​ఆత్మహత్య, స్వీయ హాని, ఆహార రుగ్మతలకు సంబంధించిన పాలసీ

మా క్రియేటర్‌లు, వీక్షకులు, అలాగే పార్ట్‌నర్‌ల భద్రతకు మేము అత్యంత ప్రాధాన్యతనిస్తాము. ప్రత్యేకమైన, ఉత్సాహవంతమైన ఈ కమ్యూనిటీని సంరక్షించడంలో మాకు మీ అందరి సహాయం అవసరమవుతుంది. మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను, అలాగే YouTubeను సురక్షితం చేయడంలో వాటి పాత్రను మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కింది పాలసీని జాగ్రత్తగా చదివేందుకు సమయం తీసుకోండి. మా గైడ్‌లైన్స్ పూర్తి లిస్ట్ కోసం మీరు ఈ పేజీని కూడా చూడవచ్చు.
YouTubeలో, మేము మా క్రియేటర్‌లతో పాటు వీక్షకులందరి ఆరోగ్యానికి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాము. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండటం, అలాగే అర్థం చేసుకోవడమనేది చాలా ముఖ్యం. డిప్రెషన్, స్వీయ హాని, ఆహార రుగ్మతలు, లేదా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించి తమ అనుభవాలను చర్చించే కంటెంట్‌ను పోస్ట్ చేయడం వంటి వాటి ద్వారా తమ కథనాలను షేర్ చేస్తున్న క్రియేటర్‌లను మేము సపోర్ట్ చేస్తాము.

అయితే, షాక్‌కు గురి చేయడానికి లేదా అసహ్యం కలిగించడానికి ఉద్దేశించిన, లేదా వీక్షకులకు గణనీయమైన రిస్క్‌కు కారణం అయ్యే విధంగా ఆత్మహత్య, స్వీయ హాని, లేదా ఆహార రుగ్మతలను ప్రమోట్ చేసే కంటెంట్‌ను మేము YouTubeలో అనుమతించము. కొన్ని సందర్భాల్లో, మేము విద్యాపరమైన, డాక్యుమెంటరీ, శాస్త్రీయ, లేదా కళాత్మక సందర్భం ఉన్న కంటెంట్‌కు మినహాయింపులు ఇవ్వవచ్చు, ఇందులో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కంటెంట్ కూడా ఉంటుంది.

మీకు ఇలాంటి కంటెంట్ కనిపిస్తే ఏం చేయాలి

ఎవరైనా ప్రమాదంలో ఉన్నారని మీరు భావిస్తే:

ఏదైనా మానసిక ఆరోగ్యం, ఆత్మహత్య, స్వీయ హాని, లేదా ఆహార రుగ్మతకు సంబంధించిన కంటెంట్ మీకు కనిపించడం వల్ల మీరు ప్రతికూలంగా ప్రభావితమవుతున్నట్లు మీకు అనిపిస్తే, మీకు సపోర్ట్ అందుబాటులో ఉందని, అలాగే మీరు ఒంటరి వారు కాదని తెలుసుకోండి. తదుపరి విభాగంలో, రిసోర్స్‌ల లిస్ట్‌ను, అలాగే సలహాలు అందించగల సంస్థలకు సంబంధించిన కాంటాక్ట్ సమాచారాన్ని మీరు చూడవచ్చు.

మీకు ఎవరి విషయంలోనైనా ఆందోళన ఉంటే, వారితో ఎలా మాట్లాడాలనే దానిపై జనరల్ గైడెన్స్ కోసం, లోకల్ హెల్ప్‌లైన్‌లను సంప్రదించండి.

మీకు సపోర్ట్ అవసరమైతే ఏం చేయాలి

మానసిక ఆరోగ్యం, ఆత్మహత్య, స్వీయ హాని, ఆహార రుగ్మత మొదలైన అంశాలకు సంబంధించిన కంటెంట్ ఏదైనా మీకు ఎదురయ్యి, అది మీపై నెగెటివ్‌గా ప్రభావం చూపుతోందని భావిస్తే ఇది గుర్తుంచుకోండి: ఇలా అనిపించడం అరుదు కాదు, మీకు మాత్రమే కాక పలువురికి ఈ భావనలు వస్తాయి. వీటి నుండి ఉపశమనం పొందడానికి గాను అవసరమైన సపోర్ట్ మీకు లభిస్తుంది. బాధాకరమైన భావోద్వేగాలతో పోరాడుతున్నప్పుడు, చాలా మంది ఈ సమస్యలను ఎదుర్కొంటారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తితో లేదా సంస్థతో మాట్లాడటం వల్ల, సంరక్షణ అవసరమైనంత స్థాయిలో మీకు ఏదైనా మానసిక అనారోగ్యం ఉందా అన్నది అంచనా వేసుకోవచ్చు. కష్టతరమైన భావనలను ఆరోగ్యకరంగా, ప్రభావవంతంగా ఎదుర్కొనే వ్యూహాలను గుర్తించి, నియంత్రించుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఈ సంభాషణ మీకు సహాయపడగలదు.

ఆత్మహత్య, స్వీయ హాని నివారణ సపోర్ట్ రిసోర్స్‌లు

వివిధ దేశాలు, ప్రాంతాల్లో అవసరమైన వారికి సహాయం చేయడానికి అంకితమైన సంస్థల లిస్ట్ దిగువున చేర్చాము. ఇవి గుర్తింపు పొందిన సంక్షోభ (క్రైసిస్) సర్వీస్ పార్ట్‌నర్‌లు. భాగస్వామ్యాలు దేశాన్ని/ప్రాంతాన్ని బట్టి మారతాయి.

ఇక్కడ లిస్ట్ చేయని ప్రాంతాలకు సంబంధించి సంస్థలను కనుగొనడంలో findahelpline.com, www.wikipedia.org/wiki/List_of_suicide_crisis_lines వెబ్‌సైట్‌లు మీకు సహాయపడవచ్చు.

ఆస్ట్రేలియా

Lifeline Australia

13 11 14

అర్జెంటీనా Centro de Asistencia al Suicida - Buenos Aires

135 (desde Capital y Gran Buenos Aires)

(011) 5275-1135 (desde todo el país)

బ్రెజిల్ Centro de Valorização da Vida 188
బెల్జియం

Centre de Prévention du Suicide /

Centrum ter preventie van zelfdoding vzw

0800 32 123

1813

బెల్జియం Community Help Service 32 2 648 4014
బల్గేరియా Български Червен Кръст 02 492 30 30
చెక్ రిపబ్లిక్ Psychiatrická léčebna Bohnice - Centrum krizové intervence
+420 284 016 666
కెనడా

Talk Suicide Canada
Parlons Suicide Canada

988
కోస్టారికా Línea Aquí Estoy +506 2272-3774
డెన్మార్క్ Livslinien 70201201
ఫ్రాన్స్ S.O.S Amitié 09 72 39 40 50
ఫిన్‌లాండ్ Suomen Mielenterveysseura / Kansallinen kriisipuhelin 09-2525-0111
జర్మనీ Telefonseelsorge 0800 111 01 11
0800 111 02 22
116 123
గ్రీస్ ΚΛΙΜΑΚΑ 1018
హాంకాంగ్ 香港撒瑪利亞防止自殺會 2389 2222
హంగేరీ S.O.S. Telefonos Lelki Elsősegély Szolgálat 06 1 116-123
భారతదేశం iCALL 091529 87821
ఐర్లాండ్ Samaritans 116 123
ఇజ్రాయెల్ ער"ן - עזרה ראשונה נפשית 1201
ఇటలీ Samaritans Onlus 800 86 00 22
జపాన్ こころの健康相談統一ダイヤル 0570-064-556
న్యూజిలాండ్ లైఫ్‌లైన్ న్యూజిలాండ్ 0800 543 354
నెదర్లాండ్స్ Stichting 113Online 0900-0113
నార్వే Mental Helse 116 123
పాకిస్థాన్ Umang Mental Health Helpline 03117786264
పెరూ Ministerio de Salud 113
రష్యా Фонд поддержки детей, находящихся в трудной жизненной ситуации 8-800-2000-122
సింగపూర్ Samaritans of Singapore

1800-221-4444

1767

స్పెయిన్

Telèfon de l'Esperança de Barcelona

Teléfono de la Esperanza

93 414 48 48

717 003 717

దక్షిణ కొరియా 보건복지부 자살예방상담전화 109
స్విట్జర్లాండ్

Die Dargebotene Hand

La Main Tendue

Telefono Amico

143
తైవాన్ 生命線協談專線 1995
థాయ్‌లాండ్ กรมสุขภาพจิต กระทรวงสาธารณสุข 1323
యునైటెడ్ కింగ్‌డమ్ Samaritans 116 123
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

Suicide & Crisis Lifeline

988 /Chat

YouTubeలో మీరు సురక్షితంగా ఉన్నారనే భావనను కలిగించడంలో సహాయపడే చిట్కాలను చదవడానికి, వీడియోలను చూడటానికి, క్రియేటర్ భద్రతా కేంద్రం లింక్‌కు వెళ్లండి.

ఆహార రుగ్మతలకు సంబంధించిన సపోర్ట్ రిసోర్స్‌లు

ఆహార రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడే సంస్థల లిస్ట్ కింద ఉంది. ఈ సంస్థలు మానసిక ఆరోగ్యం విషయంలో సపోర్ట్ అందించే పార్ట్‌నర్‌లు. భాగస్వామ్యాలు దేశాన్ని/ప్రాంతాన్ని బట్టి మారతాయి.

ఆస్ట్రేలియా Butterfly Foundation 1800 33 4673
బ్రెజిల్ Centro de Valorização da Vida 188
కెనడా National Eating Disorder Information Centre 18666334220
కెనడా Anorexie et Boulimie Québec 18006300907
ఫ్రాన్స్ Fédération Française Anorexie Boulimie 09 69 325 900
జర్మనీ BZgA - Essstörungen.de
భారతదేశం Vandrevala Foundation 91 9999 666 555
జపాన్ 摂食障害相談ほっとライン 0477108869
మెక్సికో Línea de la Vida 8009112000
దక్షిణ కొరియా 국립정신건강센터 15770199
యునైటెడ్ కింగ్‌డమ్ BEAT Eating Disorders 0808 801 0677 ఇంగ్లండ్
0808 801 0432 స్కాట్లాండ్
0808 801 0433 వేల్స్
0808 801 0434 N. ఐర్లాండ్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా Substance Abuse and Mental Health Services Administration 1-800-662-4357

ఆత్మహత్య, స్వీయ హాని, లేదా ఆహార రుగ్మతలకు చెందిన కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి సంబంధించిన కమ్యూనిటీ గైడ్‌లైన్స్

సపోర్ట్ చేసేలా, హాని కలిగించని విధంగా, మానసిక ఆరోగ్యం, ఆత్మహత్య, స్వీయ హాని, అలాగే ఆహార రుగ్మతలకు సంబంధించిన టాపిక్‌ల గురించి బాహాటంగా మాట్లాడటానికి YouTube యూజర్‌లు భయపడకూడదు.

అయితే, కొన్ని సందర్భాల్లో సున్నితమైన కంటెంట్ క్రియేట్ చేయబడవచ్చు, అది కొంత మంది యూజర్‌లకు రిస్క్‌కు గురి చేసే అవకాశం ఉంది. ఆత్మహత్య, స్వీయ హాని, లేదా ఆహార రుగ్మతలకు సంబంధించిన టాపిక్‌లు కలిగిన కంటెంట్‌ను మీరు క్రియేట్ చేసినప్పుడు, ఇతర యూజర్‌లపై, ముఖ్యంగా మైనర్‌లపై, అలాగే ఈ కంటెంట్ విషయంలో సున్నితంగా ఉండే యూజర్‌లపై మీ కంటెంట్ ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలను పరిగణనలోకి తీసుకోండి.

మీ వీక్షకులను, ఇతర యూజర్‌లను రక్షించడానికి, అలాగే వారికి సపోర్ట్‌ను అందించడానికి, ఆత్మహత్య, స్వీయ హాని, లేదా ఆహార రుగ్మతలకు సంబంధించిన కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు దయచేసి కింది కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వండి. ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవకపోవడం వల్ల, యూజర్‌లను రక్షించడానికి స్ట్రయిక్ జారీ చేయబడవచ్చు లేదా మీ కంటెంట్ తీసివేయబడవచ్చు, లేదా ఇతర పరిమితులు విధించబడవచ్చు. మరింత తెలుసుకోండి.

వీడియోలకు, వీడియో వివరణలకు, కామెంట్‌లకు, లైవ్ స్ట్రీమ్‌లకు, ఏ ఇతర YouTube ప్రోడక్ట్ లేదా ఫీచర్‌కు అయినా ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ పాలసీ వర్తిస్తుంది. ఇది పూర్తి లిస్ట్ కాదని, ఇంకా వేరే ప్రోడక్ట్‌లు కూడా ఉండవచ్చని గుర్తుంచుకోండి. ఈ పాలసీలు మీ కంటెంట్‌లో ఉండే ఎక్స్‌టర్నల్ లింక్‌లకు కూడా వర్తిస్తాయని దయచేసి గమనించండి. ఇందులో క్లిక్ చేయడానికి వీలయ్యే URLలు, వీడియోలో ఇతర సైట్‌లకు యూజర్‌లను మౌఖికంగా మళ్లించడం, అలాగే ఇతర రూపాలు కూడా ఉంటాయి.

ఈ కింది కంటెంట్‌ను పోస్ట్ చేయవద్దు:

  • ఆత్మహత్య, స్వీయ హాని, లేదా ఆహార రుగ్మతలను ప్రమోట్ చేసే లేదా ప్రోత్సహించే కంటెంట్
  • ఆత్మహత్య ద్వారా ఎలా మరణించాలి, స్వీయ హానికి ఎలా పాల్పడాలి, లేదా ఆహారాన్ని తీసుకోవడంలో క్రమబద్ధత లోపించే ప్రవర్తనల (వాటిని ఎలా దాచాలి అనే దానితో సహా) గురించి సూచనలు
  • మైనర్‌లను లక్ష్యంగా చేసుకున్న ఆత్మహత్య, స్వీయ హాని, లేదా ఆహారపు రుగ్మతలకు సంబంధించిన కంటెంట్
  • స్వీయ హానిని స్పష్టంగా చూపే ఇమేజ్‌లు
  • పూర్తిగా బ్లర్ అయ్యేలా లేదా కవర్ చేయబడితే తప్ప, ఆత్మహత్య బాధితుల శరీరాలకు సంబంధించిన విజువల్స్
  • సరిపడే సందర్భం లేకుండా, ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు లేదా ఆత్మహత్యా ప్రయత్నాలను అలాగే ఆత్మహత్య నుండి కాపాడే ఫుటేజ్‌ను చూపించే వీడియోలు
  • ఆత్మహత్య లేదా స్వీయ హాని ఛాలెంజ్‌లలో (ఉదా. బ్లూ వేల్ లేదా మోమో ఛాలెంజ్‌లు) పాల్గొంటున్నట్లుగా లేదా పాల్గొనడానికి సంబంధించిన సూచనలను చూపించే కంటెంట్
  • సరిపడే సందర్భం లేకుండా ఆత్మహత్య నోట్స్ లేదా లేఖలు
  • ఆహార రుగ్మతల సందర్భంలో బరువు-ఆధారిత బెదిరింపులు ఉన్న కంటెంట్

ఆత్మహత్య, స్వీయ హాని, లేదా ఆహార రుగ్మత కంటెంట్‌ను అనుమతించాలా, వయోపరిమితి విధించాలా, తీసివేయాలా, లేదా వీడియోలో విపత్తు సహాయక రిసోర్స్ ప్యానెల్‌ను ఉంచాలా అనే దానిని నిర్ణయించేటప్పుడు మేము కొన్ని సందర్భాల్లో కింది ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. దయచేసి ఇది పూర్తి లిస్ట్ కాదని గమనించండి:

  • విద్యా సంబంధిత, డాక్యుమెంటరీ, శాస్త్ర సంబంధిత, లేదా కళాత్మకమైన ఉద్దేశం గల కంటెంట్
  • కాంగ్రెషనల్ లేదా పార్లమెంటరీ ప్రొసీడింగ్‌లు, క్యాంపెయిన్ స్పీచ్‌లు లేదా కొనసాగుతున్న ప్రభుత్వ చర్యలపై చర్చల వంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కంటెంట్
  • సరిపడా బ్లర్ చేసిన గ్రాఫిక్ కంటెంట్
  • యానిమేషన్‌లు, వీడియో గేమ్‌లు, మ్యూజిక్ వీడియోలు, ఇంకా సినిమాలు అలాగే షోలలోని క్లిప్‌లతో సహా, వీటికి మాత్రమే పరిమితం కాకుండా, నాటకీకరణలు లేదా స్క్రిప్ట్‌తో కూడిన కంటెంట్
  • ఆత్మహత్య లేదా స్వీయ హాని పద్ధతులు, లొకేషన్‌లు, హాట్‌స్పాట్‌లకు సంబంధించిన వివరణాత్మక చర్చ
  • స్వీయ హాని లేదా ఆత్మహత్యకు సంబంధించిన స్పష్టంగా చూపే వివరణలు
  • వీక్షకులను రిస్క్‌లో పడేసే విధంగా ట్రిగ్గర్ చేసే వివరాలతో ఉన్న ఆహార రుగ్మత రికవరీ కంటెంట్

అయితే, ఇది ఆత్మహత్య, స్వీయ హాని, లేదా ఆహార రుగ్మతలకు సంబంధించిన కంటెంట్‌ను ప్రమోట్ చేయడానికి ఏకపక్షంగా అనుమతి ఇచ్చినట్లు కాదు.

ఆత్మహత్య, స్వీయ హాని, లేదా ఆహార రుగ్మతల గురించి కంటెంట్‌ను పోస్ట్ చేసే క్రియేటర్‌ల కోసం బెస్ట్ ప్రాక్టీసులు

హాని, క్షోభ నుండి మీ వీక్షకులను రక్షించడానికి, ఆత్మహత్య లేదా స్వీయ హానికి సంబంధించిన కంటెంట్‌లో ఈ బెస్ట్ ప్రాక్టీసులను ఉపయోగించమని మేము సిఫార్సు చేస్తున్నాము:

  • ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చూపడం మానుకోండి, వారి, అలాగే వారి ఫ్యామిలీల గోప్యతను గౌరవించండి. మరింత తెలుసుకోండి.
  • సానుకూలంగా, సపోర్ట్ చేసే విధంగా ఉన్న, ఇంకా రికవరీ, నివారణపై ఫోకస్ చేసే పదజాలాన్ని ఉపయోగించండి, అలాగే ఆశావహ కథనాలను ఉపయోగించండి.
  • ఆత్మహత్య, స్వీయ హాని నివారణ, అలాగే వాటిని ఎదుర్కొనే వ్యూహాలకు సంబంధించిన సమాచారాన్ని, రిసోర్స్‌లను చేర్చండి. వీడియోతో పాటు వీడియో వివరణలో కూడా దీన్ని చేర్చడానికి ట్రై చేయండి.
  • సంచలనాత్మక భాష లేదా కళాత్మక విజువల్స్‌ను ఉపయోగించవద్దు.
  • సందర్భాన్ని అందించండి, కానీ బాధితులు ఆత్మహత్య ద్వారా ఎలా మరణించారనేది చర్చించడాన్ని నివారించండి. పద్ధతులు లేదా లొకేషన్‌ల గురించి పేర్కొనవద్దు.
  • ఆత్మహత్య బాధితుల ఇమేజ్‌లు ఉన్న కంటెంట్‌ను బ్లర్ చేయండి. YouTube Studioలోని ఎడిటర్‌తో మీరు మీ వీడియోను బ్లర్ చేయవచ్చు. మరింత తెలుసుకోండి.

హాని, క్షోభ నుండి మీ వీక్షకులను రక్షించడానికి ఆహార రుగ్మతలకు సంబంధించిన కంటెంట్‌లో ఈ బెస్ట్ ప్రాక్టీసులను ఉపయోగించమని మేము సిఫార్సు చేస్తున్నాము:

  • ఆహారాన్ని తీసుకోవడంలో క్రమబద్ధత లోపించే ప్రవర్తనకు సంబంధించిన వివరాలకు బదులుగా రుగ్మత ప్రభావంపై దృష్టి పెట్టండి.
  • ఆహార రుగ్మతలు సాధారణంగా తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయని మీ ప్రేక్షకులకు చెప్పండి.
  • ఆహార రుగ్మత నివారణ, దాని నుండి బయటపడే వ్యూహాలకు సంబంధించిన సమాచారాన్ని, రిసోర్స్‌లను చేర్చండి. వీడియోతో పాటు వీడియో వివరణలో కూడా దీన్ని చేర్చడానికి ట్రై చేయండి.

కంటెంట్ ఈ పాలసీని ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుంది

మీ కంటెంట్ ఈ పాలసీని ఉల్లంఘిస్తే, మేము కంటెంట్‌ను తీసివేసి, మీకు ఆ విషయాన్ని తెలియజేయడానికి ఈమెయిల్‌ను పంపుతాము. మీరు పోస్ట్ చేసిన లింక్ సురక్షితమని మేము వెరిఫై చేయలేకపోతే, మేము లింక్‌ను తీసివేయవచ్చు. పాలసీని ఉల్లంఘించే URLలను వీడియోలో లేదా వీడియో మెటాడేటా‌లో పోస్ట్ చేయడం వలన వీడియోను తీసివేసే అవకాశం ఉంటుందని గమనించండి.

మీరు మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి అయితే, మీ ఛానెల్‌కు ఎలాంటి జరిమానా విధించకుండా ఒక హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. హెచ్చరిక గడువు 90 రోజుల తర్వాత ముగిసేందుకు వీలుగా, మీరు పాలసీ ట్రెయినింగ్‌ను తీసుకునే ఆప్షన్ ఉంది. 90 రోజుల వ్యవధి ట్రెయినింగ్ పూర్తయినప్పటి నుండి ప్రారంభమవుతుంది, హెచ్చరిక జారీ అయినప్పటి నుండి కాదు. అయితే, అదే పాలసీని ఆ 90 రోజుల వ్యవధిలో ఉల్లంఘిస్తే, హెచ్చరిక గడువు ముగియకపోవచ్చు, మీ ఛానెల్ స్ట్రయిక్‌ను అందుకునే అవకాశం ఉంది. మీరు ట్రెయినింగ్‌ను పూర్తి చేసిన తర్వాత వేరొక పాలసీని ఉల్లంఘిస్తే, మీకు మరొక హెచ్చరిక వస్తుంది.

మీరు 90 రోజుల్లోపు 3 స్ట్రయిక్‌లను అందుకుంటే, మీ ఛానెల్ రద్దు కావచ్చు. మా స్ట్రయిక్‌ల సిస్టమ్ గురించి మరింత తెలుసుకోండి.

కమ్యూనిటీ గైడ్‌లైన్స్ లేదా సర్వీస్ నియమాలకు సంబంధించి పదే పదే ఉల్లంఘనలకు పాల్పడినందుకు, మేము మీ ఛానెల్‌ను లేదా ఖాతాను రద్దు చేయవచ్చు. తీవ్రమైన దుర్వినియోగం ఒక్కసారే జరిగినప్పటికీ లేదా పాలసీని ఉల్లంఘించే ఉద్దేశంతోనే ఏదైనా ఛానెల్ వ్యవహరిస్తే కూడా మేము మీ ఛానెల్‌ను లేదా ఖాతాను రద్దు చేయవచ్చు. పదే పదే ఉల్లంఘించే వారిని భవిష్యత్తులో పాలసీ ట్రెయినింగ్‌లను తీసుకోకుండా మేము నిరోధించవచ్చు. ఛానెల్ లేదా ఖాతా రద్దుల గురించి మరింత తెలుసుకోండి.

చివరిగా, మీరు మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించే కంటెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేస్తారని మీరు సూచించినట్లయితే, లైవ్ స్ట్రీమింగ్‌కు మీకు ఉండే యాక్సెస్‌ను కూడా మేము పరిమితం చేయవచ్చు. లైవ్ స్ట్రీమింగ్‌పై పరిమితుల గురించి మరింత తెలుసుకోండి.

హెచ్చరికలు అలాగే సపోర్ట్ చేసే రిసోర్స్‌లు

ఏదైనా కంటెంట్‌లో ఆత్మహత్య లేదా స్వీయ హాని సంబంధిత టాపిక్‌లు ఉన్నప్పుడు, YouTube యూజర్‌లకు ఫీచర్‌లు లేదా రిసోర్స్‌లను చూపించవచ్చు. ఉదాహరణకు:

  • మీ వీడియో ప్లే అవ్వడం ప్రారంభం కావడానికి ముందు, అది ఆత్మహత్య, ఇంకా స్వీయ హానికి సంబంధించిన కంటెంట్‌ను కలిగి ఉందని సూచించే హెచ్చరిక
  • వీడియో కింద, ఆత్మహత్య నివారణ సంస్థల ఫోన్ నంబర్‌ల వంటి సపోర్ట్ చేసే రిసోర్స్‌లను కలిగి ఉన్న ఒక ప్యానెల్

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18203921467434327590
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
false
true
true
true
true
true
59
false
false
false
false
false