YouTube Shorts మానిటైజేషన్ పాలసీలు

YouTube Shortsలో ఆదాయ షేరింగ్ అనేది ఫిబ్రవరి 1, 2023న ప్రారంభం అయ్యింది. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నియమాలలో కొత్త మార్పుల గురించి మరింత తెలుసుకోండి.

మానిటైజ్ చేస్తున్న పార్ట్‌నర్‌లు Shorts ఫీడ్‌లోని వీడియోల మధ్య చూసే యాడ్‌ల నుండి డబ్బు సంపాదించగలుగుతారు. ఈ కొత్త ఆదాయ షేరింగ్ మోడల్ అనేది YouTube Shorts Fundను రీప్లేస్ చేసింది.

YouTube Shorts మానిటైజేషన్‌కు వర్తించే పాలసీలు

మీరు YouTubeలో మానిటైజ్ చేస్తున్నట్లయితే, మీ ఛానెల్, రిపీట్ అయ్యే అలాగే 'తిరిగి ఉపయోగించిన కంటెంట్'కు సంబంధించిన మా పాలసీలతో సహా, YouTube ఛానెల్ మానిటైజేషన్ పాలసీలను తప్పక ఫాలో అవ్వాలి. ఇందులో YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్, సర్వీస్ నియమాలు, కాపీరైట్, అలాగే Google AdSense ప్రోగ్రామ్ పాలసీలు కూడా ఉంటాయి.

Shorts యాడ్ ఆదాయ షేరింగ్‌‌ను ఆన్ చేయడం

Shorts యాడ్ ఆదాయంలో షేరింగ్‌ను ప్రారంభించడానికి, మానిటైజ్ చేసే పార్ట్‌నర్‌లు Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించాలి – ఇది Shorts ఫీడ్‌లోని యాడ్‌ల నుండి, YouTube Premium నుండి సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు అంగీకరించిన తేదీ నుండి మీ ఛానెల్‌కు సంబంధించిన అర్హత గల Shorts వీక్షణలకు Shorts యాడ్ ఆదాయ షేరింగ్‌‌ వర్తిస్తుంది. Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించడానికి ముందు వచ్చిన Shorts వీక్షణలు, Shorts యాడ్ ఆదాయ షేరింగ్‌కు అర్హత పొందవు.

యాడ్‌లకు తగిన కంటెంట్

యాడ్‌లతో మానిటైజ్ చేసే కంటెంట్ అంతా తప్పనిసరిగా మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి. Shortsలో, మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అయ్యే కంటెంట్‌కు సంబంధించిన వీక్షణలు మాత్రమే ఆదాయ షేరింగ్‌కు అర్హత పొందుతాయి.

అర్హత లేని Shorts వీక్షణలు

పేమెంట్‌లను లెక్కించడానికి సంబంధించి, అర్హత లేని Shorts వీక్షణలను YouTube లెక్కించదు. ఏ సందర్భాల్లో Shorts వీక్షణలకు అర్హత ఉండదో తెలిపే ఉదాహరణలు: 

  • ఒరిజినల్ కాని షార్ట్‌లు, ఉదాహరణకు, ఇతరుల సినిమాలు లేదా టీవీ షోల నుండి ఎడిట్ చేయని క్లిప్‌లు, YouTube లేదా ఇతర ప్లాట్‌ఫామ్ నుండి ఇతర క్రియేటర్‌ల కంటెంట్‌ను తిరిగి అప్‌లోడ్ చేయడం, లేదా ఎలాంటి ఒరిజినల్ కంటెంట్‌ జోడించబడని కంపైలేషన్‌లు
  • ఆటోమేటిక్ క్లిక్ బాట్‌ల వల్ల లేదా స్క్రోల్ బాట్‌ల వల్ల వచ్చే కృత్రిమమైన లేదా నకిలీ Shorts వీక్షణలు
  • మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేని Shorts వీక్షణలు

Shorts ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న యాడ్ ఫార్మాట్‌లు

కొత్త అప్‌డేట్: యాడ్ నికర ఆదాయం, YPP & Shorts సూపర్ థ్యాంక్స్‌కు కొత్త మార్గాలు!

Shorts ఫీడ్‌లోని వీడియోల మధ్య చూసే యాడ్‌లపై వచ్చే ఆదాయం షేర్ చేయబడుతుంది. Shorts వీక్షణలకు, Shorts ఫీడ్ నుండి వచ్చే యాడ్ ఆదాయ షేరింగ్ ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఈ ప్రాసెస్, వీక్షణ పేజీలో నిడివి ఎక్కువ ఉన్న వీడియోల మానిటైజేషన్‌‌కు భిన్నంగా ఉంటుంది.

Shorts విషయంలో యాడ్ ఆదాయ షేరింగ్‌ ఎలా పని చేస్తుంది

కొత్త అప్‌డేట్: Shorts యాడ్‌ల ఆదాయ షేరింగ్

Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించిన మానిటైజ్ చేస్తున్న పార్ట్‌నర్‌లు మాత్రమే Shorts నుండి యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు.

Shorts యాడ్ ఆదాయ షేరింగ్‌ ఎలా పని చేస్తుందనే దానికి సంబంధించి నాలుగు దశలు ఉంటాయి:

  1. Shorts ఫీడ్ యాడ్ ఆదాయాన్ని సంఘటిత నిధిగా చేయడం. Shorts ఫీడ్‌లో వీడియోల మధ్య రన్ అయ్యే యాడ్‌ల నుండి వచ్చే ఆదాయాన్ని ప్రతి నెలా ఒక చోటుకు చేరుస్తారు. ఆ మొత్తాన్ని క్రియేటర్‌లకు రివార్డ్ ఇవ్వడానికి, మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగిస్తారు. 
     
  2. 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'ని లెక్కించడం. ఆ తర్వాత, మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌లు అప్‌లోడ్ చేసిన షార్ట్‌లన్నింటిలోనూ వచ్చిన వీక్షణలు ఇంకా మ్యూజిక్ వినియోగం ఆధారంగా 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'కి Shorts ఫీడ్ యాడ్ ఆదాయం కేటాయించబడుతుంది. 
    • మానిటైజ్ చేస్తున్న క్రియేటర్ ఎలాంటి మ్యూజిక్ లేకుండా ఒక షార్ట్‌ను అప్‌లోడ్ చేస్తే, దాని వీక్షణలతో అనుబంధించబడిన ఆదాయం అంతా 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'లోకి వెళ్తుంది.
    • మానిటైజ్ చేస్తున్న క్రియేటర్ మ్యూజిక్‌తో కూడిన షార్ట్‌ను అప్‌లోడ్ చేస్తే, అప్పుడు YouTube, ఆ షార్ట్ వీక్షణలతో అనుబంధించబడిన ఆదాయాన్ని, ఉపయోగించిన ట్రాక్‌ల సంఖ్య ఆధారంగా 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి' అలాగే మ్యూజిక్ పార్ట్‌నర్‌ల మధ్య విభజిస్తుంది.
ఉదాహరణకు, మానిటైజ్ చేస్తున్న క్రియేటర్ 1 ట్రాక్‌తో కూడిన షార్ట్‌ను అప్‌లోడ్ చేస్తే, దాని వీక్షణలతో అనుబంధించబడిన ఆదాయంలో సగ భాగం 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'కి కేటాయించబడుతుంది, అలాగే మరో సగ భాగం మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చులను భరించేందుకు ఉపయోగించబడుతుంది. షార్ట్ అనేది 2 మ్యూజిక్ ట్రాక్‌లను ఫీచర్ చేస్తే, అప్పుడు దాని వీక్షణలతో అనుబంధించబడిన ఆదాయంలో మూడవ వంతు భాగం 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'కి కేటాయించబడుతుంది, మిగిలిన రెండు వంతుల భాగం మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చులను భరించేందుకు ఉపయోగించబడుతుంది. 
  1. 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'ని కేటాయించడం. 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'లోని మొత్తం డబ్బు నుండి, ప్రతి దేశంలోని మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌ల షార్ట్‌లలో వారి మొత్తం వీక్షణల వాటా ఆధారంగా మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌లకు ఆదాయం డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఉదాహరణకు, మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌లు అప్‌లోడ్ చేసిన అన్ని అర్హత గల Shorts వీక్షణలలో 5% క్రియేటర్ పొందినట్లయితే, వారికి 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'లోని ఆదాయంలో 5% కేటాయించబడుతుంది.
     
  2. ఆదాయ షేరింగ్ వర్తింపు. మ్యూజిక్ ఉపయోగించబడిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌లు తమకు కేటాయించబడిన ఆదాయంలో 45% వారి వద్ద ఉంచుకుంటారు.

'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'లో చేర్చబడనివి ఏమిటి:

  • Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను ఇంకా అంగీకరించని క్రియేటర్‌లు, లేదా తమ షార్ట్‌లను మానిటైజ్ చేసేందుకు ఇంకా అర్హత లేని క్రియేటర్‌లు అప్‌లోడ్ చేసిన Shorts వీక్షణలతో అనుబంధించబడిన ఆదాయం. ఈ ఆదాయం మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చులను భరించేందుకు ఉపయోగించబడుతుంది, మరియు/లేదా YouTube తన వద్ద ఉంచుకుంటుంది. 
  • మ్యూజిక్ పార్ట్‌నర్‌లు అప్‌లోడ్ చేసిన Shorts వీక్షణలతో అనుబంధించబడిన ఆదాయం.
  • అర్హత లేనివిగా నిర్ణయించబడిన Shorts వీక్షణలతో అనుబంధించబడిన ఆదాయం.
  • ఒక షార్ట్‌ను చూసే ముందు, Shorts ఫీడ్‌ను తెరవగానే చూపబడే ఏవైనా యాడ్‌లతో అనుబంధించబడిన ఆదాయం (ఉదా. YouTube Shorts బ్యానర్).
  • Shorts ప్లేయర్ లోపల నావిగేషనల్ పేజీలలో చూపబడే ఏవైనా యాడ్‌లతో అనుబంధించబడిన ఆదాయం.

ఒక ఉదాహరణతో అర్థం చేసుకోండి

ఇది ఎలా పనిచేస్తుందో మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఒక ఊహాత్మక ఉదాహరణను రివ్యూ చేద్దాం.

ఊహాత్మక ఉదాహరణ

మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌గా, మీరు 1 మ్యూజిక్ ట్రాక్‌ను ఉపయోగించే షార్ట్‌ను అప్‌లోడ్ చేశారనుకుందాం. మీ షార్ట్ ఈ నెలలో A అనే దేశంలో ఎంత ఆదాయం సంపాదిస్తుందో మేము ఇలా లెక్కిస్తాము.

  • A అనే దేశంలో మొత్తం 10 కోట్ల Shorts వీక్షణలు వచ్చాయి, అలాగే అన్ని వీక్షణలు మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌లు అప్‌లోడ్ చేసిన షార్ట్‌లలో వచ్చాయి.
  • Shorts ఫీడ్‌లోని షార్ట్‌ల మధ్య ప్లే అయ్యే యాడ్‌ల నుండి $100,000 ఆదాయం సంపాదించబడింది.
  • ఈ షార్ట్‌లలో 20%, 1 మ్యూజిక్ ట్రాక్‌ను ఉపయోగిస్తాయి, కాబట్టి 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి' $90,000గా ఉంటుంది అలాగే మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చులను భరించేందుకు $10,000 ఉపయోగించబడుతుంది.
  • మీ షార్ట్ 10 లక్షల సార్లు చూడబడింది, కాబట్టి 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'లో మీకు 1% లేదా $900 కేటాయించబడుతుంది. 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి' నుండి మీకు చేసే కేటాయింపు అనేది, మీరు మ్యూజిక్ ట్రాక్‌ను ఉపయోగించారా లేదా అనే దానిపై ఆధారపడదు.
  • ఆ తర్వాత, ఆదాయ షేరింగ్‌లో 45% మీకు కేటాయించబడి, A అనే దేశంలో మీకు వచ్చిన Shorts వీక్షణల వల్ల మీరు $405 ఆదాయం సంపాదిస్తారు.

Shortsలో థర్డ్-పార్టీ కంటెంట్‌ను ఉపయోగించడం

నిర్దిష్ట పరిస్థితులలో, ఒక షార్ట్ థర్డ్-పార్టీ కంటెంట్‌ను లేదా రీమిక్స్ చేసిన కంటెంట్‌ను ఫీచర్ చేసినప్పుడు, 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'ని అలాగే మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌లకు ఆదాయ షేరింగ్‌ను లెక్కించడం కోసం, షార్ట్‌కు కేటాయించబడిన వీక్షణలు అప్‌లోడర్ ఇంకా ఏదైనా థర్డ్-పార్టీ హక్కుదారుల (షార్ట్‌లో ఉపయోగించిన ఇతర కంటెంట్ ఓనర్‌ల) మధ్య విభజించబడతాయి. ఇది ఎలా జరుగుతుందో ఈ కింది పాలసీలు వివరిస్తాయి. మేము ఈ పాలసీలను అప్‌డేట్ చేయవచ్చు అలాగే ఏవైనా మార్పులు ఉంటే మీకు తెలియజేస్తాము.

  • థర్డ్-పార్టీ కంటెంట్‌ను ఉపయోగించడం అనేది 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'ని ఎలా ప్రభావితం చేస్తుంది. 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి' మొత్తాన్ని లెక్కించేటప్పుడు, YouTube మ్యూజిక్ పరిశ్రమ పార్ట్‌నర్‌లు అందుబాటులో ఉంచిన లేదా డ్రీమ్ ట్రాక్ ద్వారా జెనరేట్ చేయబడిన మ్యూజిక్ కంటెంట్‌కు మాత్రమే షార్ట్‌కు కంట్రిబ్యూషన్ చేసినట్లుగా క్రెడిట్ ఇవ్వబడుతుంది. అంటే, షార్ట్‌లో మ్యూజిక్ కంటెంట్‌ను ఉపయోగించినప్పుడు మాత్రమే, అది వీక్షణల మొత్తాన్ని అలాగే 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'కి కేటాయించబడిన అనుబంధిత ఆదాయాన్ని తగ్గిస్తుందని అర్థం. షార్ట్‌కు కంట్రిబ్యూషన్ చేసినట్లుగా థర్డ్-పార్టీ కంటెంట్‌కు సంబంధించిన ఏ ఇతర కేటగిరీకి కూడా ఈ సమయంలో క్రెడిట్ ఇవ్వబడదు, సదరు కంటెంట్‌లో కంటెంట్ ID మానిటైజ్ పాలసీ సెట్ చేసినప్పటికీ ఇది వర్తిస్తుంది. అయితే, ఇతర కేటగిరీల కంటెంట్ కోసం మేము మా మానిటైజేషన్ మోడల్‌ను అభివృద్ధి చేసే ప్రారంభ దశల్లో ఉన్నాము. 
    • ఒక షార్ట్‌లో మ్యూజిక్ కంటెంట్‌ను ఉపయోగించినప్పుడు, 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి'ని లెక్కించేందుకు వీక్షణలు అలాగే అనుబంధిత ఆదాయం ఎలా విభజించబడతాయి అనే విషయాన్ని పైన పేర్కొన్న ఉదాహరణలు వివరిస్తాయి.
  • థర్డ్-పార్టీ కంటెంట్‌ను ఉపయోగించడం అనేది 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి' నుండి కేటాయింపులను ఎలా ప్రభావితం చేస్తుంది. మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌లకు 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి' నుండి వారి వాటాను చెల్లించేటప్పుడు, షార్ట్‌లో ఏదైనా మ్యూజిక్ ఉపయోగించబడిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, (డ్రీమ్ ట్రాక్ ద్వారా జెనరేట్ చేయబడిన మ్యూజిక్‌తో సహా) మానిటైజ్ చేస్తున్న ప్రతి క్రియేటర్‌కు వారి షార్ట్‌లకు సంబంధించిన మొత్తం 100% వీక్షణల సంఖ్య కేటాయించబడుతుంది. దీని ఫలితంగా, షార్ట్‌లో మ్యూజిక్‌ను ఉపయోగించడం అనేది 'క్రియేటర్ల కోసం సంఘటిత నిధి' నుండి క్రియేటర్‌కు కేటాయింపును లేదా వారి ఆదాయ షేరింగ్ రేట్‌ను ప్రభావితం చేయదు.

Shorts విషయంలో YouTube Premium సబ్‌స్క్రిప్షన్ ఆదాయ షేరింగ్

YouTube Premium అనేది ఒక పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్, ఇది యూజర్‌లు యాడ్-రహిత కంటెంట్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, డౌన్‌లోడ్‌లను ఆస్వాదించడాన్ని, అలాగే YouTube Music యాప్‌నకు Premium యాక్సెస్ పొందడాన్ని ఎనేబుల్ చేస్తుంది. ఇది అందించే ప్రయోజనాలు Shortsలో వీక్షణలకు కూడా వర్తిస్తాయి. 

Shortsకు సంబంధించి మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌లకు కేటాయించబడిన YouTube Premiumకు చెందిన నికర ఆదాయంలో 45% YouTube చెల్లిస్తుంది. YouTube Premium ఆదాయాల్లో కొంత భాగం, మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చులను భరించడంలో సహాయపడేందుకు కేటాయించబడుతుంది. ప్రతి క్రియేటర్‌కు చేసే పేమెంట్‌లు అనేవి, ప్రతి దేశం లోపల వారి సబ్‌స్క్రిప్షన్ Shorts వీక్షణల వాటాపై ఆధారపడి ఉంటాయి.

మీ Shorts ఫీడ్ యాడ్ ఆదాయాన్ని ఎక్కడ చూడాలి

YouTube ఎనలిటిక్స్ అందుబాటులో ఉన్నప్పుడు లేదా మీరు Shorts యాడ్‌లతో మానిటైజ్ చేయడం మొదలుపెట్టిన రోజు నుండి, ఇతర పనితీరు కొలమానాలతో పాటు అంచనా వేసిన రోజువారీ Shorts ఫీడ్ యాడ్ ఆదాయాన్ని డిస్‌ప్లే చేయడం ప్రారంభిస్తుంది. మీ YouTube ఆదాయాన్ని చెక్ చేయడం ఎలాగో మరింత తెలుసుకోండి.

కనిష్ఠ పేమెంట్ పరిమితులు, ఇతర 'YouTube కోసం AdSense' వివరాలకు సంబంధించి ఇప్పటికే ఉన్న టైమ్‌లైన్‌లు వర్తిస్తాయి – YouTube కోసం AdSense గురించి మరింత తెలుసుకోండి.

Studio కంటెంట్ మేనేజర్

Studio కంటెంట్ మేనేజర్ యూజర్‌లకు సంబంధించి, డౌన్‌లోడ్ చేయగల రిపోర్ట్‌లు 2023 మార్చి నెల మధ్య నుండి మ్యూజిక్ యేతర పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ రిపోర్ట్‌లలో సంబంధిత పార్ట్‌నర్‌లు అప్‌లోడ్ చేసిన ఏవైనా మానిటైజ్ చేస్తున్న షార్ట్‌ల కోసం తేదీ వారీగా అలాగే దేశం/ప్రాంతం వారీగా విభజించబడిన ఆదాయ వివరాలు ఉంటాయి.

మీ Shorts పనితీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? మా YouTube ఎనలిటిక్స్ కోసం క్రియేటర్ చిట్కాలను చూడండి!

YouTube Shorts మానిటైజేషన్ గురించి మరింత తెలుసుకోండి 

Shorts యాడ్ ఆదాయం ఎందుకు సంఘటిత నిధిగా చేయబడుతోంది?

నిడివి ఎక్కువ ఉన్న వీడియోలతో పోలిస్తే Shorts భిన్నమైన యాడ్ ఫార్మాట్‌ను ఉపయోగిస్తాయి, అందుకే ఆదాయ షేరింగ్‌లో మేము ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించాల్సి వస్తోంది. ఆదాయాన్ని సంఘటిత నిధిగా చేసి, ఆపై వీక్షణల వాటా ఆధారంగా దాన్ని పంపిణీ చేయడం ద్వారా, తమ వీడియో పక్కన యాడ్ ఉండే క్రియేటర్‌లకు మాత్రమే కాకుండా, Shorts అనుభవాన్ని అందించే మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌లు అందరికీ రివార్డ్ ఇవ్వాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఒక అదనపు ప్రయోజనంగా, ఈ మోడల్ అనేది మ్యూజిక్ లైసెన్సింగ్ సంక్లిష్టతలను సులభతరం కూడా చేస్తుంది, మ్యూజిక్‌ వినియోగం వల్ల ఆదాయం తగ్గుతుందేమోనని చింతించకుండా క్రియేటర్‌లు తమ క్రియేటివ్ విజన్‌ను సాధించేలా ఎనేబుల్ చేస్తుంది.

క్రియేటర్‌లు వాస్తవంగా Shorts ఆదాయంలో 45% ఉంచుకుంటారా?

ప్రతి నెలా, Shorts ఫీడ్‌లోని వీడియోల మధ్య కనిపిస్తున్న యాడ్‌ల నుండి వచ్చే ఆదాయం కలిపి సంఘటిత నిధిగా చేయబడుతుంది, అలాగే Shorts క్రియేటర్‌లకు రివార్డ్ ఇచ్చేందుకు ఇంకా మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చులను భరించేందుకు ఉపయోగించబడుతుంది. క్రియేటర్‌లకు కేటాయించిన మొత్తం డబ్బు ('క్రియేటర్‌ల కోసం సంఘటిత నిధి'గా కూడా వ్యవహరిస్తారు) నుండి, వారు తమ షార్ట్‌లలో మ్యూజిక్‌ను ఉపయోగిస్తారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, 45% ఆదాయాన్ని ఉంచుకుంటారు.

నిర్దిష్టంగా "మ్యూజిక్" అంటే అర్థం ఏమిటి?

Shorts సందర్భంలో “మ్యూజిక్” అనేది YouTube మ్యూజిక్ పరిశ్రమ పార్ట్‌నర్‌లు అందుబాటులో ఉంచిన లేదా క్లెయిమ్ చేసిన కంటెంట్‌ను సూచిస్తుంది. ఇందులో వాస్తవ మ్యూజిక్ ఆడియో లేదా ట్రాక్‌లు, మ్యూజిక్ వీడియోలు, లేదా ఆర్టిస్ట్ ఇంటర్వ్యూల వంటి ఇతర మ్యూజిక్ కంటెంట్ ఉండవచ్చు. దీనిలో డ్రీమ్ ట్రాక్ ద్వారా జెనరేట్ చేయబడిన మ్యూజిక్ కంటెంట్ కూడా ఉంటుంది.

నేను Shorts Fundతో ఇప్పటికీ డబ్బు సంపాదించవచ్చా?
లేదు, ఫిబ్రవరి 1, 2023న Shorts యాడ్స్ ఆదాయ షేరింగ్‌ను లాంచ్ చేసినప్పటి నుండి, క్రియేటర్‌లు ఇకపై Shorts Fundతో డబ్బు సంపాదించలేరు. మా Shorts Fund స్వీకర్తలలో అత్యధిక భాగం మంది ఈ కొత్త ఆదాయ షేరింగ్ మోడల్ ద్వారా మరింత ఆదాయం సంపాదిస్తారని మేము భావిస్తున్నాము, ఇంకా ఇది Shorts Fundను రీప్లేస్ చేస్తుంది. జనవరి యాక్టివిటీకి సంబంధించిన తుది Shorts Fund ఆహ్వానాలు 2023 ఫిబ్రవరి నెల మధ్యలో పంపబడతాయి, పేమెంట్‌లు మార్చిలో ఉంటాయి (మా కనిష్ఠ పేమెంట్ పరిమితులు, ఆవశ్యకతలకు లోబడి).

నా షార్ట్‌లు Shorts ఫీడ్‌లో ఉన్నాయి, కానీ నేను ఆదాయం సంపాదించడం లేదు. నేను YPPలో లేకుండానే ఆ యాడ్‌ల ద్వారా డబ్బు సంపాదించవచ్చా?

లేదు. Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించిన మానిటైజ్ చేస్తున్న పార్ట్‌నర్‌లు మాత్రమే Shorts నుండి యాడ్ ఆదాయాన్ని అలాగే YouTube Premium ఆదాయాన్ని సంపాదించగలరు. మిగిలిన ఆదాయం మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చులను భరించేందుకు ఉపయోగించబడుతుంది లేదా YouTube తన వద్ద ఉంచుకుంటుంది.
నా షార్ట్‌లు యాడ్ ఆదాయాన్ని సంపాదిస్తున్నాయో లేదో నాకు ఎలా తెలుస్తుంది? నేను Shorts యాడ్ ఆదాయాన్ని సంపాదించడం ఆపివేయాలనుకుంటే ఏమి జరుగుతుంది?

మీరు Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించిన తేదీ నుండి, Shorts యాడ్‌ల ఆదాయ షేరింగ్ కోసం మీ ఛానెల్‌లో వచ్చే ఏదైనా షార్ట్‌కు సంబంధించిన వీక్షణలు పరిగణనలోకి తీసుకోబడతాయి. ఫిబ్రవరి 1, 2023 తర్వాత అప్‌లోడ్ చేయబడే Shorts వీక్షణలు, Shorts యాడ్ ఆదాయ షేరింగ్ కోసం కూడా ఆటోమేటిక్‌గా పరిగణనలోకి తీసుకోబడతాయి - అప్‌లోడ్ చేసే సమయంలో, మీరు నిడివి ఎక్కువ ఉన్న వీడియోలకు చేసినట్లుగా ఇకపై మీ షార్ట్‌లకు మానిటైజేషన్‌ను ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించడానికి ముందు వచ్చిన Shorts వీక్షణలు, Shorts యాడ్ ఆదాయ షేరింగ్‌కు అర్హత పొందవు.

మీ షార్ట్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత, మీరు దాని మానిటైజేషన్ స్టేటస్‌ని YouTube Studioలోని కంటెంట్ విభాగంలో చూడవచ్చు. Shorts యాడ్ ఆదాయ షేరింగ్ కోసం పరిగణించబడుతున్న వీక్షణలు కలిగిన షార్ట్‌లు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు మానిటైజేషన్ చిహ్నాన్ని చూపుతాయి. మా మానిటైజేషన్ చిహ్నం గైడ్‌లో విభిన్న చిహ్నాల గురించి మరింత తెలుసుకోండి.

YouTube ఎనలిటిక్స్ మీరు Shorts యాడ్‌లతో మానిటైజ్ చేయడం మొదలుపెట్టిన రోజు నుండి, ఇతర పనితీరు కొలమానాలతో పాటు అంచనా వేసిన రోజువారీ Shorts ఫీడ్ యాడ్ ఆదాయాన్ని డిస్‌ప్లే చేయడాన్ని కూడా ప్రారంభిస్తుంది. మీ YouTube ఆదాయాన్ని చెక్ చేయడం ఎలాగో మరింత తెలుసుకోండి.

మీరు మీ ఛానెల్‌కు చెందిన Shorts వీక్షణలను ఇకపై యాడ్‌లతో మానిటైజ్ చేయకూడదనుకుంటే, క్రియేటర్ సపోర్ట్‌ను సంప్రదించడం ద్వారా Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌కు సమ్మతిని నిలిపివేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2560644825071776425
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false