యువల్ చర్యలను తీసుకునేందుకు ఇప్పటికీ అనుమతి ఉండదు. ఇందులో మాన్యువల్ క్లెయిమ్‌ను జోడించడం, అలాగే కంటెంట్‌పై బ్లాక్ పాలసీని ఉంచడం వంటి వాటికే పరిమితం కాకుండా మరికొన్ని కూడా ఉంటాయి.
కంటెంట్ ID బాధ్యత కలిగిన అస్సెట్ మేనేజ్‌మెంట్ పాలసీ
సరికాని, చదవలేని లేదా డూప్లికేట్ అస్సెట్‌లు కంటెంట్ ID సిస్టమ్‌లో సమస్యలను సృష్టించవచ్చు. ఈ కారణంగా, కంటెంట్ మేనేజర్‌లు తమకు స్వంతమైన అస్సెట్‌ల పట్ల చక్కని సారథ్య బాధ్యతలు తీసుకోవాలని YouTube ఆశిస్తుంది. కంటెంట్ మేనేజర్‌లు డిజేబుల్ చేయబడిన లేదా ఇతర చర్యలు తీసుకోబడిన CMS ఫీచర్‌లకు యాక్సెస్ కలిగి ఉండకపోవచ్చు.

పాలసీ ఆవశ్యకతలు

  • అస్సెట్‌లన్నీ ఖచ్చితమైన, స్థిరమైన, మనుషులు చదవగలిగే మెటాడేటాను తప్పక కలిగి ఉండాలి.
    • ఏ కంటెంట్ క్లెయిమ్ చేయబడుతోంది, అలాగే ఆ కంటెంట్ ఓనర్ ఎవరు అన్నది అప్‌లోడర్‌కు స్పష్టంగా తెలియాలి. కంటెంట్ రకం ఆధారంగా మీరు తప్పక కనీస మొత్తంలో మెటాడేటాను చేర్చాలి:
      • సౌండ్ రికార్డింగ్ లేదా మ్యూజిక్ వీడియో: ISRC, టైటిల్, ఆర్టిస్ట్, అలాగే రికార్డ్ లేబుల్‌ను చేర్చండి.
      • మ్యూజిక్ కంపోజిషన్: టైటిల్, అలాగే రచయిత పేరును చేర్చండి.
      • టెలివిజన్ ఎపిసోడ్: షో టైటిల్, అలాగే ఎపిసోడ్ టైటిల్ లేదా ఎపిసోడ్ నంబర్‌లో ఏదైనా ఒక దానిని చేర్చండి.
      • సినిమా: టైటిల్, అలాగే డైరెక్టర్‌ల పేర్లను చేర్చండి.
      • క్రీడల ప్రసారం: పోటీదారు లేదా టీమ్ పేర్లు, అలాగే ఈవెంట్ తేదీని చేర్చండి.
      • ఇతర వెబ్ అస్సెట్‌లు: అనుబంధ రెఫరెన్స్ కంటెంట్‌ను ఖచ్చితంగా వివరించాలి.
    • కంటెంట్ డెలివరీ, అలాగే ఆర్ట్ ట్రాక్ క్రియేషన్ కోసం మ్యూజిక్ పార్ట్‌నర్‌లు చేర్చిన మెటాడేటా ఖచ్చితత్వానికి వారే బాధ్యత వహించాలి.
    • మీరు డెలివరీ చేసిన మెటాడేటా మా క్వాలిటీ స్టాండర్డ్‌లకు అనుగుణంగా లేకపోతే, కంటెంట్ డెలివరీపై పరిమితి విధించే లేదా నిలిపివేసే హక్కు మేము కలిగి ఉన్నాము.
  • కంటెంట్ మేనేజర్‌లు సరైన అస్సెట్ రకాన్ని ఉపయోగించాలి.
    • ఉదాహరణకు, పార్ట్‌నర్‌లు మ్యూజిక్ కంటెంట్ కోసం వెబ్ అస్సెట్‌లను క్రియేట్ చేయకపోవచ్చు. మ్యూజిక్ వీడియో అస్సెట్‌లను మ్యూజిక్ లేబుల్ క్రియేట్ చేయని లైవ్ ప్రదర్శనల రికార్డింగ్‌ల కోసం ఉపయోగించడం సాధ్యం కాదు.
  • కంటెంట్ ID సిస్టమ్‌లో ఏదైతే కంటెంట్‌కు ఇప్పటికే అస్సెట్ ఉంటే, ఆ కంటెంట్ కోసం డూప్లికేట్ అస్సెట్‌లను క్రియేట్ చేయవద్దు. 
    • కొత్త అస్సెట్‌లను క్రియేట్ చేయడానికి బదులుగా ఇప్పటికే ఉన్న వాటికి మీ యాజమాన్య హక్కును జోడించండి.
  • మీరు మేధోసంపత్తికి యాజమాన్య హక్కు కలిగి లేకపోతే, ఆ అస్సెట్‌కు మీ యాజమాన్య హక్కును జోడించవద్దు. 
    • అలా చేయడం ద్వారా మా సిస్టమ్‌ల పాలసీ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది, అలాగే YouTubeతో మీ భాగస్వామ్య ఒప్పందం ప్రమాదంలో పడుతుంది. 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6242481279755568668
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false