Google Play Passకు సబ్‌స్క్రయిబ్ చేయండి

మీరు Google Play Passకు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నప్పుడు, యాడ్‌లు లేదా యాప్‌లో కొనుగోళ్లు ఏవీ లేకుండా, మీరు 1000కి పైగా గేమ్‌లను, యాప్‌లను పొందుతారు. Play Pass అనేది, Google Play అంతటా కాకుండా, కొన్ని ఎంపిక చేసిన యాప్‌లకు, గేమ్‌లకు మాత్రమే మీకు యాక్సెస్‌ను ఇస్తుంది. Playలో గేమ్‌లు, యాప్‌లు, ఆఫర్‌ల లభ్యత దేశాన్ని బట్టి మారవచ్చు. ఎంచుకున్న ప్రాంతాల్లోని యూజర్‌లు వీటిని కూడా పొందవచ్చు:

మీకు అవసరమైనవి

Google Play Pass కోసం సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడానికి, మీకు కిందివి అవసరం ఉంటాయి:
ముఖ్యమైనది: మీరు ఫ్యామిలీ మేనేజర్ అయితే, మీ ఫ్యామిలీ గ్రూప్‌‌లోని ఏ చిన్నారినైనా ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతించే ముందు అన్ని యాప్‌లను మీరు చెక్ చేశారని నిర్ధారించుకోండి. 

Google Play Pass కోసం సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయండి

  1. Google Play Store యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి.
  3. Play Pass ఆ తర్వాత ప్రారంభించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
చిట్కా: మీ ట్రయల్ పీరియడ్ ముగింపు వద్ద మాత్రమే మీకు ఛార్జి విధించబడుతుంది. మీకు ఛార్జి విధించబడకూడదు అనుకుంటే, ట్రయల్ పీరియడ్ ముగింపునకు ముందే మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి.

మీ నెలవారీ Play Pass ఆఫర్‌లను ఉపయోగించండి

కింది ప్రాంతాల్లోని సబ్‌స్క్రయిబర్‌లు, Play Pass అందించే నెలవారీ ఆఫర్‌లకు అర్హులు కావచ్చు. ఈ ఆఫర్‌లు, ప్రతి నెలా రిఫ్రెష్ అవుతాయి అలాగే నిర్దిష్ట ఆఫర్ లభ్యత ఖాతాను బట్టి మారవచ్చు. ఈ ఫీచర్ Play Pass ఆఫర్‌ల నియమాలకు అనుగుణంగా ఉంటుంది.

  • ఆస్ట్రేలియా
  • చిలీ
  • ఫ్రాన్స్
  • జర్మనీ
  • గ్రేట్ బ్రిటన్
  • ఇండోనేషియా
  • మెక్సికో
  • U.S.
  • ఉక్రెయిన్*
  • ఇండియా
  • ఇటలీ
  • పోలాండ్
  • స్పెయిన్
  • ఫిలిప్పీన్స్*
  • థాయ్‌లాండ్*
  • నెదర్లాండ్స్
  • సౌదీ అరేబియా*
  • తైవాన్*
  • బ్రెజిల్
 

* ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, సౌదీ అరేబియా ఇంకా తైవాన్‌లోని సబ్‌స్క్రయిబర్‌ల కోసం: యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన Play Pass సబ్‌స్క్రయిబర్‌లతో ఈ ఫీచర్ పరీక్షించబడుతోంది, అలాగే ఈ మార్కెట్‌లలోని Play Pass సబ్‌స్క్రయిబర్‌లందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది సమీప భవిష్యత్తులో, ఈ మార్కెట్‌లలో Play Pass సబ్‌స్క్రయిబర్‌లందరికీ అందుబాటులోకి రావచ్చు.

Android పరికరంలో, ఈ నెలకు సంబంధించిన ఆఫర్‌లను చూడటానికి:

  1. Google Play Store యాప్‌ను తెరవండి.
  2. Play Pass పైన ట్యాప్ చేయండి.
  3. ఆఫర్‌ల ట్యాబ్ పైన ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు ప్రమోషనల్ ట్రయల్‌లో ఉన్నట్లయితే ఆఫర్‌లను కనుగొనలేరు.

నేను Play Pass ఆఫర్‌ను ఎప్పుడు పొందగలను?
ప్రతి నెల మొదటి తేదీన ఆఫర్‌లు రిఫ్రెష్ చేయబడతాయి. మీరు ప్రమోషనల్ లేదా ట్రయల్ పీరియడ్‌లో ఉన్నట్లయితే, పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌కు మార్చిన తర్వాత మాత్రమే ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి.
అందుబాటులో ఉన్న Play Pass ఆఫర్‌లను నేను ఎక్కడ కనుగొనగలను?
ప్రస్తుత Play Pass సబ్‌స్క్రయిబర్‌లు, తమ ఆఫర్‌లను Play Storeలోని Play Pass ట్యాబ్‌లో కనుగొనవచ్చు.
గడువు ముగింపు తేదీకన్నా ముందు, నేను నా ఆఫర్‌లను ఉపయోగించకుంటే ఏమి అవుతుంది?
Play Pass ఆఫర్‌ను నెలాఖరు లోపు మీరు ఉపయోగించకుంటే, మీరు ఆఫర్‌ను కోల్పోతారు.
ఫ్యామిలీ గ్రూప్‌లోని మెంబర్‌లు Play Pass ఆఫర్‌లను అందుకుంటారా?
లేదు, ఫ్యామిలీ ప్లాన్‌లలో ఉన్న ఇంటి పెద్ద మాత్రమే Play Pass ఆఫర్‌లకు అర్హులు.
స్ప్లిట్ పేమెంట్‌లు ఆమోదించబడ్డాయా?
అవును. ఒక ప్రత్యేక ఆఫర్, కొనుగోలుకు సంబంధించి క్రెడిట్‌ను అందజేస్తే, మిగిలిన పేమెంట్‌ను మీరు మరొక పేమెంట్‌ఆప్షన్‌తో చెల్లించవచ్చు.
నా కొనుగోలు మొత్తం, ఆఫర్ విలువ కంటే తక్కువగా ఉంటే ఏమి చేయాలి?
మీరు కొనుగోలు చేసిన వస్తువు, గరిష్ఠ ఆఫర్ విలువ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఒక్క కొనుగోలుకు మాత్రమే ఆఫర్‌లు ఉపయోగించబడతాయి. మీరు ఏదైనా ఒక్క కొనుగోలుకు మాత్రమే మీ ఆఫర్‌ను ఉపయోగించవచ్చు. ఏదైనా ఒక్క కొనుగోలు, ఆఫర్ గరిష్ఠ స్థాయికి సమానంగా లేకున్నా లేదా మించకుండా ఉన్నా, మిగిలినవి ఉపయోగించడానికి అందుబాటులో ఉండవు.
Play Pass ఆఫర్‌లు మిగిలిన Play Pass నుండి ఎలా భిన్నంగా ఉంటాయి?
Play Pass క్యాటలాగ్‌తో, గేమ్‌లలో, యాప్‌లలో యాడ్‌లు లేదా యాప్‌లో కొనుగోళ్లు ఉండవు. ఈ గేమ్‌లు, యాప్‌లపై Play Pass బ్యాడ్జ్ ఉంటుంది. ప్రత్యేక ఆఫర్ టైటిల్‌లు Play Pass క్యాటలాగ్‌లో భాగం కావు, కాబట్టి మీరు ఇప్పటికీ ఈ టైటిల్స్‌పై యాడ్‌లను పొందవచ్చు.

ఫ్యామిలీ లైబ్రరీని క్రియేట్ చేయండి

ఫ్యామిలీ లైబ్రరీతో, మీరు మీ Google Play ఫ్యామిలీ గ్రూప్‌తో Google Play Pass సబ్‌స్క్రిప్షన్‌ను షేర్ చేయవచ్చు. Google Play ఫ్యామిలీ లైబ్రరీల గురించి మరింత తెలుసుకోండి.

ముఖ్య గమనిక: ఒకవేళ మీరు ఏదైనా ఫ్యామిలీ గ్రూప్‌లో భాగం కాకపోతే, ముందుగా మీరు ఒక ఫ్యామిలీ గ్రూప్‌ను తప్పనిసరిగా క్రియేట్ చేయాలి.

  1. Google Play Store యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత ఫ్యామిలీ ఆ తర్వాత ఫ్యామిలీ లైబ్రరీకి సైన్ అప్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఫ్యామిలీ లైబ్రరీని సెటప్ చేయడానికి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో చేయండి.

ఒక ఫ్యామిలీలో చేరండి, Google Play Pass సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేయండి

మీరు ఇప్పటికే Googleలో ఒక ఫ్యామిలీ గ్రూప్‌‌లో భాగంగా ఉండి, ఆ గ్రూప్ ఫ్యామిలీ మేనేజర్ Play Pass కోసం సబ్‌స్క్రయిబ్ చేసి ఉన్నట్లయితే, మీ Play Passను ఉపయోగించడానికి ముందు, మీరు దాన్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైనది: మీరు Google Play Passను యాక్టివేట్ చేయడానికి ముందు, ఇమెయిల్ లేదా SMS ద్వారా ఫ్యామిలీ గ్రూప్‌ ఆహ్వానాన్ని అంగీకరించవలసి ఉండవచ్చు. ఫ్యామిలీ గ్రూప్‌‌లో చేరడం గురించి మరింత తెలుసుకోండి.
  1. Google Play Store యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి.
  3. Play Pass ఆ తర్వాత యాక్టివేట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు ఫ్యామిలీ ప్లాన్‌లో ఉన్నట్లయితే, ఇంటి పెద్ద మాత్రమే Play Pass ఆఫర్‌లను పొందుతారు.

Google Play Passను డీయాక్టివేట్ చేయండి

ఫ్యామిలీ మెంబర్‌లు మాత్రమే Play Passను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయగలరు. మీరు Play Passను డీయాక్టివేట్ చేసినప్పుడు, మీరు మీ ఖాతాకు మాత్రమే దాన్ని డీయాక్టివేట్ చేయగలరు. ఇతర ఫ్యామిలీ మెంబర్‌లు Play Passను ఇప్పటికీ ఉపయోగించగలరు.
  1. Google Play Store యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత Play Pass అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: Play Pass నుండి సబ్‌స్క్రిప్షన్ తీసివేయడానికి, సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్యామిలీ మేనేజర్ రద్దు చేయాలి. ఫ్యామిలీ మేనేజర్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేసినప్పుడు, ఫ్యామిలీ మెంబర్‌లకు Play Passకు యాక్సెస్ ఉండదు.

Google Play Passలో గేమ్‌లు, యాప్‌లను ఉపయోగించండి

మీరు Google Play Passకు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నప్పుడు, యాడ్‌లు లేదా యాప్‌లో కొనుగోళ్లు ఏవీ లేకుండా, మీరు 1000కి పైగా గేమ్‌లను, యాప్‌లను పొందుతారు. Play Pass అనేది, Google Play అంతటా కాకుండా, కొన్ని ఎంపిక చేసిన యాప్‌లకు, గేమ్‌లకు మాత్రమే మీకు యాక్సెస్‌ను ఇస్తుంది. Playలో గేమ్‌లు, యాప్‌లు, ఆఫర్‌ల లభ్యత దేశాన్ని బట్టి మారవచ్చు. ఎంచుకున్న ప్రాంతాల్లోని యూజర్‌లు వీటిని కూడా పొందవచ్చు:

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play స్టోర్ యాప్‌ Google Playను తెరవండి.
  2. దిగువున, Play Passను ట్యాప్ చేయండి.
  3. ఒక యాప్‌ను ఎంచుకోండి.
  4. ఒకవేళ ఆ యాప్ Play Passలో భాగం అయితే, యాప్ వివరాల పేజీ ఎగువున మీకు Play Pass లోగో కనిపిస్తుంది.
ముఖ్యమైనది: Play Passలోని డెవలపర్‌లు ఎంత సంపాదించారో తెలుసుకోవడానికి, Google Play మీ Play Pass వినియోగాన్ని కొలుస్తుంది. డెవలపర్‌ల యాప్‌లను వ్యక్తులు ఎలా ఉపయోగిస్తున్నారు అనే దాని గురించి సమాచారాన్ని మేము కూడా డెవలపర్‌లకు అందిస్తాము. మీ వ్యక్తిగత లేదా ప్రైవేట్ వినియోగ సమాచారాన్ని మేము షేర్ చేయము. మీరు ఏ సమయంలోనైనా మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు లేదా డీయాక్టివేట్ చేయవచ్చు మరియు మీ సబ్‌స్క్రిప్షన్ ముగియగానే మేము వినియోగాన్ని కొలవడం ఆపివేస్తాము.
యాప్‌లకు Google Play Pass సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిసిపోయినప్పుడు

మీరు ఉపయోగించే యాప్ లేదా ఆడే గేమ్ Play Pass సర్వీస్ నుండి నిష్క్రమిస్తే:

  • ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేకుండా లభించే యాప్‌లు, గేమ్‌లు:
    • మీరు ఇంకా యాప్ లేదా గేమ్‌ను ఉపయోగించవచ్చు, కానీ మధ్య మధ్యలో మీకు యాడ్‌లు రావచ్చు లేదా యాప్‌లోని ఐటెమ్‌లను పొందాలంటే మీరు పే చేయాల్సి రావచ్చు.
  • పెయిడ్ యాప్‌లు, గేమ్‌లు:
    • మీరు ఏదైనా యాప్‌ను లేదా గేమ్‌ను Play Pass వెలుపల విడిగా ఆడటం కోసం కొనుగోలు చేయడానికి ముందు, మీరు కొంత సమయం సేపు పెయిడ్ యాప్ లేదా గేమ్‌ను ఉపయోగించి చూడవచ్చు.
    • మీరు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ కూడా చేయవచ్చు.

మీ Google Play Pass సబ్‌స్క్రిప్షన్‌ను మేనేజ్ చేయండి

మీరు Play Passకు సబ్‌స్క్రయిబ్ చేసుకుంటే, మీరు వీటిని చేయడానికి Google Play యాప్‌ను ఉపయోగించవచ్చు:

  • మీ ప్లాన్ ఎప్పుడు రీ-యాక్టివేట్ అవుతుందో చెక్ చేయడం.
  • పేమెంట్ ఆప్షన్‌ను మార్చడం.
  • బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌ను జోడించడం.
  • మీ Play Pass సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడం.

మీ సబ్‌స్క్రిప్షన్‌ను మేనేజ్ చేయడానికి:

  1. Google Play Store యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత Play Pass అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: ప్రస్తుతానికి, మీరు మీ Play Pass సబ్‌స్క్రిప్షన్‌ను పాజ్ చేయలేరు. Play Pass నుండి డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం వలన మీ సబ్‌స్క్రిప్షన్ రద్దు కాదు.

మీరు మీ Play Pass సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసినప్పుడు ఏమి జరుగుతుంది

మీరు మీ Play Pass సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసిన తర్వాత:

  • సబ్‌స్క్రిప్షన్ కింద, ప్రయోజనాల కింద పొందిన కొంత కంటెంట్‌ను మీరు ఉపయోగించలేరు.
  • సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసిన ఫ్యామిలీ మెంబర్‌లకు కూడా ఈ రద్దు వర్తిస్తుంది.
  • మీ సబ్‌స్క్రిప్షన్ వ్యవధి ముగిసే వరకు మీరు ఇప్పటికీ మీ వద్ద ఉన్న యాప్‌లను, గేమ్‌లను ఉపయోగించవచ్చు.
  • మీరు Play Pass నుండి ఇన్‌స్టాల్ చేసిన ఏవైనా యాప్‌లు, దాని డేటా మీ పరికరంలో ఉంటాయి.

మీరు Play Pass ద్వారా పొందిన కంటెంట్ కోసం:

  • మీరు యాప్‌ను కొనుగోలు చేయమని లేదా పెయిడ్ యాప్‌ల నుండి Play Passకు సబ్‌స్క్రయిబ్ చేయమని ప్రాంప్ట్‌లను పొందవచ్చు.
  • యాప్‌లో కొనుగోళ్లు తీసివేయబడ్డాయి, కానీ వ్యక్తిగత కొనుగోలు కోసం అవి అందుబాటులో ఉన్నాయి.
  • వాటిని తీసివేసిన చోట, యాప్‌లలో మీకు యాడ్‌లు కనిపించవచ్చు.
  • మీరు Play Passలో మళ్లీ చేరితే, కంటెంట్‌లను మళ్లీ ఉపయోగించవచ్చు.

Google Play ఫ్యామిలీ లైబ్రరీలో Play Pass సబ్‌స్క్రిప్షన్‌లు:

మీ సబ్‌స్క్రిప్షన్ ముగిసిన తర్వాత, మీరు Google Play Store యాప్‌లో, Play Pass ట్యాబ్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు. మీరు Play Pass కేటలాగ్ నుండి పొందే గేమ్‌లు, ఇంకా యాప్‌లు, యాడ్‌లను, అలాగే యాప్‌లో కొనుగోళ్లను చూపడం మొదలుపెట్టవచ్చు.

Get support for Pixel Pass

To learn more about Pixel Pass, visit the Pixel Pass Help Center.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16627206631645720839
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false