మీ YouTube ఛానెల్‍‌ను ఒక బ్రాండ్ ఖాతా నుండి వేరొక బ్రాండ్ ఖాతాకు తరలించండి

మీరు ప్రారంభించడానికి ముందు:

YouTube ఛానెల్ ఆటోమేటిక్‌గా ఒక ఖాతాకు కనెక్ట్ చేయబడి ఉంటుంది. రెండు రకాల ఖాతాలు ఉన్నాయి:

Google ఖాతా YouTubeకు సైన్ ఇన్ చేయడానికి మీకు Google ఖాతా అవసరం. మీ ఛానెల్ పేరు ఆటోమేటిక్‌గా మీ Google ఖాతాలోని పేరు మాదిరిగానే ఉంటుంది.
బ్రాండ్ ఖాతా

బ్రాండ్ ఖాతా అనేది మీ బ్రాండ్ కోసం ప్రత్యేకంగా ఉండే ఖాతా. ఈ ఖాతా, మీ వ్యక్తిగత Google ఖాతా, రెండూ వేర్వేరు. ఒకవేళ ఛానెల్, బ్రాండ్ ఖాతాకు లింక్ అయ్యి ఉన్నట్లయితే, ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలు దానిని మేనేజ్ చేయవచ్చు.

బ్రాండ్ ఖాతాను క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి:

  1. ముందుగా, మీకు ఇప్పటికే బ్రాండ్ ఖాతా ఉందో, లేదో చెక్ చేయండి.
  2. YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  3. మీ ఛానెల్ లిస్ట్‌కు వెళ్లండి.
  4. ఛానెల్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. బ్రాండ్ ఖాతాకు పేరు పెట్టడానికి అలాగే మీ ఖాతాను వెరిఫై చేయడానికి వివరాలను పూరించండి.
  6. క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఛానెల్ బదిలీ ప్రమాదాలు

మీరు మీ ఛానెల్‌ను, దాని వీడియోలను ఒకే Google ఖాతాతో అనుబంధించినంత వరకు మీరు దాన్ని ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు తరలించవచ్చు. ఈ ప్రాసెస్‌ను ఛానెల్ బదిలీ అంటారు.

సున్నితమైన ఖాతా సైన్-ఇన్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి, అలాగే ఏవైనా సమస్యలు తలెత్తడానికంటే ముందే మీ ఖాతాకు యాక్సెస్‌ను నిర్వహించడానికి ముందస్తుగా ప్లాన్‌ను రూపొందించడం అనేది మీ బాధ్యత. మీ ఛానెల్‌ను రికవర్ చేయడానికి, ఖాతా రికవరీకి సంబంధించిన ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

మీ బ్రాండ్ ఖాతాను మరొక బ్రాండ్ ఖాతాకు తరలించడం అనేది మీరు మాత్రమే పూర్తి చేయగల ప్రాసెస్, అయితే ఇది అవసరమైతే మాత్రమే చేయాలి. ఒకవేళ బదిలీ తప్పుగా జరిగితే, మీరు తప్పు ఛానెల్‌ను తొలగించే ప్రమాదం ఉంది.    

బ్రాండ్ ఖాతా బదిలీని పూర్తి చేయడం వల్ల మీరు ఏమి కోల్పోతారు:

ఖాతా కోల్పోయే కంటెంట్
బ్రాండ్ ఖాతా A: బదిలీ చేయబడే ఛానెల్‌తో అనుబంధించబడింది
బ్రాండ్ ఖాతా B: రీప్లేస్ చేయబడే ఛానెల్‌తో అనుబంధించబడింది (బ్రాండ్ ఖాతా A బదిలీ అయిన తర్వాత తొలగించబడుతుంది)
  • వీడియోలు
  • మెసేజ్‌లు
  • ప్లేలిస్ట్‌లు
  • ఛానెల్ హిస్టరీ
  • వెరిఫికేషన్ బ్యాడ్జ్

మీ ఛానెల్‌ను ఒక బ్రాండ్ ఖాతా నుండి మరొక బ్రాండ్ ఖాతాకు తరలించండి:

మీ ఖాతా పర్యవేక్షించబడే ఖాతా అయితే, మీరు మీ ఛానెల్‌ను తరలించలేరు. ఛానెల్ బదిలీకి కావల్సిన అర్హతల ఆధారంగా స్కూల్ ఖాతా దాని ఛానెల్‌ను బదిలీ చేసే ఆప్షన్‌ను కలిగి ఉండవచ్చు.

మీరు ప్రారంభించే ముందు, వీటిని వెరిఫై చేయండి:

  • మీ Google ఖాతానే ప్రధాన ఖాతా ఓనర్ అని. 
  • మీరు YouTube Studioలో ఛానెల్ అనుమతుల నుండి మీ ఛానెల్‌ను నిలిపివేశారు. మీ ఛానెల్ బ్రాండ్ ఖాతాను ఉపయోగిస్తూ, అనుమతులకు తరలించబడినట్లయితే ఇది వర్తిస్తుంది. 
    • సమ్మతిని నిలిపివేయడానికి, YouTube Studio సెట్టింగ్‌లు ఆ తర్వాత అనుమతులు కింద “YouTube Studioలో అనుమతులను నిలిపివేయండి”ని ఎంచుకోండి.
  • మీరు ఛానెల్ అనుమతులు ఉన్న మీ ఛానెల్‌కు ఇతర యూజర్‌ల యాక్సెస్‌ను ఇవ్వలేదు. 

  1. YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటోను క్లిక్ చేయండి.
  3. అవసరమైతే, మీరు తరలించాలనుకుంటున్న ఛానెల్‌తో అనుబంధించబడి ఉన్న Google ఖాతాకు ఖాతాలను మార్చండి.

    హెచ్చరిక:

    మీరు అనుకోకుండా తప్పు ఛానెల్‌ను తొలిగించవచ్చు. ఈ పొరపాటును నివారించడానికి, మీరు తరలించాలనుకుంటున్న ఛానెల్‌తో అనుబంధించబడిన Google ఖాతాలో ఉన్నారని నిర్దారించుకోండి. 

    ఉదాహరణకు, ఛానెల్ A అనేది మీ పాత ఛానెల్. ఛానెల్ B అనేది మీరు బదిలీ చేస్తున్న ఛానెల్. మీరు తప్పనిసరిగా ఛానెల్ Aకు సైన్ ఇన్ చేయాలి.

  4. సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  5. అధునాతన సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. బ్రాండ్ ఖాతాకు ఛానెల్‌ను తరలించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. మీ స్క్రీన్‌పై ఉన్న లిస్ట్‌లో, మీరు ఏ ఖాతాకు తరలించాలనుకుంటున్నారో, ఆ ఖాతాను ఎంచుకోండి. మీ వద్ద ఖాతాల లిస్ట్ లేకపోతే, పైన పేర్కొన్న దశలను ఉపయోగించి పరిష్కరించండి.
  8. మీరు ఎంచుకున్న ఖాతా ఇప్పటికే ఏదైనా YouTube ఛానెల్‌తో అనుబంధించబడి ఉంటే, రీప్లేస్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఆ తర్వాత పాప్-అప్ అయ్యే బాక్స్‌లో ఛానెల్‌ను తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • ముఖ్య గమనిక: అలా చేయడం వలన ఆ ఖాతాతో ఇప్పటికే అనుబంధించబడిన ఛానెల్ తొలగించబడుతుంది. వీడియోలు, కామెంట్‌లు, మెసేజ్‌లు, ప్లేలిస్ట్‌లు, హిస్టరీతో సహా ఈ ఛానెల్‌తో అనుబంధించబడిన కంటెంట్ ఏదైనా ఉంటే అది శాశ్వతంగా తొలగించబడుతుంది.
  9. తరలించిన తర్వాత మీ ఛానెల్ పేరు ఎలా కనిపిస్తుందో చెక్ చేయండి, ఆ తర్వాత ఛానెల్‌ను తరలించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15145140769510779315
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false