Creator Music FAQ

Creator Music ఫీచర్ ప్రస్తుతం U.S. క్రియేటర్‌లకు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో అందుబాటులో ఉంది. U.S. బయట ఉండే YPP క్రియేటర్‌లకు విస్తరించే ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.
Creator Musicను ఉపయోగించడం గురించి క్రియేటర్‌లు తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు) ఈ కింద ఉన్నాయి. FAQలు 3 కేటగిరీలుగా గ్రూప్ చేయబడ్డాయి:
 
 

సాధారణ FAQలు

Creator Music అంటే ఏమిటి?
Creator మ్యూజిక్ అనేది మెయిన్‌స్ట్రీమ్ మ్యూజిక్ గల విస్తరిస్తున్న కేటలాగ్, కాపీరైట్ క్లెయిమ్‌ల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా, మానిటైజ్ చేయబడే వీడియోలలో ఆ మ్యూజిక్‌ను ఉపయోగించవచ్చు. మ్యూజిక్ హక్కుదారులు సెట్ చేసిన వినియోగ నియమాల ఆధారంగా, మ్యూజిక్‌ను ఉపయోగించడానికి సంబంధించి అనేక మార్గాలను Creator మ్యూజిక్, క్రియేటర్‌లకు అందిస్తుంది. ఉదాహరణకు:
  • కొన్ని పాటలకు లైసెన్స్ పొందవచ్చు, అంటే క్రియేటర్‌లు ముందస్తు ఫీజును (లేదా కొన్ని ట్రాక్‌ల విషయంలో ఫీజు ఉండదు) పే చేసి, వారి వీడియోలో మ్యూజిక్‌ను ఉపయోగించి, వీడియో ఆదాయం అంతటినీ వారే ఉంచుకోవచ్చు. మరింత తెలుసుకోండి.
  • కొన్ని పాటల ద్వారా ఆదాయాన్ని షేర్ చేయవచ్చు, అంటే క్రియేటర్‌లు ముందస్తుగా ఏమీ పే చేయనవసరం లేదు, వారి వీడియో ద్వారా వచ్చే ఆదాయం వారికి, ఇంకా మ్యూజిక్ హక్కుదారులకు మధ్య విభజించబడుతుంది. మరింత తెలుసుకోండి.
Creator మ్యూజిక్‌ను నేనెలా ఉపయోగించగలను?

Creator Music ఫీచర్ YouTube Studioలో ఉంటుంది, మీ YouTube వీడియోలలో ఉపయోగించడం కోసం పాటలను బ్రౌజ్ చేయడానికి, ప్రివ్యూను చూడటానికి, అలాగే డౌన్‌లోడ్ చేయడానికి అది మీకు వీలు కల్పిస్తుంది. ​​ఒక్కో ట్రాక్ విషయంలో, మీకు ఈ కింద పేర్కొన్న వినియోగ ఆప్షన్‌లు కనిపించవచ్చు:

  1. లైసెన్స్‌ను కొనుగోలు చేయడం: మ్యూజిక్‌ను ఉపయోగించడానికి ముందస్తు ఫీజును పే చేసి, అలాగే మ్యూజిక్ లేకుండా మీ కంటెంట్‌కు వర్తించే అదే ఆదాయ షేరింగ్‌ను పొందండి.
  2. ఆదాయ షేరింగ్: ట్రాక్ హక్కుదారులతో వీడియో ఆదాయాన్ని షేర్ చేసుకోండి.
ట్రాక్‌కు, ట్రాక్‌కూ వినియోగ ఆప్షన్‌లు మారవచ్చు. లైసెన్స్ పొందడం కోసం లేదా ఆదాయ షేరింగ్ కోసం అందుబాటులో లేని కొన్ని ట్రాక్‌లు మీకు ఇప్పటికీ కనిపించవచ్చని గుర్తుంచుకోండి. మీరు ఆ ట్రాక్‌లలో ఒక దాన్ని ఉపయోగించాలని ఎంచుకుంటే, మీ వీడియోకు కంటెంట్ ID క్లెయిమ్ లేదా కాపీరైట్ ఉల్లంఘన వల్ల తొలగింపు రిక్వెస్ట్ అందవచ్చు.
కొన్ని ట్రాక్‌లకు ప్రివ్యూను డౌన్‌లోడ్ చేసే ఆప్షన్ ఎందుకు అందుబాటులో లేదు?

ప్రస్తుతం మేము Creator మ్యూజిక్ నుండి లైసెన్స్ పొందగల ట్రాక్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసే వీలు కల్పిస్తున్నాము.

ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న ట్రాక్‌ల కోసం, ట్రాక్‌ను డౌన్‌లోడ్ చేయడానికి Creator మ్యూజిక్ కాకుండా వేరే సోర్స్ అవసరం అవుతుంది.

నా లైవ్ స్ట్రీమ్‌లలో నేను Creator Musicను ఉపయోగించుకోవచ్చా?
ప్రస్తుతం, లైవ్ స్ట్రీమ్ చేయబడే కంటెంట్‌కు లైసెన్సింగ్ ఆప్షన్‌ను Creator Music సపోర్ట్ చేయడం లేదు.
Creator Musicకు నాకు ఇంకా ఎందుకు యాక్సెస్ లేదు?
ఈ ఫీచర్‌ను USలోని YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) క్రియేటర్‌లకు మేము క్రమక్రమంగా రిలీజ్ చేస్తున్నాము, భవిష్యత్తులో US బయట ఉండే YPP క్రియేటర్‌లకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నాము.
నేను YPPలో లేను, నేను Creator Musicకు యాక్సెస్ పొందవచ్చా?
కాలక్రమేణా మరింత మంది యూజర్‌లకు అందుబాటులోకి వచ్చేలా మేము Creator Musicను క్రమక్రమంగా విస్తరిస్తున్నాము, మ్యూజిక్‌కు సంబంధించిన కొత్త ఫీచర్‌లను క్రియేటర్‌లందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి కృషి చేస్తున్నాము. ప్రస్తుతానికి, YPPలోని క్రియేటర్‌లు మాత్రమే లైసెన్స్‌లను కొనుగోలు చేయగలరు.
ఆడియో లైబ్రరీ ఏమైపోయింది?
మీకు Creator మ్యూజిక్‌కు యాక్సెస్ ఉంటే, మేము YouTube ఆడియో లైబ్రరీ పాటలన్నింటినీ అక్కడ జోడించాము, తద్వారా మీ సౌండ్‌ట్రాక్ అవసరాలన్నింటినీ మీరు ఒకే చోట కనుగొనగలరు. ప్రస్తుతానికి, ఇంతకు ముందు ఉండిన సౌండ్స్ ఎఫెక్ట్స్ ట్యాబ్‌ను జానర్‌ల విభాగంలో కనుగొనవచ్చు. Creator మ్యూజిక్ హోమ్ పేజీకి దిగువున ఉండే తిరిగి ఆడియో లైబ్రరీకి వెళ్లండిని క్లిక్ చేయడం ద్వారా, మునుపు YouTube ఆడియో లైబ్రరీలో సేవ్ చేయబడిన పాటలను యాక్సెస్ చేయవచ్చు.
Creator Musicలో నాకు ఒక పాట కనిపించడం లేదు. అంటే అర్థం ఏమిటి?
మీ వీడియోలో ఉపయోగించడం కోసం మీరు Creator Musicలో ఏ ట్రాక్ కోసమైతే వెతుకుతున్నారో, అది మీకు కనిపించకపోతే, లైసెన్స్ పొందడం కోసం కానీ లేదా ఆదాయ షేరింగ్ కోసం కానీ ఆ ట్రాక్ అందుబాటులో లేదని అర్థం. ఫలితంగా, ఉపయోగించడానికి మీకు హక్కులు లేని ట్రాక్‌ను మీరు ఉపయోగించాలని ఎంచుకుంటే, మీ వీడియోపై కంటెంట్ ID క్లెయిమ్ లేదా కాపీరైట్ ఉల్లంఘన వల్ల తొలగింపు రిక్వెస్ట్ అందే రిస్క్ ఉంది.
నేను ఉపయోగించిన పాటకు కాకుండా వేరే పాటకు నాకు కంటెంట్ ID క్లెయిమ్ అందింది. నేను ఏమి చేయగలను?
మీకు అందిన కంటెంట్ ID క్లెయిమ్ సరి కానిది అని మీకు అనిపిస్తే, మీరు క్లెయిమ్‌పై వివాదాన్ని ఫైల్ చేయవచ్చు.

నా వీడియోను రష్యా లేదా బెలారస్‌లో ఎందుకు బ్లాక్ చేశారు?

కొందరు మ్యూజిక్ హక్కుదారులు, తమ ట్రాక్‌లను రష్యా, బెలారస్‌తో సహా కొన్ని ప్రాంతాలలో బ్లాక్ అయ్యి ఉండేలా ఎంచుకోవచ్చు.

లైసెన్స్‌కు సంబంధించిన FAQలు

లైసెన్స్ అంటే ఏమిటి?
ఇతర వ్యక్తులకు హక్కులు ఉన్న కంటెంట్‌ను ఎవరైనా ఉపయోగించే చట్టపరమైన అనుమతిని లైసెన్స్ అందిస్తుంది. Creator మ్యూజిక్‌తో, ఈ హక్కుదారులతో నేరుగా YouTubeలోనే ఇంటరాక్ట్ అయ్యే ప్రాసెస్‌ను మేము క్రమబద్ధీకరించాము. లైసెన్సింగ్ గురించి మరింత సమాచారాన్ని మా సహాయ కేంద్రంలో చూడండి.
లైసెన్స్ కోసం నేను ఎప్పుడు పే చేయాలి?
మీరు ఉపయోగించడానికి ముందే నేరుగా Creator మ్యూజిక్‌లో లేదా Creator మ్యూజిక్ ట్రాక్‌ను ఉపయోగించిన వీడియోను అప్‌లోడ్ చేసినప్పుడు లైసెన్స్ కోసం పేమెంట్ చేయవచ్చు. ట్రాక్‌ల లైసెన్సింగ్ గురించి మరింత తెలుసుకోండి.
నేను లైసెన్స్‌ను కొనుగోలు చేస్తే, ఇప్పుడు ఆ మ్యూజిక్ నా సొంతమైనట్టేనా?
లేదు, లెసెన్స్‌ను కొనుగోలు చేసినంత మాత్రాన, మ్యూజిక్ మీ సొంతం అయిపోతుందని అర్థం చేసుకోరాదు. మీరు కేవలం మ్యూజిక్‌ను ఉపయోగించడానికి అనుమతిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని అర్థం. నిర్దిష్టంగా చెప్పాలంటే, మీరు ఏ మ్యూజిక్ కోసం లైసెన్స్ పొందుతున్నారో, లైసెన్స్ నియమాలు, షరతులకు లోబడి ఆ మ్యూజిక్‌తో వీడియోను సింక్ చేసే వీలును మీకు అందించే, ఒకేసారి ఉపయోగించగల సింక్రనైజేషన్ (లేదా "సింక్") లైసెన్స్‌ను మీరు కొనుగోలు చేస్తున్నారు.
లైసెన్స్ ధరలు ఎలా నిర్ణయించబడతాయి? ఆ ధరలు మారే అవకాశం ఉందా?

ట్రాక్‌లకు హక్కులు కలిగిన మ్యూజిక్ పార్ట్‌నర్‌లు లైసెన్స్ నియమాలను, అలాగే ధరలను సెట్ చేస్తారు. కొన్ని ట్రాక్‌లకు క్రియేటర్‌లందరికీ ఒకే ధర సెట్ చేసి ఉంటుందని, ఇంకొన్ని వాటికి అయితే, మీ ఛానెల్ సైజును బట్టి అనుకూలంగా మార్చే ధర ఉండవచ్చని గుర్తుంచుకోండి.

మీరు లైసెన్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత, ఆ లైసెన్స్ వ్యవధిలో ధరలు మారినా, లైసెన్స్ ప్రభావితం కాదు.

ఒకవేళ లైసెన్స్ ధర మారితే, అది నా మునుపటి కొనుగోలును ప్రభావితం చేస్తుందా?
లైసెన్స్ ధరలోని ఏ మార్పులూ కూడా, గతంలోని మీ లైసెన్స్‌ల కొనుగోళ్లను, వినియోగాన్ని ప్రభావితం చేయవు.
నేను లైసెన్స్‌ను కొనుగోలు చేయకుండానే ట్రాక్‌ను నా వీడియోలో ఉపయోగిస్తే, ఏం అవుతుంది?
Creator Musicలో లైసెన్స్ పొందగల కొన్ని పాటలకు ఆదాయ విభజనకు అర్హత ఉంటుంది. అంటే, వీడియో ద్వారా వచ్చే ఆదాయం, మీకు, ఆ పాట హక్కుదారులకు మధ్య విభజించబడుతుందని అర్థం.
లైసెన్స్ పొందడానికి కానీ లేదా ఆదాయ షేరింగ్ కోసం కానీ అందుబాటులో లేని ఇతర పాటలను ఉపయోగిస్తే, మీ వీడియో విషయంలో కంటెంట్ ID క్లెయిమ్ లేదా కాపీరైట్ ఉల్లంఘన వల్ల తొలగింపు రిక్వెస్ట్ వచ్చే అవకాశం ఉంది, దీని వలన మానిటైజ్ చేయగల అవకాశాన్నే మీరు కోల్పోవచ్చు.
నిర్దిష్ట ట్రాక్‌కు ఏ నియమాలు వర్తిస్తాయో చూడటానికి, మీరు Creator Musicలో వినియోగ వివరాలను చెక్ చేయవచ్చు.
నేను లైసెన్స్‌ను కొనుగోలు చేస్తే, లైసెన్స్ పొందిన ట్రాక్‌ను పలు వీడియోలలో ఉపయోగించవచ్చా?
మేము ప్రస్తుతం ఒకసారి ఉపయోగించగల లైసెన్స్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తున్నాము. అంటే, మీరు ఏదైనా ట్రాక్ కోసం లైసెన్స్‌ను కొనుగోలు చేసినట్లయితే, ఆ ట్రాక్‌ను ఒక వీడియోలో మాత్రమే ఉపయోగించగలరని అర్థం. ఒకటి కంటే ఎక్కువ వీడియోలలో ఒకే ట్రాక్‌ను ఉపయోగించాలనుకుంటే, మీరు ప్రతి వీడియోకు లైసెన్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
లైసెన్స్ పొందిన పలు ట్రాక్‌లను నేను ఒకే వీడియోలో ఉపయోగించగలనా?
ఉపయోగించవచ్చు! ఒక వీడియోకు జోడించగల లైసెన్స్‌ల సంఖ్యపై ఎలాంటి పరిమితీ లేదు. మానిటైజ్ చేయాలంటే, వీడియోలోని కంటెంట్ అంతటికీ కావలసిన హక్కులను మీరు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.
Creator Music నుండి లైసెన్స్ పొందిన ట్రాక్‌లను నేను YouTubeలో కాకుండా వేరే ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించగలనా?
లేదు, మీరు Creator మ్యూజిక్ ద్వారా ఏ ట్రాక్‌కు అయినా లైసెన్స్ పొందితే, YouTubeకు అప్‌లోడ్ చేసిన వీడియోలలో మాత్రమే మీరు ఆ ట్రాక్‌ను ఉపయోగించగలరు. Creator Music వినియోగ వివరాల గురించి మరింత తెలుసుకోండి.
లైసెన్స్ గడువు ముగిశాక, వీడియో పరిస్థితి ఏమిటి?
మీ లైసెన్స్‌ను రీ-యాక్టివేట్ చేసే వీలు మీకు లభించవచ్చు. మీరు లైసెన్స్‌ను రీ-యాక్టివేట్ చేయకపోతే, మ్యూజిక్‌కు సంబంధించిన వినియోగ నియమాలు, తిరిగి ఆదాయ షేరింగ్ నియమాలకు ఆటోమేటిక్‌గా రివర్ట్ అయిపోవచ్చు (ఒకవేళ ట్రాక్‌కు ఆదాయ షేరింగ్ అర్హత ఉంటే).
లేదంటే, వీడియోలోని ట్రాక్‌కు సంబంధించిన లైసెన్స్ గడువు ముగిసిపోయాక లేదా దాని ద్వారా ఆదాయ విభజన ఆగిపోయాక, ఆ వీడియోకు కంటెంట్ ID క్లెయిమ్ లేదా కాపీరైట్ ఉల్లంఘన వల్ల తొలగింపు రిక్వెస్ట్ అందే రిస్క్ ఉంది కాబట్టి, ఆ వీడియోపై మానిటైజేషన్ లేదా విజిబిలిటీ పరిమితులు ఉండవచ్చు.
నేను కొనుగోలు చేసిన లైసెన్స్‌కు రీఫండ్‌ను ఎలా రిక్వెస్ట్ చేయగలను?

మీరు నేరుగా YouTube Studioలోని Creator Music లైబ్రరీ పేజీ నుండి Creator Music లైసెన్స్‌కు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు. రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయడానికి:

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, Creator Music ను ఎంచుకోండి.
  3. మీ లైబ్రరీ ట్యాబ్‌ను ఎంచుకోండి.
  4. మీరు రీఫండ్ కావాలనుకుంటున్న లైసెన్స్ గల ట్రాక్‌ను కనుగొనండి.
    • (ఆప్షనల్) లైసెన్స్ పొందిన మీ ట్రాక్‌లను మాత్రమే చూడటానికి, పేజీ ఎగువన లైసెన్స్ పొందినవి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ట్రాక్ యొక్క అడ్డు వరుసలో, "మరిన్ని చర్యలు" ఆ తర్వాత రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. రీఫండ్ రిక్వెస్ట్ ఫారమ్‌ను పూర్తి చేయండి.

మీరు రీఫండ్ రిక్వెస్ట్ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, Creator Music రీఫండ్ పాలసీ ప్రకారం ఆ రిక్వెస్ట్‌కు అర్హత ఉంటే, మా సపోర్ట్ టీమ్ మీ రీఫండ్‌ను ప్రాసెస్ చేస్తుంది. రీఫండ్ పాలసీని రివ్యూ చేయడానికి, Creator Music సర్వీస్ నియమాలలోని "రద్దు, రీఫండ్‌ల" విభాగానికి వెళ్లండి.

ఆదాయ విభజనకు సంబంధించిన FAQలు

ఆదాయాన్ని షేర్ చేసే అర్హత నాకు ఎప్పుడు లభిస్తుంది?
  • ట్రాక్‌కు పక్కన 'ఆదాయాన్ని షేర్ చేయండి' చిహ్నం మీకు కనిపించినప్పుడు
    • వీడియో వ్యవధితో సంబంధం లేకుండా మీరు ట్రాక్‌ను ఎంతైనా ఉపయోగించుకోవచ్చు.
  • ఒకవేళ ట్రాక్‌కు లైసెన్స్ పొందగలిగే వీలు ఉండి కూడా, మీకు లైసెన్స్‌ను కొనుగోలు చేయాలని లేకపోతే
    • ట్రాక్‌కు సంబంధించి మీ వినియోగం తప్పనిసరిగా, 3 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉండే వీడియోలో 30 సెకన్ల కన్నా తక్కువకు పరిమితం అయ్యి ఉండాలి.
ఆదాయ షేరింగ్ అంటే ఏమిటి?

Creator Musicతో, ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన ట్రాక్‌లను నిడివి ఎక్కువ ఉన్న వీడియో ఉపయోగిస్తే, ఈ కింద ఉన్న ఉదాహరణల్లో చూపిన విధంగా మ్యూజిక్ హక్కులు పొందేందుకు అయ్యే ఖర్చుల కోసం స్టాండర్డ్ 55% ఆదాయ షేరింగ్ సర్దుబాటు చేయబడుతుంది. ఇది ఈ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:

  • ఉపయోగించిన ట్రాక్‌ల సంఖ్య: ఒక క్రియేటర్ తమ వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన ఎన్ని ట్రాక్‌లను ఉపయోగిస్తారు (ఈ కింద ఉదాహరణలను చూడండి).
  • అదనపు మ్యూజిక్ హక్కుల కోసం అయ్యే ఖర్చులు: ప్లే చేయగల హక్కుల వంటి అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చుల కోసం డిడక్షన్. ఈ డిడక్షన్ 5% దాకా ఉండవచ్చు, ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న Creator Music ట్రాక్‌లన్నింటికి సంబంధించిన ఈ అదనపు మ్యూజిక్ హక్కుల మొత్తం ఖర్చును ఇది ప్రతిబింబిస్తుంది.
ఆదాయ షేరింగ్ లెక్కింపుల ఉదాహరణలు

ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు

ఉదాహరణ: క్రియేటర్ నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత కలిగిన 1 ట్రాక్‌ను ఉపయోగించి, స్టాండర్డ్ 55% ఆదాయ షేరింగ్‌లో సగం వాటా (27.5%)ను పొందుతారు. ఉదాహరణకు, అదనపు మ్యూజిక్ హక్కుల ధరలకు సంబంధించి డిడక్షన్ 2.5% ఉంటుంది.

ఈ వీడియో కోసం క్రియేటర్ మొత్తం ఆదాయంలో 25% పొందుతారు (27.5% - 2.5%).

 
ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు
ఉదాహరణ ఆదాయ షేరింగ్: 55% ÷ 2 27.5%
ఉదాహరణ అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులు - 2.5%
ఉదాహరణ మొత్తం ఆదాయం 25%

ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, అలాగే లైసెన్స్ పొందిన 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు

ఉదాహరణ: క్రియేటర్ తమ నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, లైసెన్స్ ఉన్న 1 ట్రాక్‌ను ఉపయోగించి, స్టాండర్డ్ 55% ఆదాయ షేర్‌లో 1/3 వంతు (18.33%)ను పొందుతారు. ఉదాహరణకు, అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులకు సంబంధించి డిడక్షన్ 2% ఉంటుంది.

ఈ వీడియో కోసం క్రియేటర్ మొత్తం ఆదాయంలో 16.33% పొందుతారు (18.33% - 2%).

 
ఉదాహరణ: ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న 2 ట్రాక్‌లను, అలాగే లైసెన్స్ పొందిన 1 ట్రాక్‌ను ఉపయోగించినప్పుడు
ఉదాహరణ ఆదాయ షేరింగ్: 55% ÷ 3 18.33%
ఉదాహరణ అదనపు మ్యూజిక్ హక్కుల ఖర్చులు - 2.5%
ఉదాహరణ మొత్తం ఆదాయం 15.83%
నా వీడియో ద్వారా వచ్చే ఆదాయాన్ని నేను ఎందుకు షేర్ చేయలేకపోతున్నాను?
మీ వీడియో ద్వారా వచ్చే ఆదాయాన్ని మీరు షేర్ చేయలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి:
  • మీ వీడియోలో ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉన్న ట్రాక్‌ను కంటెంట్ ID గుర్తించి ఉండకపోవచ్చు. ఒకవేళ సదరు ట్రాక్‌కు ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉందని కంటెంట్ ID తర్వాత ఎప్పుడైనా గుర్తిస్తే, అలా గుర్తించినప్పుడు మీ వీడియోకు ఆదాయ షేరింగ్ ఎనేబుల్ అవుతుంది.
  • మీ వీడియోను అప్‌లోడ్ చేసిన తర్వాత, ఆ ట్రాక్‌కు హక్కుదారు(లు) ఆదాయ షేరింగ్‌ను డిజేబుల్ చేసి ఉండవచ్చు.
  • కొనుగోలుకు లైసెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, 3 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉన్న వీడియోలో, ట్రాక్‌కు సంబంధించి మీ వినియోగం 30 సెకన్ల కన్నా తక్కువకు పరిమితం అయ్యి ఉండకపోవచ్చు.
  • ఆదాయ విభజనకు అర్హత లేని, ఇతర థర్డ్-పార్టీ కంటెంట్ విషయంలో మీ వీడియోకు కంటెంట్ ID క్లెయిమ్ అంది ఉండవచ్చు. కంటెంట్ ID క్లెయిమ్‌ను పరిష్కరించడానికి మీకు ఉన్న ఆప్షన్‌ల గురించి తెలుసుకోండి.
నేను ఇప్పటికే అప్‌లోడ్ చేసిన వీడియోలకు, ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉంటుందా?
ఉండదు, మీకు Creator Musicకు యాక్సెస్ వచ్చిన తర్వాత పబ్లిష్ అయిన వీడియోలకు మాత్రమే లైసెన్సింగ్/ఆదాయ షేరింగ్ వర్తిస్తుంది. అది రెట్రోయాక్టివ్‌గా ముందే పబ్లిష్ అయిన వీడియోలకు వర్తించదు.
Creator మ్యూజిక్ ఆదాయ విభజనకు, Shorts ఆదాయ విభజనకు మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా?
అవును, వ్యత్యాసం ఉంది. క్రియేటర్‌లు తమ షార్ట్‌ల అప్‌లోడ్‌లకు గాను ఆదాయంలో % వాటా పొందే వీలును Shorts ఆదాయ షేరింగ్ కల్పిస్తుంది. Creator Music ఆదాయ విభజన అనేది క్రియేటర్‌లు తమ నిడివి ఎక్కువ ఉన్న వీడియోలలో అర్హత ఉన్న మ్యూజిక్‌ను ఉపయోగించినప్పుడు, వారు మ్యూజిక్ హక్కుదారులతో ఆదాయాన్ని షేర్ చేసుకునే వీలును కల్పిస్తుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10714315427855231871
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false