నా ఛానెల్‌కు మానిటైజేషన్ పాజ్ చేయబడింది

మీ ఛానెల్‌కు, యాక్టివ్‌గా ఉన్న, ఆమోదించబడిన 'YouTube కోసం AdSense' ఖాతా లింక్ చేసి లేకపోతే, మీ ఛానెల్‌కు సంబంధించిన మానిటైజేషన్ పాజ్ చేయబడుతుంది. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉన్న పార్ట్‌నర్‌లందరూ తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉన్న, ఆమోదించబడిన, ఇంకా లింక్ చేయబడిన 'YouTube కోసం AdSense' ఖాతాను కలిగి ఉండాలి. 

మీ ఛానెల్‌కు యాక్టివ్‌గా ఉన్న, ఆమోదించబడిన, ఇంకా లింక్ చేయబడిన 'YouTube కోసం AdSense' ఖాతా లేకపోతే, మీరు YouTubeలో డబ్బు సంపాదించలేరని, మీ వీడియోలలో యాడ్‌లు ప్రదర్శించబడవని గమనించండి. అడ్వర్టయిజింగ్, YouTube Premium సబ్‌స్క్రిప్షన్‌లు, ఇంకా ఛానెల్ మెంబర్‌షిప్‌ల వంటి ఇతర ఆదాయ సోర్స్‌ల నుండి కూడా మీకు ఆదాయం లభించదు.

మీ మానిటైజేషన్ పాజ్ చేయబడి ఉన్నప్పటికీ, మీరు YouTubeలో ఒరిజినల్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తూ, మీ ప్రేక్షకుల సంఖ్యను పెంచుకోవడం కొనసాగించవచ్చు. మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉండి, మీ మానిటైజేషన్ పాజ్ చేయబడితే, చింతించకండి – ఇప్పటికీ మీరు ప్రోగ్రామ్‌లో భాగంగానే ఉంటారు. మీరు ఒక యాక్టివ్‌గా ఉన్న, ఆమోదించబడిన 'YouTube కోసం AdSense' ఖాతాను లింక్ చేసిన తర్వాత, మానిటైజేషన్ తిరిగి కొనసాగించబడుతుంది.

మీకు ఇప్పటికే 'YouTube కోసం AdSense' ఖాతా ఉన్నట్లయితే, ఫైల్‌లో ఉన్న అడ్రస్ వెరిఫై చేయబడిందని నిర్ధారించుకుంటే సరిపోతుంది. మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, మేము ఏవైనా పేమెంట్‌లను మీకు పంపడానికి ముందు, మీ అడ్రస్‌ను మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఏమి అవసరం అవుతాయి అనే దాని గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

'YouTube కోసం AdSense' ఖాతాను లింక్ చేయండి

మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉండి, మీ ఛానెల్‌తో అనుబంధించబడి ఉన్న 'YouTube కోసం AdSense' ఖాతాను మార్చాలనుకుంటే, ఈ దశలను ఫాలో అయ్యి దాన్ని చేయవచ్చు: లింక్ చేసి ఉన్న మీ 'YouTube కోసం AdSense' ఖాతాను మార్చండి.

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో మీకు చెందిన కొన్ని ఛానెల్స్ ఉంటే, ప్రతి ఛానెల్‌కు ఒక 'YouTube కోసం AdSense' ఖాతాను లింక్ చేయాల్సిన అవసరం ఉందని గమనించండి.

మానిటైజేషన్‌ను మళ్లీ కొనసాగించిన తర్వాత, నా ఛానెల్ ఎంత కాలం పాటు అయితే పాజ్ చేయబడి ఉందో, అంత కాలానికి నాకు డబ్బు అందుతుందా?

లేదు. పాజ్ చేయబడిన మానిటైజేషన్ అంటే, పాజ్ చేయబడి ఉన్నంత కాలానికి మీ ఛానెల్‌కు ఆదాయం ఉండదు అని, అలాగే మీ వీడియోలలో యాడ్‌లు ప్రదర్శించబడవు అని అర్థం.

ఛానెల్‌లో మానిటైజేషన్ పాజ్ అయితే, అది మల్టీ ఛానెల్ నెట్‌వర్క్ (MCN)పై "స్ట్రయిక్"గా పరిగణించబడుతుందా?

లేదు. పాజ్ చేయబడిన మానిటైజేషన్ మా ఛానెల్ జవాబుదారీతనానికి సంబంధించిన పాలసీ ఉల్లంఘన కిందికి రాదు, ఎందుకంటే ఈ పాలసీ ప్రకారం, అది దుర్వినియోగ సంఘటనగా పరిగణించబడదు. "డీమానిటైజేషన్"ను దుర్వినియోగ సంఘటనగా పరిగణించడం జరుగుతుంది, కానీ దీనికీ, పాజ్ చేయబడిన మానిటైజేషన్ స్టేటస్‌కు సంబంధం లేదు. డిజేబుల్ చేయబడిన మానిటైజేషన్ గురించి మరింత తెలుసుకోండి.

నా ఛానెల్ మానిటైజేషన్ పాజ్ అయ్యి ఉన్నప్పుడు, క్లెయిమ్‌లు మూసివేయబడతాయా?

లేదు. మీ ఛానెల్ మానిటైజేషన్ పాజ్ చేయబడితే, క్లెయిమ్‌లు మూసివేయబడవు.

'YouTube కోసం AdSense' ఖాతాను సెటప్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?

కొత్త AdSense లేదా 'YouTube కోసం AdSense' ఖాతాను సెటప్ చేయడానికి పెద్ద సమయం ఏమీ పట్టకపోయినా, కొత్త ఖాతా యాక్టివేషన్‌కు మాత్రం కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. సాధారణంగా ఆమోదం అనేది ఒక రోజులోపే మంజూరు చేయబడుతుంది, కానీ అప్పుడప్పుడు దీనికి కొన్ని రోజుల సమయం కూడా పట్టవచ్చు. మీరు లింక్ చేసే కొత్త 'YouTube కోసం AdSense' ఖాతాకు PIN అడ్రస్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటే, దానికి 2–4 వారాల సమయం పట్టవచ్చు. మానిటైజేషన్‌ను కొనసాగించడానికి ముందు, మీరు లింక్ చేసిన 'YouTube కోసం AdSense' ఖాతా యాక్టివేట్ అవ్వాలి, ఇంకా అది ఆమోదం పొందాలి.

నా ఛానెల్ మెంబర్‌షిప్‌లకు ఏమవుతుంది?

ఛానెల్‌కు సంబంధించిన మానిటైజేషన్ స్టేటస్ పాజ్ అయినప్పుడు, వారి మెంబర్‌షిప్‌ల ఫీచర్ కూడా పాజ్ అవుతుంది, ఆ విషయం మెంబర్‌లకు తెలియజేయబడుతుంది. ఈ వ్యవధిలో, మానిటైజేషన్‌ను కొనసాగించడానికి ఆ ఛానెల్‌కు 120 రోజుల సమయం ఉంటుంది. మానిటైజేషన్ స్టేటస్ పాజ్‌లో 120 రోజులకు పైగా ఉంటే, సదరు ఛానెల్, మెంబర్‌షిప్‌లకు యాక్సెస్ కోల్పోతుంది, వారు తమ మెంబర్‌లను కోల్పోతారు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6856847081459094165
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false