నా ఫోటోలు బ్యాకప్ కావడం లేదు

ఒకవేళ మీ Google ఖాతాకు మీ ఫోటోలు, వీడియోలు సింక్ కాకపోతే, మీ బ్యాకప్ స్టేటస్‍ను చెక్ చేసుకోండి.

బ్యాకప్ అనేది మీ ఫోటోలను, వీడియోలను మీ Google ఖాతాకు ఆటోమేటిక్‌గా సేవ్ చేసే స్టోరేజ్ సర్వీస్. మీరు ఏ పరికరం నుండి మీ ఖాతాకు సైన్ ఇన్ చేసినా, ఈ ఫోటోలు, వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. బ్యాకప్ ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

మీ బ్యాకప్ స్టేటస్‌ను చెక్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Photos యాప్‌ను తెరవండి.
  2. పైన, మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ మీద ట్యాప్ చేయండి. ఈ కింద మెసేజ్‌లలో ఒకదాని కోసం చూడండి:
    • బ్యాకప్ పూర్తయింది: బ్యాకప్ చేయడానికి మీ వద్ద ఐటెమ్‌లు ఏవీ లేవు.
    • బ్యాకప్ ఆఫ్ అయింది: బ్యాకప్ ఆఫ్ చేయబడింది. బ్యాకప్‌ను ఆన్ చేయడానికి, బ్యాకప్‌ను ఆన్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • బ్యాకప్ అవుతోంది: మీ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం బ్యాకప్ అవుతున్నాయి. మిగిలి ఉన్న ఐటెమ్‍ల సంఖ్య కూడా మీకు కనిపిస్తుంది.
    • బ్యాకప్‍ను సిద్ధం చేస్తోంది లేదా బ్యాకప్‍నకు సిద్ధం అవుతోంది: మీ ఫోటోలు, వీడియోలు బ్యాకప్‌నకు సిద్ధం అవుతున్నాయి.
    • కనెక్షన్ కోసం వేచి ఉంది లేదా Wi-Fi కోసం వేచి ఉంది: Wi-Fi Off మీ సెట్టింగ్‌లను మార్చండి లేదా Wi-Fi లేదా మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి.

మీ బ్యాకప్‌ను పరిష్కరించుకోండి

మీ బ్యాకప్ సెట్టింగ్‌లను చెక్ చేయండి
  1. Google Photos యాప్‌ను తెరవండి.
  2. పైన, మీ ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ and then Photos సెట్టింగ్‌లు and then బ్యాకప్ చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. "బ్యాకప్" ఆన్ చేసి ఉంటే, ఈ ఆప్షన్‍లు మీకు కనిపిస్తాయి:
  • బ్యాకప్ ఖాతా: లిస్ట్‌లో ఉన్న ఖాతా Google Photos యాప్‌లో మీరు చూస్తున్నదేనని అని నిర్ధారించుకోండి. Google Photos యాప్‌లో మీరు ఏ ఖాతాను చూస్తున్నారు అనేది చూడటానికి, Google Photosలోని ప్రధాన మెనూను తెరిచి, దానిలో పైన మీ ఈమెయిల్ అడ్రస్‌ను కనుగొనండి.
  • పరికరం ఫోల్డర్‌ల బ్యాకప్: Google Chat, అలాగే WhatsApp లాంటి ఇతర యాప్‍ల నుండి ఫోటోలు, వీడియోలను బ్యాకప్ చేయడానికి ట్యాప్ చేసి, ఎంచుకోండి.
  • బ్యాకప్ క్వాలిటీ: మీ ఫోటోలు, వీడియోల బ్యాకప్ క్వాలిటీను మార్చడానికి ట్యాప్ చేయండి. మీ బ్యాకప్ క్వాలిటీని ఎలా మార్చాలో తెలుసుకోండి.
  • మొబైల్ డేటా బ్యాకప్: మీరు మీ మొబైల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి మీ ఫోటోలు లేదా వీడియోలను బ్యాకప్ చేయాలని అనుకుంటున్నారో లేదో ఎంచుకోండి (WI-Fi మాత్రమే కాకుండా). మీ సర్వీస్ ప్రొవైడర్ నుండి ఛార్జీలు వర్తించవచ్చు.
చిట్కా: మీరు ఇతర దేశాలలో లేదా ప్రాంతాలలో ఉన్నప్పుడు కూడా ఫోటోలు, వీడియోలను మీరు బ్యాకప్ చేయాలి అనుకుంటే "రోమింగ్‌లో ఉన్నప్పుడు బ్యాకప్ చేయండి" ఆప్షన్‌ను ఆన్ చేయండి.
ఫైల్ సైజ్ లేదా రకాన్ని చెక్ చేయండి

అవసరాలకు అనుగుణంగా లేని కారణంగా ఒక ఫోటో లేదా వీడియో అప్‌లోడ్ కాకపోవచ్చు:

  • ఫోటోలు 200 MB లేదా 200 మెగాపిక్సెల్స్ మించకూడదు
  • వీడియోలు 10 GBని మించకూడదు
ఏ ఫోటోలు బ్యాకప్ చేశారో చెక్ చేయండి
మీ బ్యాకప్ జరుగుతున్నప్పుడు, ఫోటోలు ఎన్ని మిగిలి ఉన్నాయనే దానిని అలాగే వాటి థంబ్‌నెయిల్స్‌ని ఎగువన, మీరు కనుగొనవచ్చు.

ఏ ఫోటో ఇప్పటికీ బ్యాకప్ చేయబడలేదో చెక్ చేయండి

  1. ఫోటోను ఎంచుకోండి.
  2. ఒకవేళ ఒక ఫోటో బ్యాకప్ అవ్వకపోతే, పైన మీకు బ్యాకప్ కనిపిస్తుంది .
చిట్కా: మీరు మీ బ్యాకప్ చేయబడిన అన్ని ఫోటోలు, వీడియోలను కనుగొనడానికి, మీ కంప్యూటర్‌లో, photos.google.com/people లింక్‌కు వెళ్లండి. మీరు బ్యాకప్ చేసిన ప్రతి ఫోటో అలాగే వీడియో ఇక్కడ చూడవచ్చు.
మీ పరికరం ఫోల్డర్‌లను బ్యాకప్ చేయండి

ఇతర యాప్‍ల నుండి మీరు డౌన్‌లోడ్ లేదా సేవ్ చేసే ఫోటోలు, వీడియోలను మీరు బ్యాకప్ చేయవచ్చు.

  1. Google Photos యాప్‍ను తెరవండి.
  2. దిగువున, లైబ్రరీ లోand then పరికరంలో Photos మీద ట్యాప్ చేయండి.
  3. మీరు బ్యాకప్ చేయాలి అనుకుంటున్న ఫోల్డర్‍ను ట్యాప్ చేయండి.
  4. పైన, బ్యాకప్ చేయి ఆన్ చేయండి.
మీ పరికరాన్ని ఛార్జర్‌లో పెట్టండి
మీ బ్యాటరీని సేవ్ చేయడానికి, మీ పరికరం స్క్రీన్ ఆఫ్‍లో ఉన్నప్పుడు లేదా స్క్రీన్ సేవర్ మోడ్‍లో ఉన్నప్పుడు బ్యాకప్ ప్రాసెస్ పాజ్ కావచ్చు. 
ఖాళీ ఫైళ్లు లేదా ఖాళీగా ఉన్న ఫోటో & వీడియో ఫైళ్లను తొలగించండి
ముఖ్య గమనిక: మీ Android పరికరం నుండి ఖాళీ లేదా ఖాళీ ఫోటో, అలాగే వీడియో ఫైళ్లను తీసివేయడానికి, Files by Google యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  1. Files by Google యాప్‌ను Files by Google తెరవండి.
  2. ఇమేజ్‌లు లేదా వీడియోలను ట్యాప్ చేయండి.
  3. పైన, మరిన్ని More ఆ తర్వాత దీని ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చండి ఆ తర్వాత చిన్న సైజ్‌లో ఉన్నవి ముందుగా చూపండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  4. 0 బైట్ సైజ్‌లో ఉన్న ఫైళ్లను ఎంపిక చేయండి.
  5. తొలగించండి తొలగించండి ఆ తర్వాత ఫైళ్లను ట్రాష్‌కు తరలించండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
చిట్కా: అనేక ఫోటో లేదా వీడియో ఫైళ్లను ఎంచుకోవడానికి, మొదటి ఫైల్‌ను నొక్కి, పట్టుకోండి, ఆపై మీరు తొలగించాలనుకుంటున్న ఇతర ఫైళ్లను ట్యాప్ చేయండి.
ఒకవేళ మీకు ఇంకా సమస్యలు ఉన్నట్లయితే, Google Photosకు ఫీడ్‌బ్యాక్‌ను పంపండి.

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7006965517398546334
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
105394
false
false