YouTube క్రియేటర్‌గా సహాయాన్ని పొందండి

క్రియేటర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి

మీ ఛానెల్‌కు అర్హత ఉంటే (ఉదాహరణకు, మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉంటే), మీరు సహాయం కోసం YouTube క్రియేటర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు. 

మా సహాయ కేంద్రాన్ని, కమ్యూనిటీ ఫోరమ్‌ను, @TeamYouTubeను ఉపయోగించుకోండి

YouTube సహాయ కేంద్రం

మీరు సరైన ప్రదేశంలోనే ఉన్నారు, ఇది సమస్యలను పరిష్కరించడానికి ఉత్తమమైన ప్రదేశం. ఏ YouTube పేజీ దిగువున అయినా, సహాయం బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా, మీరు ఇక్కడికి ఏ సమయంలోనైనా చేరుకోవచ్చు. మీరు support.google.com/youtube లింక్‌కు కూడా వెళ్లవచ్చు.

మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ విభాగాలను తప్పకుండా చూడండి:

  • క్రియేటర్‌ల కోసం: వీడియోలను క్రియేట్ చేయడంలో, ఇంకా మీ ఛానెల్‌ను మేనేజ్ చేయడంలో సహాయం పొందండి.
  • పార్టనర్‌ల కోసం: మీ కంటెంట్‌ను మానిటైజ్ చేయడంలో, ఇంకా ఇతర పార్టనర్‌లతో సహకరించుకోవడంలో సహాయం పొందండి.

YouTube సహాయ వీడియో ఛానెల్‌లు

తాజా వార్తలతో, అలాగే చిట్కాలతో మిమ్మల్ని అప్‌డేట్‌గా ఉంచే వీడియోల కోసం మా TeamYouTube ఛానెల్‌ను చూడండి.

YouTubeలో మీ ఛానెల్‌ను వృద్ధి చేసుకోవడంలో, అలాగే మీ బిజినెస్‌ను పెంచుకోవడంలో మీకు సహాయపడే బెస్ట్ ప్రాక్టీసు వీడియోల కోసం మా YouTube క్రియేటర్‌ల ఛానెల్‌ను చూడండి.

 YouTube సహాయ కమ్యూనిటీ

TeamYouTube నిర్వహించే - YouTube సహాయ కమ్యూనిటీలో సమాధానాలను కనుగొనండి. TeamYouTube అందించే తాజా అప్‌డేట్‌లను చూడటానికి, మీరు ఫీచర్ చేసిన పోస్ట్‌లను చూడవచ్చు. TeamYouTube అనేది కమ్యూనిటీ మేనేజర్‌ల టీమ్, వీళ్లు రియల్-టైమ్ అప్‌డేట్‌లను షేర్ చేయడానికి, అలాగే సహాయం అందించడానికి, అన్ని YouTube టీమ్‌లతో కలిసి పని చేస్తారు. అలాగే, వారు మీ ఫీడ్‌బ్యాక్‌ను కంపెనీలో చేర్చాల్సిన చోటుకు చేర్చి, అది రివ్యూ అయ్యేలా చూస్తారు.

 @TeamYouTube Twitter హ్యాండిల్

YouTube నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడటానికి రియల్-టైమ్ అప్‌డేట్‌ల కోసం, అలాగే సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన చిట్కాల కోసం, మమ్మల్ని @TeamYouTube ద్వారా Twitterలో ఫాలో చేయండి.

మా టీమ్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, జపనీస్, బహాసా భాషలలో అప్‌డేట్‌లను షేర్ చేస్తుంది, సందేహాలకు సమాధానాలను అందిస్తుంది.

TeamYouTube గురించి మరింత తెలుసుకోండి.

మీ నైపుణ్యాలను పెంపొందించుకోండి

 YouTube క్రియేటర్ చిట్కాలు

YouTube క్రియేటర్ చిట్కాలలో కొత్త క్రియేటర్లకు అన్ని విధాలా అవసరమైన సమాచారం ఉంటుంది. వీడియో, లైవ్ స్ట్రీమ్, ఇంకా Shorts కంటెంట్‌కు సంబంధించిన చిట్కాలను, బెస్ట్ ప్రాక్టీసులను, ఇంకా వ్యూహాలను ఇక్కడ మీరు పొందవచ్చు.

క్రియేటర్ల కోసం YouTube

మెరుగైన వీడియోలను క్రియేట్ చేయడంలో మీకు సహాయపడగల అన్ని ప్రోగ్రామ్‌లు, టూల్స్, అలాగే భవిష్యత్తులో జరగబోయే ఈవెంట్‌ల గురించి తెలుసుకోవడానికి క్రియేటర్ల కోసం YouTube చక్కని వేదికగా నిలుస్తుంది. క్రియేటర్ల కోసం YouTube ప్రయోజనాల ప్రోగ్రామ్ ద్వారా, మీ ఛానెల్‌ను వృద్ధి చేసుకోవడానికి కూడా మీరు సహాయం పొందవచ్చు.

కాపీరైట్ & పాలసీ గురించి తెలుసుకోండి

కాపీరైట్, YouTube పాలసీలను బాగా అర్థం చేసుకోవడానికి ఈ టూల్స్‌ను ఉపయోగించండి. కింద పేర్కొన్న కొన్ని రిసోర్స్‌లు, పరిమిత భాషలలో మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకోండి.

కాపీరైట్ సంబంధిత సందేహాలు

  • కాపీరైట్, హక్కుల మేనేజ్‌మెంట్: మీకు హక్కులకు సంబంధించిన క్లెయిమ్ అందినట్లయితే, సమాచారాన్ని, పరిష్కార ప్రక్రియను, అలాగే తర్వాతి దశలను పొందండి.
  • చట్టపరమైన పాలసీలు: ఈ చట్టపరమైన సమస్యలు అంటే ఏమిటో, అలాగే ఫిర్యాదును ఎలా ఫైల్ చేయాలో అనే దానికి సంబంధించిన సమాచారాన్ని పొందండి.

పాలసీ సంబంధిత సందేహాలు

మేము మా Google లేదా YouTube ఆఫీస్‌లలో దేనిలోనూ వ్యక్తిగత సపోర్ట్‌ను అందించము అని గుర్తుంచుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12522332112495777516
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false