YouTube ఛానెల్స్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

మీరు ఏ ఛానెల్స్ నుండి మరింత కంటెంట్‌ను చూడాలనుకుంటున్నారో ఆ ఛానెల్స్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా YouTube వీడియో కింద లేదా ఛానెల్ పేజీలో 'సబ్‌స్క్రయిబ్ చేయండి' బటన్‌ను కనుగొనవచ్చు. మీరు ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసిన తర్వాత, అది పబ్లిష్ చేసిన ఏ కొత్త వీడియోలు అయినా మీ సబ్‌స్క్రిప్షన్‌ల ఫీడ్‌లో కనిపిస్తాయి.

మీరు సబ్‌స్క్రయిబ్ చేసిన ఛానెల్ కొత్త కంటెంట్‌ను పబ్లిష్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్‌లు రావడం కూడా ప్రారంభం కావచ్చు. ఆటోమేటిక్‌గా, మేము మీకు ఛానెల్ నుండి హైలైట్‌లను మాత్రమే పంపుతాము. మీ నోటిఫికేషన్‌లను మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ప్రారంభించడం | ఏదైనా YouTube ఛానెల్‌కు ఎలా సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలి, ఎందుకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలి

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

YouTube ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

  1. YouTube యాప్‌ను తెరవండి లేదా m.youtube.com లింక్‌కు వెళ్లండి.
  2. YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  3. మీరు మొదటి ట్యాబ్ లో ఉంటే:
    • మీరు ఏ ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియో కింద ఉన్న, ఛానెల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
    • సబ్‌స్క్రయిబ్ చేసుకోండి ను ట్యాప్ చేయండి.
  4. మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలనుకుంటున్న ఛానెల్‌లోని వీడియోను చూస్తున్నట్లయితే:
    • వీడియో కింద ఉన్న, సబ్‌స్క్రయిబ్ చేసుకోండి ను ట్యాప్ చేయండి.

మీరు ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న తర్వాత, మీ స్క్రీన్‌పై సిఫార్సు చేసిన ఛానెల్స్ లిస్ట్ మీకు కనిపిస్తుంది. అవి మీరు ఇప్పటికే సబ్‌స్క్రయిబ్ చేసుకొని లేని సంబంధిత ఛానెల్స్‌పై ఆధారపడి ఉంటాయి. సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి ముందు మీరు ఎప్పుడైనా ఛానెల్ కంటెంట్‌ను చూడవచ్చు.

మీరు నోటిఫికేషన్‌లను పొందినప్పుడు

మీరు ఒక ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నప్పుడు, ఆ ఛానెల్‌లోని హైలైట్‌ల గురించి నోటిఫికేషన్‌లను మేము మీకు ఆటోమేటిక్‌గా పంపుతాము. మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చడం ద్వారా ఛానెల్, కంటెంట్‌ను పబ్లిష్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్‌ను పొందేలా మీరు ఎంచుకోవచ్చు. 

మీరు ఛానెల్‌కు సబ్‌స్క్రిప్షన్ తీసివేసి, ఆ తర్వాత తిరిగి సబ్‌స్క్రయిబ్ చేసుకున్నట్లయితే, మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లు రీసెట్ చేయబడతాయని గమనించండి.

ఛానెల్ ప్రేక్షకులు పిల్లల కోసం రూపొందించబడింది ఆప్షన్‌కు సెట్ చేయబడితే, మీరు నోటిఫికేషన్‌లను పొందరు. అదనంగా, నోటిఫికేషన్ బెల్ నోటిఫికేషన్‌లు వద్దు కు సెట్ చేయబడుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ను మార్చలేరు. 

ఏదైనా YouTube ఛానెల్‌కు ఉన్న సబ్‌స్క్రిప్షన్ తీసివేయండి

  1. YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. మీరు ఏ ఛానెల్ నుండి సబ్‌స్క్రిప్షన్ తీసివేయాలనుకుంటున్నారో, ఆ వీడియోకు వెళ్లండి.
  3. వీడియో ప్లేయర్ కింద, సబ్‌స్క్రయిబ్ చేసుకున్నవి ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. స్క్రీన్ దిగువున, మీరు సబ్‌స్క్రిప్షన్ తీసివేశారని నిర్ధారిస్తూ మీకు ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది.

మీ YouTube సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయండి

సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి ఛానెల్స్‌ను కనుగొనండి

మీకు నచ్చుతాయని మేము భావించిన వీడియోలు, ఛానెల్స్‌ను YouTube మీ మొదటి ట్యాబ్ లో, మీరు వీడియోను చూసిన తర్వాత అందిస్తుంది. మేము ఈ వీడియోలను మీరు చూసిన, ట్రెండ్ అవుతున్న వాటి ఆధారంగా సిఫార్సు చేస్తాము.  

మేము సిఫార్సు చేసినవి మీకు నచ్చకపోతే, మీకు ఆసక్తి లేదు అని మీరు మాకు తెలియజేయవచ్చు.

  • కేటగిరీ ఆధారంగా బ్రౌజ్ చేయడం: మీరు ఒక నిర్దిష్ట సబ్జెక్ట్‌కు సంబంధించిన ఛానెల్స్‌ను చూడాలనుకుంటే, అన్వేషణకు వెళ్లి, వివిధ కేటగిరీలలోని పాపులర్ ఛానెల్స్‌ను చూడండి.
  • సెర్చ్ చేయడం: YouTubeలో మీ ఆసక్తుల కోసం సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. మీరు సెర్చ్ చేసిన దానికి సంబంధించిన ఛానెల్స్‌ను చూపాలంటే, మీ సెర్చ్ ఫలితాల్లో మీరు ఫిల్టర్‌ను ఉపయోగించవచ్చు

మీ YouTube సబ్‌స్క్రిప్షన్‌లు చూడండి

మీరు ఒక ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నప్పుడు, మీ సబ్‌స్క్రిప్షన్‌ల ట్యాబ్ లో మీకు కొత్త వీడియోలు కనిపిస్తాయి. మొదటి ట్యాబ్  మీ సబ్‌స్క్రిప్షన్‌ల నుండి వీడియోలను, అలాగే మీకు ఆసక్తి ఉన్న ఛానెల్స్ లేదా వీడియోల కోసం సిఫార్సులను చూపుతుంది.

మీ సబ్‌స్క్రిప్షన్‌లకు వెళ్లడానికి, ఈ సూచనలను ఫాలో అవ్వండి:

  1. YouTube యాప్‌ను తెరవండి.
  2. YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  3. సబ్‌స్క్రిప్షన్‌ల ట్యాబ్ ను ట్యాప్ చేయండి. 

అన్నీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేసి, మీ ఛానెల్స్ లిస్ట్‌కు వెళ్లి, ఎగువన ఉన్న డ్రాప్-డౌన్ బాణాన్ని ఉపయోగించి మీ ఫలితాలను ఫిల్టర్ చేయవచ్చు.

మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ఛానెల్‌లో కొత్త కంటెంట్ అందుబాటులో ఉన్నప్పుడు, ఛానెల్ పేరు పక్కన మీకు ఒక చుక్క కనిపిస్తుంది. మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ఛానెల్, కంటెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే, ఛానెల్ పేరు పక్కన మీకు “లైవ్” అనే పదం కనిపిస్తుంది.  

మీ YouTube సబ్‌స్క్రిప్షన్‌లలో ఉన్న సమస్యలను పరిష్కరించండి

YouTube సబ్‌స్క్రిప్షన్ పరిమితులు

"చాలా సబ్‌స్క్రిప్షన్‌లు," అనే ఎర్రర్ మెసేజ్ మీకు కనిపిస్తే, మీరు సబ్‌స్క్రిప్షన్ పరిమితిని చేరుకున్నారని అర్థం. ఒక రోజుకు మీరు 75 ఛానెల్స్‌కు మాత్రమే సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

సాధారణంగా, మీరు గరిష్ఠంగా 2,000 ఛానెల్స్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు. కానీ, మీ YouTube ఛానెల్ వృద్ధి చెందే కొద్దీ, మీ సబ్‌స్క్రిప్షన్ పరిమితి కూడా పెరుగుతుంది—మీ ఛానెల్‌కు ఎంత మంది సబ్‌స్క్రయిబర్‌లు ఉన్నారనే దానితో లేదా మీ ఖాతా ఎప్పటి నుండి ఉంది అనే దానితో ఇది ముడిపడి ఉంటుంది. మీ పరిమితులు ఖచ్చితంగా ఎంత అనేది కాలక్రమేణా మారవచ్చు.

సబ్‌స్క్రిప్షన్‌ల ఫీడ్, ఛానెల్ లిస్ట్ ఉత్తమ అనుభవాన్ని అందిస్తాయని నిర్ధారించుకోవడానికి మీ ఖాతా పరిమితిని 5,000 ఛానెల్ సబ్‌స్క్రిప్షన్‌లకు పెంచమని మేము సిఫార్సు చేస్తున్నాము.

మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఛానెల్స్‌కు సబ్‌స్క్రయిబ్ చేస్తున్న థర్డ్ పార్టీ ఎక్స్‌టెన్షన్‌లు

మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకోని వీడియోలు, ఛానెల్స్ నుండి, లేదా మీరు సబ్‌స్క్రిప్షన్ తీసివేసిన కంటెంట్ నుండి మీరు నోటిఫికేషన్‌లు పొందుతుంటే, అది మీ అనుమతి లేకుండానే బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ మిమ్మల్ని సబ్‌స్క్రయిబ్ చేయడం వల్ల కావచ్చు. బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లను ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

నోటిఫికేషన్‌లకు, సబ్‌స్క్రిప్షన్‌ల ఫీడ్‌కు మధ్య ఉన్న తేడా

మీ సబ్‌స్క్రిప్షన్‌ల నుండి ఇటీవల అప్‌లోడ్ చేసిన వీడియోలు ఏవైనా ఉంటే, మొబైల్, కంప్యూటర్‌లో అందుబాటులో ఉన్న సబ్‌స్క్రిప్షన్‌ల ఫీడ్ వాటిని చూపుతుంది.

నోటిఫికేషన్‌లు అనేవి కొత్త వీడియోలు, మీ సబ్‌స్క్రిప్షన్‌ల నుండి షేర్ అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నప్పుడు, అలాగే మీకు నచ్చే కంటెంట్ గురించి మీకు తెలియజేయగలవు. మేము ఈమెయిళ్లు, వ్యక్తిగతీకరించిన నోటిఫికేషన్‌లను మొబైల్, లేదా మీ కంప్యూటర్‌లో లేదా మొబైల్ పరికరంలో, ఇన్‌బాక్స్ నోటిఫికేషన్‌లకు పంపుతాము. మీరు ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నప్పుడు, యాక్టివిటీ హైలైట్‌లతో వ్యక్తిగతీకరించిన నోటిఫికేషన్‌లు మీకు ఆటోమేటిక్‌గా అందుతాయి.

ఇన్‌బాక్స్ నోటిఫికేషన్‌లు సమయానుసారంగా వర్గీకరించబడతాయి, ఎగువున కొత్త నోటిఫికేషన్‌లు ఉంటాయి. కొన్ని నోటిఫికేషన్‌లు "ముఖ్యమైనవి" విభాగంలో కొత్త వాటి పైన ప్రదర్శించబడవచ్చు, ఇవి మీకు అత్యంత సంబంధితంగా ఉంటాయని మేము భావిస్తున్న నోటిఫికేషన్‌లను ఫీచర్ చేస్తాయి. ముఖ్యమైన నోటిఫికేషన్‌లకు సంబంధించిన ఉదాహరణలలో భాగంగా ఇవి ఉంటాయి: మీ కామెంట్‌కు రిప్లయి, లేదా వ్యక్తులు మీ వీడియోలను షేర్ చేయడం.

సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ఛానెల్ నుండి అన్ని నోటిఫికేషన్‌లను పొందడానికి, నోటిఫికేషన్ బెల్ ను ట్యాప్ చేయండి. మీరు అన్ని నోటిఫికేషన్‌లను ఎంచుకున్నారని సూచించడానికి, బెల్, ఆపై మోగుతున్న బెల్ గా మారుతుంది.

ఛానెల్ ప్రేక్షకులు పిల్లల కోసం రూపొందించబడింది ఆప్షన్‌కు సెట్ చేయబడితే, మీరు నోటిఫికేషన్‌లను పొందరు. నోటిఫికేషన్ బెల్ నోటిఫికేషన్‌లు వద్దు కు కూడా సెట్ చేయబడుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ను మార్చలేరు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
185893213367701142
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false