YouTube ఆదాయాలకు సంబంధించిన U.S. ట్యాక్స్ ఆవశ్యకాలు

ముఖ్య గమనిక: సంవత్సరం చివరికి వచ్చే సరికి, మానిటైజ్ చేసే క్రియేటర్‌లు, తమ ట్యాక్స్ సమాచారాన్ని YouTube కోసం AdSenseలో చెక్ చేసుకోవలసి ఉంటుంది. ట్యాక్స్ ఫారమ్‌ను సబ్మిట్ చేశారని నిర్ధారించుకోండి, అర్హత ఉంటే, డిసెంబర్ 10, 2023 లోపు ట్యాక్స్ ఒప్పంద ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోండి. సందర్భోచితంగా ఉన్న చోట Google 2023 ట్యాక్స్‌లను తిరిగి లెక్కించి, వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని రీఫండ్ చేస్తుంది.

మీరు ట్యాక్స్ సమాచారాన్ని షేర్ చేయకపోతే, గరిష్ఠ ట్యాక్స్ రేట్‌ను ఉపయోగించి Google ప్రపంచవ్యాప్తంగా ట్యాక్స్‌లను విత్‌హోల్డ్ చేయవలసి రావచ్చు. మీరు ట్యాక్స్ సమాచారాన్ని షేర్ చేస్తే, మీ ట్యాక్స్ రేట్ మీ U.S. ఆదాయంలో 30% వరకు ఉండవచ్చు.

మీ ట్యాక్స్ సమాచారాన్ని చెక్ చేసి, ట్యాక్స్ ఒప్పంద ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోండి:

YouTubeలో ట్యాక్స్ విత్‌హోల్డింగ్ గురించి మరింత తెలుసుకోండి లేదా Googleకు మీ U.S. ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేయడానికి సంబంధించిన FAQలను రివ్యూ చేయండి.

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లోని క్రియేటర్‌ల నుండి ట్యాక్స్ సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం Googleకు ఉంది. ఏవైనా ట్యాక్స్ డిడక్షన్‌లు వర్తిస్తే, యాడ్ వీక్షణలు, YouTube Premium, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, అలాగే ఛానెల్ మెంబర్‌షిప్‌‌ల ద్వారా U.S. లోని వీక్షకుల నుండి వచ్చే YouTube ఆదాయంపై ట్యాక్స్‌లను Google విత్‌హోల్డ్ చేస్తుంది.

Google, U.S. ట్యాక్స్‌లను ఎందుకు విత్‌హోల్డ్ చేస్తుంది

U.S. 'అంతర్గత ఆదాయ కోడ్' చాప్టర్ 3 ప్రకారం, U.S.లోని వీక్షకుల ద్వారా YouTubeలో YPP క్రియేటర్ రాయల్టీ ఆదాయాన్ని పొందినప్పుడు, ట్యాక్స్ సమాచారాన్ని సేకరించాల్సిన, ట్యాక్స్‌లను విత్‌హోల్డ్ చేయాల్సిన, అలాగే Internal Revenue Serviceకు (U.S. ట్యాక్స్ అథారిటీ, దీన్ని IRS అని కూడా పిలుస్తారు) రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత Googleకు ఉంది.

గమనిక: YouTube, Googleలు ట్యాక్స్ సమస్యలకు సంబంధించి సలహా ఇవ్వలేవు. మీ ట్యాక్స్ పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి ట్యాక్స్ నిపుణుడిని సంప్రదించండి.

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

Googleకు ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేయడం 

YouTubeలో మానిటైజ్ చేసే క్రియేటర్‌లందరూ, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, ట్యాక్స్ సమాచారాన్ని అందించాలి. దయచేసి మీ ట్యాక్స్ సమాచారాన్ని వీలైనంత త్వరగా సబ్మిట్ చేయండి. ట్యాక్స్ సమాచారాన్ని అందించకపోతే, ప్రపంచవ్యాప్తంగా Google మీ మొత్తం ఆదాయంలో 24% వరకు డిడక్ట్ చేయాల్సి రావచ్చు.

మీ U.S. ట్యాక్స్ సమాచారాన్ని Googleకు సబ్మిట్ చేయడానికి మీరు దిగువ సూచనలను ఫాలో కావచ్చు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ట్యాక్స్ సమాచారాన్ని తిరిగి సబ్మిట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడగవచ్చని, అలాగే ట్యాక్స్ ఫారమ్‌లు సబ్మిట్ చేసేటప్పుడు కేవలం లాటిన్ అక్షరాలు మాత్రమే ఉపయోగించాలని (IRS అవసరాలకు అనుగుణంగా) గమనించండి; ఇక్కడ మరిన్ని వివరాలు తెలుసుకోండి

  1. మీ AdSense ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. పేమెంట్‌లు ఆ తర్వాత పేమెంట్ సమాచారం అనే ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. "పేమెంట్స్ ప్రొఫైల్"కు స్క్రోల్ చేయండి, "యునైటెడ్ స్టేట్స్ పన్ను సమాచారం" పక్కన ఎడిట్ చేయండి ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. పన్ను సమాచారాన్ని మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. ఈ పేజీలో మీరు మీ పన్ను పరిస్థితికి తగిన ఫారమ్‌ను ఎంచుకోవడానికి సహాయపడే ఒక గైడ్‌ను కనుగొంటారు.
    చిట్కా: మీరు మీ పన్ను సమాచారాన్ని సబ్‌మిట్ చేసిన తర్వాత, మీ పేమెంట్‌లకు వర్తించే పన్ను మినహాయింపు ధరలను కనుగొనడానికి మీ పేమెంట్ ప్రొఫైల్‌లోని “యునైటెడ్ స్టేట్స్ పన్ను సమాచారం” విభాగాన్ని చెక్ చేయడానికి పై సూచనలను అనుసరించండి.

    మీ వ్యక్తిగత లేదా బిజినెస్ పరిస్థితులు ఏవైనా మారినప్పుడు మీరు కూడా మార్పులు చేయగలరు. మీ అడ్రస్‌ను మీరు మార్చినట్లయితే, మీ అప్‌డేట్ చేసిన శాశ్వత అడ్రస్ రెండు విభాగాలలో ఒకేలా ఉందని నిర్ధారించుకోండి: "శాశ్వత నివాస అడ్రస్" , "చట్టపరమైన అడ్రస్". ఇది మీ సంవత్సర-ముగింపు పన్ను ఫారమ్‌లను (ఉదా., 1099-MISC, 1099-K, 1042-S) సరైన లొకేషన్‌కు డెలివరీ చేస్తాయని ఇది నిర్ధారిస్తుంది. మీరు USలో ఉంటే, మీరు మీ W-9 ఫారమ్‌ను మీ అప్‌డేట్ చేసిన చట్టపరమైన అడ్రస్‌తో మళ్లీ సమర్పించాలి

'YouTube కోసం AdSense'లో మీ పన్ను సమాచారాన్ని సమర్పించడానికి మిమ్మల్ని సిద్ధం చేయడంలో సహాయం కావాలంటే, Googleకు మీ U.S. పన్ను సమాచారాన్ని సమర్పించడం లింక్‌కు వెళ్లండి. MCNకు సంబంధించిన గైడెన్స్ కోసం, MCNలకు, అనుబంధ ఛానెల్స్‌కు సంబంధించిన ట్యాక్స్ ఆవశ్యకతలు లింక్‌కు వెళ్లండి.

U.S. ట్యాక్స్ ఆవశ్యకతలు ఎక్కడ వర్తిస్తాయి

ప్రతి YPP క్రియేటర్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, Googleకు U.S. ట్యాక్స్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. U.S. ట్యాక్స్ చట్టం ప్రకారం, ఒకవేళ వర్తిస్తే U.S.లోని వీక్షకుల నుండి మీరు పొందిన ఆదాయం నుండి Google ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు నివాసం ఉంటున్న దేశం, మీరు ట్యాక్స్ ఒప్పంద ప్రయోజనాలను క్లెయిమ్ చేసేందుకు అర్హులా, కాదా, అలాగే మీకు వ్యక్తిగా గుర్తింపు ఉందా లేదంటే బిజినెస్‌గా గుర్తింపు ఉందా అనే అంశాల ఆధారంగా ట్యాక్స్ విత్‌హోల్డింగ్ ఆవశ్యకాలు మారుతూ ఉంటాయి.

  • U.S వెలుపల ఉండే క్రియేటర్‌లు:  మీరు U.S. ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేస్తే, U.S.లోని వీక్షకుల నుండి మీరు పొందిన ఆదాయంపై విత్‌హోల్డింగ్ రేట్‌లు 0-30% మధ్య ఉంటాయి, అలాగే యునైటెడ్ స్టేట్స్‌తో మీ దేశం ట్యాక్స్ ఒప్పందాన్ని కలిగి ఉందా, లేదా అనే అంశంపై ఆధారపడి ఉంటాయి. 
  • U.S. క్రియేటర్‌లు: మీరు చెల్లుబాటు అయ్యే ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేస్తే, Google ట్యాక్స్‌లను విత్‌హోల్డ్ చేయదు. చాలా మంది U.S. క్రియేటర్‌లు ఇప్పటికే తమ U.S. ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేశారు.

ముఖ్య గమనిక: U.S. పన్ను సమాచారాన్ని అందించకపోతే, Google గరిష్ఠ ట్యాక్స్ రేటును ఉపయోగించి విత్‌హోల్డ్ చేయాల్సి రావచ్చు. మీ ట్యాక్స్ రేటు అనేది మీ 'YouTube కోసం AdSense' ఖాతా రకం, దేశంపై ఆధారపడి ఉంటుంది:

  • బిజినెస్ ఖాతా రకం: పేమెంట్ గ్రహీత U.S. వెలుపల ఉంటే, U.S. నికర ఆదాయంపై ఆటోమేటిక్ విత్‌హోల్డింగ్ రేటు 30% ఉంటుంది. U.S.లోని బిజినెస్‌లు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మొత్తం నికర ఆదాయంపై 24% విత్‌హోల్డింగ్‌కు లోబడి ఉంటాయి.
  • వ్యక్తిగత ఖాతా రకం: బ్యాకప్ విత్‌హోల్డింగ్ వర్తిస్తుంది, అలాగే ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆదాయంపై 24% విత్‌హోల్డ్ చేయబడుతుంది.

'YouTube కోసం AdSense'లో చెల్లుబాటు అయ్యే U.S. పన్ను సమాచారాన్ని సమర్పించిన తర్వాత, ఈ విత్‌హోల్డింగ్ రేట్‌లు తర్వాతి పేమెంట్ కాల వ్యవధిలో సర్దుబాటు చేయబడతాయి. మీ AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతా ఏ ఖాతా రకం అనేది గుర్తించడానికి మీరు ఈ సూచనలను ఫాలో కావచ్చు.

ముఖ్య గమనిక: Google ఎన్నడూ కూడా మీ పాస్‌వర్డ్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారం తెలియజేయమని అడుగుతూ అవాంఛిత మెసేజ్‌లను పంపదు. ఏదైనా లింక్‌ను క్లిక్ చేసే ముందు, ఈమెయిల్ @youtube.com లేదా @google.com ఈమెయిల్ అడ్రస్ నుండే పంపబడిందా, లేదా అని ఎల్లప్పుడూ చెక్ చేసుకోండి.

FAQ

ట్యాక్స్ విత్‌హోల్డింగ్ అంటే ఏమిటి?

సరళంగా చెప్పాలంటే, పేమెంట్‌ను స్వీకరించే వ్యక్తి యొక్క U.S. ట్యాక్స్ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్‌లు మీ పేమెంట్‌ల నుండి డిడక్ట్ చేయబడతాయి, దీన్నే ట్యాక్స్ విత్‌హోల్డింగ్ అంటారు.

U.S. ట్యాక్స్ చట్టం ప్రకారం, U.S. ట్యాక్స్ చట్టానికి అనుగుణంగా అవసరమైన ముందస్తుగా కోత విధించే సంస్థగా Google వ్యవహరిస్తుంది, అలాగే అవసరమైనప్పుడు సంబంధిత YouTube ఆదాయంపై ట్యాక్స్‌లను విత్‌హోల్డ్ చేస్తుంది.

ఇది YouTubeలో నా ఆదాయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

మీరు చెల్లుబాటు అయ్యే ట్యాక్స్ సమాచారాన్ని సమర్పిస్తే, యునైటెడ్ స్టేట్స్‌లోని వీక్షకుల నుండి వచ్చే ఆదాయంలో కొంత భాగానికే ట్యాక్స్ విత్‌హోల్డింగ్, అలాగే రిపోర్టింగ్ వర్తిస్తుంది.

Googleకు మీరు అందించే పన్ను సమాచారం ఆధారంగా, ఖచ్చితమైన ట్యాక్స్ విత్‌హోల్డింగ్ రేటు నిర్ణయించబడుతుంది. మీ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, మీ 'YouTube కోసం AdSense' పేమెంట్ సెట్టింగ్‌లలోని 'పన్ను సమాచారాన్ని మేనేజ్ చేయండి' విభాగంలో మీ ట్యాక్స్ విత్‌హోల్డింగ్ రేటును చూడవచ్చు. ట్యాక్స్ విత్‌హోల్డింగ్ మొత్తాలు YouTube ఎనలిటిక్స్‌లో కనిపిస్తాయి.

ఊహాత్మక ఉదాహరణ

ఇది ఊహాత్మక ఉదాహరణ: YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగమై ఉన్న ఇండియాలోని YouTube క్రియేటర్ గత నెలలో YouTube నుండి $1,000 USD సంపాదించారు. ఈ $1,000 USDలో, వారి ఛానెల్ $100 USD U.S. వీక్షకుల ద్వారా పొందింది.

ఇక్కడ కొన్ని అవకాశమున్న విత్‌హోల్డింగ్ సందర్భాలు ఉన్నాయి:

  • క్రియేటర్ ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేయనప్పుడు: తుది ట్యాక్స్ డిడక్షన్ $240 USD ఉంటుంది, ఎందుకంటే వారు ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేయలేదు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా పొందిన మొత్తం ఆదాయంలో 24% వరకు విత్‌హోల్డింగ్ ట్యాక్స్ రేట్ ఉంటుంది. అంటే దీనర్థం పూర్తి ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేసేంత వరకు వారి U.S. ఆదాయంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆదాయంలో మేము 24% వరకు డిడక్ట్ చేయాల్సి ఉంటుంది.
  • క్రియేటర్ ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేసి, ఒప్పంద ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసినప్పుడు: తుది ట్యాక్స్ డిడక్షన్ $15 USD ఉంటుంది. ఎందుకంటే U.S., అలాగే ఇండియా మధ్య ట్యాక్స్ ఒప్పందం ఉంది, దీని ద్వారా U.S.లోని వీక్షకుల నుండి వచ్చే ఆదాయంపై ట్యాక్స్ శాతం 15%కు తగ్గుతుంది.
  • క్రియేటర్ ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేసి, ట్యాక్స్ ఒప్పంద ప్రయోజనానికి అర్హత కలిగి లేనప్పుడు: తుది ట్యాక్స్ డిడక్షన్ $30 USD ఉంటుంది. ఎందుకంటే U.S.లోని వీక్షకుల నుండి వచ్చిన ఆదాయంపై ట్యాక్స్ ఒప్పందం లేకుండా ఉండే ట్యాక్స్ శాతం 30% కాబట్టి.

అంచనా ట్యాక్స్ విత్‌హోల్డింగ్‌ను లెక్కించండి

ఈ కింద ఉదహరించిన లెక్క ప్రకారం మీ YouTube ఆదాయం ఎలా ప్రభావితమవవచ్చో చూడండి:

  1. YouTube ఎనలిటిక్స్‌లో రాబడి రిపోర్ట్‌ను యాక్సెస్ చేసి, తేదీ ఫిల్టర్‌ను సంబంధిత పేమెంట్ వ్యవధికి (ఉదా. అక్టోబర్ 1 - 31) సెట్ చేయండి. మీ YouTube ఎన‌లిటిక్స్‌ను మీరు పేమెంట్ పొందే కరెన్సీకి (ఉదా. USD) సెట్ చేస్తే సహాయకరంగా ఉండవచ్చు.
  2. యునైటెడ్ స్టేట్స్ నుండి అంచనా వేసిన ఆదాయాన్ని చూడడానికి భౌగోళిక ప్రాంత ఫిల్టర్‌ను వర్తింపజేయండి. YouTube ఎనలిటిక్స్‌లో మీ ప్రేక్షకుల గురించి మరింత తెలుసుకోండి.
  3. మీ ట్యాక్స్ విత్‌హోల్డింగ్ రేటును కనుగొనడానికి మీ 'YouTube కోసం AdSense' ఖాతాకు వెళ్లండి. మీరు U.S. పన్ను సమాచారాన్ని సమర్పించిన తర్వాత మీ విత్‌హోల్డింగ్ రేటు కనిపిస్తుంది.
  4. పైన ఉన్న 2, 3 దశల ఫలితాలను గుణించండి.

పైన పేర్కొన్న వాటిని ఫాలో అవ్వడం ద్వారా ట్యాక్స్ విత్‌హోల్డింగ్ అంచనా విలువ మాత్రమే వస్తుందని గమనించండి. Google, ట్యాక్స్‌లను విత్‌హోల్డ్ చేయడం ప్రారంభించగానే, విత్‌హోల్డ్ చేయబడిన తుది మొత్తం 'YouTube కోసం AdSense'లోని మీ సాధారణ పేమెంట్స్ లావాదేవీల రిపోర్ట్‌లో మీకు కనిపిస్తుంది (ఏవైనా వర్తిస్తే).

నా ఛానెల్‌లో U.S.లోని వీక్షకుల నుండి నేను ఆదాయాన్ని పొందకపోతే ఏమి చేయాలి?

U.S.లోని వీక్షకుల నుండి ఆదాయం పొందినా, పొందకపోయినా YPP క్రియేటర్‌లందరూ ట్యాక్స్ సమాచారాన్ని Googleకు సబ్మిట్ చేయాలి. మీరు భవిష్యత్తులో U.S.లోని వీక్షకుల నుండి ఆదాయం పొందితే, మీ U.S. ట్యాక్స్ సమాచారాన్ని సబ్మిట్ చేస్తే, మీ కోసం ఖచ్చితమైన విత్‌హోల్డింగ్ రేట్‌ను నిర్ణయించడంలో అది సహాయపడుతుంది.

నేను U.S.కు చెందిన క్రియేటరా, కాదా అన్నది నిర్ణయించడానికి ఎలాంటి ప్రమాణాలను ఉపయోగిస్తారు?

మీ ట్యాక్స్ సమాచారంలో మీరు ప్రకటించే నివాస దేశం ఆధారంగా మీ లొకేషన్ నిర్ణయించబడుతుంది.

అంటే దీని అర్థం నాకు నా నివాస దేశం, అలాగే U.S. రెండు చోట్లా ట్యాక్స్ విధించబడుతుందా?

U.S.లోని వీక్షకుల నుండి మీరు పొందిన ఆదాయంపైనే Google U.S. ట్యాక్స్‌లను విత్‌హోల్డ్ చేయాల్సి ఉంటుంది. మీ YouTube ఆదాయంపై మీ స్థానిక ఆదాయ పన్ను చట్టాలు ఇప్పటికీ వర్తించవచ్చు.

పలు దేశాలు ట్యాక్స్ ఒప్పందాలను కలిగి ఉన్నాయి, దీని ద్వారా రెండు సార్లు ట్యాక్స్ డిడక్ట్ అవకుండా ఉంటుంది. అదనంగా, అంతర్జాతీయ ట్యాక్స్ భారాన్ని తగ్గించడంలో సహాయపడడానికి కొన్ని దేశాలు విదేశీ ట్యాక్స్ క్రెడిట్‌లను అనుమతించవచ్చు. మీ 'YouTube కోసం AdSense' ఖాతాలోని ట్యాక్స్ టూల్‌లో ట్యాక్స్ ఒప్పందాన్ని క్లెయిమ్ చేయడం ద్వారా, మీ ట్యాక్స్ భారాన్ని తగ్గించుకోగలిగే అవకాశం మీకు ఉంటుంది. దయచేసి మీ ట్యాక్స్ సలహాదారును సంప్రదించండి. ఇక్కడ మరింత తెలుసుకోండి

Google ఎలాంటి ట్యాక్స్ రిపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అందిస్తుంది?

తుది ట్యాక్స్ విత్‌హోల్డింగ్ మొత్తాలు మీ పేమెంట్ కాల వ్యవధి ప్రకారం మీ పేమెంట్స్ రిపోర్ట్‌లో మీకు కనిపిస్తాయి. విత్‌హోల్డ్ చేయబడిన మొత్తాలు సాధారణంగా పేమెంట్‌కు సంబంధించిన తర్వాతి నెలలో కనిపిస్తాయి – ఉదాహరణకు, ఏప్రిల్‌కు సంబంధించిన విత్‌హోల్డింగ్ మొత్తాలు మే నెలకు సంబంధించిన పేమెంట్స్ రిపోర్ట్‌లో లిస్ట్ చేయబడతాయి. మీ ఖాతాలో పేమెంట్ హోల్డ్స్ లేదా ఇతర సమస్యలు ఉంటే, పలు సమ్మిళిత నెలలకు సంబంధించిన తుది ట్యాక్స్ విత్‌హోల్డింగ్ మొత్తాలు పేమెంట్స్ రిపోర్ట్‌లో తర్వాతి తేదీలో లిస్ట్ చేయబడవచ్చు.

పన్ను సమాచారాన్ని సమర్పించే, అర్హత కలిగిన పేమెంట్‌లను స్వీకరించే క్రియేటర్‌లందరూ, మునుపటి సంవత్సరం ట్యాక్స్ విత్‌హోల్డింగ్‌లకు సంబంధించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న లేదా అంతకు ముందు ట్యాక్స్ ఫారమ్‌ను (ఉదా. 1042-S,) అందుకుంటారు (US క్రియేటర్‌లకు జారీ చేయబడే 1099-MISC ఫారమ్‌లు సాధారణంగా మార్చి ప్రారంభంలో జారీ చేయబడతాయి). సంవత్సరాంతపు U.S. ట్యాక్స్ ఫారమ్ కాపీని, రివిజన్‌ను రిక్వెస్ట్ చేయడానికి, లేదా వాయిడ్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి మా సహాయ కేంద్రానికి వెళ్లండి.

ట్యాక్స్ డాక్యుమెంట్ డెలివరీ ప్రాధాన్యతలు 

మీరు అందుకొనే సంవత్సరాంతపు ట్యాక్స్ ఫారమ్‌లకు సంబంధించిన మీ డాక్యుమెంట్ డెలివరీ ఆప్షన్‌లు, ఇంకా డాక్యుమెంట్ స్టేటస్‌లు, AdSenseలోని ట్యాక్స్ టూల్‌లో ఉండే సెట్టింగ్‌లు > ట్యాక్స్ సమాచారాన్ని మేనేజ్ చేయండిలో అందుబాటులో ఉంటాయి. మీరు ట్యాక్స్ డాక్యుమెంట్‌లను డిజిటల్‌గా అందుకోవడానికి ఆన్‌లైన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు లేదా మామూలుగా అందుకోవడానికి పోస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. 

  • మీరు ఆన్‌లైన్ డెలివరీని ఎంచుకుంటే, మీకు డాక్యుమెంట్‌లు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుతాయి.
  • మీరు పోస్ట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, మేము డాక్యుమెంట్‌లను మీ ట్యాక్స్ ఫారమ్‌లో అందించబడిన పోస్టల్ అడ్రస్‌కు పంపుతాము, మీ డాక్యుమెంట్‌లు ఇప్పటికి కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

ఒకవేళ మీ పోస్టల్ అడ్రస్ మారి ఉంటే, మీ ట్యాక్స్ సమాచారాన్ని మీ పేమెంట్స్ ప్రొఫైల్స్‌లో అప్‌డేట్ చేయండి. మీ పేమెంట్స్ ప్రొఫైల్‌లోని U.S. ట్యాక్స్ ఫారమ్‌లో మీరు సమర్పించిన సమాచారాన్ని Google ఉపయోగిస్తుంది.

నేను మునుపటి విత్‌హోల్డింగ్‌ల నుండి ట్యాక్స్ రీఫండ్‌ను పొందగలనా?

అప్‌డేట్ చేసిన ట్యాక్స్ సమాచారాన్ని డిసెంబర్ 10 లోపు అందిస్తే, కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో U.S. విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌ను Google రీఫండ్ చేయవచ్చు. ఉదాహరణకు, తక్కువ ట్యాక్స్ రేట్‌ను క్లెయిమ్ చేస్తూ అప్‌డేట్ చేసిన W-8 ట్యాక్స్ ఫారమ్‌ను, అవసరమైన ఇతర డాక్యుమెంటేషన్‌ను కాలానుగుణంగా అందిస్తూ ఉంటే, Google విత్‌హోల్డింగ్ మొత్తాలను మళ్లీ లెక్కించి, వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని రీఫండ్ చేస్తుంది.

పరిస్థితులు మారలేదని మాకు అఫిడవిట్‌ను అందించి, అర్హత ఉంటే, మీ ఫారమ్‌కు చేసిన మార్పులు గత తేదీకి వర్తిస్తాయని మీరు ప్రకటించవలసి ఉంటుందని గమనించండి. మీరు దీన్ని మీ 'YouTube కోసం AdSense'లోని ట్యాక్స్ టూల్‌కు సంబంధించిన 6వ దశలో “స్టేటస్ మార్పు అఫిడవిట్” విభాగంలో చేయవచ్చు.

మీ ఫారమ్‌ను మీరు అప్‌డేట్ చేసిన తర్వాత పేమెంట్ కాల వ్యవధిలో ఈ రీఫండ్‌లు కనిపిస్తాయి.

ఈ పరిస్థితులు పరిమితమైనవి, అలాగే చెల్లుబాటు అయ్యే ట్యాక్స్ సమాచారం ట్యాక్స్ విత్‌హోల్డ్ చేసిన క్యాలెండర్ సంవత్సరాంతం లోపు అందాలి. మీరు క్యాలెండర్ సంవత్సరం పూర్యయ్యే లోపు చెల్లుబాటు అయ్యే ట్యాక్స్ సమాచారాన్ని అందించకపోతే, నేరుగా IRSను రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీరు ప్రొఫెషనల్ ట్యాక్స్ సలహాను తీసుకోవాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము.

వర్తించే రీఫండ్‌లు ఏవైనా ఉంటే, అవి మీ పన్ను సమాచారాన్ని 'YouTube కోసం AdSense'లో అప్‌డేట్ చేసిన తర్వాత పేమెంట్ కాల వ్యవధి ముగింపులో మీ పేమెంట్స్ రిపోర్ట్‌లో కనిపిస్తాయి.

మల్టీ ఛానెల్ నెట్‌వర్క్ (MCN)లలో ఉన్న అనుబంధ ఛానెల్స్

2023 ప్రారంభం నుండి MCNలలోని అనుబంధ ఛానెల్స్, రీఫండ్‌లకు అర్హత పొందవచ్చు. అనుబంధ ఛానెల్స్ తక్కువ రేట్‌కు లోబడి ముందస్తుగా పేమెంట్ చేశాయి అనే దానిని రుజువు చేసే చెల్లుబాటయ్యే డాక్యుమెంటేషన్‌ను తప్పనిసరిగా మాకు అందించాలి. అదే క్యాలెండర్ సంవత్సరంలో విత్‌హోల్డ్ చేయబడిన ట్యాక్స్‌లు మాత్రమే రీఫండ్‌లకు అర్హతను కలిగి ఉంటాయి. ఈ మార్పు 2022 సంవత్సరానికి లేదా మునుపటి సంవత్సరాలకు వర్తించదు. ఒకసారి అర్హత పొందితే, ట్యాక్స్ వివిత్‌హోల్డ్ చేయబడిన ఒరిజినల్ కంటెంట్ ఓనర్‌కు రీఫండ్ ఇవ్వబడుతుంది.

ఇది YouTubeతో పాటు నా AdSense నికర ఆదాయానికి కూడా వర్తిస్తుందా?

మీరు చెల్లుబాటు అయ్యే పన్ను సమాచారాన్ని అందిస్తే, చాప్టర్ 3 ప్రకారం U.S. విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌లు మీ YouTube నికర ఆదాయానికి మాత్రమే వర్తిస్తాయి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7912437350556671116
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false