అన్వేషణ, పనితీరు FAQలు

వీక్షకులు తాము చూసే అవకాశమున్న వీడియోలను కనుగొనడంలో YouTube సెర్చ్, అన్వేషణ సిస్టమ్ సహాయపడుతుంది, తద్వారా వీక్షకుల దీర్ఘకాల సంతృప్తి స్థాయులు పెరుగుతాయి. ఈ కింది FAQల ద్వారా మీ వీడియో, అలాగే ఛానెల్ పనితీరు గురించిన సమాధానాలు పొందండి.

YouTube సెర్చ్ & డిస్కవరీ: 'అల్గారిథమ్', పనితీరుకు సంబంధించి FAQలు

క్రియేటర్‌ల కోసం వీడియో అన్వేషణ చిట్కాలను పొందండి.

అన్వేషణ FAQలు

ఏ వీడియోలను ప్రమోట్ చేయాలన్నది YouTube ఎలా నిర్ణయిస్తుంది?

ఈ కింది విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రేక్షకులకు అందించాల్సిన ఉత్తమ వీడియోలను మా సిఫార్సు సిస్టమ్ నిర్ణయిస్తుంది:
  • వారు చూసే వీడియోలు
  • వారు చూడని వీడియోలు
  • వారు దేని కోసం సెర్చ్ చేస్తారు
  • లైక్‌లు, డిస్‌లైక్‌లు
  • 'ఆసక్తి లేదు' ఫీడ్‌బ్యాక్

నా వీడియోలు మరింత మంది ప్రేక్షకులకు చేరుకునేలా ప్రమోట్ చేయడం ఎలా?

YouTubeలో విజయవంతం అవ్వడానికి మీరు అల్గారిథమ్స్‌లోనో లేదా ఎనలిటిక్స్‌లోనో నిపుణులు అవ్వాల్సిన అవసరం లేదు, బదులుగా, మీ ప్రేక్షకులను తెలుసుకోవడంపై దృష్టి పెట్టండి. మా సిఫార్సు సిస్టమ్ ప్రేక్షకులకు వీడియోలను ప్రమోట్ చేయదు, కానీ మీ ప్రేక్షకులు YouTubeను సందర్శించినప్పుడు వారి కోసం వీడియోలను కనుగొంటుంది. వీడియోలు వాటి పనితీరు అలాగే మీ ప్రేక్షకులకు అవి ఎంత సందర్భోచితమైనవి అనే అంశాల ఆధారంగా ర్యాంక్ చేయబడతాయి, అన్ని వీడియోలు సిఫార్సు చేయడానికి అర్హతను కలిగి ఉండవు.

మొదటి ట్యాబ్‌లో వీడియోలు ఎలా ర్యాంక్ చేయబడతాయి?

మొదటి ట్యాబ్ అంటే మీ ప్రేక్షకులు YouTube యాప్ తెరిచినప్పుడు లేదా YouTube.com సందర్శించినప్పుడు కనిపించే స్క్రీన్. ప్రతి వీక్షకునికి అత్యంత సందర్భోచితమైన, వ్యక్తిగతీకరించిన సిఫార్సులు ఇక్కడ చూపించడానికే మేము ప్రయత్నిస్తాము. మీ ప్రేక్షకులు మొదటి ట్యాబ్‌ను సందర్శించినప్పుడు, YouTube సబ్‌స్క్రిప్షన్‌ల నుండి వీడియోలను చూపిస్తుంది. వారి లాంటి వీక్షకులు చూసిన వీడియోలు అలాగే కొత్త వీడియోలు కూడా కనిపిస్తాయి. వీడియోల ఎంపిక కింది అంశాల ఆధారంగా ఉంటుంది:
  • పనితీరు -- ఇతర అంశాలతో పాటు, మీ వీడియోలు అలాంటి ప్రేక్షకులకే ఎంత ఆసక్తికరంగా అనిపించాయి అలాగే వారు ఎంత సంతృప్తి చెందారు.
  • వీక్షణ అలాగే సెర్చ్ హిస్టరీ -- మీ ప్రేక్షకులు ఒక ఛానెల్ లేదా టాపిక్‌ను ఎంత తరచుగా చూసారు అలాగే ప్రతి వీడియోను మేము ఇప్పటికి ఎన్ని సార్లు చూపించాము.

YouTube మొదటి ట్యాబ్‌లో సిఫార్సు చేయడానికి మొత్తం కంటెంట్‌కు అర్హత లేదని గుర్తుంచుకోండి.

'ట్రెండింగ్' వీడియోలు ఎలా ఎంపిక చేయబడతాయి?

'ట్రెండింగ్' ఎలా పని చేస్తుందనేది తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

‘తర్వాత రాబోయేవి’ కింద సూచించబడే వీడియోలు ఏ విధంగా ర్యాంక్ చేయబడతాయి?

సూచించబడిన వీడియోలు మీ ప్రక్షకులు చూస్తున్న వీడియోతో పాటు 'తర్వాత రాబోయేవి' కింద సిఫార్సు చేయబడతాయి. సూచించబడిన వీడియోలు మీ ప్రేక్షకులు తర్వాత చూసే అవకాశం ఎక్కువ ఉన్న వీడియోలను అందించడానికి ర్యాంక్ చేయబడతాయి. తరచుగా ఈ వీడియోలు మీ ప్రేక్షకులు చూస్తున్న వీడియోకు సంబంధించినవి అవుతాయి, కానీ వీక్షణ హిస్టరీ ఆధారంగా కూడా వ్యక్తిగతీకరించబడవచ్చు.
తదుపరి పేజీలలో చూసేందుకు సిఫార్సు చేయడానికి మొత్తం కంటెంట్‌కు అర్హత లేదని గుర్తుంచుకోండి.

సెర్చ్‌లో వీడియోలకు ర్యాంకింగ్ ఎలా ఇవ్వబడుతుంది?

Google సెర్చ్ ఇంజిన్‌లాగానే, YouTube సెర్చ్ కూడా కీవర్డ్ సెర్చ్‌ల ప్రకారం అత్యంత సందర్భోచితమైన ఫలితాలను అందించడానికి కృషి చేస్తుంది. ఈ కింది అంశాల ఆధారంగా వీడియోలకు ర్యాంకింగ్ ఇవ్వబడుతుంది:
  • టైటిల్, వివరణ, వీడియో కంటెంట్‌లు వీక్షకుని సెర్చ్‌కు ఎంత బాగా మ్యాచ్ అవుతాయి.
  • ఏ వీడియోలు ఒక సెర్చ్‌కు అత్యంత ఎంగేజ్‌మెంట్‌ను అందిస్తాయి.
గమనిక: సెర్చ్ ఫలితాలు అంటే ఒక సెర్చ్ కోసం చూపించే అత్యంత ఎక్కువగా చూసిన వీడియోల లిస్ట్ కాదు.

వీడియో టైటిల్ లేదా థంబ్‌నెయిల్‌ మార్చడం వలన అల్గారిథమ్‌లో వీడియో ర్యాంక్ మారుతుందా?

మారవచ్చు, కానీ వీడియో టైటిల్ లేదా థంబ్‌నెయిల్‌ మార్చడం కంటే వీక్షకులు మీ వీడియోతో ఏ రకంగా విభిన్నంగా ఇంటరాక్ట్ అవుతున్నారు అనేదానికి మా సిస్టమ్‌లు ప్రతిస్పందిస్తాయి. మీ వీడియో కనిపించే విధానం మారినప్పుడు, వీక్షకులకు అది అందించబడినప్పుడు వారు దానితో ఇంటరాక్ట్ అయ్యే విధానం మారుతుంది. మరిన్ని వీక్షణలు పొందడానికి మీ వీడియో టైటిల్ అలాగే థంబ్‌నెయిల్ మార్చడం ప్రభావవంతమైన మార్గం కావచ్చు, కానీ బాగా పనిచేస్తున్న వాటిని మార్చవద్దు.

కనుగొనబడటం కోసం నేను నా టైటిల్, థంబ్‌నెయిల్‌ను ఎలా ఆప్టిమైజ్ చేయవచ్చు?

కనుగొనబడటం కోసం మీరు ఈ చిట్కాలను ఉపయోగించి మీ టైటిల్, థంబ్‌నెయిల్‌ను ఆప్టిమైజ్ చేయవచ్చు:

  • మీ థంబ్‌నెయిల్ మా థంబ్‌నెయిల్ పాలసీని ఫాలో అవుతోందని నిర్ధారించుకోండి.
  • కంటెంట్‌ను ఖచ్చితంగా సూచించే ఆకర్షణీయమైన టైటిల్స్‌ను మీ వీడియోల కోసం ఉపయోగించండి.
  • మీ కంటెంట్‌ను ఖచ్చితంగా సూచించే థంబ్‌నెయిల్స్‌ను క్రియేట్ చేయండి.
  • ఈ కింద పేర్కొన్న విధంగా ఉండే టైటిల్స్‌ను, థంబ్‌నెయిల్స్‌ను ఉపయోగించకండి:
    • వేరొక వ్యక్తి లేదా సంస్థ లాగా వ్యవహరించడం, తప్పుదారి పట్టించడం, క్లిక్ చేయాలని ప్రేరేపించడం లేదా సంచలనాత్మకం: వీడియో కంటెంట్‌ను తప్పుగా సూచిస్తాయి
    • షాక్‌కు గురి చేయడం: అభ్యంతరకరమైన లేదా మితిమీరిన భాషను కలిగి ఉంటుంది
    • జుగుప్స కలిగిస్తోంది: స్థూల లేదా అసహ్యకరమైన ఇమేజ్‌లను కలిగి ఉంటుంది
    • శృతి మించిన హింస: అనవసరంగా హింసను లేదా దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది
    • అసభ్యకరమైనది: లైంగిక భావనను సూచించే లేదా అసభ్య ప్రవర్తనను సూచిస్తుంది
    • పెద్దవి: టైటిల్‌ను ప్రత్యేకంగా చూపించడానికి అన్ని క్యాపిటల్ లెటర్స్‌ను ఉపయోగిస్తుంది లేదా !!!!!ను ఉపయోగిస్తుంది

ఇలా చేయడం వలన మీ కంటెంట్‌కు కొత్తగా వచ్చే అవకాశం ఉన్న వీక్షకులు రాకపోవచ్చు, అలాగే కొన్ని సందర్భాలలో కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించిన కారణంగా మీ కంటెంట్‌ను తీసివేసే అవకాశం ఉంది.

మానిటైజేషన్ స్టేటస్ (పసుపు రంగు చిహ్నం) నా వీడియో కనుగొనబడటాన్ని ప్రభావితం చేస్తుందా?

లేదు, ఏ వీడియోలు మానిటైజ్ చేయబడ్డాయి ఏవి చేయబడలేదు అనేది మా సెర్చ్, అలాగే సిఫార్సు సిస్టమ్‌కు తెలియదు. మేము మీ వీడియోలు మానిటైజ్ చేయబడ్డాయా, లేదా అనే దానితో సంబంధం లేకుండా మీ ప్రేక్షకులకు సంతృప్తికరంగా అనిపించే వీడియోలను సిఫార్సు చేయడంపై దృష్టి పెడతాము. మీ వీడియోలో హింసాత్మక లేదా స్పష్టంగా చూపే కంటెంట్ ఉంటే, దాన్ని డీమానిటైజ్ చేయవచ్చు. అది అనుచితమైనది అయినందువలన అది ఎక్కువ మంది వీక్షకులకు సిఫార్సు చేయబడకపోవచ్చు కూడా. ఈ ఉదాహరణ ప్రకారం, ఒక వీడియో తక్కువ సిఫార్సు చేయబడటానికి కారణం డీమానిటైజేషన్ కాదు, వీడియోలోని కంటెంట్.

ట్యాగ్‌లు ఎంత ముఖ్యమైనవి?

ముఖ్యం కాదు. ట్యాగ్‌లు ప్రధానంగా పదాలలో సాధారణమైన తప్పులను సరిదిద్దడానికి ఉపయోగపడతాయి (ఉదాహరణకు YouTube వర్సెస్. U Tube వర్సెస్. You-tube).

నా ఛానెల్ లొకేషన్ ఒక నిర్దిష్ట దేశం/ప్రాంతానికి సెట్ చేయడం వలన ఆ ప్రేక్షకులలో మరింత మంది వీక్షకులను చేరుకోవడంలో నాకు సహాయపడుతుందా? (ఉదా. నేను బ్రెజిల్‌లో ఉన్నప్పటికీ నా లొకేషన్ USకు మార్చడం)

లేదు, లొకేషన్ సెట్టింగ్‌లు YouTubeలో వీడియోలు ఎలా సిఫార్సు చేయబడతాయి అనేది తెలపడానికి ఉపయోగించబడవు.

నా వీడియో సిఫార్సు చేయబడటాన్ని లైక్‌లు/డిస్‌లైక్‌లు ప్రభావితం చేస్తాయా?

కొంత వరకు. ర్యాంకింగ్ కోసం మేము ఉపయోగించే వందలాది సంకేతాలలో లైక్‌లు అలాగే డిస్‌లైక్‌లు కొన్ని. మా సిఫార్సు సిస్టమ్ వీక్షకులు ఒక వీడియోను చూడటానికి ఇష్టపడుతున్నారా లేదా అనే దాని నుండి నేర్చుకుంటాయి. వీక్షకులు సంతృప్తి చెందితే వారు వీడియోను ఎంత సమయం పాటు చూస్తారు అనే దాని నుండి సిస్టమ్ నేర్చుకుంటుంది. మీ వీడియో పూర్తి పనితీరు ఈ అంశాల సమ్మేళనం ఆధారంగా నిర్ణయించబడుతుంది.

నేను ఒక వీడియోను అన్‌లిస్టెడ్‌గా అప్‌లోడ్ చేసి, తర్వాత పబ్లిక్‌కు మారిస్తే, నా వీడియో పనితీరు ప్రభావితం అవుతుందా?

లేదు, ఒకసారి అది పబ్లిష్ చేయబడిన తర్వాత వీక్షకుల స్పందన మాత్రమే ముఖ్యం.

పనితీరు FAQలు

నా వీడియోలలో ఒక దాని పనితీరు-సరిగ్గా లేకపోతే, దాని వలన నా ఛానెల్ ప్రభావితం అవుతుందా?

సిఫార్సు చేయబడినప్పుడు ప్రతీ వీడియోకు వీక్షకులు ఎలా స్పందిస్తారు అనేది ముఖ్యం. మీ ప్రేక్షకులకు ఏ వీడియోలు ఉత్తమ సిఫార్సులు అనేది నిర్ణయించడానికి మా సిస్టమ్‌లు వీడియో అలాగే ప్రేక్షకుల-స్థాయి సంకేతాల మీదే ఎక్కువ ఆధారపడతాయి. వీక్షకులకు సిఫార్సు చేసినప్పుడు మీ వీడియోలలో అత్యధిక వాటిని వారు చూడటం మానేయడం మీ ఛానెల్ పూర్తి వీక్షణలలో తగ్గుదలకు దారి తీయగలదు.

నేను అప్‌లోడ్ చేయడం నుండి విరామం తీసుకుంటే, అది నా ఛానెల్ పనితీరును ప్రభావితం చేస్తుందా?

అవసరమైనప్పుడు విరామాలు తీసుకోవడాన్ని మేము ప్రోత్సహిస్తాము. మేము విరామం తీసుకున్న వేలాది ఛానెల్‌లను అధ్యయనం చేసి, విరామం నిడివి అలాగే వీక్షణలలో మార్పుల మధ్య ఎలాంటి సంబంధం లేదు అని తెలుసుకున్నాము. వారి సాధారణ వీక్షణ రొటీన్‌లకు తిరిగి అలవాటు పడటం కోసం మీ ప్రేక్షకులను “వార్మ్ అప్” చేయడానికి కొంత సమయం పట్టవచ్చని గమనించండి.

నేను రోజూ లేదా కనీసం వారానికి ఒక సారి అప్‌లోడ్ చేయాలా?

అవసరం లేదు, మేము సంవత్సరాల పాటు విశ్లేషణలు చేసి, వీక్షణలలో పెరుగుదల అలాగే అప్‌లోడ్‌ల మధ్య సమయానికి ఎలాంటి సంబంధం లేదని కనుగొన్నాము. సంఖ్యతో సంబంధం లేకుండా క్వాలిటీతో చాలా మంది క్రియేటర్లు వారి ప్రేక్షకులతో నమ్మకమైన కనెక్షన్‌లు సంపాదించుకున్నారు. పూర్తిగా నిస్సత్తువగా అయిపోకుండా ఉండటానికి మీ పట్ల మీరు శ్రద్ధ వహించాల్సిందిగా మేము సూచిస్తాము, ఇది మీ ప్రేక్షకులకు అలాగే మీ శ్రేయస్సుకు ముఖ్యం.

వీడియోలను పబ్లిష్ చేయడానికి ఏది సరైన సమయం?

పబ్లిష్ చేసే సమయం దీర్ఘ-కాల పనితీరుపై ప్రభావం చూపించినట్టు ఎలాంటి ఆధారం లేదు. వీడియో ఎప్పుడు అప్‌లోడ్ చేయబడింది అనే దానితో సంబంధం లేకుండా సరైన వీక్షకులకు సరైన వీడియోలను అందించడమే మా సిఫార్సు సిస్టమ్ ధ్యేయం. అయితే, లైవ్ అలాగే ప్రీమియర్ వీడియోల వంటి ఫార్మాట్‌లకు పబ్లిష్ చేసే సమయం ముఖ్యం. ప్రీమియర్ ఎప్పుడు షెడ్యూల్ చేయాలి లేదా తర్వాతి లైవ్ ఎప్పుడు ప్లాన్ చేయాలి అనేది అర్థం చేసుకోవడానికి YouTube ఎనలిటిక్స్‌లోమీ వీక్షకులు YouTubeలో ఉండే సమయం రిపోర్ట్‌ను చూడండి.
మీ ప్రేక్షకులు అత్యంత యాక్టివ్‌గా ఉన్నప్పుడు వీడియోలను పబ్లిష్ చేయడం వెంటనే వచ్చే వీక్షకుల సంఖ్యకు ప్రయోజనకరంగా ఉండవచ్చు, కానీ ఇది ఒక వీడియో దీర్ఘ-కాల వీక్షకుల సంఖ్యను ప్రభావితం చేస్తుంది అని చెప్పలేము.

చూసిన సగటు శాతం లేదా సగటు వీక్షణ వ్యవధిలో ఏది ముఖ్యమైనది ?

ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్‌‌ను నిర్ణయించేటప్పుడు మా అన్వేషణ సిస్టమ్ సంపూర్ణ అలాగే సంబంధిత వాచ్ టైమ్‌ను ఉపయోగిస్తుంది, మిమ్మల్ని కూడా అదే చేయమని మేము ప్రోత్సహిస్తాము. మొత్తం మీద నిడివి ఎక్కువ ఉన్నవి అలాగే చిన్న వీడియోలు రెండూ విజయవంతం అవ్వాలని మా ఆశ, కాబట్టి కంటెంట్‌ను బట్టి సరైన నిడివి ఉండేలా వీడియోలు చేయాల్సిందిగా మేము సూచిస్తాము. క్లుప్తంగా చెప్పాలంటే, చిన్న వీడియోలకు సంబంధిత వాచ్ టైమ్ అలాగే ఎక్కువ నిడివి ఉన్న వీడియోలకు సంపూర్ణ వాచ్ టైమ్ మరింత ముఖ్యం. మీ వీక్షకులు ఎంత సేపు చూడటానికి ఇష్టపడుతున్నారు అనేది అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా మీ కంటెంట్ సర్దుబాటు చేసుకోవడానికి మీరు ప్రేక్షకుల నిలకడను ఉపయోగించవచ్చు.

నా సబ్‌స్క్రయిబర్‌ల సంఖ్య కంటే నా వీక్షణలు ఎందుకు తక్కువగా ఉన్నాయి?

మీ సబ్‌స్క్రయిబర్‌ల సంఖ్య మీ YouTube ఛానెల్‌ను ఫాలో అవ్వడానికి ఎంత మంది వీక్షకులు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు అనే దానిని సూచిస్తుంది. ఈ సంఖ్య మీ వీడియోలను చూసే వీక్షకుల సంఖ్యను సూచించదు. సగటున, వీక్షకులు పదుల కొద్దీ ఛానెల్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసుకుని ఉండవచ్చు, ఆపై వారు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ఛానెల్స్‌లో అప్‌లోడ్ అయిన ప్రతి కొత్త వీడియోను చూడటానికి వారు తిరిగి సందర్శించకపోవచ్చు. వీక్షకులు తర్వాత ఇక చూడని ఛానెల్‌లకు కూడా సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం కూడా సాధారణమే. YouTube ఎన‌లిటిక్స్‌‌తో మీ ప్రేక్షకులను అర్థం చేసుకోండి.

మొదటి ట్యాబ్ లేదా ‌సూచించబడిన వాటి నుండి నా ఛానెల్‌కు ఎందుకు తక్కువ ట్రాఫిక్ వస్తుంది?

ఒక ఛానెల్ వీక్షకుల సంఖ్య సమయం గడిచే కొద్దీ వాటి పెరుగుదల లేదా తగ్గుదలకు చాలా కారణాలు ఉంటాయి. సిఫార్సుల నుండి వచ్చే ట్రాఫిక్‌లో తగ్గుదలకు అత్యంత సాధారణ కారణాలలో కొన్ని ఇవి:
  • మీ ప్రేక్షకులు YouTubeలో ఇతర వీడియోలు అలాగే ఛానెల్‌లను చూస్తుండటం.
  • మీ ప్రేక్షకులు YouTubeలో తక్కువ సమయం గడుపుతున్నారు.
  • మీ వీడియోలలో కొన్ని అధిక-పనితీరును కనబరిచినవి ఉన్నాయి, లేదా ఒక వీడియో "వైరల్" అయ్యింది కానీ తర్వాత ఆ వీక్షకులు మరిన్ని చూడటానికి తిరిగి సందర్శించలేదు.
  • సాధారణం కంటే తక్కువ తరచుగా అప్‌లోడ్ చేయడం.
  • మీ వీడియోలలో ఫోకస్ చేస్తున్న టాపిక్‌కు ప్రజాదరణ తగ్గిపోతోంది.
కాలం గడిచే కొద్దీ మీ ప్రేక్షకుల ఆసక్తులలో మార్పు రావచ్చని గమనించండి. మీరు ఎల్లప్పుడూ కొత్త టాపిక్‌లు అలాగే ఫార్మాట్‌లతో ప్రయోగాలు చేయడం ముఖ్యం. ప్రేక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి, క్రియేటర్‌లు ఇప్పటికే ఉన్న వీక్షకులు కొనసాగేలా చూసుకుంటునే కొత్త వారిని ఆకర్షించాలి.

ఒక పాత వీడియోకు ఈ మధ్య వీక్షణలు పెరిగాయి, ఎందుకు?

వీక్షకులు పాత వీడియోలపై మరింత ఆసక్తి చూపించడం సాధారణమైన విషయం. చాలా మంది వీక్షకులు క్రమ వరుసలో వీడియోలను చూడటం లేదా వీడియో ఎప్పుడు పబ్లిష్ అయ్యింది అనే దానిని బట్టి ఏమి చూడాలి అన్నది నిర్ణయించుకోరు. వీక్షకులు మరింత పాత వీడియోలపై ఆసక్తి చూపిస్తున్నారు అంటే, వీటి వల్ల కావచ్చు:
  • మీ వీడియోలో ఉన్న టాపిక్‌కు ప్రజాదరణ పెరుగుతూ ఉండటం.
  • కొత్త వీక్షకులు మీ ఛానెల్‌ను కనుగొంటున్నారు అలాగే మీ పాత వీడియోలను ‘నిర్విరామంగా చూస్తున్నారు’.
  • మీ వీడియోను సిఫార్సులలో అందించినప్పుడు మరింత మంది వీక్షకులు మీ వీడియోను చూడటానికి ఇష్టపడుతున్నారు.
  • మీరు ఒక సిరీస్‌లో కొత్త వీడియోను రిలీజ్ చేశారు, దీని వలన వీక్షకులు వెనుకకు వెళ్ళి పాత ఎపిసోడ్‌లు చూడాల్సి వచ్చింది.
ఒక పాత వీడియోకు మరింత ఎక్కువ ట్రాఫిక్ రావడం మొదలైనప్పుడు, ఈ వీక్షకులు మరిన్ని చూడడం కోసం తిరిగి సందర్శించేలా ఆకర్షించడానికి ఎలాంటి వీడియో అప్‌లోడ్ చేయాలి అనే దాని గురించి ఆలోచించండి.

‘పిల్లల కోసం రూపొందించబడింది’ అని ఉండటం నా వీడియో పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

"పిల్లల కోసం రూపొందించినవి"గా మార్క్ చేసిన వీడియోలను, ఇతర పిల్లల వీడియోలతో పాటు సిఫార్సు చేసే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. కంటెంట్‌కు స్వీయ-హోదాను సెట్ చేయడం సరిగ్గా జరగకపోతే, అలాంటి ఇతర వీడియోలతో పాటు ఇది సిఫార్సు చేయబడకపోవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18315353732050297688
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false