ఛానెల్ మెంబర్‌షిప్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయడం

నెలవారీ పేమెంట్‌ల ద్వారా మీ ఛానెల్‌లో చేరే వెసులుబాటును వీక్షకులకు ఛానెల్ మెంబర్‌షిప్‌లు కల్పిస్తాయి, తిరిగి వారు బ్యాడ్జ్‌లు, ఎమోజీలు, ఇతర వస్తువుల వంటి మెంబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేక పెర్క్‌లను పొందుతారు.

మీ ఛానెల్‌కు మెంబర్‌షిప్‌లను ప్రారంభించడానికి:

  1. ఛానెల్ మెంబర్‌షిప్‌లకు కావలసిన అర్హతలు, అవి ఏ లొకేషన్‌లో అందుబాటులో ఉన్నాయి, వాటి పాలసీలు, గైడ్‌లైన్స్‌ను రివ్యూ చేయండి.
  2. మీ ఛానెల్‌కు లేదా మీ నెట్‌వర్క్‌కు మెంబర్‌షిప్‌లను ఆన్ చేయండి.
  3. మీ ఛానెల్ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్ కోసం పెర్క్‌లు, స్థాయిలను క్రియేట్ చేయండి.

ఛానెల్ మెంబర్‌షిప్‌లు

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

ఛానెల్ మెంబర్‌షిప్‌లను ఆన్ చేయడం

ఛానెల్ మెంబర్‌షిప్‌ల నుండి ఆదాయాన్ని సంపాదించడానికి, ముందుగా మీరు (అలాగే మీ MCN) తప్పనిసరిగా వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM) ఒప్పందాన్ని అంగీకరించాలి. CPM గురించిన మరింత సమాచారం కోసం, మా YouTube వాణిజ్యపరమైన ప్రోడక్ట్‌ల మానిటైజేషన్ పాలసీలను చూడండి.

మీ ఛానెల్ కోసం మెంబర్‌షిప్‌లను ఆన్ చేయండి:

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి ని క్లిక్ చేయండి.
  3. మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌ను క్లిక్ చేయండి. మీ ఛానెల్ అర్హత కలిగి ఉంటే మాత్రమే ఈ ట్యాబ్ కనిపిస్తుంది.
  4. ప్రారంభించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
  5. మెంబర్‌షిప్‌ల విభాగాన్ని ఉపయోగించడం మీరు ఇదే మొదటిసారి అయితే, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అయ్యి వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM) ఒప్పందంపై సంతకం చేయండి.

మీ నెట్‌వర్క్ కోసం ఛానెల్ మెంబర్‌షిప్‌లను ఆన్ చేయడం

నెట్‌వర్క్‌లో ఉన్న ఛానెల్, ఛానెల్ మెంబర్‌షిప్‌లను ఆన్ చేయడానికి ముందు, నెట్‌వర్క్ తప్పనిసరిగా మెంబర్‌షిప్‌లను ఆన్ చేయడానికి ఛానెల్స్‌ను అనుమతించాలి:

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. దిగువ ఎడమ వైపున ఉన్న సెట్టింగ్‌లు ను క్లిక్ చేయండి.
  3. ఒప్పందాలను క్లిక్ చేయండి.
  4. వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌ను అంగీకరించండి.

ఛానెల్ మెంబర్‌షిప్‌లను ఆఫ్ చేయడం

మీ ఛానెల్ మెంబర్‌షిప్‌లను ఎప్పుడైనా ఆఫ్ చేయవచ్చు. మీరు ఛానెల్ మెంబర్‌షిప్‌లను ఆఫ్ చేస్తే, మీ స్థాయిలు, మెంబర్‌షిప్‌లు, పెర్క్‌లు సేవ్ అవ్వవని గుర్తుంచుకోండి. మెంబర్‌లు చేసే నెలవారీ రిపీట్ అయ్యే పేమెంట్‌లన్నీ రద్దవుతాయి, మీ మెంబర్‌లను మీరు కోల్పోతారు.

మీరు ఛానెల్ మెంబర్‌షిప్‌లను మళ్లీ ఆన్ చేస్తే, వీక్షకులు స్వచ్ఛందంగా మీ ఛానెల్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌లో మళ్లీ చేరవలసి ఉంటుంది.

మీ ఛానెల్‌లో మెంబర్‌షిప్‌లను ఆఫ్ చేయండి:

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి ని క్లిక్ చేయండి.
  3. మెంబర్‌షిప్‌ల ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. “మీ మెంబర్‌షిప్‌ల ఆఫర్” పక్కన ఉన్న మరిన్ని ని క్లిక్ చేయండి.
  5. ఛానెల్ మెంబర్‌షిప్‌లను డిజేబుల్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. “నాకు అర్థం అయింది, నా ఫ్యాన్స్ అందరికీ మెంబర్‌షిప్‌లను నేను ఆఫ్ చేయాలనుకుంటున్నాను” అనే ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకొని, ఆఫ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు ఛానెల్ మెంబర్‌షిప్‌లను ఆన్ చేసిన తర్వాత, మీ ఛానెల్ మెంబర్‌షిప్‌ల ప్రోగ్రామ్ కోసం పెర్క్‌లు, స్థాయిలను క్రియేట్ చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7090725061316196456
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false