మోసం లేదా అనధికారిక కార్యకలాపం నుండి రక్షించడం

మీరు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం, ఆన్‌లైన్ చెల్లింపు మోసాల నుండి మిమ్మల్ని కాపాడటం అనే అంశాలకు Google Payలో మేము అత్యధిక ప్రాధాన్యం ఇస్తాము.

అనుమానాస్పద లావాదేవీలను రియల్-టైమ్లో గుర్తించడానికి మేము Google యొక్క అత్యుత్తమమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను, మోసాల నివారణ టెక్నాలజీని ఉపయోగిస్తాము. మిమ్మల్ని సురక్షితంగా ఉంచే టెక్నాలజీలను రూపొందించడానికి, మేము ఈ రంగానికి చెందిన మిగిలిన సంస్థలతో కూడా కలిసి యాక్టివ్‌గా పని చేస్తున్నాము.

అయినప్పటికీ, స్కామ్‌లకు పాల్పడే వ్యక్తులు మీ డబ్బు కాజేసేందుకు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కొన్ని పనులకు పురికొల్పుతారు అందుకే, మీకు అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది మీరు తప్పక తెలుసుకోవాలి.

Google Payలో ప్రామాణీకరణ ఎలా పని చేస్తుంది?

Google Payలో రెండంచెల రక్షణ అందిస్తున్నాము.

మొదటి దశలో మీరు చెల్లింపు యాప్‌ను తెరవగలుగుతారు, రెండవ దశలో (UPI పిన్) చెల్లింపు ప్రాసెస్ పూర్తి చేయగలుగుతారు. మీరు ATM పిన్‌ను ఉంచినట్టే, UPI పిన్‌ను కూడా రహస్యంగా ఉంచుకోవాలని Google Pay సూచిస్తోంది.

ఏదైనా అనుమానాస్పదమైన కార్యకలాపం జరిగితే మీరు వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించి, రిపోర్ట్ చేయాలి.

మీకు అనుమానాస్పదమైన కాల్‌లు వస్తే ఏం చేయాలి?

అసందర్భంగా వచ్చే కాల్‌లతో ఎలా జాగ్రత్తపడాలనే విషయానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాము.

మీకు తెలియని నంబర్ నుండి కాల్ వస్తే, చాలా అప్రమత్తంగా ఉండండి. మీ బ్యాంక్/రిటైలర్/ఇన్సూరెన్స్ సంస్థ తరఫున కాల్ చేస్తున్నాము అని సంబంధిత వ్యక్తి చెప్పి, తన వివరాలు సరిగా వెల్లడించకపోతే, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ సంభాషణ ప్రభుత్వ IDలు, డాక్యుమెంట్‌లు, మీ పిన్, బ్యాంక్ ఖాతా నంబర్, UPI ID వంటి మీ వ్యక్తిగత ఆర్థిక డేటాను అడగటం వైపు సాగితే, అలాంటి వివరాలను దయచేసి షేర్ చేయవద్దు. 

ఎదుటి వారి మాటలు ఎంత నమ్మశక్యంగా ఉన్నప్పటికి, మీరు ఈ వివరాలను ఎవరితోను షేర్ చేయాల్సిన అవసరం లేదు.

అనుమానాస్పదమైన కాల్‌లు లేదా మెసేజ్‌ల విషయంలో మీరు అస్సలు చేయకూడని విషయాలు: 

 • తక్షణ లావాదేవీ జరిగేలా వచ్చిన ఎలాంటి చెల్లింపు అభ్యర్థనలను అంగీకరించవద్దు, ముఖ్యంగా మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు లేదా ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు, మీకు కాల్ చేసిన వారు లైన్‌లో వేచి ఉంటామని చెప్పినప్పుడు.
 • SMS/ఇమెయిల్ ద్వారా పంపిన లింక్‌పై క్లిక్ చేయవద్దు
 • కాల్‌లో ఉన్నప్పుడు యాప్/ఫైల్‌ను డౌన్‌లోడ్ కానీ లేదా ఇన్‌స్టాల్ కానీ చేయవద్దు
 • వారు మీకు పంపించే సాఫ్ట్‌వేర్ లేదా వెబ్ లింక్ ఉపయోగించి మీ ఫోన్ స్క్రీన్ షేర్ చేయవద్దు. 
 • మీ UPI పిన్, UPI ID, లేదా ఎలాంటి బ్యాంక్ వివరాలను ఫోన్ ద్వారా తెలియచేయవద్దు.
 • ఏదైనా ఆన్‌లైన్ ఫారమ్ చట్టబద్ధమైన దానిగా అనిపించినా కూడా, దానిని నింపవద్దు. మోసగాళ్ళు తరచుగా, మీ బ్యాంక్ లేదా యాప్‌ను పోలి ఉండేలా లోగోలు, డిజైన్‌లతో మీకు తెలిసిన లేదా అసలైన వాటిలా కనిపించే వెబ్ పేజీలను సృష్టిస్తారు. 

ఏ విషయాలను ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి? 

మీరు ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకోవలసిన నిర్దిష్ట మార్గదర్శకాలను Google Pay అందించింది.

 • డబ్బు పంపించడానికి, బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి మాత్రమే మీ UPI పిన్ అవసరమవుతుంది. చెల్లింపులు స్వీకరించడానికి పిన్ అవసరం లేదు. ఒక వేళ ఎవరైనా మీ పిన్‌ను ఎంటర్ చేయమని అడిగితే, మీరు మీ నుండి బయటకు వెళ్లే చెల్లింపును ఆమోదిస్తున్నారని అర్థం, అంటే, మీ బ్యాంక్ ఖాతా నుండి చెల్లింపు.
 • మీ దృష్టి వేరే చోట ఉన్నప్పుడు ఎప్పుడు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దు — అది రీఛార్జ్ అయినా, బిల్ చెల్లింపు అయినా లేదా మరేదైనా. 
 • ఎవరైనా ఫోన్ లైన్‌లో ఉండి, మీపై ఒత్తిడి తెచ్చినప్పుడు అస్సలు చేయవద్దు.
 • సోషల్ నెట్‌వర్క్ సైట్‌లలో గోప్యమైన వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ షేర్ చేయవద్దు. 
 • ఎదుటి వ్యక్తి ఎవరు అనేది నిర్ధారించుకోకుండా ఎప్పుడూ నిధులు బదిలీ చేయవద్దు.

మీ Google Pay చెల్లింపులను సురక్షితం చేయడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలు:

మీ UPI పిన్ రహస్యంగా ఉంచండి: మీ UPI పిన్ మీ ATM పిన్ వంటిదే. దానిని ఎవరితోనూ షేర్ చేయవద్దు.
విశ్వసనీయమైన యాప్‌లు మాత్రమే డౌన్‌లోడ్ చేయండి, హానికరమైన యాప్‌లు మీరు మీ స్క్రీన్‌పై టైప్ చేసే చెల్లింపు వివరాలతో సహా మీ వ్యక్తిగత సమాచారాన్ని  యాక్సెస్ చేయగలవు.

మీకు లింక్ ద్వారా పంపించిన వెబ్‌సైట్‌లు లేదా ఫారమ్‌లలో మీ UPI పిన్ షేర్ చేసే విషయంలో జాగ్రత్త వహించండి.
మీరు డబ్బు స్వీకరించడానికి UPI పిన్ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు: మీ UPI పిన్ ఎంటర్ చేయడం అంటే మీరు ఎవరికో చెల్లింపు చేస్తున్నారని అర్థం. మీ డబ్బు ఎటు వెళ్తుందో గమనించండి.

కస్టమర్ కేర్ను సంప్రదించడానికి మీ చెల్లింపు యాప్ మాత్రమే ఉపయోగించండి: అసలైన సపోర్ట్ వివరాలను మీ Google Pay యాప్ సహాయం/సపోర్ట్ విభాగంలో  పొందండి. ఇంటర్‌నెట్‌లో మోసపూరితమైన నంబర్లు లభించే అవకాశం ఉంది, వాటిని ఉపయోగించకండి.

మీరు మోసపూరిత లావాదేవీకి బాధితులైతే ఏమి చేయాలి?

మీ లావాదేవీలలో ఏవైనా అవకతవకలు ఉంటే తక్షణమే  మీ బ్యాంక్ అలాగే ప్రభుత్వ సైబర్ సెల్‌కు రిపోర్ట్ చేయండి. మీ Google Pay లావాదేవీలో మోసం జరిగిందని మీకు అనుమానం ఉంటే ఈ కింది చర్యలు పాటించమని మేము మీకు సూచిస్తున్నాము:

 • లావాదేవీని మీ బ్యాంక్‌కు రిపోర్ట్ చేయండి
 • మీ స్థానిక అధికారిక ప్రదేశానికి సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసు డిపార్ట్మెంట్‌ను సంప్రదించవలసిందిగా మేము సూచిస్తున్నాము.
 • దానిని మాకు రిపోర్ట్ చేయడానికి, దయచేసి ఈ ఫారమ్ను ఉపయోగించండి. మేము మీ అభ్యర్థనను మా పాలసీల ప్రకారం పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటాము.

తర్వాతి దశలు:

మీకు Google Pay యాప్‌తో సమస్యలు ఉన్నాయా?

కింద ఉన్న బటన్‌ను క్లిక్ చేయండి

మీ సమస్యలకు సహాయం పొందండి

ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?

మరింత సహాయం కావాలా?

మీ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు సాయపడే, అదనపు మద్దతు ఎంపికల కోసం సైన్ ఇన్ చేయండి