మీ YouTube ఛానెల్ సాధారణ సమాచారాన్ని మేనేజ్ చేయండి

ఛానెల్ పేరు, వివరణ, అనువాదాలు, లింక్‌ల వంటి మీ YouTube ఛానెల్‌కు సంబంధించిన సాధారణ సమాచారాన్ని మీరు మేనేజ్ చేయవచ్చు.

పేరు

మీ YouTube ఛానెల్ పేరును మార్చవచ్చు, అది మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతోందని నిర్ధారించుకోండి అంతే. మీ పేరును మార్చిన తర్వాత, కొత్త పేరు అప్‌డేట్ అయ్యి, YouTube అంతటా ప్రదర్శించబడటానికి కొన్ని రోజులు పట్టవచ్చు. మీరు మీ YouTube ఛానెల్ పేరును, ఫోటోను మారిస్తే, అది YouTubeలో మాత్రమే కనిపిస్తుంది. మీరు మీ Google ఖాతా పేరుకు, ఫోటోకు ఇక్కడ (మీ YouTube ఛానెల్ పేరుకు ఎటువంటి మార్పులూ చేయకుండా) మార్పులు చేయవచ్చు.

గమనిక: మీరు 14 రోజుల వ్యవధిలో మీ ఛానెల్ పేరును రెండుసార్లు మార్చుకోవచ్చు. మీ పేరును మార్చడం వలన మీ వెరిఫికేషన్ బ్యాడ్జ్ తీసివేయబడుతుంది. మరింత తెలుసుకోండి.
  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలంగా మార్చండి ఆ తర్వాత ప్రాథమిక సమాచారం అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీ కొత్త ఛానెల్ పేరును ఎంటర్ చేయండి.
  4. పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Choosing Your YouTube Channel Name

 

 

హ్యాండిల్

హ్యాండిల్ అనేది YouTubeలో మీ ప్రత్యేక ఉనికిని ఏర్పరుచుకుని, నిర్వహించడాన్ని సులభతరం చేసే ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫయర్.

గమనిక: 14 రోజుల వ్యవధిలో మీ హ్యాండిల్‌ను మీరు రెండుసార్లు మార్చుకోవచ్చు.

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలీకరణ ఆ తర్వాత సాధారణ సమాచారాన్ని ఎంచుకోండి.
  3. హ్యాండిల్ కింద, మీరు మీ హ్యాండిల్‌ను చూడవచ్చు లేదా మార్చవచ్చు.
  4. మీరు మీ హ్యాండిల్‌ను మార్చినట్లయితే, దాన్ని నిర్ధారించడానికి పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

వివరణ

మీరు మీ YouTube ఛానెల్ వివరణను మార్చవచ్చు, అది మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతోందని నిర్ధారించుకుంటే చాలు. మీ వివరణను ఛానెల్ హెడర్‌లో యాక్సెస్ చేయవచ్చు.
  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలీకరణ ఆ తర్వాత సాధారణ సమాచారాన్ని ఎంచుకోండి.
  3. మీ కొత్త ఛానెల్ వివరణను ఎంటర్ చేయండి.
  4. పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
క్రియేటర్‌లకు సంబంధించిన వీడియో వివరణ చిట్కాల‌ను పొందండి.

మీ సర్వనామాలను జోడించండి లేదా మార్చండి

మీరు మీ సర్వనామాలను మీ ఛానెల్‌కు జోడించవచ్చు, తద్వారా అవి మీ ఛానెల్ పేజీలో డిస్‌ప్లే చేయబడతాయి. మీ సర్వనామాలు అందరికీ డిస్‌ప్లే చేయాలా లేదా అవి మీ సబ్‌స్క్రయిబర్‌లకు మాత్రమే డిస్‌ప్లే చేయాలా అనే విషయాన్ని మీరు ఎంచుకోవచ్చు.
సర్వనామాలు అనేవి వ్యక్తిగత గుర్తింపు, అలాగే వ్యక్తీకరణలో కీలకమైన భాగం. కొన్ని అధికారిక ప్రదేశాలు లింగ వ్యక్తీకరణకు సంబంధించిన చట్టాలను కలిగి ఉన్నాయి. YouTubeలో ఈ సమ్మతి ఉన్న పబ్లిక్ ఫీచర్‌ను ఉపయోగించేటప్పుడు మీ లోకల్ చట్టాలను గుర్తుంచుకోండి.
ఒకవేళ సర్వనామాలు మీ ఛానెల్ పేజీలో అందుబాటులో లేకపోతే, ఈ ఫీచర్‌ను మరిన్ని దేశాలు/ప్రాంతాలకు, మరిన్ని భాషలలో విస్తరించడం కోసం కృషి చేస్తున్నాము.
గమనిక: సర్వనామాల ఫీచర్  వర్క్ స్పేస్ లేదా పర్యవేక్షించబడే ఖాతాలకు అందుబాటులో లేదు.
  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలంగా మార్చండి  ఆ తర్వాత ప్రాథమిక సమాచారం ఆ తర్వాత సర్వనామాలను జోడించండి ను ఎంచుకోండి.
  3. మీ సర్వనామాలను ఎంటర్ చేయడాన్ని ప్రారంభించండి, మీకు సంబంధితంగా ఉన్న ఒక సర్వనామాన్ని ఎంచుకోండి. మీరు గరిష్ఠంగా నాలుగు సర్వనామాలను జోడించవచ్చు.
    1. మీరు మీ ఎంపికలను తీసివేయడానికి, మీ సర్వనామాలలో ఒకదాని పక్కన ఉన్న ను క్లిక్ చేయడం ద్వారా దాన్ని ఎడిట్ చేయవచ్చు.
  4. మీ సర్వనామాలను ఎవరు చూడవచ్చో ఎంచుకోండి:
    1. అందరికీ కనిపించాలి, లేదా
    2. నా సబ్‌స్క్రయిబర్‌లకు మాత్రమే కనిపించాలి
  5. పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఛానెల్ పేరు & వివరణకు సంబంధించిన అనువాదం

మీరు మీ ఛానెల్ పేరు, వివరణకు అనువాదాలను జోడించి, మీ వీడియోలు అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరేలా సహాయం చేయవచ్చు.
  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలంగా మార్చండి ఆ తర్వాత ప్రాథమిక సమాచారం ఆ తర్వాత భాషను జోడించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఒరిజినల్ భాషను ఎంచుకొని, ఆపై అనువాద భాషను ఎంచుకోండి.
  4. మీ ఛానెల్ పేరు, వివరణకు అనువాదాలను ఎంటర్ చేయండి.
  5. పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఛానెల్ URL

మీ ఛానెల్ URL అనేది YouTube ఛానెళ్లు ఉపయోగించే స్టాండర్డ్ URL. ఇది మీ ప్రత్యేకమైన ఛానెల్ IDని ఉపయోగిస్తుంది, URL చివర్లో కనిపించే నంబర్‌లు, అక్షరాల కలయికే మీ ఛానెల్ ID.
ఛానెల్ ప్రొఫైల్ లింక్‌లు
మీరు మీ ఛానెల్ మొదటి పేజీలో గరిష్ఠంగా 14 లింక్‌లను షోకేస్ చేయవచ్చు, అవి మా ఎక్స్‌టర్నల్ లింక్‌ల పాలసీని ఫాలో అవుతున్నాయని నిర్ధారించుకుంటే చాలు. మీ మొదటి లింక్ సబ్‌స్క్రయిబ్ బటన్ సమీపంలో ఉన్న ప్రొఫైల్ విభాగంలో ప్రముఖంగా డిస్‌ప్లే చేయబడుతుంది, మీ ప్రేక్షకులు మరిన్ని లింక్‌లను చూడటానికి క్లిక్ చేసినప్పుడు మిగిలిన మీ లింక్‌లు చూపబడతాయి. మీ ప్రేక్షకులతో లింక్‌లు షేర్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలంగా మార్చండి ఆ తర్వాత ప్రాథమిక సమాచారం అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. లింక్‌ల కింద, లింక్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, టైటిల్‌ను, మీ సైట్ URLను ఎంటర్ చేయండి.
  4. పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
కాంటాక్ట్ సమాచారం
మీరు మీ ఛానెల్‌కు కాంటాక్ట్ సమాచారాన్ని జోడించి, బిజినెస్‌కు సంబంధించిన ప్రశ్నల కోసం ఇతరులు మిమ్మల్ని ఎలా సంప్రదించాలో తెలియజేయండి.
  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, అనుకూలంగా మార్చండి ఆ తర్వాత ప్రాథమిక సమాచారం అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. దిగువున, మీ ఈమెయిల్‌ను ఎంటర్ చేయండి.
  4. పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ ఛానెల్ యొక్క సాధారణ సమాచారాన్ని ఎలా మేనేజ్ చేయాలో చూడండి

మీ ఛానెల్ పేరును, వివరణను, అనువాదాలను, లింక్‌లను ఎలా మార్చాలి అనే దాని గురించి తెలుసుకోవడానికి YouTube Creators ఛానెల్‌లోని ఈ కింది వీడియోను చూడండి.

 

Customize Your Channel Branding & Layout: Add a Profile Picture, Banner, Trailer, Sections, & more!

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7832108986278008288
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false