మీ Android పరికరంలో డేటాను బ్యాకప్ లేదా రీస్టోర్ చేయండి

మీరు మీ ఫోన్ నుండి Google ఖాతాకు కంటెంట్, డేటా అలాగే సెట్టింగ్‌లను బ్యాకప్ చేయవచ్చు. మీరు మీ బ్యాకప్ చేయబడిన సమాచారాన్ని ఒరిజినల్ ఫోన్‌కు లేదా కొన్ని ఇతర Android ఫోన్‌లకు రీస్టోర్ చేయవచ్చు. మీరు వ్యక్తిగత పరికరాన్ని వర్క్ ప్రొఫైల్‌తో లేదా కేవలం వర్క్ కోసం మాత్రమే సెటప్ చేసినప్పుడు, లేదా కంపెనీ స్వంతమైన పరికరాన్ని సెటప్ చేసినప్పుడు మీరు బ్యాకప్‌ను ఉపయోగించలేరు.

డేటాను రీస్టోర్ చేయడమనేది ఫోన్ అలాగే Android వెర్షన్‌ను బట్టి మారుతుంది. మీరు ఎక్కువ స్థాయి Android వెర్షన్‌తో రన్ అవుతున్న ఫోన్ నుండి తక్కువ స్థాయి Android వెర్షన్‌తో రన్ అవుతున్న ఫోన్‌లోకి బ్యాకప్‌ను రీస్టోర్ చేయలేరు.

ముఖ్య గమనిక: ఈ దశలలో కొన్ని, Android 9లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

మీ ఫోన్ డేటా స్టోర్ చేయబడే చోటు

బ్యాకప్‌లు Google సర్వర్‌లకు అప్‌లోడ్ చేయబడతాయి, అలాగే అవి మీ Google ఖాతా పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. మీ డేటాలోని కొంత డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడానికి, మీ ఫోన్ స్క్రీన్ లాక్ PIN, ఆకృతి లేదా పాస్‌వర్డ్ కూడా ఉపయోగించబడతాయి, తద్వారా ఆ డేటా సురక్షితంగా బ్యాకప్ చేయబడుతుంది.

ఈ కారణాల వల్ల మీ బ్యాకప్ డేటా (మీరు Google Photosకు బ్యాకప్ చేసినవి మినహా) తొలగించబడుతుంది:

  • మీరు మీ పరికరాన్ని 57 రోజుల పాటు ఉపయోగించకపోతే
  • మీరు Android బ్యాకప్ ఆఫ్ చేస్తే

కంటెంట్‌ను బ్యాకప్ చేయండి

మీ ఫోన్‌ను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేయండి

ముఖ్య గమనిక: మీరు బ్యాకప్ చేసిన డేటాను రక్షించడంలో సహాయపడటానికి, స్వైప్ లేదా బదులుగా PIN, ఆకృతి లేదా పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి .

మీ ఫైల్స్‌ను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసేలా మీరు మీ పరికరాన్ని సెటప్ చేయవచ్చు.

  1. మీ పరికరంలోని సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. Google ఆ తర్వాత బ్యాకప్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    చిట్కా: మీకు ఇదే మొదటిసారి అయితే, Google One బ్యాకప్ అనే ఆప్షన్‌ను ఆన్ చేసి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
  3. ఇప్పుడే బ్యాకప్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ Google One బ్యాకప్‌కు 24 గంటల వరకు సమయం పట్టవచ్చు. మీ డేటాను సేవ్ చేసినప్పుడు, "ఆన్" అనేది మీరు ఎంచుకున్న డేటా రకాల కింద ఉంటుంది.

బ్యాకప్ ఖాతాలను జోడించండి లేదా స్విచ్ చేయండి

బ్యాకప్ ఖాతాను జోడించండి

  1. మీ ఫోన్‌లో ఉన్న 'సెట్టింగ్‌లు యాప్'ను తెరవండి.
  2. సిస్టమ్ ఆ తర్వాత బ్యాకప్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. ఈ దశలు మీ ఫోన్‌లోని సెట్టింగ్‌లతో మ్యాచ్ అవ్వకపోతే, బ్యాకప్ కోసం మీ సెట్టింగ్‌ల యాప్‌ను సెర్చ్ చేయడానికి ట్రై చేయండి, లేదా మీ పరికర తయారీదారు నుండి సహాయాన్ని పొందండి

  3. బ్యాకప్ ఖాతా ఆ తర్వాత ఖాతాను జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. అవసరమైతే, మీ ఫోన్ PIN, ఆకృతి, లేదా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
  5. మీరు జోడించాలనుకుంటున్న ఖాతాకు సైన్ ఇన్ చేయండి.

బ్యాకప్ ఖాతాల మధ్య స్విచ్ అవ్వండి

  1. మీ ఫోన్‌లో ఉన్న 'సెట్టింగ్‌లు యాప్'ను తెరవండి.
  2. సిస్టమ్ ఆ తర్వాత బ్యాకప్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. ఈ దశలు మీ ఫోన్‌లోని సెట్టింగ్‌లతో మ్యాచ్ అవ్వకపోతే, బ్యాకప్ కోసం మీ సెట్టింగ్‌ల యాప్‌ను సెర్చ్ చేయడానికి ట్రై చేయండి, లేదా మీ పరికర తయారీదారు నుండి సహాయాన్ని పొందండి.
  3. బ్యాకప్ ఖాతా ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు బ్యాకప్‌ల కోసం ఉపయోగించాలనుకుంటున్న ఖాతాను ట్యాప్ చేయండి.
ఏవి బ్యాకప్ చేయబడతాయి
ముఖ్యమైనది: అన్ని సెట్టింగ్‌లు అలాగే డేటాను, అన్ని యాప్‌లు బ్యాకప్ లేదా రీస్టోర్ చేయలేవు. యాప్ గురించి తెలుసుకోవడానికి, దాని డెవలపర్‌ను ఎలా సంప్రదించాలో తెలుసుకోండి.

Google One బ్యాకప్ మీ ఫోన్ నుండి డేటాను ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తుంది. వాటిలో ఇవి ఉంటాయి:

  • యాప్ డేటా
  • కాల్ హిస్టరీ
  • కాంటాక్ట్‌లు
  • సెట్టింగ్‌లు
  • SMS మెసేజ్‌లు
  • ఫోటోలు, వీడియోలు
  • MMS మెసేజ్‌లు

చిట్కా: మీరు మీ ఫోటోలు అలాగే వీడియోలను మీ Google Photos లైబ్రరీకి ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేయవచ్చు. మీ ఫోటోలను బ్యాకప్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

డేటా & సెట్టింగ్‌లను మాన్యువల్‌గా బ్యాకప్ చేయండి

  1. మీ ఫోన్‌లో ఉన్న సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. Google ఆ తర్వాత బ్యాకప్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    ఈ దశలు మీ ఫోన్‌లోని సెట్టింగ్‌లతో మ్యాచ్ అవ్వకపోతే, బ్యాకప్ కోసం మీ సెట్టింగ్‌ల యాప్‌ను సెర్చ్ చేయడానికి ట్రై చేయండి, లేదా మీ పరికర తయారీదారు నుండి సహాయాన్ని పొందండి.
  3. ఇప్పుడే బ్యాకప్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

బ్యాకప్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ చేయండి

మీరు బ్యాకప్ చేసిన తర్వాత, మీ పరికరంలోని అన్నింటినీ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ద్వారా మీరు దాన్ని రీసెట్ చేయవచ్చు. మీ పరికరాన్ని ఫ్యాక్టరీ సెట్టింగ్‌లకు ఎలా రీసెట్ చేయాలో తెలుసుకోండి.

కొత్త ఫోన్‌లోకి మీ డేటాను పొందండి

సెటప్ చేయబడిన ఫోన్‌కు మీరు మీ Google ఖాతాను జోడించినప్పుడు, ఆ Google ఖాతాకు సంబంధించి మీరు మునుపు బ్యాకప్ చేసినవి, ఫోన్‌లో చేర్చబడతాయి.

రీసెట్ చేసిన ఫోన్‌కు బ్యాకప్ చేయబడిన ఖాతాను రీస్టోర్ చేయడానికి, స్క్రీన్‌పై ఉన్న దశలను ఫాలో అవ్వండి. మరింత సహాయం కోసం, మీ పరికర తయారీదారు నుండి సహాయాన్ని పొందండి.

మీ ఫోటోలు, వీడియోలు ఇప్పటికే Google Photosలో అందుబాటులో ఉన్నాయి. కానీ, మీరు మీ కొత్త ఫోన్‌ను మొదటిసారి సెటప్ చేసినప్పుడు లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత, మీరు బ్యాకప్ చేసిన మిగిలిన డేటాను రీస్టోర్ చేయవచ్చు. సెటప్‌లో, మీ డేటాను రీస్టోర్ చేయడానికి, స్క్రీన్‌పై ఉన్న దశలను ఫాలో చేయండి.

ప్రాసెస్‌కు 24 గంటల వరకు సమయం పట్టవచ్చు.

ముఖ్యమైనది: మీరు ఎక్కువ స్థాయి Android వెర్షన్‌తో రన్ అవుతున్న పరికరం నుండి తక్కువ స్థాయి Android వెర్షన్‌తో రన్ అవుతున్న పరికరంలోకి బ్యాకప్‌ను రీస్టోర్ చేయలేరు. మీ Android వెర్షన్‌ను చెక్ చేయడం, అలాగే అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీరు బ్యాకప్ చేసిన ఫోటోలు, డేటా, అలాగే సెట్టింగ్‌లను చెక్ చేయండి

మీ బ్యాకప్‌లో ఏ డేటా అలాగే ఏ యాప్‌లు చేర్చబడ్డాయో మీరు చెక్ చేయవచ్చు.

  1. మీ పరికరంలోని సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. Google ఆ తర్వాత బ్యాకప్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. “బ్యాకప్ వివరాలు” కింద, మీ పరికరంలో ఏ డేటా బ్యాకప్ చేయబడిందో రివ్యూ చేయండి.
బ్యాకప్ చేసిన కాంటాక్ట్‌లను రీస్టోర్ చేయండి

మీరు మీ కాంటాక్ట్‌లను Google ఖాతాకు సేవ్ చేసినట్లయితే, అవి ఆటోమేటిక్‌గా సింక్ అవుతాయి. మీకు ఫోన్ లేదా SIM కార్డ్‌లో ఇతర కాంటాక్ట్‌లు ఉన్నట్లయితే, కాంటాక్ట్‌లను మాన్యువల్‌గా ఎలా రీస్టోర్ చేయాలో తెలుసుకోండి.

మీ డేటాను బ్యాకప్ ఎలా హ్యాండిల్ చేస్తుంది

ముఖ్యమైనది: బ్యాకప్ సేకరించే డేటా ట్రాన్సిట్‌లో ఎన్‌క్రిప్ట్ చేయబడింది.

బ్యాకప్ మీ డేటాను Google బ్యాకప్ సర్వర్‌లకు పంపుతుంది, పరికరాల మధ్య డేటాను బదిలీ చేయడంలో మీకు సహాయపడుతుంది. మీ పరికరంలో సర్వర్‌లను అమలు చేయడానికి బ్యాకప్ నిర్దిష్ట సమాచారాన్ని కలెక్ట్ చేస్తుంది. ఈ ఫంక్షనాలిటీలో కొన్ని Google Play సర్వీసులను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, బ్యాకప్ ఈ కింది వాటిని కలెక్ట్ చేస్తుంది:

  • మీ వ్యక్తిగత బ్యాకప్‌లో భాగంగా మెసేజ్‌లు, కాంటాక్ట్‌లు, యాప్ సెట్టింగ్‌లు, ఇంకా ప్రాధాన్యతలు కలెక్ట్ చేయబడతాయి.
  • మీ బ్యాకప్‌లు మీతో, మీ ఖాతాతో అనుబంధించబడి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వ్యక్తిగత ఐడెంటిఫైయర్‌లు సేకరించబడతాయి.
  • క్రాష్ లాగ్‌లు, సమస్య విశ్లేషణలు ఎనలిటిక్స్, పరిష్కార ప్రక్రియ ప్రయోజనాల కోసం కలెక్ట్ చేయబడతాయి.

బ్యాకప్‌ను ఆఫ్ చేయండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7797394473275807834
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false