Studio కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి

ఈ ఫీచర్‌లు YouTube Studio కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించే పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. యాక్సెస్ పొందడానికి మీ YouTube పార్ట్‌నర్ మేనేజర్‌ను సంప్రదించండి.

YouTube Studio కంటెంట్ మేనేజర్ అనేది వెబ్ ఆధారితమైన టూల్, ఇది YouTube పార్ట్‌నర్‌లు YouTubeలో తమ కంటెంట్, హక్కులను మేనేజ్ చేయడానికి ఉపయోగించే టూల్. మీరు కంటెంట్ మేనేజర్ ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు మీ రోల్‌ను బట్టి, ఈ ఆప్షన్‌లలో కొన్ని లేదా అన్నీ ఎడమ వైపు మెనులో ఉంటాయి:

 డ్యాష్‌బోర్డ్

చర్య అవసరమయ్యే వివిధ రకాల సమస్యలను పర్యవేక్షించండి, ఉదాహరణకు, యాజమాన్య హక్కు వైరుధ్యాలు, ఇంకా క్లెయిమ్‌ల వంటివి. కాపీరైట్ స్ట్రయిక్‌లు ఉన్న ఛానెల్స్‌ను, పెండింగ్‌లో ఉన్న ఛానెల్ ఆహ్వానాలను, ఇంకా మానిటైజేషన్ సస్పెండ్ చేయబడి ఉన్న ఛానెల్స్‌ను కూడా మీరు పర్యవేక్షించవచ్చు.

 వీడియోలు

మీ కంటెంట్ మేనేజర్‌తో అనుబంధించబడి ఉన్న ఛానెల్స్ అప్‌లోడ్ చేసిన లేదా లైవ్ స్ట్రీమ్ చేసిన వీడియోల లిస్ట్‌ను చూడండి. ఇక్కడి నుండి మీ వీడియోలను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, బల్క్‌లో తొలగించవచ్చు, లేదా వాటికి బల్క్ అప్‌డేట్‌లు చేయవచ్చు. కాపీరైట్ క్లెయిమ్‌లు, స్ట్రయిక్‌లు, ఇంకా ఇతర లక్షణాలు గల వీడియోలను చూడటానికి, మీరు ఫిల్టర్  కూడా చేయవచ్చు.

 అస్సెట్‌లు

మీ కంటెంట్ మేనేజర్‌తో అనుబంధించబడి ఉన్న అస్సెట్‌ల ఓవర్‌వ్యూను పొందండి. మీరు అస్సెట్ డేటాను ఎగుమతి చేయవచ్చు, అస్సెట్ మెటాడేటాను చూడవచ్చు, ఎడిట్ చేయవచ్చు, అలాగే మీ అస్సెట్‌లకు బల్క్ ఎడిట్‌లు చేయవచ్చు. మీరు వెతుకుతున్న అస్సెట్‌లను కనుగొనడానికి అస్సెట్ రకం, క్లెయిమ్‌లు, ఇతర లక్షణాల ఆధారంగా, ఫిల్టర్  చేయండి. అస్సెట్‌ల గురించి మరింత తెలుసుకోండి.

 అస్సెట్ లేబుల్స్

మీ కంటెంట్ మేనేజర్‌తో అనుబంధించబడి ఉన్న అస్సెట్ లేబుల్స్ లిస్ట‌ను చూడండి. నిర్దిష్ట లేబుల్‌తో ఉన్న అస్సెట్‌ల ద్వారా క్రియేట్ చేయబడిన క్లెయిమ్‌లను కూడా మీరు చూడవచ్చు. అస్సెట్ లేబుల్స్ గురించి మరింత తెలుసుకోండి.

 సమస్యలు

మీరు దృష్టి సారించాల్సిన, అలాగే మీ అస్సెట్‌లు, రెఫరెన్స్‌లు లేదా క్లెయిమ్‌లను ప్రభావితం చేసే అవకాశం ఉన్న సమస్యలపై చర్య తీసుకోండి. క్లెయిమ్‌లు కాదగినవి, వివాదం ఫైల్ చేయబడిన, అలాగే అప్పీల్ చేయబడిన క్లెయిమ్‌లు, యాజమాన్య హక్కు వైరుధ్యాలు, ఇంకా బదిలీలు, చెల్లని రెఫరెన్స్‌లు, అలాగే రెఫరెన్స్ ఓవర్‌ల్యాప్‌‌ల గురించి మీరు మరింత సమాచారాన్ని పొందవచ్చు.

 ఛానెల్స్

మీ కంటెంట్ మేనేజర్‌తో అనుబంధించబడిన ఛానెల్స్‌కు సంబంధించిన కొలమానాలు, ఇంకా అనుమతుల లిస్ట్‌ను చూడండి. ఛానెల్స్‌ను క్రియేట్ చేయడం ద్వారా, లేదా మీ కంటెంట్ మేనేజర్ ఖాతాలో చేరమని ఇతర ఛానెల్స్‌ను ఆహ్వానించడం ద్వారా, మీ కంటెంట్ మేనేజర్ ఒకటి కంటే ఎక్కువ ఖాతాలకు లింక్ అవ్వవచ్చు.

 క్లెయిమ్ చేసిన వీడియోలు

క్లెయిమ్ చేసిన వీడియోల లిస్ట్‌ను, అలాగే వాటితో అనుబంధించబడిన అస్సెట్‌లను చూడండి. క్లెయిమ్ సమస్యలను సమర్థవంతంగా రివ్యూ చేసి, పరిష్కరించే వీలును మీకు కల్పించేందుకు, ఒకే వీడియోకు సంబంధించిన పలు క్లెయిమ్‌లను గ్రూప్ చేయడం జరుగుతుంది. క్లెయిమ్ చేసిన వీడియోల గురించి మరింత తెలుసుకోండి.

 పాలసీలు

మీ కంటెంట్‌పై మరింత కంట్రోల్‌ను పొందడానికి, మీ అనుకూల పాలసీలను రివ్యూ చేసి, ఎడిట్ చేయండి లేదా కొత్త పాలసీలను క్రియేట్ చేయండి. పేర్కొన్న తేదీకి, అలాగే సమయానికి అమలులోకి వచ్చే షెడ్యూల్ చేసిన పాలసీలను కూడా మీరు జోడించవచ్చు. పాలసీల గురించి మరింత తెలుసుకోండి.

 ఎనలిటిక్స్

వీడియోలు, ఛానెల్స్, లేదా అస్సెట్‌ల వంటి వివిధ అంశాలవారీగా మీ కంటెంట్ పనితీరు ఎలా ఉంది అనే దానికి సంబంధించి మరింత సమాచారాన్ని పొందండి. అప్‌డేట్ అయ్యి ఉన్న కొలమానాలు, అలాగే రిపోర్ట్‌లతో మీరు ఆదాయాన్ని, ప్రేక్షకుల జనాభా కేటగిరీలను, ట్రాఫిక్ సోర్స్‌లను, ఇంకా ఇతర సమాచారాన్ని పర్యవేక్షించవచ్చు. ఎనలిటిక్స్ గురించి మరింత తెలుసుకోండి.

 క్యాంపెయిన్‌లు

గత, ప్రస్తుత, అలాగే భవిష్యత్తు క్యాంపెయిన్‌ల లిస్ట్‌ను చూడండి, అలాగే అవి ఏ అస్సెట్‌ల ఆధారంగా క్రియేట్ చేయబడ్డాయో, ఆ అస్సెట్‌లను కూడా చూడండి. ఒక్కో అస్సెట్‌ను ఎంచుకోవడానికి మీరు అస్సెట్ ఆధారిత క్యాంపెయిన్‌లను క్రియేట్ చేయవచ్చు లేదా నిర్దిష్ట అస్సెట్ లేబుల్స్‌తో అనుబంధించబడిన అస్సెట్‌లను ఎంచుకోవడానికి లేబుల్ ఆధారిత క్యాంపెయిన్‌లను క్రియేట్ చేయవచ్చు. క్యాంపెయిన్‌ల గురించి మరింత తెలుసుకోండి.

 వైట్‌లిస్ట్

మీ కంటెంట్ మేనేజర్‌కు చెందిన అస్సెట్‌ల ఆధారంగా ఆటోమేటిక్‌గా క్లెయిమ్ చేయబడకుండా మినహాయించబడిన ఛానెల్స్‌ను వైట్‌లిస్ట్ చూపుతుంది. ఛానెల్ ID లేదా URL ఆధారంగా మీ వైట్‌లిస్ట్‌కు మీరు మరిన్ని ఛానెల్స్‌ను కూడా జోడించవచ్చు. వైట్‌లిస్ట్‌ల గురించి మరింత తెలుసుకోండి.

 రిపోర్ట్‌లు

ఆదాయం, వీడియోలు, అస్సెట్‌లు, రెఫరెన్స్‌లు, క్లెయిమ్‌లు, ఇంకా క్యాంపెయిన్‌లకు సంబంధించిన రిపోర్ట్‌లను చూడండి, అలాగే డౌన్‌లోడ్ చేయండి. రిపోర్ట్‌లు, వారంవారీగా లేదా నెలవారీగా అందుబాటులో ఉంటాయి. రిపోర్ట్‌ల గురించి మరింత తెలుసుకోండి.

 కంటెంట్ డెలివరీ

మీ కంటెంట్ మేనేజర్‌కు అప్‌లోడ్ చేయబడిన కంటెంట్‌కు సంబంధించిన ప్యాకేజీలను చూడండి, అలాగే డౌన్‌లోడ్ చేయండి. మీకు ఈ పేజీలో కంటెంట్‌ను డెలివరీ, అలాగే అప్‌డేట్ చేయడానికి టెంప్లేట్‌లు ఉంటాయి, అలాగే ఈ పేజీ నుండి మీరు ఆ ప్యాకేజీలను అప్‌లోడ్ చేయవచ్చు. YouTubeకు ఫైల్స్‌ను డెలివరీ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

సెట్టింగ్‌లు

ఈమెయిల్ నోటిఫికేషన్‌లు, ఇంకా యూజర్ ప్రాధాన్యతల వంటి ఖాతా సెట్టింగ్‌లను చూడండి, అలాగే మార్చండి. ఖాతా అనుమతులను మేనేజ్ చేయడానికి, ఇక్కడ వేర్వేరు యూజర్ రోల్స్‌ను క్రియేట్ చేయవచ్చు, అలాగే ఎడిట్ చేయవచ్చు. కంటెంట్ మేనేజర్ ఖాతా సెట్టింగ్‌ల గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3248269724473937020
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false